savings
-
పెట్టుబడులకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే!
-
ఇన్‌కం.. లేదు నమ్మకం!
దేశంలో 24 శాతం మంది మాత్రమే 2025లో తమ కుటుంబ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. అదే విధంగా 48 శాతం మంది తమ సంపాదన ఈ ఏడాది 25 శాతం వరకూ లేదా అంతకన్నా ఎక్కువ తగ్గొచ్చని ఆందోళన చెందుతున్నారు. ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ఈ మేరకు తేలింది. ఈ సర్వేలో 16,111 మంది పాల్గొన్నారు. సేవింగ్స్ గురించి ప్రశ్నించగా.. 27 శాతం మంది మాత్రమే ఈ ఏడాది తమ సేవింగ్స్ పెరుగుతాయని చెబితే.. 45 శాతం మంది 25 శాతం మేర తగ్గుతాయని చెప్పారు. ‘దేశవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి నెలకొనిఉన్న నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఆయా వర్గాల వారికి ఉపశమనం కలిగించేలా తగు చర్యలు తీసుకోవాలి’ అని లోకల్ సర్కిల్స్ నివేదిక పేర్కొంది. ప్రజల ఆదాయంలో వృద్ధి లేకపోవడం.. అలాగే ధరల పెరుగుదల వల్ల 2024లో నిత్యావసరాలుకాని వస్తువుల కొనుగోలు తగ్గిందని.. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లలో తాము ఆశించినంత వృద్ధి కనపడలేదని రిటైలర్లు పేర్కొన్నట్లు తెలిపింది. ఈ ఏడాది కూడా ధరలు మరింత పెరుగుతాయని ప్రజలు నమ్ముతున్నట్లు తన నివేదికలో తెలిపింది. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఈ ఏడాదికి పెట్టుబడి అస్త్రాలు!
‘ఈ రోజు గడిస్తే చాలులే.. రేపటి రోజు గురించి ఇప్పుడు ఎందుకు?’.. ఈ తరహా ధోరణి ఆర్థిక విజయాలకు పెద్ద అడ్డంకి. ఆర్థిక స్వేచ్ఛ కోరుకునే ప్రతి ఒక్కరూ రేపటి రోజు కోసం కచ్చితమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఎందుకంటే పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్, సొంతిల్లు లక్ష్యాలు ఒక నెల సంపాదనతో సాధించేవి కావు. వీటి కోసం దీర్ఘకాలం పాటు పొదుపు, మదుపు చేయాల్సిందే. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామన్నది కీలకం. పొదుపును మెరుగైన సాధనంలో పెట్టుబడిగా మార్చి, క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లిన వారే ఆకాంక్షలను నెరవేర్చుకోగలరు. వివిధ సాధనాల మధ్య చక్కని పెట్టుబడుల కేటాయింపులతో ముందుకు వెళ్లడం ద్వారా జీవిత లక్ష్యాలను త్వరగా సాకారం చేసుకోవచ్చు. ఈ ఏడాది పెట్టుబడుల కోసం ఏ సాధనాలను ఎంపిక చేసుకోవచ్చు? వాటి పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై నిపుణుల సూచనలను ఓ సారి పరిశీలిద్దాం. రూ.5 వేలతో కోటి.. గతంతో పోల్చితే నేడు ఆదాయ స్థాయిల్లో ఎంతో మార్పు వచ్చింది. నెలకు రూ.5 వేలు పొదుపు చేయడం చాలా మందికి సాధ్యమే. రూ.5 వేలను ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా 15 శాతం రాబడులను ఇచ్చే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లో 25 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేశారనుకోండి. అప్పుడు రూ.1,64,20,369 సమకూరుతుంది. ఇందులో పెట్టుబడి రూ.15 లక్షలే. మిగిలిన రూ.కోటిన్నర కాంపౌండింగ్ మాయతో సమకూరిన సంపద. ఒకవేళ రాబడి ఇంకాస్త అధికంగా ఏటా 18 శాతం వచ్చిందని అనుకుంటే సమకూరే సంపద రూ.2.91 కోట్లు. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని ఖర్చులు ఎదురైనా పెట్టుబడిని విస్మరించకూడదు. అలాగే, మొత్తం పెట్టుబడిని ఈక్విటీల్లో పెట్టేయకూడదు. వివిధ సాధనాల మధ్య పెట్టుబడిని వైవిధ్యం చేసుకోవడం ద్వారా రిస్‌్కను అధిగమించొచ్చు. పెట్టుబడిని కాపాడుకోవచ్చు. రాబడులను పెంచుకోవచ్చు. ఈక్విటీలతోపాటు డెట్ సెక్యూరిటీలు, బంగారం, రియల్ ఎస్టేట్ సాధనాలను పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాలి. ఈక్విటీలు అధిక రాబడులను ఇస్తాయి. కానీ అస్థిరతలు ఎక్కువ. డెట్‌లో అస్థిరతలు తక్కువ, రాబడులూ తక్కువే. బంగారం, రియల్ ఎస్టేట్‌లో అస్థిరతలు తక్కువగా, రాబడులు మోస్తరుగా ఉంటాయి. ఈక్విటీలు..ఈక్విటీల విలువలు గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విభాగంలో, ఇటీవలి దిద్దుబాటు తర్వాత కూడా షేర్ల ధరలు కొంత అధికంగా ఉన్నాయి. కనుక ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణి అనుసరించాలని, రాబడుల అంచనాలు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది లార్జ్‌క్యాప్ స్టాక్స్ మెరుగైన పనితీరు చూపిస్తాయన్నది విశ్లేషకుల అంచనా. నాణ్యమైన, పటిష్ట వృద్ధి అవకాశాలతో, సహేతుక విలువల వద్దనున్న స్టాక్స్‌ను పరిశీలించొచ్చు. టాప్–50 కంపెనీల విలువ మొత్తం మార్కెట్ విలువలో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిల వద్ద ఉండడాన్ని గమనించొచ్చు. అదే సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ ఐదేళ్ల కాలానికి మెరుగైన రాబడులను ఇస్తాయని, వీటి నుంచి ఏటా సగటున 20 శాతం రాబడిని ఆశించొచ్చని అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఐవో సౌరభ్ రుంగ్తా సూచించారు. ‘‘2025 లార్జ్‌క్యాప్ స్టాక్స్ వంతు. ప్రైవేటు బ్యాంక్‌లు, టెలికం, ఎఫ్ఎంసీజీ మెరుగైన పనితీరు చూపించొచ్చు. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కూడా రాబడులను ఇస్తాయి. కానీ అంచనాలు తగ్గించుకోవాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేవారు ఫ్లెక్సీక్యాప్ వైపు చూడొచ్చు’’ అని నువమా వెల్త్ ప్రెసిడెంట్ రాహుల్‌జైన్ వివరించారు. ‘‘పెట్టుబడులను వివిధ అసెట్ క్లాస్‌ల మధ్య విస్తరించుకోవడం చక్కని అవకాశాలను సొంతం చేసుకోవడానికి ఉన్న మెరుగైన మార్గం’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ సీఐవో శంకరన్ నరేన్ సూచించారు. హైబ్రిడ్ ఫండ్స్, మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్, డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఇటీవలి మార్కెట్ కరెక్షన్తో లార్జ్‌క్యాప్‌లో విలువలు దిగొచ్చాయి. కానీ, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ విలువలు చారిత్రక సగటు కంటే ఎగువన ట్రేడ్ అవుతున్నాయి. కనుక సమీప కాలానికి లార్జ్‌క్యాప్ స్టాక్స్‌పై అధిక వేయిటేజీ ఇవ్వొచ్చు. మిడ్, స్మాల్‌క్యాప్‌లో ఎంపిక ఆచితూచి ఉండాలి’’ అని మోతీలాల్ ఓస్వాల్ వెల్త్ మేనేజ్మెంట్ సూచించింది. నేరుగా స్టాక్స్ కంటే నిపుణుల ఆధ్వర్యంలో నడిచే మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. నిఫ్టీ 2024లో 9 శాతం లాభాలతో ముగిసింది. 2025లో 28,800 వరకు ర్యాలీ చేయొచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్ అంచనా వేస్తోంది. రియల్టీ / ఏఐఎఫ్లుపట్టణీకరణ విస్తరిస్తూ ఉంది. మెరుగైన ఉపాధి కల్పనతో ఆదాయ స్థాయిల్లో మార్పు వస్తోంది. ఆఫీస్ స్పేస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. కనుక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్చేసుకోవాలని నిపుణుల సూచన. కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయిస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యానికి మౌలిక వసతులు కీలకం. కనుక ఇన్వెస్టర్లు రీట్లతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చని ఐసీఐసీఐ ఏఎంసీ సూచిస్తోంది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో ఇన్వెస్ట్ చేసే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఆర్ఈ ఏఐఎఫ్‌లు) కూడా ఉన్నాయి. ‘‘ప్రత్యేకమైన ఆర్ఈ ఏఐఎఫ్‌లు అత్యున్నత గ్రేడ్ కమర్షియల్ ఆఫీస్, లగ్జరీ నివాస గృహాల పోర్ట్‌ఫోలియోల్లో పెట్టుబడుల అవకాశాలను కలి్పస్తాయి. వీటిపై అధిక రాబడులకుతోడు, మెచ్యూరిటీ సమయంలో మూలధన లాభాలను సైతం పొందొచ్చు’’అని అవెండస్ వెల్త్ మేనేజ్మెంట్ ఎండీ, సీఐవో సౌరభ్ రుంగ్తా సూచించారు. రియల్ ఎస్టేట్‌లో ఒకరు విడిగా ఇన్వెస్ట్ చేయాలంటే పెద్ద మొత్తం అవసరం పడుతుంది. రీట్లు, ఏఐఎఫ్‌ల ద్వారా అయితే రూ.100–500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. భౌతిక ప్రాపరీ్టకి బదులు వీటిల్లో పెట్టుబడులు కలిగి ఉంటే, అవసరం వచ్చినప్పుడు వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. వీటిల్లో అస్థిరతలు తక్కువ.ఎఫ్‌అండ్‌వో/ క్రిప్టోలుఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో), క్రిప్టో ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎఫ్‌అండ్‌వోలో ట్రేడ్ చేసే 1.13 కోట్ల మందిలో 92.8 శాతం మంది 2021–22 నుంచి 2023–24 మధ్య ఒక్కొక్కరు సగటున రూ.2 లక్షలు నష్టపోయినట్టు సెబీ డేటా తెలియజేస్తోంది. అంతా కలిపి పోగొట్టుకున్న మొత్తం ఈ కాలంలో రూ.1.81 లక్షల కోట్లు. టాప్ 3.5 శాతం ట్రేడర్లు అయితే విడిగా ఒక్కొక్కరు రూ.28 లక్షల చొప్పున నష్టపోయారు. ‘‘ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్ మీ లాభాలను రెట్టింపు చేయడమే కాదు, నష్టాలను రెట్టింపు చేస్తుంది. దాంతో ఏళ్లపాటు చేసిన పొదుపు అంతా తుడిచిపెట్టుకుపోతుంది’’ అని ఈక్విరస్ వెల్త్ ఎండీ, సీఈవో అభిజిత్ భవే హెచ్చరించారు. క్రిప్టో అసెట్స్ కూడా ఒకరి నియంత్రణలో నడిచేవి కావు. ఫండమెంటల్స్‌తో సంబంధం లేకుండా.. డిమాండ్–సరఫరా, స్పెక్యులేషన్ ఆధారంగా వీటి విలువలు భారీ అస్థిరతలకు లోనవుతుంటాయి. దీంతో వీటిల్లో పెట్టుబడికి రక్షణ తక్కువ. కనుక రిస్క్ తీసుకునే వారు క్రిప్టోల కంటే పటిష్టమైన నియంత్రణల మధ్య నడిచే స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. భారీ లాభాల కంటే పెట్టుబడిని కాపాడుకోవడం ముఖ్యమని 5నాన్స్ ఫౌండర్ దినేష్ రోహిరా సూచించారుబంగారమాయే..అనిశి్చత పరిస్థితుల్లో, ఈక్విటీ తదితర సాధనాల్లో ప్రతికూలతలు నెలకొన్నప్పుడు పోర్ట్‌ఫోలియోకి బంగారం కొంత స్థిరత్వాన్ని తెస్తుంది. బంగారం 2024లో 24–26 శాతం మేర రాబడులు కురిపించింది. సామాన్యుడి నుంచి సెంట్రల్ బ్యాంకుల వరకు అందరికీ బంగారం ఆకర్షణీయంగా మారిపోయింది. పసిడికి డిమాండ్ ఈ ఏడాది కూడా కొనసాగొచ్చన్నది అంచనా. డాలర్‌కు బదులు సెంట్రల్ బ్యాంక్‌లు బంగారం రూపంలో నిల్వలకు ప్రాధాన్యం ఇవ్వడం డిమాండ్‌కు ప్రేరణనిస్తోంది. రూపాయి విలువ క్షీణత రూపంలోనూ బంగారం పెట్టుబడులపై అదనపు ప్రయోజనం లభిస్తుంది. కనీసం 18–24 నెలల కాలానికి బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చన్నది నిపుణుల సూచన. ఒకరు తమ మొత్తం పెట్టుబడుల్లో 5–10 శాతం బంగారానికి కేటాయించుకోవచ్చు. ‘‘2025లో ఈక్విటీలు తదితర రిస్కీ అసెట్స్‌లో అస్థిరతలు కొనసాగితే, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉంటే, సురక్షిత సాధనమైన బంగారంలో పనితీరు ఇతర సాధనాలతో పోల్చితే స్థిరంగా ఉండొచ్చు’’అని నిప్పన్ ఇండియా ఏఎంసీ కమోడిటీస్ హెడ్ విక్రమ్ ధావన్ అభిప్రాయపడ్డారు. బంగారంలో రాబడులు ఈ ఏడాది మోస్తరుగా ఉండొచ్చని ఆనంద్‌రాఠి కమోడిటీస్, కరెన్సీస్ డైరెక్టర్ నవీన్ మాధుర్ తెలిపారు. పన్ను ప్రయోజనాల దృష్ట్యా గోల్డ్ ఈటీఎఫ్‌లు మెరుగైన ఎంపికగా పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలో తులం బంగారం ధర రూ.86,000కు చేరుకోవచ్చని, తగ్గినప్పుడు కొనుగోలు చేయడమనే విధానాన్ని అనుసరించొచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ అనలిస్టులు సూచిస్తున్నారు. బంగారం ఈ ఏడాది రూ.82,000–85,000 శ్రేణిలో ట్రేడ్ కావొచ్చని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అంచనా. వెండి సైతం రూ.1.1 లక్షల నుంచి రూ.1.25 లక్షల వరకు ర్యాలీ చేయొచ్చని అంచనా వ్యక్తీకరించారు. మిరే అసెట్ షేర్‌ఖాన్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ సింగ్ మాత్రం ఈ ఏడాది చివరికి బంగారం 10 గ్రాములు రూ.90,000–93,000కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. డెట్‌లో అవకాశాలు..స్థిరాదాయ (డెట్) సాధనాల్లో రాబడులు వడ్డీ రేట్ల గమనంపై ఆధారపడి ఉంటాయి. ఈక్విటీ పెట్టుబడులకు స్టాక్స్ విలువలను ఎలా అయితే పరిశీలిస్తామో.. డెట్‌లో పెట్టుబడులకు సమీప కాలంలో వడ్డీ రేట్ల తీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. యూఎస్ ఫెడ్ ఇప్పటికే రెండు విడతలుగా వడ్డీ రేట్ల కోత నిర్ణయాలు తీసుకుంది. వచ్చే ఏడాదికి రెండు కోతలు చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ వేచి చూసే ధోరణితో ఉంది. వచ్చే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపును చేపట్టొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లోనే ఉన్నందున ఈ దశలో లాంగ్ డ్యురేషన్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయన్నది నిపుణుల సూచన. ‘‘రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నియంత్రిత బ్యాండ్‌లోనే ఉంది. వృద్ధి నిదానించింది. వడ్డీ రేట్లు గరిష్టాలకు చేరాయని మేము భావిస్తున్నాం. ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీలు), ఎన్సీడీలు, బాండ్లలో ఇన్వెస్ట్ చేసే వారు తమ పెట్టుబడులను అధిక రాబడుల (రేట్లు) వద్ద లాకిన్ చేసుకోవాలి. సంప్రదాయ సాధనాలకు వెలుపల క్రెడిట్ ఫండ్స్, వెంచర్ డెట్ ఫండ్స్, స్పెషల్ సిచ్యుయేషన్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ ఫండ్స్ రిస్క్‌ను మించి రాబడులను ఇస్తాయి. దీంతో మొత్తం మీద డెట్ పోర్ట్‌ఫోలియో రాబడులను పెంచుకోవచ్చు’’అని నువమా వెల్త్ ఎండీ రాహుల్‌జైన్ సూచించారు. సైబర్ రక్షణ2023–24లో సైబర్ మోసాలు 300 శాతం (2,92,800 ఘటనలు) పెరిగాయి. 2024లో మొదటి తొమ్మిది నెలల్లోనే 11,333 కోట్ల నష్టం వాటిల్లింది. ‘‘మన దేశ వాసులు ఒక్కొక్కరు సగటున ఒక రోజులో 194 నిమిషాలు సోషల్ మీడియాపై గడుపుతున్నారు. టీనేజర్లు సైతం 3–6 గంటలు వెచ్చిస్తున్నారు. ఫిషింగ్, గుర్తింపు చోరీతోపాటు సైబర్ దాడులు పెరిగాయి’’అని టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నజీమ్ బిల్గ్రామి తెలిపారు. నేడు చాలా మంది స్మార్ట్ ఫోన్ నుంచే స్టాక్స్, ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. చెల్లింపులు, నగదు బదిలీ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. అదే స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా బ్రౌజింగ్ చేస్తున్నారు. ఇలాంటి వారు సైబర్ దాడుల రూపంలో పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక సైబర్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ‘‘సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ అన్నది ఆన్లైన్ మోసాలు, అనధికారిక లావాదేవీలు, డేటా లీకేజీ రూపంలో వ్యక్తులకు కలిగే ఆర్థిక నష్టం, చట్టబద్ధమైన బాధ్యతల నుంచి రక్షణనిస్తుంది’’ అని ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఎస్.బ్రహ్మజోస్యుల వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ ఇన్సూరెన్స్ రూ.10,000 నుంచి రూ.కోటి వరకు తీసుకోవచ్చు. వ్యక్తులు, కుటుంబ సభ్యులకూ కలిపి తీసుకునే వెసులుబాటు ఉంది. సైబర్ ఇన్సూరెన్స్‌తోపాటు, ఎవరూ ఊహించని విధంగా పాస్వర్డ్లు, మొబైల్లో సైబర్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ ఉండేలా చూసుకోవాలి. ఓటీపీ, వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, ఆధార్, చిరునామా వివరాలను ఎవరితోనూ పంచుకోరాదు.ఏవి.. ఎందుకు..? ఈక్విటీ ఫండ్స్: అధిక వృద్ధి అవకాశాలతో దీర్ఘకాల లక్ష్యాలకు అనుకూలం. డెట్ ఫండ్స్: స్థిరమైన, ఊహించదగిన రాబడులు ఇచ్చేవి.హైబ్రిడ్ ఫండ్స్: ఈక్విటీ, డెట్ కలసినవి. పెట్టుబడుల వృద్ధి, రిస్‌్కను సమతుల్యం చేసేవి. ఈఎల్ఎస్ఎస్: ఈక్విటీ పెట్టుబడికి అదనంగా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు ఆఫర్ చేసేవి. ఎన్పీఎస్: చాలా చౌక చార్జీలకే ఈక్విటీ, డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతూ, రిటైర్మెంట్ నిధిని సమకూర్చుకునేందుకు ఉద్దేశించిన మెరుగైన సాధనం. పన్ను ప్రయోజనాలతో కూడినది.రీట్లు/ఇన్విట్లు: కార్యకలాపాలు నిర్వహించే ఆఫీస్, రిటైల్ ప్రాపర్టీలు.. ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో యూనిట్ల రూపంలో పెట్టుబడికి వీలు కలి్పంచేవి.గోల్డ్ ఈటీఎఫ్: స్టాక్ ఎక్సే్ఛంజ్ ద్వారా బంగారంలో పెట్టుబడులకు వీలు కల్పించే ఎలక్ట్రానిక్ సాధనం. -
పెట్టుబడులకు మరోమార్గం... మ్యూచువల్ ఫండ్స్
విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి. చెట్లుగా.. ఆపై వృక్షాలుగా ఎదుగుతాయి. పూలు, పళ్ళు ఇస్తాయి. ఇదంతా ఒక్క రోజులో జరిగిపోదు.డబ్బులకూ అదే సూత్రం వర్తిస్తుంది. డబ్బులు నాటితే డబ్బులు మొలకెత్తుతాయి. ఆపై అవి లక్షలు, కోట్లుగా రూపాంతరం చెందుతాయి. ఇది కూడా ఒక్ కరోజులో జరిగే పని కాదు. మన కష్టార్జితాన్ని ఇంతలింతలు చేసుకోవడానికి ఎలాంటి సాధనాలు ఎంచుకోవాలి అన్నదే ప్రధాన ప్రశ్న.మీరు అధ్యయనం చేసి... నిపుణుల సలహా తీసుకుని..తెలివి తేటలతో వ్యవహరించి పెట్టుబడులు పెట్టగలిగితే.. దీర్ఘకాలంలో మంచి రాబడి పొందుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మన సొమ్ములు తగిన ప్రతిఫలాన్ని ఇచ్చే సాధనాలు ఏవో తెలిసి ఉండాలి. దాని కంటే ముందే మీదగ్గరున్న డబ్బుల నుంచి మీరు ఏమి ఆశిస్తున్నారో కూడా మీకు తెలిసి ఉండాలి. లేదంటే ఏళ్ళుగడిచినా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న మాదిరి మీ జీవితం ఎదుగూ బొదుగూ ఉండదు.తాము చేసే పొదుపు బాగా పెరగాలని, రెట్టింపు అవ్వాలని ఎవరు అనుకోరు చెప్పండి. మీరూ ఇందుకు మినహాయింపు కాదంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... కాస్త రిస్క్ తీసుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉండటం. కొద్దిగా రిస్క్ తీసుకోగలిగి... దీర్ఘకాలంపాటు వేచిఉండేవాళ్ళకు అనువైన పెట్టుబడి సాధనంగా మ్యూచువల్ ఫండ్స్ అని చెప్పొచ్చు.స్టాక్ మార్కెట్లో 100% రిస్క్ తీసుకోలేనివాళ్లకు ఉపయుక్తమైన పెట్టుబడి మార్గం మ్యూచువల్ ఫండ్స్. మనం ఈ ఫండ్స్‌లో సరైన వాటిని ఎంచుకుని పెట్టుబడి పెడితే కొన్నాళ్ళకు అవి మంచి రాబడి అందిస్తాయి. ఇందులో రెండు రకాలు ఉంటాయి.1. సిప్స్2. పెద్దమొత్తంలో ఒకేసారి పెట్టుబడిమీరు ఒక మ్యూచువల్ ఫండ్ స్కీను ఎంచుకుని నెలకు కొంత మొత్తం చొప్పున పెట్టుబడి పెడుతూ వెళ్లొచ్చు. ఇదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). అధిక మొత్తంలో ఒకేసారి పెట్టుబడి పెట్టలేని వాళ్లకు ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఇక మీచేతిలో తగినంత మొత్తం ఉండి పెద్దమొత్తంలో పెట్టి దీర్ఘకాలం వేచి ఉంటే మంచి రాబడి పొందడం రెండో మార్గం.ఎలాంటి ఫండ్స్ ఎంచుకోవాలి?మ్యూచువల్ ఫండ్స్‌ను వివిధ టాటా, బిర్లా, రిలయన్స్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి ప్రముఖ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. అయితే మనపెట్టుబడికి తగ్గట్టు, స్థిరంగా రాబడి అందివ్వగల ఫండ్స్‌ను ఎంచుకోవాలి. యాంఫి (AMFI) వెబ్సైటులో ఫండ్స్ కు సంబంధించిన యావత సమాచారం దొరుకుతుంది.ప్రస్తుతం దేశంలో వివిధ మ్యూచువల్ ఫండ్ సంస్థలు అందిస్తున్న స్కీంల్లో ప్రధానమైనవాటిగా ఈకింది వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. » ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఫోకస్డ్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్» ఆదిత్య బిర్లా సన్ లైఫ్ స్మాల్ & మిడ్ క్యాప్ ఫండ్» టాటా ఈక్విటీ పీఈ ఫండ్» హెచ్డీఎఫ్సీ మంత్లీ ఇన్కమ్ ప్లాన్» ఎల్&టీ టాక్స్ అడ్వాంటేజ్ ఫండ్» ఎస్బీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్» కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్» కెనరా రోబెకో గిల్టీ పీజీఎస్» డీఎస్పీ బ్లాక్‌రాక్ బ్యాలెన్స్డ్ ఫండ్» యాక్సిస్ లిక్విడ్ ఫండ్వీటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా పరిశీలించి ఎంతెంత రాబడి అందిస్తున్నాయి, రిస్క్ ఏ స్థాయిలో ఉంటుంది, పెట్టుబడి ఎలా పెట్టాలి, కాలావధి, వివిధ రేటింగ్ సంస్థలు ఇచ్చిన రేటింగ్, గతకాలపు పనితీరు.... ఇత్యాది అంశాలు సంపూర్ణంగా విశ్లేషించుకుని పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.ఇక అధిక రిస్క్‌తోపాటు అధికరాబడి ఇస్తున్న ఫండ్స్ విషయానికొస్తే... » హెచ్ఎస్బీసీ మిడ్ క్యాప్ ఫండ్» కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్» ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ స్మాల్ క్యాప్ ఫండ్» యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్» ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్» మిరే అసెట్ మిడ్ క్యాప్ ఫండ్» టాటా మిడ్ క్యాప్ గ్రోత్ ఫండ్‌పై వాటిని ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు, ఇక మహీంద్రా మేన్యూ లైఫ్ మిడ్ క్యాప్ ఫండ్, సుందరం మిడ్ క్యాప్ ఫండ్ లు 30 శాతంపైగా వార్షిక రిటర్న్ లు అందిస్తున్నాయి. సిప్ పెట్టుబడుల విషయానికొస్తే... గత అయిదేళ్లుగా ఇన్వెస్కో ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ 30 శాతంపైగా రాబడి ఇస్తోంది.మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తాయి?మ్యూచువల్ ఫండ్స్ మీ దగ్గర సమీకరించిన సొమ్ముల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాయి. అలాచేయడానికి ముందే మీ రిస్క్ కెపాసిటీ, మీ ఆలోచనలు, రాబడి అంచనాలు... వంటి సమాచారాన్ని మీ దగ్గర నుంచి సేకరిస్తాయి. తదనుగుణంగా మీ సొమ్ముల్ని వివిధ పెట్టుబడి మార్గాల్లోకి మళ్లిస్తాయి.» సెక్టోరియల్ ఫండ్స్» టాక్స్ సేవింగ్ ఫండ్స్» ఇండెక్స్ ఫండ్స్» డెట్ ఫండ్స్» స్మాల్ క్యాప్ ఫండ్స్» మిడ్ క్యాప్ ఫండ్స్» లార్జ్ క్యాప్ ఫండ్స్ఇలా భిన్నమైన మార్గాల్లో మీ సొమ్ములను ఇన్వెస్ట్ చేస్తాయి. తద్వారా వచ్చే రాబడిని మీకు బదిలీ చేస్తాయి (ట్యాక్స్‌లు, కమీషన్లు, చార్జీలు వసూలు చేసుకుని).స్టాక్ మార్కెట్‌తో పోలిస్తే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారికి రిస్క్ తక్కువే ఉంటుంది. కానీ రాబడి కూడా అదేస్థాయిలో ఉంటుంది. కాబట్టి పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు పూర్తిగా ఫండ్ స్కీంలకు సంబంధించిన సమాచారాన్ని మదింపు చేసిన తర్వాతే ముందడుగు వేయడం మంచిది. వివిధ ఫండ్లకు సంబంధించి విశ్లేషణాత్మక సమాచారాన్ని రాబోయే రోజుల్లో తెలుసుకుందాం.-బెహరా శ్రీనివాసరావు, స్టాక్ మార్కెట్ నిపుణులు -
చిన్న పెట్టుబడి.. పెద్ద రాబడి
సాక్షి, అమరావతి: మహిళల ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబడి పొందేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్’ అనే పొదుపు పథకం విశేష ఆదరణ పొందుతోంది. మహిళలు, బాలికల కోసం ఈ పథకాన్ని 2023–24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఖాతాలు ప్రారంభించడానికి ఏప్రిల్ 2023 నుంచి మార్చి 2025 వరకు మాత్రమే అవకాశం కల్పించింది. మహిళలు తమ పేరు మీద పోస్టాఫీసులు లేదా నిర్దేశించిన బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరవచ్చు. మైనర్ బాలికల పేరుతో సంరక్షకులు ఖాతా తెరిచే అవకాశం కల్పించారు.కనీసం రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.2 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన తేదీ నుంచి రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో తిరిగి ఆ మొత్తాన్ని చెల్లిస్తారు. అలాగే పాక్షిక ఉపసంహరణ సౌకర్యం కూడా కల్పించారు. ఖాతా తెరిచిన తేదీ నుంచి సంవత్సరం తర్వాత ఖాతా బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ మద్దతుతో కూడిన చిన్న పొదుపు పథకం.అందువల్ల దీనికి ఎలాంటి రిస్క్ కూడా ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 43.30 లక్షల ఖాతాలు తెరిచారని ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 7,46,223 ఖాతాలతో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. 2,11,016 ఖాతాలతో ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో నిలిచింది. ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ ఖాతాలు తెరిచేందుకు వచ్చే ఏడాది మార్చి 31 వరకే గడువు ఉంది. అందువల్ల వీలైనంత త్వరగా ఈ పథకాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.రూ.31,125 వడ్డీ..ఈ పథకం కింద రూ.2,00,000 డిపాజిట్ చేస్తే సంవత్సరానికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. మొదటి సంవత్సరంలో రూ.15,000 వడ్డీ, రెండో సంవత్సరంలో రూ.16,125 వడ్డీ లభిస్తుంది. ఈ విధంగా రెండేళ్ల గడువు పూర్తయ్యేనాటికి వడ్డీతో కలిపి రూ. 2,31,125 మేర ప్రయోజనం పొందుతారు. -
నెలవారీ సంపాదనలో పొదుపు.. ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా?
నెలవారీ సంపాదనలో పొదుపు చేసిన మొత్తాన్ని.. రిటైర్మెంట్, పిల్లల విద్య, ఇల్లు కొనుగోలు తదితర లక్ష్యాలకు ఎలా కేటాయించుకోవాలి? ఇందుకు ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా? – వికాస్ సింగ్మీ ఆదాయం, ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా వివిధ లక్ష్యాల కోసం పొదుపు, పెట్టుబడులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎలా విభజించాలనే దానికి సార్వత్రిక సూత్రం అంటూ లేదు. వ్యక్తుల ఆదాయ పరిస్థితులు, రాబడుల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగానే నిర్ణయించుకోవాలి.మీ ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి. దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవి అద్భుతమైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3–5 ఏళ్ల స్వల్ప కాలానికి సంబంధించిన లక్ష్యాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.ఇక క్రమం తప్పకుండా అంటే ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా మీ పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను డెట్ సాధనాల వైపు మళ్లించుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే చురుకైన ప్రణాళికను ఆచరణలో పెట్టండి. నా వద్ద 2020లో కొనుగోలు చేసిన డెట్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని విక్రయిస్తే పన్ను భారం ఎలా పడుతుంది? – పి.కె గుప్తాస్థిరమైన రాబడులకు డెట్ ఫండ్స్ మంచి ఎంపిక. మీరు 2020లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసి, ఇప్పుడు విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. పైగా లాభంలో ద్రవ్యోల్బణం ప్రభావం తీసివేసేందుకు (ఇండెక్సేషన్) అవకాశం లేదు. డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన తేదీ, ఎంత కాలం పాటు కొనసాగించారు, ఎప్పుడు విక్రయించారనే ఆధారంగా పన్ను భారం మారిపోతుంది.2023 ఏప్రిల్ 1కి ముందు డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే 36 నెలల పాటు వాటిని కొనసాగించి, 2024 జూలై 23లోపు విక్రయించిన వారికే ఈ ప్రయోజనం పరిమితం. మీ కొనుగోలు ధరలో ఇండెక్సేషన్ సర్దుబాటు జరుగుతుంది. దీంతో లాభంపై చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గిపోతుంది. కాకపోతే 2023 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసినప్పటికీ, 2024 జూలై 23లోపు విక్రయించని వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం కోల్పోయినట్టే.దీంతో గతంతో పోల్చితే డెట్ ఫండ్స్ లాభాలపై ప్రస్తుత పన్ను ఆకర్షణీయంగా లేదు. కాకపోతే మరింత కాలం పాటు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారా సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్డీలపై వడ్డీ ఏటా పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో విక్రయించినప్పుడే లాభంపై పన్ను అమల్లోకి వస్తుంది. -
ఫోన్‌పేలో ‘పసిడి’ పొదుపు..
ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే (PhonePe) 'డైలీ సేవింగ్స్' పేరుతో కొత్త ఉత్పత్తిని పరిచయం చేయనుంది. ఇందుకోసం మైక్రో-సేవింగ్స్ ప్లాట్‌ఫామ్ ‘జార్’తో భాగస్వామ్యం కుదుర్చికుంది. ఇది యూజర్లు రోజువారీ చిన్న పెట్టుబడి ద్వారా 24 క్యారెట్ల డిజిటల్ బంగారంలో డబ్బును ఆదా చేయడానికి వీలు కల్పిస్తుందని ఫోన్‌పే ఒక ప్రకటనలో తెలిపింది.ఈ కొత్త ఉత్పత్తి కింద వినియోగదారులు డిజిటల్ గోల్డ్‌లో రోజుకు కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 5,000 వరకు పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. స్థిరమైన పొదుపును అలవరచుకోవడంలో ఇది తోడ్పడుతుంది. డిజిటల్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియను కేవలం 45 సెకన్లలోపు క్రమబద్ధీకరించే జార్ ఇంటిగ్రేటెడ్ గోల్డ్ టెక్ సొల్యూషన్‌ను ఫోన్‌పే 'డైలీ సేవింగ్స్' ఫీచర్‌కు జోడించనున్నట్లు కంపెనీ పేర్కొంది.ఇటీవలి కాలంలో తమ ప్లాట్ఫామ్లో డిజిటల్ బంగారంపై యూజర్ల ఆసక్తిలో గణనీయమైన పెరుగుదలను చూసినట్లు ఇన్‌యాప్ కేటగిరీస్, కన్స్యూమర్ పేమెంట్స్ హెడ్ నిహారిక సైగల్ చెప్పారు. ఇటీవల సూక్ష్మమైన, సురక్షితమైన డిజిటల్ గోల్డ్ సేవింగ్స్ ఆప్షన్లకు వినియోగదారుల ప్రాధాన్యత పెరుగుతున్నట్లు ఫోన్‌పే సైతం గుర్తించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం 560 మిలియన్ల మందికి పైగా ఫోన్‌పే యూజర్లకు డిజిటల్ గోల్డ్‌లో చిన్నపాటి పెట్టుబడులు పెట్టేందుకు వీలు కల్పిస్తుంది. -
టర్మ్ డిపాజిట్లకే ఆదరణ
న్యూఢిల్లీ: బ్యాంకు ఖాతాల్లో సేవింగ్స్ డిపాజిట్లకు బదులు, అధిక రాబడినిచ్చే టర్మ్ డిపాజిట్లకే కస్టమర్లు మొగ్గు చూపిస్తున్నారు. ఫలితంగా బ్యాంకులకు నిధులపై వ్యయాలు పెరిగిపోయి, వాటి నికర వడ్డీ మార్జిన్లకు చిల్లు పెడుతున్న పరిస్థితి నెలకొంది. ఆర్బీఐ తాజా డేటా ప్రకారం.. ఐదు ప్రముఖ బ్యాంక్‌ల్లో సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ రేటు 2.7–3 శాతం మధ్య ఉండగా, ఏడాది కాల టర్మ్ డిపాజిట్లపై అవే బ్యాంకులు 7.25 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. 2023–2024 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగం, అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే టర్మ్ డిపాజిట్ల రూపంలో 18.64 శాతం అధికంగా రూ.116 లక్షల కోట్లను సమీకరించాయి. అదే కాలంలో బ్యాంకుల సేవింగ్స్ డిపాజిట్లు కేవలం 6 శాతం పెరిగి రూ.63 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 13.5 శాతంగా ఉంటే, సేవింగ్స్ డిపాజిట్లలో పరుగుదల 4.9 శాతంగానే ఉండడం గమనార్హం. 2021–22లో టర్మ్ డిపాజిట్లలో వృద్ధి 9.6 శాతంగానే ఉంది. అదే ఏడాది సేవింగ్స్ డిపాజిట్లు ఇంతకంటే అధికంగా 12.4 శాతం మేర పెరిగాయి. మొత్తం మీద 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ డిపాజిట్లు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 13.5 శాతం వృద్ధి చెందాయి. అంతకుముందు వరుస ఆర్థిక సంవత్సరాల్లో ఈ వృద్ధి వరుసగా 9.6 శాతం, 8.9 శాతం చొప్పున ఉంది.అధిక రాబడుల కోసమే..పొదుపు నుంచి టర్మ్ డిపాజిట్లకు పెట్టుబడుల మరళింపు స్పష్టంగా కనిపిస్తున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. రేట్లు గరిష్ట స్థాయిలో ఉండడంతో టర్మ్ డిపాజిట్లలోకి పొదుపు నిధులు మళ్లించుకోవడం ద్వారా రాబడులను పెంచుకునేందుకు కస్టమర్లు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. దేశంలో అతిపెద్ద బ్యాంక్ (డిపాజిట్లలో 22.6 శాతం వాటా) ఎస్బీఐ డిపాజిట్ బేస్ గడిచిన ఆర్థిక సంవత్సరంలో 11.13 శాతం వృద్ధితో రూ.49.16 లక్షల కోట్లకు చేరుకుంది. ‘‘2023–24లో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో టర్మ్ డిపాజిట్లు 16.38 శాతం మేర వృద్ధి చెంది రూ.27.82 లక్షల కోట్లకు చేరాయి. కాసా డిపాజిట్లు (కరెంట్, సేవింగ్స్ ఖాతా డిపాజిట్లు) 4.25 శాతం పెరిగి రూ.19.42 లక్షల కోట్లకు చేరాయి’’అని ఎస్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల నుంచి డిపాజిట్లు కేవలం టర్మ్ డిపాజిట్లలోకే కాకుండా, ఇంకా మెరుగైన రాబడులు వచ్చే ఈక్విటీలు, ప్రత్యామ్నాయ పెట్టుబడుల సాధనాల్లోకి వెళుతున్నట్టు బ్యాంకర్లు చెబుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా బ్యాంకు రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి తగ్గడానికి ఇదే కారణమని పేర్కొంటున్నారు. రుణాల వృద్ధి కంటే డిపాజిట్ల వృద్ధి క్షీణించడం పట్ల ఆర్బీఐ సైతం ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. డిపాజిట్లు ఆకర్షించేందుకు బ్యాంకులు వినూత్నమైన మార్గాలను అన్వేíÙంచాలని సైతం ఆర్బీఐ సూచించింది. ‘‘బ్యాంక్‌లు డిపాజిటర్లను ఆకర్షించేందుకు మెరుగైన సంబంధాల దిశగా కృషి చేస్తున్నాయి. అందుకు అనుగుణంగా వ్యాపార విధానాలు సైతం మారాల్సిందే. కేవలం డిపాజిట్ల స్వీకరణకే పరిమితం కాకుండా, సంపద నిర్వహణ సేవలు, క్లయింట్లతో పూర్తి సంబంధాల దిశగా వ్యవహరించాల్సిందే’’అని ఫెడరల్ బ్యాంక్ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొనడం గమనార్హం. -
గృహ పొదుపులే ఆదుకుంటాయ్
ముంబై: గృహ పొదుపులు ఆర్థిక వ్యవస్థ పెట్టుబడి అవసరాలకు మద్దతుగా నిలుస్తున్నాయని (వృద్ధికి) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మేకేల్ దేబబ్రత పాత్ర అన్నారు. వెలుపలి నిధులను కేవలం అదనపు మద్దతుగా పేర్కొన్నారు. సీఐఐ నిర్వహించిన ఆర్థిక సదస్సులో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. ‘‘గృహాలకు సంబంధించి నికర ఆర్థిక పొదుపులు 2020–21 నుంచి చూస్తే సగానికి తగ్గాయి. కరోనా విపత్తు సమయంలో వివేకంతో దాచుకున్న పొదుపులు ఇల్లు వంటి భౌతిక ఆస్తుల్లోకి మళ్లుతుండడమే దీనికి కారణం. రానున్న రోజుల్లో పెరిగే ఆదాయాలతో గృహ పొదుపులు తిరిగి ఆర్థిక సాధనాల్లోకి వస్తాయి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2011–17 నాటికి జీడీపీలో గృహ ఆర్థిక పెట్టుబడులు 10.6 శాతంగా ఉంటే, 2017–23 నాటికి 11.5 శాతానికి చేరాయి’’అని పాత్ర వివరించారు. కరోనా అనంతరం భౌతిక పొదుపులు సైతం జీడీపీలో 12 శాతానికి పెరిగాయని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయన్నారు. ప్రైవేటు కార్పొరేట్ రంగం నికర రుణ భారాన్ని గణనీయంగా తగ్గించుకున్నట్టు చెప్పారు. మూలధన వ్యయాల సైకిల్ పుంజుకున్నందున కార్పొరేట్ రంగం రుణాలు ఇకమీదట పెరగొచ్చని అంచనా వేశారు. ఈ విధమైన రుణ అవసరాలను గృహ పొదుపులతోపాటు, వెలుపలి వనరులు తీరుస్తాయన్నారు. ఆర్థిక ఉత్పాదకత పెరుగుతున్న కొద్దీ విదేశీ నిధులను సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ఇనుమడిస్తుందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, కరెన్సీ విషయంలో ఆర్బీఐ పాత్రను ఇదే సమావేశంలో భాగంగా సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ మెచ్చుకున్నారు. -
కోరికలు తీర్చే ‘ఫిష్’!
ఇళ్లు కొనాలనుకుంటున్నారా.. కొనండి. కారు తీసుకోవాలనుకుంటున్నారా.. తీసుకోండి. విదేశాలు చుట్టేయాలనుకుంటున్నారా.. వెళ్లిరండి. పిల్లలను మంచి స్కూల్లో చేర్పించాలంటే.. చేర్పించండి.. అంతా బాగానే ఉంది కానీ, అన్నింటికీ డబ్బుకావాలని ఆలోచిస్తున్నారా. మరేం ఫర్వాలేదు. ఉద్యోగం చేస్తూనే అన్ని కోరికలు తీర్చుకోవచ్చు. ఎలా అంటారా? అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. మదుపు ప్రారంభించాలి. ప్రధానంగా అందరికీ ‘ఫిష్’ గురించి తెలియాలి. అదేంటి చేప గురించి తెలిస్తే డబ్బు సంపాదించవచ్చని అనుకుంటున్నారేమో..కాదండి. ‘ఫిష్’ను పాటిస్తే దాదాపు మన కోరికలు నెరవేర్చుకోవచ్చు. అసలు ఈ ‘ఫిష్’ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.‘ఫిష్’ థియరీఎఫ్ఐ.ఎస్.హెచ్: ఫిష్..ఆర్థిక ప్రణాళిలో ఈ ఫిష్ థియరీని పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫిష్ థియరీను మూడు భాగాలుగా విభజించారు.ఎఫ్ఐ: ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ఎస్: సేవింగ్స్హెచ్: హ్యాపీ టు స్పెండ్ఎఫ్ఐ: ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్బ్యాంకు అకౌంట్లో జీతం పడగానే నెలవారీ స్థిర ఖర్చుల కోసం(ఎఫ్ఐ) డబ్బు వెచ్చించాలి. అందులో ప్రధానంగా ఇంటి అద్దె, ఇంటర్నెట్ బిల్లు, సరుకులు, ఫోన్ బిల్లు..వంటి ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అయితే ఈ మధ్య కూరగాయల ధరలు భారీగా పెరుగుతున్నాయి కదా. ఒకవేళ నెల మధ్యలో అమాంతం వాటి విలువ పెరిగినా ఓ పదిశాతం అధికంగా ఖర్చు చేసే వీలుంటుంది. అందుకు అనువుగా బడ్జెట్ కేటాయించుకోవాలి. అయితే ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కలిపి జీతంలో యాభైశాతానికి మించకుండా జాగ్రత్త వహించాలి.ఎస్: సేవింగ్స్భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు(ఎస్) చేయాలి. వేతనంలో 50 శాతం ‘ఎఫ్ఐ’కు కేటాయించాక మిగిన దాని నుంచి 30 శాతం ఇంటి నిర్మాణం, రిటైర్మెంట్ ప్లాన్, హెల్త్‌పాలసీ, టర్మ్ పాలసీ, ఇన్వెస్ట్మెంట్ కోసం కేటాయించాలి. ఎలాంటి మార్గాల్లో మదుపు చేయాలనే అంశంపై నిపుణులతో చర్చించాలి.ఇదీ చదవండి: మారుతున్న ప్రచార పంథాహెచ్: హ్యాపీ టు స్పెండ్ఇక మిగిలిన 20 శాతం జీతాన్ని ఆనందాలకు, అభిరుచులకు ఖర్చు పెట్టుకోవచ్చు. విందూ వినోదాలకు వెచ్చించవచ్చు. సినిమాలు, షికార్లు, షాపింగ్..వంటి వాటికి ఏంచక్కా ఖర్చు చేసుకోవచ్చు. కానీ పైన తెలిపిన విధంగా ఇతర వాటికి డబ్బు కేటాయించిన తర్వాతే మిగతా సొమ్మును ఖర్చు పెట్టాలి. ఒక్కసారి ఈ ‘ఫిష్’ థియరీను ఆకలింపు చేసుకుని ప్రయోగాత్మకంగా కొన్ని నెలలు పాటిస్తే ఆర్థిక జీవితంలో మార్పు గుర్తిస్తారని నిపుణులు చెబుతున్నారు. -
రూ.25 లక్షల జీతం.. ఏమీ మిగలడం లేదు: ట్వీట్ వైరల్
చదువుకున్న ప్రతి ఒక్కరూ జాబ్ చేయాలి, సంతోషంగా కాలం గడపాలి అనుకుంటారు. కానీ ఈ పోటీ ప్రపంచంలో చదువు పూర్తయిన ఉద్యోగంలో చేరిన తరువాత జీవితం మొత్తం ఉరుకులు, పరుగులతో నిండి ఉంటుంది. ఇది పక్కన పెడితే వచ్చే జీతాలు నెల మొత్తం గడపడానికి సరిపోవడం లేదు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.సౌరవ్ దత్త అనే ఎక్స్ (ట్విటర్) యూజర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు రూ. 25 లక్షల వార్షిక వేతనం లభిస్తుందని. పొదుపు చేద్దామంటే డబ్బు మిగలడం లేదని వివరంగా పేర్కొన్నారు.వార్షిక వేతనం రూ. 25 లక్షలు. నెలకు రూ.1.50 లక్ష చేతికి వస్తుంది. ఇందులో రూ.1 లక్ష ఈఎమ్ఐ, రెంట్ వంటి వాటికి.. రూ. 25వేలు ఫుడ్, మూవీస్, ట్రిప్స్ వంటి వాటికి, రూ. 25వేలు అత్యవసరానికి/మెడికల్ ఎమర్జెన్సీకి సరిపోతుంది. ఇలా మొత్తం ఖర్చు అవుతోంది. ముగ్గురున్న కుటుంబానికి ఇది సరిపోదు అంటూ.. పొదుపు చేయడానికి సాధ్యం కావడం లేదని వెల్లడించారు.ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో కొందరు రూ. 25లక్షలు సంవత్సరానికి సరిపోతాయని చెబుతున్నారు. మరికొందరు మారుతున్న జీవన విధానం వల్ల సరిపోదని అన్నారు. చాలామంది అతని లెక్క సరైంది కాదని విభేదిస్తున్నారు.25LPA is too little for running a family.25 LPA = in hand 1.5L per month.Family of 3 would spend 1L on essentials, EMI / rent.25K for eating out, movies, OTT, day trips.25K for emergency and medical.Nothing left to invest.— Sourav Dutta (@Dutta_Souravd) August 11, 2024 -
International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే?
స్త్రీలు సంపాదనపరులైతే ఏమవుతుంది? ఆర్థికంగా సమృద్ధి సాధిస్తే ఏమవుతుంది? తమ జీవితాలపై అధికారం వస్తుంది. కీలక నిర్ణయాలప్పుడు గొంతెత్తే ఆత్మవిశ్వాసం వస్తుంది. తమకు ఏ హక్కులు రక్షణ ఇస్తాయో ఎరుక కలుగుతుంది. స్త్రీ ఇవన్నీ కుటుంబ సంక్షేమానికే వెచ్చిస్తుంది. స్త్రీ ఆర్థిక స్వాతంత్య్రం ఇంటా, బయటా స్త్రీ, పురుషుల సమ భాగస్వామ్యాన్ని ప్రతిపాదిస్తుంది. కాని స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రానికి ఇంకా ఎంతో చైతన్యం కావాలి. స్త్రీలు సాధికారత పొందటం అంటే ఏమిటి? పరాధీనత నుంచి బయటపడటమే. అంటే? మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటమే. తండ్రి, భర్త, కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయట పడటం. అంటే బంధం నుంచి బయటపడటం కాదు. స్థితి నుంచి మాత్రమే. స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు. స్త్రీలకు సామాజికంగా, కుటుంబపరంగా హక్కులు ఉంటాయి. అయితే ఆ హక్కులను దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి. పుట్టుక నుంచే స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే తీసివేయడం నేటికీ జరుగుతోంది. ‘ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టడానికి’ అనుకునే తల్లిదండ్రులు, భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికీ జరుగుతూనే ఉంది. ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చినా చదువు వల్ల వచ్చే, ఆమెకై ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు. స్త్రీలను ‘అదుపులో ఉంచడం’ అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే. పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు. దానివల్ల న్యూనతతో ఉండాలి. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త/తండ్రి/కుమారుడి మాట చెల్లుబాటు కావడానికి కారణం వారు ‘ఆర్థిక వనరులు కలిగి ఉండటం’. ‘రూపాయి సంపాదన లేని దానివి నువు కూడా మాట్లాడేదానివేనా’ అని స్త్రీలను పరోక్షంగా అనడం. అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తోంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు. కుటుంబపరంగా, సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వావలంబన వల్ల కలుగుతుంది. ఆమెకు ఆర్థిక స్వాతంత్య్రం అవసరం. అందుకు చదువు ముఖ్య సాధనం. సాధికారత అంటే? స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే. ఒక స్త్రీ అంట్రప్రెన్యూర్ కావాలనుకున్నా, పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్నా, కాన్పు సమయంలో బ్రేక్ తీసుకుని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా, పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్లాలనుకున్నా, గృహిణిగా ఉంటూ ఇంటిపట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది. ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో 90 శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు. పురుషులు నలభై–యాభై శాతం ఖర్చు పెడతారు. స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయట పడేయడం. ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించడం. ఆర్థిక అక్షరాస్యత స్త్రీలు సాధికారత, ఆర్థిక స్వావలంబన పొందాలంటే ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి. ముఖ్యంగా దిగువ, మధ్యతరగతి స్త్రీలకు ఆర్థిక అక్షరాస్యతను కలిగించాలి. వ్యక్తిగత ఖర్చులు, కుటుంబ బడ్జెట్, పొదుపు, ఆదాయం తెచ్చే పెట్టుబడి... వీటి గురించి అవగాహన ఉండాలి. ‘మీ జీవితం మీ చేతుల్లో ఉండాలంటే’ మీ దగ్గర ఎంత డబ్బు ఉండాలి... అందుకు ఏమి చేయాలో తెలుసుకోవాలి. సొంత ఆస్తి, స్వీయపేరు మీద పాలసీలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు, ఎమర్జన్సీ ఫండ్ కలిగి ఉండటం, డిజిటల్ పరిజ్ఞానం పొంది ఉండటం– అంటే ఆర్థిక లావాదేవీలు ఫోన్‌మీద, కంప్యూటర్ మీద చేయగలిగి వేగంగా పనులు నిర్వర్తించ గలగడం. కుటుంబ సౌభాగ్యమే దేశ సౌభాగ్యం అనుకుంటే కుటుంబంలో కీలకమైన వాటాదారైన స్త్రీ ఎంత ఆర్థిక సమృద్ధితో ఉంటే దేశ సమృద్ధి అంతగా పెరుగుతుంది. ఉమెన్స్ డే సందేశం అదే. -
సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకు పెద్దపీట
న్యూఢిల్లీ: భారతదేశంలో పన్ను సంస్కరణలతో పాటు, సీనియర్ సిటిజన్లకు తప్పనిసరి పొదుపు, గృహనిర్మాణ ప్రణాళిక అవసరమని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశ జనభాలో 2050 నాటికి సీనియర్ సిటిజన్ల వాటా 19.5 శాతానికి చేరుకుంటుందని, ఈ నేపథ్యంలో వారి ప్రయోజనాలకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. భారతదేశంలో సీనియర్ సిటిజన్ల భద్రత– సంస్కరణలు అనే అంశంపై ఒక నివేదికను ఆవిష్కరించిన నీతి ఆయోగ్, సీనియర్ సిటిజన్లకు అన్ని సేవలను సులువుగా అందుబాటులోకి తీసుకురావడానికి ఒక జాతీయ పోర్టల్‌ను అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది. ‘‘భారత్‌లో సామాజిక భద్రతా విధాన చర్యలు పరిమితంగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో చాలా మంది వృద్ధులు వారి పొదుపు నుండి వచ్చే ఆదాయంపై ఆధారపడతారు. కొన్ని సందర్భాల్లో నెలకొనే తక్కువ వడ్డీ రేట్ల వ్యవస్థ వారి ఆదాయ కోతకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఈ వడ్డీరేట్లు జీవనోపాధి స్థాయిల కంటే కూడా తక్కువగా ఉంటాయి’’ అని నివేదిక వివరించింది. అందువల్ల ఆయా అంశాల పరిశీలనకు, సీనియర్ సిటిజన్ల ప్రయోజనాల పరిరక్షణకు ఒక నియంత్రణా యంత్రాంగం అవసరమని ఉద్ఘాటించింది. వృద్ధ మహిళలకు మరింత రాయితీ ఇవ్వడం అవసరమని, అది వారి ఆరి్థక శ్రేయస్సుకు దోహదం చేస్తుందని నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారతదేశంలో వృద్ధులు ప్రస్తుతం జనాభాలో 10 శాతానికి పైగా (10 కోట్లకు పైగా) ఉన్నారు. 2050 నాటికి మొత్తం జనాభాలో ఇది 19.5 శాతానికి చేరుతుందని అంచనా. సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలకుగాను పన్ను సంస్కరణలు, దత్తత వ్యవస్థ నిబంధనావళి సరళీకరణ అవసరమని కూడా నీతి ఆయోగ్ నివేదిక ఉద్ఘాటించింది. భారతదేశంలో 75 శాతం కంటే ఎక్కువ మంది వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని వివరించింది. -
క్రెడిట్ కార్డ్‌తో బోలెడన్ని లాభాలు.. అవేంటో మీకు తెలుసా?
ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు వినియోగదారులకు ఎయిర్ మైళ్లు, ఉచిత విమాన ప్రయాణం, హోటెల్ బసపై డిస్కౌంట్, కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ హోటల్ లాయల్టీ ప్రోగ్రామ్‌లకు సభ్యత్వం వంటి అనేక ఇతర ప్రయాణ ప్రయోజనాల్ని పొందవచ్చు. కానీ, మార్కెట్లో అనేక ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు అందుబాటులో ఉన్నందున, వాటిల్లో ఏ కార్డ్ వినియోగిస్తే ఎంత ప్రయోజనం చేకూరుతుందో గుర్తించడం కష్టం. అలా మీరు ట్రావెలింగ్ చేస్తూ ఏ క్రెడిట్ కార్డ్‌ను ఎలా ఉపయోగించాలో తెలియక తర్జనభర్జన పడుతున్నారా? అయితే ఇది మీకోసమే. కో-బ్రాండెడ్ లేదా జనరల్ ట్రావెల్ కార్డ్‌లు విమానయాన సంస్థలు, హోటల్ చైన్లు లేదా ట్రావెల్ పోర్టల్‌ల సహకారంతో అనేక ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు అందించబడతాయి. అయితే, అటువంటి కార్డ్‌లపై పొందిన రివార్డ్‌లు సాధారణంగా అనుబంధిత బ్రాండ్‌తో మాత్రమే రీడీమ్ చేయబడతాయి. మరోవైపు, సాధారణ ప్రయాణ క్రెడిట్ కార్డ్‌లు, బ్రాండ్‌కు పరిమితం చేయకుండా విమాన టిక్కెట్లు లేదా హోటల్ బస వంటి ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి మీకు మరింత సౌలభ్యాన్ని అందిస్తాయి. ఎలాంటి క్రెడిట్ కార్డ్ పొందాలంటే అధిక వ్యయం చేసేవారు అధిక రివార్డులు, ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకోవాలి. చాలా ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు రివార్డ్ పాయింట్లు లేదా ఎయిర్ మైల్స్ రూపంలో వాల్యూ-బ్యాక్‌ను అందిస్తాయి, ఇది ఒక్కో కార్డుకు భిన్నంగా ఉంటుంది. తమ క్రెడిట్ కార్డ్‌లపై ఎక్కువ ఖర్చు పెట్టే వినియోగదారులు అధిక రివార్డ్ రేట్‌తో ట్రావెల్ కార్డ్ కోసం వెతకాలి. ట్రావెల్ బెన్ఫిట్స్ పరిగణలోకి తీసుకోండి ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌లు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, తక్కువ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్క్-అప్ ఫీజు, డాక్యుమెంట్ల నష్టాన్ని కవర్ చేసే ప్రయాణ బీమా, చెక్-ఇన్ లగేజీ మొదలైన అదనపు ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకునే ముందు, మీరు తప్పనిసరిగా ఈ అదనపు ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, సరైన రివార్డ్‌లు మరియు అదనపు ప్రయోజనాల కలయికను అందించేదాన్ని ఎంచుకోవాలి. సరైన ఇంధన క్రెడిట్ కార్డ్‌తో రోడ్డు ప్రయాణాలను చౌకగా చేయండి ట్రావెల్ కార్డ్‌లు ఎక్కువగా ఎయిర్‌లైన్ కార్డ్‌లకు పర్యాయపదాలుగా ఉంటాయి కాబట్టి, రోడ్ ట్రిప్, వారాంతపు విహారయాత్రలను ఇష్టపడే ప్రయాణికులు ఇంధన క్రెడిట్ కార్డ్ నుండి గణనీయమైన విలువను పొందవచ్చు.చివరగా, ఏ ట్రావెల్ కార్డ్ సరైనది అనే నిర్ణయం మీ ప్రయాణ అలవాట్లు మరియు ట్రావెల్ కార్డ్‌లో మీరు వెతుకుతున్న ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది. -
బంగారం కొంటారా.. బ్యాంకుల్లో దాచుకుంటారా?
న్యూఢిల్లీ: భారతీయులు తమ ఆదాయాలను పరిరక్షించుకోడానికి ఏ మార్గాలను అన్వేషిస్తున్నారన్న అంశంపై మనీ9 నిర్వహించిన 2023 వార్షిక వ్యక్తిగత ఫైనాన్స్ పల్స్ సర్వే ఆసక్తికర అంశాలను వెలువరించింది. సర్వేలో పాల్గొన్న వారిలో 77 శాతం మంది బ్యాంక్ డిపాజిట్లు ఇందుకు తగిన మార్గమని పేర్కొంటే, 21 శాతం మంది బంగారంపై పెట్టుబడి పెట్టాలని భావించారు. బీమా రంగంపై కూడా సానుకూల ధోరణి నెలకొంది. గతేడాది కన్నా 27 శాతం మంది అధికంగా జీవిత బీమా పాలసీలవైపు మొగ్గుచూపారు. 2022 సర్వేలో ఇది 19 శాతమే కావడం గమనార్హం. దాదాపు 20 రాష్ట్రాల్లో 35,000కుపైగా కుటుంబాల నుంచి ఈ సర్వే జరిగింది. రిసెర్చ్ ట్రయాంగిల్ ఇన్స్టిట్యూట్ (ఆర్టీఐ) ఇంటర్నేషనల్ సహకారంతో జరిగిన ఈ సర్వేలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. సర్వేలో పాల్గొన్నవారిలో 53 శాతం మంది ఇప్పటికీ ఆరోగ్య బీమా కవరేజ్ కలిగిఉండకపోవడం ఆందోళన కలిగించే అంశం. స్టాక్ మార్కెట్ కూడా క్రమంగా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. 2022లో స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు కేవలం 3 శాతం ఉంటే, 2023లో ఇది 9 శాతానికి ఎగసింది. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు కూడా ఇదే సమయంలో 6 శాతం నుంచి 10 శాతానికి ఎగశాయి. దక్షిణ భారత నగరాలైన బెంగళూరు (69 శాతం), తిరువనంతపురం (66 శాతం) బంగారం పొదుపులో అగ్రగామిగా ఉండడం గమనార్హం. బీమా వ్యాప్తిలో మదురై (84 శాతం) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో అమరావతి (79 శాతం), ఔరంగాబాద్ (76 శాతం) ఉన్నాయి. విలాసవంతమైన జీవనశైలిని అనుభవిస్తున్న భారతీయ కుటుంబాల శాతం 2022లో 3 శాతం ఉండగా, 2023లో 5 శాతానికి పెరిగింది. లగ్జరీ ప్రధానంగా మెట్రో నగరాల్లో కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, ఈ ధోరణి దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. -
రూ.1000ల పెట్టుబడితో రూ.34.9 లక్షలు లాభం!
డబ్బును డబ్బే సంపాదిస్తుంది. అందుకే మన జేబులో డబ్బు ఎక్కువగా ఉన్నప్పుడు రకరకాలుగా పెట్టుబడులు పెట్టేందుకు మక్కువ చూపుతుంటాం. పెట్టుబడులు పెట్టేందుకు ఇళ్లు, బాండ్స్, బంగారం, స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడి సాధానాలు ఉన్నాయి. అయితే ఈ పద్దతుల్లో డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టాలంటే మన వద్ద భారీ మొత్తంలో డబ్బులు ఉండాలి. అలా కాకుండా రోజు వారి దిన సరి కూలీల్ని సైతం లక్షాది కారుల్ని చేసే పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. వాటిల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మీరు ఎంచుకున్న పద్దతిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. బ్యాంక్ రికరింగ్ డిపాజిట్ తరహాలో ఇది బ్యాంక్‌లో రికరింగ్ డిపాజిట్ మాదిరిగానే పనిచేస్తుంది. అంటే 6 నెలల నుంచి 10 ఏళ్ల వరకు ఎంపిక చేసుకుని అందులో నెలకు కొంత మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. దానిపై అసలు, ప్లస్ వడ్డీని టెన్యూర్ ముగిసే సమయానికి పొందవచ్చు. నెలకు రూ.1000 చొప్పున అలాంటిదే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లోని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇందులో ఉదాహరణకు రాము అనే దినసరి కూలి నెలకు రూ.1000 చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టినట్లైతే ఏడాదికి 12 శాతం చొప్పున వడ్డీ వస్తుంది. ఫలితంగా అసలు పెట్టుబడి రూ.3.6 లక్షలైతే.. నిర్ణీత గడువు ముగిసే సమాయానికి వచ్చేది రూ.34.9లక్షలు. రూ.1000 పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది ఒకవేళ అదే రాము 20 సంవత్సరాలు పాటు నెలకు రూ.1000 పెట్టుబడిగా పెడితే ఆ మొత్తం రూ. 2,40,000 అవుతుంది. గడువు ముగిసే సమయానికి వచ్చే మొత్తం రూ. 9.89 లక్షలు. అదే 10ఏళ్ల పాటు నెలకు రూ. 1,000 చొప్పున పెట్టుబడి పెడితే మొత్తం రూ.1,20,000 అవుతుంది. ఆ మొత్తం కాస్త గడువు ముగిసే సమయానికి రూ. 2,30,038 అవుతుంది. మరి అయితే ఇంకెందుకు ఆలస్యం పిల్లల చదువుకోసం, పెళ్లిళ్ల కోసం ఇతర అవసరాల కోసం చిన్న మొత్తంలో పెట్టుబడిలు పెట్టి భారీ మొత్తంలో డబ్బుల్ని ఆదా చేయండి. -
AP: పింఛన్ల పంపిణీకి జాతీయ అవార్డు
సాక్షి, అమరావతి: ప్రతినెలా ఠంచనుగా ఒకటో తేదీనే ఇచ్చే సామాజిక పింఛన్ల కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశంలో మరెక్కడా లేని విధంగా విప్లవాత్మక రీతిలో మన రాష్ట్రంలో కొనసాగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ప్రముఖ సంస్థ స్కోచ్ ఈ ఏడాది ప్లాటినం అవార్డును ప్రకటించింది. అలాగే రాష్ట్రంలో నిర్వహిస్తున్న మహిళా మార్టులకు గోల్డ్ అవార్డు, పొదుపు సంఘాల బలోపేతానికి జరుగుతున్న కార్యక్రమాలకు సిల్వర్ అవార్డును స్కోచ్ సంస్థ అందించింది. శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అందుకున్నారు. దిగులు లేని అవ్వాతాతలు ఆసరా కోసం ఎదురు చూసే అవ్వాతాతలు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దిగులు లేకుండా జీవిస్తున్నారు. ఇప్పటిదాకా ఒక్కొక్కరికీ రూ. 2,750 నుంచి రూ.10 వేల దాకా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీరు ఇంటికే వచ్చి డబ్బులు అందజేస్తుండటంతో గతంలో లాగా పింఛన్ అందుకోవడానికి పడే తిప్పలు వారికి తప్పాయి. గత టీడీపీ సర్కార్ హయాంలో పింఛనుకు అర్హత ఉండీ దానిని అందుకోవాలంటేనే ఓ ప్రహసనం. ప్రభుత్వ ఆఫీసులు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అప్పుడు కూడా అయిన వారికే పింఛన్లు మంజూరయ్యేవి. పింఛన్ తీసుకునేవాళ్లు నడవలేని స్థితిలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, కొత్తగా పింఛన్ల మంజూరు సహా ప్రభుత్వం అందజేసే అన్ని సంక్షేమ పథకాలు సంతృప్తస్థాయిలో అమలు చేస్తున్నారు. వలంటీరు, సచివాలయ వ్యవస్థలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పథకాలు అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి నెలా 65.54 లక్షల మంది లబ్ధిదారులకు నాలుగున్నర ఏళ్లలో రూ. 81,947 కోట్లు పింఛన్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 23 లక్షల మందికి కొత్త పింఛన్ల మంజూరు చేసింది. దేశంలో ఎక్కడా లేని ఈ విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేగాక మనరాష్ట్రంలో అమలు చేస్తున్న పింఛన్ పంపిణీ విధానాన్ని పలు రాష్ట్రాలు చూసి అక్కడ కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. మహిళా సాధికారతకు పట్టం.. గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ ద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు కూడా జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రభుత్వం అందజేస్తున్న ప్రోత్సాహకాలతో పొదుపు సంఘాల మహిళలు కార్పొరేట్ వ్యాపార సంస్థలకు దీటుగా సూపర్ మార్కెట్ (వైఎస్సార్ చేయూత మహిళామార్ట్)లు ఏర్పాటు చేసుకొని వాటిని లాభదాయకంగా నిర్వహిస్తున్నారు. 2022 ఆగస్టు 22న మొట్టమొదటిగా కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లిలో చేయూత మార్ట్ ఏర్పాటైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 45 మార్టులు ఏర్పాటయ్యాయి. శుక్రవారం వరకు ఆయా మార్టుల్లో రూ. 58.18 కోట్ల అమ్మకాలు జరిగాయి. దీంతో మన రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల సంఘటిత శక్తి దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. పొదుపు సంఘాల వ్యవస్థ బలోపేతం పొదుపు సంఘాల వ్యవస్థను అవసరాలకు తగిన విధంగా బలోపేతం చేయడానికి శిక్షణతో పాటు వివిధ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 8.49 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 90 లక్షల మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా 3,648 మంది కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు మాస్టర్ ట్రైనర్లగా శిక్షణ ఇచ్చి వారి ద్వారా రాష్ట్రంలో ఉన్న పొదుపు సంఘాల మహిళలందరికీ రాబోయే ఒకటిన్నర సంవత్సరం కాలంలో యూపీఐ పేమెంట్ తదితర డిజిటల్ లావాదేవీలు, ఆరి్థక భద్రత అంశాలపై శిక్షణ ఇచ్చే కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. పొదుపు సంఘాల సభ్యుల లావాదేవీలను ఆన్లైన్లో పర్యవేక్షించే నూతన విధానానికి శ్రీకారం చుట్టారు. -
డిజిటల్ సదుపాయాలతో 27 బిలియన్ డాలర్ల ఆదా - అజయ్సేథ్
న్యూఢిల్లీ: డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) వల్ల ప్రభుత్వ పథకాల అమలులో 27 బిలియన్ డాలర్లను (రూ.2.24 లక్షల కోట్లు) ఆదా చేయగలిగినట్టు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్సేథ్ ప్రకటించారు. అంతేకాదు స్వల్ప కాలంలోనే అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో ఎంతో పురోగతి సాధించినట్టు చెప్పారు. గత దశాబ్ద కాలంలో ప్రత్యక్ష నగదు బదిలీ వల్ల లకి‡్ష్యత లబ్ధిదారులను చేరుకోగలిగినట్టు, బోగస్ ఖాతాలను తొలగించినట్టు తెలిపారు. ఫలితంగా పన్ను చెల్లింపుదారుల ధనం పెద్ద ఎత్తున ఆదా అయినట్టు పేర్కొన్నారు. దేశంలో అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో సాధించిన పురోగతిని అజయ్సేథ్ వివరించారు. బ్యాంకు ఖాతాల విషయంలో 20 శాతంగా ఉన్న విస్తరణను కేవలం 7–8 ఏళ్లలోనే 80 శాతానికి డీపీఐ సాయంతో పెంచినట్టు తెలిపారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని వారికీ మెరుగైన సేవలు అందేలా పరిష్కారాలను అమలు చేసినట్టు చెప్పారు. 2014లో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన ప్రారంభించగా, 50 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరుచుకున్నట్టు వెల్లడించారు. ఇందులో 56 శాతం మహిళలకు చెందినవిగా పేర్కొన్నారు. అలాగే, 67 శాతం ఖాతాలు గ్రామీణ, చిన్న పట్టణాల నుంచే ఉన్నట్టు తెలిపారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో భారత్ తన జ్ఞానాన్ని, సాంకేతిక సామర్థ్యాలను ప్రపంచ దేశాలతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు సేథ్ ప్రకటించారు. -
35 ఏళ్లలోపు రిటైర్.. చేతిలో రూ. 41 కోట్లు.. ఈ గూగుల్ ఉద్యోగి ప్లాన్ తెలిస్తే..!
Google employee plan: సాధారణంగా యువత ఆలోచనలు ఇలా ఉంటాయి.. మంచి కంపెనీలో జాబ్ చేయాలి.. వృద్ధాప్యం వరకూ ఉద్యోగం చేసి బాగా సంపాదించాలి.. కుటుంబాలను సెటిల్ చేసి ఏ 60 ఏళ్లకో రిటైర్ కావాలి అనుకుంటారు. కానీ ఆ యువకుడు మాత్రం 35 ఏళ్లకే రిటైర్ కావాలనుకుంటున్నాడు. అతని ప్లానింగ్ తెలిస్తే అదిరిపోతారు. గూగుల్ (Google)లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల ఇతాన్ నున్లీ (Ethan Nguonly).. వీలైనంత తొందరంగా అంటే 35 ఏళ్లలోపే రిటైర్ కావాలనుకుంటున్నాడు. ఆ లోపు 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 41 కోట్లు) సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎన్‌బీసీ నివేదించింది. ఇదీ చదవండి: వ్యాల్యూ అంటే ఇదీ.. ఆ రూ.10 వేలు ఇప్పుడు రూ.300 కోట్లు! ఆర్థిక భద్రత వైపు నున్లీ ప్రయాణం చిన్నతనం నుంచే ప్రారంభమైంది. తీర ప్రాంతంలో పెరిగిన నున్లీకి పెట్టుబడి ఆవశ్యకతను తల్లిదండ్రులు ఎప్పుడూ చెబుతుండేవారు. పొదుపు ఖాతాలో డబ్బు దాచుకోవడం కంటే పెట్టుబడి పెట్టడం వల్ల వచ్చే లాభాల గురించి చెప్పేవారు. చిన్నతనం నుంచే ఆర్థిక పాఠాలు నేర్పించడంతో అతని ఆర్థిక దృక్పథాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది. రెండేళ్లలోనే ఉన్నత విద్యాభ్యాసం ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలనే నున్లీ దృఢ సంకల్పం కేవలం రెండేళ్లలోనే బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో తన కంప్యూటర్ సైన్స్ డిగ్రీని పూర్తి చేసేలా చేసింది. అదే సమయంలో అతను పూర్తి సమయం ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఇన్ఫర్మేషన్, డేటా సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించాడు. గూగుల్‌లో పని చేయాలనే నున్లీ ఆకాంక్ష 2021 డిసెంబర్లో నిజమైంది. ఈ టెక్ దిగ్గజంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించాడు. బోనస్‌లు, స్టాక్ యూనిట్లతో కలిపుకొని నున్లీ మొత్తం వార్షిక ఆదాయం సుమారు 1,94,000 డాలర్లు (దాదాపు రూ. 1.60 కోట్లు). విస్తృతంగా పెట్టుబడులు చిన్న వయసులోనే రిటైర్ కావాలన్న తన ఆశయం కోసం నున్లీ శ్రద్ధగా పెట్టుబడి పెడుతున్నాడు. వివిధ రిటైర్మెంట్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లలో దాదాపు 1,35,000 డాలర్లు (దాదాపు రూ. 1.11 కోట్లు) ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాడు. తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ఫ్లోరిడా, కాలిఫోర్నియాలో ఆస్తులను సంపాదించి రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టాడు. బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత మొదటి రెండు సంవత్సరాల పాటు కుటుంబ సభ్యులతో కలిసి జీవించిన నున్లీ క్రమశిక్షణతో కూడిన ఆర్థిక నియమావళికి కట్టుబడి 60,000 డాలర్లను పొదుపు చేయగలిగాడు.ఈ ఆర్థిక క్రమశిక్షణ ఫ్లోరిడాలోని రివర్‌వ్యూలో అతని మొదటి పెట్టుబడి ఆస్తిని పొందేందుకు దోహదపడింది. రాష్ట్రం వెలుపల రెంటల్ ప్రాపర్టీలను నిర్వహించడంలో సవాళ్లు ఎదురైనప్పటికీ, నున్లీ అంకితభావం ఫలించింది. తద్వారా అతను రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరపడేందుకు వీలు కల్పించింది. ఆ తర్వాత నున్లీ కాలిఫోర్నియాలోని లా పాల్మాలో మొదటి ఇంటిని కొన్నాడు. నున్లీ ఆర్థిక ప్రాధాన్యతలు స్పష్టంగా ఉన్నాయి. తన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడుల కోసమే కేటాయించాడు. ఇలా ఆస్తులు కొనుగోలు చేస్తుండటంతో అధిక పెట్టుబడుల సంకల్పం సవాలుగా మారినప్పటికీ, నున్లీ తన టేక్-హోమ్ పేలో 35 శాతాన్ని పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎదురుదెబ్బలే పాఠాలు పెట్టుబడులతో దూసుకెళ్తున్న నున్లీకి ఎదురుదెబ్బలూ తగిలాయి. 2021లో క్రిప్టోకరెన్సీలో మార్జిన్లో భారీగా పెట్టుబడి పెట్టినప్పుడు సుమారు 80,000 డాలర్లు నష్టపోయాడు. అయితే ఈ అనుభవం ఒక విలువైన పాఠంగా పనిచేసింది. దీర్ఘకాలిక పెట్టుబడులపై, ప్రత్యేకించి ఈటీఎఫ్‌లు, రియల్ ఎస్టేట్లపై మరింత జాగ్రత్తతో కూడిన విధానాన్ని అనుసరించేలా ప్రేరేపించింది. -
అవును.. సీఎం జగన్ మహిళా పక్షపాతే
సాక్షి, అమరావతి : అవును.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతే. ‘ఈనాడు’ తనకు నచ్చలేదని ‘పచ్చ’వాతం జబ్బుతో తప్పుడు రాతలు రాస్తే కాకుండాపోతారా! డ్వాక్రా (పొదుపు సంఘాల) మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చాక పైసా విదల్చకుండా రాష్ట్రంలో మహిళలను మోసం చేసింది టీడీపీ అధినేత చంద్రబాబు. డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని, ఎవ్వరూ పైసా కట్టొద్దంటూ 2014 ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చిన హామీని నమ్మి మహిళలు ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన మోసానికి బలైన పేదింటి మహిళలు వారు తీసుకున్న రుణాలపై ఐదేళ్ల పాటు వడ్డీలపై వడ్డీలు కట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11 నాటికి మహిళల పేరిట ఉండే పొదుపు సంఘాల రుణాల మొత్తం రూ. 25,571 కోట్లు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా నాలుగు విడతల్లో నేరుగా ఆ మహిళలకు చెల్లిస్తున్నారు. ఇంకొకటి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అమలులో ఉన్న పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకానికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పూర్తిగా మంగళం పాడేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే పొదుపు సంఘాల సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించారు. గత నాలుగేళ్లుగా సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళల వడ్డీని ఏ ఏడాదికి ఆ ఏడాదే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ నాలుగేళ్లలో రూ. 4,969.05 కోట్లు వడ్డీని చెల్లించి, అక్కచెల్లెమ్మలపై భారాన్ని తగ్గించారు సీఎం వైఎస్ జగన్. అడుగడుగునా వంచించిన చంద్రబాబును మహిళా వ్యతిరేకిగా, అన్ని విధాలుగా ఆదుకొంటున్న సీఎం వైఎస్ జగన్ సర్కారును మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఆ పేద మహిళలు ఎందుకు భావించకుండా ఉంటారు? డ్వాక్రా రుణాల మాఫీ, సున్నా వడ్డీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పి, అక్కచెల్లెమ్మలను మోసం చేసిన వైనాన్ని ఏ రోజూ ప్రశ్నించలేని ‘ఈనాడు’ పత్రిక.., ఇప్పుడు ఇచ్చిన హామీలను క్రమం తప్పకుండా అమలు చేస్తున్న జగన్మోహన్రెడ్డిపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఈనాడు ఆరోపణ: డ్వాక్రా సున్నా వడ్డీ కోత. టీడీపీ ప్రభుత్వంలో రూ. 5 లక్షల రుణం వరకు వర్తింపు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రూ. 3 లక్షలకు కుదింపు. వాస్తవం: సున్నా వడ్డీ పథకానికి గత చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా మంగళం పాడేసింది. 2016 ఆగస్టు తర్వాత సకాలంలో రుణాలు చెల్లించిన పొదుపు సంఘాల మహిళలెవరికీ అప్పటి టీడీపీ ప్రభుత్వం సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ డబ్బు చెల్లించలేదు. మొత్తం ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు చివరి మూడేళ్లు పథకాన్ని చంద్రబాబు సర్కారు నిలిపివేసింది. టీడీపీ ప్రభుత్వం నిలిపివేసిన పథకానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కోత పెట్టిందని రాయడం ‘ఈనాడు’ ప్రజలను వంచించడమే. ఆరోపణ: జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రుణ పరిమితిని తగ్గించింది వాస్తవం: వైఎస్ జగన్ ప్రభుత్వం క్రమం తప్పకుండా సున్నా వడ్డీ సొమ్ము చెల్లిస్తుండటంతో గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన సంఘాలు తిరిగి క్రియాశీలకంగా మారాయి. మొండి బకాయిలు, నిరర్ధక ఆస్తులు 18.36 శాతం నుంచి 0.33 శాతానికి తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో సి, డి గ్రేడ్‌లోకి దిగజారిన సంఘాలు జగనన్న ప్రభుత్వ సహకారంతో తిరిగి ఎ, బి‘ గ్రేడ్ లోకి చేరాయి. మరోవైపు గత నాలుగేళ్లుగా ఏటా వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం లబ్ధిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆరోపణ: సున్నా వడ్డీ పథకంలోనూ కేంద్రం వాటా ఉంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సాయాన్ని ఎక్కడా ప్రస్తావించడం లేదు. వాస్తవం: వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఈ నాలుగు సంవత్స రాలలో ఇచ్చిన మాట ప్రకారం మహిళా సంఘాలు బ్యాంకులకు కట్టవ లసిన వడ్డీని వారి తరపున ప్రభుత్వమే భరిస్తోంది. ఇప్పటివరకు 1.05 కోట్ల మంది పేరిట ఉన్న 9.76 లక్షల పొదుపు సంఘాల రుణాలకు రూ.4,969.05 కోట్లు వడ్డీ భారం ఆ పేద మహిళల నెత్తిన పడకుండా ప్రభుత్వమే పూర్తిగా చెల్లించింది. రాష్ట్రంలోని పేద మహిళలపై ఒక్క పైసా భారం వేయలేదు. ఆరోపణ: గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేయడం మహిళాపక్షపాతమా? వాస్తవం: గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన 2019 ఏప్రిల్ 11వ తేదీకి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పులు మొత్తం సుమారు రూ. 25,571 కోట్లు. ఆ మొత్తాన్ని నాలుగు విడతల్లో ఆయా మహిళలందరికీ చెల్లించేలా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘వైఎస్సార్ ఆసరా’ పథకం అమలు చేస్తోంది. అంటే, చంద్రబాబు 2014లో అధికారంలోకి రాగానే బేషరతుగా మాఫీ చేస్తానన్న రూ. 14 వేల కోట్ల అప్పులు, ఆ తర్వాత ఐదేళ్లలో వడ్డీలపై వడ్డీలు పెరిగి 2019 ఎన్నికల నాటికి ఆ ఆప్పుల మొత్తం రూ. 25,571 కోట్లు అయ్యాయి. ఈ మొత్తం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పేద మహిళలను మోసం చేసి ఎగ్గొట్టిందే. ఇందులో డ్వాక్రా మహిళల రుణ మొత్తాలతో పాటు ఆ ఐదేళ్లలో మహిళలపై వడ్డీ రూపంలో పెరిగిన అదనపు భారం కూడా ఉంది. సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019 ఏప్రిల్ 11వ తేదీ నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే అప్పుల మొత్తం రూ. 25,571 కోట్లకు గాను ఇప్పటికే మూడు విడతల్లో రూ.19,178 కోట్లు చెల్లించింది. అలాంటప్పుడు.. గత ప్రభుత్వం మహిళలకు చెల్లించాల్సిన బకాయిలను ఈ ప్రభుత్వం పక్కన పెట్టేసిందన్న ఆరోపణే అబద్ధం. అయినా, రూ.2100 కోట్లు బకాయిలు ఎగవేత అని ప్రచురించడం లో ‘ఈనాడు’కున్న ‘పచ్చ’వాతం జబ్బును తెలియజేస్తోంది. -
డబ్బుల్ని ఎందులో పెట్టుబడి పెడితే బాగుంటుంది? ఎంత ఆదాయం వస్తుంది?
మంచి ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునేందుకు ఎటువంటి అంశాలను పరిశీలించాలి?– శశాంక్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియోని చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది పరిశీలించాలి. వ్యాల్యూ రీసెర్చ్ పోర్టల్‌లో అన్ని పథకాలకు సంబంధించి పనితీరు ప్యారా మీటర్లను పరిశీలించుకోవచ్చు. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారం కూడా లభిస్తుంది. కొంత ట్రాకింగ్ లోపం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా చూపించొచ్చు. ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో కీలకం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడమే సరైనది. నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు? – గోపాల్ రామ్ ఇన్వెస్టర్లలో చాలా రకాలు ఉంటారు. కొందరు కేవలం రాబడుల వృద్ధిని చూస్తుంటారు. కొందరు పెట్టుబడి ద్వారా పన్ను తగ్గించుకోవాలని భావిస్తుంటారు. కొందరు క్రమం తప్పకుండా (రెగ్యులర్) ఆదాయం కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొందరు స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెడుతుంటారు. అయితే స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు ప్రధానంగా తమ పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. ఈ విషయంలో ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి (3 శాతం) కంటే ఎఫ్డీలో వచ్చే రాబడే ఎక్కువ. ఎఫ్డీలు ఎంతో సురక్షితమైనవి. బ్యాంకులు సంక్షోభంలో పడినా, ఒక్కో డిపాజిట్ దారునికి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్డీపై వచ్చే రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. ఒకవేళ 30 శాతం పన్ను పరిధిలో ఉంటే, అటువంటి వారికి ఎఫ్డీ మెరుగైన సాధనం అని చెప్పలేం. ఎందుకంటే వచ్చే 7 శాతం రాబడిలో 30 శాతం పన్ను చెల్లించడానికే వెళుతుంది. ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం మరో మార్గం డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్ ఫండ్స్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్ ఫండ్‌లో పెట్టుబడిని మూడేళ్ల వరకు ఉంచితే వచ్చే లాభంపై పన్ను 20 శాతంగా ఉండేది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించుకునే అవకాశం కూడా ఈ ఏడాది మార్చి వరకు అమల్లో ఉంది. కానీ, ఈ ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కనుక డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల కాల వ్యవధి ఎంతన్న దానితో సంబంధం లేకుండా వచ్చే రాబడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక పన్ను పరంగా ఎఫ్డీలకు సమానంగా డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా కేంద్రం మార్చేసింది. కనుక ఇన్వెస్టర్లు వీటిల్లో తమకు ఏది సౌకర్యం అనిపిస్తే దానినే ఎంపిక చేసుకోవచ్చు. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అయితే అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్, అంతకుమించిన కాలానికి అయితే షార్ట్ డ్యురేషన్ ఫండ్‌ను పరిశీలించొచ్చు. డెట్ ఫండ్స్ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్‌డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. అందుకని ఒక వేళ డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే అధిక నాణ్యమైన పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌లో రాబడులతో పాటు రిస్క్ ఎక్కువ. డిఫాల్ట్ రిస్క్ కూడా ఉంటుంది. -
సాక్షి మనీ మంత్రా: మీ డబ్బుకు మరింత వాల్యూ పెంచుకోండిలా!
చాలా మంది ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు సంపాదించిన దాంట్లో ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఎలా ఖర్చుపెట్టాలి? లేదా ఎలా ఇన్వెస్ట్ చేయాలని సతమతమవుతూ ఉంటారు. మీ డబ్బుకు మరింత విలువను పెంచుకోవాలనుకునే వారి కోసం ఈ రోజు సాక్షి మంత్రా కొన్ని టిప్స్ వెల్లడించింది. నిజానికి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాక లోన్స్, బిల్స్ చెల్లించడం వంటివి చేస్తారు. అలా చేసిన తరువాత మిగిలిన డబ్బును ఖర్చు చేయడానికి ఆసక్తి చూపుతారు. మీకు కావలసినదాని మీద లేదా అవసరమైనదాని మీద ఖర్చు పెట్టడం మంచిదే. అయితే తప్పకుండా కొంతవరకు సేవ్ చేయడం అవసరం. అయితే మీరు సేవ్ చేసిన డబ్బుకు మరింత విలువ పెంచుకోవాలనుకుంటే పెట్టుబడి పెట్టడం ఉత్తమం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియో ద్వారా మా బిజినెస్ కన్సల్టెంట్ 'కారుణ్య రావు' మాటల్లో తెలుసుకోవచ్చు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
మంచి రాబడిని ఇచ్చే నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఏదీ?
నాకు ఎనిమిది వరకు ఆర్ధిక లక్ష్యాలు ఉన్నాయి. ప్రతీ లక్ష్యానికి విడిగా పోర్ట్‌ఫోలియో ఏర్పాటు చేసుకోవాలా? అలా అయితే పర్యవేక్షణకు ఇబ్బంది కాదా? – శివాని లక్ష్యాలు, పోర్ట్‌ఫోలియో మధ్య సమతూకం ఉండాలి. ముందుగా సమీప కాలంలోని లక్ష్యాలను వేరు చేయండి. అలాగే, మధ్య కాలం, దీర్ఘకాల లక్ష్యాలను కూడా వేరు చేయండి. ఇప్పుడు స్వల్పకాల, మధ్యకాల లక్ష్యాలను సైతం.. రాజీ పడతగ్గ, రాజీపడలేని అనే రెండు విభాగాలుగా వేరు చేయండి. రాజీపడలేని అంటే రిస్క్ తీసుకోని పెట్టుబడులు. రిస్క్ తీసుకోలేని మధ్యకాలం లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ (స్థిరాదాయ/డెట్) సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటికోసం ఒక్కటే పోర్ట్‌ఫోలియో సరిపోతుంది. ఈ పెట్టుబడుల కోసం ఈక్విటీలపై ఆధారపడకూడదు. అవసరమైనప్పుడు వెంటనే తీసుకునేందుకు అనుకూలంగా ఉండాలి. ఇక దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులను అంటే తదుపరి ఐదేళ్ల కాలం వరకు అవసరం లేని పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించుకోవాలి. ప్రతీ లక్ష్యానికి విడిగా ఎంత చొప్పున కావాలి, ఎంత వ్యవధి ఉందనే దాని ఆధారంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ లక్ష్యానికి కావాల్సిన నగదు మీరు కోరుకున్న సమయంలో లభించేలా ప్రణాళిక ఉండాలి. ఉదాహరణకు వచ్చే మూడేళ్ల కాలంలో రూ.5 లక్షలు కావాలి, ఐదేళ్లలో రూ.5 లక్షల కావాలనుకుంటే లేదా 25–30 ఏళ్లలో రూ.కోటి రూపాయలు (రిటైర్మెంట్) కావాలనుకుంటే అందుకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. వేర్వేరు పోర్ట్ఫోలియోలన్నవి కాలవ్యవధికి అనుగుణంగానే ఉండాలి. స్వల్పకాల లక్ష్యాల కోసం ఫిక్స్డ్ ఇన్కమ్లో ఇన్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐదేళ్లకు మించిన ఏ లక్ష్యానికైనా డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అప్పుడు లక్ష్యాల వారీగా కాకుండా, కాలవ్యవధి ఆధారంగా ప్రత్యేక పోర్ట్‌ఫోలియోలు ఉంటాయి. ఇందుకోసం వ్యాల్యూరీసెర్చ్ ఆన్లైన్లో ‘మై ఇన్వెస్ట్మెంట్’ టూల్‌ను వినియోగించుకోవచ్చు. ఒకటికి మించిన పథకాల్లో ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు వివిధ లక్ష్యాలకు అనుగుణంగా ఈ టూల్‌తో వేరు చేసుకోవచ్చు. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్‌లో ఏది మంచిదనే విషయంలో సందేహం నెలకొంది. పథకం ఎంపిక చేసుకోవడం ఎలా? – స్వామినాథన్ ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకునే విషయంలో పరిశీలించాల్సిన ముఖ్య అంశాలు రెండున్నాయి. ఒకటి ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక యాక్టివ్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకుని ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సిన అవసరం లేదు. రెండోది ట్రాకింగ్ ఎర్రర్. ఒక ఇండెక్స్ ఫండ్.. తాను పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందో చెబుతుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా చేసుకుని చూస్తే ఎస్బీఐ, యూటీఐ, హెచ్డీఎఫ్సీ సంస్థల పథకాలు మెరుగ్గా పనిచేస్తున్నాయి. -
పొదుపు సూత్రం మర్చిపోతున్న భారతీయ ఉద్యోగులు
సాక్షి, అమరావతి: ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విప్లవం, పాశ్చాత్య ధోరణి ప్రభావంతో వ్యక్తుల ఆదాయానికి, ఖర్చుకు మధ్య పెద్ద అగాధాలు ఏర్పడ్డాయి. పేరుకే ఉద్యోగం.. చివరికి మిగిలేది అప్పే అన్నట్లుగా ఉద్యోగుల పరిస్థితి దిగజారింది. సంపాదనకు తగిన విధంగా పొదుపు చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తూ చిక్కుల్లో పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో నిధుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. అకస్మాత్తుగా లే–ఆఫ్‌లు వస్తే కనీసం ఈఎంఐలు కూడా కట్టలేని దుస్థితిలో భారతీయ ఉద్యోగులు ఉండటం శోచనీయం. ఉద్యోగం కోల్పోతే నెల కూడా ఉండలేరు.. 75 శాతం మంది భారతీయ ఉద్యోగులు ఎటువంటి పొదుపు మొత్తాన్ని దాచుకోవట్లేదని దేశీయ ఆర్థిక, పెట్టుబడి, స్టాక్ మార్కెట్ కోర్సులు, రీసెర్చ్ టూల్స్ సంస్థ ఫినాలజీ తాజా సర్వేలో వెల్లడించింది. మూడు లక్షల మంది భారతీయ ఉద్యోగుల నుంచి ‘ఇండియాస్ మనీ హ్యాబిట్స్’ పేరిట డేటాను సేకరించింది. దీని ప్రకారం.. ఉన్నపళంగా ఉద్యోగం కోల్పోతే ప్రతి నలుగురిలో ఒకరు ఒక నెలపాటు కూడా పరిస్థితులను తట్టుకోలేరని వెల్లడించింది. ప్రతి ముగ్గురిలో ఒకరికి ఆరోగ్య బీమా లేదని.. ఆనారోగ్య సమస్యలు, అనుకోని సంఘటనలు ఎదురైతే పరిస్థితి అగమ్యగోచరమేనని తెలిపింది. భద్రత పాలసీలకు దూరంగా.. ఇక దేశంలో కొంతమేర పెరిగిన అవగాహన, కంపెనీల్లో తప్పనిసరి కావడంవల్ల 30–40 ఏళ్ల వయస్సు ఉద్యోగులు బీమా పాలసీలను తీసుకుంటే.. 20–30 ఏళ్ల వయస్సు వారి బీమా పాలసీ స్కోరు చాలా దారుణంగా ఉందని నివేదిక పేర్కొంది. అధిక ఆర్జన కారణంగా విలాసవంతమైన జీవనశైలిపై ఎక్కువ ఖర్చుచేయడం వారి ప్రధాన అంశంగా మారిపోయిందని.. ఫలితంగా పొదుపు సూత్రాన్ని పాటించడమే లేదని సర్వే కుండబద్దలు కొట్టింది. ప్రతీ ఆరుగురు భారతీయ ఉద్యోగుల్లో కనీసం ఒకరికి కూడా ఎటువంటి పాలసీ కవరేజీ లేకపోవడం భవిష్యత్తు ఆలోచనకు దూరంగా ఉండటమేనని చెప్పింది. క్రిటికల్ ఇల్‌నెస్‌లో 69 శాతం మందికి, ప్రమాదవశాత్తూ మరణిస్తే 65 శాతం మందికి సరైన భరోసా దక్కట్లేదని గుర్తించింది. ఈ క్రమంలోనే కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైతే 68 శాతం మంది స్టాక్‌మార్కెట్లు నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు పేర్కొంది. 15 రోజులకే జీతం ఖాళీ.. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది ఉద్యోగుల జీతం 15 రోజులకే ఖాళీ అయిపోతున్నట్టు తెలిపింది. అలాగే.. ♦ ఇక్కడ నలుగురిలో ఒకరు రోజుకు వచ్చే జీతం కంటే ఎక్కువ ఖర్చుచేస్తున్నారు. ♦ ఆరుగురిలో ఒకరు తమ వద్ద ఉన్నదాని కంటే రెండు రెట్లు బాకీ ఉన్నారు. ♦ ఈఎంఐలు కట్టడానికి డబ్బులు అందుబాటులో లేకుంటే మెజారిటీ ఉద్యోగులు స్టాక్స్ వెనక్కి తీసుకుంటుంటే.. 24శాతం మంది ఈఎంఐలు కట్టడానికే తిరిగి రుణాలు తీసుకుంటున్నారు. ♦ ఐదు శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ♦ 15 శాతం మంది ఈఎంఐలు కట్టలేక ఎగ్గొడుతున్నట్లు సర్వే వెల్లడించింది. అప్పుల ఊబిలో.. మరోవైపు.. ప్రతీ ఐదుగురు భారతీయ ఉద్యోగుల్లో ఇద్దరు ఎప్పటికీ అప్పుల ఊబి నుంచి తప్పించుకోలేరని నివేదిక హెచ్చరించింది. 27 శాతం మంది ప్రస్తుతం అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతుండగా 68 శాతం మంది పదవీ విరమణ ప్రణాళిక లేకుండా గడిపేస్తున్నారని ప్రస్తావించింది. ఇక 53 శాతం మంది మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, షేర్లు చూసుకుంటున్నారని.. 36 శాతం మంది పెన్షన్ ఫండ్స్, 7 శాతం మంది అద్దె వస్తుందని, నాలుగు శాతం మంది తమ పిల్లలు చూసుకుంటారనే ధీమాలో ఉన్నట్లు నివేదిక తెలిపింది. -
రేట్ల పెంపు రూటు..ఇంటికి దారెటు
సొంతింటి కలను రుణం సాకారం చేస్తుంది. రుణం తీసుకోకపోయినా సొంతిల్లు సమకూర్చుకోవచ్చు. కాకపోతే మధ్య తరగతి వాసులు రుణం జోలికి వెళ్లకుండా ఉండాలంటే.. దీర్ఘకాలం పాటు క్రమశిక్షణతో పొదుపు, మదుపు చేసినప్పుడే ఇంటి కొనుగోలుకు కావాల్సినంత సమకూరుతుంది. అదే గృహ రుణం అయితే, కొన్నేళ్ల ముందుగానే ఇంటి కల నెరవేరుతుంది. పైగా రుణం తీసుకున్న తర్వాత ఎలా అయిన తీర్చాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక దానికి కట్టుబడి ఉంటాం. కానీ, 20–30 ఏళ్లపాటు ఇంటి కోసం పొదుపు చేసే క్రమంలో.. జీవితంలో వచ్చే ముఖ్యమైన అవసరాల కోసం గృహ రుణ నిధి విషయంలో రాజీపడే ప్రమాదం ఉంటుంది. కనుక గృహ రుణం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. కాకపోతే, గృహ రుణం విషయంలో సరైన ప్రణాళిక, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలూ, ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. గృహ రుణం అంటే చాలా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. కనుక దీనిపై వడ్డీ రేట్ల ప్రభావం కూడా ఎక్కువే. గత 10 నెలలుగా వడ్డీ రేట్లు అసాధారణంగా పెరిగాయి. రుణం తీసుకున్న వారు, తీసుకోబోయే వారు ఈ రిస్క్‌లు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో గృహ రుణం తీసుకునే ముందు తప్పకుండా గమనించాల్సిన అంశాలేంటో ఈ కథనంలో చూద్దాం... గృహ రుణంపై ఫ్లోటింగ్ రేటు చాలా తక్కువ రేటు ఆప్షన్లలో ఒకటి. అదే ఫిక్స్డ్ రేటు (స్థిరంగా ఉండే వడ్డీ రేటు, అదీ కొన్నేళ్ల పాటే) అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఫ్లోటింగ్ రేటు కంటే ఫిక్స్డ్ వడ్డీ రేటు 2 శాతం అధికంగా ఉంటుంది. గృహ రుణం తీసుకునే వారిలో ఎక్కువ మంది ఫ్లోటింగ్ రేటును ఎంపిక చేసుకోవడానికి ఈ వ్యత్యాసమే కారణం. కానీ, ఫ్లోటింగ్ రేటు అన్నది రెండు వైపులా పదునున్న కత్తి మాదిరే అనుకోవాలి. వడ్డీ రేట్లు తగ్గిపోయే క్రమంలో ఫ్లోటింగ్ రేటు వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. కానీ, అదే వడ్డీ రేట్లు పెరిగిపోయే తరుణంలో రుణ గ్రహీతలను మరింతగా బాధిస్తుంది. ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణాలు తీసుకుంటే, అవి రెపో రేటుకు అనుసంధానమై ఉంటాయి. అందుకని ఫ్లోటింగ్ రేటుపై గృహ రుణం తీసుకునే వారు, వడ్డీ రేట్లు పెరిగే సమయంలో అదనంగా చెల్లించేందుకు ముందుగానే సన్నద్ధం కావాల్సి ఉంటుంది. రేట్లు ఇంకా పెరగొచ్చు సవాళ్లు, ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు సాధారణంగా అవి తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటారు. కానీ, వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో ఇలాంటి కోరికలు నెరవేరవు. ఆర్బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును 2.5 శాతం పెంచింది. రెపో రేటు ప్రస్తుతం 6.5 శాతంగా ఉంది. చాలా మంది నిపుణులు రెపో రేటు 6.5 శాతానికి చేరిన వెంటనే వడ్డీ రేట్ల పెంపు ముగుస్తుందని లోగడ అంచనా వేశారు. కానీ, పరిస్థితులు తర్వాత మారిపోయాయి. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం సమస్యాత్మకంగా తయారైంది. అందుకే అన్ని కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు విధానాన్ని అనుసరిస్తున్నాయి. దీంతో రుణ గ్రహీతలు మరో విడత లేదంటే, మరిన్నిసార్లు రెపో రేటు పెంపును చూడాల్సి రావచ్చని నిపుణులు అంటున్నారు. చాలా సైకిల్స్ వడ్డీ రేట్లన్నవి ఆర్థిక చక్ర భ్రమణాల మాదిరే ఉంటాయి. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. మరి గృహ రుణం అంటే ఎంత లేదన్నా 20 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి తీసుకుంటూ ఉంటారు. దీంతో వడ్డీ రేట్ల సైకిల్స్ ఎన్నో వచ్చి పోతుంటాయి. దీనిపై రుణం తీసుకునే వారు ముందుగానే అవగాహన కలిగి ఉండాలి. గృహ రుణం ఈఎంఐ అనేది ఆర్జించే వేతనంలో 40 శాతం మించకుండా చూసుకుంటే, ఇలాంటి ఆర్థిక అనిశ్చితులు, వడ్డీ రేట్ల పెరుగుదలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సరైన సమయం కోసం వేచి చూడొద్దు ఏదీ శాత్వతం కాదు. కనిష్ట వడ్డీ రేట్లు అయినా, గరిష్ట వడ్డీ రేట్లు అయినా ఒక నిర్ణీత కాలం పాటే కొనసాగుతాయి. ఉదాహరణకు 20 ఏళ్ల గృహ రుణ కాలవ్యవధిలో ఒకటి నుంచి రెండు సైకిల్స్ అధిక వడ్డీ రేట్లు ఉండొచ్చు. కనుక కనిష్ట వడ్డీ రేట్లు ఉన్నప్పుడే గృహ రుణం తీసుకుందామని అనుకోవద్దు. దీనివల్ల విలువైన కాలం గడిచిపోతుంది. ఇంటి కొనుగోలు ధర కూడా పెరగొచ్చు. కనుక తక్కువ వడ్డీ రేట్ల కోసం చూస్తే, అందులో మిగిలేది, పెరిగే ఇంటి ధరతో పోలిస్తే తక్కువే ఉండొచ్చు. అవసరం, తక్కువ ధరలే ఇంటి కొనుగోలుకు ఆధారం కావాలి కానీ, వడ్డీ రేట్లు కాదని నిపుణుల సూచన. రేట్ల పెంపునకు సన్నద్ధం ఇంటిని కొనుగోలు చేసే సమయంలో కొందరు తమ అభిరుచులకు అనుగుణంగా సదుపాయాలు ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం అదనపు ఖర్చుకూ వెనుకాడరు. ఇంటి బడ్జెట్ పెంచుకోవడం అన్నది అదనపు భారానికి దారితీస్తుంది. తీసుకునే గృహ రుణం పెరుగుతుంది. దీంతో వడ్డీ రేట్లు పెరిగే క్రమంలో మరింత చెల్లించాల్సి రావచ్చు. కనుక అధిక మొత్తానికి గృహ రుణం తీసుకోవడం అన్నది పెద్ద సవాలు అవుతుందని ఆండ్రోమెడా లోన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ వి. స్వామినాథన్ పేర్కొన్నారు. కనుక అవసరమైతే, వడ్డీ రేట్లు ఊహించని విధంగా పెరిగిపోతే, నెలవారీ ఈఎంఐ 20–25 శాతం అధికంగా చెల్లించేందుకు వీలుగా, నెలవారి ఆదాయంలో వెసులుబాటు ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు నెలవారీ గరిష్టంగా రూ.40,000ను ఈఎంఐ కింద చెల్లించే సామర్థ్యం ఉంటే, అప్పుడు రూ.30,000–32,000 ఈఎంఐకి పరిమితమై గృహ రుణం తీసుకోవాలి. దీంతో వడ్డీ రేట్లు పెరిగినా, ఇబ్బంది లేకుండా అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. కాలవ్యవధి పెంపు వడ్డీ రేట్లు పెరిగిన ప్రతీ సందర్భంలోనూ రుణమిచ్చిన సంస్థలు రుణగ్రహీతల ఈఎంఐ పెంపు కంటే, కాల వ్యవధిని పెంచేందుకు మొగ్గు చూపిస్తుంటాయి. అయితే, దీనికీ పరిమితి ఉంది. రుణ గ్రహీతలు పదవీ విరమణకు ఇంకా ఎన్నేళ్లు ఉందన్న అంశాన్ని బ్యాంకులు చూస్తాయి. సాధారణంగా గృహ రుణ కాలాన్ని బ్యాంకులు రుణ గ్రహీతల వయసు, ఆర్జన ఆధారంగా నిర్ణయిస్తుంటాయి. అదే పనిగా వడ్డీ రేట్లు పెరుగుతున్న క్రమంలో.. బ్యాంకులు రేటు పెరిగినప్పుడల్లా ఆ మేరకు కాలవ్యవధిని పెంచుకుంటూ పోతే, తిరిగి చెల్లింపుల కాలం రిటైర్మెంట్ వయసుకు త్వరగా చేరిపోవచ్చు. ఇక ఆ తర్వాత కాలవ్యవధి పెంచుకోవడానికి ఉండదు. దీనికి బదులు ఈఎంఐ మొత్తాన్ని పెంచుతుంటాయి బ్యాంకులు. దీంతో అదనపు భారం పడుతుంది. రుణ కాల వ్యవధి పెంచుకోవడం వల్ల అంతిమంగా చెల్లించే వడ్డీ కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక రుణదాత కాల వ్యవధి పెంచేందుకు ఆసక్తి చూపించినా.. రుణ గ్రహీతలు దీనికి మొగ్గు చూపకపోవడమే మంచిది. కాల వ్యవధి పెంచుకోవద్దంటే, పెరిగిన వడ్డీ రేట్ల మేర అదనపు ఈఎంఐ చెల్లించేందుకు సిద్ధం కావాలి. నెలవారీ చెల్లించే ఈఎంఐని పెంచడం వల్ల గృహ రుణాన్ని త్వరగా తీర్చేయవచ్చు. అందుకే గృహ రుణ గ్రహీతలకు నెలవారీ మిగులు ఉండాలి. దీనివల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు అదనంగా చెల్లించే సామర్థ్యం ఉంటుంది. దీంతో కాల వ్యవధి పెంచుకోవడం కంటే ఈఎంఐ పెంపునకే మొగ్గు చూపుతారు. ఫలితంగా అదనపు వడ్డీ భారం పడదు. ముందస్తు చెల్లింపులు వడ్డీ రేట్లు ఎప్పుడు పెరుగుతాయో ఎవరూ చెప్పలేరు. అందుకనే గృహ రుణం తీసుకున్న తర్వాత వీలు చిక్కినప్పుడల్లా పాక్షిక చెల్లింపులకు మొగ్గు చూపించడం మెరుగైన ఆప్షన్ అవుతుంది. దీనివల్ల గృహ రుణం బకాయిని వేగంగా తగ్గించుకోవచ్చు. నిర్ణీత కాలం కంటే ముందుగానే తీర్చివేయవచ్చు. ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగినా పెద్ద భారం పడకుండా ఉంటుంది. ఉద్యోగులు అయితే బోనస్ రూపంలో వచ్చిన మొత్తాన్ని గృహ రుణానికి చెల్లింపులు చేసుకోవచ్చు. అదే మాదిరి, ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనంలో సగ భాగాన్ని గృహ రుణ ఈఎంఐ పెంచి కట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి. క్రెడిట్ స్కోరు అనుకూలత వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అప్పుడు ఫ్లోటింగ్ రేటును ఎంచుకోవడమే మార్గం. అప్పటికే తీసుకున్న గృహ రుణానికి సంబంధించి వడ్డీ భారాన్ని భరించలేకపోతుంటే.. దాన్ని తక్కువ రేటుకు ఆఫర్ చేసే బ్యాంకుకు లేదా ఇతర సంస్థకు బదిలీ చేసుకోవడం ఒక మార్గం. సేవలు బాగుండి, తక్కువ రేటుకు ఆఫర్ చేసే సంస్థకు నిశ్చింతంగా మారిపోవచ్చు. గృహ రుణ బ్యాలన్స్‌ను బదిలీ చేసుకునే ముందు, కొత్తగా రుణం ఇచ్చే బ్యాంకులో ప్రాసెసింగ్ చార్జీలు, ఇతర చార్జీలను కూడా చూడాలి. క్రెడిట్ స్కోరు మెరుగ్గా ఉంటే కాస్త డిమాండ్ చేసి రేటును తగ్గించుకోవచ్చు. బ్యాలన్స్ బదిలీ విషయంలోనూ మెరుగైన క్రెడిట్ స్కోరు ఉపయోపడుతుంది. -
కొత్త పన్ను పొదుపునకు విఘాతమా? కేంద్ర రెవెన్యూ శాఖ ఏమన్నారంటే?
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానానికి మళ్లడం అన్నది దేశ పొదుపు రేటునకు ఎంత మాత్రం ప్రమాదకరం కాబోదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. పన్ను ఆదాకు సంబంధించిన పెట్టుబడి సాధనాల్లో గృహ పొదుపులు కేవలం రూ.4 లక్షల కోట్లుగానే ఉన్నాయని, మొత్తం పొదుపు నిధుల్లో (రూ.25 లక్షల కోట్లు) ఇవి 16 శాతమేనని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చడం తెలిసిందే. కొత్త పన్ను విధానంలో రూ.7.5 లక్షల వరకు (రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ సహా) ఎలాంటి పన్ను లేదు. ఆ తర్వాత కూడా తక్కువ పన్ను రేటు ప్రతిపాదించారు. కాకపోతే ఎలాంటి పన్ను మిహాయింపులు, తగ్గింపులు ఉండవు. దీనిపై వ్యక్తమవుతున్న ఆందోళనను తొలగించే ప్రయత్నాన్ని మల్హోత్రా చేశారు. ‘‘దేశ జీడీపీలో గృహ పొదుపు నిధులు నేడు 27–30 శాతంగా ఉన్నాయి. బడ్జెట్లో భాగంగా వృద్ధులు, మహిళలకు ప్రకటించిన పథకాలు దేశ పొదుపు రేటును పెంచుతాయి’’అని చెప్పారు. పాత పన్ను విధానంలో సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, సెక్షన్ 80డీ కింద 60 ఏళ్లలోపు వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం రూ.25,000, 60 ఏళ్లు నిండిన వారికి రూ.50,000, గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు సహా ఎన్నో రకాల పన్ను ప్రయోజనాలు ఉండడం గమనార్హం. -
మీ ఫ్యామిలీ బడ్జెట్ వేశారా?
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి ప్రభుత్వాలు బడ్జెట్ పై కసరత్తు చేస్తుంటాయి. అది పెద్దస్థాయి కదా మనకెందుకులే అని వదిలేయద్దు. ఎందుకంటే, ఖర్చు ఎక్కడ పెట్టాలి..? ఎక్కడ తగ్గించుకోవాలి..? ఎంత మొత్తం పొదుపు చేయాలి..? వీటన్నింటికంటే ముందు ఆదాయం ఎంత? అన్న అంశాలపై అవగాహన ప్రతి కుటుంబానికీ కూడా ఉండాలి. అదే బడ్జెట్ ప్లానింగ్. మొన్న కేంద్ర బడ్జెట్ విడుదలైంది. ఇప్పుడు మన ఫ్యామిలీ బడ్జెట్ వంతు వచ్చింది. ఏమంటారు? నెలవారీ జీతాలతో లేదా స్వయం ఉపాధితో జీవనం సాగించే వారికి నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ అత్యవసరం. మనకు వచ్చేదెంత? అందులో మనం దేనికి, ఎంత ఖర్చుపెట్టాలి..? ఎక్కడ ఆదా చేయాలి..? అన్న అంశాలపై అవగాహన ఉంటే ఇంటి నిర్వహణ సులువు అవుతుంది. బడ్జెట్ ప్లానింగ్ ఉంటే మీ నెలవారీ ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు. అత్యవసర పరిస్థితి కోసం కొంత మొత్తం జీవితంలో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. అందుకే కొంత మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకోవడానికి వీలుగా.. మీ చేతికి వస్తున్న సంపాదనలో 20 నుంచి 30 శాతం వరకూ పొదుపు చేయడం మంచిది. ఒకవేళ ఇంత మొత్తంలో చేయలేకపోయినా.. అవకాశం ఉన్న మేరకు పక్కన పెట్టాలని పెద్దల సలహా. కుటుంబ సభ్యుల ఆమోదం: ఫలానా దానికి ఇంత మొత్తం ఖర్చు పెట్టాలి అని మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. అలా ఉండాలంటే ముందుగా మీరు చేయాల్సింది... నెలవారీ బడ్జెట్ ప్లానింగ్ కోసం కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి వివరించాలి. రాబడి, ఖర్చుల విషయాలను అందరితో చర్చించాలి. అప్పుడు వారికి కూడా అవగాహన ఏర్పడి, ఖర్చులు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. వృథాను అరికట్టాలి మనం పొదుపు చేయాలి అంటే కుటుంబంలో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలి. ఏది అవసరం, ఏది అనవసరం అనే అవగాహన ఉండాలి. ముఖ్యంగా వృథా ఖర్చులను తగ్గించాలి. సరుకులు లేదా వస్తు సామగ్రిని ఎక్కువెక్కువ తెచ్చుకోవడం, ఇష్టం వచ్చినంత వండటం, పారెయ్యటం వల్ల ఎంతో డబ్బు వృథా అవుతుంది. అందువల్ల అట్లాంటి వృథాకు అడ్డుకట్ట వేయాలి. క్రెడిట్ కార్డుతో జాగ్రత్త.. క్రెడిట్ కార్డు ఉన్నది అత్యవసర సమయంలో ఉపయోగపడటానికి మాత్రమే అని గుర్తుంచుకోవాలి. చేతిలో కార్డు ఉంది కదా అని విచ్చలవిడిగా ఖర్చుపెట్టకూడదు. మీ నెలవారీ రాబడిని అంచనా వేసుకొని అప్పుడు మాత్రమే కార్డును వినియోగించాలి. పొదుపు పథకాల్లో.. ఇలా ప్రతి నెలా బడ్జెట్ ప్లానింగ్ చేసుకొని ఆదా చేసిన సొమ్మును ఖతాలో అలా ఉంచకుండా.. మార్కెట్ రిస్క్ లేని పెట్టుబడి పథకాలు అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టాలి. అప్పుడు దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పొదుపు ఎంత ఉండాలి? ఇది కాస్త క్లిష్టమైన ప్రశ్నే. పొదుపు చేయాలంటే ముందు మన ఆదాయాన్ని అంచనా వేసుకోవాలి. ఎందుకంటే, ఆదాయాన్ని బట్టి పొదుపు శాతం పెరుగుతూ, తరుగుతూ ఉంటుంది. అయితే, ఆదాయంతో సంబంధం లేకుండా, సాధారణ కుటుంబ ఖర్చులు మినహా మరే విధమైన అదనపు ఖర్చులూ లేకుండా ఉంటే పొదుపు ఎంత ఉండాలో చెప్పడానికి కొన్ని సూత్రాలు... ప్రతి మనిషి కనీసం ఆరునెలల జీతం లేదా ఆదాయాన్ని నగదు రూపంలో దాచుకోవాలి. ఒకవేళ ఒకేసారి అలా దాచుకోలేని వారు నెలనెలా కొంత పక్కనపెడుతూ ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. కుటుంబ ఖర్చుకు సమానమైన ఆదాయం లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న దిగువ మధ్యతరగతి వారు తమ ఆదాయం లో ఐదు నుంచి పది శాతం పొదుపు చేయాలి. పొదుపు చేయడానికి మిగలక పోయినా ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారానో, ఖర్చును తగ్గించుకోవడం ద్వారానో కచ్చితంగా పొదుపు చేయాలి. నెలవారీ సగటు కుటుంబ ఖర్చు కంటే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జించేవాళ్లు నెలనెలా 25 శాతం పొదుపు చేయాలి. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే భర్త ఇంటి ఖర్చులు పెడతారు కాబట్టి భార్య 50 శాతం పొదుపుచేయాలి. అధికాదాయ వర్గాలు అయితే కుటుంబ ఆదాయంలో సగం పొదుపునకు మళ్లించాలి. భవిష్యత్తులో ఆదాయం పొరపాటున తలకిందులైతే ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఇలా చేసిన పొదుపు ఆదుకుంటుంది. పొదుపు మార్గాలు కొన్ని... ► అవసరం లేకుండా డిస్కౌంట్లలో వచ్చే వస్తువులు కొనద్దు. ► అవసరానికి ముందే ఏ వస్తువులనూ కొనుగోలు చేయకండి. ► నిర్దిష్ట తేదీల్లోపు బిల్లులు చెల్లించండి. దీని కోసం బిల్స్ పే క్యాలెండర్ తయారు చేసుకోవాలి. ► మీ బ్యాంకు ఖాతాలు ప్రతి నెల చివరన చూసుకోండి. వృథా ఖర్చులు తెలుస్తాయి. వృథా ఖర్చుల జాబితా రాయండి. ప్రతినెలా ఎంత వృథా పోతుందో తెలిస్తే ఆటోమేటిక్‌గా అప్రమత్తత పెరుగుతుంది. ► ఏ వస్తువు కొనాలన్నా ఇంటర్నెట్æద్వారా వివిధ మాల్స్/దుకాణాల్లో వాటి ధరల తేడాలు చూసి ఎక్కడ తక్కువో అక్కడ కొనండి. ఎందుకంటే ప్రతి డీలరు వేర్వేరు ధరలపై వస్తువులను అమ్ముతారు. చివరగా ఒక మాట... మీ బడ్జెట్ ఎంత పకడ్బందీగా ఉంటే భవిష్యత్తు అంత భద్రంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అదేవిధంగా మీ పిల్లలకు కూడా ఇప్పటినుంచే పొదుపు చేయడాన్ని అలవాటు చేయండి. వారికి ఇచ్చే పాకెట్ మనీతో వారికి కావలసిన వాటిని ఎలా కొనుక్కోవాలో నేర్పించండి. అప్పుడే మీరు పర్ఫెక్ట్ ఫైనాన్స్ మేనేజర్ లేదా నిపుణులైన హోమ్ మినిస్టర్ అవుతారు. ఇంతవరకు మీరు బడ్జెట్ వేసుకోకపోతే ఇప్పుడైనా వేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.. మీ బడ్జెట్‌ను నెలవారీ రివ్యూ చేసుకోవాలి. ఏమైనా మార్పులు అవసరం అయితే కచ్చితంగా ఆయా మార్పులు చేసుకోవాలి. ఇందుకోసం మీ కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. కచ్చితంగా పెట్టవలసిన ఖర్చును పక్కన పెట్టి.. ఇంకా ఏమైనా ఆదా చేసుకునే మార్గం ఉందేమో చూడాలి. -
పన్ను ప్రయోజనాలు కావాలంటే.. ఈ పోస్టాఫీస్ పథకాలపై ఓ లుక్కేయండి!
పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువ ఆలోచించేది, ఆచరించే మంత్రం ‘పొదుపు’. వారికి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా పొదుపు పథకాలను అందిస్తోంది. ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు పొదుపు చేయడంతో పాటు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందొచ్చు.అవేంటో తెలుసుకుందాం! పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఈ పథకంలో 15 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. ఇందులో కనీసం రూ. సంవత్సరానికి 500, గరిష్ట డిపాజిట్ రూ.ఒకే ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలు జమ చేసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత మాత్రమే నిధులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అది కూడా ప్రాణాంతక వ్యాధి, ఉన్నత విద్య , నివాస మార్పు వంటి పరిస్థితులకు లోబడి ఉంటుంది. అయితే, వ్యక్తులు 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యం ఉంది. 4 సంవత్సరాల తర్వాత రుణాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద చేసిన డిపాజిట్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. అదనంగా, సంపాదించిన వడ్డీ పూర్తిగా పన్ను రహితం. ప్రస్తుత పోస్టాఫీసు PPF వడ్డీ రేటు వార్షికంగా 7.1% ఉంది. సుకన్య సమృద్ధి ఖాతా ఆడపిల్లల భవిష్యత్ కోసం ఉద్దేశించిన ప్రత్యేక పథకం ఇది. 10 ఏళ్లలోపు బాలికలకు ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతా తెరిచే సమయంలో అమ్మాయి వయస్సుతో సంబంధం లేకుండా ఈ పథకం 21 సంవత్సరాల కాల వ్యవధిని కలిగి ఉంది. ఉదాహరణకు, ఖాతా తెరిచే సమయంలో ఒక అమ్మాయికి 7 సంవత్సరాలు ఉంటే, ఆ అమ్మాయికి 28 ఏళ్లు వచ్చేసరికి ఆ ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఖాతా తెరిచినప్పటి నుంచి 15 సంవత్సరాల పాటు డిపాజిట్లు చేయాలి. ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.60%. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ విషయంలో ముందస్తు విత్ డ్రా చేసుకోవచ్చు, కాకపోతే కనీసం 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ పోస్ట్ ఆఫీస్ పన్ను ఆదా పథకం కింద చేసిన పెట్టుబడులు సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనాలకు అర్హత పొందుతాయి. ప్రస్తుత పోస్టాఫీసు సుకన్య సమృద్ధి ఖాతా వడ్డీ రేటు సంవత్సరానికి 7.6% అందిస్తుంది. ఆడపిల్లల ఉన్నత చదువుల కోసం, వివాహం కోసం నియమ నిబంధనలను అనుసరించి డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ పథకంలో చేసే పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే వడ్డీ గానీ, మెచ్యూరిటీ మొత్తంపై గానీ పన్ను వర్తించదు పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అనేది పన్ను మినహాయింపు కోసం ప్రముఖ పోస్టాఫీసు పథకాలలో ఒకటి. ఈ ప్లాన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. పెట్టుబడిదారులు 1, 2, 3, 5 సంవత్సరాల వంటి వివిధ కాల వ్యవధిలో డిపాజిట్లు చేయవచ్చు ఈ పథకంలో గరిష్ట పదవీకాలం 5 సంవత్సరాలు. టైమ్ డిపాజిట్లో కనీస పెట్టుబడి మొత్తం రూ. 1,000, కాగా దీనికి గరిష్ట పరిమితి లేదు. అయితే, పన్ను ప్రయోజనం రూ. 1.5 లక్షలు ఉంటుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC) పన్ను ప్రయోజనం కోసం ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే ఖతాదారుడు మొత్తం పెట్టుబడిని ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఖాతాదారులు అసలు, వడ్డీ రెండు కలిపి మొత్తం కార్పస్‌ను అందుకుంటారు. ప్రస్తుతం ఈ స్కీమ్‌లో 7% వడ్డీ లభిస్తోంది. ఈ పథకంలో కనీసం రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. గరిష్ఠ పరిమితి లేదు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షల వరకు సెక్షన్ 80సి కింద పన్ను మినహాయింపునకు అర్హత ఉంటుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న పెద్దలు, స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన 55 నుంచి 60 ఏళ్ల లోపు వయసువారు ఈ పథకంలో చేరవచ్చు. ఇందులో కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.15 లక్షల వరకు.. ఒకేసారి పెట్టుబడి పెట్టాలి. దీని ప్రత్యేకత ఏమనగా.. పోస్టాఫీస్ అందిస్తున్న పథకాల్లో అత్యధిక వడ్డీ రేటుని అందిస్తోంది ఈ పథకం. ప్రస్తుతం వార్షికంగా ఈ పథకం 8% వడ్డీ రేటు అందిస్తోంది. ఇందులో వడ్డీని త్రైమాసికంగా చెల్లిస్తారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జులై, అక్టోబరు, జనవరి నెలల్లో మొదటి తేదీన వడ్డీ ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడులపై కూడా సెక్షన్ 80సి కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. -
పన్ను ఆదా.. స్థిరమైన రాబడులు పొందాలంటే ఈ స్కీమ్‌లో చేరాల్సిందే!
ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచే పన్ను ఆదా సాధనాల్లో ప్రతి నెలా నిర్ణీత మొత్తం ఇన్వెస్ట్ చేసుకోవడం మెరుగైనది. కానీ, చాలా మంది దీన్ని ఆచరించలేరు. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లో పన్ను ఆదా సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే వారే ఎక్కువ. ఈ తరుణంలో పన్ను ఆదా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. పన్ను ఆదాకుతోడు మెరుగైన రాబడులను ఇచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినప్పుడే అసలైన ప్రయోజనం నెరవేరుతుంది. ఈ విధంగా చూసుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) మెరుగైన సాధనం అవుతుంది. ఒకవైపు సెక్షన్ 80సీ కింద ఈ పథకాల్లో రూ.1.5 లక్షల మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. మరోవైపు మూడేళ్లకు మించి పెట్టుబడులను కొనసాగించడం ద్వారా దీర్ఘకాలంలో ఇతర అన్ని సాధనాల కంటే మెరుగైన రాబడులను వీటిల్లో పొందొచ్చు. ఈఎల్ఎస్ఎస్ విభాగంలో కెనరా రొబెకో ట్యాక్స్ సేవర్ ఫండ్‌ను ఇన్వెస్టర్లు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవచ్చు. రాబడులు ఈ పథకానికి మెరుగైన, స్థిరమైన రాబడుల చరిత్ర ఉంది. సాధారణంగా పన్ను ఆదా సాధనం కనుక ఇందులో పెట్టుబడులకు మూడేళ్ల లాకిన్ ఉంటుంది. అంటే పెట్టుబడి పెట్టిన మూడేళ్ల తర్వాతే వెనక్కి తీసుకోగలరు. కనుక ఏడాది రాబడులు కాకుండా మూడేళ్ల కాలంలో రాబడులను చూసినట్టయితే ఏటా 20 శాతం రాబడులను ఇచ్చింది. అలా కాకుండా ఆ పెట్టుబడులను ఐదేళ్ల పాటు కొనసాగించి ఉంటే ఏటా 14 శాతం, ఏడేళ్ల పాటు అయితే ఏటా 14 శాతం, 10 ఏళ్లపాటు ఉంచినప్పుడు ఏటా 14 శాతం రాబడులను ఈ పథకం ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇదంతా రెగ్యులర్ ప్లాన్‌లో. డైరెక్ట్ ప్లాన్‌లో అయితే 15 శాతంపైనే రాబడులు ఉన్నాయి. బీఎస్ఈ 500టీఆర్ఐ, ఈఎల్ఎస్ఎస్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకంలోనే కాస్త అధిక రాబడులు ఉన్నాయి. మధ్యస్థ రిస్క్ తీసుకునే వారికి ఈ పథకం అనుకూలం. పన్ను ఆదా అవసరం లేని వారు, లాకిన్ ఉన్న సాధనాలు కోరుకునే వారికి కూడా ఇవి అనుకూలమే. పెట్టుబడుల విధానం పెట్టుబడులకు మల్టీక్యాప్ విధానం అనుసరిస్తుంది. అంటే లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అయితే ఎక్కువ పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంది. కనుక రాబడుల్లో అస్థిరతలు తక్కువగా ఉంటాయి. లార్జ్‌క్యాప్ కేటాయింపులు ఎక్కువ కావడంతో గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో నష్టాలు కేవలం మూడు శాతానికి పరిమితమయ్యాయి. కానీ, గడిచిన ఏడాది కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీలు విడిగా 20–30 శాతం మధ్య దిద్దుబాటుకు గురికావడం గమనార్హం. పరిస్థితులకు అనుగుణంగా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కేటాయింపులను ఈ పథకం మార్పు చేర్పులు చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియో ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.4,583 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 97 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా 3 శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విట్లీలోనూ 77 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే కలిగి ఉంది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 21 శాతం కేటాయించగా, స్మాల్‌క్యాప్ పెట్టుబడులు ఒక్క శాతం లోపే ఉండడం గమనించొచ్చు. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 58 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 33 శాతం వీటికే కేటాయించింది. ఆ తర్వాత టెక్నాలజీ కంపెనీల్లో 11 శాతం, ఆటోమొబైల్‌లో 7 శాతం, హెల్త్ కేర్ కంపెనీల్లో 6 శాతం చొప్పున పెట్టుబడులు కలిగి ఉంది. చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే! -
ఎగాన్ లైఫ్ ఐ టర్మ్ ప్లాన్.. స్వయం ఉపాధిలోని వారికి ప్రత్యేకం
హైదరాబాద్: స్వయం ఉపాధిలోని వారిని దృష్టిలో ఉంచుకుని ఏగాన్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘ఐటర్మ్ ప్రైమ్ ఇన్సూరెన్స్’ ప్లాన్‌ను విడుదల చేసింది. వీరికి 10 శాతం ప్రీమియం తగ్గింపు ఇవ్వనుంది. 5 శాతం ఆన్లైన్ డిస్కౌంట్‌కు మరో 5 శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్టు సంస్థ తెలిపింది. ఈ తగ్గింపు మొదటి ఏడాది ప్రీమియంకే పరిమితం. కనీసం రూ.25 లక్షల సమ్ అష్యూర్డ్‌ను ఈ ప్లాన్ కింద పొందొచ్చని, గరిష్ట పరిమితి లేదని ఏగాన్ లైఫ్ ప్రకటించింది. ఏగాన్ లైఫ్ వెబ్ పోర్టల్ నుంచి, తన భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొంది. ఎటువంటి డాక్యుమెంట్లు అవసరం లేదని, అప్లోడ్ కూడా చేయనవసరం లేదని, దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిపింది. ఇందులో ‘స్పెషల్ ఎగ్జిట్ వ్యాల్యూ’ ఆప్షన్ ఉందని, పాలసీదారు 55 ఏళ్ల వయసుకురాగానే అప్పటి వరకు చెల్లించిన ప్రీమియం అంతా వెనక్కి వస్తుందని పేర్కొంది. 99.03 శాతం క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పరిశ్రమలో మెరుగైన స్థానంలో ఉన్నట్టు ప్రకటించింది. క్రిటికల్ ఇల్నెస్, యాక్సిడెంటల్ డెత్ కవర్లను జోడించుకోవచ్చని తెలిపింది. చదవండి: మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్! -
పెరుగుతున్న ఆర్థిక పొదుపులు
ముంబై: దేశంలో పొదుపు ఆర్థిక సాధనాల వైపు ప్రయాణిస్తోంది. ఈ ఆర్థిక పొదుపు 2026–27 నాటికి జీడీపీలో 74 శాతానికి చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. దీనిపై బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. ఫండ్స్ నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) 2021–22 నాటికి రూ.135 లక్షల కోట్లుగా ఉంటే, 2026–27 నాటికి రూ.315 లక్షల కోట్లకు పెరుగుతాయని అంచనా వేసింది. విధాన నిర్ణేతలు దీర్ఘకాలంగా పొదుపు నిధులు ఆర్థిక సాధనాల్లోకి మళ్లాలని కోరుకుంటున్నట్టు గుర్తు చేసింది. అంటే నగదు, బంగారం, రియల్ ఎస్టేట్ తదితర సాధనాలకు బదులు ప్రజలు మ్యూచువల్ ఫండ్స్, ఎక్సేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, ఈక్విటీ, ఇతర పెట్టుబడి సాదనాల్లో తమ పొదుపు నిధులను ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా డెట్, ఈక్విటీ మార్కెట్లలో అధిక లిక్విడిటీ మొత్తం ఆర్థికీకరణ అజెండాకు సాయపడుతున్నట్టు క్రిసిల్ పేర్కొంది. అయితే ఫైనాన్షియల్ మార్కెట్లలో ఎక్కువ కాలం పాటు అస్థిరతలు లేదా లిక్విడిటీ పరిస్థితులు ఇన్వెస్టర్ల అనుభవంపై ప్రభావం చూపించొచ్చని క్రిసిల్ హెచ్చరించింది. మద్దతు చర్యలు.. అందరికీ ఆర్థిక సేవలు చేరువ కావడం, డిజిటలైజేషన్, దీర్ఘకాలంగా మధ్య తరగతి ప్రజల ఖర్చు చేసే ఆదాయం పెరగడం, ఈ తరహా సాధనాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు అన్నీ కలసి.. పొదుపు నిధులు ఆర్థిక సాధనాల వైపు మళ్లేందుకు దోహదపడినట్టు క్రిసిల్ వివరించింది. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు పంపిణీపై దృష్టి సారించాలని క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ జిజు విద్యాధరన్ సూచించారు. ఆయా ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సాధనాలను చేరువ చేసేందుకు ప్రోత్సాహకాల అవసరాన్ని కూడా ప్రస్తావించారు. ఇన్వెస్టర్లు పెట్టుబడి సాధనాలను మరింత సరళంగా అర్థం చేసుకునేందుకు అన్నింటిపైనా ఒకే మాదిరి పన్ను విధానం ఉండాలన్నారు. -
అయ్యో.. అవ్వా, అన్నేళ్ల కష్టమంతా పోయిందే!
రాయగడ(భువనేశ్వర్): ఆరుగాలం కష్టపడి పైసా పైసా కూడబెట్టింది ఆ వృద్ధురాలు. నా అన్నవారు ఎవరూ లేకపోయినా దాచుకున్న సొమ్ముతో కులాసాగా బతకాలని అనుకుంది. తీరా అవసరం కోసం దాచుకున్న డబ్బును బయటకు తీయగా చెదలు పట్టడంతో దిక్కుతోచని స్థితిలో కన్నీరుమున్నీరు అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కెరడ పంచాయతీ ఖిలిమిసి గుడ గ్రామానికి చెందిన సామంత సదే అనే వృద్ధురాలికి ఎవరూ లేరు. కూలి పనులు చేసుకుంటూ బతుకుతోంది. వచ్చే కూలి డబ్బులను కొంతమేర అవసరాలకు ఖర్చు పెట్టి, మిగతా డబ్బును ఒక ట్రంకు పెట్టెలో దాచి ఉంచింది. ఇలా సుమారు రూ.40 వేలకు పైగా దాచుకున్న డబ్బు అవసరం కోసం తెరవగా, డబ్బుకు చెదలు పట్టి పనికిరాకుండా పోయినట్లు గుర్తించింది. కొన్ని నోట్లు తడిచిపోవడంతో పాటు మరికొన్ని పూర్తిగా చిరిగిపోయి ఉన్నాయి. దీంతో కష్టమంతా వృథా అయ్యిందని కన్నీటిపర్యంతమైంది. కొన్ని నోట్లు తడిచి ఉండడంతో ఎండలో ఆరబెట్టింది. చదవండి: డాక్టర్ సతీమణి అత్యుత్సాహం.. భర్త లేకపోవడంతో తానే వైద్యం, రోగి మృతి.. ఇద్దరూ పరార్! -
చిన్న వయసు.. పెద్ద మనసు
సాక్షి, గాలివీడు (కడప): ఆ బాలుడి వయసు పదేళ్లు.. అందరు పిల్లల్లాగా ఆడుతూ పాడుతూ తనదైన లోకంలో విహరించడంతోనే సరిపెట్టుకోలేదు. సొంతూరులోని ఓ ఆలయ పునరుద్ధరణకు భూరి విరాళమిచ్చి పెద్దమనసు చాటు కున్నాడు. వివరాలిలా.. గాలివీడుకు చెందిన భువనేశ్వరి సింగపూర్‌లో ఉంటున్నారు. ఆమె కుమారుడు బండ్లకుంట బాహుబలేయ. గాలివీడులో శిథిలావస్థలో ఉన్న చారిత్రక పురాతన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దాతల సహకారంతో పునరుద్ధరిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాహుబలేయ తాను నాలుగేళ్లుగా పొదుపు చేసుకున్న రూ.50 వేల నగదును విరాళంగా అందించాలనుకున్నాడు. తన అమ్మమ్మ లక్ష్మిదేవి, తాతయ్య దివంగత పులి వెంకటరమణల పేరు మీద రాయచోటిలోని కుటుంబ సభ్యుల ద్వారా నగదును శనివారం కమిటీ సభ్యులకు అందజేశాడు. -
బడ్జెట్ 2022: మధ్యతరగతి వర్గానికి ఒకింత ఊరట!
బడ్జెట్ కసరత్తులో కేంద్రం తలమునకలై ఉంది. జనవరి 31న మొదలయ్యే మొదటి విడత సమావేశాలు.. ఫిబ్రవరి 11 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఇక బడ్జెట్ వస్తుందంటే.. తమకు ఊరట దక్కుతుందా? అని అన్నివర్గాలు ఆశగా చూస్తుంటాయి. ఈ క్రమంలో మధ్యతరగతికి ఒకింత ఊరట ఇచ్చే అంశాల తెరపైకి వచ్చాయి. రెండు దఫాలుగా జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలో ‘బడ్జెట్’ ఎలా ఉండబోతుందో అనే అంశంపై జోరుగా ఆర్థిక మేధావుల్లో చర్చ నడుస్తోంది. 2022-23 బడ్జెట్లో కేంద్రం మధ్యతరగతి ప్రయోజనాల దృష్ట్యా.. రెండు రకాల పన్ను ప్రయోజనాలను ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో మొదటిది.. స్టాండర్డ్ డిడక్షన్.. ఆదాయం నుంచి ఆ మేరకు మినహాయించి చూపించుకునే వెసులుబాటు. 2005-06 ఆర్థిక సంవత్సరంలో ఎత్తివేసిన ఈ ప్రయోజనాన్ని.. తిరిగి 2018-19 బడ్జెట్లో ప్రవేశపెట్టారు. మొదట రూ.40,000గా ప్రకటించి.. ఆపై 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.50,000కు పెంచింది. ఇప్పుడు దీన్ని మరి కొంత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మాదిరే రూ.10,000 పెంచుతారా? మరింత ప్రయోజనం కల్పిస్తారా? అనే దానిపై బడ్జెట్లోనే స్పష్టత రానుంది. వర్క్‌ఫ్రమ్ హోం కొనసాగుతున్న నేపథ్యంలో.. కొన్ని దేశాలు అమలు చేస్తున్న తరహా ప్రయోజనాల్ని ఆశిస్తున్నారు. పిల్లల చదువు పొదుపు.. ఏటేటా పిల్లల విద్యా ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. సుకన్య సమృద్ధి యోజన.. అదీ అమ్మాయిలకు తప్పించి మరేయితర ప్రయోజనం చేకూరడం లేదు. ఈ తరుణంలో ‘సెక్షన్ 80-సీ’ కింద స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. ఇదే మంతప్రయోజనంగా లేదనేది అసలు విషయం. ఎందుకంటే జీవిత బీమా ప్రీమియం, ఈపీఎఫ్, ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్ అన్నీ సెక్షన్ 80సీ కిందకే వస్తాయి. పైగా పాఠశాల ఉన్నత విద్య, ఇంటర్, ఇంజనీరింగ్ కోర్సుల వ్యయాలు గణనీయంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్య కోసం చేసే పొదుపు, పెట్టుబడులకు ప్రత్యేక సెక్షన్ కింద ఆదాయం నుంచి మినహాయింపు ఇవ్వాలన్న డిమాండ్ ఉండగా, దీనిపైనా బడ్జెట్ లో ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త.. తక్కువ వడ్డీకే 3 రకాల లోన్స్! -
ఆ 9 లక్షల్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారు?
1) నా వయసు 41 సంవత్సరాలు. గ్రాట్యుటీ కింద తాజాగా రూ.9 లక్షలు వచ్చాయి. ఇటీవలే ఉద్యోగం మారిపోయాను. దీంతో గ్రాట్యుటీగా వచ్చిన డబ్బులను ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనికితోడు నేను ప్రతీ నెలా రూ.25,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. – రవీష్ సంతోషకరమైన విషయం ఏమిటంటే మీకు గ్రాట్యుటీగా వచ్చిన మొత్తం కూడా పన్ను రహితమే. ఇది ఆదాయం కింద పరిగణనలోకి రాదు. గతంలో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉండేది. ఈ పరిమితిని కేంద్ర ప్రభుత్వం రూ.20లక్షలకు పెంచింది. కనుక గ్రాట్యుటీ కింద రూ.20లక్షల వరకు వచ్చే మొత్తంపై పన్ను చెల్లించాల్సిన అవసరం రాదు. ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది మీరు నిర్ణయించుకోవాల్సిందే. ఎందుకంటే ఈ డబ్బులతో అవసరం తిరిగి ఎప్పుడు ఉంటుందన్నది మీకే తెలుస్తుంది. చదవండి: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్? మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే.. వచ్చే ఐదు, ఏడేళ్ల వరకు ఈ నిధి అవసరం మీకు లేకపోతే అగ్రెస్సివ్ హైబ్రిడ్ లేదా బ్యాలన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడుల విషయమై మీకు అనుభవం ఉంటే కనుక ఫ్లెక్సీక్యాప్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ నిధి మొత్తాన్ని ఒకే విడత కాకుండా. వచ్చే 12–18 నెలల కాలంలో క్రమంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీర్ఘకాలం కోసం ఉద్దేశించిన పెట్టుబడులు అయితే ఈక్విటీ లేదా ఈక్విటీ/డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడమే సముచితం. మీ అనుభవం ఆధారంగా పథకాన్ని ఎంపిక చేసుకోండి. ఒకవేళ వచ్చే రెండు మూడేళ్లకే ఈ డబ్బులతో మీకు అవసరం ఉంటే కనుక (ఏదైనా అవసరం కోసం) అప్పుడు ఈక్విటీ కాకుండా.. ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనమైన షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 2) వృద్ధులకు సెక్యూర్డ్ డిబెంచర్లు సురక్షితమేనా? నమ్మకమైన రాబడుల కోసం ఏ క్రెడిట్ రేటింగ్ చూడాలి? డెట్ మ్యూచువల్ ఫండ్స్‌తో వీటిని పోల్చి చూసేదెలా? – పరమేశ్వర్ సెక్యూర్డ్ డిబెంచర్లకు ఆస్తులు హామీగా ఉంటాయి. కానీ, చాలా డిబెంచర్లు అన్‌సెక్యూర్డ్‌గా ఉంటుంటాయి. వీటికి మద్దతుగా ఎటువంటి ఆస్తులు ఉండవు. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. రిటైర్ అయిన అందరూ ఏఏఏ రెటెడ్ లేదా కనీసం ఏఏ రేటింగ్ కంటే తక్కువ రేటింగ్ ఉత్పత్తులను ఎంపిక చేసుకోకపోవడమే మంచిది. డిబెంచర్లలో ఇన్వెస్ట్ చేయడం సులభమే. అంతా సాఫీగానే నడిస్తే అప్పుడు వడ్డీ ఆదాయం, మీ పెట్టుబడి సకాలంలో మీకు తిరిగి వస్తాయి. ఒకవేళ ఏదైనా అంచనాలు తప్పితే అప్పుడు వచ్చేదేమీ ఉండదు. కనుక వీటి విషయంలో రిస్క్ ఉంటుంది. ఒకవేళ మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసినప్పటికీ.. సెక్యూర్డ్ డిబెంచర్ల వంటి వాటిల్లో పెట్టుబడులు 2–5 శాతానికి మించవు. కనుక నష్టాలు వచ్చినా పరిమితంగానే ఉంటాయి. పెట్టుబడులను భిన్న సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వైవిధ్యం కారణంగా రిస్క్ తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఈ ప్రయోజనం లభిస్తుంది. డిబెంచర్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అయితే పూర్తి కాలం వరకు మీ పెట్టుబడులను లాక్ చేసుకుంటున్నట్టు అవుతుంది. మధ్యలో మీ పెట్టుబడులు కావాలంటే లిక్విడిటీ కష్టం. మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ లిక్విడిటీ సమస్య ఉండదు. కోరుకున్నప్పుడు మీ పెట్టుబడులను మొత్తం వెనక్కి తీసేసుకోవచ్చు. దీనికితోడు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై పన్ను ప్రయోజనాలు కూడా ఉంటాయి. మూడేళ్ల తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించి చూపించుకోవచ్చు. డిబెంచర్ అయితే ఒక ఆర్థిక సంవత్సరంలో దానిపై వచ్చే వడ్డీ ఆదాయం మొత్తం కూడా పన్ను పరిధిలోకే వస్తుంది. రెండింటి మధ్య ఉన్న ఈ వ్యత్యాసాలను పరిశీలించుకోవాలి. డిబెంచర్లోనే ఇన్వెస్ట్ చేసుకునేట్టు అయితే అధిక క్రెడిట్ రేటింగ్ వాటినే ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన రేటింగ్ ఉంటే రాబడి రేటు అంత ఎక్కువ ఉండదన్నది నిజం. 3) దీర్ఘకాల డెట్ పెట్టుబడుల కోసం ఏ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి? – అంకిత్‌జైన్ రిస్క్ వద్దు అనుకుంటే షార్ట్ టర్మ్ డెట్ ఫండ్స్ మినహా వేటిని కూడా చూడొద్దు. కాకపోతే కొంచెం రిస్క్ ఉన్నా ఫర్వాలేదనకుంటే కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. అలాంటప్పుడు ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు పెట్టుకోవడం అవుతుంది. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో 15–20 శాతం వరకు ఈక్విటీలకు కేటాయిస్తుంటాయి. ఈ పథకాల్లో దీర్ఘకాలానికి ఎటువంటి రిస్క్ ఉండదు. ఐదు–ఏడేళ్లకు మించిన కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులు వీటి నుంచి అందుకోవచ్చు. -
అప్పులపాలు కాకుండా కాపాడే మార్గం ఇది!
రమేశ్ ఓ ఐటీ కంపెనీలో టెక్నికల్ విభాగంలో పని చేస్తున్నాడు. అప్పటిదాకా హాయిగా నడిచిపోతున్న బతుకు బండి.. కరోనాతో కుదేలు అయ్యింది. ఉద్యోగం పోయింది. చేతిలో చిల్లిగవ్వలేక అప్పులవైపు అడుగులేశాడు. ఆశ్చర్యంగా రమేశ్ పరిస్థితే సురేష్‌కు ఎదురైనా.. అప్పులను ఆశ్రయించలేదు. మరో ఉద్యోగం దొరికేదాకా కుటుంబ అవసరాలను సజావుగా తీర్చుకుంటూ పోయాడు. అత్యవసర నిధి ఆవశ్యకతను గుర్తించాడు కాబట్టే రమేశ్‌లా సురేష్ కష్టపడలేదు. అత్యవసర నిధి.. సింపుల్‌గా చెప్పాలంటే ఆకస్మిక నిధి. ఊహించని పరిస్థితులు, సంక్షోభాల ప్రభావం వచ్చేఆదాయంపై పడినప్పుడు ఉపయోగపడే సేవింగ్స్ అనుకోవచ్చు. వైద్య ఖర్చులు, తప్పనిసరి గృహ మరమ్మతులు, ఆకస్మికంగా ఉపాధి కోల్పోవడం, యుద్ధాలు, కరోనా వైరస్ వంటి మహమ్మారులు, అంటువ్యాధులాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు.. అప్పులు చేయకుండా వ్యక్తుల్ని నిలువరించగలుగుతుంది. క్లిక్: స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఏది బెటర్ అంటే.. ఎంత మొత్తం కావాలి? సాధారణంగా అత్యవసర పరిస్థితులు రోజులు, వారాలు, నెలలు కొనసాగొచ్చు. కాబట్టి ఆరు నుంచి ఏడాది ఖర్చులకు సరిపడా అత్యవసర నిధి ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అఫ్కోర్స్.. అందిరికీ ఒకేలా ఉండకపోవచ్చు. అందుకనే ఉద్యోగంలో మొదలైనప్పటి నుంచే కొంత డబ్బును పక్కనపెట్టుకుంటూ వెళ్లాలి. వయసు పెరుగుతున్న కొద్దీ ఖర్చులు, భాద్యతలు పెరుగుతాయి. అలాంటప్పుడు దశల వారీగా ఎమర్జెన్సీ ఫండ్‌ను ఏర్పాటు చేసుకుంటూ వెళ్లాలి. రాబట్టుకోవచ్చు కూడా.. అవసరానికి అందుబాటులో డబ్బును ఇంట్లో ఉంచుకోవడం లేదంటే బ్యాంక్ అకౌంట్లో దాచుకోవడం చేస్తుంటారు. అలాగని దాచిన డబ్బు.. అలాగే మూలుగుతుంటే ఏం లాభం? అందుకే డబ్బు అందుబాటులో ఉండడంతోబాటు, దానిపై రాబడి ఉండడమూ ముఖ్యమే. ఇందుకోసం సేఫ్ సైడ్ అప్పులివ్వడం, పొదుపు ఖాతా లేదంటే అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఉంచొచ్చు. తద్వారా డబ్బు అవసరమైనప్పుడు ఎటువంటి ఆలస్యం లేకుండా విత్‌డ్రా చేసుకునేందకు వీలుంటుంది. విత్‌డ్రా సమయంలో ఎటువంటి పెనాల్టీలు పడకుండా జాగ్రత్త పడాలి. లేదంటే రాబడి తగ్గిపోతుంది. ఇక ఏటీఎంల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. డిజిటల్ పే తలనొప్పులు లేకుండా చూసుకోవాలంటే కొంత డబ్బును ఇంట్లోనే దాచుకోవడం ఉత్తమం. మ్యానేజ్ ముఖ్యం అత్యవసర నిధిలో వైద్య ఖర్చులు, చిన్న చిన్న ప్రమాదాలు/ కారు మరమ్మతు ఖర్చులు వంటి వాటి కోసం కేటాయించే మొత్తంపై పునరాలోచించాలి. ఎందుకంటే హెల్త్, మోటారు వంటి వాటికి ఇన్సురెన్స్ (బీమా) ఉంటుంది. తిరిగి బీమా ద్వారా పొందే అవకాశం ఉన్నప్పుడు, అత్యవసర నిధిలో ఎక్కువ మొత్తం కేటాయించాల్సిన అవసరం ఏముంది?. అందుకే అత్యవసర నిధిని ప్రాధాన్యం ఉన్న వాటికి, చాలా ప్లాన్డ్గా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఎమర్జెన్సీ ఫండ్స్ ఏర్పాటు చేసుకున్నాం.. ఖర్చు పెట్టేశాం అని కాకుండా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహించుకోవాలి. ఈ పునఃసమీక్ష ఏడాదిలో ఒకసారైనా ఉంటే మరీ మంచిది. అలాగే పిల్లలకు సేవింగ్స్ అలవాటు చేయడం ద్వారా.. భవిష్యత్‌లో ఎమర్జెన్సీ ఫండ్ ఆవశ్యకత తెలిసి వస్తుంది. -కేజీ, ఆర్థిక నిపుణుడు చదవండి: రాబడులు, రక్షణ ఒకే పథకంలో.. -
ఐటీ ఫైలింగ్.. పది ప్రశ్నలు..? ఒకటే జవాబు..!
ఆదాయపు పన్ను చెల్లించే వారికి ఎన్నో ప్రశ్నలు ఎదురవుతుంటాయి. అలాంటి ఎన్నో ప్రశ్నల్లో పది మీకోసం.. మేం మా ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు లేదా కొనవచ్చు? మేం ఎంత జాగా కొనవచ్చు? ఇల్లు ఎంత పెట్టి కొనవచ్చు? సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్లు ఎంతవరకు పెట్టవచ్చు? మా అమ్మాయి పెళ్లి గ్రాండ్‌గా చేద్దామనుకుంటున్నాం. ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు. కంపెనీలలో, వ్యాపార సంస్థల్లో షేర్లు ఎంత పెట్టి కొనవచ్చు. స్వంతంగా వ్యాపారం చేద్దామనుకుంటున్నాం. ఎంత పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల్ని అమెరికా పంపుతున్నాం. ఎంత ఆస్తి చూపించాలి? ఎంత ఆదాయం చూపించాలి? పెద్ద కారు మార్కెట్లోకి వచ్చింది. కొనవచ్చా? క్రెడిట్ కార్డుల మీద ఎంత చెల్లించవచ్చు? ఫిక్సిడ్ డిపాజిట్లు ఎంత వరకూ వేసుకోవచ్చు? ఇలాంటి ఎన్నో ప్రశ్నల వర్షం మాకు అలవాటే. ఒక్కొక్కరి అవసరాలు, ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయి. భాష మారినా, అంకెలు మారినా .. ప్రశ్నల సారాంశం ఒక్కటే. వారు పెట్టే ఖర్చులు .. పెట్టుబడులు, చేసే చెల్లింపులు, తీర్చే అప్పులు మొదలైన వాటన్నింటి కోసం అంత మొత్తం ఎలా వచ్చింది? అంటే సోర్స్ ఏమిటి.. ఆదాయానికి మూలం ఏమిటి.. ఎలా వచ్చింది వంటి ప్రశ్నలు ఎదురైతే .. వారి దగ్గర రెడీమేడ్ ఆన్సర్లు, లాజిక్కులు, వివరణలు, ఉపమానాలు, వితండ వాదాలు, నిజం చెప్పలేని నిస్సహాయత, నిరాకరణ, నిర్లిప్తత లాంటి ఆయుధాలు ఎన్నో ఉంటాయి. కానీ మీరు ఏది చెప్పినా వినే అధికారులకు మూడు విషయాల్లో రాత, కోతలు ఉండాలి. నోటి మాటకు విలువ లేదు. ఈ కింది విషయాలపై స్పష్టత ఉండాలి. వ్యవహారం ఎలా జరిగింది? దాని విలువ ఎంత? వ్యవహారంలోని వ్యక్తులు ఎవరూ డమ్మీలై ఉండకూడదు. ఇచ్చే వ్యక్తికి ‘స్తోమత’ లేదా బ్యాంకులో డబ్బు లేదా ‘సోర్స్’ ఉండాలి. దారిన పోయే దానయ్య దానం ఇవ్వలేడు కదా. ఆ విధంగా ‘సోర్స్’ అనేది అధికారుల సంతృప్తి మేరకు చూపించగలిగి ఉండాలి. అంటే నూటికి నూరుపాళ్లు ‘వైట్’లోనే జరగాలి. నిజంగానే లావాదేవీ జరగాలి. పారదర్శకత ఉండాలి. పన్నుకి గురయ్యే ‘సోర్స్’ అయితే పన్ను చెల్లించాలి. పన్నుకి గురికాని ‘సోర్స్’ అయితే, లెక్కలు చూపించాలి. అలా జరిగితే ఏ సమస్యా ఉండదు. ఎన్ని ప్రశ్నలకైనా సరే పదిలమైన జవాబులుంటాయి. అలా జరగలేదో ‘‘కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు’’. - కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు -
పిసినారి పెళ్లాంతో భర్తకి చుక్కలే.. తిండికి కూడా పైసా వసూల్
‘పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభావన’ అనేది ఓ సామెత. గీసిగీసి బేరమాడే వాళ్లని, పావలాకు పదిరూపాయలు లాభం కోరుకునేవాళ్లని.. పీనాసి సంఘంలో చేర్చి మరీ ఎండగట్టినా మారరు. పైపెచ్చు అదేదో ఘనకార్యమన్నట్లుగా పొంగిపోతుంటారు ‘అహా నా పెళ్లంట’ సినిమాలోని కోట శ్రీనివాసరావు మాదిరి. ఆ కోవలోకి చెందిందే అమెరికా వాసి.. నలభై ఒక్కేళ్ల బికీ గుయిలీస్. ‘అమెరికాలోనే అత్యంత పినాసి మహిళ’గా పేరు తెచ్చుకుంది. వాటర్ బిల్లు చెల్లించడం కూడా ఇష్టం లేని గుయిలీస్.. ఇంటి ముందు కురిసే మంచు సేకరించి దాన్ని నీరుగా మార్చి ఇంటి అవసరాలకు వాడుతుంది. ఈమె పీనాసితనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్రీ బై లేడీ’ పేరుతో తన పొదుపు సూత్రాలను పంచుకుంటున్న గుయిలీస్.. భర్త జాయ్‌కు తిండి పెట్టడానిక్కూడా డబ్బు తీసుకుంటుందట.‘తిండి విషయంలో కూడా నేను చాలా పొదుపుగా ఉంటాను. నా భర్త నేను తినే ఆహారం కంటే ఎక్కువ తింటే.. అందుకుగాను అతడు నాకు డబ్బు చెల్లించాల్సిందే. ఆ మొత్తాన్ని ఇంటి అవసరాల కోసం దాచిపెడతాను. నేను ఏదైనా వస్తువు కొనాలంటే అది 90 శాతం చవకదైనా అయ్యుండాలి లేదా ఉచితంగానైనా రావాలి. మొదట్లో ఇంత పొదుపుగా ఉండేదాన్ని కాదు. మా పెద్దబ్బాయి పుట్టాక ఏడాదికి 30 వేల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటి బాధ్యతలు స్వీకరించాను. అకస్మాత్తుగా ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అందుకే అవసరాలన్నింటినీ తగ్గించడం మొదలుపెట్టాను. చివరికి ఇంటి మరమ్మత్తులు కూడా నేనే చేసుకుంటాను’ అని చెప్పుకొస్తుంది గుయిలీస్. అయితే ఈ కథ విన్నవారంతా పొదుపు మంచిదే కానీ పొట్ట కట్టుకుని మరీ ఇంతలా చేయాలా? అని విస్తుపోతున్నారు. భార్య పీనాసి తనాన్ని భరిస్తున్న జాయ్ మీద సానుభూతి చూపిస్తున్నారు. -
జీవితకాల పొదుపు మొత్తం కరోనా పట్టుకుపోయింది!
కరోనా రాక ముందు.. వచ్చిన తర్వాత.. ఇంటి బడ్జెట్, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల విషయంలో ఎక్కువ మంది అంగీకరించే మాట ఇది. పొదుపు, పెట్టుబడులు, వ్యయాల (ఇంటి బడ్జెట్) విషయంలో లోపాలను ఈ మహమ్మారి గుర్తు చేయడమే కాదు, వ్యక్తుల నడవడికను మార్చుకోవాల్సిన అవసరాన్ని సైతం తెలియజేసింది. ఆర్థిక విషయాల్లో వ్యక్తుల ఆలోచనా ధోరణిని మార్చడమే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ఆర్థిక పాఠాలను నేర్పింది. ఒక ప్రముఖ సంస్థ ఇదే అంశంపై ఆన్లైన్లో ఒక సర్వే నిర్వహించింది. కరోనా కారణంగా ఎదురైన భిన్న అనుభవాలు, కష్ట సుఖాలు ఈ సర్వేలో పాలుపంచుకున్న 408 మంది వెల్లడించారు. ఆ వివరాలు ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’లో.. ఒకవైపు ఉద్యోగాల్లోంచి తొలగింపులు, వేతన కోతల కాలం.. మరోవైపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడితే వారికి మెరుగైన వైద్యం కోసం ఖర్చు పెట్టడం ఇవన్నీ పెద్ద సవాళ్లే. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతీ ఇద్దరిలో ఒకరు ఉద్యోగం కోల్పోయినట్టు లేదా వేతన కట్‌ను ఎదుర్కొన్నట్టు చెప్పడం గమనార్హం. స్వయం ఉపాధిలో ఉన్న వారు సైతం 71 మందిలో 37 మంది ఇదే విధంగా చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో పావు వంతు మంది (సర్వేలో పాల్గొన్న వారిలో)తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ లేదా ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. కొంత మందిపై ఆర్థిక భారం గణనీయంగా పడింది. చెన్నైకు చెందిన మృదుల (సర్వేలో పాల్గొన్న వ్యక్తి) పరిస్థితినే చూస్తే.. ఆమె స్వయం ఉపాధిలో ఉన్న మధ్య వయసు మహిళ. గతేడాది లాక్‌డౌన్‌తో ఆమె ఆదాయానికి బ్రేక్ పడింది. అదే సమయంలో మృదుల తల్లి (78) కరోనా వైరస్ బారిన పడ్డారు. 65 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. కానీ, చికిత్స కోసం రూ.34 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. ‘‘ఆరంభంలో రోజుకు రూ.40,000 బిల్లు వచ్చింది. వెంటిలేటర్ అవసరం ఏర్పడడంతో బిల్లు రూ.లక్షకు వెళ్లిపోయింది. వెంటిలేటర్ అవసరం తొలగిపోయిన తర్వాత అమ్మను ఇంటికి తీసుకొచ్చేశాము. ఎందుకంటే ఇక అంతకుమించి ఆస్పత్రి బిల్లు కట్టే పరిస్థితి లేదు’’ అని మృదుల తెలిపారు. మృదుల మాతృమూర్తి ఇప్పటికీ ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆక్సిజన్ ఇతర ఔషధాలు, పరీక్షల కోసం నెలవారీగా రూ.1–1.5 లక్షలు ఖర్చువుతోంది. ఇతర చిక్కులు/పరిమితులు..? ఆస్పత్రిలో చేరితే ఎదురయ్యే వైద్య ఖర్చుల భారం ఏ మేరకు ఉంటుందో ముందుగానే అంచనా వేయలేము. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న భరోసాతో ధైర్యంగా ఉండలేని పరిస్థితులను కరోనా పరిచయం చేసింది. కరోనా బారిన పడిన వారికి నగదు రహిత వైద్య చికిత్సలు అందించేందుకు మొదట్లో చాలా ఆస్పత్రులు ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని ఆస్పత్రుల వైఖరి అలాగే ఉంది. క్లెయిమ్‌లలో జాప్యం, అత్యవసరాలను గట్టెక్కేందుకు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడ్డవారు కూడా ఉన్నారు. వినోదిని ఐటీ ఉద్యోగి. బెంగళూరులో పనిచేస్తున్నారు. ఆమెకు కంపెనీ తరఫున కార్పొరేట్ హెల్త్ కవరేజీ ఉంది. కరోనా పాజిటివ్‌గా తేలి ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. ఫోన్లో డాక్టర్‌ను సంప్రదించారు. తెలిసిన వారి సాయంతో ఔషధాలు తెప్పించుకున్నారు. ‘‘మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం వైద్యుల ప్రిస్క్రిప్షన్, బిల్లు, టెస్ట్‌ల రిపోర్ట్లు సమర్పించాల్సి రావడం అన్నది అసహనానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు ఇటువంటి వాటి గురించి ఆలోచించలేరు. దీంతో కొన్ని వేల రూపాయలకు క్లెయిమ్‌ను నేను పొందలేకపోయాను’’ అని వినోదిని తెలిపారు. దీనికి బదులు టెస్టింగ్ రిపోర్ట్/స్కాన్ రిపోర్ట్ సమర్పించిన వెంటనే ఆటోమేటిక్‌గా నిర్ణీత మొత్తాన్ని రీయింబర్స్మెంట్ కింద అందించే విధంగా నిబంధనలను సడలించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా సీరియస్ పరిస్థితుల్లో రోగిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులతోనూ చాలా మంది నగదు రహిత క్లెయిమ్ అవకాశాన్ని కోల్పోయారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే నగదు రహిత చికిత్సలకు అవకాశం ఉంటుందని తెలిసిందే. రీయింబర్స్మెంట్ చేసుకోవచ్చు.. కానీ, అదేమంత సులభమైన ప్రక్రియ కాదు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్, డిశ్చార్జ్ సమ్మరీ, డిటెయిల్డ్ బిల్లు, అన్ని టెస్ట్ రిపోర్టులు, వైద్యుల ప్రిస్కిప్షన్ ఇలా అన్ని డాక్యుమెంట్లు, వాటిపై ఆస్పత్రుల సీల్, సంతకాలతో సేకరించి బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిల్లో కొన్ని లేకపోయినా మళ్లీ ఆస్పత్రి చుట్టూ తిరిగి వాటిని తీసుకుని సమర్పించాలి. ఇదంతా సమయం, శ్రమతో కూడుకున్న పనే. వైద్య బీమా కవరేజీ గణణీయంగానే ఉన్నప్పటికీ.. కొన్నింటికి ఉప పరిమితులు ఉంటాయి. దీంతో వాస్తవ బిల్లుతో పోలిస్తే తమకు అందిన మొత్తం తక్కువేనని సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు చెప్పారు. మృదుల తల్లిదండ్రులు కాంట్రిబ్యూటరీ హెల్త్సర్వీస్ స్కీమ్‌లో ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ బీమా పథకం. అయితే, మృదుల తల్లి నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చేరడంతో.. వాస్తవంగా రూ.34 లక్షల బిల్లు వచ్చినప్పటికీ.. రీయింబర్స్మెంట్ రూపంలో కేవలం రూ.11లక్షలే అందుకున్నారు. ఇక పెట్టుబడుల విక్రయంలోనూ సమస్యలు ఎదుర్కొన్న వారూ ఉన్నారు. భాస్కర్ కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో ఈపీఎఫ్ నిధి నుంచి విత్‌డ్రాయల్‌కు దరఖాస్తు చేసుకోగా.. అందుకు 15 రోజులు పట్టింది. ఈపీఎఫ్ ఆన్లైన్లో క్లెయిమ్ సదుపాయం ఉన్నప్పటికీ.. యూఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోవడం, ఆధార్ లింక్ చేసుకోకపోవడం అప్డేట్ చేసుకోకపోవడం ఇలా వివిధ కారణాలతో ఈపీఎఫ్ క్లెయిమ్ చెల్లింపులు ఆలస్యంగా అందుకున్న వారు చాలా మందే ఉన్నారు. గిరిధర్ పరిస్థితి మరింత భిన్నమైనది. ఆయనకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గతేడాది మూసేసిన ఆరు డెట్ పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఆ పెట్టుబడులను సొమ్ము చేసుకోలేని అనుభవాన్ని చవిచూశారు. పొదుపు పట్ల మారుతున్న ధోరణి! కరోనా ‘పొదుపు’ పట్ల వ్యక్తుల ఆలోచన తీరునే మార్చేసింది. కొందరు జీవితకాలం పొదుపు చేసిన మొత్తాన్ని కరోనా మహమ్మారి పట్టుకుపోయిందని లబోదిబోమంటున్నారు. పొదుపు పట్ల తమ ఆలోచన మారిందని 65 శాతం మంది సర్వేలో చెప్పారు. కరోనాకు ముందుతో పోలిస్తే తాము మరింత మొత్తాన్ని పొదుపు చేస్తామని 30 శాతం మంది తెలిపారు. జీవిత, వైద్య బీమా కవరేజీని పెంచుకోవడంతోపాటు.. భవిష్యత్తు ఖర్చుల కోసం మరింతగా పెట్టుబడులు పెడతామని కొందరు చెప్పారు. ముఖ్యంగా అత్యవసర నిధి అవసరాన్ని చాలా మంది గుర్తించారు. కొందరు అయితే ఆరు నెలల అవసరాలకు కాకుండా.. కనీసం ఏడాది నుంచి రెండేళ్ల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి అయితేనే సముచితమన్న అభిప్రాయానికి వచ్చారు. రిస్క్ తీసుకోని వారు బ్యాంకు ఖాతాల్లో ఈ నిధిని ఉంచేస్తామని.. లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో, స్వీప్ ఇన్ బ్యాంకు ఖాతా రూపంలో ఉంచుకుంటామని చెప్పారు. వయసులో చిన్న వారు అయితే రిస్క్ తీసుకుని అత్యవసర నిధిని స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. కానీ, ఇలాంటి నిర్ణయాల విషయంలో తగినంత ముందస్తు అధ్యయనం, పర్యవేక్షణ అవసరం. కరోనా వేళ తమకు నిధుల అవసరం ఏర్పడినప్పుడు స్టాక్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకుందామనుకుంటే.. నష్టాలు దర్శనమిచ్చాయని సర్వేలో కొందరు చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ అవసరాన్ని స్వయం ఉపాధుల్లో ఉన్న వారు గుర్తించారు. రిటైర్మెంట్ తర్వాత రిస్క్ వద్దని చెబుతుంటారు. అయినా, పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకున్న వారికి కరోనా కాలం తగిన అనుభవాన్నే నేర్పింది. అప్పు అసలే వద్దు.. ‘‘అస్సలు అప్పుల్లో ఉండకూడదని, ఉన్నా చాలా పరిమిత రుణ భారానికే కట్టుబడాలని కొందరి అనుభవం చెబుతోంది. ‘‘నేను నా పెట్టుబడులను వెనక్కి తీసుకుని రుణాన్ని ముందుగానే తీర్చేశాను. వెంటనే రుణ రహితంగా మారాల్సిన అవసరాన్ని గుర్తించాను. ఎందుకంటే ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నా చిన్నారిపై అప్పులు తీర్చాల్సిన భారం పడకూడదు’’అని సర్వేలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. ఎలా ఎదుర్కొన్నారు..? ఊహించని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు గట్టెక్కేందుకు అత్యవసర నిధి అంటూ ఒకటి కచ్చితంగా ప్రతీ ఇంటికి ఉండాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంటి బడ్జెట్లో దీనికి పెద్ద ప్రాధాన్యతే ఉంది. కానీ, ఇప్పటికీ చాలా మంది దీన్ని ఆచరణలో పెట్టడం లేదని ఈ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే కేవలం 36.5 శాతం వద్దే అత్యవసర నిధి ఉంది. పైగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఖర్చులను పెద్ద మొత్తంలో తగ్గించుకోవడం అన్నది అందరికీ సాధ్యపడని విషయం. అయినా, 75 శాతం మంది సాధ్యమైనంత వరకు ఖర్చులకు కోత విధించుకున్నట్టు చెప్పారు. సాధారణంగా ఆరు నెలల అవసరాలు, ఖర్చులు, పెట్టుబడులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఉంచుకోవాలన్నది ఆర్థిక సూత్రం. అయితే, కరోనా వంటి విపత్తుల్లో ఆరు నెలల అవసరాలకు సరిపడే అత్యవసర నిధి ఏ మేరకు సరిపోతుందన్న ప్రశ్న? ఇప్పుడు కొత్తగా ఉదయించింది. ఎందుకంటే చెన్నైకు చెందిన మృదుల చాలా పద్ధతిగా, ప్రణాళిక మేరకు నడుచుకునే వారే. ఆమె, ఆమె తండ్రి కలసి అత్యవసర నిధి కింద కొన్ని రూ. లక్షలు సిద్ధంగా ఉంచుకున్నవారే. కానీ, ఆమె తల్లి కరోనాతో సుదీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఖర్చు వచ్చి పడింది. దీంతో మృదుల తన దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న డెట్ పెట్టుబడులను ఉపసంహరించుకుని ఆస్పత్రికి చెల్లించారు. ఆమె ఒక్కరే కాదు.. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది తమ అత్యవసర వ్యయాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, పోస్టాఫీసు పొదుపులు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించారు. ‘‘ఆస్పత్రి నుంచి ఇంత చెల్లించాలంటూ డిమాండ్ రావచ్చని ముందే ఊహించా ను. దాంతో కొన్ని రోజుల ముందే పెట్టుబడులను విక్రయించడం వల్ల అవి నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. దాంతో చెల్లింపులు చేయగలిగాను’’ అని మృదుల వివరించారు. విజయ్‌ది భిన్నమైన అనుభవం. విశాఖపట్నంకు చెందిన ఆయన కాస్ట్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నారు. అత్యవసర నిధి అంటూ ఆయనకు ఏదీ లేదు. దీంతో అత్యవసరాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేశారు. ‘‘మా నాన్న గారు ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో రూ.2.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. స్టాక్స్‌లో నాకు పెట్టుబడులు ఉన్నాయి. కానీ నాన్న శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. దీంతో సోమవారం కానీ స్టాక్స్‌ను విక్రయించలేను. విక్రయించిన మేర సొమ్ము నా బ్యాంకు ఖాతాకు రావడానికి బుధవారం వరకు వేచి ఉండాల్సిందే. దీంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడం ఒక్కటే నాకు సౌకర్యవంతమైన మార్గంగా అనిపించింది. కార్డు ద్వారా చెల్లించి ఆ తర్వాత నిధులు సర్దుబాటు చేసుకుందామని నిర్ణయానికొచ్చేశాను’’ అని విజయ్ తెలిపారు. కష్టకాలంలో ఇలా క్రెడిట్ కార్డులను వినియోగించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, క్రెడిట్ కార్డుపై లిమిట్‌ను వాడుకోవచ్చు కానీ.. గడువులోపు ఇతర మార్గాల్లో నిధులను సర్దుబాటు చేసుకుని తీర్చేయడం వల్లే ఉపయోగం ఉంటుంది. లేదంటే క్రెడిట్ కార్డు బకాయిలపై 3–4 రూపాయిల వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిసిందే. ఇది మధ్యతరగతి ఇంటి బడ్జెట్‌ను మరింతగా తారుమారు చేసేయగలదు. కరోనా వల్ల ఎదురైన ఆర్థిక భారాన్ని ఎలా అధిగమించారు? వినియోగ సాధనం ఎంతమంది(%) అత్యవసర నిధి వినియోగం 36.5 క్రెడిట్ కార్డులతో చెల్లింపులు 18.6 అనధికారిక, వ్యక్తిగత, బంగారు, ఇతర రుణాలు 11.5 స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ విక్రయం 19.6 ఎఫ్డీలు, బాండ్ల ఉపసంహరణ 13.5 పోస్టాఫీసు పథకాల నుంచి ఉపసంహరణ 3.4 బీమా పాలసీల సరెండర్ 4.7 హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ 6.1 ఖర్చులను తగ్గించేసుకున్నవారు 75.5 ఆరోగ్యం లేకుంటే డబ్బున్నా.. సున్నానే! ‘‘మీకు ఈ రోజు డబ్బులు ఉండొచ్చు. అయినా ఆరోగ్యాన్ని, ఆక్సిజన్‌ను కొనుక్కోలేని పరిస్థితి. భవిష్యత్తులో డబ్బు అన్నది ఏ మాత్రం హోదా కాబోదు. మంచి ఆరోగ్యం, చక్కని ఆహారంతోపాటు.. ఎన్ని చెట్లను నాటారు అన్నదే ముఖ్యమవుతుంది’’ సర్వేలో ఒక అభ్యర్థి చెప్పిన మాట ఇది. -
కరోనా ఎఫెక్ట్: పెరిగిన కుటుంబాల పొదుపు.. ఎంతంటే?
ముంబై: మహమ్మారి కరోనా వల్ల భారతీయులు 2020లో దాదాపు ఇళ్లకే పరిమితం కావడంతో కుటుంబాల పొదుపు రేటు పెరిగింది. స్థూల దేశీయోత్పత్తి విలువలో ఈ రేటు 22.5 శాతంగా నమోదయినట్లు బ్రోకరేజ్ సంస్థ-మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తాజా నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం 2019 జీడీపీతో పోల్చితే పొదుపు రేటు 19.8 శాతంగా ఉంది. జీడీపీ విలువలతో పోల్చి నివేదికలో పొందుపరచిన కొన్ని ముఖ్యాంశాలను, గణాంకాలను పరిశీలిస్తే... కఠిన లాక్డౌన్ అమల్లో ఉన్న ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో గృహాల పొదుపురేటు కేవలం 5.8 శాతంగా నమోదయ్యింది. మహమ్మారి ముందస్తు స్థాయితో పోల్చితే దాదాపు సగానికి సగం పడిపోయింది. నిత్యావసరాలకు భారీ వ్యయాలు, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం వంటి అంశాలు దీనికి కారణం కావచ్చు. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25-ఏప్రిల్ 14, ఏప్రిల్ 15-మే 3, మే 4- మే 17, మే 18-మే 31) కఠిన లాక్డౌన్ అమలు ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4 శాతం), రెండు (-7.3 శాతం) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4 శాతం స్వల్ప వృద్ధి నమోదయ్యింది. డిసెంబర్ త్రైమాసికంలో పొదుపు రేటు భారీగా రికవరీ అయ్యింది. పలు సంవత్సరాల గరిష్ట స్థాయిలో 13.7 శాతంగా నమోదయ్యింది. సెప్టెంబర్ త్రైమాసికంలో కరెన్సీ రూపంలో పొట్టుబడులు పెరిగినా, డిపాజిట్లు, పెన్షన్లు, చిన్న పొదుపు పథకాల్లో పొదుపులు తగ్గాయి. డిసెంబర్ త్రైమాసికంలో బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ (హెచ్ఎఫ్సీ)ల్లో రుణా భారాలను తగ్గించుకోడానికి కుటుంబాలు ప్రాధాన్యత ఇచ్చాయి. ఇదే సమయంలో బ్యాంకులు నుంచి రుణాలు పెరగడం గమనార్హం. కఠిన ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 2020లో కుటుంబాల పొదుపురేట్లు పెరిగాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో పొదుపు పెరుగుదల రేటు తక్కువగా ఉంది. చదవండి: వాట్సాప్ అడ్మిన్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు -
కష్టమైనా.. ఇన్వెస్ట్ చేయాల్సిందే..!
రిటైర్మెంట్.. ఏదో ఒకరోజు ఆహ్వానించాల్సిందే. ఉద్యోగాల్లో ఉన్న వారికి కాస్త ముందు, స్వయం ఉపాధుల్లోని వారికి కొంత ఆలస్యంగా అయినా.. వృద్ధాప్యంలో పని జీవితం నుంచి విశ్రాంతి అవసరమే. అప్పటి వరకు సంపాదనతో నడిచిన జీవితం.. ఆ తర్వాత కూర్చుని కొనసాగించాలంటే అందుకు ముందు నుంచే ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాల్సిందే. రిటైర్మెంట్ కోసం పొదుపును పెద్దగా పట్టించుకోని ధోరణి యుక్త వయసులోని వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. రిటైర్మెంట్ కోసం చాలా సమయం ఉందన్నది వారి ఆలోచనా తీరు. ఈ ధోరణితో రిటైర్మెంట్ ప్రణాళికను వాయిదా వేస్తే.. వివాహంతో గృహస్థాశ్రమంలోకి ప్రవేశించిన తర్వాత పిల్లలు, వారి ఉన్నత విద్య, వారి వివాహాలు, సొంతిల్లు, కారు తదితర లక్ష్యాలు ముఖ్యమైనవిగా మారతాయి. దీంతో తమ విశ్రాంత (వృద్ధాప్య) జీవనానికి సంబంధించిన ప్రణాళిక పక్కకు వెళ్లిపోతుంది. కారణం ఏదైనా కానీయండి.. వయసుతో సంబంధం లేకుండా సంపాదించే గ్రూపులో ఉన్న ప్రతీ ఒక్కరూ తమ పదవీ విరమణ జీవితానికి పొదుపును తక్షణం ప్రారంభించడమే మంచి పరిష్కారం. ఇది ఎంత ముందుగా ప్రారంభిస్తే అంత సులభంగా కావాల్సినంత సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. ఇందుకు ఏం చేయాలో చూద్దాం.. ఉద్యోగులు అయితే ‘ఉద్యోగుల భవిష్య నిధి’ (ఈపీఎఫ్) సదుపాయం ఉంటుంది. వేతనంలో ప్రతీ నెలా నిర్ణీత శాతం మేర ఈపీఎఫ్ ఖాతాకు వెళుతుంటుంది. ఉద్యోగి వాటాకు సమానంగా పనిచేయించుకునే సంస్థ కూడా తన వంతు వాటాను సమకూర్చడం ఇందులోని విశేషం. ఉద్యోగి ప్రమేయం లేకుండా క్రమం తప్పకుండా ప్రతీ నెలా భవిష్యనిధి ఖాతాకు జమ కావడం వల్ల దీన్ని మంచి సాధనంగా నిపుణులు చెబుతారు. దీనికి విరుద్ధంగా చాలా మంది ఈపీఎఫ్ విషయంలో తప్పుగా వ్యవహరిస్తుండడాన్ని చూడొచ్చు. తమ అవసరాలకు ఈపీఎఫ్ నిధిపై ఆధారపడుతుంటారు. ఇల్లు కొనుగోలు, ఉద్యోగం మారినప్పుడు ఈపీఎఫ్ నిధిని వెనక్కి తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవడాన్ని చూడొచ్చు. ఇలా చేయడం అన్ని సందర్భాల్లోనూ సరైనది కాదు. ఈపీఎఫ్ నిధిని కదపకుండా.. రిటైర్మెంట్ తర్వాత ఉపసంహరించుకోవడం వల్ల మంచి నిధిని చేతికందుకోవచ్చు. ప్రతీ ఉద్యోగికీ సాధ్యమయ్యే రిటైర్మెంట్ పొదుపు సాధనంగా దీన్ని చూడాలి. మరి రిటైర్మెంట్ జీవితానికి ఈపీఎఫ్ ఒక్కటి సరిపోతుందా..? లేదు. మరింత అదనంగా పొదుపు, మదుపు చేసుకుంటూ వెళ్లాలి. ఎంత మొత్తం అన్నది మీరు తీసుకునే రిస్క్, ఇన్వెస్ట్ చేయగలిగే మొత్తంపై ఆధారపడి ఉంటుంది. రిస్క్ తీసుకోని రక్షణాత్మక ధోరణి ఇన్వెస్టర్ అయితే డెట్ సాధనాలను పెట్టుబడులకు ఎంచుకోవాలి. ఓ మోస్తరు రిస్క్ అయినా ఫర్వాలేదనుకునే వారికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనుకూలం. ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్.. ప్రయోజనాలు ఈపీఎఫ్ ఉద్యోగుల భవిష్యనిధిలో జమ అయ్యే మొత్తాలకు సెక్షన్ 80సీ కింద పన్ను పడదు. ఉద్యోగి వాటాతోపాటు, సంస్థ జమ చేసే వాటా కూడా పన్ను మినహాయింపు పరిధిలోకి వస్తుంది. అంతే కాదు రిటైర్మెంట్ సమయంలో ఈపీఎఫ్ నుంచి తీసుకునే మొత్తంపైనా పన్ను మినహాయింపు ఉంటుంది. ఇందులో పెట్టుబడులు, రాబడులు, ఉపసంహరణల మొత్తం కూడా పన్ను లేనిదే. అందుకే ఉద్యోగాలలో ఉన్న వారు అనవసరాలకు ఈపీఎఫ్ నిధిని ఖాళీ చేయకుండా, రిటైర్మెంట్ కోసం కొనసాగించుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఒక సంస్థ నుంచి వేరే సంస్థకు మారినా, ఈపీఎఫ్ నిధిని బదిలీ చేసుకుని, కొనసాగించుకోవాలి. వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్‌కు అనుసంధానంగా పనిచేసే వీపీఎఫ్‌ను వినియోగించుకునే వారు చాలా తక్కు వ మందే. ఈపీఎఫ్ వాటా మూల వేతనంలో 12 శాతానికే పరి మితం. కానీ, వీపీఎఫ్ విషయానికొస్తే మూలవేతనం, డీఏ రెండింటికి సమాన స్థాయిలో ప్రతీ నెలా పొదుపు చేసుకునేందుకు అనుమతి ఉంది. ఈపీఎఫ్ వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ అమలవుతుంది కనుక.. మెరుగైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇందు లో జమ చేసే మొత్తానికీ పన్ను మినహాయింపు పొందొచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వేతన జీవులు కాని వారికి పీపీఎఫ్ ఒకానొక సాధనం అవుతుంది. రాబడులు ఈపీఎఫ్‌తో పోలిస్తే ప్రస్తుతానికి ఒక శాతానికి పైగా తక్కువగా ఉన్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఇందులో రాబడులు, ఉపసంహరణలకూ పన్ను మినహాయింపు ఉంది కనుక ఇది కూడా డెట్‌లో ఒక మెరుగైన ఆప్షన్ అని చెప్పుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్జన ఆరంభమైన నాటి నుంచి రిటైర్మెంట్కు చాలా సమయం ఉంటుంది. కనుక ముందే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించినట్టయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ రూపంలో ఘనంగా సమకూర్చుకోవచ్చు. మధ్యస్థ రిస్క్ ఉన్నా ఫర్వాలేదనుకుంటే.. ఈక్విటీ ఫండ్స్‌ను ఎంచుకుని ప్రతీ నెలా నిర్ణీత మొత్తాన్ని సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలి. ద్రవ్యోల్బణాన్ని అధిగమించి సంపదను సృష్టించుకునే మార్గం ఈక్విటీలు. కాకపోతే ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్ పనితీరును ఏడాదికోసారి తప్పకుండా సమీక్షించుకోవాలి. ఈఎల్ఎస్ఎస్ ఈక్విటీల్లోనే ఇవి ఒక విభాగం. ఇందులో ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.5 లక్షల పెట్టుబడులపై సెక్షన్ 80సీ కింద పన్ను రాయితీ పొందొచ్చు. రాబడులను వెనక్కి తీసుకున్న సమయంలో మాత్రం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను 10 శాతం (రూ.లక్ష మించిన మొత్తాలపై) చెల్లించాల్సి ఉంటుంది. అయినా, రిటైర్మెంట్ కోసం ఈ పథకాలను ఎంచుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లడం మంచి మార్గమే అవుతుంది. అంతేకాదు, రిటైర్మెంట్ తర్వాత ఈక్విటీ పథకాల నుంచి ఏకమొత్తంలో ఉపసంహరించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతీ నెలా తమ అవసరాలకు కావల్సిన మొత్తాన్ని రిడెండప్షన్ చేసుకుంటూ వెళ్లొచ్చు. అప్పుడు మిగిలి ఉన్న పెట్టుబడులకు రాబడులు జమవుతూ ఉంటాయి. ఎన్పీఎస్ ఇది పూర్తిగా రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఉద్దేశించిన సాధనం. ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఇప్పుడు తప్పనిసరి అమల్లో ఉన్న పెన్షన్ సాధనం ఇదే. ప్రైవేటు రంగ సంస్థలు తమ అభీష్టం మేరకు ఈపీఎఫ్‌కు బదులు ఎన్పీఎస్ను కూడా ఎంచుకోవచ్చు. స్వచ్ఛందంగా ఎవరైనా ఎన్‌పీఎస్‌లో భాగం కావచ్చు. ఇందులో డెట్, ఈక్విటీల కలయికగా పెట్టుబడుల ఆప్షన్ ఎంచుకునేందుకు వీలుంది. ఎంత మేర ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నది నిర్ణయించుకోలేకపోతే.. వయసు ఆధారంగా ఈక్విటీ, డెట్ శాతాలను నిర్ణయించే ఆటో చాయిస్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్, పీపీఎఫ్ సాధనాల్లో మెచ్యూరిటీ తర్వాత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. కానీ, ఎన్‌పీఎస్‌లో అలా కాదు.. 60 ఏళ్లనాటికి సమకూర్చుకున్న నిధిలో 60 శాతాన్నే వెనక్కి తీసుకునేందుకు వీలుంటుంది. ఈ మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపు లభిస్తుంది. మిగిలిన 40 శాతంతో పెన్షన్ ఇచ్చే యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇలా యాన్యుటీ ప్లాన్ నుంచి ప్రతీ నెలా అందుకునే మొత్తం ఆదాయపన్ను పరిధిలోకి వస్తుంది. ఇలా మెచ్యూరిటీ తర్వాత కచ్చితంగా యాన్యుటీలో 40 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలన్న నిబంధన కొందరికి నచ్చకపోవచ్చు. అటువంటి వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. రక్షణాత్మక ధోరణి కలిగిన విభాగంలోకి మీరు వస్తే.. ఈపీఎఫ్ ఖాతాకు ప్రతీ నెలా మీ వంతు అదనంగా జమ చేయడం ఒక మంచి మార్గం. దీన్నే వాలంటరీ ప్రావిడెంట్ ఫంఢ్ (వీపీఎఫ్) అంటారు. ఈపీఎఫ్ నిల్వలపై అమలయ్యే వడ్డీ రేటే వీపీఎఫ్‌కూ వర్తిస్తుంది. డెట్ సాధనాల్లో ఈపీఎఫ్ అత్యధిక రిటర్నులు అందిస్తున్న ఒక సాధనమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేయని వారు ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్)ని ఎంచుకోవచ్చు. కాకపోతే ఇందులో రాబడులు కాస్త తక్కువగా ఉంటాయి. ఈపీఎఫ్‌తోపాటు వీపీఎఫ్ లేదా పీపీఎఫ్ రూపంలో రిటైర్మెంట్కు కావాల్సిన మేర నిధికి ప్రణాళిక వేసుకోవడం మంచి ఆలోచనే అవుతుంది. అయితే, డెట్ సాధనాల్లో వచ్చే రాబడిలో అధిక శాతం ద్రవ్యోల్బణ ప్రభావానికే కరిగిపోతుంది. కనుక అధిక రాబడుల కోసం కొంత మొత్తాన్ని అయినా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. మోస్తరు నుంచి అధిక రిస్క్ తీసుకునే వారికి ఈక్విటీలు అనుకూలమైన పొదుపు సాధనమని చెప్పుకోవాలి. ఈపీఎఫ్, వీపీఎఫ్, పీపీఎఫ్, ఈక్విటీ ఫండ్స్ కలయికతో పెట్టుబడుల ప్రణాళిక రూపొందించుకున్నామెరుగ్గానే ఉంటుంది. 20–30ల్లోనే ఉండి ఆదాయం మొదలు పెట్టిన వారు ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకోవడం ద్వారా భారీ నిధిని సమకూర్చుకునే అవకాశం సొంతం చేసుకోవచ్చు. రిటైర్మెంట్కు కనీసం 20–30 ఏళ్లు అయినా ఉంటే, ఈక్విటీల కలయికగా పెట్టుబడులను ప్లాన్ చేసుకోవాలి. పెంచుతూ పోవడం పరిష్కారం ఆదాయం పెరుగుతూ వెళుతున్నట్టే.. రిటైర్మెంట్ కోసం చేసే పొదుపు మొత్తాన్ని కూడా అంతే మేర పెంచుకుంటూ వెళ్లాలి. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. చెప్పడం సులభం.. ఆచరణే కష్టం. కానీ, ఆరంభించేంత వరకే కష్టం. ఒక్కసారి మొదలు పెడితే, దానికి తగినట్టు ఖర్చులను సర్దుబాటు చేసుకోవచ్చు. రిటైర్మెంట్ కోసం కొంత మొత్తం కావాలన్న అవసరాన్ని ఒక్కొక్కరు ఒక్కో సమయంలో గుర్తిస్తుంటారు. కొందరు అయితే అప్పటి సంగతి అప్పుడే చూసుకోవచ్చనుకుంటారు. కానీ, ముందుగా ప్రారంభించినట్టయితే.. దానికి కాంపౌండింగ్ (వృద్ధి) శక్తి తోడవుతుంది. దాంతో దీర్ఘకాలానికి గణనీయమైన మొత్తాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు మధ్య వయసు కూడా దాటి, రిటైర్మెంట్ పొదుపును ఇంకా ప్రారంభించలేదని ఆలోచిస్తున్నారా..? ఆందోళన చెందకుండా వెంటనే ఆచరణలో పెట్టడం ఉత్తమం. ఏ మాత్రం ఆలస్యం చేయవద్దు. ఎందుకంటే 45–50లకు చేరిన తర్వాత రిటైర్మెంట్ కోసం పొదుపు మొదలు పెట్టడం వల్ల అవసరమైనంత నిధి సమకూరదు. చిన్న వయసులో అయితే సంపాదనలో కొంత భాగాన్ని పక్కన పెట్టినా సరిపోతుంది. కానీ, ఆలస్యం చేసిన కొద్దీ సంపాదనలో భారీ మొత్తాన్ని రిటైర్మెంట్కు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రిటైర్మెంట్ అవసరాలకు ఎంత మేర కావాలి, అందుకు ఏం చేయాలన్న విషయమై సందేహాలు ఉంటే ఆర్థిక సలహాదారులను సంప్రదించి వారిచ్చే సూచనలను అనుసరించాలి. -
‘రేపేదైనా అయితే ఎలా...’ అనే భయం..!
వీకెండ్ మూవీల్లేవు. ఫ్రెండ్స్‌తో పార్టీలు బంద్. అప్పుడప్పుడు వచ్చి పోయే బంధుమిత్రుల సందడి లేదు.ఇంటిల్లిపాది కలిసి వెళ్లే సరదాటూర్లు లేవు. ‘రెస్టారెంట్’ అనే మాటమరిచారు. ఇల్లు దాటి బయటకు రావడానికి వంద రకాల సందేహాలు. ఇంటిల్లిపాదికి ఏవేవో అవసరాలు. ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటాయి. అయినా అన్నింటినీ వాయిదాపర్వంలోకి నెట్టేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే నగరవాసులు ‘కోవిడ్ సేవింగ్స్’ పాటిస్తున్నారు. ఉన్నదాంట్లో కొంతమొత్తాన్ని‘కోవిడ్ ముప్పు’ కోసంకేటాయిస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో: కంటికి కనిపించని శత్రువును ఎదుర్కొనేందుకు నగరవాసులు పొదుపు పాటిస్తున్నారు. మహమ్మారి కరోనా ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఏ క్షణంలో కబళిస్తుందో తెలియనిఅనిశ్చితి. ఐదు నెలలు గడిచినా వైరస్ ముప్పు తొలగలేదు. ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. మరోవైపు భరోసాను ఇవ్వలేకపోతున్న సర్కార్ దవఖానాలు, రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల భయాందోళనను మరింత రెట్టింపు చేస్తున్నాయి. దీంతో చాలా మంది కొన్ని రకాల అవసరాలను సైతం వాయిదా వేసుకొని కరోనా కోసం పొదుపు చేస్తున్నారు. దీంతో ఎవరి నోట విన్నా ‘కోవిడ్ సేవింగ్స్ అనే మాటే వినిపిస్తోంది. ఐదు నెలలుగా కొనసాగుతున్న అనిశ్చితి ప్రజల జీవన విధానంలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది. ఉందిగా వాయిదాల పర్వం.... ‘ వంట నూనెలు, పప్పులు, టీ పొడి, కాఫీ పొడి, పేస్టు వంటి నిత్యావసర వస్తువులే కావచ్చు. అవి తప్పనిసరిగా కొనుగోలు చేయవలసినవే అయినా జేబులోంచి డబ్బులు బయటకు తీస్తుంటే భయమేస్తుంది....రేపేదైనా ఆపద వస్తే ఎలా అనే ఆలోచన నిలువునా చుట్టేస్తుంది...’ మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన అనిల్ ఆవేదన ఇది. ఓ కార్పొరేట్ కాలేజీ లెక్చరర్. కరోనా దృష్ట్యా పిల్లలకు ఆన్లైన్ పాఠాలు చెబుతున్నాడు. పూర్తిగా కాకపోయినా జీతం వస్తోంది. కానీ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న తన ఒంటరి కుటుంబంలోకి కరోనా తొంగి చూస్తే ఎలా అనే భయం వెంటాడుతోంది. ‘భోజనానికి, ఇంటి అద్దెకు, అవసరమైన మందుల కోసం తప్ప డబ్బులు ఖర్చు చేయడం లేదు. పిల్లలకు ఏదైనా కొనివ్వాలనిపించినా ‘రేపేదైనా అయితే ఎలా...’ అనే భయం తన ప్రమేయం లేకుండానే అతన్ని వాయిదా పర్వంలోకి నెట్టేస్తుంది. ఒక్క అనిల్ మాత్రమే కాదు. వివిధ రంగాల్లో పని చేస్తున్న మధ్యతరగతి వర్గాలు అవసరాలన్నింటినీ వాయిదా వేసుకొని కోవిడ్ సేవింగ్స్ బాటలో పయనిస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు పాటిస్తారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంత ఇల్లు వంటివి దృష్టిలో ఉంచుకొని వచ్చే ఆదాయాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. బ్యాంకు రుణాలు తీసుకొని ఇళ్లు, స్థలాలు కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు నగరవాసులు ఏ క్షణంలో ముంచుకొస్తుందో తెలియని ఉపద్రవాన్ని ఎదుర్కొనేందుకు మాత్రమే ఈ పొదుపును పాటిస్తున్నారు. ఇంటింటికీ ‘కోవిడ్ ఫండ్’... ‘కారు చెడిపోయింది. ఇప్పటికిప్పుడు నాలుగు టైర్లు మార్చవలసిందే. కనీసం రూ.25 వేలు ఖర్చవుతుంది. కానీ కారు కోసం అంత డబ్బు వెచ్చించడం దుస్సాహసమేమో అనిపిస్తుంది. మూడు నెలలుగా ఏదో ఒకవిధంగా నెట్టుకొస్తున్నాను...’ అని చెప్పారు బోడుప్పల్‌కు చెందిన ప్రశాంత్. ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్వేర్ నిపుణుడిగా పని చేస్తున్నాడు. కోవిడ్‌కు ముందు జీవితం సంతోషంగా గడిచింది. వీకెండ్లో అందరూ కలిసి బయటకు వెళ్లేవారు. ఒక సినిమా, రెస్టారెంట్ లో డిన్నర్. పిల్లలకు నచ్చిన స్నాక్స్ తీసుకొని ఇంటికి వచ్చేవారు. ‘ఇప్పుడు ఆ సరదాలు పోయాయనే బాధ లేదు. కానీ కరోనా కోసమే డబ్బులు పొదుపు చేయవలసి రావడం చాలా బాధగా ఉంది. డెబిట్ కార్డు బయటకు తీయాలంటేనే భయమేస్తుంది.’ అని అంటారు. ప్రతి ఇంట్లోనూ ‘ కోవిడ్ ఫండ్’ ఒక తప్పనిసరి అవసరంగా మారింది. నిత్యావసర వస్తువులు, తప్పనిసరి మందులు, అత్యవసర రవాణా ఖర్చులు మినహా ఇతర అవసరాల కోసం డబ్బులు ఖర్చు చేయడం లేదు. మరోవైపు వివిధ రకాల వ్యాపార కార్యకలాపాలు స్తంభించడం వల్ల కూడా ఆయా రంగాలపైన ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని సైతం కరోనా ముప్పును దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్ వాయిదా వేసుకున్నాం ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఈ టైమ్‌లో ఎందుకు అనిపిస్తుంది. ఏదో ఒక విధంగా ఈ ముప్పు నుంచి బయట పడితే చాలనిపిస్తోంది. రిఫ్రిజిరేటర్ చెడిపోయింది. కొత్తది కొనాల్సి వస్తుంది. కానీ 4 నెలల నుంచి వాయిదా వేసుకుంటున్నాం. – కల్పన, గృహిణి సరిపెట్టుకుంటున్నాం వారం, పది రోజులకు సరిపోయే నిత్యావసర వస్తువులు, కూరగాయలు మినహా మరో అవసరం కోసం ఖర్చు చేయడం లేదు. ఒకవేళ మధ్యలోనే కొన్ని వస్తువులు అయిపోయినా ఏదో ఒకవిధంగా సర్దుకుంటున్నాం.కానీ పదే పదే బయటకు వెళ్లి కొనుగోలు చేయడం లేదు. ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వస్తుందోతెలియదు కదా. – వినయ్ వంగాల ఓన్లీ ఆహారం.. ఆరోగ్యం.. పౌష్టికాహారం తీసుకోవడం, అవసరమైన మందులు తెచ్చుకోవడం, శానిటైజర్లు, మాస్కులు, హ్యాండ్‌వాష్‌లు అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయడం మినహా మరో ఆలోచన చేయడం లేదు. గతంలో బయటకు వెళితే తప్పనిసరిగా షోకేస్ వస్తువులు, ఎలక్ట్రిక్ వస్తువులు తెచ్చేవాణ్ణి, ఇంట్లో అందరం కలిసి సరదాగా బయటకు వెళ్లేవాళ్లం.ఇప్పుడు అన్నీ బంద్. – ప్రశాంత్, సాఫ్ట్వేర్ నిపుణుడు -
పట్నం బతుకు.. కష్టం పొదుపు
రవిచంద్ర (రామంతాపూర్) ఓ మాల్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్. లాక్‌డౌన్‌కు ముందు తనకొచ్చే రూ.25 వేల నెల జీతంలో రూ.5 వేలైనా పొదుపు చేసేవాడు. అలా దాచుకున్న డబ్బులో కొంత లాక్డౌన్ సమయంలో అవసరాలకు ఉపయోగపడ్డాయి. కానీ, లాక్డౌన్ తర్వాత వ్యాపారం సరిగా లేదంటూ యజమాని సగం జీతమే ఇస్తున్నాడు. దీంతో అవసరాలు తీరక అప్పులుచేసి నెట్టుకొస్తున్నాడు. మల్లికార్జున్ (యూసుఫ్‌గూడ బస్తీ) ఓ సినీ స్టూడియోలో పనిచేస్తూ నెలకు రూ.30 వేలు సంపాదించే వాడు. పిల్లల ఫీజులు, ఇతర అవసరాలన్నీ వాటితోనే.. కూడబెట్టుకున్న డబ్బులేక లాక్డౌన్ టైమ్‌లో కుటుంబపోషణకు అప్పు చే శాడు. లాక్డౌన్లో జీతాల్లేక, అన్‌లాక్ సమయంలో పనిలేక ఇబ్బంది పడుతున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన కృష్ణ ఆటోడ్రైవర్. లాక్‌డౌన్‌తో ఆటో తిరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం ఇచ్చిన రూ.3 వేలు, 30 కిలోల బియ్యంతో బండి లాగాడు. లాక్డౌన్ తరువాత ఆటో నడుపుతూ నెలకు రూ.10 వేలు సంపాదిస్తున్నా అవి పెరిగిన ధరలకు ఏమాత్రం సరిపోవట్లేదు. సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ దెబ్బతీస్తోంది. పట్టణ పేద, దిగువ మధ్య తరగతి వర్గాల బతుకుల్ని అతలాకుతలం చేస్తోంది. వైరస్ ఉధృతి కారణంగా ఇంకా కోలుకోని వ్యాపారాలు, జీతభత్యాలు, ఉద్యోగాల్లో కోతలు, పె రుగుతున్న ధరలు పట్టణ ప్రజల నడ్డివిరుస్తున్నాయి. ఆదాయ మార్గాలు తగ్గడం, నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో పొదుపు మార్గాలన్నీ మూసుకుపోతున్నాయి. దీంతో నెల చివరికొచ్చే సరికి చేతుల్లో చిల్లిగవ్వ లేకుండాపోతోంది. దీంతో అప్పుల కోసం వెంపర్లాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో లాక్డౌన్ దాదాపుగా ఎత్తేసినా ఇంకా చాలా వ్యాపారాలు పుంజుకోలేదు. వస్త్ర వ్యాపారం పడిపోగా, హోటళ్లు, రెస్టారెంట్లకు వచ్చే వా రు 10 శాతానికి మించట్లేదు. మాల్స్‌కు వచ్చేవారు లేక వ్యాపారం తగ్గిపోయింది. దీంతో చాలాచోట్ల సేల్స్‌మన్, వాచ్‌మన్, టెలీ ఆపరేటర్లు, సర్వర్లు, బ్యాంకు కన్సల్టెంట్లు వంటి ఉద్యోగాలు భారీగా ఊడిపోయాయి. సెలూ న్లు, ఐరన్ షాపులు, టైలరింగ్ వంటి వాటిపై ఆధారపడి బతికే వారి ఆదాయాలు దారు ణంగా పడిపోయాయి. తోపుడుబండ్ల వ్యాపారం మూలనపడగా, ఆటో, క్యాబ్‌ల్లో ప్రయాణాలు తగ్గి డ్రైవర్ల ఆదాయం పడిపోయింది. ఇవన్నీ పత్య్రక్షంగా, పరోక్షంగా పట్టణ ప్రాం త ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయి. ఆదాయం తగ్గి.. ఖర్చులు పెరిగి.. ప్రస్తుతం కూరగాయల ధరలు 30% మేర పెరగ్గా, పాలు, పెరుగు, పప్పులు, నూనెలు ఇతర నిత్యావసరాల ధరలు 15–20% పెరి గాయి. తగ్గిన ఆదాయాలు, పెరిగిన ఖర్చుల తో పట్టణ ప్రాంతాల్లో పొదుపు తగ్గింది. నెల కు వస్తున్న కొద్దిపాటి ఆదాయాన్ని ఆహారం, ఆరోగ్యం, అద్దె, విద్య, విద్యుత్, గ్యాస్ ఇతర నిత్యావసరాలకు వెచ్చిస్తుండటం, వాటి ధర లు గతంతో పోలిస్తే పెరగటంతో నెల చివరి కొచ్చే సరికి పట్టణ ప్రాంత ప్రజలకు ఖాళీ జే బులే మిగులుతున్నాయి. పట్టణ కుటుంబాల కు వచ్చే ఆదాయాలు తగ్గిపోవడంతో ఇప్పటివరకు పొదుపుచేసిన మొత్తాలతో నెట్టుకొస్తున్నారు. ఈ పొదుపు సొమ్ము అయిపోతే ఇక అప్పులే శరణ్యం కానున్నాయి. ఓ జాతీయ సర్వే సంస్థ ప్రకారం లాక్‌డౌన్‌కు ముందు రూ.10వేల వరకు ఆదాయమున్న ఇంట్లో నెలవారీ పొదుపు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, అదే రూ.20వేలైతే రూ.2వేల నుంచి రూ.6వేలు, రూ.30వేల ఆదాయం ఉంటే రూ.4వేల నుంచి రూ.8వేలు ఉండగా, అది ప్రస్తుతం రూ.10వేలైతే సున్నా, రూ.20వేలైతే రూ.వెయ్యి నుంచి రూ.2వేలు, రూ.30వేల ఆదాయం ఉంటే రూ.3వేల నుంచి రూ.5వేల వరకు మాత్రమే ఉంటోంది. గ్రామీణ పేదలు కొంచెం మెరుగు.. ‘లాక్‌డౌన్‌కు ముందు వరకు పూర్తి జీతం ఇవ్వడంతో నెలకు రూ.5వేల వరకు పొదుపు ఉండేది. ఇప్పుడు జీతాల్లో 30శాతం కోతపెట్టారు. దీనికి తోడు నిత్యావసరాల ధరలు, కరెంట్ బిల్లులు పెరిగాయి. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు ఆరంభించడంతో ఖర్చు పెరిగింది. ఇప్పుడు నెల చివరకు మిగిలింది రూ.3వేలే’ అని ఖైరతాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉద్యోగి ప్రవీణ్ తెలిపాడు. అయితే, పట్టణ ప్రాంతాల తో పోలిస్తే గ్రామీణ పేదల ఆదాయం, పొదు పు కొంత మెరుగ్గా ఉన్నాయి. పీడీఎస్ బి య్యం, పప్పులకు తోడు కేంద్రం వ్యవసాయ భూములకు అందించిన రూ.2వేల సాయం, జన్‌ధన్ ఖాతాల్లో రూ.500 నగదు బదిలీ, ఉ పాధి పనులు, ధాన్యం అమ్మకాలతో వచ్చిన డబ్బుతో గ్రామీణ పేదల పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని ప్రభుత్వంలో కీలక స్థానం లో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి చెప్పారు. ► రాష్ట్రంలో పొదుపునకు దూరమైన పట్టణ ప్రజలు 40లక్షలు ► జాతీయ సర్వేల అంచనా ప్రకారం దేశంలో ఆదాయాన్ని కోల్పోవడం లేదా కోతను ఎదుర్కొంటున్న పట్టణ ప్రాంత కుటుంబాలు 84% ► కరోనా విపత్తు నేపథ్యంలో దేశవ్యాప్తంగా పొదుపును మరిచిపోయిన పట్టణ జనాభా 13.9కోట్లు -
కరోనా జీవన చిత్రం.. పొదుపు మంత్రం..
శరత్, సంతోషి భార్యాభర్తలు. సికింద్రాబాద్‌లోని ఓ పేరున్న హోటల్లో ఒకరు మేనేజర్, మరొకరు రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా విధులకు హాజరు కావడం లేదు. హోటల్ మూతబడటంతో వీరికి ఏప్రిల్ నెల వేతనం అందలేదు. మరోవైపు లాక్డౌన్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఫలితంగా ఇప్పటికిప్పుడు మరో ఉద్యోగం వెతుక్కోవడం కష్టమే. దీంతో అందుబాటులో ఉన్న నగదు నిల్వలను, పీఎఫ్ విత్‌డ్రా చేస్తే వచ్చిన మొత్తాన్ని జాగ్రత్త చేసుకున్నారు. మరో నాలుగు నెలల వరకు ఈ నగదుతో జీవనం సాగించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూనే ప్రత్యామ్నాయ ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు. రాజేశ్ దిల్సుఖ్నగర్ సమీపంలోని ఓ మల్టీప్లెక్స్‌లో సూపర్వైజర్. వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలు, భార్యతో ఆనందంగా గడుపుతున్నాడు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో థియేటర్ కాంప్లెక్స్ మూతపడింది. ఉద్యోగానికి లాక్‌పడి సరిగ్గా రెండు నెలలైంది. అప్పట్నుంచి వేతనం లేదు. దీంతో ఇద్దరు పిల్లల్ని పోషించడం ఎలా అనే ప్రశ్నతో ఉన్నపళంగా ఇల్లు ఖాళీ చేసి సొంతూరు నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి వెళ్లిపోయాడు. పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుని, చేతిలో ఉన్న సొమ్మును జాగ్రత్త చేసుకుని కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ లక్షలాది కుటుంబాల జీవన చిత్రాన్ని మార్చేసింది. ఇప్పటికిప్పుడు పరిస్థితులు చక్కబడేటట్లు లేకపోవడంతో పలు రంగాల్లో పనిచేస్తున్న వారిని ప్రత్యామ్నాయ బాట చూపిస్తూనే పొదుపు మంత్రానికి అలవాటు చేసింది. లాక్డౌన్ కారణంగా చాలా సంస్థలు మూతపడ్డాయి. హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు, సినిమా థియేటర్లు, ఫంక్షన్ హాళ్లు తదితర సంస్థలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. అలాగే విద్యా సంస్థలు, వాటికి అనుబంధంగా ఉన్న హాస్టళ్లు సైతం మూత పడ్డాయి. లాక్డౌన్ సడలింపులు ఇచ్చినప్పటికీ ఇలాంటి సంస్థలు తెరుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో వీటిల్లో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులు సొంతూళ్ల బాట పట్టారు. ఇక్కడే స్థిరపడ్డ వారు మాత్రం రోజు వారీ ఖర్చులు భారీగా తగ్గించుకుంటూ పొదుపు జీవితానికి అలవాటు పడుతున్నారు. దాచిన సొమ్ముతో ధైర్యంగా.. లాక్డౌన్ కారణంగా చాలామంది ఉద్యోగాలకు దూరమయ్యారు. సడలింపులతో కొందరు తిరిగి విధులకు హాజరవుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు మాత్రం తెరుచుకోలేదు. మరోవైపు ఆర్థిక సర్దుబాటులో భాగంగా కొన్ని కంపెనీలు ఉద్యోగాల తొలగింపు చేస్తున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కారణాలతో ఉద్యోగాలు పోతాయనే భయం వారిలో సరికొత్త ఆలోచనలకు ప్రాణం పోస్తోంది. ఇప్పటికిప్పుడు ఉద్యోగం కోల్పోతే ఎలా? అనే కోణంలో దాదాపు ప్రతి ప్రైవేటు ఉద్యోగి ఆలోచిస్తూ భవిష్యత్ కార్యాచరణ తయారు చేసుకుంటున్నాడు. చేతిలో ఉన్న నగదు, దాచిన సొమ్మును జాగ్రత్తగా ఖర్చు చేసేలా ప్రణాళిక తయారు చేసుకుంటూనే, కొత్తగా అప్పులు చేయకుండా గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నాడు. ఈక్రమంలో దుబారా ఖర్చులకు మంగళం పాడుతూ పొదుపు బాటన పరుగులు పెడుతున్నాడు. ఇక ఇప్పటికిప్పుడు ఉద్యోగం కోల్పోయినా, కొత్త ఉద్యోగం వెతికిపట్టుకుని అందులో ఇమిడే వరకు పట్టే ఆర్నెల్ల కాలం తన కుటుంబంతో తాపీగా బతికేలా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటున్నాడు. ఎందుకీ వృథా ఖర్చు మార్చి 22 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ అమలవుతోంది. అయితే హోటళ్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, విద్యా సంస్థలు, హాస్టళ్లు మాత్రం మార్చి 16 నుంచే మూతబడ్డాయి. సరిగ్గా 2 నెలలు పూర్తి కాగా, ఈ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు అప్పట్నుంచి జీతభత్యాలు లేవు. ఫలితంగా కుటుంబ పోషణ గందరగోళంగా మారింది. ఈ క్రమంలో ఆయా కుటుంబాలు పొదుపుబాట పట్టాయి. అందుబాటులో ఉన్న నగదును పక్కా ప్రణాళికతో ఖర్చు పెడుతున్నాయి. కొందరికి అధికంగా టీ తాగడం అలవాటు. కానీ ప్రస్తుతం చాలా ఇళ్లలో టీ, టిఫిన్లను భారీగా తగ్గిస్తున్నారు. వీటికి బదులుగా చిరుధాన్యాలైన పెసర్లు, శనగలు, బొబ్బర్లను ఉడికించి తినడం అలవాటు చేసుకుంటున్నారు. టిఫిన్లతో పోలిస్తే వీటి ఖర్చు తక్కువే. అదేవిధంగా నూనె వేపుళ్లు, ఇతర చిరుతిళ్లకు పూర్తిగా చెక్‌పెడుతూ.. అన్నం, కూరగాయలతో కానిచ్చేస్తున్నారు. తీసుకునే ఆహారం ఒక క్రమపద్ధ తిలో భుజిస్తే ఎన్నోరకాలుగా కలిసొస్తుందనే పాఠాన్ని వంటబట్టించుకుంటున్నారు. కుటుంబ పోషణలో కీలకమైన కిరాణా సరుకులను కూడా పద్ధతిగా కొనుగోలు చేస్తూ అనవసరమైన వాటికి దాదాపు దూరమవుతున్నారు. ఇలా కొత్త తరహా జీవనానికి అలవాటు పడుతూ పొదుపే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నారు. -
ఎస్బీఐ సేవింగ్స్ డిపాజిట్ రేట్ల కోత
న్యూఢిల్లీ: ఎస్బీఐ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాల్లోని డిపాజిట్ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విడుదలైన ప్రకటనలో ముఖ్యాంశాలు... ♦ సేవింగ్స్ డిపాజిట్లపై ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గించింది. అన్ని సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లకూ ఇది వర్తిస్తుంది. తగినంత ద్రవ్య లభ్యత ఉండడం దీనికి కారణం. ♦ ఏప్రిల్ 15 నుంచీ ఇది అమల్లోకి వస్తుంది. ♦ ఇక నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్ఆర్)ను కూడా అన్ని కాలపరిమితులకు 35 బేసిస్ పాయింట్ల వరకూ తగ్గించింది. ♦ ఎంసీఎల్ఆర్ తగ్గింపు రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. ♦ గృహ, వ్యక్తిగత, కార్పొరేట్, వాహన రుణాలకు అనుసంధానమయ్యే ఏడాది నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు 7.75 శాతం నుంచి 7.40 శాతానికి తగ్గుతుంది. ♦ దీనితో ఎంసీఎల్ఆర్కు అనుసంధానమయ్యే గృహ రుణ చెల్లింపుల విషయంలో 30 సంవత్సరాలకు సంబంధించి లక్షకు ఈఎంఐ దాదాపు రూ.24 తగ్గుతుంది. -
కరోనా పోరు: శభాష్ చిన్నారులు
ఫొటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు అక్కాచెల్లెళ్లు. కరోనా విజృంభణ నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశానికి తమ వంతు సాయం అందించి పెద్ద మనసు చాటుకున్నారు. మిజోరం రాష్ట్రానికి చెందిన ఈ ఇద్దరు చిన్నారుల పేర్లు మాన్‌పుయ్ రొకుమ్(10), లార్లూట్‌ఫెలీ రొకుమ్(5). కొలాసిప్ జిల్లా బిల్కావత్తిలిర్‌లోని దావర్ వెంగ్ ప్రాంతానికి చెందిన చిన్నారులిద్దరూ డిబ్బీల్లో తాము దాచుకున్న డబ్బులను కరోనా మహమ్మారిపై పోరాడుతున్న సంస్థకు విరాళం ఇచ్చేశారు. వీరు డిబ్బీలో దాచుకున్న డబ్బులను లెక్కిస్తే రూ. 609, రూ. 580 వచ్చాయి. చిన్న వయసులో పెద్ద మనసు దాటిన అక్కాచెల్లెళ్లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశవ్యాప్తంగా ఇలాంటి ఎంతో మంది చిన్నారులు కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు ముందుకు రావడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. (కరోనా: పెరుగుతున్న ‘తబ్లిగి’ కేసులు) -
ముందు ఇల్లు తర్వాతే పెళ్లి
సాక్షి, హైదరాబాద్: 90వ శతాబ్ధం వరకు జీవిత వరుసక్రమం.. ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఆ తర్వాతే ఇల్లు! కానీ, 20వ శతాబ్ధం నుంచి సీన్ రివర్స్ అయింది. ఉద్యోగం వచ్చిందంటే చాలు సొంతింటి ఎంపికే ప్రధాన లక్ష్యంగా మారింది. యువత జనాభా పెరుగుతుండటం, చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగ అవకాశాలు రావటం, తక్కువ వడ్డీ రేట్లకు బ్యాంక్ రుణాలు లభ్యమవుతుండటం, ప్రభుత్వం నుంచి రాయితీలు, పన్ను మినహాయింపులుండటం వంటి కారణాలతో ముందు ఇల్లు.. ఆ తర్వాతే పెళ్లి ఆలోచన అంటోంది నేటి యువతరం. 1990 వరకూ పొదుపు చేసిన సొమ్మే: 1990 సంవత్సరం వరకూ సొంతిల్లు కొనాలంటే పొదుపు చేసిన సొమ్ముతోనో లేక పదవీ విరమణ అయ్యాక వచ్చే డబ్బులతోనే కొనుగోలు చేసేవారు. దీంతో ఆ సమయంలో ఎక్కువ శాతం గృహ కొనుగోలుదారులు 45–55 ఏళ్ల వయసుగల వాళ్లే ఉండేవాళ్లు. పైగా ఆ సమయంలో బ్యాంక్‌లు, ఇతర రుణ సంస్థలు కూడా ప్రాపర్టీ విలువలో 85–90 శాతం వరకు రుణాలు ఇచ్చేవి కావు. దీంతో పొదుపు చేసిన సొమ్మే సొంతింటికి దిక్కయ్యేది. 2000 నుంచి సీన్ మారింది: డెవలపర్లకు, ప్రకటనదారులకు గృహ కొనుగోలుదారుల వయసు అనేది అత్యంత ప్రధానమైంది. 2000 సంవత్సరం నుంచి గృహ కొనుగోళ్లలో చాలా మార్పులు వచ్చాయి. కస్టమర్ల అభిరుచుల్లోనే కాకుండా వారి కొనుగోలు శక్తి వయసులోనూ మార్పులు వచ్చాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ తెలిపా రు. గృహ రుణాలు కూడా విరివిగా లభ్యమవుతున్నాయి. యువ ఉద్యోగులు కూడా దాచుకున్న డబ్బుతో కాకుండా రుణంతో కొనాలని భావిస్తున్నారు. బ్యాంక్‌లు కూడా తక్కువ వడ్డీ రేట్లతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నాయి. 35–45 ఏళ్ల లోపే టార్గెట్: అనరాక్ నివేదిక ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో 37 శాతం గృహ కొనుగోలుదారులు 35–45 ఏళ్ల వయసు వాళ్లున్నారు. 25 శాతం కస్టమర్లు 45–55 ఏళ్లు, 20 శాతం కస్టమర్లు 25–35 ఏళ్లు వయసున్నారు. ఇక, 25 ఏళ్ల లోపు కంటే తక్కువ ఉన్న కొనుగోలుదారులు 7 శాతం వరకున్నారు. హైదరాబాద్‌లో 38 శాతం ప్రాపర్టీ కొనుగోలుదారులు 25–35 సంవత్సరాల వయసున్న వాళ్లున్నారు. -
ఈక్విటీల్లో పెట్టుబడులు... అయినా రిస్క్ తక్కువే!
ఈక్విటీల్లో కొంత ఇన్వెస్ట్ చేయాలి, అదే సమయంలో పెట్టుబడులకు రిస్క్ కొంత తక్కువగా ఉండాలని ఆశించే వారు ఈక్విటీ, డెట్ కలయికతో కూడిన ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్స్ పథకం రాబడుల విషయంలో మెరుగ్గా ఉంది. ఈక్విటీ, డెట్‌తోపాటు, ఆర్బిట్రేజ్ అవకాశాల్లోనూ ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంటుంది. గతంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ ఇ¯Œ కమ్ పేరుతో ఈ పథకం కొనసాగింది. రాబడులు..: ఈ పథకం 2014లో ఆరంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే మంచి రాబడులను ఇచ్చింది. ఈక్విటీ సేవింగ్స్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు ఈ పథకంలో రాబడులు ఎక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం 8.5 శాతం, రెండేళ్లలో వార్షికంగా 6.8 శాతం, మూడేళ్లలో వార్షికంగా 9.2 శాతం చొప్పున ప్రతిఫలాన్నిచ్చింది. ఈ విభాగం సగటు రాబడులు ఏడాదిలో 5.2 శాతం, రెండేళ్లలో 5.1 శాతం, మూడేళ్లలో 7.4 శాతంగానే ఉన్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టాలి, అదే సమయంలో రిస్క్ తక్కువగా ఉండాలనుకునే వారికి ఈక్విటీ సేవింగ్స్ పథకాలు అనుకూలంగా ఉంటాయి. రిస్క్ ఆధారిత రాబడుల విషయంలో ఈ విభాగం అటు కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, ఇటు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కు మధ్యస్థంగా ఉంటాయి. ఈ పథకం ఈక్విటీ, ఈక్విటీ ఆర్బిట్రేజ్‌కు కనీసం 65 శాతం కేటాయింపులు చేస్తుంది. పన్ను పరంగా ఈక్విటీ ఆర్బిట్రేజ్ పెట్టుబడులు కూడా ఈక్విటీగానే పరిగణించబడతాయి. డివిడెండ్, మూలధన లాభాలపై పన్ను ఉంటుంది. ఇన్వెస్టర్ల లక్ష్యాలను బట్టి కనీసం మూడేళ్లు, అంతకు మించిన కాలానికి ఈ పథకాలను పరిశీలించొచ్చు. పెట్టుబడుల విధానం..: ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ సేవింగ్స్ పథకం ఈక్విటీలకు 15–50 శాతం వరకు పెట్టుబడులను కేటాయిస్తుంది. డెట్‌కు 10–35 శాతం వరకు కేటాయింపులు చేస్తుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి 25–75 శాతం మధ్య ఆర్బిట్రేజ్ వ్యూహాలకు కేటాయించడం ద్వారా రాబడులు పొందే ప్రయత్నం కూడా చేస్తుంటుంది. ఈక్విటీ డెరివేటివ్స్‌లో హెడ్జ్ పొజిషన్ల ద్వారా రాబడులపై అస్థిరతలను తగ్గించడంతోపాటు, కొంచెం అదనపు రాబడులను ఇచ్చే వ్యూహం ఈ పథకంలో గమనించొచ్చు. 43 శాతం పెట్టుబడులను ఈక్విటీ హెడ్జ్ పొజిషన్ల కోసం, 24 శాతం పెట్టుబడులను పూర్తిగా ఈక్విటీ ఎక్స్పోజర్ రూపంలో నిర్వహిస్తుంటుంది. మల్టీక్యాప్ విధానంలో, ఎక్కువగా లార్జ్‌క్యాప్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. ఈక్విటీల కోసం చేసిన మొత్తం కేటాయింపుల్లో 83 శాతం లార్జ్‌క్యాప్‌లోనే ఉండగా, మిడ్‌క్యాప్‌లో 10 శాతం, స్మాల్‌క్యాప్‌లో 7 శాతం చొప్పున ఉన్నాయి. అస్థిరతల మార్కెట్లలో లార్జ్‌క్యాప్ కంపెనీలు కొంచెం స్థిరంగా, సౌకర్యంగా ఉంటాయని తెలిసిందే. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇంధన రంగ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనించొచ్చు. -
చిన్న పొదుపులపై వడ్డీరేట్లు యథాతథం
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుతం లభిస్తున్న వడ్డీరేట్లు యథాతథంగా కొనసాగనున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సంమృద్ధి యోజనసహా అన్ని పొదుపు పథకాలపై ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో యథాపూర్వ వడ్డీరేట్లు కొనసాగుతాయని ఆర్థికశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మూడు నెలలకు ఒకసారి పొదుపు పథకాలపై వడ్డీరేట్లను సమీక్షించి ఆయా రేట్ల కొనసాగింపు లేదా మార్పులపై కేంద్రం నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే. -
డిపాజిట్ల రేటును తగ్గించిన ఎస్బీఐ
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. పొదుపు ఖాతాలు, స్వల్పకాలిక రుణ రేట్లను రెపోరేటుకు అనుసంధానం చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. తొలిసారిగా ఎక్స్టర్నల్ ప్రమాణిక వడ్డీరేట్లకు కలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నూతన రేట్లు మే 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి తీసుకొచ్చింది. రూ.లక్ష పైబడిన సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ప్రస్తుతం ఏడాదికి 3.50 శాతం రేటు ఉండగా.. ఇది రెపోరేటు కంటే 2.75 శాతం తక్కువగా ఉందని తెలిపింది. క్యాష్ క్రెడిట్ అకౌంట్స్, రూ.లక్ష దాటిన ఓవర్‌డ్రాఫ్ట్‌ను రెపోరేటు, 2.25 శాతం జోడించి అనుసంధానం ఉంటుందని వివరించింది. -
తగ్గించుకుందాం అధనపు భారం!
హిమాయత్‌నగర్: కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బడ్జెట్ మన చేతుల్లోనేఉంచుకోవచ్చు. పొదుపు మంత్రం పాటిస్తే అ‘ధన’పు భారాన్ని తగ్గించుకోవచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులకు చెక్ పెట్టేయొచ్చు. ఇందుకోసం సేవింగ్స్ స్కీంలపై దృష్టి పెట్టడం, రియల్ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, బాండ్స్ కొనడం, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చెయ్యడం.. ఇలా పొదుపు సూత్రాలను పాటిస్తే సరి. వీటిని ఎలా చేయాలనేది మాత్రం సరైన స్పష్టత లేక సతమతమవుతుంటారు. అలాంటి చిట్కాలు ఇవిగో... ఆన్లైన్ షాపింగ్‌తో కొంత పొదుపు ముందుగా ఆన్లైన్ షాపింగ్ సైట్లను పరిశీలించాలి. వాటిలో మనం తీసుకోవాల్సిన వస్తువు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో చూడాలి. గూగుల్ సెర్చ్‌లో మనకు కావాల్సిన వస్తువు ధర ఎంత అని సెర్చ్ చేస్తే.. అమెజాన్‌లో ఎంత, ఫ్లిప్‌కార్డ్‌లో ఎంత, టాటా క్లూస్‌లో ఎంత అనేది తెలుస్తుంది. ధర ఒక్కటీ తక్కువుండటం మాత్రమే కాదు షిప్పింగ్ చార్జీ ఎంత వసూలు చేస్తున్నదీ చూస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. క్రెడిట్ కార్డుతోనూ ఆదా.. వాడుతున్న క్రెడిట్ కార్డును బట్టి నెలలో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. కిరాణా సరుకులు, ఇంధనంపై 5 శాతం వరకు, మూవీ టికెట్లు, రెస్టారెంట్లలో విందులపై 20 శాతం వరకు తగ్గింపులను పొందవచ్చు. బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేయడం వల్ల అదనపు ప్రయోజనం ఉంది. లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి.. కిరాణా, నిత్యావసర వస్తువుల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరించాలి. ముందుగా ఇంట్లోకి కిరాణా సామగ్రి ఏమేమి కావాలన్న జాబితా లేకుండా షాపింగ్ చేయొద్దు. షాపింగ్‌కు వెళ్లేటప్పుడు కచ్చితంగా లిస్ట్ తయారు చేసుకుని వెళ్లాలి. తప్పకుండా ఆ లిస్ట్ కే కట్టుబడాలి. సమయం ఉంటే నెల సరుకులు కొనే ముందు సమీపంలోని సూపర్ మార్కెట్లు లేదా సాధారణ కిరాణా షాపుల్లో ధరల వ్యత్యాసం ఎంతుందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. గుల్ల చేసే మొబైల్ బిల్లు.. చాలా మందికి మొబైల్ బిల్లు విషయంలో కంట్రోల్ ఉండదు. పోస్ట్ పెయిడ్ అయితే అడ్డే ఉండదు. పొదుపు చేయాలంటే ముందు చేయాల్సింది పోస్ట్‌పెయిడ్‌కు గుడ్‌బై చెప్పేయడమే. ప్రీపెయిడ్కు మారాలి. ఆఫర్ల సమయంలోనూ.. ఏడాదికోసారి వస్త్రాలను కొనుగోలు చేయడంతోనూ ఎక్కువ ఆదా చేసుకోవచ్చు. అది కూడా ఆఫర్ల సమయంలో పెట్టుకుంటే చాలా మంచిది. పండగలకు ముందు ఆన్‌లైన్‌లోనూ, బయట కూడా షాపుల్లో భారీ ఆఫర్లు ఉంటాయి. అప్పుడు కొనుగోలు చేయడంవల్ల కనీసం 30 శాతమైనా ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. 10 నుంచి 50శాతం రాయితీ ఇస్తాం.. ఈ మధ్య అందరూ ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డారు. దీంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఓ వెబ్‌సైట్‌ని రూపొందించాం. ‘సెలబ్రేట్’ అనే వెబ్సైట్ నుంచి ఏదైనా షాపింగ్ చేస్తే 10 నుంచి 50శాతం రాయితీ ఇస్తున్నాం. – జీవన్చౌదరి, వెబ్సైట్ రూపకర్త బ్యాంకు ఖాతాలోనూ కిటుకులు.. సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో మినిమం బ్యాలెన్స్ కంటే అదనంగా ఉంచడం వల్ల వడ్డీ రాబడి తక్కువే వస్తుంది. కనుక ఆటో స్వీప్ సదుపాయం పెట్టుకోవాలి. దీంతో కనీస నగదు నిల్వకు మించి ఉన్న నగదు డిపాజిట్‌గా మారిపోతుంది. దీనిపై 7శాతం వరకు వడ్డీ లభిస్తుంది. వాయిదా మంచిదే.. ఏదైనా వస్తువు కొనాలని అనిపిస్తే వెంటనే కొనొద్దు. దాన్ని ఒక నెల వాయిదా వేయండి. ఈ మధ్యలో అది అవసరమా లేదా అని ఆలోచించండి. నెల గడిచిన తర్వాత మరోసారి ఆ వస్తువు కావాలని అనిపిస్తే కొనండి. ఆన్లైన్ షాపింగే బెస్ట్.. నాకు నచ్చిన డ్రెస్సెస్, జ్యువెలరీ అన్నీ ఆన్లైన్లోనే కొంటుంటా. ఎందుకంటే ఆన్లైన్లో చాలా చాలా ఆఫర్స్ ఉంటున్నాయి. బయట వాటికన్నా చాలా తక్కువ ధరల్లో నచ్చినవి దొరుకుతున్నాయి. అందుకే బయట షాపింగ్ చేయకుండా ఆన్లైన్ షాపింగ్నే ఇష్టపడుతున్నా.– నిహారిక కాసుల, స్టూడెంట్ -
ఫ్లాట్‌లో నివాసం.. కార్ల వేలం!
పైసా పైసా పొదుపు, అదే భవితకు మలుపు అంటున్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన తీసుకుంటున్న పొదుపు చర్యలు చాలా మందిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ప్రభుత్వంలో కొందరు ఇదెక్కడి పొదుపంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, మరికొందరు దుబారాకు కళ్లెం పడాల్సిందేనని ఇమ్రాన్‌కు మద్దతు పలుకుతున్నారు. అధికారిక నివాసం కాదని అపార్ట్మెంట్లోకి ఇమ్రాన్ పొదుపు చర్యల్ని మొదట తనతోనే మొదలు పెట్టారు. 134 ఎకరాల్లో విస్తరించిన రాజప్రాసాదం, 524 మంది సిబ్బంది ఉన్న ప్రధాని అధికారిక నివాసాన్ని కాదని 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. కేవలం ఇద్దరు సేవకుల్ని మాత్రమే పనిలో ఉంచారు. ప్రధాని నివాసాన్ని యూనివర్సిటీగా మారుస్తానని ప్రకటించారు. ఉన్నతాధికారులు విమానాల్లో ఫస్టక్లాస్ ప్రయాణాలు చేయకుండా నిషేధం విధించారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఫస్ట్‌క్లాస్ బదులుగా ఇక బిజినెస్ క్లాసులోనే ప్రయాణించాల్సి ఉంటుంది. మూడోసారి ప్ర«ధానిగా ఉన్న సమయంలో నవాజ్ షరీఫ్ 64 సార్లు విదేశీ ప్రయాణాలు చేశారు. వెళ్లినప్పుడల్లా 631 మంది సిబ్బంది ఆయన వెంట ఉండేవారు. ఇందుకోసం రూ. 65 కోట్లు ఖర్చు చేశారు. అందువల్ల అత్యవసరమైతే తప్ప విదేశీ ప్రయాణాలు చేయకూడదని ఇమ్రాన్ నిర్ణయం తీసుకున్నారు. విదేశాంగ మంత్రి తప్ప మరెవరూ ఇతర దేశాలకు వెళ్లాల్సిన పని లేదని తేల్చేశారు. ప్రభుత్వ అధికారులతో సమీక్షా సమావేశాల సమయంలో గత ప్రభుత్వాలు రకరకాల నోరూరించే వంటకాలతో లంచ్ ఏర్పాటు చేసేవి. ఇమ్రాన్ వాటన్నింటినీ తగ్గించేశారు. ఇప్పుడు సమావేశాల సమయంలో కనీసం బిస్కెట్లు కూడా ఇవ్వడం లేదని ఒక అధికారి వాపోయారు. ప్రధాని లగ్జరీ కార్ల వేలం ప్రధాని నివాసంలో అంతగా వినియోగంలో లేని 33 లగ్జరీ కార్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రధాని నివాసంలో సెప్టెంబర్ 17న ఈ వేలం జరుగుతుంది. ఎనిమిది బీఎండబ్ల్యూ కార్లు, నాలుగు బెంజ్ కార్లు, 16 టయోటా కార్లతో పాటుగా నాలుగు బుల్లెట్ ప్రూప్ వాహనాలు, ఒక హోండా సివిక్ కారు, మూడు సుజుకి వాహనాలతో పాటుగా 1994 మోడల్‌కు చెందిన హినో బస్సును కూడా వేలం వేస్తారు. హెలికాప్టర్ ప్రయాణం వివాదాస్పదం ఇమ్రాన్ తన నివాసం నుంచి సెక్రటేరియెట్‌కి ప్రతీరోజూ హెలికాప్టర్లో వెళ్లి రావడం వివాదాన్ని రేపింది. అందరికీ సుద్దులు చెబుతున్న ఇమ్రాన్ హెలికాప్టర్లో వెళ్లడమేంటని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి. హెలికాప్టర్లో వెళ్లితే కి.మీ.కు రూ. 50–55 రూపాయలకు మించి అవదని పాక్ సమాచార మంత్రి ఫవాద్ వ్యాఖ్యలు వివాదమయ్యాయి. ఇమ్రాన్ ప్రయాణిస్తున్న అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ ఖర్చు కి.మీ.కు దాదాపు రూ.1600 అవుతుందని కొందరు తేల్చారు. దీంతో ప్రభుత్వం మాట మార్చి సామాన్య జనాలకు ఇబ్బందులు కలగకుండా, కాన్వాయ్ ఖర్చు లేకుండా చూసేందుకే ఇమ్రాన్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్నారని సమర్థించుకుంది. -
క్యాష్ ఈజ్ కింగ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రూపంలో ఇంటింటి పొదుపులు గణనీయంగా పెరిగాయి. 2017–18లో స్థూల జాతీయ డిస్పోజబుల్ ఇన్కమ్(జీఎన్‌డీఐ–ఆదాయపు పన్నులు తదితర వ్యయాల తర్వాత ఖర్చులకు, పొదుపుకు కుటుంబం వద్ద ఉండే మొత్తమే డిస్పోజబుల్ ఇన్కమ్)తో పోల్చిచూస్తే, నగదు రూపంలో ఇంటింటి పొదుపు 2.8%కి పెరిగింది. ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజా గణాంకాల్లో మరిన్ని వివరాలు... 82016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు జరిగింది. అటు తర్వాత గృహ పొదుపులు అసలు పెరక్కపోగా అంతక్రితం ఏడాది (2015–16) తో పోల్చితే 2016–17లో 2 శాతం క్షీణించింది. 82016–17లో జీఎన్‌డీఐలో గృహ ఫైనాన్షియల్ సేవింగ్స్ కూడా 6.7% క్షీణించాయి. 2015–16లో ఏకంగా 8.1% వృద్ధి నమోదయ్యింది. అయితే 2017–18లో ఈ రేటులో 7.1% వృద్ధి నమోదైంది. 8డిపాజిట్ల రూపంలో పొదుపులు డీమోనిటైజేషన్ ఇయర్ (2016–17) లో 6.3 శాతం పెరిగితే, 2017–18లో ఈ రేటు 2.9 శాతానికి జారిపోయింది. 8షేర్లు, డిబెంచర్లలో పొదుపులు 2015–16లో 0.3 శాతం ఉంటే, 2017–18లో 0.9 శాతానికి ఎగశాయి. స్టాక్ మార్కెట్ బూమ్‌కు ఇది నిదర్శనం. -
మహిళ అంటే.. మరింత పొదుపు!!
మగ, ఆడ తేడా లేకుండా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే ఆర్థిక అవసరాల పరంగా చూస్తే పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకే ఇవి ఎక్కువనేది నిపుణుల మాట. పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం, సగటు ఉద్యోగ కాలం తక్కువగా ఉండటం, జీవన కాలం ఎక్కువగా ఉండటం వంటి అంశాలను దీనికి కారణాలుగా వారు చెబుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత జీవన అవసరాల కోసం ఎక్కువగా పొదుపు చేయాల్సిన అవసరం మగవారితో పోలిస్తే మహిళలకే ఉంటుంది. జీవిత భాగస్వామి ఉన్నప్పటికీ ఆర్థికంగా స్వతంత్రులైన మహిళలు జీవిత లక్ష్యాలు, అవసరాల విషయంలో ఓ ప్రణాళిక వేసుకుని దాన్ని ఆచరణలో పెట్టడం శ్రేయస్కరమనేది ఆర్థిక నిపుణుల సూచన. – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం మనదేశంలో స్త్రీ, పురుషుల మధ్య వేతన చెల్లింపుల్లో వ్యత్యాసం 20 శాతం మేర ఉంటోందని ‘మాన్స్టర్’ శాలరీ ఇండెక్స్ సూచిస్తోంది. మధ్య స్థాయిలో చూస్తే పురుషులు సగటున ఓ గంట పనికి రూ.231 పొందుతుంటే, మహిళలకు లభిస్తున్నది రూ.184.80 మాత్రమే. ఇక అనుభవం పెరుగుతున్న కొద్దీ ఈ అంతరం ఇంకా అధికమవుతోంది. ఏడేళ్ల సీనియారిటీ కలిగిన వారి మధ్య అంతరం 7.8 శాతం అయితే, 11 ఏళ్లు అంతకంటే ఎక్కువ అనుభవం ఉన్న స్త్రీ, పురుషుల మధ్య వేతనం చెల్లింపుల్లో అంతరం 25 శాతంగా ఉండటం గమనార్హం. ఈ గణాంకాలను చూసిన తర్వాతయినా మహిళలు తమ అవసరాలపై కొంచెం అధిక శ్రద్ధ వహించక తప్పదు. అందుకే వీరు పురుషులతో పోలిస్తే అదనంగా పొదుపు, మదుపు చేయడం అవసరం. ఉద్యోగ కాలం కూడా తక్కువే... పై గణాంకాలను చూస్తే మహిళలకు తక్కువ వేతనాలు వస్తున్నాయని అర్థమవుతోంది. అలాగే, మహిళల ఉద్యోగ కాలం కూడా పురుషులతో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పిల్లల సంరక్షణ కోసం మధ్యలో విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సగటున కనీసం ఓ ఏడేళ్ల పాటు వారు ఉద్యోగానికి దూరంగా ఉంటారు. అంటే ఆ కాలంలో వారు పొదుపు, పెట్టుబడులు చేయలేరు. అంతకాలం పాటు సీనియారిటీ కూడా కోల్పోయినట్టుగానే భావించాలి. దీంతో తిరిగి ఉద్యోగంలో చేరితే వారికొచ్చే వేతనం తక్కువగా ఉంటుంది. దీనివల్ల పదవీ విరమణ సమయంలో వారికొచ్చే ప్రయోజనాల్లోనూ ఆ మేరకు కోత పడుతుంది. జీవన కాలం.. కాస్త అధికం పురుషులతో పోలిస్తే మహిళల సగటు జీవన కాలం కొంచెం ఎక్కువ. మహిళల సగటు జీవన కాలం 70 ఏళ్లు, మగవారి సగటు జీవన కాలం 67గా అంచనా. అంటే రిటైర్ అయిన తర్వాత మహిళలకు ఎక్కువ కాలం పాటు జీవన అవసరాలు ఉంటాయి. దాంతో వారికి అధిక నిధులు అవసరం అవుతాయి. కొందరు ఇంకా దీర్ఘకాలం పాటు జీవించొచ్చు. అప్పుడు ఆ అవసరాలు ఇంకా ఎక్కువ అవుతాయి. వైద్య సంరక్షణ ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితుల్లో నిధుల అవసరం ఎంతో ఉంటుంది. మరింత పొదుపు చేయాల్సిందే.. మహిళలు మగవారితో పోలిస్తే కనీసం రెట్టింపు పొదుపు చేయాలి. విశ్రాంత జీవనం కోసం వేతనంలో 10 శాతానికి బదులు 20– 25 శాతం వరకూ ఇన్వెస్ట్ చేయాలనేది ఫైనాన్షియల్ ప్లానర్ పంకజ్ మాల్దే సూచన. ఒకవేళ ఉద్యోగం వచ్చిన కొత్తలో అవసరాలకు అధికంగా ఖర్చవుతూ పొదుపు చేయలేకపోతుంటే బ్యాంకు ఖాతా నుంచి పెట్టుబడులకు వెళ్లేలా ఈసీఎస్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అలాగే, ప్రావిడెంట్ ఫండ్‌లో మరింత ఇన్వెస్ట్ చేయాలి. ఇందుకోసం వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌ను ఎంచుకోవచ్చు. అంటే ఉద్యోగి తన ఈపీఎఫ్ వాటాకు సొంతంగా మరికొంత జోడించడం. దీనివల్ల మీ వేతనం నుంచి ఆటోమేటిగ్గా భవిష్యనిధికి జమ అవుతుంది. దీనిపై ఈపీఎఫ్‌కు సమానంగా వడ్డీ రేటు, పన్ను ప్రయోజనాలు లభించడం అదనపు ఆకర్షణ. మెరుగ్గా ఇన్వెస్ట్మెంట్... పొదుపు చేయడంతోనే ఆగిపోతే లాభం ఉండదు. తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. దీర్ఘకాల లక్ష్యాల కోసం డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం తక్కువ పొదుపు చేయడం కంటే ప్రమాదమన్నది ఆర్థిక సలహాదారుల మాట. తక్కువ భాగమే డెట్‌లో ఇన్వెస్ట్‌చేసి అధిక భాగాన్ని ఈక్విటీ లేదా బ్యాలన్స్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా, దీర్ఘకాలంలో డెట్ కంటే అధిక రాబడులను పొందొచ్చు. ఇంకో విషయం మీ లక్ష్యానికి తగ్గట్టుగానే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. రిటైర్మెంట్కు ఎంత అవసరం అన్నది లెక్కవేసుకోవాలి. ద్రవ్యోల్బణం, పన్ను పరమైన అంశాల ప్రభావాన్ని విశ్లేషించిన తర్వాత ఆ మేరకు ఇన్వెస్ట్ చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి... ఇక రిటైర్మెంట్ నిధి కరిగిపోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ముఖ్యమైనది వైద్య బీమా పాలసీ ఒకటి. వైద్య ఖర్చుల విషయంలో ద్రవ్యోల్బణం 12–15 శాతంగా ఉంటోంది. వృద్ధాప్యంలో జీవనశైలి వ్యాధుల ముప్పు పెరిగిపోతోంది. అందుకని పెద్ద వయసులో వైద్య ఖర్చులు చాలా ఎక్కువగా ఉండచ్చు. బీమా పాలసీ ఉంటే విశ్రాంత జీవన అవసరాల కోసం కష్టపడి కూడబెట్టిన నిధులు కరిగిపోకుండా ఉంటాయి. మెరుగైన వేతనం... ఇక ఉద్యోగంలో ఎదుగుదల చూసుకోవడం కూడా ముఖ్యమైన అంశాల్లో ఒకటి. అధిక వేతనం కోసం ఉద్యోగం మారడం, ఎదుగుదల లేని సంస్థను వీడటం ద్వారా అధిక ఆర్జనకు బాటలు వేసుకోవచ్చు. ఎక్కువ ఆర్జన ఉంటే పొదుపు, మదుపులకు ఎక్కువ కేటాయించుకోవచ్చు. ఇక రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత కూడా ఏదో ఒక ఉద్యోగంలో కొనసాగడం అవసరమవుతుంది ఈ రోజుల్లో. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత కనీసం 15–20 ఏళ్ల పాటు జీవన కాలం ఉంటోంది. -
ఇలా చేస్తే మీ పొదుపు పండినట్టే
ఎంత సంపాదించినా పొదుపు తెలియకపోతే నెల చివరికొచ్చేసరికి రూపాయి కనిపించదు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత పొదుపు, మదుపు చేశామన్నదే వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలో కీలకం. ఖర్చులను నియంత్రించుకుని, తగినంత ఇన్వెస్ట్ చేయడం ద్వారానే అన్ని ఆర్థిక పరమైన లక్ష్యాలను చేరడం సాధ్యపడుతుంది. అందుకు ఏం చేయాలన్నది నిపుణుల సూచనల ఆధారంగా తెలియజేస్తున్న కథనం ఇది. క్రమం తప్పకుండా పొదుపు చేయడం ద్వారానే ఆర్థిక భద్రత సమకూరుతుందని చాలా మందికి తెలిసిన విషయమే. అయినా, మనలో చాలా మంది అవసరమైనంత పొదుపు చేయరు. కొందరికి అవసరమైనంత మిగులు ఉండదు. కొందరు పొదుపు వాయిదా వేస్తుంటారు. భవిష్యత్తు సంగతి తర్వాత, ముందు ఈ రోజు గడిస్తే చాలనుకుంటారు. పనుల్లో ఆలస్యం జరగకూడదన్న సంకల్పంతో తమ గడియారాన్ని 10–15 నిమిషాలు అధికంగా సెట్ చేసే వారున్నారు. దాంతో నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేయగలమని, సమయ పాలన పాటించొచ్చని భావిస్తారు. గడియారం 10 నిమిషాలు వేగంగా నడుస్తుందని వారికి తెలుసు. కాకపోతే క్రమశిక్షణ కోసం వారు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ తరహా విధానాలు పొదుపు, మదుపులకు కూడా అవసరం. ఇక్కడున్నవి అటువంటివే. ఎంత సంపాదించినా పొదుపు చేయలేని వారికి ఇవి సాయంగా ఉంటాయి. వేతన పెంపు ఏటా వేతనం పెరుగుతూ ఉంటుంది. పెరిగే వేతనానికి అనుగుణంగా ఖర్చులు, వ్యయాల్లోనూ పెరుగుదల ఉంటుంది. అయితే, ఎంతో కొంత మిగులు ఉంటుంది. దాన్ని సైతం ఖర్చు చేసేయకుండా పెట్టుబడులకు మళ్లించాలి. వేతనం పెరిగిన నెల నుంచే ఆటోమేటిగ్గా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్ అయ్యేలా సెట్ చేసుకోవాలి. మీరు ఖర్చు చేసేందుకు చాన్స్ తీసుకునే అవకాశం లేకుండా ముందే పెట్టుబడులకు వెళతాయి. పెరిగే వేతనానికి తగ్గట్టుగా మ్యూచువల్ ఫండ్ సిప్ లేదా రికరింగ్ డిపాజిట్‌ను ఎంచుకోవాలి. వార్షికంగా వచ్చే బోనస్‌కు సైతం ఇదే సూత్రం వర్తిస్తుంది. బోనస్‌ను లంప్సమ్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వేర్వేరు ఖాతాలు బ్యాంకు ఖాతాలు అధిక సంఖ్యలో ఉన్నా గందరగోళంగా ఉంటుంది. పొదుపు, పెట్టుబడులకు ఓ బ్యాంకు ఖాతాను ప్రత్యేకించడం మంచిది. అయితే, పెట్టుబడుల ఖాతాకు డెబిట్ కార్డును తీసుకోవద్దు. ఇక్కడ ఓ ఉదాహరణ చూస్తే రఘురామ్ తన ఆదాయాన్ని నెలవారీ తప్పనిసరి ఖర్చులు (రుణ వాయిదా తదితర), కిరాణ, ఇంటి వ్యయాల కోసం, పొదుపు, మదుపుల కోసం అంటూ మూడు భాగాలు చేయడం అలవాటు. దీంతో ఒక నెలలో ఖర్చులు ఎన్ని ఎదురైనా గానీ, అతడి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఆగడం లేదు. ఈ తరహా స్ట్రాటజీలను అనుసరించేవారు ఎందరో ఉన్నారు. ఇలా చేయడం సరికాదు అభినవ్ మిశ్రా ఏటా పన్ను ఆదా కోసం తన పెట్టుబడుల వివరాలను కంపెనీకి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఇచ్చే అలవాటు లేదు. దాంతో కంపెనీ అతడి వార్షికాదాయం ప్రకారం టీడీఎస్‌ను నెలవారీ అమలు చేస్తోంది. నిజానికి మిశ్రా సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలను ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇంటి అద్దె కూడా భారీగానే చెల్లిస్తున్నాడు. అయితే, ఈ వివరాలను డిసెంబర్ నెలలోనే కంపెనీకి సమర్పిస్తున్నాడు. దీంతో కంపెనీ తర్వాతి మూడు నెలలు (జనవరి–మార్చి) టీడీఎస్ అమలు చేయడం లేదు. దాంతో మిశ్రా చేతికి ఏటా చివరి మూడు నెలలు పూర్తి వేతనం అందుతోంది. కానీ, ఈ విధమైన విధానం సరికాదంటున్నారు నిపుణులు. అంచనాలు తప్పితే మరింత పన్ను చెల్లించాల్సి వస్తుంది. మరో కోణంలో టీడీఎస్ వెనక్కి వచ్చేందుకు నెలల సమయం పడుతుంది. పైగా టీడీఎస్ రిఫండ్ అంతా ఒకేసారి వచ్చి పడుతుంది. మరోవైపు జనవరి నుంచి మార్చి వరకు పూర్తి వేతనం వస్తుంది. ఈ అధికంగా వచ్చే నిధుల్ని అర్థవంతంగా ఇన్వెస్ట్ చేసినప్పుడే ప్రయోజనం నెరవేరుతుంది. లేక ఆ మొత్తం ఖర్చులకు వెళ్లిపోతే నష్టపోయినట్టే. లగ్జరీకి పోతున్నారా...? ప్రతీ ఒక్కరికీ లైఫ్‌స్టయిల్ కోరికలు ఉండడం సహజంగా మారింది. హాలిడేటూర్కు వెళ్లాలని, బయట డిన్నర్ చేయాలని, స్టయిల్‌గా ఉండే డ్రెస్ తీసుకోవాలి, మంచి ఫీచర్లతో కూడిన సెల్‌ఫోన్ చేతిలో ఉండాలని ఇలాంటి కోరికలు ఎన్నో ఉంటుంటాయి. అయితే, వీటిని త్యాగం చేయాలని చెప్పడంలేదు. కానీ, వీటిని కొనుగోలు చేసేవారు అదేసమయంలో అంతే మొత్తం నగదును పెట్టుబడిగా పెట్టడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. రెండు ఖర్చులకు తగ్గ స్థాయిలో ఆదా చేయగలగడం. ఈఎంఐ మంచిదే! పొదుపు చేయలేకపోతున్నవారు పర్సనల్ లోన్ తీసుకుని ప్రతీ నెలా ఈఎంఐని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిగ్గా చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. రెండు, మూడేళ్ల పాటు ప్రతీ నెలా ఈఎంఐ రూపంలో వేతనం నుంచి రుణం చెల్లించడం చేస్తారు. దీనివల్ల పొదుపు అలవడినట్టే. అయితే, రుణం తీరిన తర్వాత కూడా ఈఎంఐ ఎంత అయితే చెల్లించారో అంతే మొత్తాన్ని పెట్టుబడులకు ఆటోమేటిగ్గా వెళ్లేలా సెట్ చేసుకోవాలి. దీనివల్ల పొదుపు అలవడుతుంది. అప్పటి వరకు ఈఎంఐగా చెల్లించి ఉంటారు కనుక ఆ తర్వాత అంతే మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం భారంగా అనిపించదు. పర్సనల్ లోన్ కింద తీసుకున్న మొత్తాన్ని అధిక రాబడులను ఇచ్చే డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వడ్డీ స్థాయిలో రాబడులను అందుకోవచ్చు. సాయం తీసుకోండి... మీకు అత్యంత సన్నిహితులను మీ పొదుపు, మదుపులను పరిశీలించేందుకు అనుమతించొచ్చు. ఆర్థిక విషయాలపై పట్టు సాధించలేని పరిస్థితుల్లో వారి సాయం పొందడంలో తప్పులేదు. వారు మీ ఖర్చులు, పొదుపులపు పరిశీలించి ట్రాక్‌లోనే ఉన్నదీ, లేనిదీ చూస్తారు. ట్రాక్ తప్పితే అప్రమత్తం చేస్తారు. ఇక మీకు సన్నిహితులైన వారితో కలసి ఆర్థిక విషయాల్లో, ప్రణాళిక, పెట్టుబడుల్లో పోటీ వాతావరణం ఉండేలా చూసుకోవడం కూడా తెలివైన యోచనే. ఖర్చుకు ముందు ఒక్క నిమిషం ప్రతీ ఖర్చు కూడా మీ బడ్జెట్‌కు చిల్లు పెట్టేదే. అందుకే కొనుగోలుకు ముందు కాస్తంత సమయం ఇవ్వడం (తాత్కాలికంగా ఆగడం) ద్వారా అది నిజంగా అవసరమా, లేక కోరికా అన్నది తేల్చుకునేందుకు అవకాశం లభిస్తుంది. నిజంగా అవసరమే అయితే కొనుగోలుకు ముందుకు వెళ్లొచ్చు. లాక్ చేయడం దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే కోరుకున్నప్పుడు వెనక్కి తీసుకోలేం. ఇది ఒకింత ఇబ్బందే. అయితే, దీనిలో ప్రయోజనమూ ఉంది. ఇలా అయినా దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేస్తారు. పీపీఎఫ్ 15 ఏళ్ల కాల వ్యవధితో కూడినది. అయితే, ఐదేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణకు వీలు కల్పిస్తుంది. ఎన్పీఎస్ రిటైర్మెంట్కు ముందు విత్‌డ్రా చేసుకోవడానికి లేదు. అయితే, ఈ మధ్య కొన్ని ప్రత్యేక అవసరాల్లో విత్‌డ్రాకు వీలు కల్పిస్తామని ఎన్పీఎస్ ప్రకటించింది. బీమా పాలసీలు అయితే 15–30 ఏళ్ల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రీమియం చెల్లించకపోతే ల్యాప్స్ అయిపోతుందని, సరెండర్ చేస్తే తక్కువగా రావడం వల్ల నష్టపోవాల్సి ఉంటుందన్న భయంతో కచ్చితంగా పాలసీని నిర్ణీత కాలం వరకు కొనసాగిస్తారు. భవిష్యత్తుపై స్పష్టత 20–30 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి రిటైర్మెంట్ పెద్ద ప్రాముఖ్యం అనిపించకపోవచ్చు. అలా అని రిటైర్మెంట్కు ఇన్వెస్ట్‌మెంట్‌ను ఆలస్యం చేయడం సరికాదు. ఎందుకంటే చిన్న వయసులో పెట్టుబడి ప్రారంభించడం వల్ల కాంపౌండింగ్ ప్రయో జనంతో దీర్ఘకాలంలో భారీ నిధి సమకూరుతుంది. అందుకని మీ లక్ష్యాలు, వాటి ప్రాధాన్యతలు, మీ ఆదాయం, అవసరాలకు అనుగుణంగా తగిన ప్రణాళికను రూపొందించుకోవడం అవసరం. ప్రతీ లక్ష్యానికి ఎంత వ్యవధి ఉంది, ఎంత మొత్తం సమకూరాలి, అందుకు ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఏ సాధనంలో అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే నిపుణుల సాయం తీసుకునేందుకు వెనుకాడరాదు. -
ఆదాయ పన్ను రద్దు చేయండి!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మరోసారి తనదైన శైలిలోవ్యాఖ్యలు చేశారు. ఆదాయపు పన్నును రద్దు చేయాలని పిలుపునిచ్చారు. దీని వలన ఎక్కువ మంది పొదుపు చేయడానికి వీలవుతుందని, తద్వారా పెట్టుబడుల పెరుగుదలకు దారితీస్తుందన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో ఇండియన్ ఎగ్జిబిషన్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఫ్యూచర్ అఫ్ ఇండియా ఇన్ ఎమర్జింగ్ వరల్డ్ 8వ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగం, పేదరికం సమస్యల పరిష్కారానికి దేశం 10 ఏళ్లలో 10 శాతం వృద్ధిరేటు సాధించాలని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు, స్టార్టప్ కంపెనీలు అధిక పన్ను భారాన్ని మోస్తున్నారన్నారు. చాలా తక్కువమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారు. ఇది కూడా వేధింపులతో సమానమన్నారు. మధ్య తరగతిపై భారాన్ని తగ్గించేందుకు, వ్యక్తిగత ఆదాయపన్నును రద్దు చేయాలని సూచించారు. అందువల్ల ప్రజల్లో పొదుపు సామర్ధ్యం పెరుగుతుందని, పెట్టుబడులు పుంజుకుంటాయన్నారు. -
పొదుపు పథకాలు.. భవిష్యత్తుకు భరోసా
పశ్చిమగోదావరి, నిడమర్రు: ఆర్జించిన నగదుపై రాబడి వచ్చే ఇతర పెట్టుబడి మార్గాల్లో దాచుకోవడంతో భవిష్య నిధిపై భరోసా ఉంటుంది. ఆర్థికపరంగా ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా పెట్టుబడికి హామీతో నిర్ధిష్టమైన రాబడి ఇచ్చే పొదుపు మార్గం బ్యాంక్/పోస్టాఫీస్ డిపాజిట్లు. డిపాజిట్ రూపంలో పెట్టిన పెట్టుబడికి లభించే వడ్డీ తక్కువగా ఉన్నా పెట్టుబడి పరంగా ఎటువంటి రిస్క్లేదు. బ్యాంకుల్లో అందుబాటులో ఉండే డిపాజిట్లు రకాలు, వాటి వల్ల ప్రయోజనాలు, ఏది మీకు అనుకూలం తదితర సమాచారం తెలుసుకుందాం.. బ్యాంకు డిపాజిట్లు రెండురకాలు అవి ఫిక్స్డ్ ♦ డిపాజిట్లు (ఎఫ్డీ), రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) రూపంలో నగదును పెట్టుబడిగా పెట్టవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్లు ఒక నిర్ణీత మొత్తాన్ని ఒక నిర్ణీత కాలానికి పొదుపుచేస్తే అటువంటి జమ (డిపాజిట్)అని ఫిక్స్డ్ డిపాజిట్లు అంటారు. ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకుల్లో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. కాలాన్ని బట్టి, జమ చేసే మొత్తాన్ని బట్టి మరియు బ్యాంకుల బట్టి వడ్డీ శాతం మారుతుంది. సాధారణంగా వృద్ధులకు సీనియర్ సిటిజన్స్ (60 ఏళ్ల వయసు పైబడినవారు) వడ్డీ 0.25 శాతం నుంచి 1.0 శాతం ఎక్కువగా ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లను పిల్లల (మైనర్స్) పేరు కూడా తెరవవచ్చు. 5 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువకాలానికి జమ చేసే టర్మ్ డిపాజిట్లపై ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద రూ1.5 లక్షల వరకూ ఆదాయంపై పన్ను ఉండదు. వీటిపై వచ్చే వడ్డీ సంవత్సరానికి రూ.10 వేలు వరకు పన్ను ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్లు రెండు రకాలు ఒకటి టర్మ్ డిపాజిట్లు, రెండోది స్ఫెషల్ డిపాజిట్లుగా ఉంటాయి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఖాతాదారుని పొదుపు ఖాతాలో జమచేస్తారు. స్పెషల్ టర్మ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ మళ్లీ అదే డిపాజిట్ ఖాతాకు జమ అవుతుంది. అందువల్ల ఖాతాదారునికి వడ్డీ మీద వడ్డీ వస్తుంది. నిర్ణీత కాలానికి ముందుగా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరిస్తే తక్కువ వడ్డీ రావడంతోపాటు కొంత మొత్తాన్ని అపరాధ రుసుం (పెనాల్టీ) రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఇవీ సౌకర్యాలు ♦ పౌరులు/ ఏకైక యాజమాన్యం కల సంస్థలు/ప్రవేట్ మరియు ప్రభుత్వ కంపెనీలు/ హిందూ అవిభక్త కుటుంబాలు / ట్రస్టులు / సంఘాలు / క్లబ్‌లు/ సమితులు /భారతదేశంలో నివసించే విదేశీయులు ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ పథకాలకు అర్హులు ♦ ఖాతాదారుల సౌకర్యార్థం వివిధ బ్యాంకులు టాక్స్ సేవింగ్ డిపాజిట్లను కల్పిస్తున్నాయి ♦ ఎస్బీఐ / ఆంధ్రా బ్యాంక్/ఇతర ప్రైవేట్ బ్యాంకులు తమ ఖాతాదారులకు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతా తెరిచే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) నెలనెలా క్రమం తప్పకుండా కనీస మొత్తాన్ని పొదుపు చేసుకుని దానిపై వడ్డీకూడా పొందేదుకు వీలైంది. ఈ డిపాజిట్ ఖాతా ఇది. ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అన్ని బ్యాంకులు/ పోస్టాఫీసులు అందిస్తున్నాయి. పోస్టాఫీసు కంటే బ్యాంకుల్లో ఆర్డీ ఖాతాలే అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లపై చెల్లించే వడ్డీ ఆర్డీకి కూడా వర్తిస్తుంది. ఐదేళ్లకు ఆర్డీ ఓపెన్ చేస్తే డిపాజిట్లపై ఐదేళ్ల కాలానికి బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేటే ఆర్డీ ఖాతాకు వర్తిస్తుంది. ఇలా అతి తక్కువ రిస్క్ కలిగి ఉండి తమకు వచ్చే సంపాదనలో కొంత మొత్తాన్ని భవిష్యత్తులో అవసరాలకు సమకూర్చుకోవడానికి ఈ ఆర్డీ పథకాలు చాలా బాగా ఉపయోగపడతాయి ఆర్డీ సౌకర్యాలు ♦ కనీసం రూ.100 రూపాయల మొత్తం నుంచి నెల నెలా ఆర్డీలో పొదుపు చేసుకోవచ్చు. ♦ కనీస మొత్తం బ్యాంకులను బట్టి మారుతుంది. ఆరు నెలల నుంచి పదేళ్ల వరకు ఎంపిక చేసుకోవచ్చు. ♦ సాధారణంగా బ్యాంకులు 7 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీని అందజేస్తున్నాయి. ♦ సీనియర్ సిటిజన్స్‌కు వడ్డీ 0.5 శాతం అదనంగా లభిస్తుంది. ♦ రికరింగ్ డిపాజిట్ చేసిన మొత్తంలో తిరిగి 80 నుంచి 90 శాతం వరకూ రుణం పొందవచ్చు. ♦ రికరింగ్ డిపాజిట్లో ఉన్న మొత్తానికి ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ లెక్కగడతారు. ♦ బ్యాంకులు ఖాతాదారుల సేవింగ్స్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా వారి రికరింగ్ ఖాతాకు ప్రతి నెల రికరింగ్ డిపాజిట్ మొత్తాన్ని బదిలీ చేసే సౌకర్యం కల్పిస్తారు. -
పొదుపు కొంచెం– నిధి ఘనం
కొన్ని చుక్కల నీరు కలిస్తేనే ఒక బిందెడు అవుతాయి. కొన్ని బిందెలు కలిస్తేనే కోనేరు నీళ్లవుతాయి. కొన్ని కోనేర్లు కలిస్తే నదిని మరిపిస్తాయి. ఇదంతా ఎందుకంటే... పెద్ద నిధి సమకూరటానికి కావాల్సింది చిల్లర మొత్తాలే. చిన్నచిన్న పొదుపులే. ఎందుకంటే చాలామంది నెలవారీ సంపాదనలో మిగిలేది కొంచెమే కదా అని దాన్ని పొదుపు చేయటానికి వెనకాడతారు. అసలు వాటిని పెట్టుబడుల్లోకి మళ్లించటం గురించి ఆలోచించనే ఆలోచించరు. కానీ, ఆ కొద్ది మొత్తాలు కలిపితేనే పెద్ద నిధి అవుతుందన్న ఆలోచన ఎంత మందికి వస్తుంది? బడ్జెట్ చిన్నదే అయినా... క్రమశిక్షణతో ఇన్వెస్ట్ చేస్తే చక్కని కార్పస్‌ను సమకూర్చుకోవచ్చనేది నిపుణుల సూచన. జీవితంలో కీలక లక్ష్యాలను సాకారం చేసుకుని, విజయ తీరాలకు చేరుకోవాలంటే అందుకు డబ్బే ప్రధానంగా కావాలి. ఈ నేపథ్యంలో లక్ష్యాలు సాధించడానికి కావాల్సిన నిధిని సమకూర్చుకునేందుకు వీలైనంత పొదుపు చేయటం తప్పనిసరి. మిగిలేది కొంతే అయినా, బడ్జెట్ చిన్నదే అయినా పొదుపు, పెట్టుబడుల విషయంలో తీసుకోవాల్సిన, అనుసరించాల్సిన వ్యూహాలేంటనేవి తెలియజేసేదే ఈ కథనం... ఉన్నదాంతోనే తొలి అడుగు.. ‘‘లక్ష్యాలను ప్రాధాన్యం మేరకు నిర్ణయించుకుని, అనవసర ఖర్చులకు కళ్లెం వేసుకోవాలి. కొన్ని లక్ష్యాలు మరీ గాల్లో మేడలు కట్టేలా ఉండకూడదు. విచక్షణా రహిత ఖర్చులను తగ్గించుకోవాలి’’ అనేది ‘లాడర్ 7 ఫైనాన్షియల్ సర్వీసెస్’ వ్యవస్థాపకుడు సురేశ్ సెడగోపన్ సూచన. ఉదాహరణకు చిన్న వయసులోనే ఇంటిని కొనుగోలు చేస్తే ఇతర కీలక లక్ష్యాల కోసం మదుపు చేసేందుకు ఇన్వెస్టర్ల వద్ద మిగిలేదేమీ ఉండదు. కనుక కొన్నాళ్లు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకుని అద్దె ఇంట్లో ఉండడం తెలివైన నిర్ణయం అవుతుంది. పెట్టుబడులను చిన్న వయసులోనే మొదలు పెట్టడం అన్నది లక్ష్య సాధనకు తోడ్పడుతుందంటున్నారు నిపుణులు. ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది కూడా కీలకమే. ఉదాహరణకు మీ పిల్లల ఉన్నత విద్య కోసం ఓ పెద్ద నిధిని 15 ఏళ్లలో సాధించాలన్న లక్ష్యంతో ఉన్నారనుకోండి. ప్రస్తుతం రూ.14 లక్షలు ఉండే కోర్స్‌ను 15 ఏళ్ల తర్వాత చెప్పించాలనుకుంటే అప్పటికి విద్యా ద్రవ్యోల్బణాన్ని కూడా కలుపుకుంటే దాదాపు రూ.33.55 లక్షలు అవసరం అవుతుంది. మరి ఈ లెక్కన 15 ఏళ్ల తర్వాత మీ లక్ష్యానికి అవసరమైన నిధి సమకూర్చుకునేందుకు వార్షికంగా కనీసం 12 శాతం రాబడులను ఇచ్చే సాధనంలో ప్రతి నెలా రూ.7,500 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. ప్రారంభంలో ఇంత మొత్తం పెట్టుబడులు కేటాయించడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. పెట్టుబడికి కొద్ది మొత్తమే ఉండొచ్చు. అయినా ఫర్వాలేదు. రూ.7,500తోనే పెట్టుబడులు ప్రారంభించాలన్న కఠిన సూత్రమేమీ లేదు. మీ దగ్గర ఉన్నంత, సాధ్యమైనంత మేర పొదుపు చేస్తూ వెళ్లడం ద్వారా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు. వీలైనప్పుడు అదనపు పెట్టుబడులు ప్రారంభంలో కాకపోతే ఆ తర్వాత అయినా పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, ఆర్జన మెరుగైనప్పుడు ఒకేసారిగా లేదా క్రమానుగతంగా పెట్టుబడులను పెంచుకోవాలి. ఆదాయ వృద్ధి అనేది ఎప్పుడూ ఒకే స్థాయిలో ఉండకపోవచ్చు. ఏటేటా ఇందులో మార్పు ఉండొచ్చు. అయినప్పటికీ దానికి అనుగుణంగా పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లాలి. ఏ దశలోనూ లక్ష్యం కోసం చేస్తున్న పెట్టుబడుల పట్ల కట్టుబాటు విడవకూడదు. క్రమశిక్షణ ముఖ్యం. పెట్టుబడులను కొనసాగిస్తూ, వీలున్నప్పుడల్లా వాటిని పెంచుకుంటూ పోవడం క్లిష్టమైనదే అయినా దాన్ని అనుసరించేందుకే ప్రయత్నించాలి. నిర్ణీత లక్ష్యం సమీపించిన సమయానికి అవసరానికంటే తక్కువ నిధి సమకూరినా ఫర్వాలేదు. ఎందుకంటే కొద్ది మొత్తమే ఉంది కదా అనుకుని పెట్టుబడులు పెట్టకుండా ఉండడం, వాయిదా వేయడం కంటే ఉన్నంత ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లిన వారే మెరుగైన స్థితిలో ఉంటారు. ఉదాహరణకు 15 ఏళ్ల కాలానికి రూ.33.55 లక్షల కోసం ప్రతీ నెలా రూ.7,500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటే, ఓ ఐదేళ్లు జాప్యం చేశారనుకోండి. అప్పుడు మిగిలిన పదేళ్లలోనే ఆ నిధి సమకూరేందుకు వీలుగా ప్రతీ నెలా ఇన్వెస్ట్ చేయాల్సిన మొత్తం రూ.15,993కు పెరిగిపోతుంది. ‘‘ఏ లక్ష్యం కోసమైనా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనసులో దాన్ని కష్టమైనదన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఇది ఎక్కువ సందర్భాల్లో తగినంత కార్పస్‌ను సమకూర్చుకోకుండా అడ్డుపడుతుంది’’ అని సెడగోపన్ వ్యాఖ్యానించారు. పన్ను ఆదా కోణంలో కాదు... తక్కువ ఆదాయం కలిగిన వారు పన్ను ఆదా కోణంలో మాత్రమే ఇన్వెస్ట్ చేయకూడదన్నది నిపుణుల సూచన. పన్ను ఆదా కోణంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల సరైన సాధనాలను ఎంచుకోలేరని ఫిన్‌కార్ట్ ఎండీ తన్వీర్ ఆలమ్ అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు పన్ను ఆదా చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ (ఈఎల్ఎస్ఎస్) దీర్ఘకాలంలో సంపద సృష్టికి మంచి ఆప్షన్. కానీ చాలా మంది ఇన్వెస్టర్లు దీర్ఘకాలం పాటు పెట్టుబడులను కొనసాగించరు. పన్ను ఆదా ఈక్విటీ పథకాల్లో మూడేళ్ల లాకిన్ పీరియడ్ అయిపోగానే పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటుంటారు. దీని వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం కోల్పోతారు. దీర్ఘకాలం పాటు కొనసాగిస్తేనే సానుకూల రాబడులకు అవకాశం ఉంటుంది. చిన్న ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ ఫండ్స్ సిప్ మార్గం మెరుగైనది. ఇవి కనీసం రూ.500 నుంచి కూడా సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇలా ఇన్వెస్ట్ చేస్తూ స్టెప్ అప్ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. దీనివల్ల నిర్ణీత కాలానికోసారి పెట్టుబడుల మొత్తం పెరుగుతుంటుంది. అలాగే, మ్యూచువల్ ఫండ్స్‌లో డైరెక్ట్ ప్లాన్‌ను ఎంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో రాబడులు అధికంగా పొందొచ్చు. కాకపోతే డైరెక్ట్ ప్లాన్లు అనేవి ఇన్వెస్టర్లు సొంతంగా ఎంచుకునేవి. కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. రెగ్యులర్ ప్లాన్లతో పోలిస్తే డైరెక్ట్ ప్లాన్లలో ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉండడం వల్ల దీర్ఘకాలంలో పెద్ద మొత్తం సమకూరుతుంది. -
పొదుపు పెంచితే.. గెలుపు తథ్యం!
అసలు జీవితంలో కీలకమైన లక్ష్యాలేంటి? పెళ్లికాని యువతకైతే ఉద్యోగం. పెళ్లయిన వారికైతే... పిల్లల చదువు, సొంతిల్లు, విశ్రాంత జీవనాన్ని సాఫీగా గడపటం!!. పొదుపు, మదుపు ఏం చేసినా వీటి కోసమే. కానీ ఈ పొదుపు, మదుపుల విషయంలో స్మార్ట్‌గా ఉంటేనే అనుకున్నవి సాఫీగా నెరవేరతాయి. మీ పిల్లల కాలేజీ విద్య కోసం అవసరమైన రూ.కోటి నిధిని సమకూర్చుకునేందుకు ఇప్పటి నుంచి ప్రతి నెలా రూ.50,000 చొప్పున రానున్న పదేళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నారనుకోండి. అప్పుడు మీ పెట్టుబడులపై వార్షిక రాబడులు కనీసం 9.5 శాతం మేర ఉండాలి. అప్పుడే రూ.కోటి నిధి సమకూరుతుంది. అయితే ఇక్కడో చిక్కుంది. వడ్డీ మనం అనుకున్నంత రాకపోవచ్చు. ఒకోసారి అనుకున్న నిధికన్నా ఎక్కువ అవసరం పడొచ్చు. మరి అలాంటపుడు ఏం చేయాలి? దానికో మంత్రముంది. అది... ప్రతి నెలా రూ.50,000 పొదుపు చేస్తూ వెళ్లడమే కాక కొంత అదనంగా పొదుపు చేయడం. ఏటా పెట్టుబడుల మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాలి. దీనివల్ల మీ లక్ష్యాలను నెవవేర్చుకునే అవకాశాలు మరింత పటిష్టం అవుతాయి. ఈ విషయంలో ఏం చేయాలన్న దానిపై నిపుణుల అభిప్రాయాలను అందించేదే ఈ ప్రాఫిట్ కథనం. పొదుపు పెంచుకుంటూ వెళ్లాలి... ఇక్కడ పొదుపును పెంచడమనేది రెండు రిస్కులను తట్టుకోవడానికేనని గుర్తుంచుకోవాలి. ఆ రిస్కుల్లో మొదటిది... రాబడి మనం ఊహించినట్లుగా లేకపోవటం. రెండోది... ద్రవ్యోల్బణం పెరిగి ఖర్చు మనం అనుకున్న దానికన్నా ఎక్కువ పెట్టాల్సి రావటం. ఇక్కడ పిల్లల చదువుకు నిధిని సమకూర్చుకోవటం కూడా ఇలాంటిదే. అందుకే ఈ నిధి కోసం ప్రత్యామ్నాయ వనరులపైనా దృష్టి సారించాలి. తగినంత నిధి సమకూరని పక్షంలో విద్యారుణాలుండనే ఉన్నాయి. అయితే, తప్పనిసరి సందర్భాల్లోనే వాటిని వినియోగించుకోవాలి. అందుకే ఆయా ఆప్షన్లను అత్యవసరం కాని సందర్భాల్లో పక్కనబెట్టాలి. ఏటా పొదుపు మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లడానికి... వేతనం వార్షికంగా కొంత పెరుగుతుంది కనక ఆ భాగాన్ని ఉపయోగించుకోవాలి. ఏదైనా రుణం ఉంటే ఇతర లక్ష్యాలకు చేసే పొదుపు పరిమితమవుతుంది. రుణాలేవీ లేకుంటే మాత్రం పన్ను అనంతరం నెలవారీ ఆదాయంలో 30–40 శాతం వరకూ పొదుపు చేసే అవకాశముంటుంది. ఉదాహరణకు నెలకు రూ.1.5 లక్షల ఆదాయం వస్తుందనుకుంటే ప్రారంభంలో కనీసం 30 శాతం పొదుపు చేయగలరనుకోవాలి. అంటే రూ.45,000. మరుసటేడాది వేతనంలో పెంపు 10 శాతం ఉంటే నెలసరి వేతనం రూ.1.65 లక్షలవుతుంది. దాంతో నెలనెలా చేసే రూ.45,000 పొదుపునకు అదనంగా పెరిగిన రూ.15 వేల నుంచి 30 శాతాన్ని మళ్లించాలి. ఇలా ఏటా పెరిగే వేతనంలో ఈ స్థాయిలో మళ్లించుకుంటూ వెళితే నిర్ణీత కాలానికి భారీగా నిధి సమకూరుతుంది. అంతేకాదు, ఇలా చేయడం వల్ల మీ పోర్ట్ ఫోలియో రాబడుల పరంగా డౌన్‌సైడ్ రిస్క్ తగ్గుతుంది కూడా. ఎలాగంటే..? ఉదాహరణకు ఈక్విటీలకు 65 శాతం , బాండ్లకు 35% పొదుపు నిధుల్ని కేటాయించారనుకోండి. దీనిపై కనీస రాబడులు 9.5 శాతంగా ఉండాలన్నది మీ లక్ష్యం. ఒకవేళ రాబడులు తగ్గినప్పటికీ ఏటా పెట్టుబడులను పెంచుకుంటూ వెళ్లడం వల్ల లక్ష్యాలను విజయవంతంగా అధిగమించొచ్చు. ఫార్వర్డ్ సిప్ ఎంతో బెటర్... ఏటా ఏప్రిల్‌లో వేతన సవరణ ఉందనుకోండి. మే 5వ తేదీన వేతనం వస్తుందనుకుంటే, అందుకు ఒక నెల ముందే సిప్ ప్రణాళికను ఆరంభించాలి. ఏటా పెంచుకుంటూ వెళ్లే మొత్తాన్ని అప్పటి వరకు ఎంపిక చేసుకున్న సాధనాల్లోకే (మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ బ్యాంకు డిపాజిట్లు) వెళ్లాలి. ఇలా లక్ష్య సాధనకు గడువు దగ్గర పడే వరకూ ఈ వ్యూహాన్నే అనుసరించడం మంచిది. ఉదాహరణకు ఈక్విటీకి 75 శాతం, బాండ్లకు 35 శాతం కేటాయిస్తుంటే, ఏటా పెంచే పెట్టుబడుల మొత్తాన్ని ఈ రెండు సాధనాల్లోకి ఇదే నిష్పత్తిలో కేటాయించాలి. ఒకవేళ వేతన సవరణ జరగకపోయిన పక్షంలో... అవసరమనుకుంటే సిప్‌ను రద్దు చేసుకోవచ్చు. -
కొత్త సేవింగ్స్ బాండ్ స్కీము
న్యూఢిల్లీ: రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేంద్రం కొత్తగా 7.75% వడ్డీ రేటుతో కొత్త బాండ్ స్కీమును ప్రకటించింది. ఏడేళ్ల మెచ్యూరిటీ వ్యవధి ఉండే ఈ బాండ్లకు జనవరి 10 నుంచి సబ్స్క్రిప్షన్స్ ప్రారంభం కానున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గత 8 శాతం స్కీము స్థానంలో దీన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్సి గర్గ్ .. ‘ట్వీట్’ చేశారు. వడ్డీ రేటును తగ్గించడానికి ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఏ కారణం చూపకపోయినప్పటికీ.. ప్రస్తుతం ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్న దరిమిలా ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ స్కీములో వడ్డీని అర్ధ సంవత్సరానికోసారి లెక్కిస్తారు. దీంతో రూ.1,000 మేర ఇన్వెస్ట్ చేసిన పక్షంలో ఏడేళ్ల తర్వాత ఆ విలువ రూ.1,703గా ఉంటుంది. ఈ బాండ్లకు పన్నులు కూడా వర్తిస్తాయి. వీటిని సెకండరీ మార్కెట్లో ట్రేడింగ్ చేసుకోవడానికి వీలుండదని, అలాగే బ్యాంకులు.. ఇతరత్రా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకునే క్రమంలో తనఖా పెట్టడానికి కూడా ఈ బాండ్లు ఉపయోగపడవని కేంద్రం పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్లను పెట్టుబడులవైపు ప్రోత్సహించే లక్ష్యంలో 2003లో అప్పటి ప్రభుత్వం 8% వడ్డీ రేటుతో ఆరేళ్ల వ్యవధి ఉండే సేవింగ్స్ బాండ్స్ స్కీమును ప్రవేశపెట్టింది. -
పొదుపు బాండ్లపై తగ్గిన వడ్డీ!
న్యూఢిల్లీ: ఎనిమిది శాతంవడ్డీ లభించే ప్రభుత్వ (పన్ను పరిధిలోకి వచ్చే) పొదుపు బాండ్లు పొందేందుకు కాలపరిమితి ఈ నెల 2వ తేదీతో ముగిసిపోయిందని విచారపడే వారికిది కాస్తంత ఉపశమనం కలిగించే వార్తే. ఈ పొదుపు బాండ్లను కేంద్రం మరోసారి ఆవిష్కరిస్తోంది. అయితే ఈ బాండ్లపై వడ్డీ రేటును మాత్రం ఈ సారి 8 శాతం నుంచి 7.75 శాతానికి తగ్గిస్తోంది. ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. పోస్టాఫీసు పొదుపు పథకాల్లో ఇటీవల కేంద్రం వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో తాజా ప్రకటన వెలువడింది. అయితే 7.75 శాతంతో కూడిన పొదుపు బాండ్లు కూడా ఇతర స్థిర ఆదాయ ప్రొడక్టులతో పోల్చితే అధిక రాబడులనే అందిస్తాయి. ఆర్బీఐ బాండ్ల స్కీమ్ అని కూడా పేరున్న ఈ 8 శాతం సేవింగ్స్ బాండ్స్ స్కీమ్‌ను కేంద్రం 2003లో తీసుకువచ్చింది. ఆ ఏడాది ఏప్రిల్ 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభమైంది. బాండ్ కాలపరిమితి ఆరేళ్లు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. రిటైల్ ఇన్వెస్టర్లు ప్రత్యేకించి ప్రవాస భారతీయుల నుంచి పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అయితే ఇవి పన్ను రహిత బాండ్లు కాదు. వీటిపై వచ్చే వడ్డీకి ఆయా వర్గాల ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. -
మరోసారి పొదుపు పథకాల రేట్లకు కోత
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పీపీఎఫ్, ఎన్ఎస్సీ తదితర వాటిపై కేంద్రం మరోసారి వడ్డీ రేట్లు తగ్గించింది. 20 బేసిస్ పాయింట్లు (0.2 శాతం) తగ్గిస్తూ జనవరి– మార్చి త్రైమాసికానికి రేట్లను ఖరారుచేసింది. సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్రాలపైనా రేట్లు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన సీనియర్ సిజిటన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటులో మాత్రం మార్పు చేయలేదు. దీనిపై ప్రస్తుతమున్న 8.3% వడ్డీ రేటు కొనసాగుతుంది. అలాగే, సేవింగ్స్ డిపాజిట్పైనా 4% వడ్డీ రేటు కొనసాగుతుంది. మార్పుల తర్వాత పీపీఎఫ్, ఎన్ఎస్సీపై 7.6%, కిసాన్ వికాస్ పత్రపై 7.3%, సుకన్య సమృద్ధి యోజనపై 8.1% వడ్డీ రేట్లు అమలవుతాయి. ఏడాది నుంచి ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన టర్మ్ డిపాజిట్లపై 6.6–7.4% మధ్య వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన రికరింగ్ డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ అమలవుతుంది. -
చిన్నారులకు రూపాయి విద్య
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అనుకోవడం సహజం. ఈ దిశగా తమకు తెలిసిన వివిధ నైపుణ్యాలను వారు సందర్భానుసారం తమ చిన్నారులకు తెలియజేస్తూనే ఉంటారు. వీటిలో అత్యంత ముఖ్యమైంది నగదు వినియోగం గురించి. తమ అవసరాలను తాము తీర్చుకోగలిగే విధంగా వారిని బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులు ప్రతి ఒక్కరిపై ఉంటుంది. గతంలో పోలిస్తే నేడు కరెన్సీ వినియోగం బాగా తగ్గింది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ చెల్లింపుల దిశగా ప్రోత్సహించడం, టెక్నాలజీ ఇలా ఎన్నో అంశాలు ఇందుకు కారణాలు చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో డబ్బులు ఎలా, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వినియోగం అవుతున్నాయి తదితర విషయాలు పిల్లలకు ఎలా తెలుస్తాయి? అది తల్లిదండ్రులే నేర్పించాలి. అందుకే అది ముందే మొదలు పెట్టడం మంచిది. పిల్లలకు ఎన్నో చెప్పాలని అనుకుంటూంటారు. కానీ వాయిదా వేయడం చాలా మంది చేస్తుంటారు. ఈ అలవాటును పక్కన పెట్టేసి ముందు పిల్లలకు డబ్బులు లెక్క పెట్టడం నేర్పించాలి. ఒకే విలువ కలిగిన కాయిన్లన్నీ ఒక దగ్గర పేర్చమని చెప్పడం, వాటి విలువ ఎలా లెక్కించాలన్నది తెలియజేయడం వంటి చిన్న చిన్న పనులతో నేర్పడం ప్రారంభించాలి. అంతేకానీ, క్రెడిట్ కార్డు, క్రెడిట్ స్కోరుతో మొదలు పెడితే ఏమంత ప్రయోజనం ఉండదు. కష్టమైన విధానంలో కాకుండా వారు ఆసక్తితో తెలుసుకునే సులభమైన విధానంలో నేర్పించాలి. పొదుపు మంత్రం చిన్నారులకు ముందుగానే పొదుపు నేర్పాలనుకుంటే వారికి ఓ పిగ్గీ బ్యాంకు కొనివ్వాలి. వివిధ సందర్భాల్లో వారు చేసే మంచి పనులకు ప్రోత్సాహకంగా కొంత నగదు ఇస్తూ దాన్ని పిగ్గీ బ్యాంకులో వేసుకునేలా ప్రోత్సహించాలి. ఆటబొమ్మలు, పుస్తకాలను పద్ధతిగా షెల్ఫ్‌లో ఉంచినప్పుడు, చెప్పిన పని చేసినప్పుడు తదితర సందర్భాలను ప్రోత్సాహకాలకు అనువుగా ఉపయోగించుకోవాలి. వారు మరింత అర్థం చేసుకునే వయసుకు వచ్చిన తర్వాత సుమారు 8 ఏళ్ల వయసులో వారి పేరిట బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తెరవడం మంచి చర్య అవుతుంది. ఖాతా తమ పేరుతో ఉంటే వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. పొదుపు, బాధ్యత తెలిసొస్తుంది. బ్యాంకింగ్ వ్యవహారాల గురించి కూడా అవగాహన ఏర్పడుతుంది. బంధువులు, పిన్ని, బాబాయి, బామ్మ, అమ్మమ్మ, తాతయ్యలు ప్రేమతో ఇచ్చిన ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని తెలియజేయాలి. దాన్ని పొదుపు చేసుకునేలా ప్రోత్సహించాలి. వినని సందర్భాల్లో కనీసం అందులో కొంత భాగం ఖర్చు చేయగా మిగిలిన మేరకైనా పొదుపు చేసే విధంగా వారికి మీ చర్యలతో ఆకర్షణీయంగా తెలియజేయాలి. ఏటీఎంకు వెళుతుంటే వారిని వెంట తీసుకెళ్లడం, లావాదేవీలు చేసే సమయంలో వాటి గురించి తెలియజేయడం, షాపింగ్‌కు వెళుతున్నప్పుడు వారిని కూడా తీసుకెళ్లి డబ్బులు చెల్లిస్తేనే అవి వస్తాయంటూ డబ్బు విలువ గురించి చెప్పాలి. అయితే, ఏటీఎంలో కార్డు పెట్టేసి పిన్ ఇచ్చేస్తే డబ్బుల నోట్లు వస్తాయని కాకుండా, అసలు ఆ డబ్బులు ఎక్కడి నుంచి మీ వరకు వచ్చాయో వివరించాలి. కష్టపడి ప్రతి రోజు ఉద్యోగం చేయడం ద్వారా వచ్చాయని చెప్పాలి. దీంతో డబ్బులున్నవి మెషిన్ల నుంచి వచ్చేవి కావని, మంచిగా చదివి గొప్ప స్థాయికి చేరుకుంటే వచ్చేవన్న అవగాహన వారిలో కలుగుతుంది. దీంతో డబ్బు విలువ, పొదుపు విలువ కూడా తెలిసివస్తుంది. నేటితరం పిల్లలు ఆర్థిక అంశాలపైనా ఎన్నో ప్రశ్నలు సంధిస్తున్నారు. టీవీలో హోమ్‌లోన్ ప్రకటన వచ్చిందనుకోండి... వారి నుంచి ఏ ప్రశ్న ఎదురైనా వివరంగా చెప్పాలి. మొక్కుబడిగా, అరకొరగా చెప్పి ఊరుకోవద్దు. మీరు చెప్పిన దానికి వారు పూర్తిగా సంతుష్టులవ్వాలి. గృహ రుణానికి ఎవరు అర్హులు, ఇచ్చేది ఎవరు, వడ్డీ రేటు, రుణ కాల వ్యవధి, చెల్లించలేకపోతే ఏం జరుగుతుంది ఇత్యాది విషయాలు తెలియజేయాలి. మీ వేతన చెల్లింపుల పత్రాన్ని చూపించడం కూడా మంచి ఐడియానే. వేతనం ఎంతొస్తుంది, దేనికి ఎంత ఖర్చవుతుంది, ఎంత పొదుపు చేస్తున్నారు తదితర విషయాలను పే స్లిప్ చూపించి వారికి తెలియజేయవచ్చు. రుణం ఏదైనా తీసుకుని ఉంటే దానికి ఎంత చెల్లించాలి కూడా చెప్పండి. కార్డు వాడకం గురించి... సూపర్ మార్కెట్ నుంచి ఆన్లైన్ కొనుగోళ్ల వరకు చాలా మంది క్రెడిట్ కార్డును వాడేస్తున్నారు. ఇది చూసి మీ పిల్లలు కార్డు ద్వారా కొనుగోలు చేయడం చాలా సులభమని పొరపడే అవకాశం ఉండొచ్చు. అందుకే వారికి క్రెడిట్ కార్డు గురించి వివరంగా చెప్పాలి. ఉదాహరణలతో చెప్పడం వల్ల వారి సందేహాలన్నింటిని తొలగించొచ్చు. క్రెడిట్ కార్డుపై కొనుగోలు చిన్నారులు ఏదేనీ గ్యాడ్జెట్ కావాలని ఒత్తిడి తీసుకొస్తే వారికి క్రెడిట్ కార్డు ద్వారా కొనిపించండి. అది కూడా బిల్లింగ్ సైకిల్ లోపట ఆ మొత్తాన్ని దాచుకున్న నిధి నుంచి తిరిగి చెల్లించాలనే షరతుపై ఇప్పించండి. దీనివల్ల వారికి ధన వినియోగం గురించి తెలిసొస్తుంది. క్రెడిట్ కార్డు ద్వారా వినియోగించుకున్న డబ్బులను సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుంది, క్రెడిట్ స్కోరు తగ్గడం, దాని పర్యవసనాల గురించి కూడా తెలియజేయాలి. కష్టపడి పనిచేయడం ద్వారానే డబ్బులు వస్తాయని ఈ విషయాల ద్వారా వారికి తెలిసొస్తుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత మీరు చెప్పిన విషయాలు వారికి ఎంతో ఉపయోగకరంగా అనిపిస్తాయి. వయసు పెరుగుతున్న కొద్దీ విషయాలు ఆర్థిక విషయాలైన పొదుపు, ఖర్చుల గురించి చెబితే చిన్నారులు మూడేళ్ల వయసులోనే వాటిని గ్రహించే శక్తి కలిగి ఉంటారని పరిశోధకులు పేర్కొంటున్నారు. వీరికి ఏడవ ఏట నుంచి సాధారణంగా డబ్బు అలవాటు మొదలవుతుందంటున్నారు. అందుకే 3–6 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారికి డబ్బులు లెక్కించడం, పొదుపు, ఖర్చు, ఇతరులకు ఇవ్వడం వంటి విషయాలు తెలియజేయాలి. 8–9 ఏళ్ల వయసు వారికి బహమతులు, ప్రోత్సాహకంగా కొంత డబ్బు ఇవ్వొచ్చు. వారి పేరిట సేవింగ్స్ ఖాతా తెరిచే సమయం ఇది. సూపర్ మార్కెట్లో కొనుగోళ్లు, ఇతర ఆర్థిక లావాదేవీల సమయంలో వారిని వెంట తీసుకెళ్లి కొత్త విషయాలు తెలియజేయాలి. సరుకుల కొనుగోలు సమయంలో వాటి ధరలు, తగ్గింపులు, ఆఫర్ల గురించి కూడా చెప్పాలి. 10–12 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత బ్యాంకు ఖాతాలు, పొదుపుపై వడ్డీ రేటు, కాంపౌండింగ్ వడ్డీ రేటు, రుణం, క్రెడిట్ కార్డు, ఆర్థిక లక్ష్యాలు, బడ్జెట్, కెరీర్ గురించి వివరించాలి. 13–17 ఏళ్ల వయసు వారికి స్టాక్ మార్కెట్ బేసిక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడి అవకాశాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు, రుణ నిర్వహణ, ఇన్సూరెన్స్, ఆన్లైన్ మోసాలు, ఇతర విషయాలు గురించి తెలియజేయాలి. -
మీ గోల్.. హిట్ అవుతుందా?
లక్ష్యం లేకుండా ఇన్వెస్ట్ చేసేవారు.. గమ్యం లేని ప్రయాణీకులు ఒకటేనట!! అలాగని లక్ష్యాలు నిర్దేశించుకోవడం అంత ఈజీ కాదు. దీనికంటూ ఓ ప్రక్రియ ఉంది. ఏంటా ప్రక్రియ? స్మార్ట్‌గా ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకోవడం ఎలా? ఒకసారి చూద్దాం... మీ స్నేహితుడో, సహోద్యోగో సడన్‌గా మిమ్మల్ని ఓ ప్రశ్నడిగాడనుకోండి!! ‘‘భవిష్యత్తులో ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? నిన్ను నువ్వు ఎలా చూసుకోవాలనుకుంటున్నావు?’’ అని ప్రశ్నించాడనుకోండి. మీరేం చెబుతారు? మీరేకాదు... చాలామంది చెప్పే జవాబు ఒక్కటే. ‘సంపన్నులుగా ఉండాలనుకుంటున్నాం’ అని. కానీ సంపదంటే ఎంత? ఆస్తులపరంగానా లేక నగదు రూపంలో సంపద సమకూర్చుకోవాలని అనుకుంటున్నారా? ఓ రెండు మూడు ఇళ్లో.. లేదా ఓ పెద్ద ఫాంహౌస్ లాంటిది సంపాదించడమా... లేదా రిటైర్మెంట్ నాటికి రెండు మూడు కోట్లు దగ్గరపెట్టుకోవడమా... లేదా ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్ల కోసం చేరో రూ.50 లక్షలు దాచిపెట్టడమా? మన ఆర్థిక లక్ష్యాలపై మనకు సరైన అవగాహన లేకపోతే.. ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతాయి. కాబట్టే ముందుగా ఆర్థిక లక్ష్యాలు ప్లాన్ చేసుకోవాలి. వాటిని అర్థం చేసుకోవాలి. అప్పుడే సాధించే మార్గాన్ని రూపొందించుకోవడం సాధ్యపడుతుంది. ఈ ప్రణాళికను వేసుకోవడానికి కొన్ని స్మార్ట్ సూచనలున్నాయి. అసలు ఆర్థికపరమైనవే కాదు... ఇతరత్రా ఏ లక్ష్యాలకైనా సరే! ఈ అంశాలు జోడిస్తే.. స్మార్ట్ లక్ష్యంగా మారుతుంది. నిర్ధిష్ట సమయమూ ముఖ్యమే... సంపన్నులం కావాలనుకోవడం కూడా లక్ష్యమే కానీ.. కచ్చితమైన స్మార్ట్ గోల్ కాదు. ‘నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను‘ అంటూ ఒక కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కీలకం. ఇక్కడ సంపన్నులుగా కావాలనుకోవడంతో పాటు నిర్ధిష్ట సమయాన్ని కూడా నిర్దేశించుకున్నాం. దీనికి మరికొన్ని అంశాలు కూడా జోడిస్తే స్మార్ట్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లే. అంకెల్లోకి మార్చుకోవాల్సిందే... కచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు దానికంటూ ఒక సంఖ్యాపరంగా ఒక అంకెను కేటాయించుకోవాలి. ఆర్థికంగా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను! అనే లక్ష్యానికి అందుకోసం ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారన్నది నిర్దేశించుకోవాలి. అఫ్కోర్స్!! ఇదేమీ చెప్పినంత సులువైన వ్యవహారమేమీ కాదు. భవిష్యత్‌లో తలెత్తే ఖర్చులను అంచనా వేసుకుని ఎంత మొత్తం అవసరం అవుతుందనేది లెక్కించుకోవడం కష్టమైన వ్యవహారమే. అయితే, దీనికో మార్గం ఉంది. ధరలు పెరుగుతున్న తీరు, వడ్డీ రేట్లు మొదలైన వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకోవచ్చు. అయితే, ఈ ధరల పెరుగుదల అనేది కూడా ఒకో అంశంలో ఒకో రకంగా ఉంటుంది. ఉదాహరణకు కార్ల రేట్ల పెరుగుదల కన్నా విద్యా వ్యయంలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి భవిష్యత్ ఆర్థిక అవసరాలకు ఎంత మొత్తం కావాల్సి ఉంటుందనేది ఆయా అంశాలను బట్టి లెక్కేసుకోవాలి. కావాలంటే నిపుణుల సలహాను తీసుకోవచ్చు. ఉదాహరణకు మన ఆర్థిక లక్ష్యాలు ఓ రూ.10 లక్షలు పెట్టి కొత్త కారు, రూ.50 లక్షలు పెట్టి సిటీలో ఓ ఇల్లు కొనుక్కోవటం అనుకుందాం. అంటే దేని కోసం ఎంత కావాలి అనేదానిపై ఒక స్పష్టత వచ్చినట్లవుతుంది. ఈ ప్రశ్నలకు జవాబు ఉందా..? స్మార్ట్ ఆర్థిక లక్ష్యాలకు సంబంధించి ఎవరికి వారు వేసుకోవాల్సినవి ఓ మూడు ప్రశ్నలున్నాయి. అవి... ♦ ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకున్నామా? ♦ అవి స్మార్ట్ లక్ష్యాలేనా? ♦ ఆర్థిక లక్ష్యాల ప్రాధాన్య క్రమంలో తగు ప్రణాళికను అమలు చేస్తున్నామా లేదా? ఒకవేళ ఈ మూడింటిలో దేనికైనా సరే సమాధానం ‘లేదు‘ అని గానీ వస్తే.. తక్షణమే ఓ పెన్నూ, పేపరు పట్టుకుని కూర్చోండి. లక్ష్యాలను, గడువును, సాధించేందుకు పాటించాలనుకుంటున్న ప్రణాళికలను రాసి పెట్టుకోండి. నిరంతరం మీ లక్ష్యాలను గుర్తు చేస్తుండేలా సదరు షీట్ ఎదురుగా ఉండేలా చూసుకోండి. క్రమశిక్షణతో పొదుపు, పెట్టుబడులు చేస్తూ అంచెలంచెలుగా లక్ష్యాల సాధన దిశగా ముందడుగు వేయండి. సాధించగలిగేవిగా ఉండాలి.. ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకుంటే సరిపోతుందా? లేదు! లక్ష్యాలు గాల్లో మేడల్లాగా ఉండకూడదు. ఆచరణ సాధ్యమయ్యేవిగా, సాధించగలిగేవిగా కూడా ఉండాలి. ♦ ఆయా ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే నిర్ధిష్ట సమయం కూడా కచ్చితంగా నిర్దేశించుకోవాలి. ఉదాహరణకు అయిదేళ్లలో కారు కొనుక్కోవాలనుకుంటున్నాను అనో లేదా పదేళ్లలో సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాననో.. ఇలా కొంత గడువు పెట్టుకోవాలి. ♦ మరోవైపు లక్ష్యాల్లో కూడా వివిధ రకాలు ఉంటాయి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక క్రమంలో ఆయా లక్ష్యాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలనేది కూడా నిర్దేశించుకోవాలి. స్వల్పకాలిక లక్ష్యాలు.. ♦ కుటుంబానికి అత్యవసర నిధి ఏర్పాటు ♦ స్కూల్ అడ్మిషన్ సంబంధ ఖర్చులు ♦ ఏదైనా గృహోపకరణం కొనటం... లేదా ఇతరత్రా చికిత్స వ్యయాలు ♦ జీవిత బీమా ప్రీమియంల చెల్లింపు ♦పన్నులపరమైన ప్రణాళికలో భాగంగా ఇన్వెస్ట్మెంట్స్ మధ్యకాలిక లక్ష్యాలు.. ♦ రుణభారం తగ్గించుకోవడం ♦ కుటుంబంతో విహారయాత్రకు వెళ్లటం ♦ మంచి కాలేజీల్లో పిల్లల చదువులు ♦ పెరిగే కుటుంబ అవసరాలు ♦ కొత్త వాహనం కొనుక్కోవడం ♦ ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు దీర్ఘకాలిక లక్ష్యాలు ♦ రిటైర్మెంట్ నిధి సమకూర్చుకోవడం (వైద్య ఖర్చులు కూడా కలిపి) ♦ వారసులకు కొంత ఆస్తిని వారసత్వంగా ఇవ్వటం ♦ కుమార్తెల పెళ్లిళ్లు ♦ విశ్రాంత జీవనానికి ఇల్లు లేదా ఫాంహౌస్ లాంటివి కొనటం -
రిస్కులేని పథకాలివి... ఎంచుకోండి..!
వడ్డీ రేట్లు బాగానే దిగివచ్చాయి. మరికొన్నాళ్ల పాటు ఈ స్థాయిలోనే ఉంటాయంటున్నారు విశ్లేషకులు. నిజం చెప్పాలంటే బ్యాంకుల్లోని రేట్ల కంటే ప్రస్తుతం పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనే కాస్తంత మెరుగైన వడ్డీ రేట్లున్నాయి. ప్రస్తుతమున్న రేట్లే కొన్ని త్రైమాసికాల పాటు కొనసాగే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఆయా పథకం రాబడులు, పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని సరైన పథకాన్ని ఎంచుకోవడం మంచిది. ఏఏ పథకం ఎంత రాబడినిస్తోంది, లాభనష్టాలేంటన్న వివరాలివిగో... రిస్క్ వద్దా?... ఇదిగో పీపీఎఫ్ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వారికి ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్) చక్కని సాధనం. దీనికి ఉన్న పన్ను మినహాయింపుల వల్ల ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన సాధనమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకవేళ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్‌పై రేటు 7.5 శాతం ఉంటే 30 శాతం పన్ను పరిధిలోని వారికి పన్ను పోను నికరంగా గిట్టుబాటయ్యేది 5.25 శాతమే. కానీ, పీపీఎఫ్‌లో 7.5 శాతం వడ్డీ రేటు పూర్తిగా పన్ను రహితం. కాకపోతే పీపీఎఫ్‌లో వార్షిక పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షలే. అంతకన్నా ఎక్కువ పెట్టడానికి వీలుండదు. పీపీఎఫ్‌లో మరో ఆకర్షణీయమైన అంశం దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పీపీఎఫ్ కాల వ్యవధి 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఇష్టమైతే మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత మూడు ఆప్షన్లు ఉంటాయి. మూల నిధిని వెనక్కి తీసుకుని, ఖాతాను తదుపరి ఎటువంటి చందాలు లేకుండా కొనసాగించుకోవడం... లేదా పెట్టుబడి కొనసాగించుకోవడం! పెట్టుబడిని కొనసాగించే ఆప్షన్ ఎంచుకుంటే అందుకోసం మరో ఐదేళ్ల పాటు కాల వ్యవధికి పొడిగించాలని దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది. 15 ఏళ్ల కాల వ్యవధి ముగిశాక ఏడాది లోపు ఎప్పుడైనా దరఖాస్తును (ఫామ్ హెచ్) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కాల వ్యవధి పొడిగించాలని కోరుతూ దరఖాస్తు చేయకుండా అలానే వదిలేస్తే దానంతట అదే ఐదేళ్లకు పొడిగింపునకు లోనవుతుంది. ఇలా జరిగితే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండదు. ఖాతాలో ఉన్న బ్యాలన్స్‌పై మాత్రం వడ్డీ లభిస్తుంది. ఉద్యోగుల మాదిరిగా నెలసరి వేతనం లేని, జీవిత మలి సంధ్యలో రిటైర్మెంట్ ప్రయోజనాలు లేనివారికి ఇది అత్యంత అనుకూల సాధనం. వైద్యులు, ఆర్కిటెక్ట్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్ల తరహా వృత్తులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ పెట్టుబడుల్లో డెట్ విభాగం కోసం పీపీఎఫ్‌ను ఎంచుకోవచ్చు. అయితే, అందరికీ పీపీఎఫ్ ఆకర్షణీయం కాదనే చెప్పాలి. యువతీ యువకులై ఉండి... పన్ను ఆదా కోరుకునేట్టు అయితే అటువంటి వారికి ఈఎల్ఎస్ఎస్ ఫండ్లే పీపీఎఫ్ కంటే అధిక రాబడులను ఇస్తాయనేది వ్యాల్యూ రీసెర్చ్ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్ సూచన. భార్యాభర్తలు ఉద్యోగులై ఉంటే వారికి అప్పటికే ఈపీఎఫ్ ఉంటుంది కనుక దానికి బదులు పన్ను ఆదా చేసే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి అధిక రాబడులు పొందొచ్చు. కూతుళ్లకు ప్రత్యేకం... సుకన్య సమృద్ధి పదేళ్లలోపు కుమార్తెలున్న తల్లిదండ్రుల కోసం ప్రవేశపెట్టిన పథకమిది. అలాంటి కుమార్తెల పేరిట మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వీలుంది. ఆమె ఉన్నత విద్య, వివాహం వంటి అవసరాల కోసం ఈ సుకన్య సమృద్ధి యోజనను మంచి పెట్టుబడి సాధనమనే చెప్పాలి. 14 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఈ పథకంపై ప్రస్తుతం 8.3 శాతం వడ్డీ రేటుంది. ఇది ఎప్పటికప్పుడు మారుతుంది కూడా. రాబడులు పీపీఎఫ్ కంటే దీన్లోనే ఎక్కువ. పీపీఎఫ్ మాదిరే సుకన్య సమృద్ధి యోజనలోనూ వార్షికంగా రూ.1.50 లక్షలకు మించి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు. ఏదైనా పోస్టాఫీసు, ఎంపిక చేసిన బ్యాంకుల్లో రూ.1,000తో ఖాతాను ప్రారంభించుకోవచ్చు. తండ్రి లేదా తల్లి గరిష్టంగా తన ఇద్దరు కుమార్తెల కోసం రెండు ఖాతాల వరకే దీన్ని ప్రారంభించే అవకాశముంది. రెండు ఖాతాలున్నప్పటికీ సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు రూ.1.50 లక్షల పెట్టుబడికే పరిమితం. కుమార్తె భవిష్యత్తు అవసరాలకు డెట్ పథకమైన సుకన్య సమృద్ధి యోజన ఒక్కటే సరైనది కాదన్నది కొందరి నిపుణుల సూచన. దీనితోపాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయం లో సుకన్య సమృద్ధి యోజన పథకంలో ముందుగా డబ్బులను వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడం సానుకూలం. మెచ్యూరిటీనాటికి కుమార్తె ఉన్నత విద్య, వివాహ బాధ్యతలు ఉంటాయి కనుక దాదాపుగా దుర్వినియోగానికి అవకాశం ఉండదు. ఎఫ్డీకన్నా బెటర్... పొదుపు సర్టిఫికెట్లు పీపీఎఫ్ మాదిరిగా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో పెట్టుబడులకు వార్షిక పరిమితి లేదు. ఐదేళ్ల కాల వ్యవధిపై వడ్డీ రేటు 7.8 శాతంగా ఉంది. కాకపోతే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను అనంతరం రాబడులు చూస్తే 5.38 శాతంగా ఉంటాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని అర్థమవుతుంది. వడ్డీ రేటు పరంగా మాత్రం ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే ఒక శాతం వరకు ఎన్‌ఎస్‌సీలోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్ఎస్సీలో ఏటా వడ్డీ రూపంలో పొందే ఆదాయంపై పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లపై 9–9.5% వడ్డీ రేట్లున్న సమయంలో తక్కువ వడ్డీ రేటుతో ఎన్ఎస్సీ వెలవెలబోయింది. బ్యాంకు రేట్లు బాగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఎన్ఎస్సీకి తిరిగి డిమాండ్ ఏర్పడింది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7% మించి లేవు. దీనిప్రకారం ఎన్ఎస్సీ ఆకర్షణీయమే. సీనియర్ సిటిజన్స్‌కు... సేవింగ్ స్కీమ్ ఐదేళ్ల కాల వ్యవధితో కూడిన ఈ పథకంలో పెట్టుబడిపై ప్రస్తుతం 8.3% వడ్డీ లభిస్తోంది. కాల వ్యవధిని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చు. రిటైర్ అయిన వారికి క్రమం తప్పకుండా ఆదాయాన్నందించే పథకమిది. ఇందులో గరిష్టంగా రూ.15 లక్షల వరకే పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది. 60 ఏళ్లు దాటిన వారే అర్హులు. ముందుగానే స్వచ్చంద పదవీ విరమణ తీసుకుని, మరో ఉద్యోగంలో చేరకపోతే 58 ఏళ్లకే ఈ ఖాతా తెరుచుకోవచ్చు. రక్షణ శాఖలో పనిచేసిన వారికి వయసుపరంగా పరిమితులు లేవు. రిటైర్ అయిన వారికి నిరంతర ఆదాయం కోసం సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ అనువైనదని నిపుణుల సూచన. హామీతో కూడిన రాబడులను ప్రతి 3 నెలలకు అందిస్తుంది. రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేశాక ఇంకా కార్పస్ మిగిలితే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
అమ్మా.. నాన్నా... అలవాట్లు!!
► అప్పు తీర్చటం నుంచి బీమా దాకా వారే గురువులు ► మనీ మేనేజిమెంట్‌లో తల్లిదండ్రుల ప్రభావమే అధికం మనం ఏం నేర్చుకున్నా దాన్లో తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. పొదుపు, ఖర్చు అలవాట్లు కూడా వచ్చేది వారి నుంచే. నిజం చెప్పొద్దూ!! ఎవరైనా తమ కలల్ని, జీవిత లక్ష్యాల్ని సాకారం చేసుకోవటానికి ఆర్థిక విషయాలు తెలిసి ఉండటమనేది అత్యంత కీలకం. అందుకని మనకు సంక్రమించిన ఖర్చు, పొదుపు అలవాట్లను విశ్లేషించుకోవటంలో తప్పు లేదు. చక్కని జీవితానికి చక్కని అలవాట్లే పునాది. దాన్లో చెడు ఉంటే గనక... ఆదిలోనే తుంచేయాలి. సదరు అలవాట్ల సింçహావలోకనమే ఈ ప్రయత్నం. రుణాల చెల్లింపులెలా ఉన్నాయ్? ఆ మధ్య కోపెన్హెగన్ యూనివర్సిటీ ఎకనామిక్స్ ప్రొఫెసర్లు ఓ ఆసక్తికరమైన అధ్యయనం చేశారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న 50 లక్షల మందికి చెందిన 3 కోట్ల రుణాలను విశ్లేషించారు. 2011– 2014 మధ్య తీసుకున్న రుణాలవి. వాళ్లు కనుక్కున్నదేమిటంటే... తల్లిదండ్రులు గనక రుణాలు తిరిగి చెల్లించటంలో డీఫాల్ట్ అయితే... వారి పిల్లలూ డీఫాల్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువని. ఇవి ఎంత ఎక్కువంటే... డీఫాల్ట్ కాని తల్లిదండ్రుల పిల్లలకంటే దాదాపు నాలుగు రెట్లు!!. కుటుంబ ఆదాయాలు, తెలివితేటలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలూ ఇలాగే ఉండటం గమనార్హం. దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే... మీ తల్లిదండ్రులు రుణాల చెల్లింపులు ఎలా చేశారో తెలుసుకోవటమే కాదు. రుణాల విషయంలో మీ వైఖరినీ విశ్లేషించుకోండి. ఒక్కటి గుర్తుంచుకోండి!! తీసుకున్న అప్పును తిరిగి చెల్లించటమనేది నైతికంగా, చట్టపరంగా మీ బాధ్యత. అదేకాదు! చక్కని చెల్లింపు అలవాట్లు మీ క్రెడిట్ స్కోరునూ పెంచుతాయి. తద్వారా తక్కువ వడ్డీకే కొత్త రుణాలు దొరుకుతాయి. సంప్రదాయ పాలసీలను కొనొద్దు... ఓ తెలిసిన బంధువో, మిత్రుడో వచ్చి గ్యారంటీ లాభాలుంటాయంటూ సంప్రదాయ బీమా పాలసీలను అంటగట్టడం మనకు కొత్తేమీ కాదు. దీర్ఘకాలంలో ఇవన్నీ అర్థంలేని పాలసీలుగా మిగిలిపోతాయి. ఇలాంటి బీమా పాలసీల్లో ఇన్వెస్ట్ చేయటమనేది ఓ సమస్య కూడా. ఎందుకంటే ఈ ప్లాన్లలోని తప్పనిసరి లాకిన్ పీరియడ్ మిమ్మల్ని వాటి నుంచి బయటపడకుండా చేస్తుంది. ఒక వాటిపై వచ్చే రాబడి అత్యంత తక్కువ. దాని బదులు తగినంత కవరేజీ ఉండేలా టర్మ్ ప్లాన్ తీసుకుని, మిగిలిన మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ల వంటి ఎక్కువ రాబడినిచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయటం తెలివైన పని. తగినంత కవరేజీ ఉందా? భారతీయుల్లో చాలామంది జీవిత బీమాను తీసుకునేది పన్నుల నుంచి బయటపడటానికే. కొందరు దాన్నో ఇన్వెస్ట్మెంట్లా కూడా చూస్తుంటారు. బీమా ఉన్న వ్యక్తి ఒకవేళ మరణించినా, ఆసుపత్రిలో ఉన్నా ఆ కుటుంబానికి వాస్తవంగా ఎంత రక్షణ కావాలన్నది మాత్రం వారు చూడరు. మీ కుటుంబ సభ్యులు కనక మీపై ఆధారపడి ఉంటే... మీపై ఆధారపడ్డ భార్య/భర్త తాలూకు ఆదాయ అవసరాలు, రుణ చెల్లింపులు, పిల్లల చదువు ఖర్చులు, ఆరోగ్య ఖర్చులు, ఇతర రోజువారీ అవసరాల వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని అందుకు తగినంత బీమాను టర్మ్ ప్లాన్ రూపంలో తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే మీపై ఆధారపడ్డ వారిని అలా వదిలేయలేరు కదా!! ఆరోగ్య బీమా లేదా? చాలామంది ఆరోగ్య బీమా లేకుండానే తమ జీవితంలో చివరి మజిలీని చేరుకుని ఉంటారు. ఆ సమయంలో వారి ఆరోగ్యం చాలా ఒడిదుడుకులకు గురవుతుంటుంది. మరోవంక బీమా ఉండదు. ఆ సమయంలో ఆరోగ్య బీమా కొనుగోలు చేయటం కూడా చాలా కష్టం. పొరపాటున ఆసుపత్రి పాలయితే కుటుంబ పొదుపు, పెట్టుబడులు ఠక్కున ఆవిరయిపోతుంటాయి. ఈ సమస్యలన్నీ రాకుండా ఉండాలంటే యుక్త వయసు నుంచే చక్కని ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవటంతో పాటు దాన్ని చిరకాలం కొనసాగించాలి. తెలివైన పెట్టుబడి సాధనాలున్నాయ్ మీకు కావాల్సినప్పుడు మీ డబ్బు మీ చేతికిరావాలి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో చాలావరకూ ఒక మోస్తరు రాబడినిస్తాయి కానీ పన్ను పరంగా అంత సమర్థమైనవి కావు. ఎండోమెంట్ బీమా పాలసీలంటే తక్కువ రాబడితో పాటు లాకిన్లూ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు. కానీ పన్ను తప్పదు. అందుకని మెరుగైన ఇన్వెస్ట్మెంట్ సాధనాలు వెతుక్కోవాలి. వీటన్నిటికీ జవాబిచ్చే మ్యూచువల్ ఫండ్లలో గడిచిన రెండేళ్లుగా ఇన్వెస్ట్మెంట్లు బాగా పెరుగుతున్నాయి. వాటిలో పన్ను ఆదాతో పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రవేశించొచ్చు... బయటపడొచ్చు కూడా. రిస్కును బట్టే రాబడులుంటాయి. నెలకు రూ.500 నుంచి మొదలుపెట్టి ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. పుత్తడి ఎల్లవేళలా మెరవదు... సంప్రదాయంగా బంగారం కూడా పెట్టుబడి సాధనంగా వస్తోంది. దాని ప్రయోజనాలు దానికున్నాయి. ఈ లోహాన్ని కావాల్సినట్టు మార్చుకోవచ్చు. పాడైపోదు. ఆభరణంగానూ వాడొచ్చు. కానీ పెట్టుబడిగా వచ్చేసరికి ప్యూరిటీ, మార్కెట్ రాబడి, దాచుకోవటమనే సమస్యలు దీనికీ ఉన్నాయి. ఆభరణంగా వాడుకోవాలంటే ‘బంగారం’లా కొనుక్కోవచ్చు. కానీ పెట్టుబడిగా అయితే మాత్రం మీ పోర్టుఫోలియోలో దాన్ని కొంతవరకే పరిమితం చేయాలి. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్లు, గోల్డ్ సావరిన్ బాండ్ల వంటి సాధనాలను పరిశీలించొచ్చు. -
గతవారం బిజినెస్
సేవింగ్స్‌పై వడ్డీ కోత: యాక్సిస్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాలపై వడ్డీ రేటును అరశాతం తగ్గించింది. సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్లు రూ. 50 లక్షల కన్నా తక్కువుంటే ఇకపై 3.5% వడ్డీ రేటు మాత్రమే చెల్లించనుంది. రూ. 50 లక్షలు పైబడిన మొత్తం ఉంటే మాత్రం యథా ప్రకారం 4% గానే కొనసాగించనున్నట్లు బ్యాంకు వెల్లడించింది. ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 19 శాతం వృద్ధి ప్రత్యక్ష పన్ను వసూళ్లు గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్–జూలై మధ్య 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది రూ.1.90 లక్షల కోట్లు. 2017–18 మధ్య కాలంలో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.80 లక్షల కోట్లుగా ఉండాలని బడ్జెట్లో లకి‡్ష్యంచారు. తాజా వసూళ్ల మొత్తం ఇందులో 19.5 శాతంగా ఉంది. ఆర్బీఐ డివిడెండ్ చిక్కి సగమైంది! కేంద్రానికి ఆర్బీఐ చెల్లించే డివిడెండ్ గడిచిన ఆర్థిక సంవత్సరం భారీగా సగానికి సగం పడిపోయింది. ఈ కాలానికి సంబంధించి ఆర్బీఐ రూ.30,659 కోట్లు మాత్రమే చెల్లించింది. అంతకు ముం దటి ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.65,876 కోట్లు. ఎంసీఎక్స్‌లో బంగారం ఆప్షన్ల కాంట్రాక్టులు బంగారంపై ఆప్షన్ల కాంట్రాక్టులను ప్రారంభించేందుకు మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ (ఎంసీఎక్స్)కు సెబీ ఆమోదం తెలిపింది. ’’బంగారం ఫ్యూచర్స్‌లో ఆప్షన్ల కాంట్రాక్టులను ప్రవేశపెట్టేందుకు సెబీ నుంచి అనుమతి వచ్చింది. ఇప్పటికే మాక్ ట్రేడింగ్ కూడా నిర్వహించాం. ఇన్వెస్టర్లలో అవగాహన కోసం కార్యక్రమాలు నిర్వహించాం. రానున్న కొన్ని వారాల్లో ఆప్షన్ల కాంట్రాక్టు సైజు, ఇతర వివరాలతోపాటు, ప్రారంభ తేదీని ప్రకటిస్తాం’’ అని ఎంసీఎక్స్ ప్రతినిధి గిరీష్దేవ్ తెలిపారు. జారుడు బల్లపైకి పారిశ్రామిక ఉత్పత్తి! పారిశ్రామిక రంగం ఉత్పత్తి జూన్ నెల్లో అత్యంత నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) అసలు వృద్ధిలేకపోగా –0.1 % క్షీణతలోకి జారిపోయింది. అంటే 2016 జూన్ నెల ఉత్పత్తితో పోల్చితే 2017 జూన్‌లో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –0.1% క్షీణించిందన్నమాట. 2016 జూన్‌లో వృద్ధి భారీగా 8%గా ఉంది. గడిచిన 12 నెలల కాలాన్ని చూస్తే, ’క్షీణ’ ఫలితం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 77% వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. వాహన విక్రయాలు రయ్ రయ్ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో జూలై నెలలో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. జీఎస్టీ అమలు తర్వాత డీలర్లు స్టాక్‌ను మళ్లీ నింపుకోవడం దీనికి ప్రధాన కారణం. సియామ్ తాజా గణాంకాల ప్రకారం.. ప్యాసింజర్ వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన జూలైలో 15.12 శాతం వృద్ధితో 2,59,720 యూనిట్ల నుంచి 2,98,997 యూనిట్లకు పెరిగాయి. కార్ల అమ్మకాలు 8.52 శాతం వృద్ధి చెందాయి. ఇవి 1,77,639 యూనిట్ల నుంచి 1,92,773 యూనిట్లకు ఎగశాయి. ఆరు కంపెనీలపై ట్రేడింగ్ ఆంక్షలు ఎత్తివేత పార్శ్వనాథ్ డెవలపర్స్ సహా ఆరు కంపెనీలకు ఊరట దక్కింది. ఈ కంపెనీల షేర్ల ట్రేడింగ్‌పై సెబీ విధించిన ఆంక్షలను స్టే రూపంలో శాట్ పక్కన పెట్టింది. జాబితాలో పార్శ్వనాథ్ డెవలపర్స్, కవిట్ ఇండస్ట్రీస్, పిన్‌కాన్ స్పిరిట్, సిగ్నెట్ ఇండస్ట్రీస్, ఎస్‌క్యూఎస్ ఇండియా బీఎఫ్ఎస్ఐ, కెకల్పన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ కంపెనీల వాదన వినాలని, వీటి వ్యాపారాలపై దర్యాప్తు నిర్వహించాలని శాట్ ఆదేశించింది. 331 అనుమానిత షెల్ కంపెనీలపై సెబీ ట్రేడింగ్ ఆంక్షలకు ఆదేశించిన విషయం తెలిసిందే. డీల్స్.. ♦ ఈ–కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌కి చెం దిన సాఫ్ట్‌బ్యాంక్ భారీగా పెట్టుబడులు పెట్టిం ది. సాఫ్ట్ బ్యాంక్ తన విజన్ ఫండ్ ద్వారా 2.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.16,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసింది. తద్వారా ఫ్లిప్‌కార్ట్‌లో అతి పెద్ద ఇన్వెస్టర్లలో ఒకటిగా మారింది. ♦ భారతి ఎయిర్టెల్..తన టవర్ల కంపెనీ భారతి ఇన్ఫ్రాటెల్లో 3.65 శాతం వాటా (6.5 కోట్ల షేర్లు) విక్రయించి, రూ. 2,570 కోట్ల నిధుల్ని సమీకరించింది. ♦ సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ కంపెనీ నెట్‌లింక్స్.. శ్రీవెంకటేశ్వర గ్రీన్ పవర్ ప్రొజెక్ట్స్ లిమిటెడ్‌లో 51% వాటాను కొనుగోలు చేసింది. ♦ పీకల్లోతు కష్టాలోఉన్న సహారా గ్రూప్‌కు చెందిన యాంబీ వ్యాలీ ప్రాజెక్ట్‌లో 1.67 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10,700 కోట్లు) పెట్టుబడికి మారిషస్‌కు చెందిన ఇన్వెస్టర్ రాయలీ పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఆఫర్ ఇచ్చింది. ♦ పెన్నార్ ఇండస్ట్రీస్ తన అనుబంధ కంపెనీ అయిన పెన్నార్ రెన్యువబుల్స్‌లో తనకున్న వాటాను గ్రీన్కో సోలార్ ఎనర్జీకి విక్రయిస్తున్నట్టు ప్రకటించింది. ఐపీవో కాలమ్.. ♦ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా (జీఐసీ) ప్రతిపాదిత ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్‌కి (ఐపీవో) సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను(డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీవోలో 12.4 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ♦ న్యూ ఇండియా అష్యూరెన్స్ (ఎన్ఐఏ) ఐపీవోకు అనుమతి కోరుతూ ముసాయిదా పత్రాలను సెబీ వద్ద దాఖలు చేసింది. ఎన్ఐఏ ఐపీవో ద్వారా కేంద్రం 9.6 కోట్ల షేర్లను, ఎన్ఐఏ సొంతంగా 2.4 కోట్ల షేర్లను ఆఫర్ చేయనున్నాయి. -
జీరో చిట్స్‌తో జరభద్రం
⇒పుట్టగొడుగుల్లా వెలుస్తున్న చిట్టీల కంపెనీలు ⇒ సామాన్య, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్ ⇒ అనతికాలంలో బోర్డు తిప్పేస్తున్న వైనం ⇒ రిజిస్ట్రేషన్ గ్రూపుల్లో చేరితేనే క్షేమం.. కాజీపేట అర్బన్ : సామాన్య మధ్యతరగతి కుటుంబాలు తమ నెలవారీ ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుని అవసరాలకనుగుణంగా వెచ్చించేందుకు చిట్స్ తోడ్పడుతాయి. అయితే కొన్ని చిట్‌ఫండ్ కంపెనీలు సామా న్య ప్రజల ఆర్థికావసరాలను ఆసరా చేసుకుని మోసానికి పాల్పడుతున్నాయి. చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి గుర్తింపు పొందకుండా నిర్వహించే చిట్ గ్రూపులను జీరో చిట్స్‌గా పరిగణిస్తారు. ఇలాంటి వాటిలో చేరిన ప్రజలకు కంపెనీ బోర్డు తిప్పేసిన సమయంలో నగదును తిరిగి పొందే అవకాశం ఉండదు. కొందరు ఇంటికి వచ్చి పలువురిని పోగుచేసి చిట్టీలను నిర్వహిస్తారు. ఇవి కూడా జీరో చిట్స్కిందకే వస్తాయి. చిట్స్ కంపెనీ గుర్తింపు ఇలా.. చిట్‌ఫండ్ కంపెనీ ఏర్పాటుకు ముందుగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ని రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ కంపెనీ అనుమతి పొందాలి. పరస్పర అంగీకారంతో ఎంఓఏ (మెమోరాండం ఆఫ్ అసోసియేషన్), పెట్టుబడి వివరాలను చార్టడ్ అకౌంట్ వద్ద అందించాలి. ఆర్టికల్ ఆఫ్ అసొసియేషన్లను పొందాలి. పాన్‌కార్డు, ఆధార్‌కార్డు, లీస్ డీడ్లను ఏర్పాటు చేసుకుని సహాయక చిట్స్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనుమతి పొందాలి. వంద శాతం నగదును ఫిక్స్డ్ డిపాజిట్ చిట్టి గ్రుపుకు సంబందించి చేయాల్సి ఉంటుంది. స్థిరాస్తి తనఖాకు గాను 10లక్షల చిట్టీలకు రూ.15 లక్షల విలువైన ఆస్తిని తనఖా (మార్టిగేజ్) చేయాలి. స్థిరాస్తితో పాటు 50శాతం బ్యాంకు గ్యారంటీని కల్పించిన అనంతరం చిట్టీల గ్రూపులకు అనుమతిని సహాయక చిట్స్ కార్యాలయం అందిస్తుంది. ఇలాంటి గ్రూపులకు పీఏస్ఓ (ప్రివియస్ సాంక్షన్డ్ ఆర్డర్) నంబరును అందిస్తారు. వీటిని రిజిస్ట్రార్డ్ గ్రూపులుగా పరిగణిస్తారు. ఆపద కాలంలో కస్టమర్లు నగదును తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నగరంతో పాటు ఉమ్మడి వరంగల్‌లో సూమారు 174 రిజిస్టార్డ్ చిట్ కంపెనీలు తమ బ్రాంచ్‌లతో సైతం సేవలను అందిస్తున్నారు. రూ.48 లక్షల కోర్టు ఫీజుల రూపంలో ఆదాయం చిట్‌ఫండ్ కంపెనీలలో తలెత్తే సమస్యల పరిష్కారానికి డిప్యూటీ రిజిస్ట్రార్ కోర్డినేటర్‌గా (మధ్యవర్తిగా) వ్యవహరిస్తారు. కస్టమర్లు, చిట్కంపెనీలు కోర్టు ఫీజును చెల్లించిన అనంతరం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారు. డిసెంబర్ 31 ,2016 నాటికి సుమారు 48 లక్షల రూపాయలు కోర్టు ఫీజు రూపంలో ఖజానాకు ఆదాయం వచ్చిందంటే సమçస్యలు ఏవిధంగా ఉన్నాయో అర్థం అవుతుంది. అదే విధంగా చిట్స్ గ్రూపుల నిర్వాహణకు గాను 2శాతం చెల్లించే స్టాంప్ డ్యూటీతో సుమారు రూ.21లక్షల ఆదాయం గతేడాది లభించింది. నోట్ల రద్దుతో జీరో గ్రూపులు సైతం స్టాంప్ ఫీజును చెల్లించి గ్రూపులను రిజిష్ట్రర్ చేసుకునే అవకాశం ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలే టార్గెట్... చిట్ కంపనీలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ అనతికాలంలోనే బోర్డు తిప్పేస్తున్నాయి. కంపెనీని ప్రారంభించి మొదటి నాలుగు నెలలు కేవలం కస్టమర్లను చేర్పించే పనిలో నిమగ్నమై అనుకున్న డబ్బు సాధించిన అనంతరం బోర్డు తిప్పేస్తున్నారు. ఇటీవల నిట్ ఏరియాలోని హిమాన్వి చిట్‌ఫండ్ అదేబాటలో పయనించి రిజిష్టర్ గ్రూపులు లేక జీరో గ్రూపులలో చేర్పించుకుని ప్రజలకు టోపీ పెట్టింది. కస్టమర్లు సహాయక చిట్స్ కార్యాలయాన్ని ఆశ్రయించిన రిజిష్టర్ కాని గ్రూపులకు ఎలాంటి సహాయమూ అందించలేమని చెప్పడంతో ప్రజలు డబ్బులను కోల్పోతున్నారు. -
మీ ఇంటి కోసం అందమైన బడ్జెట్?
►ఆదాయ, వ్యయాలపై పూర్తి అవగాహన ఉండాలి ►ఖర్చులకు కళ్లెం వేస్తేనే లక్ష్యాల సాకారం ►అవసరాల కోసం లక్ష్యాలను పణంగా పెట్టవద్దు ►మీకంటూ బడ్జెట్ రూపకల్పనతో తగిన క్రమశిక్షణ ఎంత సంపాదించినా పొదుపు చేయలేకపోతున్నారా...? అవును అనే సమాధానం వస్తే వెంటనే మీ ఇంటి బడ్జెట్ రూపకల్పనకు సిద్ధమై పోండి. బడ్జెట్ అన్నది వస్తున్న ఆదాయాన్ని అర్థవంతంగా, తెలివిగా వినియోగించేందుకు... వ్యయాలను నియంత్రించుకునేందుకు ఓ మార్గ సూచీలా తోడ్పడుతుంది. చక్కని బడ్జెట్ తయారు చేసుకోవడం వల్ల మీ డబ్బును ముందుగా ముఖ్యమైన వాటికి మళ్లించేందుకు వీలుంటుందని ఆర్థిక నిపుణులు చెబుతారు. అంతగా ప్రాధాన్యం లేని వాటిపై అధికంగా ఖర్చు చేయకుండా కూడా నియంత్రణతో ఉండవచ్చు. బడ్జెట్ అన్నది వస్తున్న ఆర్థిక వనరులను ప్రాధాన్యతలకు అనుగుణంగా కేటాయించుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఇప్పడంతా స్మార్ట్ యుగం కనుక ఈ పని చేసి పెట్టేందుకు బడ్జెటింగ్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. ఈ యాప్‌లు మీ ఖర్చులను గమనిస్తూ గీత దాటిపోతుంటే అప్రమత్తం చేస్తాయి. రెస్టారెంట్‌కు వెళ్లి మంచి పార్టీ చేసుకున్నా, వస్త్రదుకాణాల్లో రెచ్చిపోయి షాపింగ్ చేసినా సరే ఓ సారి హెచ్చరిస్తాయి. నిజానికి యుక్త వయసులో ఉన్న వారు తమ సంపాదనలో ఎక్కువగా ఖర్చు పెట్టేది, విందులు, వినోదాలు, వస్త్రాలపైనే. చిన్న వయసులోనే పొదుపు ప్రారంభమైతే సంపద సృష్టి సాధ్యమవుతుంది. 30 ఏళ్ల వయసు నుంచే నెలకు కేవలం రూ.10వేలు పొదుపు చేసి దాన్ని వార్షికంగా 10 శాతం రాబడినిచ్చే సాధనాల్లో మదుపు చేశారనుకుందాం. 30 ఏళ్ల తర్వాత అంటే 60 ఏళ్ల వయసుకు వచ్చే సరికి 2.16 కోట్ల నిధి ఏర్పడుతుంది. అదే కొంచెం ఆలస్యంగా 35 ఏళ్ల వయసులో నెలకు రూ.10వేల పొదుపు, మదుపులను ప్రారంభిస్తే ఈ నిధి కాస్తా రూ.96 లక్షలకే పరిమితం అవుతుంది. అందుకే వీలైనంత చిన్న వయసు నుంచే ఖర్చులకు కళ్లెం వేసుకుంటే వారి రిటైర్మెంట్ జీవితం హాయిగా సాగిపోతుంది. ఇందుకు బడ్జెట్ అక్కరకు వస్తుంది. దీని గురించి చర్చించేదే ఈ వారం ప్రాఫిట్ కథనం... –సాక్షి బిజినెస్ డెస్క్ బడ్జెట్‌తో ఉపయోగాలు... ఆర్థిక లక్ష్యాల విషయంలో క్రమశిక్షణ ఎంతో అవసరం. బడ్జెట్ ఈ క్రమశిక్షణను అలవాటు చేస్తుంది. బడ్జెట్ మన ఖర్చులను ప్రాధాన్యతల వారీగా విభజిస్తుంది. వాటికి అవసరమైన మేర నిధులను కేటాయిస్తుంది. తమకంటూ ఓ బడ్జెట్ రాసుకుని దాని ప్రకారం నడిచే వారు, ఏ బడ్జెట్ లేకుండా సాగిపోయేవారితో పోలిస్తే మరింతగా పొదుపు చేయగలుగుతున్నట్టు ఎన్నో సర్వేల్లో వెల్లడైంది. బడ్జెట్ వల్ల ప్రతీ నెలా దేనికి ఎంత వినియోగించాలనే స్పష్టత ఉంటుంది. ఇది లేకపోతే అసలు కుటుంబ అవసరాలకు ఎంత కావాలి, పెట్టుబడులకు ఎంత కావాలన్న స్పృహ ఉండదు. దాంతో అనవసర ఖర్చులకు సంపాదనంతా తరిగిపోతుంది. ఫలితంగా అవసరాలప్పుడు చేయి చాచే పరిస్థితి ఎదురవుతుంది. దాహం వేసినప్పుడు బావి తవ్వుకోవడం మాదిరిగా బడ్జెట్ లేని వారి వ్యవహారం ఉంటుందని చెప్పుకోవచ్చు. బడ్జెట్ ఇలా ముందుగా ఏ ఏ రూపాల్లో ఎంత ఆదాయం వస్తుందో నోట్ చేసుకోవాలి. వేతనం రూపంలో, ఇంటి అద్దెల రూపంలో, డిపాజిట్లపై వడ్డీ, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే డివిడెండ్ ఆదాయం ఇవన్నీ ఆదాయంలో భాగమే. తర్వాత ఖర్చులన్నింటినీ పేపర్‌పై పెట్టండి. ప్రాధాన్యతల వారీగా వాటికి నిధులను కేటాయించాలి. కిరాణా బిల్లు, ఇంటి పనులు చేసే వ్యక్తికి ఇచ్చే వేతనం, పెట్రోల్, ఏదైనా రుణం తీసుకుని ఉంటే దానికి నెలనెలా చెల్లించే వాయిదా(ఈఎంఐ), పిల్లలు ఉంటే వారి స్కూల్ ఫీజులు, బీమా ప్రీమియం ఇలా ముఖ్యమైన ప్రతీ ఖర్చునూ రాసుకోవాలి. బడ్జెట్ సూత్రం 50:30:20 అనేది బడ్జెట్‌కు సంబంధించి ఎక్కువగా ఆచరించే ముఖ్య సూత్రం. వస్తున్న ఆదాయంలో 50 శాతం కనీస అవసరాలకు కేటాయించాలి. అంటే ఆహారం, నివాసం, వస్త్రాలు, వైద్యం ఇవన్నీ కనీస అవసరాల కిందకు వస్తాయి. ఇక 30 శాతం ఆదాయాన్ని మీ విచక్షణ మేరకు వినియోగించుకోవచ్చు. అంటే విందులు, వినోదాలకుమాట. మిగిలిన 20 శాతాన్ని తప్పకుండా పొదుపు చేయాల్సిందే. పొదుపు అంటే మిగల్చడం మాత్రమే కాదు, దాన్ని పెట్టుబడులకు మళ్లిస్తేనే వృద్ధి ఉంటుందని తెలుసుకోవాలి. అందరూ ఇదే సూత్రాన్ని పాటించాలనేమీ లేదు. ఎందుకంటే వారి వారి ప్రత్యేక అవసరాల రీత్యా 60:20:20 సూత్రాన్ని సైతం పాటించుకోవచ్చు. పట్టణ ప్రాంతాల్లో సగటు మధ్య తరగతి ఇళ్ల బడ్జెట్ ఈ సూత్రం ఇదే మాదిరిగా ఉంటుంది. ఉప పరిమితులు పైన రెండు రకాల సూత్రాలు చెప్పుకున్నాం. కనీస అవసరాలకు 50 నుంచి 60 శాతం, విచక్షణావసరాలకు 20 నుంచి 30 శాతం, పొదుపునకు 20 శాతం కేటాయింపులను చూశాం. ఇప్పుడు ప్రతీ విభాగంలోనూ ఒక్కోదానికి ఉపపరిమితులు కూడా విధించుకోవాలి. ఉదాహరణకు కనీస అవసరాల్లో కిరాణాకు ఇంత మొత్తం, ఆహారం, వస్త్రాలకంటూ ఇంత బడ్జెట్ చొప్పున కేటాయింపులు చేసుకోవాలి. ఇక రుణాలకు చేసే చెల్లింపులు నెలసరి ఆదాయంలో గరిష్టంగా 50 శాతానికి మించకుండా చూసుకోవాలి. రుణ చెల్లింపులు 50 శాతం మించితే విశ్రాంత జీవితానికి కేటాయింపులు, పిల్లల భవి ష్యత్ విద్యావసరాల లక్ష్యాలకు కేటాయింపుల ను త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత బీమా ప్రీమియం మొత్తం ఆదాయంలో 2 – 3 శాతానికి మించకుండా చూసుకోవాలి. ఉదాహరణకు రూ.5 లక్షల వార్షిక వేతనం ఉన్న వ్యక్తి వార్షికంగా రూ.10వేల నుంచి రూ.15వేల వరకు జీవిత బీమా కోసం కేటాయించుకోవచ్చు. ఇంత తక్కువతో సరైన బీమా కవరేజీనిచ్చేది టర్మ్ ప్లాన్లు మాత్రమే. అదే సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలో రూ.15 వేలు వెచ్చిస్తే రూ.3 లక్షలకు మించి బీమా కవరేజీ వచ్చే పరిస్థితి లేదు. పదేళ్ల తర్వాత పిల్లల ఉన్నత విద్యావసరాలకు ఇంత మొత్తం కావాలన్న లక్ష్యం, రిటైర్ అయిన తర్వాత కనీస జీవనానికి కావాల్సిన నిధి కోసం మంచి మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంచుకుని వాటికి వేతన ఖాతా నుంచి నెల నెలా ఆటోమేటిక్‌గా పెట్టుబడులు వెళ్లేలా ఈసీఎస్ ఇవ్వాలి. సర్దుబాట్లు విభాగం వారీ బడ్జెట్ కేటాయింపుల తర్వాత కొన్ని విభాగాల్లో కొంత మిగులు ఉండవచ్చు. ఆ మిగులును అత్యవసర పరిస్థితుల కోసం వినియోగించుకోవచ్చు. అలాగే ఈ మిగులును పొదుపు విభాగంలోకీ మళ్లించుకోవచ్చు. అంతేకానీ విచక్షణావసరాలకు మాత్రం మళ్లించరాదు. అనవసర వ్యయాల వల్ల అవసరమైన లక్ష్యాలు దెబ్బతింటాయి. సమీక్ష బడ్జెట్ రూపొందించుకుని దాన్ని ఆచరణలో పెట్టిన తర్వాత పరిశీలిస్తే... మీ ఖర్చులు, పొదుపులు స్పష్టంగా తెలిసిపోతాయి. దాంతో ఎక్కడ ఖర్చులను తగ్గించుకోవచ్చన్నదీ తెలుస్తుంది. అలాగే పొదుపు మొత్తాన్ని బట్టి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలను సైతం రూపొందించుకోవడం సులువు అవుతుంది. మొత్తం మీద బడ్జెట్ అనేది మన కోసం మనం రూపొందించుకుని నడిచే ఆర్థిక బాట. క్రమశిక్షణతో నడిపిస్తూ ఆర్థిక పరమైన ఆటుపోట్లను రాకుండా చూసే దిక్సూచీ. -
సేవింగ్స్ వడ్డీ ఆదాయంపై పన్ను ఉంటుందా..?
నేను బిర్లా సన్ లైఫ్‌కు చెందిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఫండ్‌లో ఏడాదిన్నర క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే ఈ ఫండ్ యూనిట్లను విక్రయించాను. అయితే సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ 30 శాతం మూల««దlన లాభాల పన్ను విధించింది. ఏడాది దాటిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే ఎలాంటి మూలధన లాభాల పన్ను ఉండదు కదా? మరి ఈ సంస్థ ఎందుకు పన్ను విధించింది? – పరమేశ్వర్, విజయవాడ దేశీయ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ ఫండ్స్‌కే మీరు చెప్పిన పన్ను నిబంధనలు లేదా రాయితీలు వర్తిస్తాయి. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌కు ఈ రాయితీలు వర్తించవు. డెట్ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలే ఇలాంటి గ్లోబల్ ఫండ్స్‌కు వర్తిస్తాయి. వీటిని ఈక్విటీ(ఇంటర్నేషనల్) ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఈ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోపే ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, స్వల్ప కాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది. ఈ పరంగానే బిర్లా సన్ లైఫ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఫండ్ మీకు 30 శాతం పన్ను విధించి ఉంటుంది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. నా వయస్సు 50 సంవత్సరాలు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సీ కింద ఇప్పటికే రూ. లక్షన్నర వరకూ పన్ను ప్రయోజనాలు పొందుతున్నాను. అదనపు పన్ను ప్రయోజనాలు పొందడం కోసం ఏదైనా బీమా లేదా పెన్ష న్ ప్లాన్ ను తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. – సుధాకర్, విశాఖపట్టణం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద జీవిత బీమా ప్రీమియమ్‌లు, పెన్షన్ ప్లాన్ ప్రీమియమ్లకు రూ. లక్షన్నర వరకూ పన్ను రాయితీ లభిస్తుంది. మీరు ఇప్పటికే ఈ పరిమితి వరకూ ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి, అదనంగా బీమా, పెన్షన్ ప్లాన్ లు తీసుకున్నా, ఈ సెక్షన్ కింద ఎలాంటి పన్ను మినహాయింపులు మీరు పొందలేరు. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్ పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80 సీ కింద మరో రూ.50,000 వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఆరోగ్య బీమా తీసుకుంటే దానికి సెక్షన్ 80 డి కింద మరో రూ.25,000 వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. వీటితో పాటు కొన్ని రుణాలు, వ్యయాలు, విరాళాలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. నేను నా తల్లిదండ్రుల కోసం ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నాను. దీని నుంచి సూపర్ టాప్ అప్ ప్లాన్ కు పోర్ట్ చేసుకోవచ్చా ? – గణేశ్, తిరుపతి సాధారణంగా మీరు ఒక సంస్థ నుంచి వైద్య బీమాను తీసుకున్నారనుకోండి. ఈ బీమా పాలసీని మరో సంస్థకు పోర్ట్ (బదిలీ) చేసుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, బీమా తీసుకోకముందే ఉన్న జబ్బుల కవరేజ్ వంటి ప్రయోజనాలు నష్టపోకుండా ఇలా పోర్ట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్ పీ)లాగానే ఈ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కూడా మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో మీ నంబర్ మారకుండానే టెలిఫోన్ ఆపరేటర్‌ను మార్చుకునే వీలు ఉంది కదా. ఇలాంటిదే ఇది కూడా. ఈ బీమా పోర్టబిలిటీలో ఒకే విధమైన లేదా ఒకే సెగ్మెంట్ పాలసీలను బదిలీ చేసుకోవడానికే వీలుంటుంది. అంతేకాని మీరు తీసుకున్న బీమా పాలసీల నుంచి సూపర్ టాప్–అప్ ప్లాన్లకు పోర్ట్ చేసుకోవడానికి వీలుండదు. నేను, నా భార్య కలసి ఒక బ్యాంక్‌లో జాయింట్ సేవింగ్స్ ఖాతా తెరిచాము. ఈ ఖాతాలోని నిల్వపై వచ్చే వడ్డీని ఐటీ రిటర్న్‌ల్లో చూపాలా ? సేవింగ్స్ ఖాతాపై వచ్చిన వడ్డీ ఆదాయంపై ఏమైనా రాయితీలు ఉన్నాయా? ఐటీ రిటర్న్‌ల్లో ఏ పద్దు కింద ఈ వడ్డీ ఆదాయాన్ని చూపాలి ? – జావేద్, కరీంనగర్ సేవింగ్స్ ఖాతాలోని మొత్తంపై వచ్చే వడ్డీని ఐటీ రిటర్న్‌ల్లో చూపాల్సిందే. మీది జాయింట్ అకౌంట్ కాబట్టి, మీ భార్యకు ఎలాంటి సంపాదన లేకపోతే, ఈ వడ్డీ ఆదాయాన్ని మీ ఆదాయంతో కలిపి చూపాలి. ఒక వేళ మీ భార్య ఉద్యోగం / వ్యాపారం నిర్వహిస్తున్నట్లయితే మీ ఆదాయంతో కానీ, లేద , మీ భార్య ఆదాయంతో కానీ కలిపి చూపించాలి. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం అనే పద్దు కింద సేవింగ్స్ ఖాతా నుంచి వచ్చే వడ్డీని చూపించాలి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 టీటీఏ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని సేవింగ్స్ ఖాతాల్లోని వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంతకు మించిన వడ్డీ ఆదాయం ఆర్జిస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు వడ్డీ సర్టిఫికెట్లు దాఖలు చేయాల్సిన పనిలేదు. అయితే దీనికి సంబంధించిన ఒరిజినల్‌ను మాత్రం మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి. ఎవరైనా అసెసింగ్ ఆఫీసర్ ట్యాక్స్ స్క్రూటినీ నిర్వహిస్తే అప్పుడు ఈ వడ్డీ సర్టిఫికెట్ ఒరిజినల్‌ను చూపించాల్సి ఉంటుంది. – ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
పొదుపుతోనే ఆర్థిక భద్రత
నాబార్డ్ ఏపీ సీజీఎం సత్యనారాయణ అమలాపురం టౌ¯ŒS : పొదుపుతోనే ప్రతి వ్యక్తికి ఆర్థిక భద్రత లభిస్తుందని నాబార్డ్ ఏపీ సీజీఎం వీవీవీ సత్యనారాయణ అన్నారు. బ్యాంకుల సేవలను నూరు శాతం సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక భద్రత కల్పించుకోవాలని ఆయన సూచించారు. స్థానిక ఏఎస్ఎ¯ŒS కళాశాలలో శుక్రవారం జరిగిన వివిధ బ్యాంకర్లతో జరిగిన ఆర్థిక సమ్మిళిత అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనాన్సియల్ సర్వీస్ డిపార్ట్మెంట్, మినిస్ట్రీ ఫైనా¯Œ్స, జిల్లా లీడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో జిల్లాకు చెందిన అన్ని బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళా శక్తి సంఘాల ప్రతినిధులు, చిరు వ్యాపారులు, రైతు క్లబ్‌ల ప్రతినిధులు, రైతు మిత్రులు కూడా హాజరై బ్యాంకుల నుంచి సేవలను పొందే విషయాలపై సందేహాలను అధికారుల ముందు ఉంచి నివృత్తి చేసుకున్నారు. వివిధ బ్యాంకుల అధికారులు సమన్వయం, సహకారంతో ఆర్థిక సమ్మిళితకు పాటు పడాలని సదస్సు నిర్ణయించింది. జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ బీవీఎం సుబ్రహ్మణ్యం, డీసీసీబీ సీఈవో మంచాల ధర్మారావు, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, జిల్లా చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మ¯ŒS టి.శ్రీనివాసరావు సదస్సులో ప్రసంగించారు. సాంకేతిక సేవలను ఎలా ఉపయోగించుకుని ఆర్థిక భద్రత కల్పించుకోవాలని అనే అంశాలపై బ్యాంకుల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. -
కలల సాకారానికి 'సిప్ టాపప్'
పెంచుకుంటూ వెళితే అనూహ్య రాబడి అఖిల్‌కు ఈ మధ్యే పెళ్లయింది. త్వరగా సొంతింటి యజమాని కావాలనే కోరిక ఉంది. రెండేళ్లలో కార్లో తిరిగేయాలనే కల కూడా కళ్ల ముందు కదులుతోంది. మున్ముందు పుట్టబోయే పిల్లలకయ్యే ఖర్చు, వారి విద్యావసరాలను తట్టుకునేలా పొదుపు చేయాలని కూడా ఉంది. నిజానికి అఖిల్‌కే కాదు!! ప్రతి వ్యక్తికీ కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా కొన్ని ఆర్థిక లక్ష్యాలుంటాయి. ఈ లక్ష్యాలను ఎక్స్‌ప్రెస్ వేగంతో చేరుకోవాలంటే ‘టాపప్’ తల్లి గురించి తెలుసుకుని తీరాలి... కలలు, లక్ష్యాలు త్వరగా సాకారం కావాలంటే అందుకు తగ్గ కృషి చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇటువంటి కోర్కెల జాబితా అందరికీ ఉంటుంది. కానీ, ఎంతమంది వీటిని నెరవేర్చుకుంటున్నారు? అని అడిగితే చాలా తక్కువ మందేనన్న సమాధానం వినిపిస్తుంది. దీనికి కారణాలను అన్వేషిస్తే... వారు లక్ష్యాన్ని తగిన విధంగా నిర్దేశించుకోలేకపోవడం, అందుకు తగ్గట్టుగా మదుపు చేయకపోవడమే అయి ఉంటుంది. సాగిపోవాల్సిన మార్గమిదే వార్షికాదాయం రూ.10 లక్షలు. సాధారణంగా దీనికి పది రెట్ల వరకు లక్ష్యాన్ని నిర్ణయించుకోవచ్చు. అంటే రూ.కోటి సమకూర్చుకోవాలి. ఇప్పుడు ఈ కోటి రూపాయలను పదేళ్ల కాలంలో 120 నెలల్లో చేరుకునేలా ప్లాన్ చేసుకుని ఆ మేరకు క్రమానుగత పెట్టుబడి (సిప్) పెడుతూ వెళ్లాలి. పొదుపు, మదుపులకు సిప్ ఉత్తమ సాధనం అని వినే ఉంటారు. పెట్టుకున్న లక్ష్యాలను వేగవంతంగా చేరుకోవాలంటే సిప్‌కు సిప్ టాపప్‌ను తగిలించుకోవడమే ఉత్తమం. అంటే సిప్ మొత్తానికి అదనంగా టాపప్ రూపంలో మరికొంత మదుపు చేసుకుంటూ వెళ్లాలి. దీన్నే దగ్గరిదారి అని చెప్పవచ్చు. టాపప్ ఎలా..? ప్రతీ ఆరు నెలలు లేదా ఏడాదికోసారి, లేదా మీ వెసులుబాటు ఆధారంగా సిప్ టాపప్ ఎంచుకోవచ్చు. కనీసం రూ.500 నుంచి గరిష్టంగా మీ వెసులుబాటు వరకు. ఏటా వేతనం ఎంతోకొంత పెరుగుతూనే ఉంటుంది కనుక 10 శాతం చొప్పున సిప్ టాపప్ పెరిగేలా చూసుకుంటే సరిపోతుంది. సిప్ టాపప్ అన్నది పెట్టుబడి దారులు తమ లక్ష్యాలను తొందరగా చేరుకునేందుకు ఉకపరించే ఉత్తమ సాధనం. మహిమ ఇదీ... సిప్ టాపప్ కొద్ది మొత్తమే కావచ్చు. కానీ పెట్టుబడుల విలువను గణనీయంగా పెంచడంలో దీనికిదే సాటి. ఉదాహరణకు అఖిల్ లక్ష్యం రూ.5వేల చొప్పున సిప్ రూపంలో మదుపు చేయడం. కాల వ్యవధి పదేళ్లు. ఏటా 12 శాతం చొప్పున రాబడి (నెలవారీ కాంపౌండెడ్) ఉంటే పదేళ్ల తర్వాత పెట్టుబడుల విలువ రూ.11,79,275. కానీ, సిప్ టాపప్ రూపంలో ఏటా ఓ పది శాతం చొప్పున అదనంగా అఖిల్ పొదుపు చేయాలని నిర్ణయించుకుంటే పదేళ్ల తర్వాత సమకూరే మొత్తం రూ.17,20,659. ఎంతలో ఎంత తేడా చూశారా...? కేవలం పది శాతం అదనంగా టాపప్ రూపంలో యాడ్ చేసుకుంటూ వెళ్లడం వల్ల రూ.5,41,384 రూపాయల నిధి అదనంగా సమకూరింది. దీన్ని చూస్తే లక్ష్యాన్ని త్వరగా చేరుకునేందుకు దగ్గరి దారి సిప్ టాపప్ అని అర్థమయ్యే ఉంటుంది. ఉదాహరణకు నెలకు రూ.5,098 రూపాయలను సిప్ చేస్తూ, ఏటా పది శాతం చొప్పున పెట్టుబడి పెరిగేలా సిప్ టాపప్ ఎంపిక చేసుకుంటే... 12 శాతం రాబడి చొప్పున 20 ఏళ్ల కాలంలో రూ.కోటి నిధిని సమకూరుతుంది. రూ.3 కోట్లు కావాలనుకుంటే ప్రతి నెలా రూ.15,295 చొప్పున సిప్ చేస్తూ ఏటా 10 శాతం పెరిగేలా సిప్ టాపప్ ఎంచుకుంటే సరి. నెలకు కేవలం రూ.5వేల చొప్పున పెట్టుబడికే పరిమితం అయితే రూ.3.13 కోట్ల నిధి కోసం 35 ఏళ్ల పాటు నిరీక్షించాల్సి ఉంటుంది. టాపప్ ఎప్పుడు...? ఏటా టాపప్ పెంచుకోవడం ఎప్పుడన్న సందేహం వస్తే... వేతనం పెరిగి చేతికి అందే సమయమే అనువైనదని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎక్కువ మందికి పెరిగిన వేతనం ఏప్రిల్ నెలలో చేతికి అందుతుంది. అంటే ఏటా ఏప్రిల్‌లో సిప్ టాపప్‌ను నిర్ణయించుకుంటే... ఆ మేరకు బ్యాంకు నుంచి అదనంగా మ్యూచువల్ ఫండ్ సంస్థకు వెళుతుంది. లేదు వెసులుబాటు ఉందనుకుంటే ఆరు నెలలకోసారి కూడా సిప్ టాపప్ పెంచుకోవచ్చు. సిప్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలోనే టాపప్ సిప్‌కు సంబంధించి స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ సమర్పిస్తే సరిపోతుంది. ఏటా రూ.2 వేలు లేదా అప్పటికే ఉన్న సిప్ మొత్తంపై పది శాతం చొప్పున పెరిగే ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. లాభాలు ⇒ సిప్ టాపప్ అనేది పెట్టుబడి దారుల కోర్టులో ఉన్న బాల్ తో సమానం, మీరు డిసైడ్ చేసినట్టు అది వెళుతుంది. దీని సాయంతో స్వల్ప కాల, దీర్ఘకాల లక్ష్యాలను త్వరగా చేరుకోవచ్చు. ⇒ ద్రవ్యోల్బణ ప్రభావానికి మించి రాబడులు అందుకోవాలంటే ఏటా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను పెంచుకోవాలి. అందుకు సిప్ టాపప్ ఓ సాధనం. ⇒ ఏటా వేతనం పెరుగుతూనే ఉంటుంది. కానీ, అందుకు తగ్గట్టు పొదుపు, మదుపులు పెరుగుతున్నాయా..? చాలా మంది అవును అని చెప్పలేని స్థితి. సిప్ టాపప్ పత్రంపై ఒక్కసారి సంతకం పెడితే పెరిగే వేతనానికి తగ్గట్టు అదే పొదుపు చేసుకుంటూ వెళుతుంది. ⇒ మీ ఆదాయ పెరుగుదల, బోనస్, ఇతరత్రా లభించే ప్రయోజనాలకు తగ్గట్టు, మీ వెసులుబాటుకు అనుగుణంగానే టాపప్ నిర్ణయించుకునే వెసులుబాటు ఉంది. -
'రికరింగ్'తో రిలీఫ్!
కొందరు రికరింగ్ డిపాజిట్ అనొచ్చు. మరికొందరు ఆర్డీ అనొచ్చు. ఎలా పిలిచినా... పొదుపు చేసేవారి జీవితంలో ఇది ఎప్పుడో ఒకప్పుడు తారసపడుతూనే ఉంటుంది. కాకపోతే ఈ సులువైన పొదుపు సాధనంలో ఉన్న ప్రయోజనాలు చాలామందికి తెలియవనే చెప్పాలి. వాటి పై అవగాహనే ఈ కథనం... నిజానికి ఆర్డీ అనేది ఈజీగా ఎంచుకునే పొదుపు సాధనం. నిర్దిష్ట కాలానికి, నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా మదుపు చేసే సౌలభ్యం ఈ డిపాజిట్లో ఉంది. రెండేళ్లో, నాలుగేళ్లో... ఎంతో కొంత కాలాన్ని ముందే నిర్ణయించుకుని, అప్పటిదాకా నెలనెలా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేస్తే... ముందే నిర్ణయించిన రేటు మేరకు వడ్డీ అందుతుంది. ఉదాహరణకు నెలకు రూ.1,000 చొప్పున 24 నెలలు పొదుపుచేద్దామనుకుంటే బ్యాంకులో ఆర్డీ ఖాతా తెరవొచ్చు. ఎంచుకునే కాలాన్ని బట్టి వడ్డీరేటు దాదాపు 7.5 శాతం వరకూ ఉంది. ⇒ స్వల్ప మొత్తాల పొదుపునకు మెరుగైన సాధనం ⇒ పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఈజీగా తెరవొచ్చు ⇒ ఆన్‌లైన్‌లోనూ సొంతగా తెరుచుకునే వీలు ⇒ నిర్దిష్ట వ్యవధికి వడ్డీ గ్యారంటీ; నష్టభయం ఉండదు ⇒ స్వల్పకాలిక లక్ష్యాలకు ఆర్డీ మేలంటున్న నిపుణులు స్వల్పకాలిక లక్ష్యాలంటే...? కొత్తింటి కొనుగోలుకు కొంత డౌన్‌పేమెంట్ కావాలి. ఉంటున్న ఇంటికి మరమ్మతులు, అదనపు హంగులు కావాలంటే... రెండు మూడేళ్ల వ్యవధిలో ఇంట్లో వారికి పెళ్లి చేయాల్సి రావటం. సెలవుల్లో కుటుంబంతో కలసి విహార యాత్రకు వెళ్లటం ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, మోటార్‌సైకిల్, కారు లేదా ఫ్రిజ్, టీవీ, వాషింగ్‌మెషీన్ల వంటి వైట్ గూడ్స్ కొనుగోలు స్వల్పకాలిక లక్ష్యాలకు ఉత్తమం... ఆర్డీ చాలా సురక్షితం. తప్పనిసరిగా రాబడులొస్తాయి. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి సహజంగా విశ్లేషకులు చెప్పేదేంటంటే... 8 నుంచి 9 సంవత్సరాల్లో అవి మంచి ఫలితాలిస్తాయని. స్వల్పకాలంలో అయితే నష్టాలు రావొచ్చని హెచ్చరిస్తుంటారు. తప్పుడు షేర్లలో పెట్టుబడులు పెడితే లాభం కాదుకదా... అసలుకే ఎసరు రావొచ్చు. ఆర్డీతో అలాంటిదేమీ ఉండదు. మార్కెట్ రేటు రిటర్న్ గ్యారంటీ. దీన్నిబట్టి చూస్తే ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి సంబంధించిన స్వల్పకాలిక లక్ష్యాలకు రికరింగ్ డిపాజిట్ ఉత్తమం. నిజానికి మనం దీర్ఘకాలిక పెట్టుబడుల గురించే ఆలోచిస్తుంటాం తప్ప... స్వల్పకాలం అవసరాలను గుర్తించం. స్వల్ప మొత్తం... తేలిగ్గా పరి ష్కారం అయిపోతుం దిలే అనుకుంటాం. కానీ అక్కడే ఇబ్బంది పడతాం. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాల పెట్టుబడులకు సైతం అమాంతంగా బ్రేక్ వేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. ఎలా బాగుంటుంది.... ఉదాహరణకు మీరు వచ్చే 18 నెలల్లో మూడు లక్ష్యాలు పెట్టుకున్నారు. అందులో రూ.20,000 ఫోన్, పాపకు రూ.30,000 చిన్న ఆభరణం. అబ్బాయి ఉన్నత విద్యకు తొలి విడత ఫీజు రూ. 25,000. వీటిని తేలిగ్గా చేరుకోడానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల కాలానికి తగిన నెలవారీ చెల్లింపులతో మూడు ఆర్డీలను తెరిస్తే చాలు. అనుకున్నది సాధించొచ్చు. ఇంకో విషయమేంటంటే... ఆర్డీలు తెరిచాక తప్పనిసరిగా డబ్బు చెల్లించాలి కనుక... సహజంగానే మీరు పొదుపరులుగా మారిపోతారు. దుబారా తగ్గించుకుంటారు. ఖర్చులపై ఆచితూచి తీసుకునే నిర్ణయాలు... దీర్ఘకాలంలో చక్కని ఫలితాలనిస్తాయి. అకౌంట్ తెరవడమూ కష్టం కాదు... బ్యాంక్‌కు వెళ్లి... అకౌంట్ కాగితాలు తీసుకుని... పూర్తిచేయాల్సిన అవసరమేదీ ఇప్పుడు లేదు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ పేజీకి వెళ్లి... క్షణాల్లో అకౌంట్‌ను స్వయంగా తెరవొచ్చు. నెలవారీ ఎంత చెల్లించాలనుకుంటున్నారు? కాల వ్యవధి ఎంత? ఏ తేదీన మీ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు? ఇలాంటివన్నీ ఆన్లైన్ అప్లికేషన్లోనే పూర్తిచేసేయొచ్చు. మరో విషయమేంటంటే... మీరు ఆర్డీలను ప్రత్యక్షంగా బ్యాంక్ అకౌంట్‌కే లింక్ చేసుకుంటే... నెలనెలా మీరు నగదు బదిలీ చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిగ్గా మీ ఖాతా నుంచి డబ్బులు ఆర్డీకి జమ అయిపోతాయి. వడ్డీపై పన్ను చెల్లించాల్సిందే... వడ్డీపై గతంలో పన్ను మినహాయింపు ఉండేది. ఇపుడు లేదు. ఆర్డీ మొత్తానికి మాత్రం పన్ను మినహాయింపు ఉంటుంది. కొంత వడ్డీ కోతతో ఎప్పుడైనా మీ ఆర్డీని బ్రేక్ చేసుకునే వీలుంది. కొన్ని బ్యాంకుల్లో నెలవారీ డిపాజిట్ మొత్తాన్ని కొంత పెంచుకోవచ్చు కూడా. కాకపోతే తగ్గించడానికి వీలుపడదు. ఆర్డీ వడ్డీని చక్రగతిన మూడు నెలలకోసారి లెక్కిస్తారు. ఆర్డీలో నామినేషన్ సౌలభ్యం ఉంది. దీన్లో జమయిన మొత్తంపై 80 నుంచి 90 శాతం వరకూ రుణం కూడా తీసుకోవచ్చు. పోస్టాఫీసుల విషయంలో ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి అకౌంట్‌ను మార్చుకోవచ్చు. ఇద్దరు పెద్దలు కలసి జాయింట్ అకౌంట్‌నూ తెరవొచ్చు. నెలలో నిర్దిష్ట కాలంలో డిపాజిట్ చెల్లించకపోతే రూ.5కు ఐదు పైసల జరిమానా ఉంటుంది. నాలుగు రెగ్యులర్ డిఫాల్ట్స్కు అనుమతి ఉంది. అలా జరిగితే రెండునెలల్లో డిపాజిట్‌ను పునరుద్ధరించుకోవచ్చు. లేదంటే తదుపరి డిపాజిట్ చెల్లించడానికి కుదరదు. కనీసం ఆరు విడతల డిపాజిట్లు ముందే కట్టేస్తే... రాయితీ లభిస్తుండడం మరో విశేషం. డిపాజిట్‌కు ఒకవేళ మీరు చెక్ ఇస్తే... ఆ మొత్తం ప్రభుత్వ ఖాతాలో పడిన తర్వాతే మీరు చెల్లింపులు జరిపినట్లుగా భావిస్తారు. డిపాజిట్-కాలం.. కనీసం ఎంత? రికరింగ్ డిపాజిట్లో నెలకు డిపాజిట్ చేయాల్సిన కనీస మొత్తం... కాల వ్యవధి బ్యాంకును బట్టి మారుతుంటాయి. ఎస్బీఐ, పీఎన్బీ, ఆంధ్రాబ్యాంక్ వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనీసం రూ.100 తోనే ఆర్డీ ప్రారంభించవచ్చు. ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ వంటి ప్రైవేటు బ్యాంకుల్లో ఈ మొత్తం కనీసం రూ.500 లేదా రూ.1,000గా ఉంది. పోస్టాఫీసులో కనిష్టంగా రూ.10. గరిష్ట పరిమితి ఎక్కడా లేదు. ఇక కాల వ్యవధి ఆరు నెలల నుంచి పదేళ్ల వరకూ ఉంది. -
సేవింగ్స్ డిపాజిట్లపై ఇంత భారీ వడ్డీలా?
న్యూఢిల్లీ : ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోకపోయినప్పటికీ, సేవింగ్స్ ఖాతాపై వడ్డీరేట్లు అధికంగా ఉండడం పట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సేవింగ్స్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు కొనసాగడం అవసరమా అని ప్రశ్నించారు. ఈ డిపాజిట్లపై అధిక వడ్డీల వల్ల రుణ వ్యయాలు పెరిగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీస్తుందన్నారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఏర్పాటై 140 ఏళ్లయిన సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్ఈలో కమోకాగా, కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్‌ను త్వరలో ప్రారంభిస్తామని బీఎస్ఈ పేర్కొంది. వ్యవసాయేతర కమోడిటీలు- లోహాలు, ఆయిల్, గ్యాస్ వంటి కమోడిటీల్లో డెరివేటివ్ ట్రేడింగ్ కోసం అనుమతి ఇవ్వాలంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేశామని తెలిపింది. -
పొదుపు పేరిట కుచ్చుటోపీ
బోర్డు తిప్పేసిన రోస్ వ్యాలీ నారాయణఖేడ్ : తమ వద్ద పొదుపు చేస్తే అధిక వడ్డీ ఇస్తామని, ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా రెట్టింపు డబ్బులిస్తామంటూ నమ్మించిన ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతానికి చెందిన రోస్‌వ్యాలీ హోటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ సంస్థ హాలీడే మెంబర్షిప్ టైం షేర్‌గా పేర్కొంటూ మనూరు మండలం గూడూరు, మనూరు, దన్వార్, ముక్టాపూర్ గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలను 500 మందిని సభ్యులుగా చేర్చుకుంది. రూ.500 మొదలుకొని రూ.1,100 వరకు నెలసరి చెల్లించే పద్ధతిన సభ్యత్వం చేసుకొని హాలీడే మెంబర్షిప్ ప్లాన్ సర్టిఫికెట్‌ను బాండ్‌గా పేర్కొంటూ జారీచేశారు. మహిళలు నిరక్షరాస్యులు కావడంతో సంస్థ సభ్యులు ఇచ్చిన కాగితాన్ని తమ వద్ద ఉంచుకొని ఏడాదిన్నరగా ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తున్నారు. ఇలా ఐదేళ్ల పాటు చెల్లిస్తే రూ. లక్ష వరకు అందజేస్తామని సంస్థ చెప్పింది. ఈ మేరకు సదరు సంస్థ నారాయణఖేడ్‌లో కార్యాలయాన్ని తెరిచింది. అయితే, ఇటీవల ఏజెంట్లు సక్రమంగా ఉండకపోవడం, కార్యాలయం సైతం మూసి ఉండడంతో మహిళలు రెండు మూడు నెలలుగా డబ్బులు చెల్లించడం నిలిపివేశారు. మంగళవారం కార్యాలయం తెరచి ఉండడం, అందులో కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఏజెంట్ గంగావార్ రమేష్ ఉండడంతో అతన్ని ఘెరావ్ చేశారు. తానే ఏజెంట్‌ను మాత్రమేనని, తమ సంస్థ ఎండీ సుబమయ్యదత్తు అని పవన్‌కుమార్ అనే మరో ఏజెంట్ ఉన్నాడని తెలిపారు. మహిళలు, స్థానికులు ఏజెంట్ రమేశ్‌ను ఘెరావ్ చేస్తూ తమ డబ్బులు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. -
మహిళలకూ కావాలి జీవితబీమా!
మన సమాజంలో స్త్రీలకు సముచిత స్థానముంది. ముఖ్యంగా మన దేశంలో కుటుంబ ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో గృహిణులదే కీలక పాత్ర. పొదుపులో మహిళలే ముందుంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాకపోతే కొద్ది మంది మాత్రమే వారికోసమో, కుటుంబ సభ్యుల కోసమో జీవిత బీమా చేస్తుంటారు. ప్రస్తుతం పలు సాధనాలు అందుబాటులోకి రావటంతో మహిళల్లోనూ చైతన్యం పెరిగింది. మేం ఇప్పటికే బీమా, ఎఫ్డీలు, ఇతర పెట్టుబడి సాధనాల విషయంలో మహిళల్లో గణనీయమైన మార్పుల్ని చూస్తున్నాం. మహిళలకే ఎందుకు? ఈ రోజుల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవడమనేది ఎంతో అవసరం. మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మహిళలకిది చాలా అవసరం. ఉద్యోగినులకు, గృహిణులకు, ఒంటరి ఆడవాళ్లకు జీవిత బీమాలో పొదుపు చేయడమనేది అనేక సందర్భాల్లో ఆర్థిక స్వేచ్ఛనిస్తుంది. నిజానికి భారత్‌లో చిన్నమొత్తాల పొదుపు అనేది మహిళల సామ్రాజ్యం. స్టాక్ మార్కెట్లలో పొదుపు చేసే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్(యూఎల్ఐపీ) వంటివి ఎంచుకోవటం ద్వారా పొదుపు చేయటంతో పాటు బీమా రక్షణ కూడా పొందొచ్చు. మార్కెట్లలో పెట్టుబడులుంటాయి కనుక మెరుగైన రాబడులూ ఆశించవచ్చు. సాధారణంగా పిల్లల చదువు, పెళ్లిళ్లు, సొంతింటి కొనుగోలు, పదవీ విరమణ తరువాత జీవితం... ఇలాంటి జీవితావసరాల కోసం సంప్రదాయ ‘విత్ ప్రాఫిట్స్’ పథకాలను ఎంచుకోవచ్చు. జీవితానికి రక్షణ... జీవితంలో ప్రధాన సందర్భాల్లో పెట్టే ఖర్చులకు జీవిత బీమా సమర్థంగా పనికొస్తుంది. దీనికితోడు మహిళలకు తక్కువ ప్రీమియం ఉంటుంది కూడా. ప్రత్యేకించి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్సుల్లో మహిళలకు ప్రీమియంలో డిస్కౌంట్ తప్పనిసరిగా ఉంటుంది. మహిళలు తమ అవసరానికి తగ్గట్టుగా వీటిని ఉపయోగించుకోవచ్చు. కావాలంటే పూర్తిస్థాయి టర్మ్ పాలసీనే ఎంచుకోవచ్చు. లేనిపక్షంలో ప్రాఫిట్స్‌తో కూడిన జీవిత బీమా పాలసీనైనా తీసుకోవచ్చు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లోనూ.... ఆరోగ్య బీమాతో పాటు కొన్ని రకాలైన తీవ్ర అనారోగ్యాలకు వ ర్తించే క్రిటికల్ ఇల్నెస్ కవర్‌తో కూడిన బీమా అయితే అటు ప్రీ మియం విషయంలోనూ, ఇటు కవరేజీ విషయంలోనూ చక్కని ప్రయోజనం పొందొచ్చు. ఎందుకంటే కొన్ని తీవ్రమైన అస్వస్థతల విషయంలో అయ్యే ఖర్చును భరించటం మామూలు విషయం కాదు. ఆర్థికపరమైన బాధ్యతల నుంచి తప్పుకోవటంతో పాటు ఇంట్లో పనుల్ని కూడా వేరొకరికి అప్పగించాల్సి వస్తుంది. అందుకని ఇలాంటివన్నీ తట్టుకునేలా మహిళలకోసం ప్రత్యేకమైన ఉత్పత్తులున్నాయి. అవి మరీ క్లిష్టమైనవేమీ కాదు. ఈజీగానే అర్థం చేసుకుని ఎంచుకోవచ్చు. తరువాతి వారికి ఇవ్వాలన్నా...! కొందరు మహిళలు తమ కుటుంబానికి తగినంత మొత్తం ఇవ్వాలనుకుంటారు. పిల్లలకే కాక భర్తకు కూడా బాసటగా నిలవాలనుకుంటారు. మరికొందరైతే ధార్మిక సంస్థలకు చెప్పుకోదగ్గ స్థాయిలోనే దానధర్మాలు చేయాలనుకుంటారు. వారికి ఇవన్నీ చేయటానికి వీలు కల్పించే ఉత్పత్తుల్లో జీవిత బీమాదే ముందు వరస. మిగతావన్నీ తరువాతేనని చెప్పాలి. చివరిగా నా సలహా ఏంటంటే మహిళలు పాలసీ తీసుకున్నాం కదా అని ఊరుకోకుండా జీవితంలో మార్పు సంభవించిన ప్రతి సందర్భంలోనూ వాటినొకసారి సరిచూసుకోవాలి. అంటే పెళ్లి, పిల్లలు పుట్టడం, ఇతరత్రా కీలక ఘటనలు సంభవించినపుడన్న మాట. అవసరమైతే కొన్ని మార్పులు చేసుకోవాలి. అంతేకాదు!! ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తమ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలి. - ప్రదీప్ పాండే చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, ఫ్యూచర్ జెనరాలి లైఫ్ ఇన్సూరెన్స్ -
బతుకు కోరే బడ్జెట్.. నెలకు రూపాయే!
బతుకు కోరే బడ్జెట్.. నెలకు రూపాయే! ప్రమాద సందర్భాలలో దేశంలోని ప్రతి ఒక్కరికీ కొంత మేర ఆర్థిక చేయూతను ఇవ్వాలనే ముఖ్యోద్దేశంతో ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన పథకం ప్రారంభమైంది. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పథకం మొదలయింది. ప్రమాదం వల్ల సంభవించే మరణానికి లేదా అంగవైకల్యానికి ఇది బీమా రక్షణ కల్పిస్తుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని బ్యాంకుల ద్వారా నిర్వహిస్తోంది. ఏవైతే బ్యాంకులు బీమా కంపెనీలతో అనుసంధానమై ఉంటాయో ఆ బ్యాంకులు తమ సేవింగ్స్ అకౌంటు ఖాతాదారులకు ఈ పథకాన్ని అందజేస్తాయి. ఈ పథకం వివరాలను చూద్దాం. ఒక ఖాతాదారుడు ఒక బ్యాంకు ద్వారా మాత్రమే ఈ పథకాన్ని కలిగి ఉండే వీలుంది. {పీమియం సంవత్సరానికి 12 రూపాయలు. ఆ మొత్తం ఖాతాదారుని ఖాతా ద్వారా ఆటో డెబిట్ విధానంలో కట్ అవుతూ ఉంటుంది.ఈ పథకం ప్రతి సంవత్సరం జూన్ 1 నుండి మే 31 వరకు ఉంటుంది. మళ్లీ తర్వాత సంవత్సరానికి పొడిగించడానికి మే 31 లోపు ప్రీమియం కోసం తగిన మొత్తాన్ని ఖాతాలో ఉంచవలసి ఉంటుంది. ఖాతాదారుని సూచన మేరకు బ్యాంకు వారు ఆటో డెబిట్ ద్వారా ఖాతా నుండి ప్రీమియం సొమ్మును తీసుకుని బీమా కంపెనీకి చెల్లిస్తారు. కనీసం 18 సం. వయస్సు నుండి 70 సం. వయస్సు వరకు ఈ పథకంలో చేరవచ్చు.ఈ పథకంలో చేరిన వారికి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఈ కింద తెలియజేసిన విధంగా బీమా సొమ్ము అందుతుంది. ఎ) ఖాతాదారుడు మరణిస్తే 2 లక్షల రూపాయలు నామినీకి అందజేస్తారు. బి) రెండు కళ్లు / రెండు చేతులు / రెండు పాదాలు / ఒక కన్ను, చేయి, ఒక పాదం పనిచేయకపోతే 2 లక్షల రూపాయలు ఖాతాదారునికి అందజేస్తారు. సి) ఖాతాదారునికి ఒక కన్ను /ఒక పాదం / ఒక చెయ్యి పూర్తిగా పని చేయకపోతే 1 లక్ష రూపాయలు ఖాతాదారునికి అందజేస్తారు. డి) ఖాతాదారుని బ్యాంకు ఖాతాకు ఎవరైతే నామినీగా ఉంటారో వారినే ఈ పథకానికి కూడా నామినీగా నమోదు చేస్తారు. ఒక వేళ వేరేవారిని నామినీగా పెట్టదలచుకుంటే వారి వివరాలను బ్యాంకుకు అందజేసి నమోదు చేయించుకోవచ్చు. ఈ పథకంలో చేరిన తర్వాత కింది సందర్భాలలో బీమా రక్షణ ఉండదు. ఎ) 70 సం. వయసు నిండిన తర్వాత బీమా రక్షణ ఉండదు. ఇంకా... బి) బ్యాంకు ఖాతా మూసి వేసినప్పుడు సి) బ్యాంకు ఖాతాలో ప్రీమియం సొమ్మును జమ చేయనప్పుడు డి) ఒకవేళ ఒక బ్యాంకు ఖాతా కన్నా ఎక్కువ బ్యాంకులలో ప్రీమియం చెల్లించినా కూడా ఒక ఖాతాలోని పథకం ద్వారానే బీమా రక్షణ ఉంటుంది కానీ, తక్కిన ఖాతాల ద్వారా ఉండదు. అలాగే మిగతా ఖాతాల ప్రీమియంలను కూడా వెనక్కి ఇవ్వరు. {పతి సంవత్సం ప్రీమియం ఎంత అనేది ఈ పథకంలోని క్లెయిమ్‌లను సమీక్షించి మార్పులు, చేర్పులు చేస్తుంటారు.జూన్ 1 తర్వాత ఈ పథకంలో జాయిన్ అయితే బీమా రక్షణ జాయిన్ అయిన తేదీ నుండి మే 31 వరకు లభిస్తుంది. కానీ ప్రీమియం మొత్తం కట్టాలి.ఖాతాదారుని ఆధార్ నంబర్ని కీలక పత్రంగా పరిగణిస్తారు. కనుక ఆధార్ నంబర్ తప్పకుండా బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయి ఉండాలి.ఖాతాదారుని బ్యాంకు.. తన ఖాతాదారులందరికీ కలిపి మాస్టర్ పాలసీని కలిగి ఉంటుంది. ఈ పథకం ద్వారా చాలా తక్కువ ప్రీమియంతో సులభంగా ఖాతాదారులకు ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. రజని భీమవరపు ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’ -
ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎలా ప్రారంభించాలి?
ఫైనాన్షియల్ బేసిక్స్... చిన్న చిన్న నీటి బిందువులన్నీ కలిసి సముద్రంలా మారతాయి. అలాగే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లన్నీ కలిసి దీర్ఘకాలంలో కాం పౌండింగ్ ప్రక్రియ ద్వారా మనకు అధిక ప్రయోజనాన్ని అందిస్తాయి. ఎప్పడూ ఖర్చు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవద్దు. కొంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్నే ఖర్చుపెట్టండి. అంటే మొత్తం ఆదాయంలో కొంత భాగాన్ని ముందుగానే సేవింగ్స్/ఇన్వెస్ట్మెంట్లకు కేటాయించుకోవాలి. మనం ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నామనే విషయానికి ప్రాధాన్యమివ్వడం కన్నా... ఆ చేసే ఇన్వెస్ట్మెంట్లను ఎంత త్వరగా ప్రారంభించాం? వాటిని రెగ్యులర్‌గా సక్రమంగా క్రమశిక్షణతో చేస్తున్నామా? లేదా? అనే అంశాలపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్లను దీర్ఘకాలంలో కొనసాగిస్తే అధిక ప్రయోజనాలను పొందొచ్చు. ఎలాగంటే మంచి సేవింగ్స్/ ఇన్వెస్ట్మెంట్స్ ఒక విత్తనం లాంటివి అనుకుంటే... విత్తనం నుంచి చెట్టు ఎలా పెరుగుతుందో... అలాగే మన చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్ల నుంచి దీర్ఘకాలంలో మంచి ప్రయోజనాలను పొందుతాం. ఇన్వెస్ట్మెంట్లను ఎంత వీలైతే అంత త్వరగా ప్రారంభించడానికి ప్రయత్నించండి. -
ఆదాయంతో పాటు పొదుపూ పెరగాలి!
రఘు, ఆనంద్... ఇద్దరూ ఉద్యోగస్తులే. ఇద్దరూ పొదుపరులే. ప్రతినెలా కొంత మొత్తం పొదుపు చేయటం ఇద్దరికీ అలవాటు. అయితే రఘు ప్రతినెలా రూ.5000 చొప్పున పొదుపు చేయటం మొదలెట్టాడు. ఆనంద్ కూడా అలాగే మొదలుపెట్టినా... మొదటి ఏడాది గడిచాక జీతం పెరగటంతో పొదుపు మొత్తాన్ని కూడా పెంచాడు. అంతేకాదు! ప్రతి ఏటా కొంత మొత్తాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. పదేళ్లు తిరిగేసరికి ఏం జరిగిందో తెలుసా? ఆనంద్ పొదుపు రూపంలో పెంచింది కొద్ది మొత్తం. కానీ అతనికి సమకూరిన నిధిలో మాత్రం భారీ తేడా కనిపించింది. ఎంత తేడా అంటే... రఘు సమకూర్చుకున్న నిధికన్నా రెట్టింపు!!. మామూలు ఉద్యోగులకు, చిన్న వ్యాపారులకు రిటైర్మెంట్ తరవాత కూడా డబ్బు రావాలంటే ఒకే ఒక మార్గం పొదుపు. ప్రతినెలా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ... ఏడాదికోసారి పొదుపు మొత్తాన్ని పెంచుకుంటూ వెళితే రిటైర్మెంట్ సమయానికి భారీ నిధిని సమకూర్చుకోవచ్చు. అదెలాగో అంకెల్లో చూద్దాం. * క్రమం తప్పకుండా పెంచుకుంటే భారీ నిధి * ఎంత త్వరగా పొదుపు మొదలుపెడితే అంత బెటర్ మరో చిన్న ఉదాహరణ చూద్దాం. ముందే అనుకున్నట్లుగా ఆనంద్ ప్రతి ఏటా కొంత మొత్తాన్ని పెంచుకుంటూ పొదుపు చేస్తూ వెళ్తున్నాడు. అయితే సుధీర్ మాత్రం మూడేళ్లకోసారి పెంచుదామని అనుకున్నాడు. అలా పెంచే మొత్తం ఆనంద్ పెంచే మొత్తంకన్నా కాస్త ఎక్కువే ఉండేది. కానీ చివర్లో ఇద్దరి చేతికీ వచ్చిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ను చూస్తే... ఇక్కడా ఆనంద్‌దే పైచేయి. అంటే... క్రమం తప్పకుండా పద్ధతిగా పెంచుకుంటూ వెళితే కలిగే ప్రయోజనం ముందు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఒకేసారి పెంచటం వల్ల కలిగే ప్రయోజనం తక్కువే. అది అంకెల్లో ఒకసారి చూద్దాం...త్వరగా సేవింగ్స్ ప్రారంభించండి... ఎవ్వరికైనా నా సలహా ఏంటంటే... సేవింగ్స్‌ను ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచిది. కాంపౌండింగ్ ప్రక్రియ పోర్ట్‌ఫోలియోపై అధికంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 25 ఏళ్ల వయసులో నెలకు రూ.5,000 చొప్పున (10 శాతం వడ్డీరేటు) పొదుపు చేయటం మొదలు పెడితే... అతనికి 55 ఏళ్లు వచ్చే సరికి సేవింగ్స్ మొత్తం దాదాపుగా రూ.1.15 కోట్లు ఉంటుంది. అలాగే మరో వ్యక్తి కాస్త ఆలస్యంగా... అంటే 30 ఏళ్ల వయసులో నెలకు అదే రూ.5,000 చొప్పున పొదుపు చేయటం మొదలుపెడితే... 55 ఏళ్లు వచ్చేసరికి అతనికి జమయ్యే మొత్తమెంతో తెలుసా? రూ.67 లక్షలు. అంటే కేవలం ఐదేళ్లు ఆలస్యంగా మొదలుపెట్టినందుకు తనకు రూ.48 లక్షల వరకు తక్కువ వచ్చిందన్న మాట. నిజానికి తొలి ఐదేళ్లూ ఆయన పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ.60 వేలు చొప్పున ఐదేళ్లకు ఆయన పొదుపు చేసేది కేవలం రూ.3 లక్షలు. ఆ మొత్తాన్ని తొలి ఐదేళ్లలో పొదుపు చేయలేదు కనక ఆయన నష్టపోయింది రూ.48 లక్షలు. అదే కాంపౌండింగ్ మహిమ. అందుకే పొదుపు ఎంత త్వరగా ఆరంభిస్తే అంత మంచిది. ఇక మీ చేతుల్లో గనక డబ్బులు ఎక్కువగా ఉన్నట్లయితే... ఆ పొదుపును ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళితే ఇంకా మంచిది. పొదుపు చేయడానికి బ్యాంకు డిపాజిట్లు, పోస్టాఫీసు డిపాజిట్లే కాదు. మ్యూచ్‌వల్ ఫండ్లు, షేర్లు కూడా ఉన్నాయని గుర్తుంచుకోండి. వీటిలో రెగ్యులర్‌గా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానంలో పొదుపు చేయటం ఉత్తమం. అలాగే ఎమర్జెన్సీ ఫండ్‌ను కూడా ఏర్పాటు చేసుకోండి. ఏదైనా సమస్య వచ్చి ఆర్థిక పరిస్థితులు తలకిందులైతే ఇది మనల్ని ఆదుకుంటుంది.4 నుంచి 6 నెలల పాటు ఏ ఢోకా లేకుండా గడిపేయటానికి సరిపడేలా ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్లలో ఆలస్యం జరగకుండా డెరైక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆటోమేటిక్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్స్‌కు నగదును పంపే విధానాన్ని అవలంబించండి. ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ప్రణాళికలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ వెళ్లాలి. మన ఆదాయంతో నిమిత్తం లేకుండా రఘు మాదిరి ప్రతి నెలా ఒకే స్థిర మొత్తంలో (రూ.5,000) ఇన్వెస్ట్ చే స్తూ వెళితే .. అది పదేళ్లలో (10 శాతం వడ్డీ రేటు) రూ.49.7 లక్షలు అవుతుంది. అలా కాకుండా ఆనంద్ మాదిరిగా ఆదాయం పెరుగుదలతోపాటు ఇన్వెస్ట్మెంట్ ను కూడా పెంచుకుంటూ వెళితే (అంటే ఆదాయం ఎంతైనా అందులో 25 శాతం).. అదే పదేళ్ల కాలంలో, అదే 10 శాతం వడ్డీ రేటులో మన సేవింగ్స్ మొత్తం రూ.1.05 కోట్లు అవుతుంది. అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. చూడండి ఎంత తేడా ఉందో. ఇక్కడ శ్రీధర్ మాదిరి ఫిక్స్డ్ సేవింగ్స్ విధానంలో చివర్లో ఇన్వెస్ట్మెంట్లు పెంచినప్పుడు వచ్చే మొత్తం రూ.72 లక్షలుగా ఉంది. ఇది ఆనంద్ చేసిన డైనమిక్ సేవింగ్స్ విధానంలోని మొత్తం రూ.1.05 కోట్ల కన్నా తక్కువగానే ఉంది. -
వాటిని వేస్ట్ చేస్తే నాకు నచ్చదు!
తెలుగు పరిశ్రమలో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్గా దూసుకెళుతున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఇటీవల ఓ సందర్భంలో ఈ బ్యూటీ పొదుపు గురించి మాట్లాడారు. ముఖ్యంగా తన కళ్లెదుట ఆహారాన్నీ, నీటినీ వృథా చేసేవాళ్లను చూసినప్పుడు చాలా కోపం వస్తుందట. ఆ విషయం గురించి రకుల్ మాట్లాడుతూ - ‘‘ఆహారం, నీరు లేనిదే మనిషి మనుగడ కష్టమవుతుంది. అందుకే, ఈ రెండింటినీ అస్సలు వృథా చేయకూడదు. కొంతమంది ట్యాప్ ఫుల్‌గా తిప్పేసి, చేతులు కడుక్కుంటారు. పనైన తర్వాత వెంటనే కట్టేయరు. అలాంటి సంఘటనలను చూసినప్పుడు, ఇవన్నీ ఒకరు నేర్పించేవి కావు. ఎవరి విజ్ఞత వాళ్లకుండాలనిపిస్తుంది. అవసరం లేనప్పుడు నీటిని ఉపయోగించడం, ఆహారాన్ని నేలపాలు చేయడంలాంటివి చూస్తే ఒళ్లు మండిపోతుంది. విద్యుత్తుని కూడా ఆదా చేయాలి. కొంతమంది టీవీ ఆన్ చేసి ఉంచి, మొహానికి పేపర్ అడ్డం పెట్టుకుని చదువుతుంటారు. ఫ్యాన్, ఏసీ ఒకేసారి వేసుకునే ప్రబుద్ధులను కూడా చూశాను. మనకేంటిలే ఎంత బిల్లు వచ్చినా కట్టేస్తాం అనే ధీమాతోనే వాళ్లలా చేస్తారనుకుంటా. కానీ, విద్యుత్తు తయారీకి ఎంత కష్టపడాల్సి వస్తుందో తెలుసుకోవాలి. అలాగే, నీళ్లు కూడా. అందుకే ప్రతి ఒక్కరూ వీటిని పొదుపు చేసే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి’’ అని చెప్పారు. మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి. పైగా.. అందగత్తెలు చెబితే ఆచరణలో పెట్టాలనిపిస్తుంది కదూ! -
బడ్జెట్ వస్తోంది... వీటి సంగతేంటి?
వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెలాఖరులో కొత్త బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏమైనా మార్పులుంటే అవన్నీ కూడా 2016-17వ ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. ఏ మార్పులు వస్తున్నాయో బడ్జెట్ ప్రతిపాదనల ద్వారా మనకు ముందే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు చేయవలసిన కొన్ని పనులు ఈ రోజు ట్యాక్స్ కాలమ్‌లో... * సెక్షన్ 80(సీ) కింద అర్హత ఉన్న సేవింగ్స్, పెట్టుబడులు తదితర వాటి మీద గరిష్ట పరిమితి రూ.1,50,000. ఈ రోజు వరకు ఎంత ఇన్వెస్ట్ చేశారో లెక్కించండి. ఇంకా అవకాశం ఉంటే వెంటనే రంగంలోకి దిగండి. * మెడిక్లెయిమ్కి వాయిదాలు చెల్లించండి. * ఇంటి రుణం మీద అసలు, వడ్డీ చెల్లించకపోతే వెంటనే చెల్లించండి. * అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులు సెప్టెంబర్ నుంచే మొదలవుతాయి. మార్చి 15 చివరి తేదీ. అవకాశం ఉంటే త్వరగా చెల్లించండి. చివరి క్షణం వరకు నిరీక్షణ వద్దు. * టీడీఎస్ వివరాలు తెలుసుకోండి. డిడక్టర్తో మాట్లాడండి. యజమానిని సంప్రదించండి. బ్యాంక ర్లు వారి పని ఒత్తిడి వల్ల మన పని చేయకపోవచ్చు. మీరే వారిని కలిసి టీడీఎస్ సమస్యను పరిష్కరించుకోండి. * మీ కేసులో టీడీఎస్ జరిగినప్పటికీ.. ఆ మొత్తంలో పూర్తి పన్ను భారం చెల్లించలేం. ఉదాహరణగా బ్యాంకర్లు కేవలం 10 శాతం చెల్లిస్తారు. మీ ఆదాయం 30 శాతం శ్లాబ్‌లో ఉందనుకోండి. మీరింకా 20 శాతం చెల్లించాలి. దీన్ని అడ్వాన్స్ ట్యాక్స్ ద్వారా చెల్లించాలి. చాలా మంది టీడీఎస్ అయిపోయింది కాదా.. ఇక అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదనుకుంటారు. ఇది పొరపాటు. ఇటువంటివి ఇప్పుడే చూసుకోండి. * మీకున్న అన్ని బ్యాంకు అకౌంట్లలో బ్యాంకర్లు సంవత్సరంలో రెండు సార్లు కానీ నాలుగు సార్లు కానీ వడ్డీని క్రెడిట్ చేస్తారు. ఇటువంటి మొత్తం 10 వేల రూపాయలు దాటితే పన్ను భారం పడుతుంది. అటువంటి సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోండి. * బ్యాంకు అకౌంట్లలో ప్రతి క్రెడిట్‌కి, ప్రతి డెబిట్‌కు వివరణ రాసుకోండి. * మార్చి 15 తర్వాత ఊహించని విధంగా ఆదాయం వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకొని పన్నుభారం లెక్కించండి. * కొన్ని విషయాలను మీరు ఇప్పుడే ప్లాన్ చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రతిపాదనల వల్ల బేసిక్ లిమిట్ , శ్లాబ్ మారవచ్చు. మినహాయింపుల పరిమితి పెరగొచ్చు. ఈ ప్రభావం పన్ను మీద పడుతుంది. * అందుకే బడ్జెట్ ప్రతిపాదనలు తెలియగానే పన్ను భారం గురించి వృత్తి నిపుణులను సంప్రదించండి. ట్యాక్సేషన్ నిపుణులు: కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య -
పొదుపులో అమెరికన్లు వెనుకబడ్డారట!
ఆదాయంలో కొంతభాగం పొదుపు చేయాలి అనేది ఆర్థిక సూత్రం. అయితే ఈ విషయాన్ని అమెరికన్లు అస్సలు పాటించలేకపోతున్నారట. 63 శాతంమంది అమెరికన్లు తమ ఆదాయం.. నిత్యావసర ఖర్చులకే సరిపోవడం లేదంటున్నారట. వారు కనీసం అత్యవసర పరిస్థితుల్లో వాడుకొనేందుకు 5 వందల డాలర్లను కూడ వెనకేసుకోలేకపోతున్నారని తాజా సర్వేలు చెప్తున్నాయి. సంపన్నదేశంగా చెప్పుకునే అమెరికాలో ఇప్పుడు 37శాతం మంది ప్రజలు మాత్రమే వారి ఆదాయంలో అత్యవసరాలకోసం ఐదు వందల డాలర్లనుంచీ వెయ్యి డాలర్ల వరకూ పొదుపు చేయగల్గుతున్నారని, మిగిలిన అరవై మూడు శాతం మంది క్రెడిట్ కార్డుల చెల్లింపులు, అప్పులు, అనుకోని ఖర్చులతో ఏమాత్రం వెనకేసుకోలేకపోతున్నారని సర్వే చెప్తోంది. అమెరికన్లు పొదుపర్లా, కాదా అన్నది ఇక్క్డడ విషయం కాకపోయినా... స్థానిక పేవ్ ఛారిటబుల్ లెక్కలు మాత్రం మూడు అమెరికన్ కుటుంబాల్లో ఒకరు కనీస పొదుపు కూడ చేయలేకపోతున్నారని చెప్తున్నాయి. అలాగే మాగ్నిఫై మనీ చేసిన సర్వేల్లో కూడ 56.3 శాతం మంది అమెరికన్ల సేవింగ్స్ ఖాతాల్లో కనీస మాత్రమైనా డబ్బు నిల్వ ఉండటం లేదని తేలింది. ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం మరింత దిగజారిపోతున్నట్లుగా కనిపిస్తోందని సర్వేలు తెలుపుతున్నాయి. నిజానికి మధ్య తరగతి కుటుంబాల్లో అత్యవసర ఖర్చులకు కనీసం పదివేల డాలర్లు అవసరమౌతాయని, కానీ అదికూడ వారు పొదుపు చేయలేకపోతున్నారని పేవ్ ఛారిటబుల్ ట్రస్ట్ అంటోంది. 25 వేల డాలర్లకన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి పొదుపు మరీ కష్టంగా ఉందని పేవ్ సర్వే ద్వారా తెలుస్తోంది. అయితే ఏభై నుంచి ఎనభై అయిదు వేల డాలర్లకు పైబడి ఆదాయం ఉన్నకుటుంబాల్లో మాత్రం 2,500 డాలర్లు వరకూ పొదుపు చేయగల్గుతున్నట్లు చెప్పారని, ఎనభై అయిదు వేలకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు మాత్రమే పదివేల డాలర్ల వరకూ పొదుపు చేయగల్గుతున్నట్లు చెప్పారని పేవ్ ఛారిటబుల్ అధ్యయనకారులు అంటున్నారు. ఏది ఏమైనా మధ్యతరగతి వారికి మాత్రం అత్యవసర పరిస్థితులు గడ్డుగానే మారుతున్నాయని లెక్కలు చెప్తుండగా... ఆయా కుటుంబాల్లో ఖర్చులు ప్రణాళికా బద్ధంగా లేకపోవడం వల్ల కూడ సంవత్సరమంతా ఇబ్బందులకు గురౌతున్నారని సర్వేలు తేల్చాయి. ముఖ్యంగా వీరి అనుకోని ఖర్చుల్లో కారు రిపేర్లు వంటివి ఉంటున్నాయని బ్యాంక్ రేట్ డాట్ కామ్ లెక్కల్లో తేలింది. 23 శాతం మంది ఇంటి ఖర్చులకు కాక, అదనంగా 500 నుంచి 1000 డాలర్ల వరకూ రెస్టారెంట్లలో భోజనాలకు, కాఫీలకు ఖర్చుపెడుతున్నట్లు సర్వేల ద్వారా తెలుస్తోంది. వీరి బడ్జెట్లో మాత్రం స్థితి స్థాపకత కాస్త కనిపిస్తోందని సర్వే వెల్లడిస్తోంది. అయితే అనుకోని పరిస్థితుల్లో వచ్చిన ఖర్చులకు క్రెడిట్ కార్డుల వంటివి వాడటం ఇతర వ్యాపరస్తులకు ప్రోత్సాహకరంగా, లాభదాయకంగా మారుతోందని సీనియర్ ఇన్వెస్టింగ్ అనలిస్ట్ షైనా స్టినేర్ చెప్తోంది. చాలామంది ఏ ఖర్చు వచ్చినా వెంటనే క్రెడిట్ కార్డును వాడేస్తుంటారని, అటువంటి ఏదో ఒక ఖర్చును తగ్గించుకోగల్గితే పొదుపు చేయడం అంత కష్టమైన పనేమీ కాదని ఆమె ప్రజలకు సూచిస్తోంది. -
పొదుపుపై పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి: అసోచామ్
న్యూఢిల్లీ: దీర్ఘకాలిక పొదుపులకు సంబంధించి పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత రూ.1.5 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచాలని పారిశ్రామిక మండలి అసోచామ్ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. వేతన ఉద్యోగులకు స్టాండెర్డ్ డిడక్షన్‌ను పునఃప్రారంభించాలని కూడా ఒక ప్రకటనలో కోరింది. ఆయా అంశాలు వ్యవస్థలో వినియోగం, వృద్ధి దారితీస్తాయని వివరించింది. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం నుంచి వివిధ ఆర్థిక, వ్యాపార, సామాజిక వర్గాలతో 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ముందస్తు చర్చలు జరపనున్న నేపథ్యంలో అసోచామ్ తాజా విజ్ఞప్తి చేసింది. -
ఏపీకి 6, తెలంగాణకు 5
* జాతీయ ఇంధన పొదుపు అవార్డులు అందజేసిన కేంద్రమంత్రి * డిస్కమ్స్, బిజినెస్ విభాగంలో ఏపీ ఎస్పీడీసీఎల్కు ప్రథమ బహుమతి సాక్షి, న్యూఢిల్లీ: ఇంధన పొదుపులో తెలంగాణకు 5, ఆంధ్రప్రదేశ్‌కు 6 జాతీయ అవార్డులు లభించాయి. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సోమవారం నిర్వహించిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఇంధన పొదుపులో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన సంస్థల ఉన్నతాధికారులు, ప్రతినిధులకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ అవార్డులను అందచేశారు. డెయిరీ విభాగంలో ద్వితీయ బహుమతి సాధించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్, ఉప్పల్(హైదరాబాద్) జనరల్ మేనేజర్ ఎల్.శ్రీనివాస్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో ద్వితీయ బహుమతి సాధించిన టాటా కాఫీ లిమిటెడ్, ఇన్స్టంట్కాఫీ డివిజన్, తూప్రాన్ యూనిట్(మెదక్) ప్రతినిధి సంజీవ్ సారన్, జనరల్ కేటగిరీలో ద్వితీయ బహుమతి సాధించిన దక్షిణమధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్, కాజీపేట పంపింగ్ సెక్టర్(సికింద్రాబాద్) నుంచి సోలంగుప్త, మాన్యుఫాక్చరర్స్ ఆఫ్ బీఈఈ స్టార్ లేబుల్డ్ అప్లియెన్స్(డిస్ట్రిబ్యూషన్ ట్రాన్సుఫార్మర్) విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన తోషిబా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్(ఇండియా) మెదక్ ప్రతినిధి ఉపాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, కార్యాలయ భవనం విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ సీ-టీఏఆర్ఏ బిల్డింగ్(సికింద్రాబాద్) ఎస్సీఆర్ జీఎం రవీంద్ర గుప్తాలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులు ప్రదానం చేశారు. దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ డివిజన్ షీప్మండి పంప్‌హౌజ్ (సికింద్రాబాద్), కాచీగూడ రైల్వే స్టేషన్, దక్షిణ మధ్య రైల్వే సంచాలన్‌భవన్ (సికింద్రాబాద్), లాలాగుడ సెంట్రల్ ఆసుపత్రి, జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (సికింద్రాబాద్) మంజీరా హోటల్స్ అండ్ రిసార్ట్స్, ఆదిత్యాపార్క్ హోటల్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ), సోహరబ్జి గోద్రేజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (రంగారెడ్డి జిల్లా)కు మెరిట్ సర్టిఫికెట్లు లభించాయి. ఏపీ నుంచి..: డెయిరీ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్(చిత్తూరు) అధ్యక్షుడు సాంబశివరావు, విద్యుత్ పంపిణీ కంపెనీ(డిస్కమ్స్) విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(చిత్తూరు) సీఎండీ హెచ్.వై.దొర, జనరల్ కేటగిరీలో ప్రథమ బహుమతి సాధించిన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(విశాఖ) కమిషనర్ ప్రవీణ్ కుమార్, స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీస్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్(ఎస్ఈసీఎం), ఇంధన శాఖ విభాగం, ఐఎండీఐ, (ఏపీ ప్రభుత్వం) సీఈవో చంద్రశేఖరరెడ్డి, బిజినెస్ మోడల్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించిన ఎస్పీడీసీఎల్(తిరుపతి) సీఎండీ హెచ్.వై.దొర, ద్వితీయ బహుమతి సాధించిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్‌లకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అవార్డులను ప్రధానం చేశారు. -
ఆర్థికంగా ఫిట్.. ఎలా?
ఫైనాన్షియల్ బేసిక్స్ ప్రతి ఒక్కరూ శారీరకంగా ఫిట్‌గా ఉండాలని భావిస్తారు. ఇందుకు జిమ్... వ్యాయామం, యోగా వంటి వాటిని ఆశ్రయిస్తారు. మరి ఆర్థికంగా ఫిట్‌గా ఉండాలంటే? మనం అసలు ఆర్థికంగా ఫిట్‌గా ఉన్నామో లేదో ముందు తెలుసుకోవాలి. నిజానికి శారీరక ఫిట్‌నెస్‌కు ప్రమాణాలున్నట్లుగా ఆర్థిక ఫిట్‌నెస్‌కు నిర్దిష్ట ప్రమాణాలుండవు. కానీ కొన్ని బేసిక్ నిబంధనలను పాటిస్తే ఆర్థిక ఫిట్నెస్ సాధించొచ్చు. కెరీర్ ప్రారంభమే... సేవింగ్స్‌కు పునాది సంపాదన మొదలైన తొలినాళ్లలోనే సేవింగ్స్ ప్రారంభించాలి. సాధ్యపడకపోతే కనీసం 30 ఏళ్లు వచ్చినపుడైనా సేవింగ్స్ ప్రారంభించాలి. సేవింగ్స్ ప్రక్రియను మీరు ఎంత ఆలస్యం చేస్తే అంత మీ రిటైర్మెంట్ గడువు వెనక్కు జరుగుతుంది. మీ ఆదాయంలో 40 శాతాన్ని సేవింగ్ చేయడం మంచిది. సాధ్యపడకపోతే వ్యక్తిగత, ఇంటి ఖర్చులను ఎక్కడైనా తగ్గించుకోవచ్చేమో పరిశీలించండి. ఉదాహరణకు మీ సొంత ఖర్చులను తగ్గించుకుంటే.. ఆ మొత్తం మీ పిల్లల చదువుకు ఉపయోగపడుతుంది. అత్యవసర నిధి ఏర్పాటు మరవొద్దు... ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా గుండెపోటు రావచ్చు. బైక్ మీద వెళ్తున్నపుడు ప్రమాదం జరగొచ్చు. అనుకోకుండా ఉద్యోగం పోవచ్చు. అప్పుడు మన పరిస్థితేంటి? అందుకే అనుకోని సంఘటనలను ఎదుర్కోడానికి ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా అత్యవసర నిధి మొత్తం... మన నెల జీతానికి ఆరు రెట్లుండాలి. జీవిత బీమా తీసుకోండి... మనిషి సంఘ జీవి. ఒకడిగా జీవించలేడు. కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అప్పుడు మన తరవాత మనపై ఆధారపడ్డ వారి జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖంగా ఉండాలంటే.. కచ్చితంగా జీవిత బీమాను తీసుకోవాలి. జీవిత బీమా కనీసం మన వార్షిక వేతనానికి 12 రెట్లు ఉండాలి. అలాగే కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఆరోగ్య బీమాను రూ.5 లక్షలకు తీసుకోవాలి. ఇటీవల ఆరోగ్య ఖర్చులు బాగా పెరిగిపోయాయి. భవిష్యత్తులో ఇంకా పెరగొచ్చు కూడా. ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి.. ఇక ఇన్వెస్ట్మెంట్ల విషయానికి వస్తే.. ముందుగా మీరు ఏ స్థాయిలో రిస్క్‌ను భరించగలరో.. దాన్ని బేరీజు వేసుకోండి. అలాగే మీ ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకోండి. వాటికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ చేయడం ప్రారంభించండి. ఎప్పుడూ ఇన్వెస్ట్‌మెంట్‌ను ఒకే దానిలో చేయకండి. మీ పోర్ట్‌ఫోలియోను ఎల్లప్పుడూ డైవ ర్సిఫైడ్గా ఉంచుకోండి. వంద శాతంలో మీ వయసును తీసేస్తే వచ్చే సంఖ్యకు సమాన మొత్తాన్ని రిస్క్ అధికంగా ఉండే ఈక్విటీ వంటి ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడిగా పెట్టండి. ద్రవ్యోల్బణం, పన్నులు వంటి అంశాలను తట్టుకొని అధిక రాబడిని పొందాలంటే రిస్క్‌ను భరించాల్సి ఉంటుందన్న విషయాన్ని మరవద్దు. ఆర్థిక వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షించుకోండి. అవసరమైన సందర్భాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెన కాడవద్దు. ఆర్థిక పటిష్టత సాధించాలంటే క్రమశిక్షణ, ఓపిక అనే రెండు అంశాలను తప్పక అలవరచుకోవాలి. -
మీ పొదుపుపై ద్రవ్యోల్బణం ప్రభావం?
ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడం. ఉదాహరణకు ఇప్పుడు 6 శాతం ద్రవ్యోల్బణం రేటు వుందనుకోండి...అంటే గత ఏడాది రూ. 100కు లభించే సరుకులు, వస్తువుల ధర ఇప్పుడు రూ. 106 అయ్యిందన్నమాట. మీరు రూ. 100కు ఆరు రూపాయలు చొప్పున ఎక్కువ చెల్లించాల్సివుంటుంది. ద్రవ్యోల్బణం కారణంగా మీ కొనుగోలు శక్తి సన్నగిల్లడమే కాదు...మీ పెట్టుబడులపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. అందుచేత మీ పొదుపు, పెట్టుబడులు ద్రవ్యోల్బణం రేటుకంటే ఎక్కువ రాబడులు ఇచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. అలా చేస్తేనే మీరు ధరల్ని తట్టుకొని భవిష్యత్ లక్ష్యాలను సాధించగలుగుతారు. మీ బ్యాంక్ డిపాజిట్ ద్వారా 8.5 శాతం వడ్డీ లభిస్తుందనుకుంటే...వాస్తవంగా ద్రవ్యోల్బణం పోను నికరంగా మీకు మిగిలేది 2.5 శాతమే. అందుకే ఎక్కువ వడ్డీ లభించే సాధనాల్ని ఎంచుకోవాలి. అధిక వడ్డీ సాధనాల్ని ఎంచుకునేముందు, వాటిలో రిస్క్ ఏమైనా వుందేమో చూసుకోవాలి. వివిధ రకాల బ్యాంకులు వివిధ డిపాజిట్ పథకాల్ని అందిస్తుంటాయి. పోస్టాఫీసు పథకాలు, ప్రావిడెంట్ పథకాలు కూడా పరిశీలించవచ్చు. కాస్త రిస్క్ తీసుకునేవారైతే ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి డెట్ స్కీములు, మ్యూచువల్ ఫండ్ స్కీముల్ని ఎంచుకోవొచ్చు. -
కొంత రిస్క్ఉన్నా.. లిక్విడ్ స్కీమ్స్ బెస్ట్
నా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెద్ద మొత్తంలోనే సొమ్ములున్నాయి. ఈ సొమ్ములను మంచి రాబడులు వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు భద్రత ఉండాలి. ఎలాంటి పన్నుల భారం ఉండకూడదు, లేదంటే తక్కువ పన్నులుండాలి. నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు క్యాష్ చేసుకునేలా ఉండాలి. ఈ విషయాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని నాకు తగిన సూచనలివ్వండి. - చక్రవర్తి, గుంటూరు తక్షణం అవసరం లేని పక్షంలో బ్యాంక్‌లో డిపాజిట్ల రూపంలో ఇంత పెద్ద మొత్తం ఉంచుకోవడం సరైనది కాదు. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ డిపాజిట్లపై వచ్చే రాబడులు పెద్దగా ఉండవని చెప్పవచ్చు. పైగా బ్యాంక్ డిపాజిట్లపై పన్ను ప్రయోజనాలు కూడా తక్కువగానే ఉంటాయి. ఇప్పటికిప్పుడు అవసరం లేని డబ్బులను మంచి రాబడులు వచ్చే ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేసే మొత్తాన్ని, కాలాన్ని, మీరు భరించగలిగే రిస్క్‌ను పరిగణనలోకి తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న కాలం మూడేళ్లలోపు ఉంటే, డెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఎంచుకోవాలి. ఐదేళ్లు, అంతకు మించి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షేర్లలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. బ్యాంకు డిపాజిట్లలోలాగా భద్రంగా, లిక్విడిటీతో ఉండే ఇన్వెస్ట్మెంట్ సాధనాలు దాదాపు లేవు. లిక్విడిటీ, భద్రత కావాలనుకుంటే, మీ సొమ్ములను బ్యాంక్ డిపాజిట్లలోనే కొనసాగించండి. కొంత రిస్క్ తీసుకోగలిగితే, లిక్విడ్ స్కీమ్స్‌ను పరిశీలించవచ్చు. లిక్విడ్ స్కీమ్స్ మరీ ఏమంత రిస్క్‌గా ఉండవనే చెప్పవచ్చు. ఒక్క రోజులోనే డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. మార్కెట్ రాబడులే వచ్చే అవకాశాలున్నాయి. ఒక ఏడాది పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆల్ట్రా షార్ట్-టర్మ్ బాండ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలి. నాకు వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్‌కు మాత్రమే అర్హత ఉందని ఒక బీమా సంస్థ పేర్కొంది. నేను రూ. కోటి టర్మ్ పాలసీ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పినా కూడా రూ.50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే ఇస్తామని ఆ కంపెనీ తెలిపింది. నేను రూ.50 లక్షల టర్మ్ పాలసీలను రెండు తీసుకుందామనుకుంటున్నాను. అలా తీసుకోవచ్చా? ఇలా తీసుకున్న పక్షంలో క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఏమైనా సమస్యలు వస్తాయా? - సాగర్, వరంగల్ ఆ బీమా సంస్థను కాకుండా మరో బీమా సంస్థను సంప్రదించండి. టర్మ్ ప్లాన్‌కు దరఖాస్తు చేసేపటప్పుడు ఏ బీమా సంస్థ అయినా ప్రస్తుతం మీ దగ్గరున్న బీమా పాలసీల గురించి వాకబు చేస్తాయి. అప్పుడు మీరు మీ బీమా పాలసీల గురించి చెప్పండి. మీరు రూ.50 లక్షల టర్మ్ పాలసీ తీసుకొని ఉండి కూడా, మరో రూ.50 లక్షల టర్మ్ పాలసీ కోసం దరఖాస్తు చేస్తే, ఇవ్వాలా, వద్దా అనేది సదరు బీమా సంస్థ నిర్ణయించుకుంటుంది. ఇక క్లెయిమ్‌ల విషయానికొస్తే, క్లెయిమ్ సరిఅయినది అయితే, నామినీకి రెండు బీమా సంస్థలు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. క్లెయిమ్ చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు ఉండకూడదనుకుంటే, మీకు తెలిసిన అన్ని వివరాలను బీమా పాలసీ తీసుకునేటప్పుడు వెల్లడించడం మంచిది. నేను ఇటీవలనే మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్) విధానంలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాను. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే స్వల్ప, దీర్ఘకాలిక లాభాలపై పన్నులు ఎలా ఉంటాయి. పన్నులు ఆదా చేస్తూ పటిష్టమైన పోర్ట్‌ఫోలియోను ఎలా ఏర్పాటు చేసుకోవాలో సూచిస్తారా ? - శ్రీవల్లి, హైదరాబాద్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వచ్చే రాబడులపై విధించే పన్నులకు, డెట్ ఫండ్స్ ద్వారా వచ్చే రాబడులపై విధించే పన్నులకు తేడా ఉంటుంది. డెట్ ఫండ్స్‌తో పోల్చితే ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పన్ను ప్రయోజనాలు అధికంగా లభిస్తాయని చెప్పవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఏడాది తర్వాత విక్రయిస్తే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏడాదికి మించిన ఇన్వెస్ట్‌మెంట్స్‌పై వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై దీర్ఘకాలిక మూలధన లాభాలపై ఎలాంటి పన్ను ఉండదు. ఒకవేళ మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఏడాదిలోపే విక్రయిస్తే వాటిని స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను 15 శాతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక డెట్ ఫండ్స్ విషయానికొస్తే మూడేళ్లలోపు ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయపు పన్ను స్లాబ్నునుసరించి ఈ పన్ను ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లు మించితే, 20 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఇండెక్సేషన్‌తో కలిపి) చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు డివిడెండ్లపై ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. అయితే డివిడెండ్లకు సంబంధించి పన్నులు చెల్లించాల్సిన బాధ్యత మ్యూచువల్ ఫండ్ సంస్థలకు ఉంటుంది. ఆ మేరకు రాబడులపై ప్రభావం ఉంటుంది. మూడేళ్ల ఇన్వెస్ట్మెంట్ కాలానికి డెట్ ఫండ్స్‌లోనూ, ఐదేళ్లకు మించిన ఇన్వెస్ట్మెంట్ కాలానికి ఈక్విటీ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేస్తే పన్ను ప్రయోజనాలతో పాటు మంచి రాబడులు కూడా పొందవచ్చు. ఎలాంటి పన్నులు చెల్లించకపోవడం, ఒకవేళ పన్నులు చెల్లించాల్సి ఉంటే, వీలైనంత తక్కువగా పన్నులు చెల్లించడం.. మంచి ఇన్వెస్ట్మెంట్ వ్యూహాల్లో ఒకటి. అయితే పన్నులు ఆదా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు ఉండకూడదు. మీ ఆర్థిక లక్ష్యాలు, మీరు భరించగలిగే రిస్క్‌ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. -
త్వరిత పొదుపుతో లక్ష్య సాధన
పిల్లల్ని సమాజంలో ఎవరికీ తక్కువ కాకుండా పెంచడానికి తాపత్రయపడతాం. ఉన్నత చదువులు చదివించాలని కలలు కంటాం. ఇలా చేయాలంటే దానికి చాలా మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. ఈ విషయం మీద అవగాహన వున్నపుడు మనం పిల్లల భవిష్యత్తు కోసం ఎంత వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్చేయడం ప్రారంభిస్తాం. నానాటికీ పెరుగుతున్న చదువుల వ్యయాలు... నా చిన్నప్పుడు ఒక పెన్సిల్ ధర రూపాయి ఉంటే ఇప్పుడు అదే పెన్సిల్ ధర ఐదు రూపాయలుగా ఉంది. అలాగే పిల్లలు ఎదుగుతున్నకొద్దీ చదువుల ఖర్చు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇటీవల కాలంలో పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల్లో చదువుల ఖర్చు పెరుగుతూ వస్తోంది. మెడికల్, ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులు చేయాలంటే ఖర్చు తడిసిమోపెడు అవుతోంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్‌లో 2005-07లో మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చేయాలంటే రూ.3.16 లక్షలు ఖర్చవుతే, ఇప్పుడు అదే ప్రోగ్రామ్ చేయాలంటే రూ. 18.5 లక్షలు అవుతోంది. అంటే ఆ ప్రోగ్రామ్ చేయడానికి అయ్యే ఖర్చు పదేళ్లలో ఆరు రెట్లు పెరిగింది. చదువుల ఖర్చు వచ్చే రోజుల్లో కూడా పెరుగుతూనే ఉంటుంది. వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉన్నప్పుడు ప్రస్తుతం ఏదైనా ఒక కోర్సు చేయడానికి రూ. 15 లక్షలు ఖర్చు అవుతుంటే.. అదే కోర్సు చేయడానికి 18 ఏళ్ల తర్వాత రూ.43 లక్షలు కావాల్సిన పరిస్థితి రావచ్చు. సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే విద్యారంగంలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుంది. మీరు విద్యా రుణం తీసుకుంటే మేలేకానీ అది మీ అవసరాలన్నింటినీ కవర్ చేస్తే బాగుంటుంది. అలాగే పెద్ద మొత్తంలో లోన్ పేమెంట్ కట్టడం కూడా కొన్ని సార్లు కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు మీ పిల్లలు పుట్టిన దగ్గరి నుంచి వారి చదువు కోసం సేవింగ్ చేయడం ప్రారంభిస్తే చాలా మంచిది. అప్పుడే పెరుగుతున్న ఖర్చులను భరించగలుగుతాం. పెళ్లి ఖర్చు సంగతేంటి? మీరు మీ పిల్లలకు ఘనంగా పెళ్లి చేయాలని అనుకుంటే మాత్రం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఇప్పుడు పెళ్లి చేయడానికి రూ.20 లక్షలు ఖర్చయితే అదే 18 ఏళ్ల తర్వాత పెళ్లి చేయాలంటే రూ.57 లక్షలు (వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతంగా ఉంటే) కావాలి. కాబట్టి త్వరగా ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలంటే త్వరపడాలి.. మీ పిల్లల చదువుకు, పెళ్లికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమౌతాయి. దీని కోసం మీరు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. మీకు ఐదేళ్లలో రూ. 40 లక్షలు కావాలంటే మీరు వార్షికంగా 10 శాతం రాబడినిచ్చే సాధనాల్లో ఇప్పుడు రూ.25 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదే 10 శాతం రాబడితో మీరు 18 ఏళ్లలో రూ.40 లక్షలు పొందాలంటే నెలకు రూ.6,700 ఇన్వెస్ట్ చేస్తూ రావాలి. ఈ విధంగా నెలకు రూ.6,700 ఇన్వెస్ట్ చేస్తే మీరు పదేళ్ల తర్వాత రూ.13.72 లక్షలు పొందుతారు. తర్వాతి 8 ఏళ్లల్లో కూడా అదేతరహా పొదుపు కొనసాగిస్తే ఈ మొత్తం రూ.40.23 లక్షలు అవుతుంది. - అనీశ్ ఖన్నా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్,ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ -
యువతలో ఖర్చు ఎక్కువ-పొదుపు తక్కువ
నెల సంపాదనలో 69 శాతం కరిగిపోతోంది... ఐసీఐసీఐ లాంబార్డ్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాలం మారింది. గతంలో సంపాదించిన దాంట్లో పొదుపుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తే ఈ తరం యువత జల్సాలకే తమ ఓటు అంటున్నారు. ప్రస్తుతం దేశంలో ప్రధాన నగరాల్లో నివసిస్తున్న యువత విందులు, విలాసాలకే అధిక ప్రాధాన్యతను ఇస్తోందంట. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు మధ్యనున్న వారు నెలవారీ సంపాదనలో 69 శాతం ఖర్చు చేస్తున్నట్లు ప్రైవేటు సాధారణ బీమా కంపెనీ ఐసీఐసీఐ లాంబార్డ్ సర్వేలో వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తో సహా ఎనిమిది నగరాల్లో నివసిస్తున్న 25 నుంచి 35 ఏళ్ల వారిపై నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఇలా ఖర్చు చేస్తున్నదాంట్లో 50 శాతం కుటుంబం, ఇంటి అవసరాలకు కోసం కేటాయిస్తుంటే, ఆ తర్వాతి స్థానాల్లో ఈఎంలు, బీమా ప్రీమియంలున్నాయి. ఇంటికి ఖర్చు చేస్తున్న దాంట్లో వారాంతాల్లో రెస్టారెంట్లు, విహార యాత్రలదే అగ్రస్థానం. సంపాదనలో ఆరోగ్య సంరక్షణకు 5 శాతం కూడా కేటాయించడం లేదు. కానీ మారిన ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నట్లు క్లెయిమ్ గణాంకాలను విశ్లేషిస్తే తెలుస్తోందని ఐసీఐసీఐ లాంబార్డ్ పేర్కొంది. ఆరోగ్య బీమా తీసుకోనివారు పొదుపు తక్కువగాను, వైద్య అవసరాలకు ఎక్కువగాను ఖర్చు చేస్తున్నట్లు సర్వేలో తేలినట్లు పేర్కొంది. కానీ సర్వేలో పాల్గొన్నవారిలో 68 శాతం మంది కాలంతో పరుగులు పెట్టే జీవన విధానం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారని ఐసీఐసీఐ లాంబార్డ్ క్లెయిమ్స్ చీఫ్ సంజయ్ దత్తా వివరించారు. 43 శాతం మంది కేవలం పన్ను ప్రయోజనాల కోసమే ఆరోగ్య బీమా తీసుకుంటున్నట్లు వెల్లడించడం విశేషం. -
పొదుపు, పెట్టుబడికి తేడా ఏంటి?
ఫైనాన్షియల్ బేసిక్స్ సంపదను కాపాడటం, దాన్ని అభివృద్ధి చేయడం ఒక కళ. ‘మీరు రూపాయి ఆదా చేస్తే రూపాయి సంపాదించినట్లే’ అనేది ఎన్నడో బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పిన మాట. మనలో చాలా మందికి డబ్బును ఆదా చేయాలని ఉంటుంది. డబ్బును రెండు మార్గాల్లో ఆదా చేయొచ్చు. ఒకటేమో సేవింగ్స్, రెండోది ఇన్వెస్ట్మెంట్స్. అసలు ముందు తెలియాల్సింది పొదుపునకు, పెట్టుబడికి తేడా. మిగులు సంపాదనను క్రమ పద్ధతిలో కూడబెడితే అది సేవింగ్స్. అదే మిగులు సంపాదనను అధిక రాబడిని అందించే సాధనాల్లో పెడితే అది ఇన్వెస్ట్మెంట్. సేవింగ్స్ అంటే భద్రత! సేవింగ్ అనేది చిన్న వయసు నుంచే అలవాటు కావాలి. ఇందుకు సాధారణంగా ఉపయోగించేది బ్యాంకు సేవింగ్స్ ఖాతానే. సేవింగ్స్ ముఖ్య లక్షణం భద్రత. దీన్లో రిస్క్ ఉండనే ఉండదు. అయితే పొదుపు చేసే డబ్బులో పెరుగుదల ఉండదు. ఉన్నా అది స్వల్పమే. పొదుపు చేయడం వల్ల పెద్దగా లాభం ఉండదు. అందుకని ఆ పొదుపును ఇన్వెస్ట్మెంట్గా తప్పక మార్చాలి. పెట్టుబడి ముఖ్య లక్షణం సంపద సృష్టి రేపటి జీవనం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే వచ్చే ఆదాయంలో మన ఖర్చులు మినహా మిగిలిన సంపదను పలు రకాల ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడిగా పెట్టాలి. అది మరింత సంపదనిస్తుంది. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను స్టాక్‌మార్కెట్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, బంగారం, కమోడిటీస్‌లో ఎక్కువగా చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ అనేది మీ సంపాదన మొదలైన రోజు నుంచి ఆరంభమవ్వాలి. పెట్టుబడి ముఖ్య లక్షణం సంపద సృష్టి. ఈ సంపద పిల్లల కాలేజీ ఫీజులు, పెళ్లిళ్లు, సెలవుల్లో సరదాగా గడపడం, మంచి జీవన ప్రమాణానికి, రిటైర్మెంట్ తర్వాత జీవితం సాఫీగా గడపటానికి ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది. పెట్టుబడి వల్ల వచ్చే రాబడి పెరుగుతున్న ద్రవ్యోల్బణం కన్నా అధికంగా ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా రాబడిని పొందలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రికవరీ దిశగా బంగారం ధర దేశీయంగా బంగారం ధర రూ.26,000పైన స్థిరపడింది. గతవారం ప్రారంభం నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర వారాంతానికి వచ్చేసరికీ అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా మారడం, దేశీ రిటైలర్ల నుంచి డిమాండ్ పెరగడం, పండుగ సీజన్ వంటి అంశాల కారణంగా కొద్దిగా కోలుకుంది. గతవారం బంగారం ధర బాగా ఒడిదుడుకులకు లోనయింది. ముంబైలో 10 గ్రాముల 99.9 స్వచ్ఛత బంగారం ధర ఒకానొక సందర్భంలో రూ.25,930 కనిష్ట స్థాయికి పతనమై చివరకు రూ.26,380 వద్ద ముగిసింది. ఇది కడపటి వారం ముగింపు ధర రూ.26,755తో పోలిస్తే రూ.375 తక్కువ. అలాగే 10 గ్రాముల 99.5 స్వచ్ఛత బంగారం ధర కూడా రూ.25,780 వరకు పడి చివరకు రూ.26,230 వద్ద స్థిరపడింది. ఈ ధర కూడా కడపటి వారపు ముగింపు ధర రూ.26,605తో పోలిస్తే రూ.375 తక్కువ. ఇక అంతర్జాతీయంగా న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర ఔన్స్‌కు 1,137 డాలర్లుగా ఉంది. -
ఆనంద్! ఇక ‘సిప్’ చేయండి!
ఆనంద్ రాజుకు 27 ఏళ్లు. వివాహమయింది. నెలకు కోతలన్నీ పోను చేతికి రూ. 28 వేల వరకూ వస్తుంది. దాన్లో 18 వేలు ఖర్చయిపోతాయి. మిగిలిన 10 వేలూ పొదుపు చేస్తుంటాడు. కాకపోతే ఆనంద్‌కు పొదుపు పథకాలపై, పెట్టుబడులపై ఎలాంటి అవగాహనా లేదు. దీంతో మిగిలే సొమ్మంతా తన సేవింగ్స్ ఖాతాలోనే జమ చేస్తున్నాడు. ఇలా జమ చేసిన మొత్తం ఇప్పటికి రూ. 3 లక్షలపైనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ పథకాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది? ఎందుకంటే తనకు ఇప్పటిదాకా ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్లూ లేవు. కానీ ఆర్థికంగా ఆయనకు కొన్ని లక్ష్యాలున్నాయి. అవేంటంటే... 35 ఏళ్లు నిండేసరికల్లా కనీసం రూ. 50 లక్షలు పెట్టి సొంత ఇల్లు కొనుక్కోవాలి. 60 ఏళ్లకు రిటైరయి... హాయిగా బతకాలి. ఈ ప్రశ్నను ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ రెగోకు పంపించాం. మరి ఆయన ఏమన్నారు? ఏం సూచించారు. ఇదే ఈ వారం ‘ప్లానింగ్’... లక్ష్యాలు బాగున్నాయి.. ఆనంద్! నేను గమనించిందేమంటే మీ లక్ష్యాలు, వాటి ప్రాధాన్యాలు చాలా బాగున్నాయి. కాకపోతే వీటిని సాధించడానికి మీరు సరిపోయే నిధిని సమకూర్చుకోవాలి. అందుకోసం ప్రస్తుతం మీ దగ్గరున్న మిగులు మొత్తాన్ని సరైన రీతిలో పెట్టుబడులకు మళ్లించాలి. మీ వయసు చిన్నదే కాబట్టి... ఇపుడు మీరు కాస్త రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. మీ లక్ష్యాలకోసం మీరు సమకూర్చుకోవాల్సిందేంటంటే... - ఇల్లు కొనుగోలు చేయటం. దానికి 2023 నాటికి రూ.50 లక్షలు కావాలి. - రిటైరయ్యే నాటికి... అంటే 2048 నాటికి నెలకు రూ.18,000 రావాలి. కాకపోతే ఇంటికి కావాల్సిన సొమ్మును గానీ, రిటైర్మెంట్ అనంతరం అవసరమయ్యే మొత్తాన్ని గానీ ఇప్పటి రేట్ల ప్రకారం లెక్కించాం. కానీ ధరలు ఇప్పట్లా ఉండవు కదా? అందుకని ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అలా తీసుకుంటే మీ రిటైర్మెంట్ నిధి ఈ కింది విధంగా ఉండాలి. ఇక ఇంటి విషయానికొస్తే డౌన్ పేమెంట్‌గా కనీసం 20 శాతం మొత్తం ఉండాలి. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. ఇలా విశ్లేషించొచ్చు... దాచుకున్న మొత్తాన్ని డెట్‌లో పెట్టుబడి పెట్టొచ్చు అక్కడి నుంచి క్రమంగా ఈక్విటీలోకి మళ్లించండి అప్పుడే సొంతింటిసహా హ్యాపీ రిటైర్మెంట్ కాల వ్యవధిని బట్టి మీ అవసరాలను మధ్య కాలిక, దీర్ఘకాలిక అవసరాలుగా విభజించవచ్చు. మధ్య కాలిక అవసరాలు తీర్చుకోవటానికి ఈక్విటీ లేదా బ్యాలెన్స్డ్ ఫండ్ వంటి విభిన్న సాధనాలను ఎంచుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక లక్ష్యాలకోసమైతే ఎక్కువగా ఈక్విటీపైనే ఆధార పడాలి. సొంతిల్లు విషయానికొస్తే మీరు గృహ రుణం తీసుకోవచ్చు. కావాల్సిన మొత్తం రుణం 40 లక్షలు. ఇది మీరు కొనాలనుకుంటున్న మొత్తంలో 80 శాతం. దీనికి నెలవారీ ఈఎంఐల రూపంలో రూ. 41వేలు చెల్లించాల్సి ఉంటుంది. రుణ వ్యవధి 20 ఏళ్లు. ఇలాగైతే మీరు సంపాదిస్తున్న మొత్తంపై ఈఎంఐ ప్రభావం చాలానే ఉంటుంది. అది మీ ఇతర అవసరాలపై కూడా పడుతుంది. ఇక డౌన్‌పేమెంట్‌గా మీరు చెల్లించాల్సిన మొత్తం కోసం... మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. నా సూచనలు ఇవీ.. మీ అవసరాలు కావచ్చు... లక్ష్యాలు కావచ్చు. వాటిని సాధించాలంటే ఇప్పటి నుంచే మీరు మీ నెలవారీ పొదుపు మొత్తాన్ని పెట్టుబడులలోకి మళ్లించండి. ఎవరైనా నెలవారీ పొదుపు మొత్తాన్ని పెట్టుబడుల్లోకి మళ్లించాలంటే దానికో చక్కని మార్గం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(సిప్). దీన్లో రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయటం వల్ల ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది. దీర్ఘకాలంలో మార్కెట్లు పెరుగుతాయన్న అంచనాలుంటాయి కనక సగటు కొనుగోలు మొత్తం తగ్గుతుంది. దీనివల్ల భారీ నిధిని సమకూర్చుకోవటం వీలవుతుంది. ఇక మీ సేవింగ్స్ ఖాతాలో ఇప్పటిదాకా దాచుకున్న మొత్తం విషయానికొస్తే దాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసి... సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ద్వారా కొన్నాళ్ల వ్యవధిలో ఈక్విటీలోకి మళ్లించండి. వీటితో పాటు మీరు ఆరోగ్య బీమాను తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించాలి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో ఏదైనా అనుకోని అనారోగ్యం వస్తే ఆ ఖర్చులు తట్టుకోవటం చాలా కష్టం. మీ వయసు, రిస్క్ సామర్థ్యం, మీకు వస్తున్న ఆదాయాన్ని బట్టి మీరు ఈ కింది పోర్ట్‌ఫోలియోను పరిశీలించవచ్చు. అప్పటికి ఖర్చులు ఇలా ఉండవచ్చు..! ప్రస్తుతం నెలకు మీకు అవుతున్న ఖర్చు రూ.18 వేలు. కాకపోతే ద్రవ్యోల్బణాన్ని, ఇతరత్రా అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే మరో 33 ఏళ్ల తరవాత మీకు నెలకు అవసరమయ్యే మొత్తం రూ.1.23 లక్షలు. దాన్ని చూస్తే.. ప్రస్తుతం నెలకు ఖర్చు రూ.18 వేలు ద్రవ్యోల్బణం అంచనా 6 శాతం రిటైర్మెంట్ సంవత్సరం 2048 అప్పటి నెలవారీ ఖర్చు రూ.1,23,131 అనిల్ రెగో సీఈవో, రైట్స్హొరైజన్స్ -
విజయవాడలో రేపు సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్
పొదుపు, పెట్టుబడులపై మదుపరులలో అవగాహన కల్పించేందుకు ‘సాక్షి’ నిర్వహిస్తున్న ‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ సదస్సు ఆదివారం విజయవాడలో జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా నిర్వహించిన ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సులకు చక్కని స్పందన రావటంతో... ఈ సదస్సు నిర్వహణకు సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్), స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్) సాక్షితో జతకట్టాయి. ఆదివారం సాయంత్రం విజయవాడ గాంధీనగర్, హనుమాన్‌పేట్‌లోని చెట్లపల్లి మారుతీ ప్రసన్న లక్ష్మి ఫంక్షన్ హాల్లో జరిగే ఈ సదస్సులో సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజరు వనిశెట్టి శివప్రసాద్, ఎస్‌హెచ్‌సీఐఎల్ రీసెర్చ్ అనలిస్ట్ ముప్పవరపు రవికుమార్ పాల్గొంటారు. వీరు ఇన్వెస్టర్ల సందేహాలు తీర్చటంతో పాటు వారికి వివిధ ఇన్వెస్ట్మెంట్ విధానాలపై తగు సూచనలిస్తారు. ఉచిత రిజిస్ట్రేషన్ తదితరాల కోసం 9505555020 ఫోన్ నెంబర్లో సంప్రతించవచ్చు. -
ఆడుతూ..పాడుతూ..
ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచే గేమ్స్ పొదుపు చేసే విధానం, పెట్టుబడులు పెట్టే తీరు కాలంతో పాటు మారిపోయాయి. కానీ ఇప్పటికీ చాలా మందికి ఈ రెండింటి మధ్య వ్యత్యాసం గురించి అంతగా తెలియదు. నిజానికి ఆర్థిక విషయాలపై ఎంత పట్టు ఉంటే, అందిపుచ్చుకోగలిగే అవకాశాలపైనా అంత అవగాహన ఉంటుంది. కానీ, వీటి గురించి తెలుసుకునే దగ్గరే వస్తుంది చిక్కంతా. డబ్బు మాట బాగానే ఉన్నప్పటికీ..దానితో ముడిపడి ఉండే విషయాలు కాస్త సంక్లిష్టంగా కనిపించడం వల్ల బోరింగ్‌గా అనిపిస్తుంటాయి. దీంతో ఫైనాన్షియల్ ప్లానింగ్ అమలు చేయాలని ఉన్నా సరైన సమాచారం, అవగాహన లేక ఆ వైపుగా దృష్టి పెట్టడానికి బద్ధకించడం జరుగుతుంటుంది. ఇలా బోర్ కొట్టించకుండా ఆడుతూ, పాడుతూ ఆర్థిక విషయాలను నేర్పించే గేమ్స్ ప్రస్తుతం చాలా మటుకు అందుబాటులోకి వచ్చాయి. క్రికెట్‌ను బేస్ చేసుకుని ఆడే గేమ్ ఒకటైతే.. ఫుట్‌బాల్ ఆధారంగా ఆర్థిక మెలకువలు నేర్పేది మరొకటి. ఈ తరహా ఫైనాన్స్ గేమ్స్‌లో కొన్ని మీకోసం.. ది గ్రేట్ పిగ్గీ బ్యాంక్ అడ్వెంచర్ ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రాధాన్యం గురించి నేర్పే గేమ్. మొబైల్ ఫోన్లలోనూ లభించే ఈ ఉచిత ఆన్లైన్ మినీ-గేమ్‌ను వాల్ట్ డిస్నీ ఇమాజినీరింగ్తో కలిసి టి రోవీ ప్రైస్ సంస్థ రూపొందించింది. ప్రధానంగా అమెరికాలో ఇన్వెస్టర్ల కోసమే దీన్ని తయారుచేసినప్పటికీ.. ఏ దేశం వారికైనా అనువుగా ఉండేలా ఇందులో పలు అంశాలను పొందుపర్చింది. ఒకవైపు ఆడుతూనే మరోవైపు నేర్చుకునేలా ఈ గేమ్ ఉంటుంది. లక్ష్యాలు పెట్టుకోవడం, పొదుపు చేయడం, జాగ్రత్తగా వ్యయాలు చేయడం, ద్రవ్యోల్బణం, అసెట్ కేటాయింపులు, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ తదితర అంశాలను ఇది నేర్పుతుంది. ప్రాక్టికల్ మనీ స్కిల్స్ పిల్లలు మనీ గురించి తెలుసుకునేందుకు ఈ వెబ్సైట్లో బోలెడన్ని గేమ్స్‌తో పాటు ఉపయోగకరమైన సమాచారం కూడా ఉంటుంది. ఫ్రాడ్ సీన్ ఇన్వెస్టిగేటర్ మిస్టరీలను ఛేదించడం ఇష్టపడేవారి కోసం ఈ గేమ్ రూపొందించడం జరిగింది. ఇందులో ఆర్థిక మోసాలను ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వివిధ ఆర్థిక అంశాల గురించి కూడా ప్లేయర్ నేర్చుకోవచ్చు. ఫండ్టేస్టిక్ కప్ క్రికెట్ స్ఫూర్తితో రూపొందించిన ఈ గేమ్.. క్విజ్ రూపంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్న ఒక్కో బాల్లాంటిది. ఈ గేమ్‌లో ప్రతి ఓవర్లో 10 బాల్స్ ..అంటే ప్రశ్నలు ఉంటాయి. వీటికి సరిగ్గా జవాబులు చెప్పగలిగితే తదుపరి రౌండుకు వెళ్లొచ్చు. గేమ్ ఫర్ మనీ జపాక్డాట్కామ్ వెబ్సైట్లో ఈ గేమ్ ఉంటుంది. భారతీయ ఇన్వెస్టర్లను దృష్టి లో పెట్టుకుని దీన్ని తయారు చేశారు. ఇందులో ప్లేయర్‌కి వర్చువల్ నగదు లభిస్తుంది. దాన్ని మ్యూచువల్ ఫండ్స్, బీమా, రియల్ ఎస్టేట్, స్టాక్స్ వంటి వివిధ పెట్టుబడి సాధనాలకు కేటాయించాలి. పాచికలు వేస్తూ లక్ష్యం దిశగా గళ్లను దాటుకుంటూ వెళ్లాలి. ఉదాహరణకు, ప్లేయర్ ఆగిన గడిలో స్టాక్‌మార్కెట్ పెరిగిందనో, పడిందనో వస్తే దానికి తగ్గట్లే పోర్ట్‌ఫోలియో కూడా మారుతుంది. మైండ్ బ్లోన్ లైఫ్ మనీ మేనేజ్మెంట్ నైపుణ్యాలకు పదును పెడుతుంది ఈ మొబైల్ గేమ్. ఆర్థిక అంశాల పట్ల అవగాహన పెంచుతుంది. ఫైనాన్షియల్ ఎంటర్టైన్మెంట్ ఆర్థిక అంశాల నిర్వహణలో పలు కోణాలను ఈ వెబ్సైట్ ఆవిష్కరిస్తుంది. ఇందుకు సంబంధించిన ఆన్లైన్, మొబైల్ గేమ్స్ ఇందులో చాలా ఉన్నాయి. -
ఇల్లు, పెళ్లి తరువాత గానీ... చదువు కొని చూడు
♦ పొదుపు వెనక తల్లిదండ్రుల ప్రధాన ఉద్దేశం ఇదే ♦ నానాటికీ పెరిగి తడిసి మోపెడవుతున్న విద్యా వ్యయం ♦ దాన్ని తట్టుకునేందుకు వారి చిన్నప్పటి నుంచే పొదుపు ♦ బీమా, మ్యూచువల్ ఫండ్లు సహా ఎన్నో కొత్త పథకాలు ♦ కాస్త రిస్కు ఎక్కువైనా ఈక్విటీవైపే పలువురి మొగ్గు పెళ్లి చెయ్యటం... ఇల్లు కట్టుకోవటం. ఒకప్పుడు ఎవరికైనా ఆర్థిక లక్ష్యాలు ఈ రెండే. రిటైరయ్యేలోపు ఈ రెండింటినీ సాధిస్తే చాలు. ఒకవేళ సాధించలేకపోయినా... పిల్లలకు పెళ్లిళ్లు చేసేసి, రిటైరయ్యేటపుడు వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకునేవారు. తరవాత పింఛన్‌తో హాయిగా కాలం గడిపేసేవారు. మరి ఇప్పుడో!!?ఇల్లు, పిల్లల పెళ్లి సంగతి తరవాత. వాళ్ల భవిష్యత్ బాగుండాలంటే ముందు బాగా చదివించాలి. అలా చదివించేసరికే తల్లిదండ్రుల పని అయిపోతోంది. ఎందుకంటే విద్యా వ్యయమనేది ద్రవ్యోల్బణం కన్నా వేగంగా పెరుగుతోంది. మరి ఇలాంటపుడు ఏం చేయాలి? పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలంటే అందుబాటులో ఉన్న సాధనాలేంటి? ఈ వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రధాన కథనం... - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం స్థిరాదాయం కావాలంటే... ఎటువంటి రిస్క్ తీసుకోలేని వారు స్థిరమైన ఆదాయాన్నిచ్చే బ్యాంకు డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ వంటి పథకాలవైపు చూడొచ్చు. కేవలం అమ్మాయిల పెళ్లిళ్ల కోసం నిధిని సమకూర్చుకోవాలి అనుకునే వారికి మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే ప్రవేశపెట్టిన సుకన్య-సమృద్ధి పథకం చాలా అనువుగా ఉంది. అమ్మాయిల పేరిట మాత్రమే తీసుకోవడానికి వీలైన ఈ పథకానికి అమ్మాయి పెళ్ళి లేదా అమ్మాయికి 21 ఏళ్లు.. ఏది ముందైతే దాన్ని మెచ్యూరిటీ సమయంగా నిర్ణయించారు. ఈ ఏడాది ఈ పథకంపై 9.2 శాతం వడ్డీ లభిస్తోంది. 10 ఏళ్ళలోపు పిల్లలు దీన్లో చేరడానికి అర్హులు. సుకన్య-సమృద్ధి తర్వాత రిస్క్‌లేని దీర్ఘకాలిక ఇన్వెస్ట్మెంట్ పథకం అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌ను చెప్పుకోవచ్చు. 15 ఏళ్ళ కాలపరిమితి ఉండే ఈ పథకంపై 8.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులూ ఉన్నాయి. పై రెండూ వద్దనుకున్నవారు పదేళ్ల కాలపరిమితి గల నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ కేసి చూడొచ్చు. దీనిపై 8.8 శాతం వడ్డీతో పాటు పన్ను మినహాయింపులు లభిస్తాయి. వీటితో పాటు ఇన్వెస్ట్ చేసిన మొత్తం రెట్టింపయ్యే కిసాన్ వికాస పత్రాలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత 8 ఏళ్ల నాలుగు నెలలకు మీ సొమ్ము రెట్టింపవుతుంది. ఇవన్నీ కాని పక్షంలో దీర్ఘకాలిక బ్యాంకు డిపాజిట్లు కూడా పరిశీలించొచ్చు. ఐదు అంతకంటే ఎక్కువ సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై ఇప్పుడు బ్యాంకులు 8-8.5 శాతం వడ్డీని అందిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు.. పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయాలంటే బీమా, పోస్టాఫీసు పథకాలు, బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో దేన్నయినా ఎంచుకునే ముందు మీ లక్ష్యం... దాన్ని చేరుకోవడానికి పట్టే సమయం... మీ రిస్క్ సామర్థ్యం... వంటివన్నీ పరిగణనలోకి తీసుకోవాలి. సాధారణంగా పిల్లలకు 15 - 18 ఏళ్ళు దాటాకే భారీ మొత్తాలు కావాల్సి వస్తుంది కనక దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలి. అత్యధికులు బీమావైపే... పిల్లల కోసం పొదుపు అనగానే ఠక్కున గుర్తుకొచ్చేవి బీమా పథకాలే. వీటికి బాగా డిమాండ్ ఉండటంతో బీమా కంపెనీలు ఎప్పటికప్పుడు పలు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతున్నాయి. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నవారిలో అత్యధికంగా 64 శాతం మంది బీమా పథకాలవైపే మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్యనే ఎల్ఐసీ చైల్డ్ కేర్, న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీలను ప్రవేశపెట్టింది. అలాగే ప్రైవేటు కంపెనీల్లో బిర్లా సన్‌లైఫ్ విజన్ స్టార్ ప్లాన్‌ను, పీఎన్బీ మెట్‌లైఫ్ సంస్థ స్మార్ట్ చైల్డ్‌ను, కోటక్ హెడ్‌స్టార్ట్ చైల్డ్ అష్యూర్ను అందుబాటులోకి తెచ్చాయి. మార్కెట్ లాభాల కోసం ఎంఎఫ్‌లు... వడ్డీరేట్లు తక్కువగా ఉండటం, ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు మంచి లాభాలు అందిస్తుండటంతో గత రెండేళ్లుగా పిల్లల ఇన్వెస్ట్మెంట్ కోసం ఈక్విటీ సాధనాల కేసి మొగ్గుచూపే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం మ్యూచువల్ ఫండ్ సంస్థలు పిల్లల కోసం ప్రత్యేక పథకాలను అందిస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని అధిక రిస్క్ లేకుండా ఈక్విటీలు, డెట్ పథకాల్లో సమానంగా పెట్టుబడి పెట్టేలా ఈ పథకాలను తీర్చిదిద్దారు. కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలతో పోలిస్తే వీటిల్లో కొద్దిగా రిస్క్ తక్కువగా ఉంటుంది. ఇంకాస్త ఎక్కువ రిస్క్ చేసేవారికి ఈక్విటీ ఓరియెంటెడ్ చిల్డ్రన్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. టెంపుల్టన్ ఇండియా క్యాప్ గిఫ్ట్ ప్లాన్, హెచ్డీఎఫ్సీ చిల్డ్రన్ గిఫ్ట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్-గిఫ్ట్, యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్- అడ్వాంటేజ్ వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. అదే డెట్ ఓరియెంటెడ్ చైల్డ్ ఫండ్స్ విషయానికి వస్తే ఇవి దాదాపు 60 శాతం వరకు డెట్ పథకాల్లో, మిగిలిన మొత్తం ఈక్విటీలకు కేటాయిస్తాయి. టాటా యంగ్ సిటిజన్స్, ఎల్ఐసీ చిల్డ్రన్, మాగ్నం చిల్డ్రన్ బెనిఫిట్, యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్ బ్యాలెన్స్డ్ వంటి పథకాలు ఈ విభాగంలోకి వస్తాయి. అలా కాక మీకు మరింత రిస్క్ సామర్థ్యం ఉంటే డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. పొదుపుతోనే లక్ష్య సాధన... చదువుల కోసం ఒకేసారి కోటి రూపాయలు కావాలంటే కష్టం. కానీ ఆర్థికాంశాల విషయంలో క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. విద్యా వ్యయం ఏటా 12 శాతం పెరుగుతోంది కాబట్టి అంతకంటే ఎక్కువ రాబడినిచ్చే పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు. పిల్లలు పుట్టిన వెంటనే ప్రతి నెలా పదివేలు కంటే తక్కువ ఇన్వెస్ట్ చేయడం ద్వారా పిల్లలు మేజర్లయ్యే సమయానికి కోటి రూపాయల నిధిని తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం ఈక్విటీలను పెట్టుబడిగా ఎంచుకోవచ్చు. ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.9,000 ఇన్వెస్ట్ చేస్తే 18 ఏళ్లకు మీ నిధి కోటి రూపాయలు దాటుతుంది. ఇక్కడ సగటు రాబడిని 15 శాతంగా లెక్కించడం జరిగింది. ఈ రాబడి ఇంకా పెరిగితే మీ చేతికొచ్చే మొత్తం మరింత పెరుగుతుంది. తగ్గితే ఆ మేరకు రాబడి తగ్గుతుంది. ఆర్థిక పాఠాలు నేర్పించాల్సిందే... పిల్లల అవసరాల కోసం ఇన్వెస్ట్ చేయడమే కాకుండా వారికి చిన్నప్పటి నుంచే డబ్బు విలువ తెలిసేలా వ్యవహరించాలి. వారికి ప్రతి నెలా ప్యాకెట్ మనీ ఇస్తూ దాన్ని ఏ విధంగా దాచుకోవాలో నేర్పించండి. ఇప్పుడు అన్ని బ్యాంకులూ చిన్న పిల్లలకు కూడా బ్యాంక్ ఖాతాలను అందిస్తున్నాయి. ఈ జూనియర్ ఖాతాలు ప్రారంభిస్తే వారికి నిజమైన బ్యాంకింగ్ అనుభవం వస్తుంది. బహుమతుల రూపం లో వచ్చే నగదును ఈ ఖాతాలో జమ చేయడం, అప్పుడప్పుడు బ్యాలెన్స్ ఎంతుందో చూడటం చేయిస్తూ ఉంటే పిల్లలకు పొదుపు విలువ తెలిసొస్తుంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరి... సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్ట్‌మెంట్‌ను మొదలుపెట్టాలి. పిల్లలు పుట్టాక తల్లిదండ్రులు అధిక మొత్తానికి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పోర్ట్‌ఫోలియోలో అధిక భాగం ఈక్విటీలకు కేటాయించాలి. ఎంచుకున్న పథకం మీ లక్ష్యానికి అనువుగా ఉందో లేదో పరిశీలించండి. చదువుకోసమే పొదుపు... పిల్లల కోసం రకరకాల పొదుపు చేస్తున్న పలువురితో ఈ మధ్య ఓ ప్రయివేటు బీమా సంస్థ సర్వే చేసింది. సర్వేలో చాలా ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అవేంటంటే పిల్లలకోసం పొదుపు చేస్తున్నవారిలో 77 శాతం మంది పిల్లల చదువుకోసం చేస్తుండగా... 23 శాతం మంది మాత్రమే వారి పెళ్లి కోసం చేస్తున్నారట!. విద్యా వ్యయం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతోందని, దీంతో పిల్లలకు సరైన చదువు చెప్పించగలమా? లేదా? అనే భయం వెంటాడుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ ఆందోళనకు అనుగుణంగానే వారి ఇన్వెస్ట్మెంట్ విధానంలోనూ మార్పులొచ్చాయి. గతంలో పిల్లల కోసం ఎలాంటి రిస్క్ లేని పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపిన వారిలో చాలా వరకూ... గత రెండేళ్లుగా బీమా, డిపాజిట్లు, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడి విధానాలకన్నా షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, రియల్ ఎస్టేట్ వంటి రిస్కు-రాబడి రెండూ ఎక్కువగానే ఉండే సాధనాలవైపు మొగ్గు చూపిస్తున్నారు. అదీ కథ. విద్యా వ్యయం పెరుగుతోందిలా... ఇప్పుడు కాస్త మంచి కాలేజీలో డొనేషన్లు లేకుండా నాలుగేళ్ల ఇంజనీరింగ్ విద్య పూర్తి చేయాలంటే సుమారు రూ.6 లక్షలు ఖర్చవుతోంది. ఇక డొనేషన్లుంటే దాన్ని లెక్కించటం చాలా కష్టం. ఇదే సమయంలో విద్యావ్యయం ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతోంది. ఈ లెక్కన చూస్తే ఆరేళ్ల తర్వాత ఇదే కోర్సును పూర్తి చేయడానికి రూ.12 లక్షలు అవసరమవుతుంది. అదే 12 ఏళ్ల తర్వాతయితే రూ.24 లక్షలు చేతిలో ఉండాల్సిందే. 18 ఏళ్ల తరవాతైతే రూ.34 లక్షలు కావాలి. వివిధ కోర్సుల ఫీజులు భవిష్యత్తులో 10 శాతం చొప్పున పెరిగితే ఎంత ఉంటాయో ఇప్పుడు చూద్దాం.. -
పొదుపా..! మీ వయసెంత?
♦ వయసును బట్టి పొదుపు పద్ధతి మారాల్సిందే ♦ పెద్దయ్యేకొద్దీ ఇన్వెస్ట్మెంట్లలో రిస్క్ తగ్గాలి ♦ ఎంత త్వరగా పొదుపు ఆరంభిస్తే అంత బెటర్ నరేష్ పాతికేళ్ల వయసులో ఉద్యోగంలో చేరాడు. మంచి జీతం కావటంతో చేరిన నాటి నుంచే నెలకు రూ.5,000 పొదుపు చేయటం మొదలెట్టాడు. అందుకోసం చక్కని రాబడి వచ్చే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకున్నాడు. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయని, దాంతో పాటే ఖర్చులూ పెరుగుతాయనే ఉద్దేశంతో పెళ్లి కాకముందే పొదుపు మొదలుపెట్టాడు. ఉద్యోగంలో చేరిన ఐదేళ్లకు నరేష్‌కు పెళ్లయింది. రెండేళ్లకు పిల్లలు. దీంతో ఖర్చులు పెరిగాయి. ఖర్చులన్నీ తగ్గించుకుంటూ పొదుపు చేయటం సరికాదనుకున్నాడు. దీంతో పొదుపు ప్రారంభించిన ఏడేళ్లకు... ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఆపేశాడు. కాకపోతే... అప్పటిదాకా ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని మాత్రం ముట్టుకోలేదు. తనకు 60 ఏళ్లు వచ్చేదాకా అలాగే మ్యూచువల్ ఫండ్స్‌లోనే వదిలేశాడు. కాకపోతే వాటిని అప్పుడప్పుడూ సమీక్షించటం, కొన్ని ఫండ్స్‌ను మార్చటం మాత్రం చేసేవాడు. సురేష్‌ది కూడా ఇలాంటి కథే. పాతికేళ్లకే ఉద్యోగంలో చేరాడు. స్వతహాగా విలాస పురుషుడు కావడం... ఆర్థికంగా ఎటువంటి బాదరబందీలు లేకపోవడంతో మొత్తం జీతాన్ని ఎంచక్కా ఖర్చు పెట్టేసేవాడు. మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్, తరచూ కార్లు మార్చటం వంటివి చేసేవాడు. నరేష్ మాదిరే 30 ఏళ్లకు పెళ్లి చేసుకుని... ఆ తరవాత రెండేళ్లకు తండ్రయ్యాడు. అప్పుడు చూసుకుంటే తెలిసింది... తాను పైసా వెనకేయలేదని. పిల్లల భవిష్యత్ గుర్తుకురావటంతో 32 ఏళ్ల వయసులో పొదుపు మొదలెట్టాడు. రిటైర్మెంట్ భయంతో నెలకు రూ.5,000 చొప్పున... 60 ఏళ్లు వచ్చేవరకూ... అంటే దాదాపు 28 ఏళ్లపాటు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాడు. ఇద్దరూ ఇన్వెస్ట్ చేసింది నెలకు రూ.5వేలే. కాకపోతే సురేష్ 32వ ఏట నుంచి 60వ సంవత్సరం వచ్చేదాకా ప్రతినెలా ఇన్వెస్ట్ చేశాడు. నరేష్ మాత్రం 25వ ఏట నుంచి ఏడేళ్ల పాటు ఇన్వెస్ట్ చేసి మానేశాడు. మ్యూచువల్ ఫండ్స్‌పై రాబడి 14 శాతం వరకూ సగటున గిట్టుబాటయ్యే అవకాశం ఉంది. కానీ కనీసంగా ఏడాదికి ఇద్దరి పొదుపు మొత్తంపై 12 శాతం రాబడిని అంచనా వేసుకుంటే ఇద్దరికీ 60వ ఏట చేతికి ఎంత వచ్చిందో తెలుసా? - ఏడేళ్లలో కేవలం రూ.4.2 లక్షలు ఇన్వెస్ట్ చేసిన నరేష్‌కు 1.52 కోట్లు అందాయి. - 28 ఏళ్ల పాటు రూ.16.8 లక్షలు ఇన్వెస్ట్ చేసిన సురేష్‌కు మాత్రం రూ.1.2 కోట్లే వచ్చాయి. చిన్న వయసులో పొదుపు మొదలుపెడితే వచ్చే లాభమిది. కాంపౌండింగ్ వడ్డీ మహాత్మన్ మిది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందొకటే. ఆలస్యమయ్యేకొద్దీ ఇన్వెస్ట్ చేసే మొత్తం పెరుగుతుంది. రాబడి తగ్గుతుంది. ఒక్కసారి 45 ఏళ్లు దాటాయంటే దృష్టంతా రిటైర్మెంట్ మీదకి మళ్లుతుంది. ఆదాయం ఆగిపోయాక ఇదే విధమైన జీవితాన్ని కొనసాగించగలమా? అన్న ప్రశ్న వెంటాడుతుంటుంది. ఈ సమయంలోనే పిల్లలకు ఉన్నత చదువులు, పెళ్లి వంటి భారీ ఖర్చులు చేయాల్సి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే రిస్క్ సామర్థ్యం బాగా తగ్గిపోతుంది. కానీ భారీ అవసరాల దృష్ట్యా కొంత మేర రిస్క్ చేయాల్సి ఉంటుంది. అందుకే రిస్క్ ఉండే ఈక్విటీ పథకాలకు గరిష్టంగా 40% మించకుండా చూసుకోండి. రిటైరయ్యాక సంపాదన ఉండదు. పెన్షన్‌తోనే జీవితాన్ని కొనసాగించాలి. వీరికి ప్రతి రూపాయి చాలా విలువైనది. అసలు రిస్క్ చేయలేరు. సంపాదిస్తున్న కాలంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని కూడా రిస్క్‌లేని పథకాల్లోకి మార్చుకోవాలి. కాకపోతే భవిష్యత్తులో పెరిగే ధరలను దృష్టిలో పెట్టుకుంటే కొంత మొత్తం ఈక్విటీలకు కేటాయించాల్సి వస్తుంది. అందుకే పోర్ట్‌ఫోలియోలో కనీసం 20 శాతం ఈక్విటీలకు కేటాయించడం ద్వారా ద్రవ్యోల్బణ సమస్యను అధిగమించొచ్చు. ముందే మొదలుపెడితే మేలు అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరిన యువతకు అంతగా ఆర్థిక ఇబ్బందులుండవు. వారి సంపాదనలో అధిక భాగం విలాసాలకే కేటాయిస్తారు. పొదుపు ఆలోచనే ఉండదు. వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. పొదుపు అవసరాలు తెలుస్తాయి. 50ల్లోకి రాగానే భవిష్యత్తుపై ఆందోళన మొదలవుతుంది. ఇలా వయసును బట్టి ఆర్థిక అవసరాలు మారుతాయి. దానికి అనుగుణంగానే పొదుపు-మదుపులో మార్పులు చేసుకోవాలి. పొదుపు సామర్థ్యం అనేది వారి రిస్క్‌ను బట్టి మారుతుంటుంది. అందుకే వయసును బట్టి పోర్ట్‌ఫోలియోను మార్చుకోవాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం... ఈ వయసు వారు అప్పుడే ఉద్యోగంలో చేరి ఉంటారు. చాలామందికి పెళ్లి కూడా అయి ఉండదు కనక ఖర్చులు తక్కువే. భవిష్యత్తు కోసం సాధ్యమైనంత ఎక్కువ నిధిని కూడబెట్టాల్సింది ఇప్పుడే. ఈ వయసులో ఏటా ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంటుంది. అలాగే వీరి రిస్కు సామర్థ్యమూ ఎక్కువే. మున్ముందు పెళ్లి, పిల్లలు, సొంతిల్లు వంటి ఆర్థిక అవసరాలుంటాయి కనక వీటికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి. ఈ వయసు వారు వారి రిస్క్ సామర్థ్యాన్ని బట్టి సాధ్యమైనంత వరకు అధిక మొత్తం ఈక్విటీలకు కేటాయించేలా పోర్ట్‌ఫోలియోను రూపొందించుకుంటే బాగుంటుంది. ఎంత జీతం ఉన్నా సరిపోని విధంగా వీరికి ఖర్చులు చాలా ఎక్కువ. పెళ్లయిన తర్వాత ఇంటికి సామాన్లు సమకూర్చుకోవడం, పిల్లల చదువులు, గృహ, వాహన ఈఎంఐలు ఇలా ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయి కనక రిస్క్ సామర్థ్యమూ తగ్గుతుంది. అందుకే ఈక్విటీలకు కొద్దిగా తగ్గించుకొని ఆ మొత్తాన్ని స్థిరాదాయానికి ఇచ్చే వాటికి కేటాయిస్తే సరిపోతుంది. -
లేటు వయసులో తల్లిదండ్రులైతే..!
భిన్నమైన ప్లానింగ్ తప్పనిసరి ఈనాటి యువత కెరీర్‌కే ప్రాధాన్యమిస్తుండటంతో పెళ్లి, పిల్లలు వంటివి ఆలస్యమవుతున్నాయి. ఒకవేళ సకాలంలో పెళ్లయినా భార్యాభర్తలిద్దరూ కెరీర్ జపం చేస్తుండటం వల్ల పిల్లలు లేటుగా పుడుతున్నారు. ఇలాంటి 35-40 సంవత్సరాల మధ్య ఉండే లేట్ పేరెంట్స్... ఆర్థిక విషయాల్లో ఇతరులకన్నా భిన్నంగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి వారికి ఆ సమయంలోనే ఆదాయం ఎక్కువగా ఉండడంతో పాటు పిల్లలు, వారి సంరక్షణ ఖర్చూ అప్పుడే ఎక్కువగా ఉంటుంది. మరోవంక రిటైర్ అయ్యే సమయం ముంచుకొస్తూ ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ చేయాలి. అందుకోసం నిపుణుల సలహాలివీ... పొదుపు... పొదుపు... అదే మదుపు లేటు వయస్సులో తల్లిదండ్రులైన వాళ్లు కొన్ని త్యాగాలు చేయకతప్పదు. విలాసాలకు ఫుల్స్టాప్ పెట్టాలి. విలాసవంతమైన క్లబ్‌లలో సభ్యత్వం, ఏడాదికి రెండు సార్లు విదేశీ విహారం లాంటివి తగ్గించుకోవాలి. అలాగని మరీ త్యాగమూర్తులు కావాల్సిన పనిలేదు. ఒక తండ్రిని ఉదాహరణగా తీసుకుంటే.... ఆయన ఖర్చులపై అదుపు కోసం వినూత్న విధానాన్ని అనుసరించాడు. అప్పటివరకూ బీమా ప్రీమియాల్ని ఏడాదికి ఒకేసారి కట్టేసేవాడు. కూతురు పుట్టాక మూడునెలకొకసారి ప్రీమియం చెల్లిస్తున్నాడు. దీనివల్ల చెల్లించాల్సిన ప్రీమియమ్‌లో పెద్దగా తేడా ఉం డదు. కానీ, మూడునెలలకొకసారి చెల్లించడం వల్ల అనవసర ఖర్చులు తగ్గించుకోగలిగానన్నది ఆయన మాట. రిస్క్‌లు వద్దే వద్దు.... లేటు వయసులో పిల్లలు పుట్టడం వల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా పిల్లల కోసం భారీగానే ఖర్చు చేయాల్సి రావచ్చు. అందుకని ఇలాంటి వాళ్లు రిస్క్‌లు తగ్గించుకోవాలి. తక్కువ రాబడులొచ్చే పొదుపు మార్గాలను తగ్గించుకోవాలి. ఎక్కువ మొత్తంలో పొదుపు చేయడానికి ప్రయత్నించాలి. స్టాక్ మార్కెట్లో నేరుగా ఇన్వెస్ట్చేయడం ఒకింత రిస్క్ అనే చెప్పవచ్చు. రిస్క్ తగ్గించుకోవడానికి మ్యూచుల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పరిశీలించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఒకింత రిస్క్ ఉంటుంది. అందుకని లార్జ్ క్యాప్ ఫండ్స్‌కు ప్రాధాన్యమివ్వాలి. కొంచెం రిస్క్ తీసుకోగలిగితే మల్టీ-క్యాప్ ఫండ్స్ మంచి రాబడులనిస్తాయి. తల్లిదండ్రుల్లో ఒకరే సంపాదనపరులైతే రిస్క్ విషయానికి తగినంత ప్రాధాన్యమివ్వాలి. సెకండ్ కెరీర్‌నీ చూసుకోవాలి... లేటు వయస్సు తల్లిదండ్రులు రిటైరైనప్పటికీ, వారి పిల్లల బరువు, బాధ్యతలు పూర్తిగా తల్లిదండ్రులపైనే ఉంటాయి. ఇది లేటు వయస్సు తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులపై బాగానే ప్రభావం చూపుతుంది. రిటైరయ్యాక కూడా ఆదాయం కోసం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాల్సిందే. పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తే కొంత వరకూ ఆర్థిక వెసులుబాటు లభిస్తుంది. విల్లు రాయాల్సిందే.. కుటుంబానికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో విల్లు రాయడం కీలకం. ఏదైనా జరగరానిది జరిగితే, బిడ్డ/భార్యకు సంరక్షకులుగా వ్యవహరించడానికి నమ్మకస్తులైన బంధువు/మిత్రుడిని ఎంచుకోవాలి. విల్లులోని వివరాలు సమూలంగా జీవిత భాగస్వామికి వివరించాలి. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి వివాదాలు తలెత్తవు. దీర్ఘకాల కవర్ ఉండాలి... బీమాకు సంబంధించి కవర్ అధిక మొత్తంలో ఉండడమే కాక ఎక్కువ కాలం ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు 40 ఏళ్ల వ్యక్తికి కూతురో, కొడుకో పుడితే... ఆ వ్యక్తి రిటైరయ్యేటప్పటికి ఈ పాప/బాబు కాలేజీ చదువు కూడా పూర్తవదు. అందుకే ఆ వ్యక్తి లైఫ్ కవర్ 65 లేదా 70 ఏళ్ల వరకూ తీసుకోవాలి. ఇప్పుడు చాలా కంపెనీలు ఈ వయస్సు వరకూ టెర్మ్ కవరేజీని ఇస్తున్నాయి. 40 ఏళ్ల వ్యక్తి తర్వాతి 30 ఏళ్లకు రూ.కోటి బీమా కవర్ తీసుకుంటే బీమా ప్రీమియం ఏడాదికి రూ.18,000 వరకూ ఉండొచ్చు. తక్కువ కవర్‌ను ఇచ్చే అనవసర జీవిత బీమా పాలసీలను సరెండర్ చేసి వాటి బదులుగా టెర్మ్ పాలసీలు తీసుకోవాలి. దీనివల్ల వార్షికంగా కొంత ఆదాయం మిగులుతుంది. దీంతో మరిన్ని రాబడులు వచ్చేలా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. లేదా ఈ మిగులు సొమ్ముతో అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవచ్చు. ఆరోగ్య బీమా కూడా ముఖ్యమైనదే. కుటుంబం మొత్తానికి ఫ్లోటర్ హాస్పిటలైజేషన్ కవర్ తీసుకోవడం మంచిది. 40 ఏళ్ల వయస్సులో ఇలాంటి పాలసీ తీసుకుంటే ప్రీమియం ఎక్కువగానే చెల్లించాల్సి ఉంటుంది. అందుకని బేస్ కవర్ తీసుకొని,వాటికి సూపర్ టాప్-అప్ హెల్త్ప్లాన్లు జత చేయాలి. -
పొదుపు బాటలో ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎట్టకేలకు పొదుపుబాట పట్టింది. రోజురోజుకు పెరుగుతున్న నష్టాలను అధిగమించేందుకు ఖర్చులను నియంత్రించుకోవటంతోపాటు ఆదాయాన్ని పెంచుకునేందుకు అంతర్గత సామర్థ్యానికి పదును పెట్టాలన్న సీఎం ఆదేశంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించే సమయంలో సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గట్టిగా చెప్పారు. దీంతో తొలుత ఇంధన రూపంలో అవుతున్న ఖర్చును ఆదా చేయటంతో ఆయ న మాటలను అమలు చేయబోతోంది. ఇందులో భాగంగా వచ్చే నెల నుంచి బయో డీజిల్ వాడకాన్ని ప్రారంభించబోతోంది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఇంధనంలో 10 శాతం మేర బయోడీజిల్‌ను వాడబోతోంది. సాధారణ డీజిల్‌తో పోలిస్తే బయో డీజిల్ ధర లీటరుకు రూ.8 మేర తక్కువగా ఉన్నందు న నిత్యం రూ.అరకోటి వరకు ఆదా అవుతుందని అధికారులు లెక్కలేస్తున్నా రు. వెరసి ప్రతినెలా రూ.15 కోట్ల మేర ఇంధన రూపంలో ఖర్చు తగ్గనుంది. గతంలోనే నిపుణుల సూచన ధర పరంగా డీజిల్ కంటే బయో డీజిల్ చవకైంది కావటంతోపాటు వాతావరణ కాలుష్యానికి కారణమయ్యే ఉద్గారాలనూ నియంత్రిస్తుంది. ఆర్టీసీ కూడా దీన్ని వినియోగిస్తే ఖర్చు తగ్గుతుందని చాలాకాలం క్రితమే నిపుణులు సూచించారు. దీంతో ఆ దిశగా ఆర్టీసీ కూడా అప్పట్లో చర్యలు చేపట్టింది. కానీ రాష్ట్ర విభజన ఉద్యమాల నేపథ్యంలో అంతర్గతంగా సరైన పరిస్థితులు లేకపోవటంతో అధికారులు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మధ్యలో కొన్నిసారి టెండర్లు పిలిచినా దాన్ని అమలులోకి తేలేకపోయారు. ఓసారి గట్టిగానే ప్రయత్నించినా... దాని ధర ఎక్కువే ఉందన్న కారణాన్ని పేర్కొంటూ ప్రతిపాదనను అటకెక్కించారు. కానీ ప్రస్తుతం మార్కెట్లో లీటరు డీజిల్‌తో పోలిస్తే రూ.8 వరకు బయోడీజిల్ ధర తక్కువగా ఉంది. ఆ ఇంధనాన్ని సరఫరా చేసే సంస్థలు కూడా ఎక్కువయ్యాయి. ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ నిత్యం 6 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోంది. ఈ రూపంలో రోజూ అవుతున్న ఖర్చు రూ.3.5 కోట్లు. ఇందులో 10 శాతం వరకు బయోడీజిల్‌ను ఇంధనంగా వాడాలనేది తాజా ప్రతిపాదన. ప్రస్తుతం మార్కెట్లో బయో డీజిల్ ధర లీటర్‌కు రూ.51 వరకు ఉంది. ఇది డీజిల్ కంటే రూ.8 వరకు తక్కువ. ఈలెక్కన ప్రతి లీటరు ఇంధనం వ్యయంలో అంతమేర ఆదా చేస్తే నిత్యం రూ.అరకోటి వరకు ఖర్చు తగ్గుతుంది. రాష్ట్రంలో తొలుత వెయ్యి బస్సులతో ప్రారంభించే యోచనలో అధికారులున్నారు. దాని ఫలి తాల ఆధారంగా ఆ ఇంధనాన్ని మిగతా బస్సులకు కూ డా విస్తరించనున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
పొదుపు పాఠం నేర్పండిలా..!
పేరెంటింగ్ టిప్స్ పిల్లలకు పొదుపు లక్షణాన్ని అలవరచడం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు ఒక్కసారి పొదుపులో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తే... ఆ తరువాత ‘రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు’. మీ చిన్నారికి ప్రతిరోజూ మీరు ఇచ్చే రూపాయి వారి పిగ్గీబ్యాంక్లో చేరుతుంది. ‘పిగ్గీబ్యాంక్ నిర్వహణ’పై వారికి అవగాహన వస్తుంది. పిగ్గీబ్యాంక్ నిండినపుడు అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి పట్టిన ‘కాలం విలువ’ తెలిసివస్తుంది. ఎన్నిరోజులు కష్టపడితే లక్ష్యాన్ని చేరుకున్నామో తెలుస్తుంది. తల్లిదండ్రులు తమ కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసుకుంటారు. ఆ ఆలోచన వారిని దుబారాకు దూరంగా ఉంచుతుంది. 6-10 ఏళ్లలో..: డబ్బు విలువను పిల్లలకు తెలియజేయడానికి ఇది సరైన వయసు. ఆర్థికపరమైన విషయాల్లో పిల్లలను భాగస్వాములను చేయండి. మీరు ఫలానా వస్తువు ఎందుకు కొంటున్నారో చెప్పండి. వారికి కావలసిన వస్తువు ధర ఎక్కువగా ఉంటే... అదే నాణ్యతలో అంతకన్నా తక్కువ ధరలో వస్తువులు ఎక్కడ దొరుకుతాయో తెలియజేయండి. కొంత డబ్బు ఇచ్చి పిల్లలను సూపర్ మార్కెట్‌కు పంపండి. వాళ్లకు నచ్చిన వస్తువును కొనమని చెప్పండి. వారు కొనేటప్పుడు ఏం నేర్చుకున్నారో గమనించండి. ఇలాంటి పనులు వారిలో స్వయం నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని పెంపొందిస్తాయి. ప్రతి వస్తువును కొనేముందు అవసరం అనుకుంటేనే కొనాలని, ఇష్టానుసారంగా కొనుక్కుంటూ పోతే చివరికి మనవద్ద ఏమీ మిగలదని చెప్పండి. 11-13 ఏళ్లలో..: ఈ వయసులో వారికి వడ్డీ అంటే ఏంటో పరిచయం చెయ్యాలి. వారికోసం దాచే చిన్నమొత్తాలకు ఎంత వడ్డీ వస్తుందో వారితోనే లెక్కగట్టించాలి. వారికి 20 ఏళ్లు, 30 ఏళ్లు అలా ఎన్నేళ్లకు ఎంత వడ్డీ జమవుతుందో వారినే చెప్పమనండి. దాని ద్వారా పిల్లల్లో పొదుపు చేయాలనే తాపత్రయం పెరుగుతుంది. పిగ్గీబ్యాంక్ ద్వారా డబ్బు కేవలం జమవుతుంది. అదే పొదుపుఖాతాల ద్వారా అయితే వడ్డీ కూడా వస్తుందని తెలిస్తే తప్పకుండా పాటిస్తారు. మరీ ఖరీదైన ఆటవస్తువులను కొనివ్వకండి. వాటికి బదులుగా ఇంట్లో కొద్దిసేపు వీడియోగేమ్‌లు ఆడుకోమని చెప్పండి. 14-18 ఏళ్లలో..: ఈ వయసు పిల్లల చేత బ్యాంకు, పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతాలు తెరిపించండి. వారికి ప్రతినెలా పాకెట్ మనీ ఇవ్వడం ప్రారంభించండి. ముందు పొదుపు ఖాతాలో డబ్బులు వేసిన తరువాత మిగిలినవి ఖర్చు చేసుకోమని చెప్పండి. మల్టీప్లెక్స్‌లు, పెద్దపెద్ద షాపింగ్‌మాల్స్‌కు బదులు ఇంటికి సమీపంలో ఉన్న సాధారణ థియేటర్లోనూ అదే సినిమా తక్కువ ధరలో చూడవచ్చని వారు గ్రహించేలా చెప్పండి. - అనిల్ కుమార్ బి. -
మా సొమ్ముకు శఠగోపం పెడితే ఎలా?
కృష్ణా(విజయవాడ) : తప్పు మీరు చేసి మా పొదుపు నుంచి కట్ చేస్తే ఎలా? ఉద్యోగుల సొమ్ము అప్పనంగా వాడేసిన కమిషనర్లపై కేసు పెట్టండి. లేదంటే మీరే బాధ్యత వహించండి.. అంటూ కార్పొరేషన్ ఉద్యోగులు విజయవాడ మునిసిపల్ ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పాలక వర్గంపై తిరుగుబాటు చేశారు. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సొసైటీ వార్షిక బడ్జెట్ సమావేశం హనుమాన్ పేటలోని జంధ్యాల దక్షిణామూర్తి నగరపాలక సంస్థ పాఠశాలలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై వాడివేడిగా చర్చ సాగింది. వివరాలు.. 2012వ సంవత్సరంలో 650 మంది ఉద్యోగులు సొసైటీ నుంచి తీసుకున్న రుణ మినహాయింపు కోసం వారి జీతాల నుంచి కొంత సొమ్ము కట్ చేశారు. అయితే, కట్ చేసిన సొమ్ము రూ.2.68 కోట్లను బ్యాంక్‌కు మినహాయించలేదు. ఆ మొత్తాన్ని ఇతర పనుల కోసం వినియోగించారు. ప్రస్తుతం ఆ రూ.2.68 కోట్లకు రూ.80లక్షలు వడ్డీ అయ్యింది. ఈ నష్టాన్ని తిరిగి ఉద్యోగుల జీతం నుంచి భర్తీ చేస్తున్నారు. ఈ అంశాన్ని సొసైటీ డెరైక్టర్ బ్రహ్మారెడ్డి బడ్జెట్ సమావేశంలో లేవనెత్తారు. వడ్డీ నష్టాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. దీనిని పూడ్చుకునేందుకు ఉద్యోగుల పొదుపు సొమ్ము నుంచి మినహాయించడం ఎంతవరకు సబబు అని నిలదీశారు. ఉద్యోగుల సొమ్ము వాడుకునే అధికారం నాటి కమిషనర్‌కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రావిడెంట్ ఫండ్ మొత్తం ఎంత ఉందో తేల్చిచెప్పాలన్నారు. ఆడిట్ వ్యవహారంలోనూ మతలబు జరుగుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయని మరో డెరైక్టర్ అజయ్‌కుమార్ ఆరోపించారు. ఖర్చవుతోందని ప్రశ్నించారు. అయితే, ఇవి అంచనాలు మాత్రమేనని ఈశ్వర్ సమాధానమిచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఒక్కో ఉద్యోగికి రూ.3.50 లక్షలు వ్యక్తిగత రుణాన్ని అందించనున్నట్లు ఈశ్వర్ స్పష్టంచేశారు. గతంతో పోలిస్తే లక్ష రూపాయల మేర రుణ పరపతి పెరుగుతోందన్నారు. పొదుపు మొత్తాన్ని నెలకు రూ.500 నుంచి రూ.1,000 వరకు పెంచాలన్న పాలకపక్షం ప్రతిపాదనను కొందరు సభ్యులు వ్యతిరేకించారు. బడ్జెట్ కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇద్దరు డెరైక్టర్లతో పాటు పలువురు సభ్యులు ప్రశ్నల వర్షం కురిపించడంతో పాలకవర్గం కంగుతింది. -
లక్ష్యం కష్టమే..
ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు రుణాలందక అల్లాడుతున్న మహిళా సంఘాలు బకాయిలు చెల్లిస్తేనే కొత్తరుణాలంటున్న బ్యాంకర్లు లక్ష్యం అధిగమించలేక చతికలపడిన యంత్రాంగం ఇవ్వాల్సింది బారెడు.. ఇచ్చింది మూరెడు అన్న చందంగా తయారైంది జిల్లాలో డ్వాక్రా సంఘాల రుణలక్ష్యం తీరు. రుణమాఫీ మహిళాసంఘాలనే కాదు అధికారులను సైతం ముప్పుతిప్పలు పెడుతోంది. అప్పులుపుట్టక మహిళలు గగ్గోలు పెడుతుంటే లక్ష్యం చేరే పరిస్థితి లేక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మరొక పక్క కొండలా పేరుకు పోయిన బకాయిలు వసూలు కాక బ్యాంకర్లు ఇబ్బందులపాలవుతున్నారు. విశాఖపట్నం: పొదుపు ఉద్యమాన్ని రుణమాఫీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నీరుగార్చింది. గద్దెనెక్కి ఎనిమిది నెలలైనా మాఫీకాదు కదా కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఊసెత్తకుండా కాలయాపన చేస్తు న్న ప్రభుత్వం.. ఏది ఏమైనా రుణలక్ష్యం చేరాలంటూ అధికారుల మెడపై కత్తి పెడుతోంది. వడ్డీలతో పేరుకుపోయిన బకాయిలు చెల్లిస్తే తప్ప కొత్త రుణాలివ్వలేమని బ్యాంకర్లు తెగేసి చెబుతుండగా.. కనీసం కొత్త సంఘాలకైనా రుణాలివ్వాలంటూ వారి కాళ్లా వేళ్లాపడుతున్నారు అధికారులు. గ్రామీణ జిల్లాలోని 44,211 సంఘాల్లో 5,08,782 మంది సభ్యులున్నారు. వీటిలో 21,386సంఘాలకు రూ.641.42కోట్లుఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు కేవలం 5వేల సంఘాలకు రూ.195కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు.జీవీఎంసీపరిధిలోని 21,660 డ్వాక్రా సంఘాల్లో 2,30,656 మంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్విశాఖలో 7468సంఘాలకు రూ.175.96కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్దేశించగా, ఇప్పటి వ రకు కేవలం 2045సంఘాలకు రూ.65 కోట్లు మాత్రమే ఇవ్వగలిగారు. ఇక యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీల్లోని 2032 సంఘాల్లో 23వేల మంది సభ్యులున్నారు. ఈ రెండు మున్సిపాల్టీల్లో 732 సంఘాలకు రూ.19.05కోట్లు రుణాలివ్వాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటి వరకుకేవలం 185 సంఘాలకు కేవలం రూ.6.36కోట్లు మాత్రమే ఇచ్చారు. ఇలా మొత్తమ్మీద జిల్లాలో నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 32 శాతం మాత్రమే చేరుకోగలిగారు. గతంలో ఏటా నూరుశాతం లక్ష్యాన్ని చేరుకోవడమేకాదు.. లక్ష్యానికి మించి రుణాలిచ్చేవారు. ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది అతికష్టమ్మీద రూ.270కోట్లకు మించి అప్పులివ్వలేని దుస్థితిలో బ్యాంకర్లు ఉన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ హామీపుణ్యమే పొదుపు సంఘాల నేటి దుస్థితికి కారణమని అధికారులే బాహాటంగా చెబుతున్నారు. వడ్డీ లేని రుణ పథకం కింద పొందే రాయితీతో పాటు పావలా వడ్డీ రాయితీని కూడాసంఘాలు కోల్పోయాయి. మరొక పక్క 14 శాతం వడ్డీతో బకాయిలు తడిసిమోపెడయ్యాయి. ఒక్కో సంఘానికి గడిచిన ఏడాదిలో వడ్డీయే 50 వేల వరకు పడినట్టుగా బ్యాంకర్లు చెబుతున్నారు. వడ్డీతో అసలు చెల్లించ లేక ఇంకా లక్షలాది సంఘాలు ప్రభుత్వ రుణమాఫీకోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. సంక్రాంతికి ప్రతీ మహిళకు రూ.10వేల చొప్పునసంఘానికి లక్ష చొప్పున జమ చేస్తామని గతేడాది విశాఖ పునరుద్ధరణ వేడుకల్లో చంద్రబాబు ప్రకటించిన హామీ నేటికీ అమలుకు నోచుకోక పోవడం పట్ల డ్వాక్రా సంఘాల సభ్యులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. చేతకానప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారంటూ మండిపడుతున్నారు. బ్యాంకర్లు ముఖం చాటేయడంతో వడ్డీలకు అప్పులు తె చ్చుకోలేక ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నామని వాపోతున్నారు. -
మీ ఆర్థిక లక్ష్యాలను అందుకోవడమిలా...
పొదుపు సలహా మా పొలం అమ్మితే దాదాపు పది లక్షలు వచ్చాయి. అందులో మా తక్షణావసరాలు పోను ఆరేడు లక్షల వరకు మిగిలాయి. వాటిని మదుపు చేసేందుకు సురక్షితమైన మార్గం చెప్పగలరు. మా పిల్లలు సెవెన్త్, టెంత్ చదువుతున్నారు. - ఎస్. పుష్పలత, కైకలూరు మీ పిల్లల ఉన్నత చదువులు.. వివాహాల ఖర్చుల కోసం, మీ రిటైర్మెంట్ కోసం తగినంత నిధిని సమకూర్చుకోవడం మీ లక్ష్యాలు. దీనిప్రకారం చూస్తే కింది పేర్కొన్న విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరగలవు. 1. మీ దగ్గరున్న మొత్తంలో 40 శాతాన్ని అధిక రాబడులు అందించగలిగే షేర్లు, షేర్ల ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్స్‌కి సంబంధించి ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీవోల్లో లేదా సెకండరీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే.. డీమ్యాట్ పద్ధతిలో స్టాక్ బ్రోకర్ ద్వారా గానీ లేదా మ్యూచువల్ ఫండ్ ఏజంట్ల ద్వారా గానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే నిపుణుల సలహా తీసుకోండి. దశలవారీగా ఇన్వెస్ట్ చేయండి. 2. మరో 30 శాతం మొత్తాన్ని బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లు/ కార్పొరేట్ ఫిక్సిడ్ డిపాజిట్లు/ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లలో ఉంచండి. 3. ఇక రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మీ వద్ద ఉన్న డబ్బులో 20 శాతాన్ని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్/ న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)/ యాన్యుయిటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. పీపీఎఫ్‌లో రిస్కులు ఉండవు, రాబడులు గ్యారంటీ. మీరు నిర్దేశించుకున్న వ్యవధి తర్వాత యాన్యుయిటీ ప్లాన్ల ద్వారా పింఛను అందుకోవచ్చు. 4. చివరిగా మిగిలిన 10 శాతం మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల కోసం బ్యాంక్ సేవింగ్స్ అకౌంటు/లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఉంచండి. బ్యాంక్ పొదుపు ఖాతాల కన్నా వీటిపై కాస్త ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. - రజనీ భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ -
బంగారం లాంటి లక్ష్యం కోసం.
మాకు ఏడేళ్లమ్మాయి, పదేళ్ల అమ్మాయి ఉన్నారు. మా పిల్లలకు పెళ్లి వయసు వచ్చేసరికి చెరొక పది తులాల బంగారు నగలు చేయించాలని నా ఆలోచన. మా వారి జీతం నుంచి నెలకు ఆరువేల వరకు పొదుపు చేయగలను. నేను ఏ విధంగా చేస్తే సులువుగా నా లక్ష్యాన్ని సాధించగలనో సలహా ఇవ్వగలరు. - సి.కుమారి, విజయవాడ సాధారణంగా స్టాక్ మార్కెట్ల పనితీరు ఆధారంగానే పసిడి ధరలో హెచ్చుతగ్గులుండటం గమనించవచ్చు. మీరు ప్రస్తుతం నెలకు రూ. 6,000 పొదుపు చేయగలనన్నారు కదా. ఈ నేపథ్యంలో ఆ మొత్తాన్ని ఈ కింది సాధనాల్లో మదుపు చేయడం ద్వారా గరిష్టంగా ప్రయోజనం పొందవచ్చు.. మీ లక్ష్యాన్నీ సాధించవచ్చు. 1. గోల్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలు (నెలవారీ సిప్ పద్ధతిన) మీరు పొదుపు చేస్తున్న మొత్తంలో మూడోవంతు.. అంటే రూ. 2,000ను సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద ఏదైనా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు కట్టే మొత్తంతో ఫండ్.. పసిడిని కొనుగోలు చేసి, మీకు యూనిట్స్‌ను కేటాయిస్తుంది. మీరెప్పుడైనా ఆభరణాలు కొనుగోలు చేయదల్చకుంటే ఈ యూనిట్లను విక్రయించేసి కొనుక్కోవచ్చు. బంగారం రూపంలో కొని ఉంచుకోవడం కంటే ఇలా కొనుక్కోవడం మంచిది. 2. రికరింగ్ /ఫిక్సిడ్ డిపాజిట్ మరో మూడో వంతు డబ్బును.. అంటే రూ. 2,000ను ఆర్డీ లేదా ఫిక్సిడ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలో కచ్చితమైన రాబడి ఉంటుంది. రిస్కులు ఉండవు. 3. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీములు (నెలవారీ సిప్ పద్ధతి) ప్రస్తుతం మీ పిల్లలది చిన్న వయస్సే. దీన్ని బట్టి మీరు దీర్ఘకాలిక దృష్టితో కాస్త రిస్కు తీసుకోవచ్చు. కనుక, మిగతా మూడో వంతు మొత్తాన్ని సగటున 15-18 శాతం మేర రాబడులు ఇస్తున్న మంచి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ (గ్రోత్ ఓరియంటెడ్)లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా మార్కెట్లపరంగా వచ్చే అధిక రాబడులనూ అందుకోవచ్చు. తద్వారా మరిన్ని ఎక్కువ ఆభరణాలనూ కొనుక్కోవచ్చు. - రజని భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ -
రిటైర్మెంట్ ప్లాన్ ఇలా బెటర్!
పొదుపు సలహా మా వారొక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మాకు ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం మాకు బాగానే గడిచిపోతోంది. అయితే మరో పదిహేనేళ్లకు ఆయన రిటైరవుతారు. ఆ తర్వాత మా పరిస్థితి ఏమిటన్నది నా ఆందోళన. దయచేసి మాకు ఒక మంచి రిటైర్మెంట్ ప్లాన్ చెప్పగలరు. మా వారి జీతం నుంచి నేను నెలకు ఐదువేల వరకు ఆదా చేయగలను. - ఎన్.పి.లత, హైదరాబాద్ రిటైర్మెంట్ ప్లాన్ కోసం మీరు కేటాయించదలచిన ఈ మొత్తాన్ని ఈ కిందివిధంగా మదుపు చేస్తే మీ విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపవచ్చు. పి.పి.ఎఫ్: ఈ ప్లాన్ కింద మీరు నెలకు రూ. 2000 చొప్పున పదిహేను సంవత్సరాలపాటు పొదుపు చేయండి. ఇది ఎటువంటి నష్టభయమూ లేని మార్గం. దీనికి సెక్షన్ 80 సి కింద దీనికి పన్ను రాయితీ ఉంది. వడ్డీపై ఎటువంటి పన్నూ లేదు. ప్రస్తుతం ఈ పథకంలో 8.7 శాతం వడ్డీ ఇస్తున్నారు. మనీ బ్యాక్ పాలసీలు/ఎన్పీఎస్: ఈ పథకం కింద మీరు నెలకు రూ.1500 వరకు మదుపు చేయవచ్చు. ఇది కూడా నష్టభయం లేని పథకమే. ఇందులో మదుపు చేయడం వల్ల బీమాతోపాటు మనం ఎంచుకున్న కాలవ్యవధి మేరకు విడతల వారీగా కొంత మొత్తం సొమ్ము చేతికి అందుతుంటుంది. దీనికి చెల్లించే ప్రీమియంకు పన్ను రాయితీ ఉంది. దీనితోబాటు నూతన పెన్షన్ పథకం కూడా ప్రయోజనకరమే. ఇందులో మంచి రిటైర్మెంట్ బెనిఫిట్స్ లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్: పైన చెప్పుకున్న రెండూ స్వల్ప వడ్డీనిచ్చే నష్టభయం లేని పథకాలు కాబట్టి, మిగిలిన డబ్బును మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ ఆధారిత గోత్ పథకంలో పెట్టుబడి పెట్టడం ప్రయోజనకరం. పదిహేనేళ్ల కనీస వ్యవధిని ఎంచుకుంటే 15 నుంచి 18 శాతం వరకు వడ్డీ గ్యారంటీ ప్రయోజనాన్ని పొందవచ్చు. - రజని భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ పొదుపు సలహా -
దిగమింగి దగా చేశాడు
ఆశాలపల్లి(సంగెం) : ఐకేపీ సీఏ నిర్లక్ష్యంతో గ్రామైక్య సంఘాల మహిళలను రూ. 50 లక్షలు నష్టపోయూరు. 48 సంఘాలకు రాయితీ వడ్డీ రాకుండా సీఏ ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఇలా ఒక్కో సంఘం రూ. లక్ష-1.8 లక్షలు నష్టపోయింది. నష్టాన్ని ఆలస్యంగా గుర్తించిన మహిళలు గురువారం ఆందోళనకు దిగారు. మండలంలోని ఆశాలపల్లిలో రెండు గ్రామైక్య సంఘాల్లో 48 సంఘాలకు చెందిన 580 మంది సభ్యులున్నారు. వీరంతా క్రమం తప్పకుండా పొదుపులు, బ్యాంకు రుణాలకు వడ్డీ చెల్లిస్తున్నారు. కానీ మూడేళ్లలో ఒక్క సంఘానికీ వడ్డీ తిరిగిరాలేదు. ఇదే విషయూన్ని సీఏ బొల్లేబోయిన కుమారస్వామిని అడిగితే దాటవేస్తూ వచ్చాడు. మహిళలు వారింట్లో సమస్య చెప్పుకోగా గత నెల 22న ఏపీఎం ఝాన్సీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గ్రామంలో అధికారులు గురువారం బహిరంగ చర్చ చేపట్టారు. తమ పొదుపులు, రుణ వాయిదాలను బ్యాంకులో చెల్లిస్తానని సీఏ కుమారస్వామి తీసుకుని సొంతానికి వాడుకునేవాడని మహిళలు ఆరోపించారు. అన్ని సంఘాల పుస్తకాలు తన వద్దే పెట్టుకునేవాడని, ఈ విషయం బయటపెట్టొద్దని బెదిరించేవాడని పేర్కొన్నారు. లింకేజీ కింద రూ. లక్ష రుణం మంజూరైతే రూ. వెయ్యిచొప్పున కమీషన్ తీసుకునేవాడని, అభయహస్తం బీమా సొమ్ము రూ. 30 వేలు మంజూరైతే రూ.4 వేల చొప్పున కోత విధించేవాడని ఆరోపించారు. ఆడిట్ కోసం రూ. 150, మొబైల్ బుక్కీపింగ్ ఇతరాల కోసం ఒక్కో సంఘం నుంచి నెలకు రూ.450ల చొప్పున వసూలు చేశాడని తెలిపారు. ఇన్ని వసూళ్లకు పాల్పడి కూడా.. ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీని దక్కనీయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఏపై చర్య తీసుకుని తమకు న్యాయం చేయూలని కోరారు. సీఏ కుమారస్వామి, సీసీ కొమురయ్యపై పీడీకి నివేదిక ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. సర్పంచ్ గాజే మురళి, మాజీ సర్పంచ్ కిశోర్‌యాదవ్, మాజీ ఎంపీటీసీ సూరయ్య తదితరులు పాల్గొన్నారు. -
భారతీయ మహిళా బ్యాంక్
మహిళ కష్టపడి డబ్బు సంపాదిస్తే సరిపోతుందా? దాన్ని దాచుకునే దారి కూడా ఉండాలి కదా! ఇక్కడ మాట్లాడుతున్నది పెద్ద ఉద్యోగాలు చేస్తూ వేలు, లక్షల రూపాయలు సంపాదించే మహిళల గురించి కాదు.. రోజు కూలీ చేసుకునే సామాన్య మహిళకు పొదుపు చేసుకునేందుకు భద్రమైన చోటు కావాలి. బ్యాంక్‌లో నాలుగు పైసలుంటే ఉండే భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క భారతీయ మహిళకూ బ్యాంక్‌లో అకౌంటు ఉండాలనే లక్ష్యంతో గతేడాది ముంబైలో ‘భారతీయ మహిళా బ్యాంక్’ నెలకొల్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 భారతీయ మహిళా బ్యాంక్‌లున్నాయి. పందొమ్మిదో బ్రాంచ్‌గా హైదరాబాద్‌లో వెలసిన బీఎమ్‌బీ.. అకౌంట్ల ఓపెనింగ్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. - భువనేశ్వరి ఈ ఏడాది మార్చిలో అమీర్‌పేట దగ్గర భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్‌బీ)ని నెలకొల్పిన కొత్తలో సిబ్బంది పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. ‘బ్యాంక్‌లో మొత్తం ఆరుగురు మహిళా ఉద్యోగులం ఉన్నాం. మా బ్యాంక్ చుట్టూ మరో నాలుగు ఇతర బ్యాంకులున్నాయి. ఎవరొచ్చినా వాటిలోకే వెళ్లేవారు. ఒక్కరు కూడా మా బ్యాంకు వైపు తొంగి చూసేవారు కాదు. ‘మహిళా బ్యాంక్‌లో సొమ్ము దాచుకోవడం ఏంటమ్మా..’ అంటూ హేళన చేసేవారు ఎదురయ్యారు. లాభం లేదని మేమంతా కుర్చీలు వదిలేసి బ్యాంక్ బయట మెట్లపై కూర్చొని అటుగా వచ్చేవారికి మా బ్యాంక్ గురించి చెప్పడం మొదలుపెట్టాం. చాలావరకూ మహిళలకే చెప్పేవాళ్లం. కొందరు బ్యాంక్ లోపలికి వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకుని అకౌంట్ ఓపెన్ చేసేవారు. కొన్ని రోజులు గడిచాక మేం మా సీట్లలో కూర్చుని పనిచేయడం మొదలుపెట్టాం’ అంటూ తమ బ్రాంచ్ ఓపెన్ అయిన తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు సీనియర్ మేనేజర్ సుచరిత. క్యాంప్.. ఆపరేషన్.. మహిళా ఖాతాదారుల సంఖ్య వేగంగా పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేశారు. వారాంతాల్లో మురికివాడలకు వెళ్లి అక్కడి మహిళల్ని కలసి కౌన్సెలింగ్ ఇచ్చి వారితో ఖాతాలు తెరిపించడం మొదలుపెట్టారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో విరివిరిగా క్యాంపులు నిర్వహించారు. ఫలితంగా.. పట్టుమని పదినెలలు కూడా పూర్తి కాకుండానే బ్యాంకులో అకౌంట్ల సంఖ్య 7 వేలకు చేరింది. ఇందులో ఆరున్నరవేల ఖాతాలు మహిళలవే కావడం విశేషం. ‘పేద, సామాన్య మహిళలు ఏదో ఒక పనిచేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ వాటిని పొదుపు చేసుకునే తీరు, దారి తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు ఎక్కడున్నారో ముందుగా ఎంక్వయిరీ చేసుకుని వారి ఇళ్లకు వెళ్లి.. బీఎమ్‌బీ గురించి వివరించాం. అప్పుడప్పుడు క్యాంపులు నిర్వహించాం. ‘బ్యాంకు ఖాతా వల్ల ఉపయోగం ఏంటి..?’ అనేవారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నాం..’ అని వివరించారు మేనేజర్ విశాలిని. నమ్మకమే పూచీకత్తు.. మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం బీఎమ్బీకున్న ప్రత్యేకత. మామూలుగా అయితే ష్యూరిటీ లేనిదే రూపాయి కూడా లోన్ ఇవ్వరు. అయితే మహిళా సాధికారికత కోసం ప్రత్యేక పథకం కింద బీఎమ్‌బీ పూచీకత్తు లేని రుణాలు అందిస్తోంది. ‘కర్రీ పాయింట్లు, క్రష్‌లు, క్యాటరింగ్ వ్యాపారాలు, బ్యూటీపార్లర్లు వంటి చిన్న చిన్న వ్యాపారాలకు మహిళల దగ్గర ఎలాంటి పూచికత్తులు కోరడం లేదు మేం. ఆసక్తి ఉన్న మహిళలతో మేమే దగ్గరుండి వ్యాపారం పెట్టిస్తున్నాం. అలా ఇప్పటివరకూ వంద మంది మహిళలతో చిన్న వ్యాపారాలు పెట్టించాం’ అని వివరించారు బ్యాంక్ ఉద్యోగి సుచరిత. ఖాతాలు తెరిపించడం, వ్యాపారాలు పెట్టించడంతో ఆపకుండా.. కార్పొరేట్ రంగంలో కూడా మహిళలకు అండగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
ఆ అవగాహన వస్తుంది ఇలా...
మాకు ఎనిమిది, పది సంవత్సరాల పిల్లలున్నారు. వాళ్లకు పొదుపు చేయడం నేర్పించాలనుకుంటున్నాను. మంచి సలహా ఇవ్వగలరు. - రాగిణి, గుంటూరు ఇప్పటినుంచే పిల్లలకు పొదుపు, పెట్టుబడిని అలవాటు చేయాలనుకోవడం మంచి ఆలోచన. ఇందు కోసం కొన్ని ఐడియాలు...{పతి నెల వారికి కొంత పాకెట్ మనీ ఇవ్వండి. అలాగే ఒకటి పొదుపు కోసం, మరొకటి ఖర్చుల కోసం అంటూ రెండు డిబ్బీలు ఏర్పాటు చేయండి. పాకెట్ మనీ అయినా, ఇతరత్రా గిఫ్ట్ రూపంలో డబ్బులు వచ్చినా వాటిల్లో వేసేట్లు అలవాటు చేయండి. ముందు పొదుపు కోసం అంటూ ఇంత మొత్తం అని కేటాయించి, మిగతాదే ఖర్చుల డిబ్బీలో వేసేలా నేర్పండి. ఊరికే పొదుపు చేయడం అని కాకుండా సైకిల్, ఐప్యాండ్ లాంటివి ఏదో ఒకటి సమకూర్చుకునేలా దానికి ఒక లక్ష్యం అంటూ నిర్దేశించండి. {పస్తుతం బ్యాంకులు పిల్లల కోసం కూడా ఖాతాలు అందిస్తున్నాయి. కాబట్టి పిల్లల పేరిట అకౌంటు తెరిచి, రెగ్యులర్‌గా ప్రతి నెలా అందులో ఎంతో కొంత డిపాజిట్ చేసేలా ప్రోత్సహించవచ్చు. డిబ్బీలో దాచిపెట్టుకోవడం, బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం మధ్య తేడాలను, ప్రయోజనాలను వారికి వివరించండి. మరోవైపు, చిన్నతనం నుంచే పొదుపు, పెట్టుబడులు చేయడం వల్ల చక్రవడ్డీ మహిమతో అధిక ప్రయోజనం ఎలా పొందవచ్చన్నది తెలిసేలా చెప్పండి. ఇవే కాకుండా, ప్రతి నెలా షాపింగ్‌కి వెళ్లేటప్పుడు మీ పిల్లలను కూడా వెంట తీసుకెళ్లండి. వివిధ ఉత్పత్తుల ధరల గురించి అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. దీనివల్ల రేట్ల పెరుగుదల, తగ్గుదల గురించి వారికి కూడా తెలుస్తుంది. - రజనీ భీమవరపు, సీఎఫ్‌పీ, జెన్‌మనీ -
పొదుపుతోనే ఆర్థికాభివృద్ధి: గిడ్డి ఈశ్వరి
పాడేరు రూరల్: పొదుపు చేయటం ద్వారనే ఆర్థికాభివృద్ధి సాధ్యపడుతుందని, తద్వారా భవిష్యత్తుకు భరోసా ఏర్పడుతుందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. మండలంలోని కుజ్జెలి పంచాయతీ దిగు మోదాపుట్టు గ్రామంలో మంగళవారం ఐకేపీ రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రగతి సాధించాలన్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి దశల వారిగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కుజ్జెలి, దిగు మోదాపుట్టు గ్రామాల్లో సామాజిక భవనాల నిర్మాణానికి కషి చేస్తానన్నారు. పంచాయతీ పరిధిలోని ఇసుకలు, తూరుమామిడి గ్రామాల్లో రక్షిత తాగునీరు, రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే నేరుగా తమకు అర్జీల రూపంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. అన్ని వేళల్లో గిరిజనులకు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయం సహాయక సంఘంలోని 16 మంది సభ్యులకు మంజూరైన రూ.5 లక్షల రుణాల ద్వార కొనుగోలు చేసిన 3 ఆటోలు, ఒక జెరాక్స్ మెషీన్, దుక్కిటెద్దులు, గొర్రెలను అర్హులైన గిరిజనులకు అందజేశారు. మరో ఇద్దరు మహిళలు రుణం ద్వారా ఏర్పాటు చేసుకున్న కిరాణా దుకాణం, టిఫిన్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పోలుపర్తి నూకరత్నం, ఎంపీపీ వర్తన ముత్యాలమ్మ, సర్పంచ్ గబ్బాడ చిట్టిబాబు, ఎంపీటీసీ సభ్యులు అడపా నర్శిం హామూర్తి నాయుడు, కిల్లు చంద్రమోహన్ కుమార్, కో ఆప్సన్ సభ్యుడు మహమ్మద్ తాజుద్దిన్, మాజీ ఎంపీపీ ఎస్వీవీ రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు వర్తన పిన్నయ్యదొర, బూరెడ్డి నాగేశ్వరరావు, ఐకేపీ ఏపీఎం అప్పలనాయుడు, సీసీపీ. గోవిందమ్మ, ఓబీలు ఎస్.నాగమణి, డి.జయ, కె.చిన్నతల్లి, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. -
మహబూబ్‌నగర్‌లో త్వరలో సోలార్ పార్క్
ఇంధన వనరుల పొదుపుతోనే రాష్ట్రం పురోగతి రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర పొదుపు పాటించిన 48 కంపెనీలకు అవార్డుల ప్రదానం సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్, సహజ, ఇంధన వనరుల పొదుపుతోనే రాష్ట్రం పురోగతి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కె.ప్రదీప్‌చంద్ర అన్నారు. ప్రత్యేకించి తెలంగాణలో విద్యుత్ పొదుపు అత్యంత ఆవశ్యకంగా మారిందన్నారు. ఇందులో భాగంగానే త్వరలో మహబూబ్‌నగర్ జిల్లాలో సోలార్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే భూ సేకరణ కూడా పూర్తయిందన్నారు. ఎక్స్‌లెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్2014 అంశంపై మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో 15వ జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా దేశంలో విద్యుత్, ఇంధన వనరులను పొదుపు చేసిన 48 కంపెనీలకు అవార్డులను అందించారు. జనరల్, ఆటోమోబైల్, బిల్డింగ్, సిమెంట్, పవర్, పేపర్, షుగర్ విభాగాల్లో ఈ అవార్డులను ఇచ్చారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన అశ్రీయ హోటల్స్ అండ్ ఎస్టేట్స్ ప్రై.లిమిటెడ్., టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, డెక్కన్ పార్క్, విప్రో లిమిటెడ్, సీటీఆర్ఎల్ఎస్ డాటా సెంటర్ ప్రై.లిమిటెడ్‌లు ఉన్నాయి. అనంతరం ప్రదీప్‌చంద్ర మాట్లాడుతూ.. మారుతోన్న కాలంలో గ్రీన్ టెక్నాలజీ, ఇంధన పొదుపు ముఖ్యమైన ఆదాయ వనరుగా మారినట్టు తెలిపారు. అందుకే పారిశ్రామిక పాలసీ రూపకల్పనలో గ్రీన్ టెక్నాలజీ, ఇంధన పొదుపునకు అధిక ప్రాధాన్యాన్ని ఇస్తున్నట్టు తెలిపారు. ఇంధన, సహజ వనరుల పొదుపు అనేది వ్యక్తితో ముడిపడకుండా పారిశ్రామిక స్థాయిలో జరగాల్సిన అవసరముందని గుర్తుచేశారు. పరిశ్రమలు తమ కార్యకలాపాల వినియోగంలో పాత పద్ధతుల్లో కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, గ్రీన్ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) తెలంగాణ చైర్పర్సన్ వనితా దాట్ల, సీఐఐ గోద్రెజ్ జీబీసీ నేషనల్ అవార్డ్ స్కీమ్ చైర్మన్ ఎల్ఎస్ గణపతి, సీఐఐ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ నౌషద్ ఫోర్బ్స్ పాల్గొన్నారు. -
ముందు పొదుపు తర్వాతే ఖర్చు
ధనమేరా అన్నిటికీ మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవ ధర్మం అన్నారు ఒక సినీ కవి. మనిషి అన్ని అవసరాలకూ ధనం అవసరం. సంపాదన ప్రారంభించిన నాటి నుంచి ఆదాయంలో కనీసం మూడవ వంతును ఆదా చేస్తూ వస్తే వయసు మళ్లాక హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. నేడు ప్రపంచ పొదుపు దినం సందర్భంగా ఎలా పొదుపు చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుందో తెలుసుకుందాం... ఒకసారి కావ్య అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చి తనకు ఈ మధ్యనే పెళ్లయిందనీ, తను గృహిణిననీ, భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారనీ, నెలకు 15 వేలు జీతమనీ చెప్పింది. వాళ్లు ప్రస్తుతం నెలకు 5 10 శాతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతున్నామనీ, మిగతా జీతమంతా ఖర్చు చేస్తున్నామనీ పొదుపు వివరాలు తెలిసింది. ఇంతకీ వారిద్దరికీ పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు లేవు. ఒక సంవత్సరం తరువాత పిల్లలను కనాలనుకుంటున్నారు. కనుక కాన్పు, చదువు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయడానికి ఆర్థిక ప్రణాళికను సూచించమంది. కావ్య ప్రస్తుత పరిస్థితి గమనిస్తే చాలా తక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తున్నట్లు లెక్క. అందువల్ల ఆమెకు ఈ కింది సంప్రదాయిక ఆర్థిక ప్రణాళికను సూచించాను. ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆర్థికారోగ్యం కూడా అంతే ముఖ్యం. విద్య, వైద్యం, గృహవసతి లాంటి ఖర్చులు ఏటా 10 నుంచి 20 శాతం దాకా పెరుగుతూ ఉంటాయి. ఇక నిత్యావసరాలు, అత్యవసరాల సంగతి సరే సరి. ఇవన్నీ కుటుంబ ఆదాయానికి గండికొడుతున్నాయి. ఆర్థిక వనరులను సక్రమంగా వాడుకుంటూ ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకోవాలి. ఆ దిశగా ఉపయోగపడే కొన్ని ముఖ్యాంశాలు... బడ్జెట్ తయారీ: ప్రతి ఒక్కరూ ఆదాయవ్యయాలను రాసు కోవాలి. దీనివల్ల క్యాష్ ఫ్లో తెలుస్తుంది. అలాగే వారికున్న కీలకలక్ష్యాలను చేరడానికి పట్టే సమయాన్ని తెలుసుకుంటే, ఆర్థికప్రయాణం ఎక్కడవరకు చేయాలో అర్థం అవుతుంది. రూపాయి పాపాయి: రూపాయిని పాపాయిలా చూడాలని పెద్దలు చెబుతారు. ఒక రూపాయిని పొదుపు చేశామంటే, ఒక రూపాయిని సంపాదించినట్లు. కుటుంబానికి ఏది ఏ మేర అవసరం అనే స్పష్టతతో ఖర్చులను అదుపు చేసుకోవాలి. పక్కింటివారో, స్నేహితులో ఫలానాది కొన్నారని, అవసరం లేని వస్తువుల కోసం ఖర్చు పెట్టుకుంటూ పోతే రానున్న రోజుల్లో అవసరమైన వాటిని అమ్ముకోవలసి వస్తుంది. ప్రఖ్యాత పెట్టుబడిదారునిగా పేరొందిన వారెన్ బఫెట్ ‘పొదుపు చేశాకే ఖర్చు గురించి ఆలోచించు. అంతేగాని ఖర్చులు పోను ఏమైనా మిగిలితే అదే పొదుపు అనేది సరికాదు’ అన్నారు. అనుకోని సంఘటనలు: మరణం, అనారోగ్యం, అంగవైకల్యం లాంటివి మనల్ని ఇబ్బందిపెట్టే విషయాలు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా... వీటి ద్వారా అవసరాలను కొంతవరకు అధిగమించవచ్చు. వీటితోపాటు ఇతర అత్యవసరాలను దాటేలా ఒక అత్యవసర నిధిని 3 నుండి 6 నెలల జీతంతో ఏర్పాటుచేసుకోగలగాలి. పొదుపు మదుపు: సంపాదనలో సింహభాగాన్ని పొదుపు- మదుపులకు మళ్లించాలి. వాటి రిస్క్, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. ఏయే సాధనాలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుని కాలానుగుణంగా అవసరమైన మార్పు చేసుకోవాలి. వాయిదా చిన్నచూపు: పొదుపు అనగానే ఇప్పుడే కెరీర్ ప్రారంభించాం, ఇప్పుడే పెళ్లయ్యింది. వంశపారంపర్యంగా ఆస్తులు వచ్చాయి, ఇప్పుడు కాదులే... అంటూ వాయిదా వేయడం ఆర్థిక ప్రగతికి మొదటి అడ్డంకి. వంద రూపాయలకి ఏం వస్తుంది, ఈ చిన్న మొత్తాలలో మనం సాధించేదేమిటి... అనే చిన్నచూపును రెండో అడ్డంకిగా చెప్పవచ్చు. సంపాదన తొలినాళ్ల నుండే 20 30 శాతం పొదుపునకు కేటాయించితే, ఆర్థిక లక్ష్యాలను సులువుగా అందుకోవచ్చు. అప్పు ముప్పు: నెలసరి వాయిదాలతో వస్తువులు కొనడం, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్ ్డలోన్ అంటూ కొంతమంది జీవితాంతం అప్పులు చేసి తిప్పలు పడుతుంటారు. ఇంటికోసం, పిల్లల చదువు కోసం, మంచి వ్యాపారం కోసం తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవచ్చు. ఇప్పటికే అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకున్నవారు తక్కువ వడ్డీ రుణాలకు మారడం లేదా పూర్తిగా రుణవిముక్తులు కావడం మంచిది. సంపద సృష్టి: ఉమ్మడి కుటుంబాలు తగ్గుతూ మేమిద్దరం మాకిద్దరనే కుటుంబాలు పెరుగుతున్న రోజులివి. ఎక్కువ కుటుంబాలలో ఒకరే సంపాదించడం, మిగిలిన సభ్యులు ఆ వ్యక్తిపై ఆధారపడడం చూస్తుంటాం. ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలంటే అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకోసం ఎవరికివారు ఎక్కువ మొత్తాన్ని సంపాదించాలి తక్కువ ఖర్చులు పెట్టుకొంటూ ఎక్కువ భాగాన్ని ‘పొదుపు మదుపుకి కేటాయించాలి. ఈ రెండవ పని స్థితప్రజ్ఞతతో, పట్టుదలతో చాలామంది చెయ్యటానికి అవకాశం ఉన్న మార్గం. సంపాదించే వయస్సులో వీలైనంత కూడపెడితే, ఆర్థిక లక్ష్యాలను అధిగమించి, మలి వయస్సు జీవితపు ఆర్థిక అవసరాలను అధిగమించగలుగుతాం. కావ్యకి 35 సంవత్సరాలు వచ్చేసరికి 15 లక్షల విలువైన ఇల్లు కొనుక్కుంది. 5 లక్షలతో ఒక కారు కొంది. పిల్లల కోసం 10 లక్షలు పొదుపు చేసింది. ఒక్క కావ్య మాత్రమే కాదు, అందరూ ఈ సూచనలను పాటించి, పొదుపు చేస్తే ఆనంద మయమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. రజని భీమవరపు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, హైదరాబాద్ -
విద్యుత్ పొదుపు తూచ్..!
కర్నూలు (రాజ్‌విహార్) : విద్యుత్‌ను పొదుపు చేయండి అంటూ ఊదరగొట్టే ఆ శాఖ దానిని అమలు చేయడంలో విఫలమవుతోంది. ఒక యూనిట్‌ను ఆదా చేస్తే రెండు యూనిట్లు ఉత్పత్తి చేసినట్లే అని చెబుతున్న విద్యుత్ శాఖ అధికారులు.. పొదుపు చర్యలు చేపట్టడం లేదు. జిల్లాలో ప్రతి రోజూ లైన్‌లాస్ కింద 13 లక్షల యూనిట్లు వృథా అవుతున్నా.. దాన్ని అరికట్టేందుకు కసరత్తు చేయడం లేదు. లైన్‌లాస్ నివారణకు 2009లో రూ.50 కోట్లతో హెచ్‌వీడీఎస్ (హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) పనులు చేపట్టారు. ఆ తరువాత మరిన్ని ఫీడర్లలోని గ్రామాలను ఎంపిక చేసి రెండో విడతలో రూ.75 కోట్లతో పనులు చేపట్టేందుకు అప్పటి ప్రభుత్వం నివేదికలు కోరింది. దీంతో స్థానిక అధికారులు సర్వే పనులు పూర్తి చేసి నివేదికలు పంపించినా ఇప్పటివరకు కదలిక లేదు. ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా లక్షల యూనిట్లు వృథా అవుతున్నా చర్యలు లేవు. వృథా అయిన విద్యుత్‌ను లైన్‌లాస్ కింద చూపి వినియోగదారులపైనే ఆ భారం మోపుతున్నారు. హెచ్‌వీడీఎస్‌తో లైన్‌లాస్ నివారణ.. రైతులకు ఎల్టీ లైను ద్వారా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ట్రాన్స్ఫార్మర్ దూరంగా ఉండడంతో తీగల దూరాన్ని, మోటర్ల వినియోగాన్ని బట్టి విద్యుత్ వృథా అవుతుంది. దీంతో సంస్థ రూ.లక్షల ఆదాయాన్ని కోల్పోతుంది. వృథా అవుతున్న విద్యుత్ (లైన్‌లాస్)ను నివారించేందుకు దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హెచ్‌వీడీఎస్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ కనెక్షన్ కోసం మోటార్ల వద్దకు ఎల్టి లైన్‌కు బదులు హెచ్‌టీ లైను ద్వారా సరఫరా అందించేందుకు ఈ పథకాన్ని శ్రీకారం చుట్టారు. మూడు లేదా నాలుగు వ్యవసాయ మోటార్లు ఉన్న ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సరఫరా అందించేందుకు ఈ విధానాన్ని ఆచరణలో పెట్టారు. జిల్లాలో తొలి విడత (సమైక్య రాష్ట్రంలో మూడో విడత)గా 35 ఫీడర్లు (80 గ్రామాలు)ల్లో పనులు మంజూరు కాగా 23 ఫీడర్లలో పనులు చేపట్టారు. కోడుమూరు మండలంలోని ప్యాలకుర్తి, నల్లకాలువ, అగవెళ్లి, చెరుకుచెర్ల, దూపాడు, ఆలమూరు, ఐకే పేట, పసుపుల, పెద్ద హోతూరు, తంగరడోణ, గాజులదిన్నె, ఇరుపాపురం, కైరుప్పల, బురాన్‌దొడ్డి తదితర ఫీడర్లలో పనులు చేపట్టారు. మొత్తం 100 కేవీఏల ట్రాన్స్పార్మర్లు తొలగించి 16, 25 కేవీఏల సామర్థ్యం ఉన్న ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ పనుల కాంట్రాక్టును టెండరు ద్వారా దక్కించుకున్న కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన స్కిల్‌టెక్ సంస్థ సకాలంలో చేపట్టలేకపోయింది. దీంతో ఐదు సార్లు గడువు పొడిగించారు. అప్పటికీ పూర్తి కాకపోవడంతో కాట్రాక్టరుపై జరిమానా విధించిన సందర్భాలున్నాయి. ఇందులో జరిగిన పనుల కారణంగా 16 శాతం ఉన్న లైన్‌లాస్ 13 శాతానికి తగ్గింది. ముందుకు సాగని రెండో విడత పనులు జిల్లాలో రెండో విడతగా (రాష్ట్రంలో నాలుగో విడత) హెచ్‌వీడీఎస్ పనులు చేపట్టేందుకు 2012లోగ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 100 ఫీడర్లలో ఈ పనులు చేపట్టేందుకు ఏపీ సీపీడీసీఎల్ రూ.75 కోట్ల నిధులు మంజూరు చేసింది. కర్నూలు డివిజన్ పరిధిలోని పంచలింగాల, జి.శింగవరం, ఉలిందకొండ, లద్దగిరి, గుండ్రేవుల, నన్నూరు, కె.నాగులాపురం, కొత్తపల్లి సబ్ స్టేషన్ల పరిధిలోని 18 ఫీడర్లలో ఈ పనులు చేపట్టనున్నారు. నంద్యాల డివిజన్ పరిధిలో గోనవరం, గాజులపల్లి, బుక్కాపురం, బండి ఆత్మకూరు, వెలుగోడు, పి.బోధనం, గోస్పాడు, ఉయ్యాలవాడ, నందవరం, కోవెలకుంట్ల, దొర్నిపాడు, రామాపురం, అవుకులో పనులు చేపట్టాల్సి ఉంది. అలాగే కొలిమిగుండ్ల సబ్ స్టేషన్ల పరిధిలోని 47 ఫీడర్లలో, ఆదోని డివిజన్లోని దిబ్బనకర్, 132 కేవీ సబ్ స్టేషన్, మార్కెట్‌యార్డు, కుమ్మరచేడు, హోళగుంద, బి.అగ్రహారం, మద్దికెర, దేవనకొండ, ఈదుల దేవరబండ, జొన్నగిరి, మద్దికెర, ఆర్ఎస్ పెండేకల్,తుగ్గలి, నందవరం, నాగులదిన్నె, తుంగభద్ర సబ్ స్టేషన్ల పరిధిలోని 35 ఫీడర్లలో పనులు చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ చేయూత లేక ఈ పనులు ఆగిపోయాయి. సర్వే పూర్తి చేసి యాజమాన్యానికి నివేదికలు పంపి రెండేళ్లయినా ఇప్పటి వరకు పురోగతి లేదు. -
పెట్టుబడులకు.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్
జీవితానికి భరోసా, భవిష్యత్తుపై ధీమా కల్పించేవి.. పొదుపు, మదుపు. సంపాదించిన ప్రతి పైసాను జాగ్రత్తగా వాడుకొని, రేపటి అవసరాల కోసం అందులో కొంత మిగుల్చుకోవాలనే ఆరాటం అందరిలో ఉంటుంది. మిగిల్చిన సొమ్మును ఎక్కడ, ఎలా పొదుపు చేసుకోవాలో చాలామందికి అవగాహన ఉండదు. ఒక రూపాయితో మరో రూపాయిని సంపాదించడం ఎలాగో తెలియదు. బీమా పాలసీ తీసుకోవాలంటే .. మార్కెట్లో లెక్కలేనన్ని పథకాలు. వాటిలో తమ అవసరాలకు సరిపోయే పథకంపై పరిజ్ఞానం శూన్యం. ఇలాంటి కీలకమైన ఆర్థిక అంశాలపై జనానికి అవగాహన కల్పించి, పొదుపు మదుపుల విషయంలో మార్గదర్శిగా వ్యవహరించే నిపుణులే.. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. నేటి సామాజిక అవసరాల రీత్యా వీరికి డిమాండ్ పెరుగుతోంది. ఆదాయాలు వృద్ధి చెందుతుండడంతో ఆర్థిక సలహాదారులను సంప్రదించేవారి సంఖ్య నానాటికీ అధికమవుతోంది. అంకెలు, గణాంకాలు, వడ్డీ లెక్కలపై ఆసక్తి ఉన్నవారు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌గా కెరీర్లో సులభంగా రాణించొచ్చు. సలహాదారులకు ప్రస్తుతం పుష్కలమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్‌లు, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సంస్థల్లో.. అర్హులైన ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ కార్పొరేట్ సంస్థల, క్లయింట్ల ఆర్థికపరమైన సందేహాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లు, ఈక్విటీ షేర్లు, డిబెంచర్లు, బీమా పాలసీలు, కమోడిటీలు, స్థిరాస్తి.. ఇలా వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలు ఇవ్వాలి. క్లయింట్ల తరఫున వారి డబ్బును పెట్టుబడి పథకాల్లో పొదుపు, మదుపు చేయాలి. లాభాలను వారికి అందిస్తూ ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. ప్రతి పెట్టుబడిలో లాభనష్టాలను వివరించాలి. ఆయా రంగాల్లో భవిష్యత్తు పరిణామాలను ఊహించగలిగే నేర్పు ఉండాలి. క్లయింట్ల సొమ్ముకు భద్రత కల్పించే పథకాలను సూచించాలి. భారీ స్థాయిలో వ్యాపారలావాదేవీలను నిర్వహించే కార్పొరేట్ సంస్థలు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లను నియమించుకుంటున్నాయి. బ్యాంకుల్లో, రియల్ ఎస్టేట్ సంస్థల్లో, స్టాక్‌మార్కెట్లలోనూ ఉద్యోగాలు దక్కుతున్నాయి. వృత్తి నైపుణ్యాలను పెంచుకొని సొంతంగా ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవచ్చు. కావాల్సిన నైపుణ్యాలు: ఆర్థిక సలహాదారులకు విశ్లేషణాత్మక దృక్పథం, తార్కిక ఆలోచనా విధానం ఉండాలి. కమ్యూనికేషన్, మార్కెటింగ్, రిలేషన్షిప్ బిల్డింగ్ స్కిల్స్ అవసరం. ఆర్థిక వ్యవహారాలు, సంబంధిత చట్టాలు, నియమ నిబంధనలపై ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలి. వృత్తిపరమైన నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. అర్హతలు: పర్సనల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌గా వృత్తిలోకి ప్రవేశించాలంటే.. ‘అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఇండియా సర్టిఫికేషన్ టెస్ట్’లో అర్హత సాధించాలి. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సర్టిఫికేషన్‌తో అర్హతలను, నైపుణ్యాలను పెంచుకోవచ్చు. కార్పొరేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్‌గా మారాలంటే.. ఫైనాన్స్ సబ్జెక్ట్ స్పెషలైజేషన్‌గా గ్రాడ్యుయేషన్/పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రారంభంలో సీనియర్ అడ్వైజర్ వద్ద పనిచేసి, వృత్తిలో మెళకువలను తెలుసుకొని అనుభవం సంపాదించిన తర్వాత సలహాదారుగా సొంతంగా పనిచేసుకోవచ్చు. వేతనాలు: పొదుపు, మదుపు సలహాదారులు తమ నైపుణ్యాలు, మార్కెట్ స్థితిగతులను బట్టి ఆదాయం ఆర్జించుకోవచ్చు. కార్పొరేట్ సంస్థల సలహాదారులకు స్థిరమైన వేతనం అందుతుంది. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు పొందొచ్చు. సొంతంగా ఏజెన్సీని ఏర్పాటు చేసుకుంటే ఇంకా అధికంగా సంపాదించుకోవచ్చు. ఖాతాదారుల సంఖ్య, వారి పెట్టుబడుల ఆధారంగా ఆదాయం లభిస్తుంది. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: ఏ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ - కోల్‌కతా వెబ్సైట్: https://www.iimcal.ac.in/ ఏ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, ఢిల్లీ యూనివర్సిటీ వెబ్సైట్: http://www.fms.edu/ ఏ నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్-ముంబై వెబ్సైట్: http://www.nmims.edu/ ఏ ఇంటర్నేషనల్ కాలేజీ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ వెబ్సైట్: http://www.icofp.org/ ఏ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వెబ్సైట్: http://www.xlri.ac.in/ కాంపిటీటివ్ కౌన్సెలింగ్ పోటీ పరీక్షల్లో ‘పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య’లపై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? వీటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? -ఎం.నరేష్, హఫీజ్‌పేట 2013లో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో ఐసోబార్లపై ప్రశ్న అడిగారు. అణుభారం (ద్రవ్యరాశి సంఖ్య)ను సమానంగా ఇచ్చి, వాటి పరమాణు సంఖ్యలను వేరుగా ఇచ్చారు. నిర్వచనం ప్రకారం ఐసోబార్లలో పరమాణు ద్రవ్యరాశి సమానంగా ఉండి, పరమాణు సంఖ్యలు వేరుగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు జవాబులు గుర్తించడానికి పరమాణు సంఖ్యలు, ద్రవ్యరాశి సంఖ్యలను గుర్తుంచుకోవాల్సిన పని లేదు. ఇచ్చిన ఆప్షన్ల లోని మూలకాల పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య, ఇంకా లోతుగా.. న్యూట్రాన్ల సంఖ్య సమానంగా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని గుర్తిస్తే చాలు. పరమాణు సంఖ్య అనేది ఆ మూలక క్రమ సంఖ్య లాంటిది. ప్రాథమిక కణాల్లో ప్రోటాన్ల సంఖ్య ఆధారంగా మూలకానికి పరమాణు సంఖ్య (ో) ఇచ్చారు. కేంద్రకంలోని ప్రోటాన్లు, న్యూట్రాన్ల భారాన్ని కలిపితే పరమాణు భారం వస్తుంది. దీని నుంచి ద్రవ్యరాశి సంఖ్య (అ) వస్తుంది. ప్రోటాన్లు, న్యూట్రాన్ల సంఖ్యలోని తేడాల వల్ల ఐసోటోపులు, ఐసోబార్లు, ఐసోటోన్లు, ఐసోడయఫర్లు వస్తాయి. పదో తరగతితోపాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకాలను చదివితే ఈ పాఠ్యాంశంపై పట్టు సాధించవచ్చు. నేను డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్‌కు ప్రిపేరవుతున్నాను. భూగోళ శాస్త్రంలోని ‘భారతదేశ ఉనికి, క్షేత్రీయ అమరిక’ అధ్యాయాన్ని ఎలా చదవాలి? -కె.ప్రసన్న, సంతోష్‌నగర్ గత డీఎస్సీ పరీక్షలో ఈ అధ్యాయం నుంచి రెండు ప్రశ్నలు అడిగారు. ఈసారి కూడా 2 నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాలు, వివిధ దేశాల సరిహద్దులను మ్యాప్ పాయింటింగ్ ద్వారా సాధన చేస్తే ఈ పాఠ్యాంశంలోని అంశాలను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఉత్తర ప్రాంత హిమాలయాలను అధ్యయనం చేసేటప్పుడు, వాటి దిక్కులను ఆధారంగా చేసుకుని చదవాలి. భారతదేశ భూ స్వరూపాలు, నదీ ప్రాంతాలు, ఏర్పాటైన రాష్ట్రాలు, ప్రాంతాలను కలిపి చదవాలి. అట్లాస్‌ను దగ్గర పెట్టుకొని భారతదేశ భౌతిక అమరిక, పర్వతాల క్రమం, రాష్ట్రాల ఉనికిపై పట్టు సాధిస్తే ఈ విభాగం నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానాలను సులువుగా గుర్తించవచ్చు. జాబ్స్, అడ్మిషన్స అలర్ట్స జేఎన్టీయూ-హైదరాబాద్ హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకడమిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అకడమిక్ అసిస్టెంట్ విభాగాలు: సీఎస్, ఎస్ఈ, సీఎన్‌ఐఎస్, బీఐ అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంటెక్/ పీహెచ్డీ ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17 వెబ్సైట్: http://jntuh.ac.in/ హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ ముంబైలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్), గ్రాడ్యుయేట్ ఇంజనీర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అర్హత: బీటెక్. వయసు: 25 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: గేట్-2015 స్కోర్ ఆధారంగా. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: 18 డిసెంబర్ 2014 నుంచి 2 ఫిబ్రవరి 2015 వెబ్సైట్: www.hindustanpetroleum.com ఎస్బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్లు ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. చీఫ్ మేనేజర్ (ఎకనామిస్ట్) మేనేజర్ (ఎకనామిస్ట్) డిప్యూటీ మేనేజర్ (ఎకనామిస్ట్) చీఫ్ మేనేజర్ (రిస్క్ ఎనలిస్ట్) చీఫ్ మేనేజర్ (కంపెనీ సెక్రటరీ) దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17 వెబ్సైట్: www.sbi.co.in ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ కింద పేర్కొన్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. ఎమ్మెస్సీ (నర్సింగ్) అర్హతలు: 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్)/ బీఎస్సీ హానర్స్ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ (నర్సింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్‌తో పాటు ఏడాది అనుభవం అవసరం. ఎంపిక: ఆన్లైన్ టెస్ట్ ద్వారా. ఎంపీటీ. అర్హతలు: బీపీటీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబర్ 17 వెబ్సైట్: ntruhs.ap.nic.in ఎడ్యూ న్యూస్: ఆస్ట్రేలియాలో విదేశీ విద్య ఖర్చు ఎక్కువ ఫారిన్ ఎడ్యుకేషన్ విషయంలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ఖర్చు అత్యధికం. హెచ్ఎస్బీసీ తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఒక విదేశీ విద్యార్థి భారత్‌లో అండర్గ్రాడ్యుయేట్ కోర్సు చదవడానికి ప్రతిఏటా 5,642 అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే ఆస్ట్రేలియాలో అయితే 42,093 డాలర్లు వెచ్చించాల్సిందే. మొత్తం15 దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. నాణ్యమైన విద్యనందించడంలో మనదేశం 8వ స్థానంలో ఉండడం గమనార్హం. విదేశీ విద్యకు ఎక్కువ డబ్బు ఖర్చయ్యే దేశాల జాబితాలో ఆస్ట్రేలియా, సింగపూర్, అమెరికా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. సింగపూర్‌లో ప్రతిఏటా 39,229 డాలర్లు, అమెరికాలో 36,564 డాలర్లు ఖర్చవుతాయి. భారత్‌లో న్యూజిలాండ్ విద్యాసంస్థ కోర్సులు భారత్‌లో అప్లయిడ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాల్లో పోస్టుగ్రాడ్యుయేట్ డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనున్నట్లు న్యూజిలాండ్‌లో ప్రభుత్వ నిధులతో నడిచే ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఈఐటీ) ప్రకటించింది. ఈ కోర్సుల ద్వారా భారత విద్యార్థులు తమ నైపుణ్యాలను పెంచుకొని, అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగావకాశాలు దక్కించుకోవచ్చని పేర్కొంది. ఎడ్యూ ఈవెంట్: ‘ప్రాక్టికల్ నాలెడ్జ్‌తోనే కెరీర్లో రాణింపు’ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు అలవర్చుకోవాల్సిన నైపుణ్యాలపై నగరంలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ(ఐఎంటీ) క్యాంపస్‌లో సదస్సు నిర్వహించారు. ఇండస్ట్రీ, క్లాస్‌రూంకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు ఐఎంటీ ప్రతిఏటా వ్యాపార ప్రముఖులతో సదస్సులను నిర్వహిస్తోంది. ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న పాఠాలను ప్రాక్టికల్‌గా అన్వయించుకునే అవకాశం చిక్కుతుందంటున్నారు నిర్వాహకులు. విద్యార్థులు ప్రాక్టికల్ నాలెడ్జతోనే కెరీర్లో బాగా రాణిస్తారని ఈ సదస్సుకు హాజరైన నిపుణులు చెప్పారు. ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ప్రాక్టికల్ ఓరియెంటేషన్‌ను పెంపొందించుకోవాలని సూచించారు. -
పొదుపుతో సంపాదించండి!
ఆర్థికం కొందరు మహిళలు డబ్బు వ్యవహారాలు తమ పని కానే కాదని, అంతా పురుషులే చూసుకుంటారని వారి మీద వదిలేస్తారు. అలా కాకుండా, ఇంటి సరుకులు, పిల్లల ఫీజులు అన్నీ ఒక పద్ధతి ప్రకారం ఖర్చు పెడితే మీరు కూడా కొద్ది మొత్తాన్ని సంపాదించినట్టే! ఇప్పటివరకు ఆర్థిక విషయాలలో అనుభవం లేకపోయినా సరే, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ పద్ధతిలో పొదుపు చేయండి ఇలా... కొద్ది కొద్దిగా కొనుక్కోవడమే ఉత్తమం: కూరగాయలు కొద్ది కొద్దిగా కొనుక్కునే కంటే టోకున కొనేస్తే చౌకగా వచ్చే మాట నిజమే. అయితే ఇందులో లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఎందుకంటే వారం పదిరోజులకి సరిపడా కూరలు ఒకేసారి కొనేసి ఫ్రిజ్‌లో కుక్కేస్తుంటారు అందరూ. దీనివల్ల ఫ్రిజ్ ఎక్కువ విద్యుత్‌ను వాడుకుంటుంది. దానితోపాటు కూరగాయలు ఎంత ఫ్రిజ్‌లో ఉన్నా వడలటం, కుళ్లిపోవటం, చెడిపోవటం సహజం. అలా కాకుండా ఖరీదు కొద్దిగా ఎక్కువైనా, ఎప్పటికప్పుడు కొనుక్కోవడం వల్ల తాజాగా ఉంటాయి. విటమిన్లు నష్టపోకుండా ఉంటాయి. ఉచితం జోలికి వెళ్లనే వద్దు... ఒకటి కొంటే ఇంకొకటి లేదా రెండు ఉచితం అనే ప్రకటన చూసి ఇట్టే బుట్టలో పడిపోతుంటారు. అలా అమ్మే వాటిలో ఒకదానికే రెండిటి ధర వేస్తారు. ఒకవేళ చవకగానే ఇచ్చినా, నిల్వ ఉన్నవి, కాలం చెల్లిపోయినవి (ఔట్ డేటెడ్ లేదా ఫెయిల్యూర్ మోడల్స్), అంతగా మన్నికలేనివే ఉంటాయి. పైగా, మరోటి ఉచితంగా వచ్చిందే కదా అనే ధీమాతో, అంత జాగ్రత్త తీసుకోం. అందుకే ఉచితం వద్దు... ధర ఎక్కువైనా, నాణ్యమైనవి, మన్నికైనవే తీసుకోండి. ఆన్లైన్లో కొనండి... కానీ... ఇటీవలి కాలంలో ఆన్లైన్లో అమ్మకాలు, కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. బయట మార్కెట్లో దొరికే వాటితో పోల్చితే, ఇవి కాస్తంత చవకగానే వస్తాయి. కొన్ని ఆన్లైన్ విక్రయ సంస్థలు నిర్ణీత మొత్తానికి మించి కొంటేనే షిప్పింగ్ ఛార్జీలు ఉచితం అని నిబంధన విధిస్తాయి. దాంతో మనం షిప్పింగ్ ఛార్జీలు తప్పించుకోవడం కోసం అవసరానికన్నా ఎక్కువ వస్తువులు లేదా అంతగా ఉపయోగం లేని వాటిని కూడా కొనుగోలు చేయవలసి వస్తుంది. కాబట్టి షిప్పింగ్ ఛార్జీలు చెల్లించండి... దానివల్ల అదనపు వస్తువులు కొనవలసిన భారం తప్పుతుంది. -
6 మెట్రో నగరాల్లో...ఇక ఏటీఎం చార్జీల మోత
ముంబై: మెట్రోపాలిటన్ నగరాల్లో ఏటీఎంల వినియోగంపై చార్జీల మోత మోగనుంది. హైదరాబాద్ సహా ఆరు మెట్రోపాలిటన్ నగరాల్లో నవంబర్ నుంచి ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితిని కుదించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ఇకపై నెలకు 5 లావాదేవీలు మాత్రమే ఉచితం. అదే మరో బ్యాంకు ఏటీఎంలోనైతే ఈ పరిమితిని ప్రస్తుతమున్న 5 నుంచి 3కు తగ్గించనున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. నగదు విత్‌డ్రాయల్స్ మొదలుకుని బ్యాలెన్స్ స్టేట్మెంట్ల లావాదేవీల దాకా అన్నీ ఈ పరిమితికి లోబడే ఉండాలి. ఒకవేళ దాటితే ప్రతి లావాదేవీకి గరిష్టంగా రూ. 20 మేర చార్జీలు పడతాయి. అయితే, చెక్‌బుక్కులు తదితర అదనపు సర్వీసులు ఉండని బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. మిగిలిన చోట్ల ఇతర ఏటీఎంల వాడకంపై ప్రస్తుతమున్న ఐదు లావాదేవీల పరిమితి యథాప్రకారం కొనసాగుతుంది. ఈ ఏడాది మార్చి దాకా అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1.6 లక్షల ఏటీఎంలు ఉన్నాయి. అయితే ఏటీఎంల ఏర్పాటు, ఉచిత లావాదేవీల వల్ల నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయని బ్యాంకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్.. త న దృష్టికి తీసుకురావడంతో ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకుంది. నిర్దేశిత పరిమితులను, కొత్త చార్జీలను గురించి ఖాతాదారులకు పారదర్శకంగా తెలియజేయాలని బ్యాంకులకు సూచిం చింది. అలాగే, ఈ విషయంలో ఖాతాదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండాను, ఫిర్యాదులు తలెత్తకుండా చూసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఖాతాదారుల సౌలభ్యం కోసం వారు వినియోగిస్తున్న ఏటీఎం మెట్రో పరిధిలో ఉందా లేక నాన్-మెట్రో పరిధిలో ఉందా అన్నది స్పష్టంగా తెలిసేలా తగిన ఏర్పాట్లు చేయాలని పేర్కొంది. అలా గే వినియోగించుకున్న ఉచిత లావాదేవీల సంఖ్యను విధించబోయే చార్జీలను కస్టమర్లకు తెలియచేయాలి. -
పొదుపు లక్ష్ములు...
సమాజంలో నువ్వు ఆశించిన మార్పు ముందుగా నీతోనే మొదలు కానివ్వమని గాంధీజీ చెప్పినట్లు గృహలక్ష్ములు అనవసరపు ఖర్చులకు కళ్లెం వేస్తే కాసింత వెనకేయవచ్చు. ఆదాయానికి మించిన ఖర్చులు చేయకూడదని గట్టిగా నిర్ణయించుకోవాలి. ఖర్చుపెట్టే ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి. షాపింగ్‌ను అవసరానికి కాకుండా కాలక్షేపానికి చేయడాన్ని మానుకోవాలి. ధర కొంచెం ఎక్కువైనా, నాణ్య మైనవి, మన్నికైనవి మాత్రమే కొనుగోలు చేయాలి. ఆహార పదార్థాలను రుచికరంగా, వైవిధ్యంగా తయారు చేస్తే ఆహారాన్ని బయట కొనుక్కోవడానికి వెచ్చించే ఖర్చు తగ్గడంతో బాటు ఆరోగ్యమూ బాగుంటుంది. తెలివిగా, ఆలోచనతో చేసే ఆదాతో మనం పెట్టాలనుకున్న మదుపునకు రెక్కలు మొలుస్తాయి! -
వాయిదా భారమెంతో తెలుసా?
పొదుపు విషయంలో కాలపరిమితి అనేది చాలా విలువైనది. ఎంత తొందరగా పొదుపు మొదలు పెడితే అంత తక్కువ మొత్తంతో ఎక్కువ లాభాలను పొందొచ్చు. అలా కాకుండా ఆలస్యం అయ్యే కొద్ది పొదుపు వ్యయం పెరుగుతుంది. చిన్న తనంలోనే పొదుపు చేయడం ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ఏగాన్ రెలిగేర్ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యతీష్ శ్రీవాత్సవ ఏమంటున్నారో చూద్దాం... ఎంబీఏ పూర్తి చేసిన సుమీత్ (23) హైదరాబాద్ మల్టీ నేషనల్ కంపెనీలో చేరాడు. ఇతని నెల జీతం రూ.30,000. తండ్రి ప్రభుత్వరంగ బ్యాంకు ఉద్యోగి, సొంతింటిలోనే మకాం ఉండటంతో సుమీత్కు ఎటువంటి బాదరబందీలు లేవు. ఇప్పటి యువతరం లాగానే జీతాన్ని అంతా కొత్త కొత్త ఫ్యాషన్ దుస్తులు, గాడ్జెట్స్, ఇతర విలాసాలకు ఖర్చు చేస్తున్నాడు. కాని తన భవిష్యత్తు ఆర్థిక భద్రత, దానికి సంబంధించి ఇప్పటి నుంచే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై అవగాహన లేదు. ఇలాంటి సుమీతులు మనకు దేశవ్యాప్తంగా లక్షల్లో కనిపిస్తుంటారు. దీనికంతటికీ కారణం వారికి ఎటువంటి ఆర్థిక బాధ్యతలు లేకపోవడం, పొదుపుపై అవగాహన లేకపోవడమే. కాని సుమీత్ లాంటి వారు చిన్నతనంలోనే పొదుపు చేయడం ప్రారంభించకపోవడం వల్ల ఎంత నష్టపోతున్నారో అర్థం చేసుకోవటం లేదు. ఉదాహరణకు బీమా విషయానికి వస్తే ఇక్కడ ప్రీమియంలు అనేవి వయసుతో ఆధారపడి ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ ప్రీమియం పెరిగిపోతుంది. సుమీత్ 23 ఏట కాకుండా 30 ఏళ్లప్పుడు రూ. 50 లక్షలకు బీమా పాలసీ తీసుకుంటే 26 శాతం అధిక ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అతను 75 ఏళ్లు వచ్చే వరకు అదనపు ప్రీమియం చెల్లిస్తూనే ఉండాలి. అంతేకాదు రూ. 50 లక్షల బీమాకు అతను చెల్లించే ప్రీమియం విలువ ఎంతో తెలుసా?... తన వార్షిక జీతంలో ఒక శాతం కూడా ఉండదు. ఇది అతని కొత్త ఫోన్ ఖరీదు కంటే తక్కువ. కాబట్టి సుమీత్ లాంటి వాళ్లు ఆర్థిక ఇబ్బందులు లేవు కాబట్టి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నా, ఇదే సమయంలో భవిష్యత్తు ఆర్థిక భద్రత విషయంలో మాత్రం అలసత్వం వహించకూడదు. -
ఆదాకు ఆలివ్ చిట్కా..
ఆదా, పొదుపు ఇవి సగటు జీవికే కాదు.. పెద్ద పెద్ద కంపెనీలకూ చాలా కీలకమే. ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోగలమా అని కంపెనీలు నిరంతరం అన్వేషిస్తుంటాయి. పైసానే కదా అని చూసీ చూడనట్లుగా వదిలేయకుండా జాగ్రత్త పడి కోట్లు మిగుల్చుకుంటూ ఉంటాయి. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఇదే చేసింది. ఆ కంపెనీ తమ ప్రయాణికులకిచ్చే సలాడ్‌లో ఆలివ్‌తో పాటు అయిదు వెరైటీలు ఉండేవి. ఇందుకోసం ప్రతి సలాడ్‌కి ఎనభై సెంట్లు ఖర్చయ్యేది. అయితే, చాలా మంది ఈ ఆలివ్‌ను తినకుండా వదిలేస్తుండటాన్ని గమనించి ప్రయోగాత్మకంగా సలాడ్‌లో నుంచి ఆలివ్‌ను తగ్గించారు. దీంతో సలాడ్ వ్యయం 33 శాతం మేర తగ్గి అరవై సెంట్లకి దిగొచ్చింది. ఈ రకంగా ఒకే ఒక్క ఆలివ్‌ను తగ్గించడం ద్వారా కంపెనీ ఏడాదికి 5,00,000 డాలర్లు (దాదాపు రూ. 3 కోట్లు) మిగుల్చుకుంది. అనవసర వ్యయాలు తగ్గించుకోవడానికి మిగతా వారు కూడా దీన్ని అమల్లో పెట్టొచ్చు. ఉదాహరణకు దుస్తులు మొదలు ఇంటి కొనుగోలు దాకా చాలా అంశాల్లో ఈ ఫార్ములా ప్రయత్నించవచ్చు. బాగుంది కదాని అవసరం లేకపోయినా అదనపు బెడ్రూం ఇల్లు తీసుకోకుండా ఉంటే ఆ మేరకు మిగుల్చుకున్నట్లే. అలాగని నిత్యావసరాలకు కూడా అన్వయించుకోకుండా వీలైన చోట్ల మాత్రమే ఇలాంటి ఆలివ్లను పక్కన పెడితే బోలెడంత ఆదా అయినట్లే. -
ఆదాయం-పొదుపు= ఖర్చులు
రాజా చిరుద్యోగి స్థాయి నుంచి కాస్త పై స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో ఆదాయమూ పెరిగింది. జీతం పెరిగితే ఎంతో కొంత దాచిపెట్టొచ్చు .. కారో, ఇల్లో కొనుక్కునేందుకు ఉపయోగపడుతుంది కదా అని మొదట్లో సంతోషపడుతూ వచ్చాడు. కానీ ఆదాయంతో పాటు ఖర్చులూ పెరిగాయి. ఫలితంగా జీతం అయిదు వేలు ఉన్నప్పుడూ సరిపోలేదు.. యాభై వేలు వస్తున్నప్పుడూ ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇక, పొదుపు ఎక్కణ్నుంచి చేయాలో అర్థం కాక తలపట్టుకున్నాడు. దీంతో అర్జంటుగా ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను సమూలంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. దానికి తగ్గట్లుగానే కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాడు. అవేంటంటే.. పొదుపు చేయగా మిగిలినదే ఖర్చులకు.. సాధారణంగా అంతా ఖర్చులన్నీ పోగా ఏదో కొద్దిగా మిగిలితే దాన్ని పొదుపు చేద్దాం అనుకుంటారు. వారు ఫాలో అయ్యే ఫార్ములా ఆదాయం-ఖర్చులు = పొదుపు. కానీ, నిజంగా పొదుపు చేయడం ద్వారా లాభపడాలంటే.. దీన్ని కాస్త అటూ ఇటుగా మార్చుకోవాలి. ప్రతి నెలా కచ్చితంగా ఇంత పొదుపు చేయాలని నిర్ణయించుకుని దాన్నే ఆదాయం నుంచి తీసేస్తే మిగిలే మిగతా మొత్తాన్ని ఖర్చులకు కేటాయించాలి. అంటే ఆదాయం - పొదుపు = ఖర్చులు అన్నమాట. ఖర్చులను నియంత్రించడం సాధ్యం ఎలాగూ కాదు. ఎంత వద్దనుకున్నా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అదే మనకి వచ్చే ఆదాయంలో ముందస్తుగానే కొంత మొత్తాన్ని పొదుపు కోసం తీసి పక్కన పెట్టడం వల్ల చేతిలో ఉండే డబ్బుతోనే మిగతా ఖర్చులను చక్కబెట్టాల్సిన పరిస్థితి కల్పించుకుంటే ఆటోమేటిక్‌గా వ్యయాలపై కొంతైనా నియంత్రణ వస్తుంది. ఇక, ఈ పొదుపు మొత్తం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు బైటికి లాగేసే విధంగా ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి సదుపాయం ఉందంటే ఏదైనా కాస్త ఎక్కువ ఖర్చులు ఎదురైన ప్రతిసారీ మనసు అటు లాగేస్తూ ఉంటుంది. అందుకే, అంత సులభసాధ్యంగా విత్‌డ్రా చేసే వీలు ఉండని సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో ఉపయోగపడుతుంది. కొన్ని మ్యూచువల్ ఫండ్ పథకాలు, ప్రావిడెంట్ ఫండ్ లాంటి సాధనాలు ఇలాంటి దీర్ఘకాలికమైన సాధనాలే. ప్రతి నెలా ఉద్యోగి జీతంలో నుంచి కొంత మొత్తాన్ని కంపెనీ పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తుంటుంది. రిటైరయ్యే దాకా ఆ పొదుపు మొత్తం వడ్డీలతో కలిసి పెరుగుతూ ఉంటుంది. పదవీ విరమణ చేసే నాటికి కాస్త పెద్ద మొత్తం చేతికొస్తుంది. ఏవో కొన్ని అత్యవసర సందర్భాల్లో మాత్రమే దీన్ని ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే వీలు ఉంటుంది. చిన్న మొత్తంతోనైనా శ్రీకారం.. పొదుపు, ఇన్వెస్ట్ చేయాలన్న తలంపు వచ్చినప్పుడు భారీ మొత్తం చేతికొచ్చినప్పుడే చేయాలనుకోనక్కర్లేదు. చాలా మంది ఈ తప్పే చేస్తుంటారు. ఎంతో కొంత చొప్పున ప్రతి నెలా చిన్న మొత్తాలను మొదలుపెట్టి ఆదాయం పెరిగే కొద్దీ పొదుపు, ఇన్వెస్ట్మెంట్లను పెంచుకుంటూ పోవచ్చు. చక్రవడ్డీల ప్రభావంతో కొన్నాళ్లకు పెద్ద మొత్తమే అవుతుంది. పెద్ద మొత్తం కూడబెట్టే దాకా వెయిట్ చేస్తూ కూర్చుంటే ఈలోగా కొంగొత్త ఖర్చు లంటూ పుట్టుకొస్తూనే ఉంటాయి. చేతిలో ఉన్న డబ్బు హారతికర్పూరం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ప్రతీ సంవత్సరం పొదుపు మొత్తాన్ని ఎంతో కొంత పెంచుకుంటూ వెళ్లగలగాలి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ సిప్‌లలో పెట్టుబడులు కావొచ్చు మరొకటి కావొచ్చు చాలా మంది ఈ విషయాన్ని అంతగా పట్టించుకోరు. ఇక, మనం చేసే దాన్ని బట్టే ఫలి తాలు ఉంటాయి. ఇన్వెస్ట్ చేయడం బదులు అనవసర ఖర్చు చేయడం వల్ల మనకు రావాల్సిన రాబడి పోవడంతో పాటు.. కొన్నదాన్ని నిలబెట్టుకోవడం మరొకటి.. ఆపై మరొకటి కొనుక్కుంటూ పోవాల్సిన పరిస్థితి ఎదురుకావచ్చు. అలాగని, మరీ లోభిత్వం చేయాలనీ కాదు. ఎక్కడ ఖర్చు పెట్టాలి.. ఎక్కడ తగ్గాలి అన్నదీ కొంత ఎరుకతో వ్యవహరిస్తే మంచిది. లగ్జరీ ట్యాక్స్ విధించుకోవడం.. పొదుపు చేయడం అంటే చిన్న సరదాలను కూడా తీర్చుకోకుండా మరీ పర్సును బిగించేసి పిసినారిగా వ్యవహరించాలని కాదు. ఒకవేళ విలాసవంతమైన వస్తువేదైనా భారీ సొమ్ము వెచ్చించి కొన్నా.. మళ్లీ ప్రణాళిక గాడి తప్పకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణకు.. ఖరీదైన మొబైల్ ఫోనో మరొకటో కాస్తంత లగ్జరీ వస్తువేదైనా తీసుకున్నప్పుడు.. దాదాపు అంతే మొత్తాన్ని ప్రత్యేకంగా పొదుపు కోసం మళ్లించేసేందుకు ప్రయత్నించాలి. ఇదొక విధంగా మనపై మనం విధించుకునే లగ్జరీ ట్యాక్స్ లాంటిదే. కానీ, ఇందులో ప్రయోజనం ఏమిటంటే.. మనకు కావాల్సిన వస్తువు దక్కించుకోవడంతో పాటు మన ఆర్థిక క్రమశిక్షణ కూడా గాడి తప్పకుండా చూసుకోవచ్చు. కెడిట్ కార్డులు తగ్గించాలి.. క్రెడిట్ కార్డులు అవసరానికి రుణం ఇచ్చి ఆదుకోగలిగినా.. ఖర్చులపై అదుపులేని వారి విషయంలో ఇవి చాలా ప్రమాదకరమైనవి. కార్డుతో ఏదైనా కొనుగోలు చేసినప్పుడు సింపుల్‌గా ఒక స్లిప్పై సంతకం చేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా జేబులో నుంచి అప్పటికప్పుడు డబ్బు కట్టాల్సిన పని ఉండదు కాబట్టి సదరు కొనుగోలు భారం తక్షణం తెలియదు. కానీ మరుసటి నెల ఇతర ఖర్చులతో పాటు కార్డు బకాయిలు పేరుకుపోయి కట్టలేని పరిస్థితి తలెత్తినప్పుడు వస్తుంది అసలు తంటా. అందుకే, సాధ్యమైనంత వరకూ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు అసలు భారం అప్పటికప్పుడు తెలుస్తుంది కనుక కొంత అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడానికి వీలవుతుంది. అలాగే, మన లక్ష్యాలు రాసుకున్న చిన్న చీటీని గానీ కుటుంబసభ్యుల ఫొటోలు గానీ క్రెడిట్ కార్డుపై అతికించి ట్రై చేయొచ్చు. స్వైప్ చేయడానికి కార్డు తీసిన ప్రతిసారీ దానిపై కనిపించే లక్ష్యాలు ఠక్కున కనిపించి.. సదరు కొనుగోలు గురించి పునరాలోచించుకునే వీలు కలుగుతుంది. వృథా ఖర్చులకు కొంతైనా అడ్డుకట్ట పడుతుంది. -
నిశ్చింతగా రిటైర్ కావాలంటే..
జీతం మీదే ఆధారపడిన వారికి .. పదవీ విరమణ తర్వాత ఆదాయ మార్గాలు తగ్గిపోతాయి. ఖర్చులు మాత్రం పెరిగిపోతుంటాయి. కంటి మీద కునుకు లేకుండా చేస్తుం టాయి. రిటైర్మెంట్ తర్వాత ఇలాంటి సమస్యల వలయంలో చిక్కుపడకూడదంటే .. కాస్త ముందు నుంచే ప్రణాళిక వేసుకుంటే సరి. పదవీ విరమణ తర్వాత నిశ్చింతగా ఉండొచ్చు. ఈ దిశగా తోడ్పడే కొన్ని అంశాలు మీకోసం.. వైద్యానికీ కొంత కేటాయించాలి .. రిటైర్మెంట్ తర్వాత ఒడిదుడుకుల్లేకుండా జీవించడానికి ఎంత మొత్తం సమకూర్చుకోవాలన్నది రెండు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి ద్రవ్యోల్బణం, మరొకటి వయసు పైబడుతున్న కొద్దీ పెరిగే వైద్యం ఖర్చులు. ఆసుపత్రి వ్యయాలు ఏటా 18-20% పెరుగుతున్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ఎంత అవసరమో లెక్క వేసుకోవాలి. రిటైర్మెంట్ నిధి.. సాధారణంగా 58-60 సంవత్సరాలకు రిటైరవుతుంటాం. అయితే, ఏదైనా కారణంతో ఒకవేళ 50 ఏళ్లకే రిటైరవ్వాల్సి వస్తే పరిస్థితి ఏమిటి? అందుకే ఈ రెండు అంశాలకూ పనికొచ్చే విధంగా రిటైర్మెంట్ నిధిని రెండు భాగాలుగా విడగొట్టాలి. ఒక భాగం సాధారణ రిటైర్మెంట్కి కేటాయించాలి. రెండోది ముందస్తు రిటైర్మెంట్ వయసు నుంచి సాధారణ పదవీ విరమణ వయసు దాకా (58-60) గడిపే సంవత్సరాల కోసం కేటాయించాలి. అత్యాశకు పోవద్దు.. సాధ్యమైనంత ఎక్కువ నిధిని కూడబెట్టుకోవాలన్న లక్ష్యంతో అధిక రాబడులు అందిస్తామనే మోసపూరిత పథకాల వలలో పడకుండా ఉండాలి. అధిక రాబడులు వస్తాయంటే రిస్కు కూడా ఎక్కువే ఉంటుందని గుర్తుంచుకోవాలి. మార్కెట్లంటే భయపడొద్దు .. రిటైర్మెంట్ ప్లానింగ్ అన్నది దీర్ఘకాలికమైనది. కనుక, సురక్షితంగా, స్థిరమైన రాబడులు ఇచ్చే పెట్టుబడి సాధనాలు ఎంచుకోవాలి. అలాగని మరీ రక్షణాత్మకంగా కాకుండా పోర్ట్‌ఫోలియోలో అన్ని పథకాలు ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీలు దీర్ఘకాలంలో మిగతా సాధనాల కన్నా అధిక రాబడులు అందిస్తుంటాయి. కనుక, ముందస్తుగా పదవీ విరమణ చేయదల్చుకున్న వారు రిటైర్మెంట్ కోసం ఉద్దేశించిన యులిప్స్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మరింత పొదుపు చేయాలి.. తగినంత నిధితో రిటైర్ కావాలంటే.. సాధ్యమైనంత వరకూ వ్యయాలు తగ్గించుకోవాలి, పొదుపు చర్యలు పాటించాలి, తెలివిగా ఇన్వెస్ట్ చేయాలి. పన్నులపరంగా పక్కా ప్లానింగ్‌తో వ్యవహరిస్తే.. మరింత డబ్బు పొదుపు చేసేందుకు ఉపయోగపడుతుంది. ఆదాయం పెంచుకోవాలి.. కాలం చాలా విలువైనది. కనుక దీన్ని వృథా చేయకుండా ఆదాయం తెచ్చిపెట్టే పనులపై ఇన్వెస్ట్ చేయాలి. కేవలం జీతమే కాకుండా అదనపు ఆదాయ మార్గాలను కూడా అన్వేషించుకోవాలి. -
ఆర్థిక లక్ష్యం అలవోకగా ఛేదిద్దాం
ద్రవ్య మార్కెట్లు ఇటీవలి సంవత్సరాల్లో తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. కొన్ని ద్రవ్య సంస్థలు పతనమయ్యాయి. ద్రవ్యోల్బణం పెరిగింది. రూపాయి మారకం విలువ క్షీణించింది. సవాళ్లూ, అవకాశాలూ ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాల సాధనకు అప్రమత్తంగా వ్యవహరించాలి. స్వల్పకాలంలో డబ్బు సంపాదించే యోచనను పక్కనపెట్టి సంపద సృష్టికి దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవడం మేలు. పూర్వకాలంలో మన తాత ముత్తాతలు ఒక్కో లక్ష్యానికి ఒక్కో హుండీని ఏర్పాటు చేసి వాటిలో డబ్బు దాచుకునేవారు. కిరాణా సరుకులకు ఒకటి, విలాసాలకు మరొకటి, ఏడాదికోసారి జరిపే యాత్ర ఖర్చులకు ఇంకొకటి, ఇంట్లో త్వరలో జరిగే పెళ్లికి మరొకటి... ఇలా ఒక్కో అవసరానికి ఒక్కో హుండీ ఉండేది. ఈ పద్ధతినే మనం లక్ష్యం ఆధారిత ఆర్థిక ప్రణాళిక అని అంటున్నాం. ఈ పద్ధతి చాలా సులువైనది. ఇప్పటి కాలానికి అన్వయిస్తే, పిల్లల చదువుకు, వివాహాలకు, ఇల్లు, వాహనం కొనుగోలుకు లక్ష్యాలు రూపొందించుకుని అందుకు అనువుగా పొదుపు, పెట్టుబడులు ప్రారంభించాలన్నమాట. లక్ష్యం నిర్దేశించుకోవడం అత్యంత ప్రాముఖ్యమైనది. తొందరపాటుతోనో, పొరపాటుగానో నిర్దేశించుకునే లక్ష్యాలు మంచి కంటే చెడే ఎక్కువ చేయవచ్చు. లక్ష్యాలు మిమ్మల్ని తప్పుదోవ పట్టించినా, లక్ష్యాలు సునాయాసంగా సాధించేవి అయినా వాటివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు. ఒకవేళ లక్ష్యాలు అత్యంత కష్టసాధ్యమైనవైతే మీ వైఫల్యానికి మీరే ప్రణాళిక రూపొందించుకున్నట్లు అవుతుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకునే సమయంలో బాగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలివి... విలువ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంత సొమ్ము దాచుకోవాలో నిర్దుష్టంగా అంచనా వేయాలి కాలం: లక్ష్య సాధనకు మనకు ఎన్నేళ్ల తర్వాత డబ్బు అవసరమవుతుందో నిర్ణయించుకోవాలి. రిస్కు: లక్ష్యాల సాధనలో భాగంగా రిస్కులను ఎదుర్కొనే సామర్థ్యం ఎంత ఉందో పరిశీలించుకోవాలి. ప్రాధాన్యం: లక్ష్యాలన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ వాటి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు పిల్లల కాలేజీ ఫీజు చెల్లించడం లక్ష్యమైతే సంబంధిత పెట్టుబడిలో ఎలాంటి రిస్కుకూ తావుండదు. అంటే, రిస్కు అతి తక్కువగా ఉండే పెట్టుబడి ప్రణాళికను ఎంచుకోవాలి. ఇల్లు, కారు కొనుగోలు, వివాహం వంటి పెద్ద అవసరాలకు దీర్ఘకాలిక లక్ష్యాలు రూపొందించుకోవాలి. ఇలాంటి వాటికి సొమ్ము అధికంగా కావాలి. కనుక, పొదుపులో క్రమశిక్షణ పాటించాలి, మూల ధనమూ వృద్ధి చెందుతుండాలి. ఇందుకోసం ప్రతి లక్ష్యానికీ ఓ సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ - ఎస్ఐపీ)ను చేపట్టండి. ఎంపిక చేసిన ఈక్విటీల్లో సమయానుకూలంగా పెట్టుబడులు పెట్టడం కంటే క్రమబద్ధంగా సిప్ పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడమే మరింత లాభదాయకమని సర్వేలు చెబుతున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో 5-10 శాతాన్ని బంగారంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మార్కెట్ కుంగి పోతే నిరాశ చెందకండి. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాను, రిస్క్ ప్రొఫైల్‌కు అనుగుణంగా మరిన్ని పెట్టుబడులు చేయండి. ప్రతి ఒక్కరికీ తగిన పథకాలు మ్యూచువల్ ఫండ్లలో ఉన్నాయి. కనుక వీటిపైనా దృష్టిసారించండి. -
పొదుపే గతి..!
- జూలై మొదటివారం నుంచి నగరంలో 10 శాతం నీటి కోత - రెండో వారం కూడా వరుణుడు కరుణించకుంటే 20 శాతానికి పెంపు సాక్షి, ముంబై: నగరవాసులు పొదుపు మంత్రం జపించాల్సిన సమయం ఆసన్నమైంది. అయితే ఇది పెరిగిన నిత్యావసరాల భారాన్ని తగ్గించుకునేందుకు మాత్రం కాదు. వరుణుడు కరుణించనందుకు. వర్షాకాలం ప్రారంభమై దాదాపు నెల కావస్తోంది. అయినా ఇప్పటిదాకా చినుకు జాడే లేదు. ఇక నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. మరో పక్షం రోజులు ఇలాగే గడిస్తే చుక్క నీటిని కూడా వృథా చేయకుండా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే జూలై మొదటి వారం నుంచే నగరవాసులకు సరఫరా చేసే నీటిలో 10 శాతం కోత విధించాలని బీఎంసీ నిర్ణయిం చింది. రెండో వారం కూడా వర్షాలు పడకపోతే ఈ కోతను 20 శాతానికి పెంచాలని భావిస్తోంది. ఇలా కోతలు పెరిగితే ముంబైకర్లకు నీటిని పొదుపుగా వాడుకోవడం మినహాయించి మరో గత్యంతరం ఉండదు. నగరానికి నీటిని సరఫరా చేసేఏడు జలాశయాల్లో నీటి మట్టం తగ్గిపోయినందునే కోతలు విధించాలనే నిర్ణయం తీసుకున్నట్లు బీఎంసీ అధికారి చెప్పారు. ముఖ్యంగా మిడిల్, అప్పర్ వైతర్ణాలో నీటి నిల్వలు కనిష్టస్థాయికి చేరాయన్నారు. ఈ ఏడు జలాశయాలన్నింటిలో కలిపి మంగళవారంనాటికి 1.43 లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. గత ఏడాది జూన్ 24వ తేదీ వరకు ఈ జలాశయాల్లో మూడు లక్షల మిలియన్ లీటర్ల నీటి నిల్వలుండగా ప్రస్తుతం అందులో సగం కంటే తక్కువగా ఉన్నాయి. అందుబాటులో ఉన్న నీటి నిల్వలు జూలై మాసాంతం వరకు మాత్రమే సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. అయితే నగరానికి ఏడాది నీటి కోతలు విధించకుండా ఉండాలంటే 12 నుంచి 13 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరమవుతోంది. రోజుకు 4,200 మిలియన్ లీటర్ల నీరు అవసరం ఉన్నప్పటికీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) 3,450 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది. మరికొన్ని రోజులు వర్షాలు ఇలాగే ముఖం చాటేస్తే నీటి కోత మరింత పెంచాల్సి ఉంటుందని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. దీంతో నగరవాసులు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్పొరేషన్ కూడా త్వరలో ‘సేవ్ వాటర్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించనుందని చెప్పారు. ప్రతికా ప్రకటనలు, హోర్డింగ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా నగరవాసుల్లో నీటి పొదుపుపై అవగాహన కల్పించనున్నారు. -
భార్య కూడా పొదుపు లాంటిదే బ్రదరూ!
పెళ్లి మీద ఉన్నన్ని జోకులు, పెళ్లి పైన ఉన్నంత ఆసక్తి మరెక్కడా, ఎవరికీ ఏ అంశంలోనూ ఉండవు. ఒకే విషయంపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు పెళ్లి విషయంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రెండింటికీ కారణం - ‘ఆమె’. అసలు పెళ్లంటే... మగాడు తన బ్యాచిలర్ డిగ్రీని పోగొట్టుకుని, భార్య తన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందడమే అంటుంటారు. కానీ, గమనిస్తే, ‘పొదుపు’ అంత మంచిది, అంత ఉపయోగకరమైనది - ‘భార్య’. ఈ విచిత్రమైన పోలిక... వెనక ఉన్న కథాకమామిషు! ఆమె తోడు మిక్కిలి ఆనందాన్నిస్తుంది. ఆమె ప్రేమ తన్మయత్వాన్నిస్తుంది, ఆమె అండ కొండంత బలాన్నిస్తుంది. పండుటాకుగా మారేకొద్దీ తాను బలంగా పట్టుకోలేననీ, తనను అంటిపెట్టుకునే వారే ఇప్పుడు అవసరమనీ, ఆ అండే ఆమె అనీ అనిపిస్తుంది. ఆమె తోడుకు మించిన ఆస్తే లేదనిపిస్తుంది. పొదుపు చేయడం ఓ యజ్ఞం. అందరూ చేయాలనుకుని, కొందరు ఆసక్తితో, ఇంకొందరు అవసరంతో, మరికొందరు అవగాహనతో చేసే పని. సరిగ్గా పెళ్లి కూడా అలాంటిదే. భార్యకు -పొదుపుకు అనేక పోలికలున్నాయి. మొదటి దశ పెళ్లయినప్పటి తొలినాళ్ల లాగే మొదలుపెట్టినప్పుడు పొదుపు చాలా ఆసక్తితో క్రమబద్ధంగా చేస్తాం. ఆర్థికంగా ఏ ఇబ్బందులూ లేనపుడే కదా సాధారణంగా పొదుపు మొదలుపెడతాం. కాబట్టి, నెలనెలా ఠంచనుగా పొదుపు ఖాతాలోకి డబ్బులు మళ్లిస్తాం. ప్రతి నెలా ఓ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఓ ఆరునెలలు గడిస్తేనే... ‘అబ్బో అప్పుడే ఆరునెలలు పొదుపు చేసేశానే’ అనుకుని సంబర పడతాం. పెళ్లయిన కొత్తలో దశ కూడా ఇంతే. ఆఫీసు నుంచి ఇంటికి త్వరగా వస్తాం. అడిగిందే తడవుగా అడిగినవన్నీ సమకూరుస్తాం. భార్యపై ఎక్కడ లేని ప్రేమాభిమానాలుంటాయి. ప్రతి నెలా ఎంతో కాలం కలిసి ఉన్నట్లు లేత జ్ఞాపకాలు తలచుకుంటూ సంబర పడిపోతాం. అలా, వేగంగా, హాయిగా జీవితం గడుస్తుంది. భార్యపై అపారమైన ప్రేమ ఉంటుంది. మధ్య దశ పొదుపు ఖాతాలోకి ఎంతో కాలం నుంచి డబ్బులు వేస్తూ ఉంటాం. మధ్యలో డబ్బు అవసరాలు పెరుగుతుంటాయి. పొదుపు ఆపలేం. నానా ఇబ్బందులు పడి పొదుపు చేయక తప్పదు. ఎన్నాళ్లింకా పొదుపు చేయాలని చిరాకు వస్తుంది. మధ్యలో ఆపేద్దామా అనిపిస్తుంది. కానీ భవిష్యత్తులో వచ్చే లాభాలు గుర్తుకొస్తాయి. ఇప్పటికే ఎంతో కాలం నుంచి చేస్తుంటాం, ఇంకా ఎంతో కాలం చేయాల్సి ఉంది. దీంతో చచ్చీచెడీ ఆ పొదుపు కొనసాగిస్తాం. సరిగ్గా పెళ్లి పాతబడ్డాక... ప్రేమను రెండోస్థానంలోకి నెట్టేసి బాధ్యతలు మొదటి స్థానంలోకి వస్తాయి. ఆమె వల్లే కలిగే మేలు, దక్కే ప్రేమ కంటే కుటుంబ బాధ్యతలు నిరంతరం వెంటాడుతుంటాయి. ఈ పెళ్లీ వద్దు, పెళ్లామూ వద్దు ఈ కష్టాలూ వద్దనిపిస్తుంది. కాస్త భారంగా జీవితం నడుస్తుంటుంది. చివరి దశ క్రమం తప్పకుండా చేసిన పొదుపు ఖాతా అలా పెరిగి పెరిగి ఓ పెద్ద సొమ్ము జమ అవుతుంది. కష్టాలు పడితే పడ్డాం కానీ కష్టకాలంలో ఆదుకుంటోంది. అవసరానికి అక్కరకు వచ్చింది అనిపిస్తుంది. మన మీద మనకు ప్రశంస, అందివచ్చే సొమ్ముపై ఆశ తలెత్తుతాయి. ఇక అది చేతికి అందినప్పుడు ఆ ఆనందం చెప్పలేనిది. ఇక జీవితం విషయానికి వస్తే... వెనక్కు తిరిగి చూసుకుంటే ఆమె లాగా నిరంతరం ఎవరూ మన వెంట నడవలేదని గుర్తుకువస్తుంది. రోజురోజుకూ ఆమెపై ఆధారపడటం పెరుగుతూ వచ్చి ఆమె లేనిదే జీవితం లేదనిపిస్తుంది. ఆమె తోడు మిక్కిలి ఆనందాన్నిస్తుంది. ఆమె ప్రేమ తన్మయత్వాన్నిస్తుంది, ఆమె అండ కొండంత బలాన్నిస్తుంది. పండుటాకుగా మారేకొద్దీ తాను బలంగా పట్టుకోలేననీ, తనను అంటిపెట్టుకునే వారే ఇప్పుడు అవసరమనీ, ఆ అండే ఆమె అనీ అనిపిస్తుంది. ఆమె తోడుకు మించిన ఆస్తే లేదనిపిస్తుంది. భార్యను జీవిత భాగస్వామి అని ఊరకే అనలేదు. ఆమె భాగస్వామ్యం - ఆస్తులు, సుఖాల్లోనే కాదు కష్టాల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్య బాధల్లో. అన్నింటిలో అండగా ఉండే భార్య ఎప్పటికీ భారం కాదు, బాధ్యత! అందుకే, అది సెవెన్ ఇయర్స్ ఇచ్ కాదు, సెవెంటీ ఇయర్స్ బ్యూటిఫుల్ లైఫ్! -
ఆహారం కోసం పొదుపు
కంట్రీ కథ- కెనడా బహుళ సంస్కృతుల మేళవింపు, ప్రకృతి సౌందర్యం, ప్రశాంతతతో వంటి అంశాలతో కెనడాకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సుమారు మూడున్నర కోట్ల జనాభా ఉండే కెనడియన్ల ఖర్చులు, ఇన్వెస్ట్మెంట్లు ఆసక్తికరంగా ఉంటాయి. ఒక సర్వే ప్రకారం ఆహార పదార్థాల వ్యయాలు భారీగా పెరిగిపోతుండటంతో కెనడియన్లు ఇతర ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవడంపై దృష్టి పెడుతున్నారు. ఇక, కెనడియన్ కుటుంబాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. మొత్తం ఖర్చుల్లో సగటున 21 శాతం పన్నులకే పోతుంది. ఇక ఆ తర్వాత వాటా రియల్టీపై వెచ్చిస్తారు. అద్దె ఇల్లయితే కిరాయి రూపంలో కావొచ్చు లేదా సొంత ఇల్లయితే ఈఎంఐల రూపంలోనైనా కావొచ్చు. సాధ్యమైనంత వరకూ ఒక మోస్తరు ఆదాయం ఉన్న కెనడియన్లు కూడా సంపదను మరింత పెంచుకోవడంపైనే దృష్టి సారిస్తారు. ముందుగా సొంత ఇంటిని సాకారం చేసుకున్నాక.. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు, రియల్టీ ఆస్తులు సమకూర్చుకుంటారు. కెనడాకి సంబంధించి దాదాపు 80 శాతం సంపద.. ఇరవై శాతం ప్రజల వద్ద ఉందని అంచనా. ఈ సంపన్నులంతా కూడా ఎడా పెడా ఖర్చులు చేయడం కాకుండా.. పొదుపునకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం ఎంత ఉన్నా.. ఖర్చులు అంతకన్నా తక్కువే ఉండేలా చూసుకుంటారు. -
పైసా పైసా పోగుచేసి..! పెళ్లిలో జోరుచేసి..!
పొదుపు పెళ్లి ఖరీదు బాగా పెరిగిపోతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లలో ఆడవాళ్ల ఖర్చులు హద్దులు దాటిపోవడం వల్ల తర్వాత రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తోటివారితో పోల్చుకుంటూ పెళ్లిలో ఆడవాళ్లు చేస్తున్న అనవసరపు ఖర్చులను తగ్గించుకోవాలి. దీనికోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చాలామంది పెళ్లయిపోయాక కూర్చుని లెక్కలు వేసుకుంటారు. ‘అయ్యో...అనవసరంగా దానికి ఖర్చుపెట్టాం, దీనికి ఖర్చుపెట్టాం...’ అంటూ తలపట్టుకుంటారు. అలాకాకుండా పెళ్లికి ముందే..ముఖ్యమైన ఖర్చులు ఆడంబరంకోసం చేసే ఖర్చులు ఏమిటన్నది విడిగా రాసుకోవాలి. ఆపైన చేతిలో ఉన్న డబ్బుని దృష్టిలో పెట్టుకుని ఖర్చులు పెట్టుకుంటే మంచిది. పెళ్లి సమయంలో ఖర్చుకు కళ్లెం వేయకపోతే అమ్మాయి తల్లిగా ఆ తర్వాత మీ చేతిలో చిల్లిగవ్వ మిగిలే పరిస్థితి ఉండకపోవచ్చు. పెళ్లి తర్వాత కూడా అమ్మాయిలకు పెట్టాల్సిన ఖర్చులు చాలా ఉంటాయి. వాటిని తగ్గించుకోవడం కొన్ని సందర్భాల్లో కుదరదు. కాబట్టి పెళ్లిలో అనవసరమైన హంగామాల జోలికెళ్లకుండా జాగ్రత్తపడాలి. ఈ మధ్యకాలంలో మెహందీ ఫంక్షన్ అని నాలుగైదు రోజులు వచ్చిన బంధువులందరికీ గోరింటాకు పెట్టిస్తున్నారు. దీనికి పార్లర్వాళ్లు వేల రూపాయల్లో వసూలు చార్జ్ చేస్తున్నారు. ఈ కాలం అమ్మాయిలు చాలావరకూ ఉద్యోగినులే ఉంటున్నారు. చీరలు కట్టడం చాలావరకూ తగ్గించేస్తున్నారు. సౌకర్యాన్ని బట్టి చాలావరకూ చుడీదార్ల వంటినే ఇష్టపడుతున్నారు. పెళ్లి తర్వాత చీరలు పెద్దగా వాడరని తెలిసి కూడా గొప్ప కోసం పెళ్లికూతురుకి వంద చీరలు, రెండు వందల చీరలు అంటూ కొనేస్తున్నారు. దీని బదులు అమ్మాయికి నగదు ఇస్తే మరో ముఖ్యమైన ఖర్చుకి ఉపయోగపడుతుంది. అలాగే ఆభరణాలు కూడా హడావిడిగా కొనేయడం, ఆ తర్వాత డిజైన్ నచ్చలేదని, అవుట్‌డేటెడ్ అని మళ్లీ మార్చేస్తుంటారు. దీనివల్ల కూడా వేల రూపాయలు వృథా. - సుజాత బుర్లా, ఇన్వెస్టర్ అండ్ ఫండ్ మ్యానేజర్ -
పొదుపు, రిటైర్మెంట్ ఈ రెండే ముఖ్యం
ప్రపంచానికి పెద్దన్న.. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ.. అలాంటి అమెరికాలో ప్రజల ఆదాయ వ్యయాల తీరు ఎలా ఉంటుంది? పెట్టుబడుల విధానమేంటి? ఇవన్నీ తెలియజేసేదే ఈ వారం కంట్రీ కథ... అమెరికా అంటే 50 సమాఖ్య రాష్ట్రాల కూటమి. వీటికి సమాఖ్య జిల్లా వాషింగ్టన్ డీసీ అదనం. అగ్రరాజ్యమే అయినా ఐదేళ్ల కిందట మాంద్యం చేసిన గాయం ప్రభావం మామూలుగా లేదు. దాన్నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎంత సంపన్న దేశమైనా ప్రజా సంక్షేమ పథకాల విషయాల్లో దానికన్నా వర్ధమాన దేశాలే మెరుగ్గా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. సోషల్ సెక్యూరిటీ వ్యవస్థ కింద అమెరికా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పింఛను అంతంత మాత్రంగానే ఉంటోంది. వైద్య బీమాకి సంబంధించి నిధుల్లో కొంత ప్రభుత్వం సమకూరిస్తే... మిగతాది ఉద్యోగులు, వారు పనిచేసే కంపెనీలు చెరికాస్త సమకూరుస్తున్నాయి. పొదుపు: చూడటానికి కుబేరుల కంట్రీగానే కనిపిస్తున్నా అమెరికాలో మూడింట రెండొంతుల మందిది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అక్కడి వారి జీతభత్యాల గురించి లెక్కలేసే అమెరికన్ పే రోల్ అసోసియేషన్ స్వయంగా చెప్పిన విషయమిది. మాంద్యం దరిమిలా అమెరికన్లు మెల్లగా పొదుపుపై దృష్టి సారిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం నాటి సంక్షోభానికి బ్యాంకులే కారణమైనా... ఇప్పటికీ డబ్బు దాచుకునేందుకు బ్యాంకులే సురక్షితమైనవని వారు విశ్వసిస్తున్నారు. ఖర్చులు: అమెరికన్లు తమ ఆదాయంలో 30-40 శాతాన్ని హౌసింగ్పైన, 11-16 శాతాన్ని ఆహారంపైన వెచ్చిస్తుంటారు. అధికాదాయ వర్గాలు (ఏడాదికి 92,000 డాలర్లకు పైగా సంపాదించే వారు) మాత్రం వీటిపై ఇంతకన్నా తక్కువేఖర్చు చేస్తుంటారట. అధికాదాయ వర్గాలు వ్యక్తిగత బీమాకు, పింఛన్లకు అత్యధికంగా 16 శాతం మేర కేటాయిస్తుండగా.. అల్పాదాయ వర్గాలు (35,000 డాలర్ల కన్నా తక్కువ సంపాదించేవారు) 5.3 శాతం మాత్రమే వీటికి కేటాయించగలుగుతున్నారు. పెట్టుబడులు: చాలా మంది అమెరికన్ల దగ్గర షేర్లు, బాండ్లు ఉంటాయి. రిటైర్మెంట్ పథకాల ద్వారా వీటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. గతేడాది లెక్కల ప్రకారం మ్యూచువల్ ఫండ్లలో అమెరికన్ల పెట్టుబడులు ఏకంగా 13.6 లక్షల కోట్ల డాలర్లు. అమెరికన్లలో అత్యధికులు స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయటంతో పాటు మిగతా ప్రపంచ దేశాల ఫండ్లు కూడా అమెరికన్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అందుకే వీటి విలువ చాలా ఎక్కువ. -
ఖర్చుకైనా... పొదుపుకైనా ‘చమురు’ వదిలిస్తారు..!
రాజిరెడ్డిది ప్రైవేటు ఉద్యోగం. చిన్న వయసులోనే బాధ్యతలు మీద పడ్డాయి. చదువు కూడా ఒకదశలో ఆగిపోయింది. అయితేనేం! ఉద్యోగం చేస్తూ... ఉన్నత చదువులు కూడా చదివాడు. అదే సమయంలో పక్కా ప్లానింగ్‌తో చక్కటి ఇండిపెండెంట్ ఇల్లు కూడా సొంతం చేసుకున్నాడు. చిన్న వయిసులోనే ఓ ఇంటివాడయ్యాడు. ఆ యువకుడి కథే ఈ వారం ఫైనాన్షియల్ టార్గెట్. చూడ్డానికి ఎడారి. నిండా చమురు నిక్షేపాలు. వాటితో కాసుల సేద్యం చేసే అబుదాబి, దుబాయ్, షార్జా వంటి ఏడు ఎమిరేట్స్ సమాఖ్యే యూఏఈ. బ్రిటిషర్ల నుంచి స్వాతంత్య్రం వచ్చాక 1970లలో ఈ సమాఖ్య ఏర్పడింది. చమురు నిల్వలతో పుష్కలంగా ఆదాయం వస్తుండటంతో ఇక్కడి ప్రభుత్వాలు తమ పౌరులకు ఇళ్ల నుంచి విద్య దాకా ప్రతి దానికీ పభుత్వం సబ్సిడీలు ఇస్తున్నాయి. స్వదేశీయుల కన్నా విదేశాల నుంచి ఉద్యోగాల కోసం వచ్చిన వారి జనాభాయే ఇక్కడ అధికం. అయితే, ఆదాయ పన్ను మాత్రం లేదిక్కడ. ఖర్చు: చాలామంది ఎమిరేటీలు (ఎమిరేట్స్ పౌరులు) ప్రభుత్వ ఉద్యోగాలే చేస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు చాలా తక్కువ. తమ పౌరుల పదవీ విరమణ అవసరాలపై ప్రభుత్వం బాగా శ్రద్ధ చూపిస్తోంది. పౌరులకు కావాల్సిన ఇతరత్రా అవసరాలనూ పట్టించుకుంటోంది. ఉదాహరణకు.. తక్కువ ఆదాయం వచ్చే ఎమిరేటీల వివాహాల కోసం ప్రత్యేకంగా యూఏఈ మ్యారేజ్ ఫండ్ ఉంది. ఇది పౌరుల వివాహాలకు 19,000 డాలర్ల దాకా గ్రాంటు కింద అందిస్తుంది. ఇల్లు మొదలుకుని కార్ల దాకా ప్రతీదీ సబ్సిడీ మీదే లభిస్తుంది. దీంతో వీరికి చేతినిండా డబ్బులుంటున్నాయి. దీన్ని విలాసాలకు ఖర్చు పెట్టేవారు కొందరైతే... మరీ కాస్మోపాలిటన్ జీవన విధానం కోరుకునే ఎమిరేటీలు... క్రెడిట్ కార్డుల్ని వినియోగిస్తూ, భారీగా వ్యక్తిగత రుణాలనూ తీసుకుంటున్నారు. సంక్షేమం: సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఉదారంగానే ఉంటోంది. సాధారణంగా ఉద్యోగుల పెన్షన్ నిధికి కంపెనీలతో పాటు ప్రభుత్వం కూడా నిధులు ఇస్తుంటుంది. ఉదాహరణకు అబుదాబిలో పింఛను నిధికి ఉద్యోగులు తమ జీతంలో 5 శాతం ఇస్తే, వారు పని చేసే కంపెనీ మరో 15 శాతం, ప్రభుత్వం ఇంకో 6 శాతం నిధులను ఇస్తుంది. అంటే... నెలకు జీతంలో 26 శాతం పొదుపు చేస్తున్నట్లే. అందుకే ఎమిరేటీలకు రిటైర్మెంట్ తరవాత పెద్దగా ఇబ్బందులుండవు. పెట్టుబడులు: ఎమిరేటీలు తమ ఇన్వెస్ట్మెంట్స్ గురించి వెల్లడించడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ.. షేర్లు, బాండ్లు, ఇతర దేశాల్లో రియల్ ఎస్టేట్ వంటి సాధనాల్లో బాగానే ఇన్వెస్ట్ చేస్తారు. పెపైచ్చు విదేశాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు యూఏఈ ప్రత్యేకంగా సార్వభౌమ వెల్త్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఫండ్లలో ఇది కూడా ఒకటి. వివిధ దేశాల్లో వివిధ సాధనాల్లో ఇది ఇన్వెస్ట్ చేస్తుంది. -
ఈఫిల్ టవరు ఇక్కడే అంతెత్తు పన్నులూ ఇక్కడే
ఫ్రాన్స్ పేరెత్తగానే ఈఫిల్ టవర్ గుర్తొస్తుంది. ఫ్యాషన్ రాజధాని ప్యారిస్ కనిపిస్తుంది. ఓస్ అంతేనా!! అంటే.... ఈ టవర్ స్థాయిలోనే ఇక్కడ పన్నులూ ఎక్కువే. పొదుపు కూడా ఎక్కువే. అదే ఈ కంట్రీ స్పెషల్. ఏడాదికి ఒక మిలియన్ యూరోల ఆదాయం ఉన్నవారిపై ఏకంగా 75 శాతం మేర ఆదాయపు పన్ను వేయాలని ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండ్ ప్రతిపాదించారు. ఈ దెబ్బకి గెరార్డ్ డెపార్డూ వంటి యాక్టర్ ఫ్రెంచ్ పౌరసత్వాన్ని కూడా వదులుకోవటానికి సిద్ధపడ్డారు. చివరకు ఫ్రాంకోయిస్ వెనక్కి తగ్గారనుకోండి. అది వేరే విషయం. అలాంటి హిస్టరీ ఫ్రాన్స్‌ది. ఫ్రాన్స్‌లో పన్నులు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఆదాయ పన్ను 45 శాతంగా ఉంది. దీంతో పాటు సోషల్ సర్వీస్ ట్యాక్స్ 12 శాతం ఎటూ చెల్లించాల్సిందే. చాలా ఉత్పత్తులపై 19 శాతం వేల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) కూడా ఉంటోంది. ఇంత భారీగా పన్నులు విధిస్తున్న ప్రభుత్వం... ఆ సొమ్మును పింఛను, వైద్యంతో పాటు సంక్షేమ పథకాలపై వెచ్చిస్తుండటం వల్ల జనానికి ఆ మేరకు ఊరట దొరుకుతోంది. పొదుపు చేసేదెలా...? యూరోజోన్ దేశాలన్నిట్లోనూ అత్యధికంగా పొదుపు చేసేది ఫ్రెంచి వారే. దీనికోసం వారు ఆశ్రయించేది బ్యాంక్ డిపాజిట్లనే. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో బ్యాంకు డిపాజిట్ల విలువ 85,700 కోట్ల డాలర్లపైనే. దీంతోపాటు వీరు పోస్టాఫీస్ పథకాల్లోనూ దాచిపెడుతుంటారు. వీటిపై వచ్చే వడ్డీకి పన్ను భారం లేకపోవటం అసలు కారణం. ఇక పొదుపు పథకాలపై వడ్డీ రేటు మనతో పోలిస్తే చాలా తక్కువ. కేవలం 1.75 శాతం. పిల్లల కోసం, ఇల్లు కొనుక్కోవాలనుకునే వారి కోసం ఇలా.. ఒక్కొక్క అవసరం కోసం ఒక్కో తరహా పొదుపు పథకాలున్నాయి. ఇన్వెస్ట్ చేయడం కన్నా వీటిలో పొదుపు చేయడంవైపే ఫ్రాన్స్ వాసులు మొగ్గు చూపుతుంటారు. అయితే, ఇటీవలి ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తోటి యూరోజోన్ దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తే.. ఫ్రాన్స్ తమ సంక్షేమ పథకాల్లో కోత పెడుతుందని అంచనా. అదే జరిగితే.. తప్పనిసరిగా ఫ్రాన్స్ ప్రజలు బ్యాంక్ డిపాజిట్లే కాకుండా ఇతర ఇన్వెస్ట్మెంట్ సాధనాలవైపు మళ్లే అవకాశం ఉంది. మరి ఖర్చులో...? విలాస వస్తువులపై ఫ్రెంచివారు పెట్టే ఖర్చు ఎక్కువే. అయితే వీరి ఖర్చుల అలవాట్లను నిరుద్యోగం, తాత్కాలిక ఉద్యోగాలు ప్రభావం చేస్తుంటాయి. నిరుద్యోగం ఎక్కువగా ఉండి, తాత్కాలిక ఉద్యోగాలు తగ్గటం వంటివి జరిగితే వీరు వెంటనే ఖర్చులు తగ్గించేసుకుంటారు. ఒకవేళ ధరలు భారీగా పెరిగిపోతే... చాలా మంది ఖరీదైన వాటి జోలికెళ్లకుండా చౌకైన హైపర్ మార్కెట్లకు క్యూ కడతారు. ఆర్థికాంశాల్లో సహకారం కోసం 34 దేశాలు ఏర్పాటు చేసుకున్న ఓఈసీడీ కూటమిలో ఫ్రాన్స్ కూడా ఉంది. కాకపోతే ఈ దేశాలన్నిట్లోనూ అత్యధిక సమయం తింటూ, తాగుతూ గడిపేసేది ఫ్రెంచివారేనట.!! -
అవసరం ఎలాంటిదైనా..నెలకో కొంత
‘‘ఏమండీ డిసెంబర్ వస్తోంది! పిల్లలిద్దరి సెకండ్ టెర్మ్ ఫీజు కట్టేశారా?’’ అజయ్‌ని అడిగింది ఆయన భార్య సుహాసిని. ’అరె! మరచిపోయానే!! ఇప్పటికిప్పుడు 60 వేలు ఎలా?’ ఆలోచనలో పడ్డాడు అజయ్. ఈ సమస్య అజయ్ ఒక్కడిదే కాదు. స్వల్పకాలంలో డబ్బు అవసరమయ్యే స్కూలు ఫీజులు, ఇంట్లో శుభకార్యాలు, ఇంటి రిపేర్లు, విహారయాత్రలు... వీటికీ ప్లానింగ్ తప్పనిసరి. మరి ఇలాంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం దేన్లో పొదుపు చేయాలి? ఏవి మంచివి? చాలామంది నెలనెలా కొంత మొత్తాన్ని తీసి పక్కన పెడుతుంటారు. కొందరు దాన్ని ఇంట్లోనే దాచుకుంటారు. మరికొందరు సేవింగ్స్ ఖాతాలోనే వదిలేస్తారు. కొందరైతే సిప్ వంటి సాధనాల ద్వారా షేర్ మార్కెట్లో పెడతారు. వీటిని చూసినట్లయితే... ఇంట్లో దాస్తే ఏ రాబడీ రాదు. సేవింగ్స్ ఖాతాలో వదిలేస్తే వడ్డీ అతితక్కువ వస్తుంది. షేర్లలో పెడితే రిస్కుంటుంది. మరి ఏం చేయాలి? ఇలా ఆలోచించేవారికి అక్కరకొచ్చేదే ఆర్డీ. అంటే రికరింగ్ డిపాజిట్. చిన్న లక్ష్యాల కోసం... మీరు రూ.20 వేల స్మార్ట్‌ఫోనుకు, రూ.25 వేలు విహారయాత్రకు, రూ.50 వేలు పిల్లల స్కూలు ఫీజుకు పెట్టాల్సి ఉంది. సాధారణంగా... స్కూలు ఫీజు తప్ప.. మిగతా రెండింటికీ డబ్బులుంటే చూద్దాంలే అనుకుంటాం. చాలా సందర్భాల్లో అంత మొత్తం ఒకేసారి సమకూరదు. ఆ సరదా తీరకపోనూ వచ్చు. ఆర్డీ ఉంటే ఇవి తీరనివేమీ కావు. ఎలాగంటే... ఫోన్ కోసం ప్రతి నెలా రూ. 2,000 చొప్పున పది నెలలు, వెకేషన్ కోసం ఏడాది పాటు రూ. 2,000, స్కూల్ ఫీజుల కోసం ఏడాది పాటు రూ.4,000 ఆర్డీ చేయడం మొదలు పెట్టి చూడండి. నెలకు రూ.8,000 వీటికోసం కేటాయించాల్సి వస్తుంది. అది కష్టమేమీ కాదు. కానీ ఏడాది తిరిగేసరికి మీ కోరికలన్నీ తీరుతాయి. పెపైచ్చు దీనిపై వడ్డీ కూడా వస్తుంది. ఆర్డీ ఎందుకంటే... దీని కనీస వ్యవధి 6 నెలలు. గరిష్ట వ్యవధి పదేళ్లు. కనీసం రూ.100 (ఎస్బీఐ, ఆంధ్రా బ్యాంక్ లాంటివి) నుంచి ఆర్డీ చేయొచ్చు. ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ మొత్తం రూ.500. పోస్టాఫీసులోనైతే నెలకు రూ.10 వేయొచ్చు. వడ్డీ రేట్లు 7-10% దాకా ఉన్నాయి. మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి అసలుకు జమచేస్తారు. గడువుకన్నా ముందే ఆర్డీని వెనక్కి తీసుకోవచ్చు. కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ వెనక్కి తీసుకోవటం ఇష్టం లేకుంటే... ఆర్డీలో జమ అయిన మొత్తంలో 90 శాతం దాకా లోన్ తీసుకోవచ్చు. ఆర్డీపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. స్వల్పకాలానికి సింపుల్ సాధనం.. కొత్తగా పొదుపు ఆరంభించిన వారు... హడావుడిగా ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఆర్డీతో మొదలుపెట్టడం బెటర్. నెలనెలా కొంతమొత్తాన్ని నిర్దిష్ట కాలానికి డిపాజిట్ చేయటమే ఆర్డీ. దీనివల్ల క్రమం తప్పకుండా పొదుపు చేయడం అలవాటవుతుంది. ఒకటి రెండేళ్లు గడిచాక మెల్లగా మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి ఇతర సాధనాలపై అవగాహన పెంచుకుని ఇన్వెస్ట్మెంట్ మొదలుపెట్టొచ్చు. -
అమెరికా, బ్రిటన్ అంటారు కానీ..పొదుపులో మనమే బెస్ట్
మనిషికి పొదుపు చాలా ముఖ్యం. అలాగని అన్ని దేశాల్లోనూ ఈ సూత్రాన్ని పాటిస్తారా? ఒకవేళ పొదుపు చేయాలనుకుంటే ఎలా చేస్తారు? అత్యంత సంపన్న దేశమైనప్పటికీ.. అమెరికన్లకు ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేయటం అలవాటు. ఈ విషయాన్ని పలు సర్వేలు స్పష్టంగా చెప్పాయి. ఇటీవలి సర్వేను చూస్తే... 28% మంది అమెరికన్ కుటుంబాలకు అస్సలు పొదుపన్నదే తెలీదు. 60% మంది దగ్గర అత్యవసర పరిస్థితులకు సరిపడేంత డబ్బు లేదు. ఇక దాచుకునే వారి విషయానికొస్తే.. తమ సంపాదనలో కేవలం మూడు శాతమే పొదుపు చేస్తారట. ఈ విషయంలో బ్రిటిషర్లూ ఏమీ తీసిపోలేదు. ఏకంగా 70% మంది బ్రిటిషర్ల దగ్గర అత్యవసర పరిస్థితుల కోసం పైసా కూడా ఉండదట. పొదుపు విషయానికొస్తే.. ఆదాయంలో ఆరు శాతమే పొదుపు చేస్తారు వీరు. ఈ విషయంలో ఆసియా వాసులే బెటర్. చైనా వారు ఏకంగా ఆదాయంలో 50% పొదుపు చేస్తుంటారట. మన భారతీయులు వారిలో సగభాగం మేర... అంటే దాదాపు 28 శాతం పొదుపు చేస్తున్నారని అంచనా. అసలింతకీ పొదుపు ఎందుకు.. మొట్టమొదటిగా అత్యవసరాల కోసం. ఇంట్లో వాటర్ హీటరు నుంచి మిక్సీ, కుక్కర్, టీ వీల దాకా ఏదైనా ఎప్పుడైనా మొరాయించొచ్చు. రిపేరు చేయించడమో లేదా కొత్తది కొంటేనో గానీ పని జరగదు. అడపా దడపా చిన్న చిన్న అనారోగ్యాలు, జ్వరాలు అంటూ ఆస్పత్రికి తిరగాల్సి రావొచ్చు. ఇంటి రిపేర్లతో పాటు ఇలాంటి అత్యవసరాల కోసం పొదుపు మొత్తాలు ఉపయోగపడతాయి. రెండోది... ఎప్పుడైనా కుటుంబ సమేతంగా సరదాగా హాలిడే గడిపేందుకు ఎటైనా వెళ్లాలనుకుంటే బోలెడంత ఖర్చు. కాబట్టి ముందు నుంచే ఇలాంటి వాటి కోసం కొంత కొంతగా దాచిపెడితే పర్సుపై భారం గురించి ఆలోచించకుండా సెలవులు ఎంజాయ్ చేయొచ్చు. నిశ్చింతగా రిటైర్ కావాలన్నా పొదుపు చేయాల్సిందే. యువతకు డబ్బు దాచిపెట్టుకోమంటూ వృద్ధులు నూరి పోస్తుంటారు. అది తప్పుడు సలహా. ప్రతి రూపాయిని దాచిపెట్టకండి. మిమ్మల్ని మెరుగ్గా తీర్చిదిద్దుకునేందుకు మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. నాకు నలభై ఏళ్లు వచ్చేదాకా నేనొక్క పైసా కూడా దాచిపెట్టలేదు. - హెన్రీ ఫోర్డ్ -
భారతీయుల సంపద ఐదేళ్ళలో రూ.411లక్షల కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే ఐదేళ్ళలో భారతీయుల వ్యక్తిగత సంపద విలువ రెట్టింపై రూ.411 లక్షల కోట్లకు చేరుకుంటుందని కార్వీ ప్రైవేట్ వెల్త్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం భారతీయులు వ్యక్తిగత సంపద రూ.202 లక్షల కోట్లుగా ఉన్నట్లు కార్వీ ‘ఇండియా వెల్త్ రిపోర్ట్- 2013’ పేర్కొంది. ఆర్థిక సంస్కరణల పేరుతో దేశం ముందుకుపోతున్నా ఇప్పటికీ భారతీయులు ఈక్విటీల కంటే బంగారం, స్థిరాస్తి రంగాలనే ఎక్కువగా నమ్ముకుంటున్నారు. ఈ మొత్తం సంపదలోనే అత్యధికంగా రూ.60.61 లక్షల కోట్లు (30 శాతం) ఒక్క బంగారానికే కేటాయించారంటే భారతీయులు బంగారంపై ఎంత ప్రేమ పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాతి స్థానంలో స్థిరాదాయాన్నిచ్చే బ్యాంకు డిపాజిట్లు, బాండ్లలో రూ.35 లక్షల కోట్లు (17%), రియల్ ఎస్టేట్‌లో రూ.31.43 లక్షల కోట్లు (16%) ఇన్వెస్ట్ చేశారంట. వీటన్నింటితో పోలిస్తే భారతీయులు కేవలం రూ.24.31 లక్షల కోట్ల(12%) విలువైన ఈక్విటీ సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ఇతర పెట్టుబడి సాధనాలన్నింటికీ కలిపి 54 శాతం కేటాయిస్తే కేవలం బంగారం, స్థిరాస్తి రంగాలకే 46 శాతం కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఫైనాన్షియల్ పెట్టుబడి సాధనాలు, ఫిజికల్ అసెట్స్ పెట్టుబడుల నిష్పత్తి 55:45 వద్ద స్థిరంగానే ఉందని కార్వీ ప్రైవేట్ వెల్త్ సీఈవో సునీల్ మిశ్రా తెలిపారు. కాని రానున్న కాలంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడటంతో బంగారం నుంచి ఈక్విటీల్లోకి పెట్టుబడులు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సంపదలో 30 శాతం వాటా ఉన్న బంగారం వాటా 22 శాతానికి పడిపోతుందని ఈ మొత్తం అత్యధికంగా ఈక్విటీల్లోకి వస్తుందన్నారు. అలాగే వచ్చే మూడేళ్లలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా బాగా పెరుగుతాయన్నారు. ప్రస్తుతం ఫిజికల్ అసెట్స్‌లో బంగారం, స్థిరాస్తి నిష్పత్తి 65:35గా ఉందని, అదే వచ్చే ఐదేళ్ళలో 52:48గా మారుతుందన్నారు. -
మధ్యతరగతి భారతీయుల్లో పొదుపు రేటు డౌన్
బన్యూఢిల్లీ: సంపాదనలో ఎంతోకొంత పొదుపు చేసుకోవడం అనేది భారతీయుల జీవనం విధానంలో అంతర్భాగం. అలాంటిది ఇప్పుడు దీనికి చిల్లుపడుతోంది. అంతకంతకూ ఎగబాకుతున్న ధరలు, అధిక ఇంధన రేట్ల భారం.. విద్య, ఆరోగ్య బీమా ప్రీమియంల వ్యయాలు తడిసిమోపెడవుతుండటం వంటివన్నీ మధ్యతరగతి భారతీయుల వాస్తవ ఆదాయాలు ఆవిరయ్యేలా చేస్తున్నాయి. దీంతో గడిచిన మూడేళ్లలో పొదుపు రేటు 40% పడిపోయినట్లు అంచనా. పారిశ్రామిక మండలి అసోచామ్ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడైంది. పేద ప్రజలు ప్రస్తుత ధరాభారాన్ని భరించలేక తల్లడిల్లుతుంటే.. మధ్య తరగతి వర్గాల కొనుగోలు శక్తికి అధిక ద్రవ్యోల్బణం చిల్లుపెడుతోందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. దీంతో పొదుపు చేయడానికి చేతిలో డబ్బు మిగిలే పరిస్థితి కానరావడం లేదని చెప్పారు. సర్వే నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ... కుటుంబ ఖర్చులు భారీగా పెరిగిపోతుండటంతో భారతీయుల నికర పొదుపు(బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల్లో నగదు డిపాజిట్లు; షేర్లు, డిబెంచర్లు, చిన్న మొత్తాల పొదుపు స్కీమ్‌లలో నగదు పెట్టుబడులు ఇతరత్రా మార్గాల్లో) మొత్తం కూడా గణనీయంగా హరించుకుపోతోంది. మెట్రోపాలిటన్ నగరాల్లో అత్యధిక శాతం కుటుంబాలు తమ ఖర్చులను తగ్గించుకోవడం.. తద్వారా మిగుల్చుకునే డబ్బును షాపింగ్ సమయాల్లో తక్కువ రేట్లకు వచ్చే వస్తువులను కొనుక్కోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఆదాయాలను పెంచుకోవడం కోసం మరిత మెరుగైన జీతం వచ్చే ఉద్యోగాలకు మారాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సర్వేలో పాల్గొన్న ప్రతి నలుగురిలో ఒకరు పేర్కొన్నారు. లేదంటే అదనపు ఆదాయం కోసం పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, ఎక్కువ సమయం పనిచేయడం వంటివి వాటిపై దృష్టిపెడుతున్నారు. అధిక ద్రవ్యోల్బణం కారణంగా కంపెనీలు కూడా తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక వ్యయాలు పెరిగిపోవడం, ఉద్యోగుల నుంచి జీతాల పెంపు డిమాండ్లు కంపెనీలపై ఒత్తిడి పెంచుతున్నాయి. జీవన వ్యయం 40-45% పెరిగిపోయిందని, దీనికి అనుగుణంగా గతేడాది జీతాల పెంపు లేదని సర్వేలో 82% మంది అభిప్రాయపడ్డారు. మరింత అధిక జీతాలను కోరుకుంటున్నట్లు చెప్పారు. సర్వేలో 82 శాతం మంది మెట్రోవాసులు ఆర్థికంగా తాము చితికిపోతున్నామని, తమ జీవన ప్రమాణాలు 25 శాతం మేర దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. {దవ్యోల్బణం సెగ, అధిక ఇంధన భారాలను తట్టుకోవడం కోసం ఎక్కువ మంది మధ్య, దిగువ మధ్య తరగతి కుటుంబాలు తమ ఖర్చుల్లో సాధ్యమైన చోటల్లా కోత పెట్టుకుంటున్నారు. లేదంటే చౌక ఉత్పత్తులను కొనుగోలు చేయడం, కొనుగో ళ్లను వాయిదా వేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి-మార్చి మధ్య మూడు నెలల వ్యవధిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్, పుణే, చండీగఢ్, డెహ్రాడూన్ తదితర నగరాల్లో సర్వే నిర్వహించారు. కూరగాయలు, పండ్లు, ఇతరత్రా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో... అక్టోబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 7%కి, రిటైల్ ద్రవ్యోల్బణం 10.09 శాతానికి ఎగబాకడం తెలిసిందే. -
పొదుపు.. అభివృద్ధికి మలుపు
ఓర్వకల్లు రూరల్, న్యూస్‌లైన్: పొదుపు చేయడం ఆర్థిక అభివృద్ధికి మలుపు అని ప్రపంచ బ్యాంకు బృందం తెలిపింది. జిల్లాలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుల పనితీరు భేష్ అని కొనియాడింది. గురువారం ఓర్వకల్లు మండలం హుసేనాపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును 12 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందం సందర్శించింది. బృందంలో ఓరోసులిస్టాని, రాపిగ్రాతు, జార్జ్స్పరయా, సిద్దిక్ ప్రేమనా, డినేసిసింద్రా, రాపికేహబి, ఆరిఫ్, పూర్ణిమా, సూర్యపత్రిమా, జాకీ బాయరాయి ఉన్నారు. వారి వెంట పీఎన్ఆర్ రాష్ట్ర ప్రాజెక్టు మేనేజర్ శ్రీధర్‌రెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా వారు పొదుపు మహిళలు బ్యాంకుల ద్వారా లబ్ధి పొందిన విధానాన్ని, అభివృద్ధిని అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ రంగన్న మాట్లాడుతూ కర్నూలు, వైఎస్సార్, అనంతపురం, ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో సుమారు 5,300 మంది పొదుపు గ్రూపు సంఘాలకు రుణాలు ఇచ్చామన్నారు. ఏటా జూన్‌లో రుణాలు వసూలు చేస్తామన్నారు. ఒక్కో గ్రూపునకు రూ. 5 లక్షలు నుంచి రూ. 10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామన్నారు. ఆ డబ్బుతో సభ్యులు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారన్నారు. బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లిస్తురని చెప్పారు. పొదుపునకు సంబంధించిన అనేక అంశాలను మీరా గ్రూపునకు చెందిన లీడర్ పద్మావతితో బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. పొదుపు సంఘాలు లేనప్పుడు, ఏర్పడ్డాక ఎలా ఉందని బృందం సభ్యులు ప్రశ్నించారు. సంఘాలు లేనప్పుడు అప్పులు దొరికేవి కావని, సంఘాలు ఏర్పడిన తర్వాత తాము ఎంతో అభివృద్ధి చెందామని వారికి వివరించారు. పొదుపుతో ఆర్థిక అభివృద్ధి: డీఆర్డీఏ పీడీ నజీర్అహ్మద్ మాట్లాడుతూ పొదుపు సంఘాల సభ్యులు వ్యాపారాలు, భూమి కొనుగోళ్లు చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందారని బృందానికి వివరించారు. హుసేనాపురం ఆంధ్రప్రగతి బ్యాంకు మేనేజర్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ 250 పొదుపు సంఘాలకు రూ. 4.50 కోట్ల రుణాలు, 1500 మంది రైతులకు రూ. 9 కోట్ల వరకు పంట రుణాలు ఇచ్చామన్నారు. అనంతరం పొదుపు మహిళలతో ప్రపంచ బ్యాంకు బృందం సభ్యులు మాట్లాడారు. పొదుపు ద్వారా పేదరికాన్ని జయించి ఆర్థికంగా అభివృద్ధి చెందడాన్ని అభినందించారు. సంఘాల పనితీరును తాముఆదర్శంగా తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రగతి బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ పూర్ణ పుష్కల, ఫీల్డ్ ఆఫీసర్ చంద్రశేఖర్ఆచారి, అకౌంటెంట్ జ్యోతిర్మయి, ఆర్ఓ క్రెడిట్ మేనేజర్ రమణారెడ్డి, నాబార్డు ఏజీఎం కల్యాణ సుందరం పాల్గొన్నారు. -
బీమాతోనే చదువుకు ధీమా!
తల్లిదండ్రుల లక్ష్యాల్లో పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించడమనేదే ఇప్పుడు ప్రధానం. ఈ మధ్య అవైవా, ఐఎంఆర్బీ కలిసి భారతీయ పొదుపు గురించి చేసిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. పొదుపు చేస్తున్న వారిలో 93 శాతం మంది వారి పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్నామని చెప్పగా, 77 శాతం మంది పెరుగుతున్న విద్యా వ్యయంపై ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ బీమా పథకాలు చక్కటి సమాధానం చెపుతాయి. బీమా అనేది కేవలం ఆర్థిక రక్షణగానే కాకుండా వివిధ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఒక చక్కటి ఇన్వెస్ట్మెంట్ సాధనంగానూ మారింది. ముఖ్యంగా పిల్లల అవసరాలకై ఇప్పుడు అనేక బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. పుట్టిన వెంటనే... తల్లిదండ్రులు వారి పిల్లలను డాక్టరో, ఇంజనీరో లేక పైలట్టో చేయాలనుకుంటారు. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే వారికి మంచి విద్యను అందించాలి. దీనికి తగినంత నిధిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలు పుట్టగానే ఆ దిశగా అడుగులు వేస్తే తక్కువ మొత్తంతోనే ఎక్కువ నిధిని సమకూర్చుకోవచ్చు. ఉదాహరణకు పిల్లల కోసం రూ.10 లక్షల నిధిని సమకూర్చుకోవాలంటే మొదటి సంవత్సరంలోనే ప్రారంభిస్తే ఏటా రూ.39,771 ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. అదే ఏడేళ్ళ తర్వాత మొదలు పెడితే ఇదే మొత్తానికి ఏటా రూ.82,045 చెల్లించాల్సి ఉంటుంది. అంటే అదనంగా ఏటా మరో రూ.42,274లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత తక్కువ మొత్తంతో లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాం. నాలుగు మార్గాలు నాలుగు మార్గాలను అనుసరించడం ద్వారా పిల్లల ఆర్థిక లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. స్టెప్ 1: ముందుగా పిల్లల ఉన్నత చదువు లేదా భవిష్యత్తు అవసరాల కోసం ఎంత మొత్తం అవసరమవుతుందో లెక్కించుకోండి. స్టెప్ 2: ఇక రెండో దశలో ఎంత బీమా రక్షణ అవసరమవుతుందో చూసుకోవాలి. జీవితంలో ఏదైనా ఊహించని సంఘటన జరిగినా పిల్లల భవిష్యత్తు, ఆర్థిక లక్ష్యాలపై ప్రభావం లేకుండా ఉండే విధంగా బీమా రక్షణ ఎంచుకోవాలి. కొన్ని బీమా కంపెనీలు ఇందుకోసం ప్రత్యేకమైన రైడర్లను అందిస్తున్నాయి. స్టెప్ 3: ఈ లక్ష్యం చేరుకోవడానికి ఎంత కాలపరిమితి ఉంది, ఎంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది, దీన్ని ఎంత మొత్తంలో చెల్లించగలం అన్నది పరిశీలించండి. స్టెప్ 4: చివరగా మీ రిస్క్ సామర్థ్యం ఆధారంగా బీమా పథకాన్ని ఎంచుకోండి. రిస్క్ చేయగలి గితే యులిప్ పథకాలను, లేకపోతే సంప్రదాయ బీమా పథకాలను ఎంచుకోండి. పలు బీమా పథకాలను పిల్లల వయస్సు 18 లేదా 21 సంవత్సరాలు వచ్చేసరికి నగదును అందించే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో మీకు నచ్చిన కాలపరిమితిని ఎంచుకోవచ్చు. ఈ విధంగా పిల్లలు పుట్టగానే వారికోసం ఆర్థిక ప్రణాళికను తయారు చేసుకుంటే ఎటువంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా సులభంగా లక్ష్యాన్ని చేరుకోగలరు.