సికింద్రాబాద్ స్టేషన్‌ను సదరన్ జీఎం సందర్శన | A visit to the Southern Station in Secunderabad, GM | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ స్టేషన్‌ను సదరన్ జీఎం సందర్శన

Published Fri, Nov 28 2014 2:23 AM | Last Updated on Sun, Apr 7 2019 3:23 PM

సికింద్రాబాద్ స్టేషన్‌ను సదరన్ జీఎం సందర్శన - Sakshi

సికింద్రాబాద్ స్టేషన్‌ను సదరన్ జీఎం సందర్శన

సాక్షి, హైదరాబాద్: సదరన్ రైల్వే జనరల్ మేనేజర్ రాకేష్ మిశ్రా గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ప్రయాణికుల భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు,  పోలీసు నిఘా, ప్రయాణికుల సదుపాయాలు, పరిశుభ్రతా చర్యలను ఆయన పరిశీలించారు.

మొబైల్ హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రయాణికులకు అందుతున్న సేవలపై అధికారులతో మాట్లాడారు. ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్ల రాకపోకలను పరిశీలించారు. రైళ్ల రాకపోకలపై ప్రయాణికులకు ప్రత్యక్ష  సమాచారాన్ని అందజేసే ‘ హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్’ (హైలైట్స్) పనితీరును పర్యవేక్షించారు. అంతకుముందు ఆయన రైల్‌నిలయంలో  దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకె.శ్రీవాస్తవతో  వివిధ అంశాలపై చర్చించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement