బెంగళూరు: తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని ఓ వ్యక్తి తీవ్ర బెదిరింపులకు దిగాడు. ఏకంగా హత్య చేస్తానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దానికి పోలీసులు స్పందించిన తీరు.. ఆపై అతను ఇచ్చిన రిప్లై చర్చనీయాంశంగా మారాయి.
యాదగిరి జిల్లా కోడేకల్ కి చెందిన షరీఫ్ అనే వ్యక్తి ఎక్స్‌లో తల్వార్ ఫోటో పోస్టు చేసి మరీ ‘‘హత్య చేస్తా’’ అంటూ హెచ్చరించాడు. ‘మేము ఇల్లు కడుతుండగా కొందరు అడ్డుకుని బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే అక్కడ ఎవరూ పట్టించుకోలేదు’ అని ఆరోపించాడు. పైగా స్థానిక ఎమ్మెల్యే పీఏ ద్వారా ఒత్తిడి వల్లే మమ్మల్ని పోలీసులు పట్టించుకోలేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. కాబట్టి నేను ఇదే తల్వార్‌తో మర్డర్ చేస్తాను అంటూ పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు.
ఈ పోస్ట్ కు బెంగళూరు సిటీ పోలీస్ అకౌంట్ నుంచి.. ఏ పోలీస్‌స్టేషన్ కు మీరు వెళ్లారు అని ప్రశ్నించారు. కోడేకల్ ఠాణాకు వెళ్లానని, నేను మా తండ్రి నెలరోజులుగా ఠాణా చుట్టూ తిరుగుతున్నాము, పేదలం అని ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. మీరు చర్యలు తీసుకోకపోతే నేను నా చట్ట ప్రకారం మర్డర్ చేస్తానని హెచ్చరించారు. ఈ అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ನಮ್ಮ್ ಮನೆಯ ಎಲ್ಲಾ ಧಾಖಲೆ ಇದೆ
ನಮ್ಮ್ ಮನೆ ಕಟ್ಟುತಿರುವಾಗ ಜೀವ ಬೆದರಿಕೆ ಹಾಕತಾರ
ನಾವು police station complaint ಕೊಡೋಕೆ ಹೋದ್ರೆ ಅಲ್ಲಿ ಯಾರು ಕೇರ್ ಮಾಡಲ್ಲ
Station ಗೆ MLA P. A ಯಿಂದ ಹೇಳ್ತೆಸರ police ಯಾರು ಕೇರ್ ಮಾಡಲ್
ಅದ್ಕೆ ನಾ ಇದೆ ತಲ್ವಾರ್ ಯಿಂದ ಮರ್ಡರ್ ಮಾಡತೀನಿ 👇👇
ಇಲ್ಲಾ FIR ತೊಗೋಳಿ pic.twitter.com/Fwc1sbWrhw— shareef (@LoverBoy1381979) January 19, 2025
Comments
Please login to add a commentAdd a comment