ఆమె అక్కడా ఇక్కడా కవర్ చేస్తానంటోంది | Kriti Sanon plans balancing act in Hindi, southern films | Sakshi
Sakshi News home page

ఆమె అక్కడా ఇక్కడా కవర్ చేస్తానంటోంది

Mar 20 2015 2:07 PM | Updated on Oct 2 2018 3:43 PM

ఆమె అక్కడా ఇక్కడా కవర్ చేస్తానంటోంది - Sakshi

ఆమె అక్కడా ఇక్కడా కవర్ చేస్తానంటోంది

ముంబై: దక్షిణాది, ఉత్తరాధి చిత్రాల్లో నటించే అవకాశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానంటోంది ప్రముఖ బాలీవుడ్ తార కృతి సనన్.

ముంబై: దక్షిణాది, ఉత్తరాధి చిత్రాల్లో నటించే అవకాశాలను  సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానంటోంది ప్రముఖ బాలీవుడ్ తార కృతి సనన్. తనకు ఉత్తరాధి చిత్రాలు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా దక్షిణాధి చిత్రాలు కూడా ముఖ్యమనే చెప్తోంది. హీరో పాంటీ చిత్రంతో బాలీవుడ్లో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చెప్పిన ఈ అమ్మడు తెలుగులో మహేశ్బాబు చిత్రం వన్లో అలరించిన విషయం తెలిసిందే.

'నేను సినిమాల్లోకి వచ్చే ముందు తొలిసారి హిందీ చిత్రం హీరోపాంటిలో నటించేందుకు సంతకం చేశాను. ఆ తర్వాత వెంటనే తెలుగు చిత్రం వన్కోసం సంతకం చేశా. దీంతో నేను దక్షిణాధి చిత్రాల్లో కూడా దృష్టిని పెట్టాలనుకుంటున్నాను.. ఎందుకంటే చాలా గొప్పవాళ్లు, ప్రతిభ ఉన్నవాళ్లు అక్కడ ఉన్నారు' అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు. తాను సరైన మార్గంలోనే వెళుతున్నానని, అయితే చిత్ర పరిశ్రమ అన్నాక పోటీలు ఉంటాయని, కానీ తాను వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తానంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement