
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక భద్రతపరమైన భరోసానివ్వడంతో పాటు సంపద సృష్టికి కూడా ఉపయోగపడేలా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ శుభ్ ఫ్లెక్సి ఇన్‌కం ప్లాన్ పేరిట వినూత్న జీవిత బీమా పొదుపు సాధనాన్ని ఆవిష్కరించింది. వివిధ వర్గాల ఆర్థిక ప్రణాళికలు, అవసరాలకు అనుగుణంగా ఇందులో ఎండోమెంట్, ఎర్లీ ఇన్‌కం, డిఫర్డ్ ఇన్‌కం ఆప్షన్లు ఉంటాయి. మహిళా పాలసీదార్లకు ప్రత్యేక డిస్కౌంటు ఉంటుంది.
బోనస్‌లపై వడ్డీని పొందుతూ, దాన్ని భవిష్యత్తు ప్రీమియం చెల్లింపులకు ఉపయోగించుకునేలా సబ్–వాలెట్ ఫీచరు కూడా ఉంది. పాలసీదారు దురదృష్టవశాత్తూ కన్ను మూసిన పక్షంలో భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియంల నుంచి మినహాయింపు లభిస్తుంది. వారి కుటుంబ సభ్యులకు భవిష్యత్తు బోనస్‌లు, ఇతర ప్రయోజనాలు యథాప్రకారం లభిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment