Southern
-
లెబనాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాల విధ్వంసం
జెరూసలేం: లెబనాన్‌పై ఇజ్రాయెల్ సైన్యం మరోమారు భీకర దాడి చేసింది. డజన్ల కొద్దీ ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు వందకు మించిన హిజ్బుల్లా స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ విమానాల నుంచి వస్తున్న శబ్ధాలు, దూసుకువస్తున్న బాంబులు, క్షిపణులకు ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు హిజ్బుల్లా రాకెట్ లాంచర్లతో సహా దక్షిణ లెబనాన్‌లోని దాదాపు 110 లక్ష్యాలపై భారీ దాడి చేశాయని ఐడీఎఫ్ తెలిపింది. ఈ దాడిలో లెక్కలేనందమంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. దీనికిముందు శనివారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 37 మంది మృతి చెందారు. ఈ తాజా దాడి తర్వాత లెబనాన్‌లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. శనివారం లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై వరుస దాడుల ఘటన మరువక ముందే తాజా దాడులు జరిగాయి. తాజా దాడుల్లో వేలాది రాకెట్ లాంచర్ బారెల్స్ ధ్వంసమయ్యాయని ఐడీఎఫ్ పేర్కొంది. 🚨Update: IDF continues massive air strikes across Lebanon! One of the largest bombs ever dropped by Israel on southern Lebanon, very likely a US Moab! pic.twitter.com/D71TB3tPI3— US Civil Defense News (@CaptCoronado) September 21, 2024ఇది కూడా చదవండి: గాజాలో 22 మంది మృతి -
ఆసియా అంతటా భానుడి భగభగలు
దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియాలో అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ప్రజలకు ఊపిరి ఆడనీయకుండా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో పలు దేశాల్లో ఆరోగ్య హెచ్చరికలు జారీ చేయడంతో పాటు స్కూళ్లను మూసివేశారు.అటు ఫిలిప్పీన్స్ నుండి థాయ్‌లాండ్ వరకు, ఇటు భారతదేశం నుంచి బంగ్లాదేశ్ వరకు రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు మించవచ్చని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. అత్యధిక ఉష్ణోగ్రతల నేపధ్యంలో బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్‌లో పాఠశాలలను మూసివేశారు. మరోవైపు ఇండోనేషియాలో డెంగ్యూ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి.ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో శనివారం ఉష్ణోగ్రత 38.8 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఇది దశాబ్దాల క్రితం నాటి ఉష్ణోగ్రతల రికార్డును అధిగమించింది.ఈ వేడి వాతావరణం మే మధ్యకాలం వరకు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా నీటి కొరత, కరెంటు కోతలు, పంట నష్టం మొదలైన సమస్యలు ఎదురవుతున్నాయి.కంబోడియా గత 170 ఏళ్లలో ఎప్పుడూ చూడని అత్యధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటోందని జలవనరులు, వాతావరణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చాన్ యుథా తెలిపారు. గడచిన వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు చేరుకున్నాయి. సెంట్రల్ మాగ్వే, మాండలే, సాగింగ్, బాగో ప్రాంతాల్లోని ఏడు టౌన్‌షిప్‌లలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని మయన్మార్ వాతావరణ విభాగం వెల్లడించింది. మయన్మార్‌లోని పలు పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ప్రపంచస్థాయి రికార్డులను దాటాయి.థాయ్‌లాండ్‌లోని కొన్ని ఉత్తర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. బ్యాంకాక్‌లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సింగపూర్‌లోని వాతావరణ శాఖ దేశంలో ఉష్ణోగ్రతలు గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేసింది. వియత్నామీస్ మీడియా నివేదికల ప్రకారం మధ్య వియత్నాంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో అడవుల్లో కార్చిచ్చు సంభవించే ప్రమాదం ఉందని జాతీయ వాతావరణ సంస్థ హెచ్చరించింది.మలేషియాలో వరుసగా మూడు రోజులు 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నదని మలేషియా వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆసియా అంతటా అత్యధిక ఉష్ణోగ్రతలు నెలకొన్నందున పలు చోట్ల ప్రజలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. డీహైడ్రేషన్, వడదెబ్బ సమస్యలతో ఆసుపత్రులలో చేరుతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.వడదెబ్బ కారణంగా ఈ ఏడాది ఇప్పటివరకు 30 మంది మృతి చెందారని థాయ్‌లాండ్ డిసీజ్ కంట్రోల్ విభాగం తెలిపింది. మలేషియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వడదెబ్బ కాణంగా దేశంలో ఇప్పటివరకూ రెండు మరణాలు నమోదయ్యాయని పేర్కొంది. ఫిలిప్పీన్స్‌లో విపరీతమైన వేడి వాతావరణం కారణంగా 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు మరణించారు. ఈ వివరాలను ఫిలిప్పీన్స్ ఆరోగ్య శాఖ తెలిపింది.బంగ్లాదేశ్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకూ 20 మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. ఇండోనేషియాలో అత్యధిక ఉష్ణోగ్రతలు డెంగ్యూ జ్వరాలకు దారి తీస్తున్నాయి. దోమల ద్వారా సంక్రమించే ఇన్ఫెక్షన్, కేసుల కంటే డెంగ్యూ జ్వరాలు రెండింతల మేరకు పెరిగాయని బంగ్లాదేశ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
భళా.. బాల మేధావులు
సాక్షి, అమరావతి: విజయవాడలో నిర్వహిస్తున్న ‘సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్’ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను ఎలుగెత్తి చాటుతోంది. ఏపీ పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ మ్యూజియం, కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు 6 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 210 ప్రాజెక్ట్‌లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అత్యుత్తమ ప్రదర్శనలను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలకు ఇక్కడ అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 30 నమూనాలు సైతం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎగ్జిబిషన్‌కు తరలివచ్చారు. తమ వయసు విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను తిలకించి, ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకే.. సైన్స్ రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, భూమి/అంతరిక పరిజ్ఞానం, పర్యావరణం, ఇంజినీరింగ్, అగ్రి, బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే అంశాలకు చోటు కల్పించామన్నారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని వివరించారు. తక్కువ ఖర్చు.. ఆదాయం హెచ్చు ఈ చిత్రంలో కనిపిస్తున్న కె.హేమమాధురి, పి.పావని చిత్తూరు జిల్లా పెదపంజానిలోని మహత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ రైతుకు మేలు చేసే సమగ్ర వ్యవసాయ (ఇంటిగ్రేటెడ్ పారి్మంగ్) విధానాన్ని రూపొందించారు. తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూనే.. ఎరువుల ఖర్చు లేకుండా అదనపు ఆదాయంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను అనర్గళంగా వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఇంగ్లిష్ ప్రావీణ్యం ప్రదర్శిస్తూ.. సదరన్ సైన్స్ ఫెయిర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆపదలో ఆదుకునే తుపాకీ సైనికులు, ఫారెస్ట్ సిబ్బంది, అగ్నిమాపకదళ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఒక్కోసారి దారి తప్పడమో, మంచులో కూరుకుపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు వారున్న చోటును తెలిసేలా అద్భుతమైన తుపాకిని రూపొందించాడు మంగుళూరుకు చెందిన విద్యార్థి పి.తేజస్. ఓ వైపు శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించడంతోపాటు సైనికుడి ఉనికిని తన బృందానికి చేరవేసేలా సెన్సార్‌ను బిగించాడు. ఇది బయటి వారికి సిగ్నల్స్‌ను పంపించి ఆచూకీ చెబుతుంది. తేజస్ తయారు చేసిన తుపాకి ఒక్కసారి వినియోగానికి రూ.30 మాత్రమే ఖర్చవుతుంది. మంటల్లో కాలిపోతున్న ఎత్తయిన భవనాల్లోకి ఈ తుపాకి ద్వారా ఆక్సిజన్ బాల్స్‌ను ఫైర్ చేసి మంటలను సైతం ఆర్పేయవచ్చు. -
విశాఖలో దక్షిణ భారత హోటల్ యజమానుల సదస్సు
-
AP: వచ్చే నెల వర్షాలే వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వచ్చే నెల ఆరంభం నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఈ సీజన్లో కొద్దిరోజులుగా కానరాని వర్షాలు నాలుగైదు రోజుల్లో తిరిగి ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఆగస్టు నెలలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. నైరుతి రుతుపవనాల సీజను ఆరంభమైన జూన్‌లో మోస్తరుగా, జూలైలో విస్తారంగా వానలు కురిశాయి. ⛈️ ఆగస్టులో వర్షాల జాడ లేదు. ఈనెల ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి (మాన్సూన్ ట్రఫ్) హిమాలయాల వైపు వెళ్లిపోయింది. వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ. హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుంది. ఆ మధ్య సమయంలోనే కొద్దిరోజుల పాటు బ్రేక్ మాన్సూన్ (వర్షాలకు విరామం) ఏర్పడి వానలకు అడ్డుకట్ట వేస్తుంది. ⛈️ అయితే ఈసారి అందుకు భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి తిష్ట వేసింది. ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిపించి వరదలకు కారణమైంది. రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిపాటి వర్షాలు కురిశాయి తప్ప సాధారణ వర్షాలు లేవు. ⛈️ ఈ ద్రోణి వచ్చే నెల ఒకటో తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. ఆ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు మళ్లీ మొదలవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ⛈️ రుతుపవన ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి సెప్టెంబర్ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం లేదా అంతకు మించి ఒకింత ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ కూడా అంచనా వేసింది. జాడలేని అల్పపీడనాలు.. అరేబియా సముద్రం, బంగాళాఖాతం శాఖల నుంచి వేర్వేరుగా పయనించే రుతుపవనాల ప్రభావంతో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడి, వర్షాలు కురుస్తాయి. కానీ ఈ సీజన్లో ఇప్పటిదాకా చెప్పుకోదగిన స్థాయిలో అల్పపీడనాలు ఏర్పడలేదు. ఈ ఏడాది ‘నైరుతి’ సీజను ఆరంభమైన కొన్నాళ్లకు రుతుపవనాలు చైనా, జపాన్ వైపు వెళ్లిపోయాయి. రుతుపవన ద్రోణి దిగువకు (దక్షిణం వైపునకు) రాకపోవడం, ఎల్‌నినో ప్రభావం వెరసి ఆగస్టులో దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. -
సౌత్‌పై కన్నేసిన ఫిజిక్స్‌వాలా.. మూడేళ్లలో రూ. 500 కోట్లు..
న్యూఢిల్లీ: యూనికార్న్ స్టార్టప్ సంస్థ ఫిజిక్స్‌వాలా మూడేళ్లలో ఎడ్టెక్ సంస్థ జైలెమ్ లెర్నింగ్‌ను సొంతం చేసుకోనుంది. కేరళ కేంద్రంగా ఆవిర్భవించిన ఈ ఎడ్టెక్ సంస్థలో 50 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఫిజిక్స్‌వాలా పేర్కొంది. ఇందుకు రానున్న మూడేళ్లలో దశలవారీగా రూ. 500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అలఖ్ పాండే వెల్లడించారు. తద్వారా దక్షిణాది మార్కెట్లో మరింత పట్టుసాధించే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల కుదిరిన భాగస్వామ్య ఒప్పందం ప్రకారం ఈక్విటీ, నగదు ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా జైలెమ్ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు వివరించారు. మూడేళ్లలో రూ. 500 కోట్లు వెచ్చించడం ద్వారా హైబ్రిడ్ లెర్నింగ్ జైలెమ్ మోడల్‌ను సరిహద్దు రాష్ట్రాలకు పరిచయం చేయనున్నట్లు పేర్కొన్నారు. కంపెనీ అవలంబిస్తున్న ఫలితాలు సాధించే ప్రణాళికల శిక్షణా విధానం తననెంతో ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. -
ఈ ఏడాదిలో ఈరోజు చాలా స్పెషల్.. ఎందుకో తెలుసా?
