కాంతారగడ | Kantara 2 Lands In Fresh Trouble, Rishab Shetty Film Accused Of Damaging Forest, Check Out For More Details | Sakshi
Sakshi News home page

కాంతారగడ

Jan 21 2025 11:28 AM | Updated on Jan 21 2025 12:38 PM

Kantara 2 lands in fresh trouble Rishab Shetty film accused of damaging forest

అడవిలో మంటలు, పేలుళ్ల మధ్య షూటింగ్‌

స్థానిక గ్రామస్తుల తీవ్ర అభ్యంతరం  

అటవీ అధికారుల తనిఖీ  

అతిక్రమణలుంటే షూటింగ్‌ బంద్‌: మంత్రి  

యశవంతపుర: హిట్‌ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్‌ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్‌ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్‌ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్‌ సినిమా షూటింగ్‌ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్‌ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం.
  
షూటింగ్‌ అనుమతులు ఇలా 
జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్‌ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్‌ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్‌ ఎసీఎఫ్‌ మధు, ఆర్‌ఎఫ్‌ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్‌ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్‌ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.  

నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రే
ఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్‌ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్‌ను బంద్‌ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్‌ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్‌ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్‌ కొనసాగడం అనుమానంగా ఉంది.


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement