కర్నూలు శివారులోని కట్టమంచి స్కూలు వద్ద ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఆటో ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
Jan 30 2017 12:16 AM | Updated on Sep 18 2018 8:18 PM
కర్నూలు : కర్నూలు శివారులోని కట్టమంచి స్కూలు వద్ద ఆటో బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కేశవరెడ్డి స్కూలులో పోస్టుమెన్ పరీక్ష రాసేందుకు కృష్ణనగర్‌కు చెందిన నాగరాజు కూతురు, నల్లబోతుల మాధవిలత, ఏలూరుకు చెందిన రాజేశ్వరరెడ్డి కుమారుడు సత్యశేఖర్ బిర్లాగేటు వద్ద ఆటో ఎక్కారు. కట్టమంచి స్కూలు యూటర్న్ దగ్గర ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు చేతులు విరిగాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement