దేశంలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ( పీఎంజేడీవై ) ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను దాటాయని, వాటిల్లో 56 శాతం మహిళలవేనని కేంద్ర ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 50 కోట్ల అకౌంట్లలో 67 శాతం రూరల్, సెమీ- అర్బన్ ప్రాంతాల ప్రజలు ఓపెన్ చేసినట్లు పేర్కొంది.
ఇక ఈ అకౌంట్లలో మొత్తం రూ.2.03లక్షల కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపిన ఆర్ధిక శాఖ.. 34 కోట్ల మందికి రూపే కార్డ్‌లను ఉచితంగా అందించినట్లు వెల్లడించింది. జన్ ధన్ యోజన ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 4,076 కాగా, వీరిలో 5.5 కోట్లకు పైగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) పొందుతున్నారని చెప్పింది.
ఉపయోగాలు ఇవే
కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు సైతం బ్యాంకింగ్ సేవల్ని వినియోగించేందుకు 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్ని వినియోగించుకోవచ్చు. రూపే డెబిట్ కార్డ్ తీసుకున్నవారికి రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇక జన్ ధన్ అకౌంట్‌లో రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment