ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష. | Government to review life cover scheme under Jan Dhan after 5 years | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష.

Published Mon, Feb 2 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 PM

ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష.

ఐదేళ్ల తర్వాత జనధన లైఫ్ కవర్ స్కీమ్ సమీక్ష.

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జనధన యోజన(పీఎంజేడీవై) కింద ఖాతాలు ప్రారంభించిన వారికి ఇచ్చే జీవిత బీమా (లైఫ్ కవర్) స్కీమ్‌ను ఐదేళ్ల తర్వాత సమీక్షిస్తామని ఆర్థిక  శాఖ వెల్లడించింది.  జనధన ఖాతాదారులకు రూ.30,000 జీవిత బీమా కవరేజీ 2019-20 ఆర్థిక సంవత్సరం వరకూ వర్తిస్తుందని, ఆ తర్వాత ఈ స్కీమ్ కొనసాగింపు, ప్రీమియం చెల్లింపులు, తదితర అంశాలను తగినవిధంగా సమీక్షిస్తామని పేర్కొంది.

గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది జనవరి 26 మధ్య తొలిసారిగా బ్యాంకు ఖాతాలు తెరచిన వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. ప్రభుత్వోద్యోగులు(రిటైరైన వాళ్లు కూడా), వారి కుటుంబాలు, ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసేవాళ్లు, టీడీఎస్ చెల్లించేవాళ్లు, ఆమ్ ఆద్మీ బీమా యోజన వర్తించేవాళ్లు, తదితరులకు ఈ లైఫ్ కవర్ స్కీమ్ వర్తించదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement