Talwar
-
బుల్లెట్ ఎక్కాలే తల్వార్ తిప్పాలే
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక మహిళ గాల్లో తల్వార్ ఊపుతూ బుల్లెట్‌పై వీరవిహారం చేసింది. మరో మహిళ టాప్‌లెస్ జీప్‌ను ఒంటి చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేతితో తల్వార్‌ను గాలిలో ఝుళిపించింది. ఒక మహిళ స్కూటీ డ్రైవ్ చేస్తుంటే మరొక మహిళ వెనుక సీటులో నిల్చొని గాల్లో తల్వార్‌తో విన్యాసాలు చేసింది. ఆ రాత్రి దుర్గామాత మండపం సమీపంలో మహిళలు చేసిన రకరకాల స్టంట్స్‌కు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వీడియోలకు మిశ్రమ స్పందన లభించింది. కొందరు ‘ఆహా ఓహో’ అని అబ్బురపడితే మరికొందరు ‘ఇలాంటి సాహసాలు తగవు’ అని ఖండించారు. -
జెనరిక్ ఔషధాలంటే నాసిరకం కాదు!
వైద్యులు తప్పనిసరిగా జెనరిక్ ఔషధాలనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఓ ప్రకటన విడుదల చేసి, వైద్యుల ఆందోళన అనంతరం ఆ నిర్ణయాన్ని నిలిపివేసింది. దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జెనరిక్ ఔషధాలు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దీని కారణంగానే, రోగులు వాటిని ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. అధిక ధర ఉన్నప్పటికీ ‘బ్రాండెడ్’ మందులను తీసుకోవడానికే మొగ్గుచూపు తున్నారు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం, లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నాసిరకం మందులు (కలుషితమైనవి అయినా లేదా నాణ్యత లేనివైనా) ఉత్పత్తవుతాయి. అందువల్ల, మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ప్రపంచ ఫార్మసీగా భారత్‌ను పేర్కొంటారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో జెనరిక్ మందులు భారత్ నుండి ఎగుమతి అవుతాయి. 21వ శతాబ్ది ప్రారంభం వరకు, మన దేశంలోని పేటెంట్ వ్యవస్థ ఉత్పత్తి పేటెంట్లను కాకుండా ప్రక్రియ పేటెంట్లను మాత్రమే అనుమతించింది. ఇది భారతీయ ఔషధ పరిశ్రమకు, పేటెంట్ ఉల్లంఘనకు పాల్పడకుండా ఔషధాలను తయారు చేయడానికి అవకాశాన్ని కల్పించింది. ‘రివర్స్ ఇంజనీరింగ్’ విధానం వల్ల వివిధ తయారీ ప్రక్రియలు అభివృద్ధి చెందగలవు. భారతీయ తయారీ రంగం విజయగాథల్లో ఒకటిగా భారతదేశ ఔషధ రంగాన్ని పరిగణిస్తున్నారు. ప్రత్యేకంగా, హెచ్ఐవి/ ఎయిడ్స్, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్ లు వంటి సంక్లిష్ట రంగాల్లో ఇవాళ మనం ప్రపంచం మొత్తానికి జెనరిక్ ఔషధాలకు సంబంధించి అతిపెద్ద సరఫరాదారుగా ఉన్నాము. ‘బ్రాండెడ్’ ఔషధాల లాగే జెన రిక్ మందులు కూడా అదేవిధమైన క్రియాశీల పదార్థం కలిగినవి కాబట్టి, ఒకేరకమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. జెనరిక్ ఔషధాల ధర తక్కువగా ఉండటమే వాటిని సమర్థించ డానికి ప్రధాన కారణం. ఎందుకంటే అవి పదేపదే జంతు, క్లినికల్ అధ్యయనాలకు గురికావాల్సిన అవసరం లేదు. ధర సమస్య దృష్ట్యా, అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా ముఖ్యమైనవి. అలాగే ఇవి ప్రపంచానికి విపరీతంగా ప్రయోజనం చేకూర్చాయి. ఔషధాల నాణ్యత విషయంలో ఏ విధమైన రాజీ ఉండకూడదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే దేశంలో అందుబాటులో ఉన్న కొన్ని జెనరిక్ మందులు నాసిరకమైనవన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దీని కారణంగానే, రోగులు సహేతుకంగానే జెనరిక్ ఔషధాలను ఉపయోగించడానికి ఇష్టపడటం లేదు. అధిక ధర ఉన్నప్పటికీ బ్రాండెడ్ మందులను తీసుకోవడానికే వీరు తరచుగా మొగ్గు చూపు తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జన్ ఔషధి ఔట్లెట్లలో పేలవమైన అమ్మకాలే దీనికి నిదర్శనం. వైద్యులు తప్పనిసరిగా జెనరిక్ మందులనే రాయాలని ఇటీవల జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఓ ప్రకటన విడుదల చేసింది. అందుబాటులో ఉన్న జెనరిక్ ఔషధాల నాణ్యతకు సంబంధించిన తీవ్రమైన సమస్యను ఇది తెరపైకి తెచ్చింది. ఆ ప్రకటనపై వైద్యులు సముచితమైన ఆందోళనలను వ్యక్తం చేశారు. ఇది మీడియాలో ప్రముఖంగా వచ్చింది. దీంతో జెనరిక్ ఔషధాలను వైద్యులు తప్పని సరిగా రాయడానికి సంబంధించిన తన నిర్ణయాన్ని ఎన్ ఎంసి ప్రస్తు తానికి నిలిపివేయడం సరైన చర్య. ఏదేమైనప్పటికీ, జెనరిక్ ఔషధాల ప్రాధాన్యతపై దృష్టి సారించాల్సిన అవసరమైతే ఉంది. నిజానికి, ఆరోగ్య సంరక్షణ కోసం పెట్టే ఖర్చును తగ్గించడానికి జెనరిక్ ఔషధాల వినియోగం చక్కటి మార్గం. ప్రభుత్వం కూడా నాణ్యమైన జెనరిక్‌లను నిర్ధారించడానికి అన్ని విధాలా కృషి చేయాలి. మన దేశంలో నకిలీ లేదా నాసిరకం ఔషధాలు ఉండటం, ప్రధా నంగా పేలవమైన క్రమబద్ధీకరణ వ్యవస్థ ఫలితమే. అలాంటి కొన్ని మందుల ఉపయోగం తర్వాత ఉత్పన్నమైన తీవ్రమైన సమస్యలకు సంబంధించిన సంఘటనలు కూడా బయటకు వచ్చాయి. గత సంవత్సరం, ఒక కంపెనీ తయారు చేసిన ప్రొపోఫోల్ ఇంజెక్షన్‌ను ఉపయోగించడం వల్ల ఏర్పడిన ప్రతికూల ఫలితాలు, ఆఖరికి మరణం సంభవించడం కూడా చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ దృష్టికి వచ్చింది. భారతదేశం నుండి ఎగుమతైన దగ్గు సిరప్ వాడకం వల్ల గాంబి యాలో నమోదైన మరణాలు, ఫార్మా హబ్‌గా మన దేశానికి ఉన్నపేరు ప్రతిష్ఠను దెబ్బతీశాయి. నాసిరకం మందులు వాడిన తర్వాత ఉండే ప్రమాదాల్లో తగిన రీతిలో లేని ప్రతిస్పందన, ఆ ఔషధానికి నిరోధకత అభివృద్ధి కావడం వంటివి తీవ్రమైన ఆందోళన కలిగించే అంశాలు. సమర్థవంతమైన నియంత్రణ యంత్రాంగం లేనప్పుడు, కొన్ని ఔషధ తయారీ సంస్థలు డబ్బును ఆదాచేసుకునే ప్రయత్నంలో, అంత ర్జాతీయంగా ఆమోదించిన ఉత్తమ పద్ధతులను అనుసరించకుండా విస్మరిస్తున్నాయి. వీటి ఉత్పత్తుల విషయంలో కంపెనీలు చాలా తరచుగా రాజీపడి పోతు న్నాయి. నిర్లక్ష్యం, కల్తీ ఉండటం వంటి నిజాయితీ లేని పద్ధతులను కూడా గమనించవచ్చు. సాధారణంగా తయారీ ప్రక్రియలో నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా తప్పు చేయడం వలన నకిలీ మందులు (కలుషితమైనవి అయినా లేదా నాణ్యత లేనివైనా) సంభవిస్తాయి. ఇది ఏ విధంగానూ ఆమోదయోగ్యం కాదు. దీన్ని తీవ్రంగా ఖండించాల్సి ఉంది. బ్రాండెడ్ ఔషధాల లాగే ప్రభావవంతమైనవనీ, సురక్షితమైన వనీ, వాటికి ప్రత్యామ్నాయం కాగలవనీ తగిన ధ్రువీకరణ జరిగిన తర్వాత మాత్రమే యూరోపియన్ దేశాలు, అమెరికా జెనరిక్ ఔషధా లను ఉపయోగించడానికి ఆమోదిస్తాయనేది అందరికీ తెలిసిందే. జెనరిక్ ఔషధాలను ఆమోదించడానికి కఠినమైన సమీక్షా ప్రక్రియ అమలులో ఉంటుంది. ఉదాహరణకు, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ), ఉత్తమ ఉత్పాదక పద్ధతులకు అను గుణంగా ఉండేలా తయారీ ప్లాంట్లను కూడా తనిఖీ చేస్తుంది. ఇది జెనరిక్ ఔషధాలపై రోగి విశ్వాసాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఐఎమ్ఎస్ హెల్త్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, జెనెరిక్ మందులు అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఒక దశాబ్దంలో (2009– 2019) దాదాపు 2.2 ట్రిలియన్ డాలర్లను ఆదా చేశాయి. జెనరిక్ ఔషధాలు ఎంత ముఖ్యమైనవో ఈ సొమ్మే చెబుతోంది. అందువల్ల, మనం పాఠాలు నేర్చుకుని, మన నియంత్రణ యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. కచ్చిత మైన నాణ్యతా నియంత్రణ చర్యలు అమలులో లేకుంటే, అసమర్థ మైన మందులు, తీవ్రమైన దుష్ప్రభావాల రూపంలో జంట ప్రమా దాలు అలాగే ఉంటాయి. మన ప్రస్తుత విధాన మార్గదర్శకాలను పునఃపరి శీలించి, అమలు ప్రక్రియను బలోపేతం చేయడం తక్షణ అవసరం. పూర్తి శిక్షణ పొందిన నిపుణులు నిర్వహించే పరీక్షా సౌకర్యాల రూపంలో తగిన మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుతమున్న చట్టబద్ధమైన, ఇతర రక్షణలకు చెందిన కచ్చి తమైన పర్యవేక్షణ చాలా ముఖ్యమైనది. చట్టపరమైన నియంత్రణ విధానాలు కంపెనీలు స్వీయనియంత్రణను ప్రోత్సహించే విధంగా నిర్మాణాత్మకంగా ఉండాలి. అయితే వికృతమైన కేసులను సాహసంతో ఎదుర్కో వటానికి సంకల్పం ఉండాలి. భారతదేశంలో ఔషధాల నాణ్యతను నియంత్రించడానికి బాధ్యత వహించే ‘సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్’ (సీడీఎస్‌సీవో)ను తప్పనిసరిగా బలోపేతం చేయాలి. మన ఔషధ అప్రమత్తత, నిఘా వ్యవస్థ జాగరూకత కార్యక్రమా లను కూడా శక్తిమంతం చేయాల్సిన అవసరం ఉంది. మార్కెటింగ్ అనంతరం మన ఉత్పత్తుల భద్రతను నిర్ధారించడానికి ఇవి మార్గాలు. ఔషధ హెచ్చరికల తర్వాత, వాటిని వెనక్కి తీసుకునే ఏ తదుపరి చర్య నైనా తప్పనిసరిగా పబ్లిక్ డొమైన్ లో వీలైనంత త్వరగా ఉంచాలి. నాణ్యమైన జెనరిక్ ఔషధాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఇక బ్రాండెడ్ మందులను మార్కెట్ చేయవద్దని ప్రభుత్వం ఔషధ కంపెనీలను ఆదేశించాలి. ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ మార్కె టింగ్ బడ్జెట్లను తగ్గించి, పరిశోధన, అభివృద్ధితో పాటు నాణ్యతా నియంత్రణపై ఎక్కువ ఖర్చు చేసేలా ప్రోత్సహించాలి. నాణ్యమైన జెనరిక్ ఔషధాలను నిర్ధారించే సవాలును సీడీఎస్సీఓ తప్పనిసరిగా ఎదుర్కోవాలి. మన ఇంటిని మనం చక్కదిద్దుకున్న తర్వాత, జాతీయ వైద్య కమిషన్ ఆదేశాన్ని స్వాగతించవచ్చు. డాక్టర్ కె.కె. తల్వార్ వ్యాసకర్త పీజీఐఎంఈఆర్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
పెళ్లి రిసెప్షన్లో యువకుల హల్చల్.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు
సాక్షి, కామారెడ్డి: పెళ్లి రిసెప్షన్లో కొందరు యువకుడు వీరంగం సృష్టించారు. తుపాకీలు, కత్తులు చేతపట్టి డ్యాన్స్ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 10వ తేదీ రాత్రి మద్నూర్ మండల కేంద్రంలో జరిగిన పెళ్లి రిసెప్షన్ జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కొడుకుతోపాటు మరికొందరు యువకులు తల్వార్, గన్లతో డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ వీడియోలను కొందరు ఫేస్బుక్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి ఈ విషయం పోలీసులకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ వరుడితోపాటు స్నేహితులనుఅదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
నిజాం నవాబుల ఖడ్గం స్టైలే వేరు.. పాము ఆకారం, రంపపు పళ్లు..
హైదరాబాద్ సంస్థానాన్ని ఏలిన నిజాంలకు చెందిన అరుదైన, పాము ఆకార ఖడ్గం ఇది. ఇండో–పర్షియన్ డిజైన్, రంపపు పళ్ల తరహాలో రెండు వైపులా ఉన్న పదునైన మొనలు, బంగారు పూత పూసిన ఏనుగు, పులి బొమ్మలతో కూడిన ఈ ఖడ్గం 117 ఏళ్ల తర్వాత యూకే నుంచి తిరిగి భారత్‌కు చేరుకుంది. త్వరలోనే మన భాగ్యనగరానికి చేరుకోనుంది. ఈ నేపథ్యంలో దీని చరిత్ర, విదేశాలకు ఎలా తరలి వెళ్లింది..? ఇప్పుడు ఎలా స్వదేశం చేరుకుంటోంది వంటి వివరాలను తెలుసుకుందాం. అధికార దర్పానికి చిహ్నంగా... క్రీస్తు శకం 1,350లో తయారైన ఈ కరవాలాన్ని 1896 నుంచి 1911 మధ్య హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ తన అధికార దర్పానికి, సైనిక శక్తిసామర్థ్యాలకు చిహ్నంగా పలు వేడుకల్లో ప్రదర్శించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 1903లో భారత్‌ను పాలించే బ్రిటిష్ చక్రవర్తిగా కింగ్ ఎడ్వర్డ్–7, క్వీన్ అలెగ్జాండ్రల పట్టాభిషేక మహోత్సవం ఢిల్లీ దర్బార్‌లో అట్టహాసంగా జరిగిందని, ఈ వేడుకలో పాల్గొన్న సందర్భంగా మీర్ మహబూబ్ అలీఖాన్ ఈ ఖడ్గాన్ని ప్రదర్శించారని పేర్కొన్నారు. చోరీయా లేక విక్రయమా.. మీర్ మహమూబ్ అలీఖాన్ పాలనలోనే ఈ ఖడ్గం మాయమైందని చరిత్రకారులు పేర్కొనగా ఈ ఖడ్గం సహా మరికొన్ని విలువైన వస్తువులను చోరీకి గురైన వస్తువులుగా ప్రభుత్వం పేర్కొంటూ వచ్చింది. బ్రిటిషర్ల వాదన మరోలా ఉంది. 1905లో నాటి బ్రిటిష్ సైన్యంలోని బాంబే కమాండ్‌కు చెందిన కమాండర్ ఇన్ చీఫ్ సర్ హంటర్ దీన్ని హైదరాబాద్ సంస్థాన ప్రధాని బహదూర్ నుంచి కొనుగోలు చేశారని, 1978లో ఆయన మేనల్లుడు ఈ ఖడ్గాన్ని స్కాట్లాండ్లోని గ్లాస్గో లైఫ్ మ్యూజియంకు దానం చేసినట్లు రికార్డుల్లో ఉంది. ఈ ఖడ్గం ఆరో నిజాం నుంచి నాటి ప్రధాని వద్దకు ఎలా వచ్చిందన్నది తెలియరాలేదు. తిరిగి స్వదేశానికి.. భారత్‌తో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా భారత్‌కు చెందిన 7 చారిత్రక వస్తువులను స్కాట్లాండ్ గత నెలలో తిరిగి అప్పగించింది. ఆ ఏడు వస్తువుల్లో నిజాం కాలంనాటి పాము ఆకార ఖడ్గం, 10వ శతాబ్దానికి చెందిన సూర్యదేవుని విగ్రహం మొదలైనవి ఉన్నాయి. పాము ఆకార ఖడ్గం నిజాంలకు చెందినది కాబట్టి కేంద్రం దాన్ని హైదరాబాద్‌కు పంపే అవకాశం ఉందని సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్‌రెడ్డి తెలిపారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
కేక్ కట్ చేశాడు! దెబ్బకు జైలుకెళ్లాడు
దొడ్డబళ్లాపురం: పుట్టినరోజునాడు పెద్ద కత్తితో కేక్‌ను కట్ చేసిన ముగ్గురిని ఉడుపి జిల్లా పడుబిద్రి పోలీసులు అరెస్టు చేసారు. జితేంద్రశెట్టి, గణేశ్ పూజారి, శరత్శెట్టి అరెస్టయిన యువకులు. మే 30న పడుబిద్రెలో జితేంద్రశెట్టి ఇంట్లో బర్త్‌డే సందర్భంగా తల్వార్‌తో కేక్‌ను కోశారు. ఈ వీడియోను వైరల్ చేయగా, పోలీసులు కేసు నమోదు పై ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. పెద్ద కత్తిని కలిగి ఉండడం, దానిని ప్రదర్శించడం చట్టరీత్యా నేరమవుతుంది. సినిమాలో నష్టపోయి రియాల్టీలో మోసాల యశవంతపుర: స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేసి పరారైన కేసులో సినీ నిర్మాత మంజునాథ్‌తో పాటు కేకే శివకుమార్, చంద్రశేఖర్, సీ శివకుమార్ అనేవారిని రాజాజీనగర పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాత మంజునాథ్ నటుడు కోమల్‌తో లొడ్డె అనే సినిమాను నిర్మించారు. ఇంకా విడుదల కాలేదు. కానీ సినిమా ద్వారా అతనికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో రియల్ఎస్టేట్ వ్యాపారం ప్రారంభించి తక్కువ ధరలకు స్థలాలను ఇప్పిస్తామని ప్రకటన ఇవ్వటంతో అనేక మంది క్యూ కట్టారు. పలువురి నుంచి డబ్బులు కూడా కట్టించుకుని ఆఫీసుకు తాళం వేశారు. దీంతో బాధితులు ఫిర్యాదు చేయడంతో మంజునాథ్‌ను, అనుచరులను అరెస్టు చేశారు. (చదవండి: బాల్యం బడికి దూరం) -
తల్వార్‌తో కేక్ కట్ చేసిన రామ్ గోపాల్ వర్మ
-
బర్త్‌డే వేడుకల్లో తల్వార్‌తో వీరంగం
-
తల్వార్ వోల్వో షోరూం ఎండీ అరెస్ట్
బంజారాహిల్స్: కారుకు రుణం పేరిట ఫైనాన్స్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొని కారు డెలివరీ చేయకుండా పథకం ప్రకారం మోసగించిన ఘటనలో బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని తల్వార్ వోల్వో షోరూం ఎండీ సాకేత్ తల్వార్‌ను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నెక్లెస్ రోడ్ బుద్ధ భవన్ వెనక ఉన్న విజయ్‌కాంత్ ఫైనాన్స్ మేనేజర్ గులాం అబ్రార్‌ను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 86లోని ఫేజ్–2లో నివసించే అబ్దుల్ యాకుబ్ గత ఏడాది జూన్ 27న కొత్త వోల్వో కారు కొనుగోలు చేయాలనుకుంటున్నానని రుణం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. అన్ని పత్రాలను పరిశీలించిన ఫైనాన్స్ కంపెనీ అబ్దుల్ యాకుబ్‌కు రూ.70 లక్షలు రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మేరకు రూ.67.23 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా తల్వార్ కార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాకు జమచేసి మొదటి ఈఎంఐ కింద రూ.2.76 లక్షలు ఇచ్చింది. అబ్దుల్ యాకుబ్ ఈ కారును ఇవ్వడంలో సాకేత్ తల్వార్ తీవ్ర జాప్యం చేశారు. ఇదేంటని ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ గులాం అబ్రార్ అలీ నాలుగైదుసార్లు కలిసి సాకేత్ తల్వార్‌ను ప్రశ్నించారు. తమ మేనేజర్ సొహైల్‌ను కలవాలంటూ ఒకసారి, ఇంకా మంజూరు కాలేదని మరోసారి సాకేత్ తప్పించుకోసాగాడు. ఇటీవల కారు కోసం ఆరా తీయగా తమ పేరు మీద కారు కేటాయించారని, దాన్ని మరొకరికి సాకేత్ విక్రయించారని తేలడంతో షాక్‌కు గురయ్యారు. మరింత ఆరా తీయగా ఇప్పటికే సాకేత్ తల్వార్ వంద మంది వరకు ఇలా కార్ల ముసుగులో మోసగించినట్లు తేలింది. తాను మోసపోయానని తెలుసుకున్న ఫైనాన్స్ సంస్థ మేనేజర్ గత నెల 2న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అప్పటి నుంచి నిందితుడు తప్పించుకు తిరుగుతున్నాడు. గట్టి నిఘా వేసిన పోలీసులు కొండాపూర్‌లోని బొటానికా విల్లాస్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సాకేత్‌తో చేతులు కలిపి మోసానికి పాల్పడ్డ అబ్దుల్ యాకుబ్, ఎంఏ సొహైల్లపై కూడా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వీరి కోసం గాలిస్తున్నారు. -
విమానయాన సంస్థలతో తల్వార్ లింకులపై దర్యాప్తు
న్యూఢిల్లీ: కార్పొరేట్ లాబీయిస్ట్ (వ్యవహారాల నేర్పరి) దీపక్ తల్వార్‌కు దేశ, విదేశాలకు చెందిన 50 సంస్థలతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు ఏజెన్సీలు దృష్టి సారించాయి. తన విదేశీ క్లయింట్లకు అనుకూలంగా ఎయిర్ ట్రాఫిక్ హక్కులను సంపాదించేందుకు గాను ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయనేతలకు తల్వార్ లంచాలు ఇచ్చినట్టు.. తద్వారా విమానయాన సంస్థల నుంచి తల్వార్‌కు రూ.272 కోట్లు ముట్టినట్టు దర్యాప్తు నివేదిక స్పష్టం చేస్తోంది. యూపీఏ హయాంలో తల్వార్ లాబీయింగ్ వ్యవహారాలు, ముఖ్యంగా విమానయాన రంగానికి సంబంధించిన వాటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ దర్యాప్తు చేస్తున్నాయి. ప్రస్తుతం తల్వార్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ ఆరోపణలను ఆయన ఖండించడం గమనార్హం. ఎయిర్ఇండియా ప్రయోజనాలకు గండికొట్టి.. 2008–09లో మూడు విదేశీ విమానయాన కంపెనీలకు అనుకూలంగా ట్రాఫిక్ హక్కులను తల్వార్ సంపాదించిపెట్టినట్టు దర్యాప్తు ఏజెన్సీలు అభియోగాలు మోపాయి. -
వైరల్: కత్తులతో కేంద్రమంత్రి నృత్యం
గాంధీనగర్ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కత్తులు చేత పట్టారు. అంతేకాదు కరవాలాలను అలవోకగా తిప్పుతూ డాన్స్ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్‌కు కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వామి నారాయణ గురుకుల్ ఫౌండేషన్ అధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమ నిర్వాహకులు విజ్ఞప్తి మేరకు.. కేంద్రమంత్రి పిల్లలతో కలిసి స్టేజ్ మీద కత్తులు పట్టుకుని నృత్యం చేశారు. ఈ నృత్యం పేరు 'తల్వార్ రాస్'. ఇది సాంప్రదాయ జానపద నృత్యం. గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రసిద్ది చెందిన నృత్యం ఇది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. రెండు చేతుల్లో కత్తులు పట్టుకొని డాన్స్ చేయడం. విద్యార్థులతో పాటు స్మృతి ఇరానీ కూడా వారితో సమానంగా స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH Gujarat: Union Minister Smriti Irani performs ‘talwar raas’, a traditional dance form using swords, at a cultural programme in Bhavnagar. (15.11.19) pic.twitter.com/xBgZyDHG45 — ANI (@ANI) November 15, 2019 -
తల్వార్‌తో రౌడీషీటర్ వీరంగం
లంగర్‌హౌస్: బస్తీలో మద్యం తాగుతూ గొడవ చేయవద్దు అన్నందుకు ఓ రౌడీషీటర్ తల్వార్‌తో దాడి చేయడంతో ఏడుగురు వ్యక్తులు గాయపడిన సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం అర్దరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గండిపేట మండలం, గంధంగుడ గ్రామానికి చెందిన నాగరాజు అలియాస్ బిట్టు రౌడీషీటర్. ఇతనిపై దారి దోపిడీ, బెదిరింపుల కేసులు ఉన్నాయి. ఆదివారం రాత్రి అతను నార్సింగికి చెందిన లక్ష్మణ్‌తో కలిసి లంగర్‌హౌస్ వచ్చారు. ఇద్దరు కలిసి అంబేద్కర్‌నగర్‌లోని ఓ కిరాణా దుకాణం ఎదుట ఉన్న ఆటోలో కూర్చొని మద్యం తాగారు. మద్యం మత్తులో కేకలు వేస్తుండటంతో దుకాణ యజమాని బయటికి వచ్చి వారిని నిలదీయగా అదే ప్రాంతానికి చెందిన సాయి స్నేహితులమని చెపాక్పరు. వెళ్లకపోతే పోలీసులను పిలుస్తా అని యజమాని ఫోన్ తీసుకోగా అతడిని చంపుతామని బెదిరించారు. దీంతో స్థానికులు అక్కడ గుమిగూడటంతో... వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే లాల్‌దర్వాజ అమ్మవారి దర్శనం చేసుకొని స్నేహితులతో కలిసి ఇంటికి వస్తున్న సాయి వినయ్ స్థానికులను వివరాలు అడగ్గా ఇద్దరు వ్యక్తులు నీ పేరు చెప్పి తాగుతు గొడవ చేసినట్లు తెలిపారు. వారు బాపూఘాట్ వైపు వెళ్లినట్లు చెప్పడంతో స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లిన సాయికి ఆరాధన హోటల్ ఎదుట నాగరాజు లక్ష్మణ్ కనిపించారు. దీంతో అతను లక్ష్మణ్‌ను పక్కకు పిలిచి బస్తీకి వచ్చి తాగి గొడవ చేసి తమకు చెడ్డ పేరు తేవద్దని కోరాడు. దీంతో ఆగ్రహానికిలోనైన నాగరాజు తన వెంట తెచ్చుకున్న తల్వార్‌తో వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో కిరణ్, సాయి వినయ్, లక్ష్మణ్, సునీల్‌కుమార్, సాయి కిరణ్‌లకు గాయాలయ్యాయి. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సుందర్, విజయ్‌కుమార్‌లపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
మొన్న బెల్లి డ్యాన్స్.. నిన్న తల్వార్ డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని చాంద్రాయణగుట్ట రౌడీ రాజ్యంగా మారుతోంది. ఈ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు పెళ్లి వేడుకల్లో తమ స్థాయిని ప్రదర్శించుకోవడానికి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన ఓ పెళ్లి వేడుకలో బెల్లి డ్యాన్స్ పేరిట అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇది మరవక ముందే మరో వివాహా వేడుకలో కొందరు తల్వార్ డాన్స్ పేరిట సామాన్య జనాలను బెదిరిపోయేలా చేశారు. చాంద్రాయణగుట్టలోని బండ్లగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన పెళ్లి వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫంక్షన్ హాల్ వెలుపల మెయిన్ రోడ్‌పై మూడు గంటలపాటు తల్వార్ డ్యాన్స్‌లు చేశారు. ఇది చూసిన సామాన్య ప్రజలు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. ఇది జరిగి 48 గంటలు గడిచిన ఇప్పటివరకు దీనికి కారణమైన వారిపై పోలీసు శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తమ ప్రాంతంలో ఇలాంటి కార్యకలపాలు చోటుచేసుకోవడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదవండి : చాంద్రాయణగుట్టలో బెల్లి డ్యాన్స్ -
భూతమంటే ఇష్టం..
జనరేషన్ తాటిచెట్టు అంత ఎత్తు.. అరటి బోదెల్లాంటి చేతులు.. తల్వార్ లాంటి పళ్లు.. రెండు మూడు అడుగుల గోర్లు.. వామ్మో వాడే ఒంటి కన్ను రాక్షసుడు. సమాధుల్లో కొరివి దయ్యం. మర్రిచెట్టు మీద భూతాలు.. ఊరి పొలిమేరల్లో పిశాచాల దిబ్బలు.. బాబోయ్ తలచుకుంటే గుండె రైలు అరుు్య వేగంగా పరిగెత్తేది. కాళ్లు రైసు మిల్లుల్లో మిషన్లా టకటకా కొట్టుకొనేవి. పెదాలు వైబ్రేషన్‌కు గురై వణికేవి. చుక్కల చుక్కల పొట్టి నిక్కరు తడిచేది. కొన్నిసార్లు డయేరియూ సింటమ్స్ కనిపించేవి. సగం వెన్నెల రూఫ్ కింద.. తారల గుడ్డి వెలుతురు మధ్య.. కుక్కల డీటీఎస్ సౌండ్ వింటూ.. నక్కల ఊళలకు గుండె జారుతూ ఇంటిముందు పట్టెమంచంపై పడుకునేవాడిని. పదిమీటర్ల దూరంలోనే పాడుబడిన మా బడికొష్టం రాజ కోటలాంటి మందమైన గోడలు.. పగిలిపోరుు భయంకర శబ్దం చేసే వెదురు బొంగులు.. అప్పుడప్పుడు ఠపీమని కిందపడే పెంకు ముక్కల భీకర శబ్దం. ఇంటిచుట్టూ దట్టమైన చెట్లు..వాటిమీద చేరిన గుడ్లగూబల అరుపులు... బహుశా నాకు ఐదారేళ్లు ఉంటాయేమో. అప్పటికి ఇంకా గ్రామాల్లో పూర్తిస్థారుులో విద్యుదీకరణ జరగలేదు. ఎనిమిది గంటలకే చుట్టు పక్కల కిరోసిన్ దీపాలు గుడ్‌నైట్ చెప్పేవి. అప్పుడప్పుడు వచ్చే చల్ల గాలి నాతో స్నేహం చేస్తానని బతిమాలేది. కానీ నాలోని ఆలోచనలు దయ్యూలపై రీసెర్చ్ చేసేందుకు పోటీ పడుతుండేవి. ‘గుర్రు..గుర్రు’మనే మానాన్న గురక ‘రేయ్ వెధవా నిద్రపో’ అనే సందేశాన్ని పంపిస్తూ ఉండేది. చాలాసేపటికి కళ్లు మంటలను మోసుకొచ్చేవి. నిండిన గాల్‌బ్లాడర్ చిమ్మచీకటి దెబ్బకు సెలైంట్ అయ్యేది. సీన్ కట్ చేస్తే.. నా మూడేళ్ల గారాల పట్టి ఓ అర్ధరాత్రి ‘నాన్నా’ అని పొలికేక పెట్టి ఉలిక్కిపడి లేచింది. కలత నిద్రలో ఉన్న నేను.. కదలకుండా పడుకున్న ‘నాలో సగం’ ఇద్దరం లేచాం. ‘ఏమైందమ్మా’ అని మా చిన్నారిని అడిగాం. అది నిద్రలో కూడా నవ్వుతూ ‘దయ్యం వచ్చింది’ అని ముసిముసి నవ్వులు చిందించి టప్మని పడుకుంది. ఎంత ఆశ్చర్యం? ఎంత మార్పు!.. ముప్పై, నలభై ఏళ్ల క్రితం టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో.. అప్పుడప్పుడే రవాణా మార్గాలు.. వాహనాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో చిన్నారుల ప్రవర్తన మరోలా ఉండేది. ‘అమ్మా కథ చెప్పవా’ అని అడిగినప్పుడు భుజంపై బేతాళుడిని వేసుకున్న విక్రమార్కుని కథ చెప్పగానే బుడతలంతా చప్పుడు చేయకుండా గాఢనిద్రలోకి జారుకొనేవారు. రాత్రి ఏడు గంటలు దాటితే తలుపులన్నీ మూసుకొనేవి. కీచురాళ్ల రొద.. కప్పల బెకబెకలు... చీకటి భీతావహ వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఉండేవి. ఇప్పడు..? దయ్యూలు, పిశాచాలు అంటే పిల్లలకు కామెడీగా మారింది. ఓ కార్టూన్ చానల్లో డెవిల్ను పిల్లలు తమ బానిసగా మార్చుకుంటారు. అది భయపెట్టడానికి ప్రయత్నిస్తే ‘అంత సీన్లేదులే’ అని లైట్‌గా తీసుకుంటారు. వారి టార్చర్‌కు భూతం కుమిలిపోతూ ఉంటుంది. ఇక వారికి అవంటే భయం ఎలా పుడుతుందీ! ! మొత్తానికి మా జనరేషన్‌ను.. అంతకుముందు తాత ముత్తాతలను భయపెట్టిన భూతాలు నేటి తరాన్ని ఏమీ చేయలేకపోతున్నారుు. ఎక్కడ జోకర్లుగా మారుతామోనని దిగులేసుకుంటున్నారుు. మళ్లీ భూమ్మీద నూకలుంటే పిశాచాల అవతారం వద్దు నాయనా అని తీర్మానం చేసుకున్నారుు. మరి పిల్లలా పిడుగులా..! - సంధ్యా సుందర్. ఎస్ -
పెళ్లి చేయడం లేదని తండ్రిపై తల్వార్‌తో దాడి
జగద్గిరిగుట్ట: పెళ్లి చేయడం లేదని, ఆస్తి ఇవ్వడం లేదని తండ్రిపై కొడుకు తల్వార్‌తో దాడి చేశాడు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... సుభాష్‌చంద్రబోస్‌నగర్‌లో నివాసముండే షాబుద్దీన్‌కు కుమారులు నాజుద్దీన్ (33), నిజాముద్దీన్ సంతానం. చిన్న కుమారుడికి వివాహం చేశారు. పెద్ద కుమారుడు నాజుద్దీన్ పని, పాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడు. తనకు కూడా పెళ్లి చేయాలని, ఆస్తి ఇవ్వాలని తల్లిదండ్రులపై అతను కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తండ్రిపై కక్షపెంచుకున్న నాజుద్దీన్ ఆదివారం తల్వార్‌తో దాడి చేశాడు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాబుద్దీన్‌ను చికిత్స నిమిత్త ఆస్పత్రి తరలించి నాజుద్దీన్ను అదుపులోకి తీసుకున్నారు.