ఈ ఏడాదిలోనే ఈరోజుకి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే, డిసెంబర్ 21ని అత్యంత చిన్నరోజుగా నాసా అధికారులు గుర్తించారు. నేడు సూర్యుడి నుంచి ఉత్తరార్ధగోళం తన కక్ష్యలో దూరంగా వంగి ఉన్నందున ఈ సంవత్సరంలో ఇదే తక్కువ పగలు రోజుగా నిలుస్తుందని వారు తెలిపారు. సూర్యుని నుంచి దూరంగా వంగి ఉండటం వల్ల ఉత్తరార్ధగోళం మీద తక్కువ సూర్యకాంతి పడుతుంది. దీంతో ఈ రోజు చాలా తొందరగా గడిచినట్లు ఉత్తరార్ధగోళంలో నివసించే వారికి అనిపిస్తుంది. ఈరోజు పగటి పుట సమయం చాలా తక్కువగా ఉండటం, రాత్రి ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ఇలా సంవత్సరంలో రెండుసార్లు సంభవిస్తుంది. ఉత్తరార్ధగోళంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 22 మధ్య కాలంలో, దక్షిణార్థ గోళంలో జూన్ 20 నుంచి 21 మధ్య కాలంలో ఇలా సంభవిస్తుంది. పురాతన కాలంలో ఈ రోజున రోమన్లు శనిదేవుడిని తిరిగివచ్చినట్లుగా భావించేవారు. మన దేశంలో అత్యల్ప తక్కువ రోజుగా మకర సంక్రాంతిని జరుపుకుంటారు. ఇదే పండుగను చైనీయులు, జపనీయులు కూడా జరుపుకుంటారు. (చదవండి: పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం ఆదాయం ఎంతనో తెలుసా..!) -
14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, అమరావతి: తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం తదితరాలపై చర్చిస్తారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో వివిధ శాఖల కార్యదర్శులు, టీటీడీ ఈవో, చిత్తూరు కలెక్టర్, ఎస్పీ తదితరులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. ఎలాంటి లోపాలకు ఆస్కారమివ్వకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి చర్చించాల్సిన అంశాలు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అజెండాపై వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, ఎల్. ప్రేమచంద్రారెడ్డి, అనిల్ సింఘాల్, వి.ఉషారాణి, శ్యామల రావు, పి.బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆతిథ్యం
సాక్షి, అమరావతి: సదరన్ జోనల్ కౌన్సిల్ 29వ సమావేశానికి ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. మార్చి 4వ తేదీన తిరుపతిలో ఈ సమావేశాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. దీంతో పాటు ఈ సమావేశంలో చర్చించనున్న ఎజెండా అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ కౌన్సిల్ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి (ప్రస్తుతం సీఎం లేరు) నుంచి ముఖ్యమంత్రులు.. అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌ల నుంచి ప్రత్యేక ఆహ్వానితులు హాజరవుతారని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. ప్రధానంగా 26 అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరుగుతాయని తెలిపారు. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, ఆర్థిక శాఖ కార్యదర్శి నటరాజన్ గుల్జార్, అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్ స్పెషల్ సెక్రటరీ మధుసూధన్ రెడ్డి, ఇరిగేషన్ సెక్రటరీ శ్యామల రావు, దిశ స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఏపీ ఆతిథ్యం
-
కాలిఫోర్నియాలో వరద బీభత్సం
-
యాంగ్షూ ప్రకృతి చేసిన విన్యాసం
చెట్టులెక్కగలవా... ఓ నరహరి పుట్టలెక్కగలవా అంటూ చెంచులక్ష్మి ఆట పట్టించడాన్ని సినిమాల్లో చూశాం. ట్రెకింగ్, మౌంటెనీరింగ్ అంటూ కొండ వాలులు, పర్వత సానువుల వెంట పరుగులు తీసే సాహసికులను బయట చూస్తూనే ఉంటాం. ఇప్పుడు... అడ్వెంచర్ టూరిజం రాక్ క్లైంబింగ్ మీద సరదా పడుతోంది. అందుకు అనువైన శిఖరాల కోసం చైనా బాట పడుతోంది. చైనా దక్షిణభాగంలో గువాన్గ్జీ రీజియన్‌లో గుయిలిన్ నగరానికి సమీపంలో ఉంది యాంగ్షూ. ప్రకృతి చేసిన విచిత్రమైన విన్యాసాలే ఈ ఊరిని ప్రపంచం దృష్టిలో పడేటట్లు చేశాయి. యాంగ్షూ పట్టణానికి చుట్టూ పచ్చటి శిఖరాలు చీమల పుట్టల్లా ఉంటాయి. వాటి మధ్యలో కొద్దిపాటి సమతల ప్రదేశం, ఓ పక్క ‘లీ’ నది ప్రవాహం. కొండవాలులో కట్టిన ఇళ్లు, వాటిని తొంగి చూడడానికే అన్నట్లు అర్ధచంద్రాకారంలో పెద్ద రంధ్రం. కొండకు ఇంత చక్కగా ఏ శిల్పకారుడో చెక్కినట్లు అర్ధవృత్తాకారం ఎలా వచ్చిం దని ఆశ్చర్యంగా చూసేలోపు గైడ్లు ఓ సైన్సు పాఠం చెప్పేస్తారు. ఈ కొండల్లోని లైమ్‌స్టోన్, డోలమైట్, జిప్సమ్ వంటివి నీటిలో కరిగిపోవడంతో ఏర్పడిన రంథ్రం అది. వర్షాలు కురిసి నీటిలో డోలమైట్ వంటివి కరిగిపోగా మిగిలిన రాతి రూపాలివి. చీమ పుట్టలను తలపించే కొండశిఖరాలు, గుహలు, భూగర్భ జలప్రవాహాలు, సహజంగా రూపొందిన విచిత్రమైన రూపాలు కూడ. యాంగ్ షూ కే ఎందుకంటే... ఇది పొల్యూషన్ ఫ్రీ టూరిస్టు స్పాట్. ఓ సైకిల్ అద్దెకు తీసుకుని పట్టణ వీధుల్లో తిరగవచ్చు. వాటర్ కేవ్‌లో మునిగి మడ్ బాత్, మడ్ ఫైట్ చేయవచ్చు. ఇది పెద్ద వాళ్లను చిన్నపిల్లలుగా మార్చేసే సరదా ఆట. మడ్ఫైట్ చేసిన తర్వాత ఆ పక్కనే ఉండే వేడినీటి గుండాల్లో సేదదీరడంలో ఉన్న హాయిని ఫీలవ్వాల్సిందే. ఇక్కడ మోటర్‌బైక్ ట్యాక్సీలను యువతులు నడుపుతుంటారు. గైడ్‌కు కానీ, ట్యాక్సీలకు కానీ బేరమాడకపోతే పది ‘రెన్మిన్బి’ల బదులు యాభై వరకు సమర్పించుకోవాలి. అచ్చమైన చీనీ వంట! రెస్టారెంట్లలో చైనీస్ఫుడ్తోపాటు పశ్చిమ దేశాల ఆహారం కూడా దొరుకుతుంది. చాలా రెస్టారెంట్లలో మెనూ చైనాభాషలోనే ఉంటుంది. పేరు పలకడానికి వచ్చినవే ఆర్డర్ చేయడం లేదా గైడ్ సహాయంతో ఆర్డర్ చేయడమే మార్గం. చైనా వాళ్ల వంటలను వారి ఇళ్లలోనే రుచి చూడాలంటే యాంగ్షూ నుంచి పది నిమిషాలు ప్రయాణించాలి. అక్కడ రైతులు ఇళ్లలో పర్యాటకులకు వండి పెట్టడంతోపాటు కలిసి భోజనం చేస్తారు. లీ నదిలో పడవ ప్రయాణం! యాంగ్షూ చిన్న పట్టణం. గుయిలిన్ లియాన్గ్జియాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగి రోడ్డు మార్గాన వెళ్లాలి. దీనికంటే అద్భుతమైన ప్రయాణం లీ నదిలో పడవలో వెళ్లడమే. కాలుష్య రహితమైన ప్రదేశంలో ప్రవాహ వేగం తెలియని నిశ్శబ్దమైన నదిలో పడవలో విహరిస్తుంటే... ఆకాశం కనిపిస్తుంది కానీ అందదు. నేల ఉందని తెలుసు కానీ తాకలేం. తీరం మాత్రం నేనున్నానని భరోసా ఇస్తున్నట్లు ఉంటుంది. ఏ నదిలో పయనిస్తున్నా ఇలాంటి అనుభవమే ఉంటుంది. కానీ లీ నదిలో పయనించేటప్పుడు, కొండలెక్కేటప్పుడూ పక్కనే యాంగ్షూ పట్టణంలో వీధులు, ఇళ్లు కనువిందు చేస్తుంటాయి. రాక్ క్లైంబింగ్! కొండల పైకి ఎక్కుతూ మంద్రంగా ప్రవహించే లీ నదిని చూస్తూ మధ్యలో వైవిధ్యమైన ఆర్కిటెక్చర్‌తో ఉన్న చైనా ఆలయాలను చూడడానికి ఆసియా దేశాలతోపాటు పాశ్చాత్య దేశాల నుంచి కూడా పర్యాటకులు క్యూ కడుతుంటారు. -
ఆమె అక్కడా ఇక్కడా కవర్ చేస్తానంటోంది
ముంబై: దక్షిణాది, ఉత్తరాధి చిత్రాల్లో నటించే అవకాశాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళతానంటోంది ప్రముఖ బాలీవుడ్ తార కృతి సనన్. తనకు ఉత్తరాధి చిత్రాలు ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువగా దక్షిణాధి చిత్రాలు కూడా ముఖ్యమనే చెప్తోంది. హీరో పాంటీ చిత్రంతో బాలీవుడ్లో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చెప్పిన ఈ అమ్మడు తెలుగులో మహేశ్‌బాబు చిత్రం వన్‌లో అలరించిన విషయం తెలిసిందే. 'నేను సినిమాల్లోకి వచ్చే ముందు తొలిసారి హిందీ చిత్రం హీరోపాంటిలో నటించేందుకు సంతకం చేశాను. ఆ తర్వాత వెంటనే తెలుగు చిత్రం వన్కోసం సంతకం చేశా. దీంతో నేను దక్షిణాధి చిత్రాల్లో కూడా దృష్టిని పెట్టాలనుకుంటున్నాను.. ఎందుకంటే చాలా గొప్పవాళ్లు, ప్రతిభ ఉన్నవాళ్లు అక్కడ ఉన్నారు' అంటూ చెప్పుకొచ్చిందీ అమ్మడు. తాను సరైన మార్గంలోనే వెళుతున్నానని, అయితే చిత్ర పరిశ్రమ అన్నాక పోటీలు ఉంటాయని, కానీ తాను వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తానంటోంది. -
సికింద్రాబాద్ స్టేషన్‌ను సదరన్ జీఎం సందర్శన
సాక్షి, హైదరాబాద్: సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ రాకేష్ మిశ్రా గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, పోలీసు నిఘా, ప్రయాణికుల సదుపాయాలు, పరిశుభ్రతా చర్యలను ఆయన పరిశీలించారు. మొబైల్ హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రయాణికులకు అందుతున్న సేవలపై అధికారులతో మాట్లాడారు. ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకలను పరిశీలించారు. రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందజేసే ‘ హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్’ (హైలైట్స్) పనితీరును పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన రైల్‌నిలయంలో దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకె.శ్రీవాస్తవతో వివిధ అంశాలపై చర్చించారు. -
అభిమానులకు డబుల్ ధమాకా!
ఇప్పటి వరకు దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రుతీ హాసన్ దాదాపు ఇరవై చిత్రాలు చేస్తే, వాటిలో ఆమె తన మాతృభాష తమిళంలో చేసినవి మాత్రం రెండే రెండు. ఎప్పటికప్పుడు తమిళంలో ఎక్కువ సినిమాలు అంగీకరించాలని శ్రుతికి ఉన్నప్పటికీ డేట్స్ ఖాళీ లేక చేయలేకపోతున్నారట. కానీ, ఈ ఏడాది తన తమిళ అభిమానులను ఆనందపరిచేలా ఏకంగా రెండు సినిమాలు అంగీకరించారు. ఒకటి విశాల్ సరసన చేస్తున్న ‘పూజై’. గత కొన్నాళ్లుగా ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. తాజాగా, తమిళంలో ఓ భారీ చిత్రానికి పచ్చజెండా ఊపారు శ్రుతి. ‘తమిళంలో నేను చేయనున్న భారీ సినిమా గురించి త్వరలో ప్రకటిస్తా’ అంటూ రెండు రోజుల క్రితం ఆమె తన అభిమానులను ఊరించారు. ‘అది ఏ సినిమా అయ్యుంటుంది? ఏ హీరో సరసన శ్రుతి నటించనుంది?’ అని పలువురు చర్చించుకున్నారు. ఇప్పుడా సీక్రెట్‌ను బయటపెట్టేశారు శ్రుతి. విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వం వహించనున్న ఓ చారిత్రక చిత్రంలో కథానాయికగా నటించనున్నట్లు ఆమె ప్రకటించారు. విజయ్ లాంటి పెద్ద హీరో సరసన సినిమా చేయనుండటం ఆనందంగా ఉందని అన్నారు. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో జగదేక సుందరి శ్రీదేవి, సుదీప్ కీలక పాత్రలు చేయనున్నారు. విజయ్‌కి ఇది 58వ చిత్రం కావడంతో ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్‌గా ‘విజయ్ 58’ అని నిర్ణయించారు. ఏది ఏమైనా శ్రుతి ఇలా తమిళంలో ఒకేసారి రెండు సినిమాలు అంగీకరించడం, అందులోనూ ఒకటి పెద్ద హీరో సరసన భారీ చిత్రం కావడం అక్కడి అభిమానులకు డబుల్ ధమాకా అనే చెప్పాలి.