balance
-
బోసు బాల్‌తో నటి కొత్త కసరత్తులు వైరల్ : అసలేంటీ బోసు బాల్ ఎక్స్‌ర్‌సైజ్?
బరువు తగ్గడానికి శరీరాన్ని దృఢంగా ఆ మార్చుకోవడానికి వ్యాయామం ఒక్కటే మార్గం. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది వారి వారి వ్యక్తిగత అవసరాలు, ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. యోగా, వాకింగ్, జాకింగ్ లాంటి వాటితో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది బోస్ బాల్ వ్యాయామం. బోసు బాల్ (BOSU Ball) వ్యాయామం మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. శరీరంతోపాటు, జీవిత సమన్వయ సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. తాజాగా బోసు బాల్ వ్యాయామాన్ని అలవోకగా చేస్తోంది నటి శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra).యోగాసనాలు, జిమ్‌లో కసరత్తులతో అభిమానుల ఆకట్టుకునే శిల్పా బోసు బాల్ మీద చాలా బ్యాలెన్సింగ్ వ్యాయామాలుచేస్తున్న వీడియోను మండేమోటివేషన్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.బోసు బాల్ వ్యాయామం శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తుందని శిల్పా చెప్పుకొచ్చింది. సమతుల్యతను, బ్యాలెన్సింగ్ మెరుగుపరుస్తుందని తెలిపింది. క్రియాత్మక ఫిట్నెస్ను పెంచుతుందని, అలాగే పట్టు తప్పి పడిపోవడం, గాయాల ప్రమాదాలను తగ్గిస్తుందని తెలిపింది.ఎలా చేస్తారు?ఒక ప్లాస్టిక్ బేస్‌మీద రబ్బరు బంతిని అమరుస్తారు. దీనిమీద స్క్వాట్స్, పుష్ అప్ప్, జంపింగ్, ప్లాంక్స్, హాప్స్, షోల్డర్ టాప్స్, మౌంటైన్ క్లైంబర్స్ఇలాచాలా రకాల వ్యాయామాలను చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు కూడా తొందరగా తగ్గుతారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) బౌన్స్ అవుతున్న బంతిమీద వ్యాయామం అంటే అన్ని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలో అలవడుతుంది. బోసు బాల్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచిది. సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుష్-అప్స్, జంప్స్ చేయడంలో వల్ల టోన్ల్ బాడీ సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాల కండరాల సమూహాలను లక్ష్యంగా 15 నిమిషాల పాటు చేస్తే చేయాలి.45-60 నిమిషాలు మంచి ఫలితం ఉంటుంది. మెదడికి, శరీరానికి మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. మానసిక బలం చేకూరుతుంది. బోసు బాల్ వ్యాయామాలు, ప్రయోజనాలుబోసు బాల్ వ్యాయామంతో అనేక రకాల(health benefits) ప్రయోజనాలున్నాయి. నిజానికి ఈ వ్యాయామం శారీరక బలానికి ఒక పరీక్ష లాంటిది. ఇది ఒక్కసారి అలవాటైతే చక్కని శరీర సౌష్టవంతోపాటు దేహ దారుఢ్యంగా కూడా పెరుగుతుంది, బ్రహ్మాండమైన ఫిట్నెస్ మన సొంతమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆరంభంలో సరియైన నిపుణుడు, లేదా శిక్షకుడి ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది. బోసు బంతితో వ్యాయామం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ బాల్‌పై ఎలాంటి ఎక్స్‌ర్‌సైజ్ చేసినా, తొందర పడకుండా, నిదానంగా బ్యాలెన్సింగ్‌ను అలవర్చుకోవాలి. భుజాలు వెనుకకు, తల తటస్థంగా ఉండేలా సరియైన భంగిమలో ఉండాలి. బంతిపై నిలబడి ఉన్నప్పుడు మోకాళ్లను వదులుగా ఉంచుకోవాలి. ఇది బాల్ పై కదలికల సమయంలో, లేదా కొంచెం వంగినపుడు పడిపోకుండా సహాయపడుతుంది ఇవీ చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంపెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ రొమాంటిక్ డ్యాన్స్! వైరల్వీడియో -
కుటుంబ బాధ్యతల్లో బ్యాలెన్స్ అవసరం
అంజలి ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టి, పెరిగింది. తండ్రి ప్రధాన ఆదాయదారుడిగా ఉండగా, తల్లి ఇంటిని నిర్వహిస్తూ, పిల్లలను చూసుకునేవారు. ఇంట్లో ఎవరేం చేయాలనే విషయంలో స్పష్టత ఉండేది. ఈ వాతావరణంలో పుట్టి, పెరిగిన అంజలికి భార్యాభర్తలు ఎవరేం చేయాలనే విషయంపై ఒక బలమైన అభిప్రాయం ఏర్పడింది. డిగ్రీ పూర్తి చేశాక అంజలికి రాజుతో వివాహమైంది. రాజు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తుండగా అంజలి హౌస్ వైఫ్ బాధ్యతలను ఆనందంగా స్వీకరించింది. ఇద్దరూ సంతోషంగా గడిపేవారు. ఒక బిడ్డ పుట్టాక బిడ్డను చూసుకుంటూ ఇంటిపనులు చేయడం అంజలికి కష్టంగా ఉండేది. ఇద్దరు బిడ్డలు పుట్టాక అది మరింత కష్టంగా మారింది. ఉదయాన్నే లేచి రాజుకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ సిద్ధం చేయడం, పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం, ఇంటి పనులు చూసుకోవడంతో చాలా అలిసిపోయేది. రాజు కొంత సహాయం చేసినప్పటికీ అది అంజలి ఆశించిన స్థాయిలో ఉండేది కాదు. దాంతో అంజలి చాలా ఒత్తిడిని అనుభవించేది. నిరంతర సమస్యలుక్రమక్రమంగా అంజలికి శారీరక శ్రమతో పాటు, మానసిక శ్రమ కూడా పెరిగింది. భర్త, పిల్లల అవసరాలను అర్థం చేసుకుని, సమయానికి అన్నీ మకూర్చే క్రమంలో అంజలి తన అవసరాలను నిర్లక్ష్యం చేసేది. తాను అనుభవిస్తున్న ఒత్తిడిని రాజుకు చెప్పడంలో ఇబ్బంది పడేది. ఆమె తన అవసరాలను చెప్పగానే, రాజు వాటిని నిర్లక్ష్యం చేసేవాడు లేదా తప్పుగా అర్థం చేసుకునేవాడు. లేదంటే తాను ఆఫీసులో ఎంత స్ట్రెస్ అనుభవిస్తున్నాడో చిట్టా విప్పవాడు. అలా మాట్లాడుతుంటే అంజలి మనసు చివుక్కుమనేది. ‘ఇదేంటి ఈ మనిషి నేను చెప్పేది వినడు, నా కష్టం పట్టించుకోడు’ అనిపించేది. కాలం గడిచేకొద్దీ, కుటుంబంకోసం రాజు కష్టపడుతున్నా, అదే కుటుంబంకోసం తాను పడుతున్న కష్టాన్ని గుర్తించడంలేదని బాధపడేది. అది వారిద్దరి అనుబంధం, ఆప్యాయతలపై ప్రభావం చూపించింది. రాజును కేవలం భర్తగా కంటే రూమ్మేట్ గా చూడటం ప్రారంభించింది. మరోవైపు భార్యగా తన బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదని బాధపడేది. ఇది ఆమెను అపరాధభావనలోకి చెట్టింది. తనలో మరింత నిరాశను, అంతర్గత ఘర్షణను సృష్టించింది.ఇవన్నీ కలిసి అంజలి మానసిక ఆరోగ్యంపై నెగెటివ్ ప్రభావం చూపాయి. ఆందోళన పెరిగింది. ఆత్మవిశ్వాసం తగ్గింది. నేను మంచి భార్యనైతే ఇలా ఆలోచించేదాన్ని కాదనే అపరాధభావం పెరిగి పెద్దదైంది. దాన్నుంచి బయటపడేందుకు ఇంటిపనుల కోసం మరింత సమయం వెచ్చించేంది. అది మళ్లీ ఆమె అలసటను, అసంతృప్తిని పెంచేది. దాంతో అప్పుడప్పుడూ రాజుపై అరిచేది, గొడవపడేది. అది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది. చికిత్స లక్ష్యాలు... పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న అంజలి కౌన్సెలింగ్ కోసం మా క్లినిక్ కు వచ్చింది. తన మానసిక స్థితిని పూర్తిగా వివరించింది. తన ఆందోళనను తగ్గించడంతోపాటు, రాజుతో తన బంధాన్ని బలపరిచేందుకు సహాయం చేయాలని కోరింది. మొదటి సెషన్ లో ఆమెతో మాట్లాడాక, రెండో సెషన్ కు రాజుతో పాటు రావాలని సూచించాను. రెండో సెషన్ లో వారిద్దరితో మాట్లాడాక కౌన్సెలింగ్ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. అంజలి, రాజులు పరస్పర అవసరాలను, భావాలను, ఆందోళనలను వ్యక్తపరచడానికి అవసరమైన వాతావరణాన్ని అభివృద్ధి చేయడం. వైవాహిక బాధ్యతలు, భావోద్వేగాలను పంచుకోవడం ద్వారా బంధాన్ని సరిదిద్దడం, సమాన భాగస్వామ్యాన్ని స్థాపించడం. కుటుంబ రోల్స్, బాధ్యతలు, భాగస్వామ్య భావనలను ప్రభావితం చేసే వ్యక్తిగత విలువలు, అంచనాలు, సామాజిక ప్రభావాలను అన్వేషించడం. •ఒత్తిడి, ఆందోళన, నిరాశను మేనేజ్ చేసేందుకు అవసరమైన స్కిల్స్ ను అభివృద్ధి చేయడం. చికిత్స సాగిన విధానంరాజు, అంజలి మధ్య బంధాన్ని, కమ్యూనికేషన్ ను మెరుగుపరిచేందుకు ప్రొటోకాల్ రూపొందించాను. అందులో మొదటిది I Sentences. అంజలి రాజును బ్లేమ్ చేయడం కాకుండా, తన భావాలను వ్యక్తం చేయడానికి ‘‘నేనిలా అనుకుంటున్నాను, నేనిలా ఫీలవుతున్నాను’’ అని ‘ఐ సెంటెన్సెస్’ ఉపయోగించడం ప్రారంభించింది. దాంతో రాజు తనను బ్లేమ్ చేస్తుందనే భావన లేకుండా ఓపెన్ గా వినడం మొదలుపెట్టాడు. రాజు అలా వినడం అంజలికి సంతృప్తినిచ్చింది. కుటుంబంలో ఏ పనులు ఎవరు చేయాలనే విషయంపై ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చారు. వారానికోసారి ఈ అంశంపై ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అంగీకరించారు. ఇది అంజలిపై పని ఒత్తిడి భారాన్ని, ఒత్తిడికి లోనవుతున్నాననే భావనను అధిగమించడానికి ఉపయోగపడింది. వారానికోసారి ఇద్దరూ కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకోవడం, ఒకరి కష్టాన్ని మరొకరు శ్రద్ధగా ఆలకించడం, సహాయాన్ని ఆఫర్ చేయడం వారిద్దరి మధ్య బంధం, అనుబంధం పెరిగేందుకు సహాయపడింది. దీంతోపాటు మరికొన్ని థెరప్యూటిక్ టెక్నిక్స్ పాటించడం ద్వారా ఆరునెలల్లో వారి మధ్య బంధం బలపడింది. ఇప్పుడు ఇద్దరూ ప్రశాంతంగా, ప్రేమానురాగాలతో జీవిస్తున్నారు. సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066ww.psyvisesh.com -
హెలికాప్టర్‌ను కిందికి వదిలేశారు
రుద్రప్రయాగ(ఉత్తరాఖండ్): దాదాపు మూడు నెలలుగా మరమ్మతుల కోసం ఎదురు చూస్తున్న ఓ హెలికాప్టర్‌ను తరలించేందుకు చేపట్టిన ప్రయత్నం విఫలమైంది. బ్యాలెన్స్ తప్పడంతో ప్రమాదాన్ని శంకించిన వైమానిక దళ(ఐఏఎఫ్) ఎంఐ–17 చాపర్ పైలట్ ఆ హెలికాప్టర్‌ను కొద్దిదూరం వెళ్లాక కిందికి వదిలేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. క్రిస్టల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చెందిన హెలికాప్టర్ మే 24వ తేదీన కేదార్‌నాథ్‌కు తీర్థయాత్రికులతో వచ్చింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ హెలికాప్టర్ గిరికీలు కొడుతూ హెలిప్యాడ్‌కు సమీపంలో ల్యాండయ్యింది. అదృష్టవశాత్తూ అందులోని యాత్రికులు, పైలట్ సహా ఏడుగురు సురక్షితంగా బయటపడ్డారు. అప్పటి నుంచి ఆ హెలికాప్టర్ అక్కడే ఉండిపోయింది. దానిని మరమ్మతుల కోసం గౌచార్‌కు తరలించాలని అధికారులు భావించారు. వైమానిక దళానికి చెందిన ఎంఐ –17 రకం చాపర్ శనివారం ఉదయం దానిని తీసుకుని బయలుదేరింది. గాల్లోకి లేచి ముందుకు సాగిన కొద్దిసేపటికే బ్యాలెన్స్ తప్పింది. హెలికాప్టర్ బరువెక్కువగా ఉండటంతోపాటు, కొండప్రాంతం కావడంతో పైలట్ ప్రమాదాన్ని శంకించారు. అధికారుల సూచనలతో థారు క్యాంప్‌కు సమీపంలోని కొండ ప్రాంతంలో జన సంచారం లేని చోట హెలికాప్టర్‌ను వదిలేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఆ హెలికాప్టర్లో ఎటువంటి కూడా సామగ్రి లేదన్నారు. ఘటనాస్థలికి నిపుణుల బృందం చేరుకుని, పరిశీలన చేపట్టినట్లు చెప్పారు. హెలికాప్టర్ కూలిందంటూ వస్తున్న వార్తలను నమ్మొద్దని ప్రజలను కోరారు. -
ఉద్యోగం దొరికితే చాలు అనే యువతరం కాదు..అంతకుమించి..!
కొత్త రంగాలు ఉనికిలోకి రావడం వల్ల ‘ఉద్యోగమే సర్వస్వం’ ‘ఉద్యోగం దొరికితే చాలు’ అనుకోవడం లేదు యువతరంలో చాలామంది. దీనికి కారణం...ప్రత్యామ్నాయ అవకాశాలు. ‘ఉద్యోగం ఎందుకు చేయాలి?’ నుంచి ‘చేస్తే ఎలాంటి ఉద్యోగం చేయాలి’ వరకు కెరీర్ బాట పట్టడానికి ముందు రకరకాల కోణాలలో ఆలోచిస్తున్నారు. మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. 44 దేశాల్లో మిలీనియల్స్, జెన్ జెడ్‌పై సర్వే చేసింది డెలాయిట్. దీని ప్రకారం ప్రైమరీ జాబ్ తోపాటు మరో జాబ్ చేస్తున్న యువ ఉద్యోగుల సంఖ్య తక్కువేమీ కాదు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కాలేజీలో పని చేస్తున్న పరిమళ ఆన్లైన్లో వ్యాపారం కూడా చేస్తుంటుంది.‘డబ్బు కోసం కాదు. అదొక ఫ్యాషన్’ అంటుంది తన ఆన్లైన్ వ్యాపారం గురించి. లింక్డ్ ఇన్ సర్వే ప్రకారం 2023లో మన దేశంలో 88 శాతం మంది జెన్ జెడ్ ఉద్యోగులు ‘ఉద్యోగ మార్పు’నకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. జెన్ జెడ్ ఉద్యోగులపై ఆర్పీజీ గ్రూప్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం పదిమందిలో ఆరుగురు మంచి వేతనం కంటే మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు.‘పని ఒత్తిడి చచ్చినట్లు భరించాల్సిందే’ అని రాజీపడడం కంటే ‘జీతం తక్కువ అయినా సరే నాకు నచ్చిన ఉద్యోగం చేస్తాను’ అని ఆలోచిస్తున్న వారి సంఖ్య యువతరంలో ఎక్కువగానే ఉంది. ముంబైలోని ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం చేసిన అనన్యకు పనిభారంతో ఊపిరాడేది కాదు. ఒక ఫైన్ మార్నింగ్ ‘ఇది కాదు జీవితం’ అనిపించింది. తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఒక స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. ‘నేను పని చేస్తున్న కంపెనీతో పోల్చితే ఇది చాలా చిన్న ఉద్యోగం కావచ్చు. కాని ఎంతో సంతోషంగా ఉంది’ అంటుంది అనన్య. ఒక మార్కెటింగ్ సంస్థలో ఉద్యోగం చేసిన ఇరవై సంవత్సరాల సారా బోహ్ర ఆ ఉద్యోగం మానేసి సొంతంగా మార్కెటింగ్ ఫర్మ్ మొదలుపెట్టింది. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. ‘ఇప్పుడు చాలా సౌకర్యంగా ఫీలవుతున్నాను. పని ప్రకారం కాదు గంటల ఆధారంగా ప్రొడక్టివిటీని కంపెనీలు అంచనా వేస్తున్నాయి’ అంటుంది సారాతీయని పాఠాలు..రాజస్థాన్‌లోని వనస్థలి యూనివవర్శిటీలో బీబీఏ డిగ్రీ పూర్తి చేసిన అనువ కక్కర్ ఉద్యోగం కంటే సొంత స్టార్టప్‌కే ్ర΄ాధాన్యత ఇచ్చింది. అయితే కస్టమైజ్డ్ పోస్టర్ కార్డ్‌లకు సంబంధించి ఆన్లైన్ బిజినెస్‌లో ఫెయిల్ అయింది. అయితే ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకున్న అనువ ‘టిగెల్’ చాకోలెట్ బ్రాండ్‌తో సక్సెస్ అయింది. హాట్ చాక్లెట్+వింటర్= హ్యాపీనెస్ నినాదంతో చిన్న బడ్జెట్లో కంపెనీ మొదలు పెట్టింది. కస్టమర్ చాయిస్‌లను అర్థం చేసుకోవడంలో పట్టు సాధించింది. ‘టిగెల్’ స్టార్ట్ చేసినప్పుడు అనువ వయసు 21 సంవత్సరాలు. ‘చిన్న వయసులో ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రస్థానం మొదలు పెట్టడం వల్ల ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది’ అంటుంది అనువ కక్కర్. బెస్ట్ ప్లాన్ బెడిసి కొడితే?‘ఈ రంగంలో మాత్రమే పనిచేస్తాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఏ రంగంలో పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. యాంత్రిక జీవితం కంటే ఉల్లాసకరమైన మార్పు చాలామంచిది’ అంటుంది చెన్నైకి చెందిన శ్రీతేజ. కోల్‌కత్తాకు చెందిన 23 సంవత్సరాల మనీష తన ఉద్యోగానికి సంబంధించి ఇప్పటికీ మూడు రంగాలు మారింది. అలా అని ఆమెలో పశ్చాత్తాపం ఏమీ లేదు. ‘ఏ రంగంలో అయినా పనిచేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మనీష. వర్క్ నుంచి గ్యాప్ తీసుకోవాలనుకునే యువతరం కోసం ఈమధ్య కాలంలో ఎన్నో ‘గ్యాప్ ఇయర్ కమ్యూనిటీస్’ వచ్చాయి. ‘గ్యాప్ఎక్స్’ పేరుతో హరియాణాలోని అశోకా యూనివర్శిటీలో 40 మంది స్టూడెంట్స్‌తో కూడిన గ్రూప్ ఉంది.‘యువతలో చాలామంది కెరీర్ మార్గాన్ని నిర్ణయించుకునే ముందు వివిధ అవకాశాల గురించి అన్వేషిస్తున్నారు. ఆలోచిస్తున్నారు’ అంటున్నాడు దిల్లీ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ దినేష్ సింగ్. చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి నచ్చిన ఉద్యోగం చేయడం, సొంతంగా కంపెనీ మొదలుపెట్టడం, ఉద్యోగ విరామం తీసుకొని ఆన్లైన్ కోర్సులలో చేరడం వరకు తమదైన దారిలో ప్రయాణం చేస్తోంది నవతరం.(చదవండి: సడెన్‌గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..) -
50 కోట్ల దాటిన జన్ ధన్ యోజన ఖాతాలు.. ఉపయోగాలు ఇవే
దేశంలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ( పీఎంజేడీవై ) ఖాతాల సంఖ్య 50 కోట్ల మార్క్‌ను దాటాయని, వాటిల్లో 56 శాతం మహిళలవేనని కేంద్ర ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 50 కోట్ల అకౌంట్లలో 67 శాతం రూరల్, సెమీ- అర్బన్ ప్రాంతాల ప్రజలు ఓపెన్ చేసినట్లు పేర్కొంది. ఇక ఈ అకౌంట్లలో మొత్తం రూ.2.03లక్షల కోట్లు డిపాజిట్ చేసినట్లు తెలిపిన ఆర్ధిక శాఖ.. 34 కోట్ల మందికి రూపే కార్డ్‌లను ఉచితంగా అందించినట్లు వెల్లడించింది. జన్ ధన్ యోజన ఖాతాల్లో సగటు బ్యాలెన్స్ రూ. 4,076 కాగా, వీరిలో 5.5 కోట్లకు పైగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పొందుతున్నారని చెప్పింది. ఉపయోగాలు ఇవే కేంద్ర ప్రభుత్వం నిరుపేదలు సైతం బ్యాంకింగ్ సేవల్ని వినియోగించేందుకు 2014 లో ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఎలాంటి మినిమం బ్యాలెన్స్ లేకుండా జన్ ధన్ బ్యాంక్ ఖాతాల్ని వినియోగించుకోవచ్చు. రూపే డెబిట్ కార్డ్ తీసుకున్నవారికి రూ.2 లక్షల వరకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ కవరేజీ లభిస్తుంది. ఇక జన్ ధన్ అకౌంట్లో రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం ఉంది. -
Fact Check: బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ రూ.30వేలకు మించితే క్లోజ్! నిజమేనా?
బ్యాంక్ అకౌంట్లో నగదు బ్యాలెన్స్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ జారీ చేసిన రూల్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. బ్యాంకు ఖాతాలలో రూ. 30 వేల కంటే ఎక్కువ ఉంటే అటువంటి అకౌంట్లను క్లోజ్ చేస్తారన్నది దాని సారాంశం. అయితే ఆ వార్త ఫేక్ అని తేలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వార్త నిజం కాదని, ఆర్బీఐ అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని నిర్ధారించింది. హిందీలో ఉన్న ఆ వార్తను ట్విటర్లో షేర్ చేస్తూ అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: Rs 500 Notes: రూ.88 వేల కోట్లు మిస్సింగ్! ఏమయ్యాయి? ఇంటర్నెట్లో తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్ లో ఈ ఫ్యాక్ట్-చెకింగ్ విభాగాన్ని ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించి సర్క్యులేట్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు పీఐబీ పేర్కొంటోంది. एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck ▪️ यह ख़बर #फ़र्ज़ी है। ▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9 — PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023 -
ఇంగ్లండ్ క్రికెటర్ సంచలన నిర్ణయం.. జింబాబ్వే తరపున ఆడేందుకు!
ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ గ్యారీ బ్యాలెన్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లండ్ దేశీవాళీ క్రికెట్లో యార్క్‌షైర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న బ్యాలెన్స్.. ఇప్పుడు తన సొంత దేశం జింబాబ్వే తరపున ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో బ్యాలెన్స్ తన బంధాన్ని తెంచుకున్నాడు. కాగా బ్యాలెన్స్ అభ్యర్థనను యార్క్‌షైర్ క్రికెట్ కూడా అంగీకరించింది. ఇక యార్క్‌షైర్ క్రికెట్ క్లబ్‌తో తెగదింపులు చేసుకున్న బ్యాలెన్స్.. జింబాబ్వేలో రెండేళ్ల పాటు దేశవాళీ క్రికెట్ ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడమే అతడు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక జింబాబ్వేలో జన్మించిన బ్యాలెన్స్.. తన చిన్న తనంలోనే అతడి తల్లిదండ్రలు ఇంగ్లండ్‌లో స్ధిర పడ్డారు. దీంతో ఇంగ్లీష్ జట్టు తరపున అతడు 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. బ్యాలెన్స్ 23 టెస్టులు, 16 వన్డేల్లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. జింబాబ్వేకు ఆడటమే నా లక్ష్యం ఇక యార్క్‌షైర్ నుంచి బయటకు వచ్చిన బ్యాలెన్స్ తొలి సారి స్పందించాడు. "జింబాబ్వే క్రికెట్లో చేరేందుకు అతృతగా ఎదురుచూస్తున్నాను. సీనియర్ కోచ్‌లు, ప్రతిభావంతులైన ఆటగాళ్లతో కలిసే ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. దేశవాళీ క్రికెట్లో రాణించి జింబాబ్వే జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యమని" బ్యాలెన్స్ పేర్కొన్నాడు. చదవండి: ENG vs PAK: పాకిస్తాన్ క్రికెట్లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు.. -
ఈపీఎఫ్ఓ వడ్డీ జమ షురూ: మీరూ చెక్ చేసుకోండిలా..!
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఎఫ్ఓ) వడ్డీ డిపాజిట్ కోసం ఎదురుచూస్తున్న ఖాతాదారులకు శుభవార్త. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) వడ్డీ జమలను ప్రారంభించినట్టు ఈపీఎఫ్‌వో ట్విటర్ ద్వారా సమాచారాన్ని అందించింది. ప్రక్రియ ప్రారంభమైంది త్వరలోనే మీ ఖాతాలోనే పూర్తిగా జమ అవుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేసింది. 2021-22 ఏడాదిగాను డిపాజిట్లపై వడ్డీరేటు నాలుగు దశాబ్దాల కనిష్టం వద్ద 8.1 శాతంగా ప్రభుత్వం జూన్‌లో ఆమోదించింది. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేటు 8.5 శాతంగా ఉంది. The process of crediting interest is ongoing and it will get reflected into your account soon. Whenever the interest is credited, it will be paid in full. There will be no loss of interest. — EPFO (@socialepfo) October 31, 2022 పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి? సాధారణంగా బ్యాలెన్స్‌ను ఎస్ఎంఎస్ లేదా మిస్డ్ కాల్ ద్వారా చూసుకోవచ్చు. సంస్థ పోర్టల్‌లో లాగిన్ కావడం ద్వారానూ తెలుసుకోవచ్చు. ఖాతాదారులు అధికారిక వెబ్సైట్ లో ‘మా సేవలు’ ట్యాబ్‌కు వెళ్లాలి. ట్యాబ్‌లో, 'ఉద్యోగుల కోసం' ఆప్షన్‌ను ఎంచుకోండి..కొత్త పేజీ ఓపెన్ అయ్యాక సబ్‌స్క్రైబర్ తప్పనిసరిగా 'సభ్యుని పాస్‌బుక్'పై క్లిక్ చేసి, యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN),పాస్వర్డ్ వంటి వివరాలను నమోదు చేయాలి. పాస్‌బుక్‌లో వడ్డీ క్రెడిట్ అయిందీ లేనిదీ చెక్ చెసుకోవచ్చు. అయితే ఒకటి కంటే ఎక్కువ సంస్థల్లో ఉద్యోగం చేసిన వారు వేర్వేరు ఐడీ ఆధారంగా చెక్ చేయాలి. మిస్డ్ కాల్: ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవవచ్చు. 011-22901406 అనే నంబరుకు చందాదారుడు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కాల్ చేయాలి. ఎస్ఎంఎస్: పీఎఫ్ చందాదారుడు తన రిజిస్టర్ మొబైల్ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్సును తెలుసుకోవచ్చు. పీఎఫ్ బ్యాలెన్స్ చెకింగ్ కోసం 7738299899 నంబరుకు ‘‘EPFOHO UAN ENG’’ అని ఎస్ఎంఎస్ పంపాలి. యూఏఎన్ అని ఉన్న చోట దాన్ని టైప్ చేయాలి. ఎస్ఎంఎస్ సెండ్ చేశాక పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలతో మరో మెసేజ్ వస్తుంది. -
ఇన్వెస్టర్లూ.. వీటి సంగతి చూడరూ.!
ఏదైనా ఒక విభాగంలో పెట్టుబడిని లక్ష్యం, కాల వ్యవధి, రంగం పనితీరు ఇలా ఎన్నో అంశాలు నిర్ణయిస్తాయి. పెట్టుబడిదారులు తమ లక్ష్యాలకు అనుకూలమైన ఉత్పత్తులపై దృష్టి సారించాలి. మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ పథకాలు ఇన్వెస్టర్లకు లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో పరిమిత రిస్క్‌తో పెట్టుబడులకు వీలు కల్పిస్తాయి. కనుక చక్కని ఏకైక పెట్టుబడి పరిష్కారంగా ఇవి పనిచేస్తాయి. తమ పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసే సాధనాలను ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో భాగం చేసుకోవడం ద్వారానే గరిష్ట ప్రయోజనాన్ని సొంతం చేసుకోగలరు. విదేశీ పెట్టుబడులకు చోటు నూతన, వినూత్నమైన పెట్టుబడుల అవకాశాలు మన మార్కెట్లలోనూ ఇన్వెస్టర్లకు అందుబాటులోకి వస్తున్నాయి. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపైనా ఇన్వెస్టర్లు ఒకసారి దృష్టి సారించాలి. ముఖ్యంగా అధిక రిస్క్ తీసుకునే వారు విదేశీ పెట్టుబడులకు చోటివ్వాలి. వర్ధమాన, అభివృద్ధి చెందిన మార్కెట్లలో దీర్ధకాలంలో గణనీయమైన సంపదను సృష్టించుకోవచ్చు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ తదితర సాధనాల ద్వారా ఇన్వెస్టర్లు ఆయా అవకాశాల్లో ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. అత్యవసరాల కోసం పెట్టుబడి జీవితంలో దేన్నీ ఊహించలేమని కరోనా మహమ్మారి అతిపెద్ద పాఠం నేర్పించింది. ఈ తరహా పరిస్థితులను మనం ‘సన్నద్ధత’ ద్వారానే అధిగమించగలం. అందుకని అత్యవసర నిధిపై పెట్టుబడి పెట్టడం ఎంతో ముఖ్యం. ఇలా చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఆ నిధిని వేగంగా వెనక్కి తీసుకోవచ్చు. ఇందుకోసం ఓవర్‌నైట్ ఫండ్, లిక్విడ్ ఫండ్, లో డ్యురేషన్ డెట్ ఫండ్స్, లేదా ఫ్లోటర్ ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. నాణ్యతకు ప్రాధాన్యం పెట్టుబడుల సాధనాల నాణ్యతపైనా దృష్టి పెట్టాలి. మంచి వ్యాల్యూషన్లు, దీర్ఘకాలంలో రాబడులను ఇచ్చే విధంగా పెట్టుబడులు ఉండాలి. ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నట్టు అన్ని కంపెనీలు లేదా అన్ని రంగాల్లో ఎప్పుడూ అదే మాదిరి ప్రదర్శన, రాబడులను ఉండవని తెలుసుకోవాలి. ప్రీమియం వ్యాల్యూషన్లతో ఎక్కువ కాలంపాటు కొనసాగలేవు. కనుక దీర్ఘకాల పెట్టుబడుల్లో నాణ్యతకు పెద్ద పీట వేయాలి. నూతన సంవత్సరం ప్రారంభమైందని చెప్పి తమ పోర్ట్‌ఫోలియోను సమూలంగా మార్పు చేసుకోవాల్సిన అవసరం అందరికీ ఏర్పడకపోవచ్చు. కాకపోతే పునఃసమీక్ష అన్నది మంచి విధానం. భవిష్యత్తులో రాబడులను ఇచ్చే విధంగా పోర్ట్‌ఫోలియో ఉందా, లేదా అన్నది సరిచూసుకోవడం ఇక్కడ కీలకమని గుర్తించాలి. రిస్క్ కొద్దీ రాబడులు అనుభవం ఉన్న పెట్టుబడిదారులు రిస్క్‌ను, రాబడులను అర్థం చేసుకోగలరు. కానీ, అవగాహన లేని ఇన్వెస్టర్లు ‘రిస్క్’ అంటే ఏంటో నష్టాల రూపంలో చూడాల్సి వస్తుంది. కనుక ఇన్వెస్టర్లు రిస్క్‌ను అర్థం చేసుకునేందుకు వారి పోర్ట్‌ఫోలియోను సూక్ష్మంగా విడదీసి చూడాలి. తమ అవసరాలకు అనుగుణంగా రీబ్యాలన్స్ (మార్పులు చేర్పులు)చేసుకోవాలి. రిస్క్‌కు అనుగుణంగా రాబడులను సర్దుబాటు చేసుకోవాలి. ప్యాసివ్ పెట్టుబడి అవకాశాలు ప్యాసివ్ ఇన్వెస్టింగ్ పట్ల భారతీయ ఇన్వెస్టర్లలోనూ క్రమంగా ఆదరణ పెరుగుతోంది. వైవిధ్యమైన పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ఇవి వీలు కల్పించడమే కాకుండా.. ఇండెక్స్‌కు అనుగుణంగా వెయిటేజీ, రాబడులకు చోటిస్తున్నాయి. ఫండ్ మేనేజర్ వైపు నుంచి పక్షపాత ఆధారిత లోపాలను అధిగమించే ఉత్పత్తులు ఇవి. ఈటీఎఫ్‌లు, ఫండ్ ఆఫ్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ రూపంలో ప్యాసివ్ పెట్టుబడులు చేసుకోవచ్చు. ఇండెక్స్కే పరిమితం అయ్యే ఉత్పత్తులు ఇవి ఎంతమాత్రం కాబోవు. థీమ్యాటిక్, రంగాల వారీ ఫండ్స్‌లోనూ ఇవి అంకురిస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లకు రాబడులపై భరోసా ఉంటుంది. లక్ష్యాల సమీక్ష గడిచిన రెండేళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయి. ప్రజల అవసరాలు, ప్రాధాన్యతలు మారిపోయాయి. కనుక ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల లక్ష్యాలను కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా సమీక్షించుకోవాలి. వివాహం తర్వాత బాధ్యత పెరిగి రీబ్యాలన్స్ అవసరం ఏర్పడవచ్చు. లేదంటే ఉన్నత విద్యకు సంబంధించిన ప్రాధాన్యతలు మారిపోయి ఉండొచ్చు. వీటికి అనుగుణంగా మీ పెట్టుబడుల లక్ష్యాల్లోనూ మార్పులు చేసుకోవాలి. మార్కెట్లో నూతన అవకాశాల కోసం చూస్తూ ఉండొచ్చు. ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు, లక్ష్యాలకు అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియో నిర్మాణంపై తప్పకుండా దృష్టి సారించాలి. గడిచిన రెండేళ్లలో.. ముఖ్యంగా కరోనా ప్రవేశం తర్వాత ప్రతీ ఒక్కరికీ ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. వ్యాపార విధానాలు, నమూనాలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీని అక్కున చేర్చుకోవాల్సి వచ్చింది. నూతనతరం టెక్నాలజీ ఆధారిత కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతున్నాయి. దీంతో ఈక్విటీ మార్కెట్ పట్ల ఇన్వెస్టర్ల వైఖరిలోనూ మార్పు వచ్చింది. 2022 అయినా స్థిరత్వాన్ని, సానుకూల పరిస్థితులను తీసుకురావాలని ఆశిద్దాం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు (హెల్త్ చెకప్) చేయించుకోవాలన్నది వైద్యుల సూచన. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియోను నిర్ణీత కాలానికోసారి సమీక్షించుకోవాలన్నది (వెల్త్ చెక్) ఆర్థిక సలహాదారులు ఇచ్చే సలహా. నూతన సంవత్సరం ఆరంభం ఇందుకు అనుకూల సందర్భంగా చూడాలి. గత సంవత్సరంలో రాబడులు ఏ మేరకు సమకూరాయి, రిస్క్ సామర్థ్యం, పెట్టుబడుల తీరు వీటన్నింటినీ పరిశీలించుకుని అస్సెట్ అలోకేషన్‌ను అమల్లో పెట్టాలి. మార్కెట్ అవకాశాలను సొంతం చేసుకునే విధంగా విధానాన్ని రూపొందించుకుని అమల్లో పెట్టాలి. – రాఘవ్ అయ్యంగార్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్, యాక్సిస్ ఏఎంసీ -
వావ్! వాట్ ఏ బ్యాలెన్స్..సోనూ వీడియో వైరల్
సాక్షి ముంబై: రియల్ హీరో సోనూసూద్ ఒకవైపు మహారాష్ట్ర మేయర్ పదవి రేసులో ఉన్నారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు ఈ వార్తలను కొట్టిపారేసిన సోనూసూద్ మాత్రం తనదైన శైలిలో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా విమానాశ్రయంలో ఎస్కెలేటర్ విన్యాసాలతో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఆటవిడుపు వీడియోను స్వయంగా ఆయనే ట్విటర్లో షేర్ చేశారు. బ్రిలియన్స్ ఆఫ్ బ్యాలెన్స్ అంటూ వీడియోన చూసి అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు. సోనూ సూద్ పర్ఫెక్ట్ బాడీతో ఫిట్నెస్ ఎంత బాగా మెయింటైన్ చేస్తారో అందరికీ తెలిసిందే. కాగా దేశంలో కరోనా మహమ్మారి మొదటి రెండు దశల్లో పంజా విసిరిన సమయంలో అనేకమంది బాధితుల పట్ల ఆపద్బాంధవుడిలా మారి రియల్ హీరో అవతరించాడు. అంతేకాదు ఇప్పటికీ నిరాటంకంగా తన సేవా కార్యక్రమాలతో గొప్ప మనసును చాటుకొంటూనే ఉన్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నారు. అటు భారీ సినిమా అవకాశాలతో వృత్తి జీవితంలో కూడా బిజీగా మారిపోయాడు సోనూ సూద్. Only if I could fly ❣️ pic.twitter.com/zNeQFLDpRP — sonu sood (@SonuSood) August 26, 2021 -
ఎయిర్‌సెల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా)ఎయిర్‌సెల్ వినియోగదారులకు ఊరటనిచ్చింది. ఎయిర్‌సెల్ కస్టమర్లకు చెందిన బ్యాలెన్స్ నగదును, సెక్యూరిటీ డిపాజిట్లను తిరిగి చెల్లించాలని ఎయిర్‌సెల్‌ను ఆదేశించింది. ఈ విషయంలో వినియోగదారుల ఫిర్యాదులపై స్పందించిన ట్రాయ్ ఈ ఆదేశాలిచ్చింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ చందాదారులకు చెందిన బకాయిలు చెల్లించాలని పేర్కొంది. మార్చి 1 , 2017నుంచి మార్చి 18 2018 మధ్య ఈ చెల్లింపులు చేయాలని ఆదేశించింది. అంతేకాదు ఈ చెల్లింపులకు సంబంధించి ప్రాంతాల వారీగా పూర్తి రిపోర్టును మే 10లోపు అందించాలని కూడా కోరింది. ఎయిర్‌సెల్ గ్రూప్ ఖాతాదారుల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని ట్రాయ్ తెలిపింది. టెలికాం చందాదారుల ప్రయోజనాన్ని కాపాడే క్రమంలో ఈ అదేశాలు జారీ చేసినట్టు వెల్లడించింది. ఎయిర్‌సెల్‌నుంచి పోర్ట్ అయిన ఖాతాలకు రీఫండ్ మొత్తాన్ని క్రెడిట్ చేయాలని, ఈ సమాచారాన్ని వారికి ఎస్ఎంఎస్ ద్వారా వినియోగదారులకు తెలియజేయాలని కోరింది. -
ఒక్క మిస్డ్ కాల్‌తో పీఎఫ్ బ్యాలెన్స్..
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం మరో వెసులుబాటును కల్పించింది. కేవలం ఒక్క మిస్డ్ కాల్తోనే ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్) బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకునే వీలుకల్పించింది. ఉద్యోగస్తులు పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను సులువుగా పొందడానికే ఈ సాంకేతికతను ప్రవేశపెట్టినట్లు కేంద్ర కార్మిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎంప్లాయీస్(ఈపీఎఫ్ఓ) స్కీమ్‌లోని ఉద్యోగులు ఎవరైతే యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యూఏఎన్) పోర్టల్‌లో కూడా రిజస్టర్ అయి ఉంటారో వారు ఈ సేవలను వినియోగించుకోవచ్చు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలు పొందే మాదిరిగానే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను కూడా తెలుసుకోవచ్చన్న మాట. యూఏఎన్ పోర్టల్‌లో ఉద్యోగులు పేర్కొన్న తమ ఫోన్ నెంబర్ నుంచి 011-22901406 కు మిస్డ్ కాల్ ఇస్తే చాలూ.. వెంటనే వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా అందుతాయి. ఈ సర్వీస్‌కు ఎలాంటి చార్జీలు ఉండబోవని కార్మిక శాఖ తెలిపింది. అదే విధంగా రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ‘EPFOHO UAN’ అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా కూడా వివరాలు పొందవచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో బ్యాలెన్స్ వివరాలు పొందవచ్చని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. -
'ఏమిచ్చాన్రా నేను మీకు. ఆస్తులిచ్చానా ఏదైనా ఇచ్చానా?
జీవితంలో బంధాలు, అనుబంధాలు ఉంటే అంతకు మించిన సిరి లేదు. బడ్జెట్లు వస్తాయి. పోతాయి. మధ్య తరగతికి వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకచోట తగ్గితే ఇంకోచోట పెరుగుతుంది. ప్రభుత్వాల పనే అది.. బ్యాలెన్స్ చెయ్యడం! డబ్బుతో.. కిందా మీదా అయ్యే రిలేషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడం మన పనే. ఇంట్లో సంతోషం ఉంటే డబ్బు ఉన్నట్లే. సిరిచెట్టు ఉన్నట్లే. ‘డబ్బులు... చెట్లకు కాస్తాయా?’ అంటారు! కాయవు. కానీ సిరిచెట్టుకు సంతోషం కాస్తుంది. అంతకు మించిన సంపద ఏముంటుంది? ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో క్లైమాక్స్ సీన్. పెళ్లి మండపంలో వెంకటేశ్, మహేశ్‌బాబు కూర్చొని ఉంటారు. వాళ్లను వెతుక్కుంటూ వస్తాడు ప్రకాష్‌రాజ్. వచ్చి ఇద్దరి మధ్యా కూర్చుంటాడు. వాళ్లిద్దరూ కొడుకులు. ఆయన తండ్రి. ‘‘ఏమిచ్చాన్రా నేను మీకు. ఆస్తులిచ్చానా ఏదైనా ఇచ్చానా? రెక్కలిచ్చాను... పోరాడండ్రా అని. ఒక సామాన్యుడిగా.. మనం ఏమివ్వగలంరా ఈ సమాజానికి? ప్రేమతో కూడిన ఒక మంచి కుటుంబం తప్ప. దానికి మించింది ఇంకేదైనా ఉందేంట్రా? ఆ భగవంతుడిని మన కోసం ఏం కోరుకోనక్కర్లేదురా. అలా కోరుకోవాల్సి వస్తే పక్కోడి గురించి కోరుకోవాలి. భగవంతుడా నిజాయితీ బతికే ఏ ఒక్కడినీ చిరునవ్వుకు దూరం చేయకు తండ్రీ.. చిరునవ్వు నుంచి దూరం చెయ్యకు’’ అని.. అంటాడు. చిరునవ్వు ఎక్కడి నుంచి వస్తుంది? అనుబంధాల నుంచి. అనుబంధాలు ఎక్కడి నుంచి వస్తాయి? డబ్బు నుంచా? డబ్బు లేకపోవడం నుంచా? కలిమి లేములు.. కష్టసుఖాలు చేతిలో డబ్బుంటే నొప్పి తెలీదు. నొప్పి తెలియడం లేదని ఖర్చు పెట్టేస్తే చెయ్యే ఉండదు. అదీ డబ్బు వ్యాల్యూ. మరి చేతికి వ్యాల్యూ లేదా? ఉంటుంది. పట్టు విడుపులు ఉన్న చేతికి మాత్రమే ఆ వ్యాల్యూ ఉంటుంది. డబ్బుని ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకోవాలి. ఎక్కడ వదలాలో అక్కడ వదలాలి. పట్టుకోవడం కోసం వదిలేవాడు బిజినెస్‌మేన్. వదల్లేక వదల్లేక పట్టుకునేవాడు టాక్స్‌పేయర్. పట్టు బిగించడం కోసం వదిలేసేవాడు ఇన్వెస్టర్. పట్టు విడుపులు పట్టనివాడు కన్జ్యూమర్. ఏవరేజ్ కుటుంబీకుడు. ఏ బడ్జెట్ అయినా టోటల్‌గా ఈ నలుగురి చుట్టూనే తిరుగుతుంది. నిన్న జైట్లీ బడ్జెట్ కూడా ఇంతే. సుఖ దుఃఖాలన్నీ ఈ నలుగురివే. లాభ నష్టాలన్నీ ఈ నలుగురికే. ఆర్థిక లోకంలోని స్వర్గం నరకం ఈ నలుగురి కోసమే! బడ్జెట్‌ని బట్టి కలిమి లేములు.. కష్టసుఖాలు. మనుషుల్లోనే ఎక్కువ తక్కువలు చేతిలో ఉన్న పది నోటు.. అది మిగులైనా, తగులైనా.. అందులోంచి మళ్లీ.. వచ్చే రూపాయి, పోయే రూపాయి అని బడ్జెట్ వేసుకునే మనుషులమే మనమందరం. ఊహించని విధంగా వచ్చిన ఒక్క నోటుతో.. స్విచ్ వేసినట్లుగా మన ముఖం వెలిగిపోతుంది. ఊహించని విధంగా చెయ్యిజారిన ఒక్క నోటుతో ‘టప్’మన్న బల్బులా మన ముఖం మాడిపోతుంది. డబ్బులో ఎక్కువ తక్కువలుండొచ్చు. డబ్బు దగ్గర మాత్రం అందరూ ఒక్కటే. రూపాయొస్తే సంతోషం. రూపాయి పోతే సారో ఫీలింగ్. లోక్‌సభలో జైట్లీ మొన్న.. సూట్‌కేస్ ఓపెన్ చేస్తున్నప్పుడు లోపలంతా సీరియస్‌గా కూర్చొని ఉన్నారు. రాష్ట్రపతికీ, ఉప రాష్ట్రపతికీ, గవర్నర్లకు జీతాలు పెరుగుతున్నాయ్ అని బడ్జెట్ చదువుతూ, జైట్లీ ప్రకటించగానే ఎంపీల ముఖాల్లో ఒక్కసారిగా చిరునవ్వులు విరిశాయి! వాళ్లకు పెరిగితే ఆటోమేటిగ్గా వీళ్లకు పెరుగుతాయి. అదీ సంతోషం. ఎందుకంత సంతోషం? వాళ్లకేం తక్కువ? తక్కువనీ కాదు, ఎక్కువనీ కాదు. పెరగడం సంతోషం. డినామినేషన్ ఎంతైనా డబ్బు డబ్బే. అదొక డివైన్ గిఫ్ట్. మోదీ ఇచ్చేదో, జైట్లీ ఇచ్చేదో కాదు. దేవుడిచ్చిన నోటు. కింద పడిన నోటును ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రింట్ కొట్టేవాడైనా కళ్లకు అద్దుకోవాల్సిందే. పెట్టినంత పెట్టాలి మనిషికి దేవుడు రెండు చేతులు ఇచ్చింది.. పట్టినంత తీసుకుని, పెట్టినంత పెట్టమనే! కోట్ బాగుంది. ఎవరి కోట్ అయి వుంటుంది? బాగా డబ్బున్న మనిషిదా? డబ్బులేని బికారిదా? చూశారా.. డబ్బున్న వాళ్లను మనిషి అనీ, డబ్బు లేని మనిషిని బికారి అనీ అనేస్తున్నాం. డబ్బు ఉన్నవాళ్లు, లేనివాళ్లు ఎలా ఉంటారో చెప్పలేం. ఏం ఆలోచిస్తారో చెప్పలేం. కానీ డబ్బు ఉన్నవాళ్ల పట్ల, లేనివాళ్ల పట్ల మనం ఎలాగుంటామో మన మనసుకు తెలుసు. ఎవరు ఎలా ఉన్నా.. ఇవ్వడం అనేది గొప్ప. డబ్బు ఇవ్వడం ఇంకా గొప్ప. కష్టపడి సంపాదించినదాన్ని ఇష్టపడి ఇవ్వడం మరీ మరీ గొప్ప. గొప్పే కానీ, డబ్బు దగ్గర జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విలువ తెలియనివాళ్లకు డబ్బివ్వడం.. డబ్బు అవసరం లేనివాళ్లకు పిలిచి డబ్బివ్వడమే! మన కష్టం విలువను మనం తగ్గించుకున్నట్లు. తాత్వికులు చాలా చెప్తారు. డబ్బుదేముంది? పోయేటప్పుడు కట్టకట్టుకుపోతామా అని! పోము నిజమే. ఉన్నప్పుడు (డబ్బు కాదు.. మనుషులం) పోయినట్లు ఎందుకుండాలి? ఎలాగూ పోతాం కదా అని చేతిలోనిది ఎందుకు పోగొట్టుకోవాలి? డబ్బుకు ఎన్ని మరకలైనా అంటుకోవచ్చు. చెల్లుబాటు అవుతుంది. ఫిలాసఫీ అంటుకోకూడదు. జీవితాన్ని చెల్లుబాటు కాకుండా చేస్తుంది. ‘డబ్బు బ్రెయిన్లో ఉండాలి కానీ హార్ట్‌లో ఉండకూడదు’ అంటాడు జొన్నాథన్ స్విఫ్ట్. ఆయన సెటైరిస్టు. అందుకని అలా అనలేదు. డబ్బంటే కూడికలు, తీసివేతల లెక్క. లెక్కల్లో గుండె.. పూర్ స్టూడెంట్. ఆన్సర్లు కరెక్టుగా చేయలేదు. బ్రెయిన్.. క్లవర్ స్టూడెంట్. పర్ఫెక్టుగా చేస్తుంది. చివరికి మిగిలిందేదో అదే.. గుండె ఉన్నవాడి ఆన్సర్. చివరికి ఏం మిగలాలో అదే.. బ్రెయిన్ ఉన్నవాడి ఆన్సర్. లేనప్పుడే ఉన్నట్లుండాలి డబ్బు విషయంలో నిజాయితీ, ఉదారత పనికిరావంటాడు చాణక్యుడు. మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని గురువు ఈయన. ఆయన రాసిన ‘అర్థశాస్త్రం’ రెండువేల మూడొందల ఏళ్ల తర్వాత కూడా ఇవాళ్టికీ ప్రపంచ దేశాలకు ఒక ఎకనమిక్ గైడ్. కష్టం వచ్చినప్పుడు మనిషి దేవుడివైపు చూసినట్టుగా, చేతిలో డబ్బుల్లేనప్పుడు అగ్రరాజ్యాలు సైతం చాణక్యుడి బుక్‌ని తిరగేస్తాయి. ‘పూట గడవడం ఎలా?’ అని తెలుసుకోవడం కోసం. అయితే అంత ‘లేని పరిస్థితి’ ఎందుకొస్తుంది! ఉన్నవాళ్లు లేనివాళ్లకు ఇస్తే సమాజం ‘ఈక్వల్ ఈక్వల్’ అవుతుందంటుంది కమ్యూనిజం. ఉన్నవాళ్లు వ్యాపారాలు చేస్తే సమాజం ‘డెవలప్’ అవుతుంది అంటుంది క్యాపిటలిజం. ప్రపంచంలో కమ్యూనిస్టులూ ఉన్నారు, క్యాపిటలిస్టులూ ఉన్నారు. సహజంగానే ఈ రెండు ఇజాల మధ్యా క్లాష్ మొదలౌతుంది. అభివృద్ధితో సమానంగా అసమానతలూ పెరిగితే క్లాష్ కాక మరేమొస్తుంది? చివరికది ‘క్యాష్ క్రంచ్’కి దారితీస్తుంది. ఏ పాపమూ తెలియని డబ్బు నలిగిపోతుంది. బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మళ్లీ చాణక్యుడు సీన్లోకి వస్తాడు. డబ్బు ఒకేచోట ఉండిపోకూడదు. ఒకే దారిలో తిరక్కూడదు. ఎప్పుడూ ఒకే పని చేస్తుండకూడదు. ఇవన్నీ పెద్ద పెద్దవాళ్లకు. డబ్బే లోకంగా బతక్కూడదు. డబ్బు ఏ దారిలో ఉంటే ఆ దారిలోకి వెళ్లిపోకూడదు. డబ్బును దాచేయడమే జీవిత లక్ష్యం కాకూడదు. ఇవన్నీ చిన్న చిన్నవాళ్లకు. బంధాల వల్లే విలువ చేతి నిండా డబ్బుండీ ఊరికే కూర్చుంటే ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉన్నా సరే, ఆ డబ్బుకు వ్యాల్యూ ఉండదు!చేతిలో అసలేం లేకుండా అవీ ఇవీ ఇంటికి తెచ్చేసుకుంటూ ఉంటే.. ఎన్ని సౌఖ్యాలున్నా ఆ మనిషికి వ్యాల్యూ ఉండదు.డబ్బుని కష్టపడి సంపాదించాలి. జాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. అప్పుడే ఆ డబ్బుకి, ఆ మనిషికి విలువ. ఇలాంటి విలువే బంధాలను, అనుబంధా లను నిలబెడుతుంది. ఆ నిలబెట్టే వ్యాల్యూ ‘మనీ’ది కాదు. మనిషిది! సుఖ దుఃఖాల లెక్క చార్ల్ డికెన్స్ లెక్క ఒకటి ఉంది. వార్షిక ఆదాయం 20 పౌండ్లు. వార్షిక వ్యయం 19 పౌండ్ల 6 షిల్లింగ్స్. ఫలితం.. సంతోషం. వార్షిక ఆదాయం 20 పౌండ్లు. వార్షిక వ్యయం 20 పౌండ్ల 6 షిల్లింగ్స్. ఫలితం.. విచారం. డబ్బు లెక్క ఇలాగే ఉండాలి. దేశానికైనా, మనిషికైనా. సూట్‌కేస్‌లోని బడ్జెట్‌కైనా, పర్సులోని అరల్లోనైనా. చార్ల్స్ ఆర్థికవేత్త కాదు. చాణక్యుడు కాదు. డబ్బుల్లేని మనిషి. డబ్బుల్లేక పస్తులున్న మనిషి. తండ్రి చేసిన అప్పుల్ని తీర్చడానికి ఉద్యోగం చేసిన మనిషి. తల్లికి, తోబుట్టువులకు ఇంత గోధుమ రొట్టెను సంపాదించడానికి రెక్కలు ముక్కలు చేసుకున్న మనిషి. పుస్తకాలు రాయడం కూడా నాలుగు పౌండ్ల కోసమే చేసిన మనిషి. ‘డేవిడ్ కాపర్ఫీల్డ్’ ఆయన ఆటోబయోగ్రఫీ. అందులో డబ్బు గురించేమీ లేదు. కానీ డబ్బున్నవాళ్లు, డబ్బు లేనివాళ్లు, డబ్బంటే ఇంట్రెస్ట్ లేనివాళ్లు కూడా చదవాల్సిన పుస్తకం. బుక్‌గా వెయ్యకూడదనుకున్నాడు చార్ల్స్ మొదట. ‘నా తలనొప్పులెందుకు ఈ ప్రపంచానికి?’ అనుకున్నాడు. కానీ పబ్లిషర్లు వేయించారు. ముందు సీరియల్‌గా (1849–59), తర్వాత బుక్‌గా! బ్రిటన్‌లో ఆ సీరియల్‌ని అప్పట్లో చదవనివారు దాదాపుగా లేరు. -
ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త
-
బడ్జెట్... బ్యాలెన్స్ నేర్పిస్తున్నారా?
సెల్ఫ్ చెక్ పిల్లల సరదాల్లో డబ్బు వాడకమూ ఉంటుంది. పెద్దయితే తామే షాపుకెళ్లి కొనుక్కోవచ్చు అనుకుంటుంటారు. వారికి ఖర్చు, పొదుపు నేర్పిస్తున్నారా? 1. కిడ్డీబ్యాంకులో డబ్బును దాచుకోవడం అలవాటు చేశారు. ఎ. అవును బి. కాదు 2. దాచుకున్న డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారో తెలుసుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. దగ్గరలో ఉన్న దుకాణం నుంచి ఇంట్లోకి కావల్సిన చిన్న చిన్న వస్తువులను తీసుకురావడం నేర్పించారు. ఎ. అవును బి. కాదు 4. ఇలా చేస్తే పెద్దవాళ్లలాగా తాము కూడా లావాదేవీ నిర్వహించేటంత పరిణితి చెందినట్లుగా భావించి పిల్లలు సంతోషపడతారని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 5. సొంతంగా కొంటే నాణ్యమైన వస్తువుల కోసం వాకబు చేయడం, జాగ్రత్తగా లెక్క చూసుకోవడం అలవాటవుతాయని కూడా అలా చేస్తారు. ఎ. అవును బి. కాదు 6. అనవసరమైనవి కొనాలనుకుంటున్నట్లు తెలిసి మీ పెద్దరికంతో ఖండిస్తే ‘ఇవి నా డబ్బులే కదా, నా కిష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకోనివ్వరా’ అనుకుని పిల్లలు మొండిగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎ. అవును బి. కాదు 7. అందుకే పిల్లలు కొనాలనుకుంటున్న వస్తువుకు ఎంత, దాని అవసరం అంతటి ప్రాధాన్యం ఉన్నదా? అని చిన్న చిన్న ప్రశ్నలతో విషయం వాళ్లకే అర్థమయ్యేటట్లు చేస్తారు. ఎ. అవును బి. కాదు 8. దాచుకున్న డబ్బుని సామాజిక సేవకు, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు విరాళంగా ఇవ్వడాన్ని ప్రోత్సహిస్తారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఎక్కువగా వస్తే పిల్లలకు మనీమేనేజ్‌మెంట్ మీద అవగాహన కలిగిస్తున్నారు. ఈ అలవాటు ఆర్థిక నిర్వహణను మాత్రమే కాకుండా దానికి అనుబంధంగా అనేక సామాజిక అంశాల్లో అవగాహనను పెంచుతుంది. ‘బి’లు ఎక్కువైతే... మీరు పిల్లలను డబ్బుకు దూరంగా ఉంచుతున్నారు. దుబారా చేయకుండా, అమాయకంగా కొనకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచి సొంతంగా కొనడం అలవాటు చేస్తేనే మంచిది. -
నాలుగైదు రోజుల్లో ‘కంది’ బకాయిల చెల్లింపు
అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం • కంది సాగు పెరగడంతో ఆశించిన ధర రావడం లేదు • ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలూ కారణమే • పప్పు ధాన్యాల ఎగుమతులపై నిషేధం ఎత్తివేయాలి • దిగుమతులపై సుంకాలు విధించాలని కేంద్రానికి విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: కంది రైతులకు బకాయి పడిన రూ.150 కోట్లను నాలుగైదు రోజుల్లో చెల్లిస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. మార్క్‌ఫెడ్, నాఫెడ్ తదితర ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి కంది పంటను కొనుగోలు చేసినా సొమ్ము చెల్లించని వైనాన్ని వివరిస్తూ.. మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘పైసలేవి సారూ!’ కథనంపై ఆయన స్పం దించారు. కంది క్రయ విక్రయాలు, వ్యవ సాయ మార్కెట్లలో తాజా పరిస్థితిపై సమీక్షించారు. చిట్టచివరి గింజ వరకు కంది కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 90 కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటివరకు 74 వేల టన్నులు కొనుగోలు చేశామన్నారు. ఇప్పటివరకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో నాఫెడ్ సంస్థ 49వేల టన్నులు కొనుగోలు చేసిందని, ఎఫ్‌సీఐ 25 వేల టన్నులు కొనుగోలు చేసిందని చెప్పారు. రైతులకు బకాయి పడిన రూ.150 కోట్లను నాలుగైదు రోజుల్లో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగు పెరగడంతో.. రాష్ట్రంలో ఇంతకు ముందు 2.47 లక్షల హెక్టార్ల కంది సాగు జరిగేదని, ఇప్పుడు 4.35 లక్షల హెక్టార్లకు పెరగడంతో.. రైతులకు ఆశించిన ధర లభించడం లేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. అయితే కనీస మద్దతు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుం దని చెప్పారు. కంది తదితర పంటల మార్కెట్ ధరలను కేంద్ర ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయాలు ప్రభావితం చేస్తున్నాయ న్నారు. ఎగుమతి, దిగుమతులకు సంబంధిం చి మొజాంబిక్, టాంజానియా, మయన్మార్ తదితర ఆఫ్రికా దేశాలతో కేంద్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం తెలంగాణ కంది రైతులకు నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. 2016–17లో లక్ష టన్నులు, మరో మూడేళ్లలో 2 లక్షల టన్నుల కందిని దిగుమతి చేసు కోవడానికి కేంద్రం ఎంవోయూ చేసుకోవడం, శనగలు మినహా మిగతా పప్పు ధాన్యాల ఎగుమతిని కేంద్ర ప్రభుత్వ 2006 ఎగుమతి విధానంలో నిషేధించడంతో ఈ సమస్య తలె త్తిందన్నారు. అంతేగాకుండా పప్పు ధాన్యాల దిగుమతులపై సుంకాన్ని ఎత్తివేసిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను పునఃసమీక్షించుకోవాలని, దిగుమతులపై సుంకాన్ని పెంచితేనే దేశంలోని రైతులకు మంచి ధర లభిస్తుందని స్పష్టం చేస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్‌కు తాను ఇదివరకే లేఖ రాశానని మంత్రి వెల్లడించారు. పప్పుధాన్యాల ఎగుమతి విధానాన్ని సులభతరం చేయాలని.. నిల్వలపై ఆంక్షలు ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లోనూ ఈసారి భారీగా కంది దిగుబడులు వచ్చినందున మార్కెట్లో ధర తగ్గినట్టు మంత్రి విశ్లేషించారు. కంది రైతుల సమస్యలు, ఫిర్యాదుల కోసం జనవరి 21న ప్రారంభించిన కాల్ సెంటర్ పనితీరును సమీక్షించారు. దీనికి ఇప్పటివరకు 305కు పైగా ఫిర్యాదులు అందినట్టు మార్కెటింగ్ అధికారులు మంత్రి దృష్టికి తీసు కొచ్చారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్య లు తీసుకోవాలని హరీశ్ ఆదేశించారు. -
ఆటో ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
కర్నూలు : కర్నూలు శివారులోని కట్టమంచి స్కూలు వద్ద ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కేశవరెడ్డి స్కూలులో పోస్టుమెన్ పరీక్ష రాసేందుకు కృష్ణనగర్‌కు చెందిన నాగరాజు కూతురు, నల్లబోతుల మాధవిలత, ఏలూరుకు చెందిన రాజేశ్వరరెడ్డి కుమారుడు సత్యశేఖర్ బిర్లాగేటు వద్ద ఆటో ఎక్కారు. కట్టమంచి స్కూలు యూటర్న్ దగ్గర ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు చేతులు విరిగాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ బోల్తా..యువకుడు మృతి
– రామచంద్రాపురంలో విషాదం పత్తికొండ టౌన్: బైక్ అదుపుతప్పి బోల్తాపడడంతో యశ్వంత్(24) అనే యువకుడు మృత్యువాతపడ్డాడు. శుక్రవారం అర్ధరాత్రి రామచంద్రాపురం కొట్టాల గ్రామ సమీపంలో ఈ దర్ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రమేష్, శ్రీకళ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం చేశారు. కుమారుడు యశ్వంత్ డిగ్రీ మధ్యలో మానివేసి, టమాట వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. పత్తికొండకు పనిమీద వచ్చి..శుక్రవారం రాత్రి తిరిగి గ్రామానికి వెళ్లేటపుడు రామచంద్రాపురం కొట్టాలకు సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంతలో పడ్డాడు. ప్రమాదంలో యశ్వంత్ అక్కడిక్కడే మృతిచెందాడు.రాత్రివేళ కావడంతో ప్రమాదం జరిగిన విషయం ఎవరికి తెలియలేదు. ఉదయం పత్తికొండకు వస్తున్న గ్రామస్తులు గమనించి యువకుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. యువకుడు మృతిచెందిన సమాచారం తెలుసుకుని శనివారం ఉదయం కేడీసీసీ మాజీవైస్‌చైర్మన్ రామచంద్రారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి తదితరులు యశ్వంత్ కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢసంతాపాన్ని తెలియజేశారు. -
బైక్‌పై నుంచి పడి మహిళ మృతి
చనుగొండ్ల(గూడూరు రూరల్): చనుగొండ్ల గ్రామ పొలిమేరలో బైక్‌పై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. పుసులూరుకు చెందిన చిన్నస్వాములు భార్య సులోచన(30) బిడ్డ మానసతో కలిసి బైక్‌పై పుట్టినిల్లు అయిన గూడూరుకు బయలుదేరింది. కోడుమూరు సమీపంలోని చనుగొండ్ల పొలిమేరలో అదుపుతప్పి బైక్‌పై నుంచి పడ్డారు. గాయాలైన తల్లిబిడ్డకు 108లో కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా సులోచన మార్గమధ్యంలోనే మృతిచెందింది. గూడూరు ఎస్ఐ చంద్రబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
వాలెట్ యూజర్లకు సూక్ష్మ రుణాలు
* రూ.500-2,500 రేంజ్లో * అందిస్తున్న మోబిక్విక్ న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ మోబిక్విక్ తన సేవలను మరింతగా విస్తరిస్తోంది. బ్యాలెన్స్ అయిపోయిన వాలెట్ యూజర్లకు తక్షణ సూక్ష్మ రుణాలను (రూ.500-2,500 రేంజ్లో)ఆఫర్ చేస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం జోరు పెంచడానికి ఈ రుణాలను ఆఫర్ చేస్తున్నామని మోబిక్విక్ తెలిపింది. ప్రయోగాత్మకంగా ఈ ఇన్స్టంట్ మైక్రోలోన్స్ను కొన్ని వారాల క్రితమే ప్రారంభించామని మోబిక్విక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉపాసన తకు చెప్పారు. ఇప్పటికే 25వేల మంది యూజర్లకు ఈ రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ రుణాలు తీసుకున్నవాళ్ల చెల్లింపులు 97 శాతంగా ఉన్నాయని, ఈ కొత్త సర్వీస్ సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ సర్వీస్‌ను మరింతగా విస్తరించాలనుకుంటున్నామని వివరించారు. కన్సూమర్ లెండింగ్ మార్కెట్ ప్లేస్ క్యాష్‌కేర్ భాగస్వామ్యంతో ఈ సర్వీస్‌ను అందిస్తున్నామని వివరించారు. వచ్చే కొన్నినెలల్లో 2-3 లక్షల మంది యూజర్లకు ఈ రుణాలివ్వనున్నట్లు తెలిపారు. -
ఆర్టీసీ టికెట్.. జేబు కట్
రేసుగుర్రం సినిమాలో హీరోయిన్ ఎవరు? మహేష్‌బాబు శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? సమాధానం మీకు తెలిస్తే వెంటనే కింది నంబరుకు ఫోన్ చేయండి. షరతులు వర్తిస్తాయి. నిమిషానికి రూ.6 స్టాండర్డ్ చార్జీలు వర్తిస్తాయి. డబ్బంటే ఎవరికి చేదు?. అందులోనూ ఊరక వచ్చేదంటే మరీనూ. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి, సినీ జ్ఞానం ఉన్న పలువురు అమాయకులు ఆశతో ఒక ప్రశ్నకు ఠక్కున సమాధానం చెప్పేద్దాంలే..అని ఆర్టీసీ టికెట్ వెనుక ఉన్న ప్రకటనలోని నంబరుకు ఫోన్ చేస్తున్నారు. ఆ కంప్యూటర్ వాయిస్‌లో వచ్చే వరుస ప్రశ్నలకు వరుసగా సమాధానం చెబుతున్నారు. చివరగా మీ నంబరు మా కంప్యూటర్లో నమోదైంది, మీ నంబరుకు ఫ్రైజు వస్తే రూ.లక్ష బహుమానం మీ ఇంటికి పంపుతామన్న చావు కబురుతో ఫోన్ పెట్టేస్తున్నారు. అనంతరం ఫోన్లోని బాలెన్స్ మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోయి ఉండడాన్ని చూసి అవాక్కవుతున్నారు. ఇలా ఎందరో అమాయకులు బలవుతున్నారు. పుంగనూరుటౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు సరిపడా చిల్లర ఇవ్వకపోతే కండక్టర్ టికెట్ వెనుక ప్ర యాణికుడికి తిరిగి ఇవ్వాల్సిన నగ దు ఎంత అన్న విషయం రాసి ఇచ్చి.. దిగే సమయంలో తీసుకోమంటాడు. ఇది నిన్నటి వరకు జరుగుతున్న తం తు. కానీ నేడు కండెక్టర్‌కు ఆర్టీసీ ఆ అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే టికెట్ వెనుక వైపు మొత్తం వ్యాపార ప్రకటనలను ప్రచురిస్తోంది. వాటిని నమ్మి ఫోన్ చేసి, పలువురు అమాయకులు తమ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు. సాధారణంగా టికెట్లకు కావాల్సిన ప్రింటింగ్ మెటీరియల్ (పేపర్‌రోల్స్) ఆర్టీసీ బయటి ఏజెన్సీల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్టీసీ నేడు నష్టాల్లో నడుస్తోంది. ఈ నేపథ్యంలో నష్టాలను తగ్గించుకునేం దుకు ఆర్టీసీ తమ టికెట్ల వెనుక ప్రకటనలు వేసుకోవచ్చని, అందుకు తమ సంస్థకు కొంత మొత్తం చెల్లించాలని ప్రకటించింది. ఈ క్రమంలో పలు సం స్థలు తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడానికి మొదట కొన్ని వ్యాపారసంస్థలు ముందుకు వచ్చాయి. ఆ తర్వాత విడుదలకు సిద్ధమైన సినిమా ల ప్రకటనలు వస్తుండేవి. ఇటీవల కొత్తగా బంగారం గెలుచుకోండి. లక్ష రూపాయలు గెలిచే లక్కీచాన్స్ మీదే అంటూ హైదరాబాద్‌కు చెందిన వాయిస్ సర్వీసెస్ ప్రకటనలు మొదలయ్యాయి. పోనీ ఇంతవరకు ఈ స్కీంలో గెలిచినవారెవరైనా ఉన్నది ఎక్కడా ఎవరికీ తెలియదు. ఫోన్ చేసినపుడు వారు చెప్పిన వెబ్అడ్రస్ ఠీఠీఠీ.ఠిౌజీఛ్ఛిట్ఛటఠి జీఛ్ఛిట.జీలో వెతికినా ఆర్టీసీకి వారికి గల సంబంధంపై ఎ లాంటి సమాచారం కానీ, ఫోన్ ద్వా రా సమాధానాలు చెప్పిన వారి వివరాలు గానీ ఏవీ తెలియవు. ఇలా ప్రజ ల ఆశలను పెట్టుబడిగా చేసుకుని కో ట్లాది రూపాయలు ఆర్జించే వారికి ఓ ప్రభుత్వ రంగసంస్థ సహకారం అం దించడమేమిటని సర్వత్రావిమర్శలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఇలాంటి మోసపూరిత ప్రకటనలకు ఆర్టీసీ స్వస్తి చెప్పి ప్రజలకు విలువైన సేవలు అందించాలని కోరుతున్నారు. -
దగాపడుతున్న రైతన్న
తూకంలో మోసం చేస్తున్న ఎరువుల కంపెనీలు 50 కేజీల బస్తాలో 3 నుంచి 6 కేజీల వరకు తగ్గుదల అధికారుల తనిఖీలో వెల్లడైన వాస్తవం అన్నం పెట్టే రైతన్న అడుగడుగునా దగా పడుతున్నాడు. అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఎరువుల కంపెనీలు సైతం మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ విషయం తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారులు శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో వెల్లడైంది. నరసరావుపేట వెస్ట్ : సాధారణ తనిఖీల్లో భాగంగా తూనికలు, కొలతల శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ చల్లా దయాకరరెడ్డి వినుకొండ రోడ్డులోని సెంట్రల్ వేర్‌హౌసింగ్ గోడౌన్లను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. ఆ సమయంలో గోడౌన్లో స్పిక్, కోరమాండల్ కంపెనీకి చెందిన గ్రోమోర్ పారీ సూపర్, ఎంవోపీ (పోటాషియం), పీపీఎల్ నవరత్న (డీఏపీ) ఎరువులకు చెందిన వేలాది బస్తాలు షాపులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి నుంచి ప్రతి రకానికి చెందిన 32 బస్తాలను ఎలక్ట్రానిక్ కాటా సహాయంతో తూకం వేయగా దిమ్మె తిరిగే వాస్తవం బయటపడింది. కాటాల్లో కోరమాండల్ పారీ సూపర్ కంపెనీకి చెందిన 50 కేజీల 32 బస్తాలను కాటా వేయగా వాటిలో 16 బస్తాల్లో తూకంలో తేడాలు ఉన్నట్టు గుర్తించారు. ఒక్కో బస్తాలో 1 నుంచి 6 కేజీల వరకు తక్కువగా ఉన్నాయి. అలాగే కోరమాండల్ ఎంవోపీ (పొటాషియం) 32 బస్తాలను తూకం వేయగా ఒక్కో బస్తాలో 3 కేజీల వరకు త గ్గుదల ఉందని ఇన్స్పెక్టర్ దయాకరరెడ్డి చెప్పారు. పీపీఎల్ నవరత్న డీఏపీ బస్తాలను తూకం వేయగా 8 బస్తాల్లో 5 కేజీల వరకు తూకం తగ్గిందన్నారు. ప్రతి బస్తా గోనె సంచితో కలిపి 50 కేజీల 120 గ్రాములు ఉండాల్సి ఉండగా 49.600 గ్రాములే ఉన్నాయన్నారు. కంపెనీలకు నోటీసులు ఇచ్చి కేసులు నమోదు చేస్తాం తనిఖీల్లో బయటపడిన వాస్తవాలపై ఆయా కంపెనీలకు నోటీసులు జారీచేసి, ఆ కంపెనీలపై కేసు నమోదు చేస్తామని ఇన్స్పెక్టర్ దయాకరరెడ్డి విలేకర్లకు చెప్పారు. రైతులు కొనుగోలు చేసే సమయంలో ప్రతి బస్తాను కాటా వేసుకొని తూకాన్ని నిర్థారించుకున్న తర్వాతనే తీసుకోవాలని ఆయన సూచించారు. -
రెండోసారి పక్షవాతాన్ని నివారించుకోండి
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా దగ్గరి బంధువుల్లో ఒకరి వయసు 47. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోందని గొడవపెడ్తున్నాడు. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దీన్ని నివారించలేమా? - అరవింద్‌కుమార్, దిల్సుఖ్నగర్ అకస్మాత్తుగా కలిగే పరిణామం ఏదైనా సరే... అంటే మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... ఇవన్నీ పక్షవాత లక్షణాలే. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. నా వయసు 35. నాకు గత 16 ఏళ్లుగా ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అది నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. దీని తీవ్రత ఎంతగా ఉంటుందంటే నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయి కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాడు. వాడి వయసు ఎనిమిదేళ్లు. ఇది వంశపారంపర్యంగా వచ్చే సమస్యా? నాకు తగిన సలహా ఇవ్వండి. - వసుంధర, మహబూబ్‌నగర్ తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ అనేది కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ బి. చంద్రశేఖరరెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదారాబాద్ -
నిల్చుంటే బ్యాలెన్స్ తప్పుతోంది...
ఇఎన్‌టి కౌన్సెలింగ్ నా వయసు 47 ఏళ్లు. నాకు అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. కొన్నిసార్లు కింద పడిపోవడం కూడా జరిగింది. నాకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. ఒక డాక్టర్‌ను సంప్రదించి, బీపీ, షుగర్ పరీక్షలు కూడా చేయించుకున్నాను. అన్నీ నార్మల్ అని రిపోర్టులు వచ్చాయి. ఈ సమస్యతో నాకు చాలా ఆందోళనగా ఉంది. నాకు తగిన సలహా ఇవ్వండి. - వెంకటేశ్వరరావు, కోదాడ మీరు చెప్పిన వివరాలు పరిశీలిస్తే మీరు ‘బినైన్ పొజిషనల్ వర్టిగో’ అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. మన చెవిలోని లోపలి భాగంలో వినికిడి కోసం, బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు... రెండు వ్యవస్థలు ఉంటాయి. బ్యాలెన్స్ నియంత్రించే వ్యవస్థలను ‘వెస్టిబ్యులర్ వ్యవస్థ’ అంటారు. ఇందులో భాగాలలో ఓటోలిత్ అనే కణాలు, హెయిర్ సెల్స్, ఇతర భాగాలు ఉంటాయి. ఇవి మన బ్యాలెన్స్‌ను నియంత్రించేందుకు ఉపయోగపడతాయి. వాటిలోని లోపాల వల్ల బ్యాలెన్స్ వ్యవస్థలో లోపాలు రావడానికి అవకాశం ఉంది. మీరు మొదట నిపుణులైన ఈఎన్టీ వైద్యులను సంప్రదించి వినికిడి, బ్యాలెన్స్ వ్యవస్థకు సంబంధించిన క్లినికల్ పరీక్షలు చేయించుకోండి. కళ్లు తిరగడంతో పాటు తలనొప్పి, వినికిడి లోపం, ఇతర సమస్యలు ఉన్నట్లయితే ఈఎన్టీ వైద్యుల సలహాపై న్యూరాలజిస్ట్‌ను కూడా సంప్రదించండి. అయితే ఈ సమస్య అంత ప్రమాదకరమైనది కాదు. కొన్ని రకాల వెస్టిబ్యుల్‌కు సంబంధించిన ఎక్సర్‌సైజులతో తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి కొన్ని మందులు వాడాల్సి ఉంది. ఆందోళన పడాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. నాకు నత్తి వస్తోంది. త్వరత్వరగా మాట్లాడినప్పుడు నత్తి ఎక్కువవుతోంది. దాంతో ఎవరితోనూ మాట్లాడలేకపోతున్నాను. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియజేయగలరు. - వి. రమేశ్, జనగామ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. దీనికి గల ముఖ్య కారణాల్లో జన్యుపరమైన అంశం ప్రధానమైనది. మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి మీరు మొదట అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించవలసి ఉంటుంది. కొన్నిసార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడితే ఈ సమస్య ఎక్కువవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడు ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషించండి. ఇలా నత్తిని అధిగమించినవారు చాలామందే ఉన్నారు. మీ అంతట మీరు సమస్యనుంచి బయటపడలేకపోతే స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల నుంచి కౌన్సెలింగ్ తీసుకుని వారు చెప్పినట్లుగా ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. -
ఇక ఆన్లైన్లోనే PF
-
ఆమె అక్కడా ఇక్కడా కవర్ చేస్తానంటోంది
ముంబై: దక్షిణాది, ఉత్తరాధి చిత్రాల్లో నటించే అవకాశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానంటోంది ప్రముఖ బాలీవుడ్ తార కృతి సనన్. తనకు ఉత్తరాధి చిత్రాలు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా దక్షిణాధి చిత్రాలు కూడా ముఖ్యమనే చెప్తోంది. హీరో పాంటీ చిత్రంతో బాలీవుడ్లో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చెప్పిన ఈ అమ్మడు తెలుగులో మహేశ్‌బాబు చిత్రం వన్‌లో అలరించిన విషయం తెలిసిందే. 'నేను సినిమాల్లోకి వచ్చే ముందు తొలిసారి హిందీ చిత్రం హీరోపాంటిలో నటించేందుకు సంతకం చేశాను. ఆ తర్వాత వెంటనే తెలుగు చిత్రం వన్కోసం సంతకం చేశా. దీంతో నేను దక్షిణాధి చిత్రాల్లో కూడా దృష్టిని పెట్టాలనుకుంటున్నాను.. ఎందుకంటే చాలా గొప్పవాళ్లు, ప్రతిభ ఉన్నవాళ్లు అక్కడ ఉన్నారు' అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు. తాను సరైన మార్గంలోనే వెళుతున్నానని, అయితే చిత్ర పరిశ్రమ అన్నాక పోటీలు ఉంటాయని, కానీ తాను వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తానంటోంది. -
నా పథం ప్రగతి పథం
డాక్టర్ శరత్... ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు ఏడు పత్రాలు ఏకకాలంలో అందించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలబడిన ఐఏఎస్. ప్రజలు అండగా నిలబడితే చాలు.. కొండనైనా ఢీ కొట్టి సంక్షేమ పథకాలను నేరుగా పేదింటికి చేరవేస్తానే ఆత్మవిశ్వాసం ఆయనది. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా.. అన్నింటికీ మించి రాజకీయ చైతన్యం ఉన్న మెతుకుసీమ ఫుల్చార్జి సంయుక్త కలెక్టర్‌గా ఆయన కొత్త బాధ్యతలు మోస్తున్నారు. మా రాష్ర్టం.. మా పాలన అంటూ ఫుల్‌జోష్ మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు మధ్య వారధిగా ఇరువురినీ బ్యాలెన్స్ చేస్తూ సర్కారు బండిని నడిపిస్తున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు అందించాలన్నదే తన లక్ష్యమంటున్న డాక్టర్ శరత్‌తో ‘సాక్షి’ప్రతినిధి ముఖాముఖి. సాక్షి: జిల్లాలో బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయా? ఏ ప్రాతిపదికన వాటిని ఏరివేస్తున్నారు? కలెక్టర్: 2011 జనాభా లెక్కల ప్రకారం కుటుంబాల సంఖ్యను నిర్ధారించాం. ఈ లెక్కన చూసినపుడు గ్రామీణ ప్రాంతంలో 5 శాతం, పట్టణ ప్రాంతంలో 10 శాతం రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చాం. సాక్షి : ఆధార్ కార్డుకు, రేషన్‌కార్డుకు లింక్ పెడతారా? కలెక్టర్: కచ్చితంగా. ఆధార్‌తో అనుసంధానం చేయని కార్డులను మొదటి సారే బోగస్ కార్డులుగా పరిగణిస్తాం, గ్రామాల్లో ఇంటింటి సర్వే చేస్తాం. కార్డులో పేర్లు ఉన్న వ్యక్తులు ఉండి, ఆధార్‌తో అనుసంధానం కాని కార్డులకు కూడా మరో అవకాశం కల్పిస్తాం. అంతేకాకుండా వారికి ఆధార్ కార్డు అందేలా మేమే సపోర్టు చేస్తాం. సాక్షి: బోగస్ రేషన్ కార్డుల ఏరివేత ప్రక్రియ ఎలా ఉంటుంది? కలెక్టర్: ఈనెల 4 నుంచి 15 తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. ఆగస్టు 15 లోపు ఈ బోగస్ రేషన్ కార్డుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తాం. ఒక ఇంట్లో ఎన్ని రేషన్ కార్డు ఉన్నాయో చూస్తాం. కార్డుల్లో నిర్ధారించిన కుటుంబాలు, వ్యక్తులు ఉన్నారో..లేరో చూస్తాం. తప్పుడు సమాచారంతో కార్డులు పొందిన వారికి నోటీసులు ఇస్తాం. ఇక ఆ తర్వాత రెండు రకాల లిస్టులు తయారు చేస్తాం. అందులో ఒకటి పూర్తిగా బోగస్ కార్డుల లిస్టు , రెండవది మరణాలు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి వివరాలతో కూడా మరో లిస్టు. వీఆర్ఓలు, డీలర్ల మీటింగ్ ఏర్పాటు చేసి మా దగ్గర బోగస్‌కార్డులు లేవు అని నిర్ధారణ పత్రం కూడా రాయించుకుంటున్నాం. అనంతరం ఏరివేత షురూ చేస్తాం. సాక్షి: రేషన్‌కార్డుల ఏరివేతతో ప్రజల నుంచి వ్యతిరేకత రాదా? కలెక్టర్: నిజమైన లబ్ధిదారులకు ఏ మాత్రం అన్యాయం జరకుండా బోగస్ కార్డు ఏరివేత జరుగుతుంది. అందువల్లే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకత ఎదురు కాదనే భావిస్తున్నాం. కొంత మంది ఉద్యోగుల వద్ద కూడా తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయని తెలిసింది. అలాంటి వారి వివరాలు వెంటనే తెలియజేయాలని కోరాం. సాక్షి: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టారా? కలెక్టర్: అవును.. వర్షాలు కురవకపోవటం కొంత ఇబ్బందిగానే ఉంది. వ్యవసాయ పంచాంగాన్ని అనుసరించి ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధంగా ఉంచాం. కానీ దురదృష్టవశాత్తు సకాలంలో వానలు కురవటం లేదు. ఇప్పటికే వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడాం. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించాం. జూన్ 15 వరకు ఇంకా సమయం ఉందని వారు చెప్పారు. అప్పటి వరకు వర్షాలు కురవకపోతే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాభావ పరిస్థితుల్లో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులను అందించేందుకు యంత్రాగం సిద్ధంగా ఉంది. సాక్షి: హరీష్‌రావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు ఆయన నియోజకవర్గంలో ఒక ప్రయోగం చేశారు కాదా? కలెక్టర్: ఓ... అదా..! అవును నిజమే. ఆరో ఫేజ్ భూ పంపిణీలో దాదాపు 3,500 ఎకరాలను పంపిణీ చేయడంతో పాటు లబ్ధిదారునికి ఏడు డాక్యుమెంట్లు ఒకేసారి ఇచ్చాం. దాన్ని ఇప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలోనే (అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు) ప్రయోగాత్మకంగా అమలు చేశాం. అసైన్డ్ చేసిన తర్వాత భూమి చూపించలేదని, పాసు బుక్కులు, టైటిల్ డీడ్, సర్వే మ్యాప్, పహణీ రాలేదనే ఒక్క ఫిర్యాదు కూడా రాకుండా చేశాం. దాన్నే రాష్ట్రమంతటా కూడా అనుసరించారు. సాక్షి: ఇంకా ఏమైనా చేశారా? కలెక్టర్: ప్రభుత్వ భూముల వివరాలను గ్రామాల వారీగా సర్వే నంబర్ల ప్రకారం సర్వే చేసి రికార్డు చేశాం. వాస్తవానికి జిల్లాలో ఎంత ప్రభుత్వ భూమి ఉంది? ఎక్కడ ఎంత భూమి కబ్జాకు గురైంది. ఏఏ భూముల మీద కోర్టుల్లో కేసులున్నాయి. ఏఏ భూములు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి తదితర వివరాలను సేకరించి శాశ్వతంగా రికార్డు చేశాం. దీన్ని అప్పటి సీసీఎల్ఏ సీఎస్ మహంతి ఇక్కడికి వచ్చి సమీక్ష చేసి, ఈ విధానం బాగుందని మేం చేసిన ఫార్మాట్‌నే మిగతా జిల్లాలకు ఇచ్చారు. రెవెన్యూ సదస్సులు పెట్టి సమస్యలను పరిష్కరించాం. అంతేకాకుండా సమస్య పరిష్కారమైనట్లు లబ్ధిదారులతో సంతకం కూడా తీసుకున్నాం. సాక్షి: వక్ఫ్ భూముల రికవరీ, పరిరక్షణ సాధ్యమేనా? కలెక్టర్: మంత్రి హరీష్‌రావు ఈ భూముల విషయంలో చాలా దృఢ నిశ్చయంతో ఉన్నారు. జిల్లాలో మొదటి సర్వేలోనే 26 వేల ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నట్లు గుర్తించాం. రెండవ సారి సర్వే చేస్తున్నాం. మరో 8 వేల నుంచి 10 వేల ఎకరాల భూమి తేలవచ్చు. అంటే దాదాపు 35, 36 వేల ఎకరాల వక్ఫ్ భూమి జిల్లాలో ఉంది. ముతవల్లి ప్రధాన ప్రజాసేవకులు. వక్ఫ్ భూమి వాళ్ల అజమాయిషీలోనే ఉంటుంది. ముందుగా పునఃపరిశీలన చేస్తాం. సర్వే నంబర్ వారీగా భూములు గుర్తించి ఒక గెజిట్ తీసుకొని వస్తాం. ఆక్రమణదారులను గుర్తించి ఆ భూములను పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం. సాక్షి: హరీష్‌రావు గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు కదా? జిల్లాలో మీరు ఏమైనా గొలుసుకట్టు చెరువులను గుర్తించారా? కలెక్టర్: నిజంగా గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరిస్తే పాత రోజులను మనం తిరిగి తెచ్చుకున్నట్టే. పాత రోజుల్లో చూస్తే ఒక చెరువు కింద ఆయకట్టు ఉండేది. చెరువు నిండి అలుగు పారితే... ఆ నీళ్లు మరో చెరువులోకి వెళ్లేవి... అది కూడా అలుగు పారితే మూడో కుంటలోకి ఇలా వాగో.. ఏరో కలిసేంత వరకు చెరువుల మధ్య ఈ గొలుసు సిస్టం కనిపించేది. ఇప్పుడు అలుగులు ఒకరు ఆక్రమిస్తే ... ఆయకట్టునూ మరొకరు చెరపెట్టారు. రెవెన్యూ రికార్డుల్లో ఏది అలుగు, ఏది ఆయకట్టో భద్రంగా ఉంది. వాటి ఆధారంగా చెరువు అలుగులు గుర్తించి, నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేసి గొలుసుకట్టు చెరువులు పునరుద్ధరిస్తాం. సాక్షి: మంత్రి హరీష్‌రావు మిమ్ములను ఆదర్శ కలెక్టర్ అని కీర్తించారు కదా..! ఎందుకని? కలెక్టర్: మొదటి నుంచి నాకు ఆఫీసులో గడపటం కంటే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడమంటేనే ఇష్టం. అలా చేసిన పనులే పటిష్టంగా ఉంటాయి. అసైన్డ్ భూముల్లో లబ్ధిదారులకు పట్టాలిస్తారు. కానీ భూమి ఎక్కడుందోచూపించరు. భూమి చూపిస్తే పట్టాలివ్వరు. కొన్ని చోట్ల టైటిల్ డీడ్ ఇవ్వలేదు. సర్వే మ్యాపు ఇవ్వలేదు. నేను సర్వే చేయించి ఎస్సీ,ఎస్టీ భూముల్లో 2,58,116 సమస్యలను గుర్తించాం. వీటి పరిష్కారంలో ఎప్పుడూ మెదక్ జిల్లా చివరిలో ఉండేది. ఇప్పుడు మాత్రం మెదక్ జిల్లా సమస్యలన్నీ పరిష్కరించి మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా ఉంది. వీఆర్ఓలను ఐకేపీ సిబ్బందిని సమన్వయం చేసి ఈ సమస్యలపై విచారణ చేయించి పరిష్కారం చేశాం. పరిష్కార పత్రం కూడా ఇంటింటికి వెళ్లి ఇచ్చాం. సాక్షి: మీరు చేస్తున్న ఆకస్మిక పర్యటనలతో మంచి ఫలితాలు వస్తున్నా...ఉద్యోగుల నుంచి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది కాదా? కలెక్టర్: చెట్టుకు కాయలు ఉంటేనే రాయి విసురుతారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కచ్చితంగా పేదలకు అందాలి. బంగారు తెలంగాణ నిర్మాణానికి తెలంగాణ బిడ్డగా నా ప్రయత్నం నేను చేస్తాను. మా సిబ్బంది నా ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు. నాకు సహకరిస్తారనే నమ్మకం ఉంది. అందులో భాగంగానే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాను. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రజారోగ్యం చాలా కీలకం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఎన్నో ప్రశ్నలకు పరిష్కారం దొరుకుతుంది. ముందు ఆస్పత్రుల తీరు మెరుగుపరచాలి. కారణాలు ఏవైనా కావచ్చు...ఈ కాలంలో కూడ ఒక తల్లి రోడ్డు మీద ప్రసవించాల్సిన దుస్థితిని మనం అంగీకరించగలమా? కఠిన నిర్ణయాలు తీసుకొనే సందర్భంలో కొంత వ్యతిరేకత రావొచ్చు. దాన్నే తలుచుకుంటూ కూర్చోవడం నా నైజం కాదు. -
కేటీపీపీకి నోటీసులు
బకాయిలపై స్పందించని అధికారులు నిబంధనలకు తిలోదకాలు భూనిర్వాసిత గ్రామాలపై శీతకన్ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ మరిచారు పత్తాలేని పర్యావరణ పరిరక్షణ గణపురం: తెలంగాణ రాష్ట్రంలో సూపర్ పవర్ విద్యుత్ కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న కేటీపీపీ.. పన్నుల చెల్లింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. బకాయిపడిన పన్నులను చెల్లించాలని కేటీపీపీకి చెల్పూరు గ్రామపంచాయతీ నోటీసులు పంపింది. చెల్పూరు శివారులో సుమారు వెయ్యి ఎకరాల్లో ఉన్న 500 మెగావాట్ల ప్లాంటుతో పాటు. నిర్మాణంలో ఉన్న 600 మెగావాట్ల ప్లాంటు, ఇటీవల మంజూరైన 800 మెగావాట్ల ప్లాంట్లకు సంబంధించిన లేఅవుట్, పంచాయతీ అనుమతుల పన్నులు లక్షల్లో బకాయిలు ఉన్నాయి. వాటిని చెల్లించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ నోటీసులను జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కేటీపీపీ అధికారులు ప్రవర్తించడంతో పాటు పంచాయతీ అందజేసిన నోటీసులకు కూడా సక్రమంగా స్పందించడం లేదని గ్రామ పంచాయతీ అధికారులు గుర్రుగా ఉన్నారు. ఇంతకు ముందు పాత పంచాయతీ పాలకవర్గాన్ని కూడా కేటీపీపీ అధికారులు ముప్పుతిప్పలు పెట్టారు. ప్లాంట్‌లో నాలుగు వందల మంది ఇంజినీర్లు నివాసాలు ఉంటే భవనాలకు, నిర్మాణంలో ఉన్న భవనాలకు సంబంధించిన అనుమతులు గ్రామపంచాయతీ నుంచి తీసుకోలేదు. స్పెషల్ ఆఫీసర్ల పాలన సమయంలో కూడా డీఎల్‌పీఆర్‌ఓ, డీపీఓలు కూడా కేటీపీపీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. కేటీపీపీ నోటీసులను పట్టించుకోకపోతే కోర్టుకు పోవడానికి సిద్ధమని పంచాయతీ అధికారులు అంటున్నారు. భూనిర్వాసిత గ్రామాలను పట్టించుకోని కేటీపీపీ కేటీపీపీకి భూములు ఇచ్చిన బాధితులను, ఆ గ్రామాలను అధికారులు పట్టించుకోవడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా ప్లాంట్‌కు అవసమైన మొత్తం భూమిలో 90 శాతం చెల్పూరు శివారులో ఉంది. 2005 డిసెంబర్ 16న చెల్పూరు ఉన్నత పాఠశాలలో జరిగిన పర్యావరణ పరిరక్షణ ప్రజావేదిక సదస్సులో అప్పటి జెన్కో సీఎండీ అజయ్‌జైన్ ప్రజలకు ఇచ్చిన హమీలను కేటీపీపీ అధికారులు బుట్టదాఖలు చేశారు. బాధిత గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు, పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టడానికి రూ.100కోట్లను ఖర్చు చేస్తామని ప్రకటించారు. కానీ మాటను నిలుపుకోవాలనే ప్రయత్నం అధికారులు చేయలేదు.ప్రాజెక్టు మూలంగా చెల్పూరు, దుబ్బపల్లి, కొంపల్లి ప్రజలు కాలుష్యం కాటుకు బలవుతునే ఉన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ మాటేమిటి? ప్లాంట్‌లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అమ్మకం ద్వారా వచ్చిన లాభాలలో కొంత శాతాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫండ్ పేరిట ఖర్చు చేయవలసి ఉంది. గత సంవత్సరం రూ.2 కోట్ల రూపాయలను చెల్పూరు పరిధి గ్రామాలకు జెన్కో అధికారులు కేటాయించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా తయారు చేశారు. అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పలుమార్లు జెన్కో అధికారులతో మాట్లాడి నిధులను మంజూరు చేయించారు. ఆ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారు. తెలంగాణ రాష్టానికి గుండెకాయ కాబోతున్న చెల్పూరుకు కనీసం గ్రామపంచాయతీ భవనం కూడా లేకపోవడం శోచనీయం. నిధులు మంజూరు చేయాలని గత ఐదు సంవత్సరాల నుంచి కేటీపీపీ అధికారులని పంచాయతీ పాలకవర్గం వేడుకుంటూనే ఉంది. చెల్పూరు గ్రామానికి గోదావరి నదీజాలాలు అందిస్తామని, వైద్య, విద్య, రోడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలను కల్పిస్తామని ఇచ్చిన మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. బకాయిలు చెల్లించాలి కేటీపీపీ ప్రాజెక్ట్ నుంచి గ్రామపంచాయతీకి రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలి. చెల్పూరుతోపాటు శివారు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్పస్ సోషల్ రెస్పాన్స్ ఫండ్‌ను ఖర్చు చేయాలి. పర్యావరణ పరిరక్షణ కోసం చెట్ల పెంపకం చేపట్టాలి. ప్లాంట్‌లో నిర్మించే భవనాలకు పంచాయతీ నుంచి అనుమతులు తీసుకోవాలి. - కొత్త పద్మవెంకటేశ్వర్లు, చెల్పూరు సర్పంచ్ ఇంటి పన్ను చెల్లిస్తున్నాం చెల్పూరు గ్రామ పంచాయతీకి కేటీపీపీలోని ఇంజినీర్ల కాల నీకి చెందిన ఇంటి పన్నును దాదాపు రూ.మూడు లక్షలను చెల్లిస్తున్నాం. కార్పస్ సోషల్ రెస్పాన్స్ ఫండ్‌పై జెన్కో ఉన్నతస్థాయి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమే. ప్లాంటులో నిర్మించే భవనాలను పన్నులు చెల్లించాలంటే అవసరమైన అధారాలు కావాలి. - వెంకటేశ్వర్రావు, కేటీపీపీ సీఈ