చనుగొండ్ల గ్రామ పొలిమేరలో బైక్‌పై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. పుసులూరుకు చెందిన చిన్నస్వాములు భార్య సులోచన(30) బిడ్డ మానసతో కలిసి బైక్‌పై పుట్టినిల్లు అయిన గూడూరుకు బయలుదేరింది. కోడుమూరు సమీపంలోని చనుగొండ్ల పొలిమేరలో అదుపుతప్పి బైక్‌పై నుంచి పడ్డారు. గాయాలైన తల్లిబిడ్డకు 108లో కోడుమూరు
చనుగొండ్ల(గూడూరు రూరల్): చనుగొండ్ల గ్రామ పొలిమేరలో బైక్‌పై నుంచి పడి ఓ మహిళ మృతిచెందింది. వివరాల్లోకి వెళితే.. పుసులూరుకు చెందిన చిన్నస్వాములు భార్య సులోచన(30) బిడ్డ మానసతో కలిసి బైక్‌పై పుట్టినిల్లు అయిన గూడూరుకు బయలుదేరింది. కోడుమూరు సమీపంలోని చనుగొండ్ల పొలిమేరలో అదుపుతప్పి బైక్‌పై నుంచి పడ్డారు. గాయాలైన తల్లిబిడ్డకు 108లో కోడుమూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా సులోచన మార్గమధ్యంలోనే మృతిచెందింది. గూడూరు ఎస్‌ఐ చంద్రబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.