బైక్, కారు వంటి వాహనాలు నడపడం చాలా సులువని అందరూ అనుకుంటారు. కానీ అందుకు ఎంతో శిక్షణ అవసరం. ఎక్కువగా బండి నడపడం వచ్చిన వాళ్ల దగ్గర డ్రైవింగ్ నేర్చుకుంటారు. లేదంటే ప్రత్యేకంగా డ్రైవింగ్ స్కూల్స్ కూడా ఉంటాయి. అయితే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పించడం అంతా ఈజీ కాదని భావిస్తుంటారు. మహిళలు రోడ్డు మీద బండి నడపడం చూసిన కొంతమంది భయపడుతుంటారు. ఇప్పుడీ వార్త చదివితే.. ఈ విషయం నిజమేననిపిస్తుంది.
అసలేం జరిగిందంటే.. కాలేజీ గ్రౌండ్‌లో ఓ యువకుడు మరో విద్యార్థినికి టూ వీలర్ నడపడం నేర్పించేందుకు రెడీ అయ్యారు. యువతిని ముందు కూర్చొబెట్టి వెనకాల అతడు కూర్చున్నాడు. ఇద్దరు కలిసి మెల్లగా కొంతదూరం వెళ్లారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. బ్రేక్ బదులు స్కూటీ ఎక్సలేటర్‌ను యువతి ఒక్కసారిగా పెంచడంతో బండి రెండు మూడు వంకర్లు తిరుగుతూ ముందుకు వెళ్లింది. అబ్బాయి బండిని ఆపేందుకు ప్రయత్నించినా కుదరలేదు. ఇంకేముంది చివరికి ఇద్దరు బొక్కబొర్లా పడ్డారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు స్పందిస్తూ.. అమ్మాయిలకు డ్రైవింగ్ నేర్పడం అంతా ఈజీ కాదు బ్రో. సరదా తీరిందా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది అమ్మాయిలను ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదని ఇలాగే రోడ్డుపై పడేస్తారు. ఇలాంటివి జరిగినప్పుడే డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయిలను చూస్తే భయమేస్తోంది. వాళ్లకు డిస్టెన్స్ మెయింట్ చేయడం బెటర్’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment