వావ్‌! వాట్‌ ఏ బ్యాలెన్స్‌..సోనూ వీడియో వైరల్‌  | Sonu sood Funny momets at Airport fans says Brilliance of Balance | Sakshi
Sakshi News home page

Sonu sood: బ్రిలియన్స్‌ ఆఫ్‌ బ్యాలెన్స్‌! వీడియో వైరల్‌

Published Thu, Aug 26 2021 5:07 PM | Last Updated on Thu, Aug 26 2021 9:38 PM

Sonu sood Funny momets at Airport fans says Brilliance of Balance - Sakshi

సాక్షి ముంబై: రియల్‌ హీరో సోనూసూద్‌ ఒకవైపు మహారాష్ట్ర మేయర్‌ పదవి రేసులో ఉన్నారన్న వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మరోవైపు  ఈ వార్తలను కొట్టిపారేసిన సోనూసూద్ మాత్రం తనదైన శైలిలో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. తాజాగా విమానాశ్రయంలో ఎస్కెలేటర్ విన్యాసాలతో ఎంజాయ్‌ చేస్తు‍న్నారు. ఈ ఆటవిడుపు వీడియోను స్వయంగా ఆయనే ట్విటర్‌లో షేర్‌ చేశారు. బ్రిలియన్స్‌ ఆఫ్ బ్యాలెన్స్ అంటూ వీడియోన చూసి అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు. సోనూ సూద్ పర్‌ఫెక్ట్‌  బాడీతో ఫిట్‌నెస్‌ ఎంత బాగా మెయింటైన్‌ చేస్తారో అందరికీ తెలిసిందే.

కాగా దేశంలో కరోనా మహమ్మారి మొదటి రెండు దశల్లో పంజా విసిరిన సమయంలో అనేకమంది బాధితుల పట్ల ఆపద్బాంధవుడిలా మారి  రియల్‌ హీరో అవతరించాడు. అంతేకాదు ఇప్పటికీ నిరాటంకంగా తన సేవా కార్యక్రమాలతో  గొప్ప మనసును చాటుకొంటూనే ఉన్నారు. ముఖ్యంగా వీధి వ్యాపారులకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తున్నారు. అటు భారీ సినిమా అవకాశాలతో వృత్తి జీవితంలో కూడా బిజీగా మారిపోయాడు సోనూ సూద్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement