సేవింగ్స్ డిపాజిట్లపై ఇంత భారీ వడ్డీలా? | A massive interest on savings deposits? | Sakshi
Sakshi News home page

సేవింగ్స్ డిపాజిట్లపై ఇంత భారీ వడ్డీలా?

Published Sun, Jul 10 2016 9:07 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

సేవింగ్స్ డిపాజిట్లపై ఇంత భారీ వడ్డీలా?

సేవింగ్స్ డిపాజిట్లపై ఇంత భారీ వడ్డీలా?

న్యూఢిల్లీ : ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకోకపోయినప్పటికీ, సేవింగ్స్ ఖాతాపై వడ్డీరేట్లు అధికంగా  ఉండడం పట్ల ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.   సేవింగ్స్ డిపాజిట్లపై అధిక వడ్డీరేట్లు కొనసాగడం అవసరమా అని ప్రశ్నించారు. ఈ డిపాజిట్లపై అధిక వడ్డీల వల్ల రుణ వ్యయాలు పెరిగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీస్తుందన్నారు.

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్‌ఈ) ఏర్పాటై 140 ఏళ్లయిన సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బీఎస్‌ఈలో కమోకాగా, కమోడిటీ డెరివేటివ్ సెగ్మెంట్‌ను త్వరలో  ప్రారంభిస్తామని బీఎస్‌ఈ పేర్కొంది. వ్యవసాయేతర కమోడిటీలు- లోహాలు, ఆయిల్, గ్యాస్ వంటి కమోడిటీల్లో డెరివేటివ్ ట్రేడింగ్ కోసం అనుమతి ఇవ్వాలంటూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేశామని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement