
ఎన్నికల్లో ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 పెనాల్టీ కింద భారత ఎన్నికల సంఘం (ECI) కట్ చేస్తుందంటూ ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి హిందీ వార్తపత్రికలో ప్రచురితమైన ఓ వార్త క్లిప్పింగ్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.
ఓటు వేయడాన్ని విస్మరించినవారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ అవుతుందని, సదురు వ్యక్తికి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోతే మొబైల్ రీఛార్జ్ నుంచి ఆ మొత్తం కట్ చేస్తారని ఆ న్యూస్ క్లిప్పింగ్‌లో ఉంది. దీన్ని కొంత మంది విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఓటు వేయకపోతే డబ్బులు కట్ అవుతాయంటూ హెచ్చరిస్తున్నారు.
(అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్.. ఇక అన్నింటికీ ఆ సర్టిఫికెటే ఆధారం!)
దీనిపై ప్రభుత్వ వార్తాసంస్థ పీఐబీకి చెందిన ఫ్యాక్ట్‌చెక్ (pib fact check) విభాగం స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ (fake news) అని తేల్చింది. గతంలోనే సర్కులేట్ అయిన ఈ ఫేక్ న్యూస్ మరోసారి ప్రచారంలోకి వచ్చిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్’(ట్విటర్) ద్వారా పేర్కొంది.
కాగా ఈ వార్త ఓ హిందీ వార్తాపత్రికలో 2019లో ప్రచురితమైంది. హోలీ ప్రాంక్‌గా దీన్ని ప్రచురించారు. అయితే ఇది అప్పటి నుంచి అసలైన వార్తగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ఎలక్షన్ కమిషన్ 2021లోనే క్లారిటీ ఇచ్చింది.
क्या लोकसभा चुनाव में मतदान नहीं किए जाने पर बैंक अकाउंट से कटेंगे 350 रुपए❓
— PIB Fact Check (@PIBFactCheck) September 15, 2023
जानें वायरल ख़बर की सच्चाई❕#PIBFactCheck:
🔶 यह ख़बर #फ़र्ज़ी है।
🔶 @ECISVEEP ने ऐसा कोई निर्णय नहीं लिया है।
🔶 जिम्मेदार नागरिक बनें, मतदान अवश्य करें!!
🔗 https://t.co/8EwXdkIPlF pic.twitter.com/ikFLUndfCh