Life cover scheme
-
ఈ బ్యాంకు కస్టమర్లకు...3 లక్షల క్రెడిట్, 3 లక్షల బీమా
సాక్షి,ముంబై: ఫెడరల్ బ్యాంక్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. తన కస్టమర్ల కోసంఏజియాస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో కలిసి సాచెట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ 'గ్రూప్ క్రెడిట్ షీల్డ్'ను ప్రారంభించింది. ఈ కార్డు ద్వారా పలు సౌలభ్యాలు అందిస్తోంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ కార్డు తీసుకున్న వారికి రూ.3 లక్షల జీవిత బీమా ఆఫర్ చేస్తోంది. ప్రమాదవశాత్తూ కార్డు దారుడు మరణిస్తే నామినీకి రూ. 3 లక్షలు బీమా లభిస్తుంది. అలాగే ఈ కార్డుపై రూ.3 లక్షల వరకు క్రెడిట్ అందించడం మరో విశేషం. అయితే ఈ సింగిల్ ప్రీమియం ప్లాన్ లైఫ్ కవర్ ఒక సంవత్సరం మాత్రమే. ఈ మేరకు ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఫెడరల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ క్రెడిట్ కార్డ్ తన కస్టమర్లకు ప్రత్యేకమైన కవర్‌ను అందిస్తుంది. ఈ కార్డ్ క్రెడిట్ పరిమితి గరిష్టంగా రూ. 3 లక్షలు. ప్రస్తుతం Celesta, Imperio, Signet అనే మూడు వేరియంట్లను అందిస్తోంది. ఈ కార్డులపై కస్టమర్లకు జీవిత భద్రత కల్పిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంక్ తెలిపింది. తమ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు కేవలం 3 నిమిషాల్లో దీన్ని ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చని, బైట్ సైజ్, బండిల్డ్ ప్రొడక్ట్‌ల ద్వారా దేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచాలని భావిస్తున్నామని బ్యాంకు ఫెడరల్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాలిని వారియర్ అన్నారు. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్ల కోసం తమగ్రూప్ క్రెడిట్ షీల్డ్ నిమిత్తం ఫెడరల్ బ్యాంక్‌తో భాగస్వామ్యం చాలా సంతోషదాయకమని ఏజిస్ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, హెడ్-ప్రొడక్ట్స్ కార్తిక్ రామన్ తెలిపారు. గ్రూప్ క్రెడిట్ షీల్డ్ కస్టమర్లకు జీవిత బీమా కల్పించి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు రుణాన్ని తిరిగి చెల్లించే భారం లేకుండా వారిని కాపాడుతుందన్నారు. -
ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జనధన యోజన(పీఎంజేడీవై) కింద ఖాతాలు ప్రారంభించిన వారికి ఇచ్చే జీవిత బీమా (లైఫ్ కవర్) స్కీమ్‌ను ఐదేళ్ల తర్వాత సమీక్షిస్తామని ఆర్థిక శాఖ వెల్లడించింది. జనధన ఖాతాదారులకు రూ.30,000 జీవిత బీమా కవరేజీ 2019-20 ఆర్థిక సంవత్సరం వరకూ వర్తిస్తుందని, ఆ తర్వాత ఈ స్కీమ్ కొనసాగింపు, ప్రీమియం చెల్లింపులు, తదితర అంశాలను తగినవిధంగా సమీక్షిస్తామని పేర్కొంది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది జనవరి 26 మధ్య తొలిసారిగా బ్యాంకు ఖాతాలు తెరచిన వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రభుత్వోద్యోగులు(రిటైరైన వాళ్లు కూడా), వారి కుటుంబాలు, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవాళ్లు, టీడీఎస్ చెల్లించేవాళ్లు, ఆమ్ ఆద్మీ బీమా యోజన వర్తించేవాళ్లు, తదితరులకు ఈ లైఫ్ కవర్ స్కీమ్ వర్తించదు.