భూతమంటే ఇష్టం.. | Like the devil .. | Sakshi
Sakshi News home page

భూతమంటే ఇష్టం..

Published Sun, Jul 3 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

భూతమంటే ఇష్టం..

భూతమంటే ఇష్టం..

జనరేషన్

తాటిచెట్టు అంత ఎత్తు.. అరటి బోదెల్లాంటి చేతులు.. తల్వార్ లాంటి పళ్లు.. రెండు మూడు అడుగుల గోర్లు.. వామ్మో వాడే ఒంటి కన్ను రాక్షసుడు. సమాధుల్లో కొరివి దయ్యం. మర్రిచెట్టు మీద భూతాలు.. ఊరి పొలిమేరల్లో పిశాచాల దిబ్బలు.. బాబోయ్ తలచుకుంటే గుండె రైలు అరుు్య వేగంగా పరిగెత్తేది. కాళ్లు రైసు మిల్లుల్లో మిషన్‌లా టకటకా కొట్టుకొనేవి. పెదాలు వైబ్రేషన్‌కు గురై వణికేవి. చుక్కల చుక్కల పొట్టి నిక్కరు తడిచేది. కొన్నిసార్లు డయేరియూ సింటమ్స్ కనిపించేవి.
    
 
సగం వెన్నెల రూఫ్ కింద.. తారల గుడ్డి వెలుతురు మధ్య.. కుక్కల డీటీఎస్ సౌండ్ వింటూ.. నక్కల ఊళలకు గుండె జారుతూ ఇంటిముందు పట్టెమంచంపై పడుకునేవాడిని. పదిమీటర్ల దూరంలోనే పాడుబడిన మా బడికొష్టం రాజ కోటలాంటి మందమైన గోడలు.. పగిలిపోరుు భయంకర శబ్దం చేసే వెదురు బొంగులు.. అప్పుడప్పుడు ఠపీమని కిందపడే పెంకు ముక్కల భీకర శబ్దం. ఇంటిచుట్టూ దట్టమైన చెట్లు..వాటిమీద చేరిన గుడ్లగూబల అరుపులు... బహుశా నాకు ఐదారేళ్లు ఉంటాయేమో. అప్పటికి ఇంకా గ్రామాల్లో పూర్తిస్థారుులో విద్యుదీకరణ జరగలేదు. ఎనిమిది గంటలకే చుట్టు పక్కల కిరోసిన్ దీపాలు గుడ్‌నైట్ చెప్పేవి. అప్పుడప్పుడు వచ్చే చల్ల గాలి నాతో స్నేహం చేస్తానని బతిమాలేది. కానీ నాలోని ఆలోచనలు దయ్యూలపై రీసెర్చ్ చేసేందుకు పోటీ పడుతుండేవి. ‘గుర్రు..గుర్రు’మనే మానాన్న గురక ‘రేయ్ వెధవా నిద్రపో’ అనే సందేశాన్ని పంపిస్తూ ఉండేది. చాలాసేపటికి కళ్లు మంటలను మోసుకొచ్చేవి. నిండిన గాల్‌బ్లాడర్ చిమ్మచీకటి దెబ్బకు సెలైంట్ అయ్యేది.
 
సీన్ కట్ చేస్తే..
నా మూడేళ్ల గారాల పట్టి ఓ అర్ధరాత్రి ‘నాన్నా’ అని పొలికేక పెట్టి ఉలిక్కిపడి లేచింది. కలత నిద్రలో ఉన్న నేను.. కదలకుండా పడుకున్న ‘నాలో సగం’ ఇద్దరం లేచాం. ‘ఏమైందమ్మా’ అని మా చిన్నారిని అడిగాం. అది నిద్రలో కూడా నవ్వుతూ ‘దయ్యం వచ్చింది’ అని ముసిముసి నవ్వులు చిందించి టప్‌మని పడుకుంది.
    
 
ఎంత ఆశ్చర్యం? ఎంత మార్పు!.. ముప్పై, నలభై ఏళ్ల క్రితం టెక్నాలజీ అంతగా లేని రోజుల్లో.. అప్పుడప్పుడే రవాణా మార్గాలు.. వాహనాలు అభివృద్ధి చెందుతున్న సమయంలో చిన్నారుల ప్రవర్తన మరోలా ఉండేది. ‘అమ్మా కథ చెప్పవా’ అని అడిగినప్పుడు భుజంపై బేతాళుడిని వేసుకున్న విక్రమార్కుని కథ చెప్పగానే బుడతలంతా చప్పుడు చేయకుండా గాఢనిద్రలోకి జారుకొనేవారు. రాత్రి ఏడు గంటలు దాటితే తలుపులన్నీ మూసుకొనేవి. కీచురాళ్ల రొద.. కప్పల బెకబెకలు... చీకటి భీతావహ వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఉండేవి.
 
ఇప్పడు..?
దయ్యూలు, పిశాచాలు అంటే పిల్లలకు కామెడీగా మారింది. ఓ కార్టూన్ చానల్లో డెవిల్‌ను పిల్లలు తమ బానిసగా మార్చుకుంటారు.  అది భయపెట్టడానికి ప్రయత్నిస్తే ‘అంత సీన్‌లేదులే’ అని లైట్‌గా తీసుకుంటారు. వారి టార్చర్‌కు భూతం కుమిలిపోతూ ఉంటుంది. ఇక వారికి అవంటే భయం ఎలా పుడుతుందీ!
    
 
! మొత్తానికి మా జనరేషన్‌ను.. అంతకుముందు తాత ముత్తాతలను భయపెట్టిన భూతాలు నేటి తరాన్ని ఏమీ చేయలేకపోతున్నారుు. ఎక్కడ జోకర్లుగా మారుతామోనని దిగులేసుకుంటున్నారుు. మళ్లీ భూమ్మీద నూకలుంటే పిశాచాల అవతారం వద్దు నాయనా అని తీర్మానం చేసుకున్నారుు. మరి పిల్లలా పిడుగులా..!
 - సంధ్యా సుందర్. ఎస్
 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement