ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? | SBI Launches Nation Wide Drive To Promote Inoperative Account Activation | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐలో అకౌంట్‌ ఉందా..? బ్యాంక్‌ ప్రత్యేక క్యాంపెయిన్‌

Published Wed, Dec 4 2024 9:25 AM | Last Updated on Wed, Dec 4 2024 9:25 AM

SBI Launches Nation Wide Drive To Promote Inoperative Account Activation

న్యూఢిల్లీ: ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇనాపరేటివ్‌గా మారిన ఖాతాలను పునరుద్ధరించేందుకు ఎస్‌బీఐ దేశవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. వరుసగా రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీ లేని సేవింగ్స్, కరెంట్‌ ఖాతాలను ఇనాపరేటివ్‌గా (నిర్వహణలో లేని) బ్యాంకులు పరిగణిస్తుంటాయి. ఈ ఖాతాలను తిరిగి యాక్టివేట్‌ చేసుకోవాలంటే తాజా కేవైసీ పూర్తి చేయాలి.

లావాదేవీల నిర్వహణతో ఖాతాలు ఇనాపరేటివ్‌గా మారకుండా చూసుకోవచ్చన్నది ఈ కార్యక్రమం ద్వారా తాము ఇచ్చే కీలక సందేశమని ఎస్‌బీఐ తెలిపింది. జన్‌ధన్‌ ఖాతాలను యాక్టివ్‌గా ఉంచడం, కస్టమర్లు నిరంతరం లావాదేవీలు నిర్వహించేలా చూసేందుకు మళ్లీ కేవైసీ చేయాల్సిన అవసరాన్ని ఎస్‌బీఐ చైర్మన్‌ సీఎస్‌ శెట్టి ప్రస్తావించారు.      

ఈ కార్యక్రమానికి ముందు ఎస్‌బీఐ తమ బిజినెస్‌ కరస్పాండెంట్లకు గురుగ్రామ్‌లో ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఖాతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఇన్ ఆపరేటివ్ అకౌంట్ యాక్టివేషన్ ప్రాముఖ్యత గురించి పాల్గొనేవారికి అవగాహన కల్పించడంపై ఈ వర్క్‌షాప్ దృష్టి సారించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement