వెయిట్ లాస్ జర్నీ అంత ఈజీగా సాగదు. మరీ ముఖ్యంగా పెళ్లి, పిల్లలు తరువాత విపరీతంగా పెరిగిన బరువును తగ్గించుకోవడం మహిళలకు కత్తిమీద సామే. ఎంతో పట్టుదల కావాలి. అలా 37 కిలోల బరువును తగ్గించుకొని ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అవతరించిందో గృహిణి. అసాధ్యం కాదు అనుకున్న దాన్ని సాధ్యం చేయడంలో ఉన్న కిక్కే వేరు అంటున్న ఆ గృహిణి గురించి తెలుసుకుందామా...!
బరువు తగ్గే క్రమంలో 36 ఏళ్ల తనుశ్రీ అనే ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన స్ఫూర్తిదాయకమైన ప్రయాణం సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది. అంకితభావం , పట్టుదలతో ఆమె సాధించిన విజయంపై ప్రశంసలు లభించాయి.
బాల్యం నుంచీ బొద్దుగానే ఉం డే తనుశ్రీ తన ఇరవైలలో,ముఖ్యంగా గర్భం దాల్చిన తర్వాత బాగా బరువు పెరిగిపోయింది. దీంతో పెరిగిన తన శరీరాన్ని చూసుకొని ఆశ్చర్యపోయింది. దీంతో తన కాన్ఫిడెన్స్ లెవల్స్ తగ్గిపోతున్నాయని గమనించింది. తన ఆరోగ్యం, విశ్వాసాన్ని తిరిగి పొందాలని నిశ్చయించుకుని రంగంలోకి దిగింది.
తల్లిగా, గృహిణిగా ఇంటి బాధ్యతలను మోస్తూనే గత ఆరేళ్లకుపైగా పట్టుదలగా ఆహార నియమాలు, ఇంట్లోనే సులువైన వ్యాయాయాలు ఆచరించింది. తాను అనుకున్నది సాధించింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే వెనక్కి తగ్గలేదు. ఒక ప్రణాళికగాబద్దంగా తేలికపాటి ఆహారాన్ని తీసుకుంటూ, గృహోపకరణాలతోనే క్రియేటివ్‌గా వ్యాయామాలను చేసింది. జీవనశైలి మార్పులతో పాటు స్వీయ సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. తను అనుకున్న ఫిట్‌నెస్ లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ వీడియో చేసిన నెటిజన్లు ఆమెను కొనియాడారు. భలే చేంజ్ కనిపించింది. శారీరకంగా , మానసికంగా తన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకునే, ప్రేమించే వ్యక్తి కంటే అందమైనది ఇంకేముంటుంది. మంచి పనిచేస్తున్నారు..ఇలాగే ముందుకెళ్లండి అంటూ ఆమె ఫాలోయర్లు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు.
‘‘ఇంతకు ముందులా గృహస్థంగా, అమాయకంగా కాకుండా, ఇపుడు నమ్మకంగా, బలంగా, అందంగా కనిపిస్తున్నారు.కష్టే ఫలి అంటే ఇది కొందరు వ్యాఖ్యానించారు. "అద్భుతం, మీలోని మార్పు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ స్ఫూర్తి చాలా ప్రశంసనీయం నా భార్య కూడా 2018 సంవత్సరంలో అచ్చం ఇలాంటి విజయాన్నే సాధించిందని మరో యూజర్ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment