బ్యాంక్ అకౌంట్‌లో నగదు బ్యాలెన్స్‌కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ జారీ చేసిన రూల్స్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది. బ్యాంకు ఖాతాలలో రూ. 30 వేల కంటే ఎక్కువ ఉంటే అటువంటి అకౌంట్లను క్లోజ్ చేస్తారన్నది దాని సారాంశం.
అయితే ఆ వార్త ఫేక్ అని తేలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) చేసిన ఫ్యాక్ట్ చెక్‌లో ఈ వార్త నిజం కాదని, ఆర్బీఐ అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని నిర్ధారించింది. హిందీలో ఉన్న ఆ వార్తను ట్విటర్‌లో షేర్ చేస్తూ అది పూర్తిగా ఫేక్ అని నిర్ధారించినట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: Rs 500 Notes: రూ.88 వేల కోట్లు మిస్సింగ్! ఏమయ్యాయి?
ఇంటర్నెట్‌లో తప్పుడు సమాచారం, ఫేక్ వార్తలను అరికట్టడానికి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 2019 డిసెంబర్ లో ఈ ఫ్యాక్ట్-చెకింగ్ విభాగాన్ని ప్రారంభించింది. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రభుత్వ విధానాలు, పథకాలకు సంబంధించి సర్క్యులేట్ అవుతున్న తప్పుడు సమాచారాన్ని గుర్తించడం లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేసినట్లు పీఐబీ పేర్కొంటోంది.
एक ख़बर में दावा किया जा रहा है कि भारतीय रिजर्व बैंक के गवर्नर ने बैंक खातों को लेकर एक अहम ऐलान किया है कि अगर किसी भी खाताधारक के खाते में 30,000 रुपये से ज्यादा है तो उसका खाता बंद कर दिया जाएगा#PIBFactCheck
— PIB Fact Check (@PIBFactCheck) June 15, 2023
▪️ यह ख़बर #फ़र्ज़ी है।
▪️ @RBI ने ऐसा कोई निर्णय नहीं लिया है। pic.twitter.com/dZxdb5tOU9
Comments
Please login to add a commentAdd a comment