
న్యూఢిల్లీ: చిన్న మొత్తాల పొదుపు పథకాలైన పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీ తదితర వాటిపై కేంద్రం మరోసారి వడ్డీ రేట్లు తగ్గించింది. 20 బేసిస్ పాయింట్లు (0.2 శాతం) తగ్గిస్తూ జనవరి– మార్చి త్రైమాసికానికి రేట్లను ఖరారుచేసింది. సుకన్య సమృద్ధి యోజన, కిసాన్ వికాస్ పత్రాలపైనా రేట్లు తగ్గాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన సీనియర్ సిజిటన్స్ సేవింగ్స్ స్కీమ్‌పై వడ్డీ రేటులో మాత్రం మార్పు చేయలేదు. దీనిపై ప్రస్తుతమున్న 8.3% వడ్డీ రేటు కొనసాగుతుంది.
అలాగే, సేవింగ్స్ డిపాజిట్‌పైనా 4% వడ్డీ రేటు కొనసాగుతుంది. మార్పుల తర్వాత పీపీఎఫ్, ఎన్‌ఎస్‌సీపై 7.6%, కిసాన్ వికాస్ పత్రపై 7.3%, సుకన్య సమృద్ధి యోజనపై 8.1% వడ్డీ రేట్లు అమలవుతాయి. ఏడాది నుంచి ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన టర్మ్ డిపాజిట్లపై 6.6–7.4% మధ్య వడ్డీ లభిస్తుంది. ఐదేళ్ల కాల వ్యవధి కలిగిన రికరింగ్ డిపాజిట్‌పై 6.9 శాతం వడ్డీ అమలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment