Groom With Friends Dance With Guns,Talwar At Kamareddy, Video Viral - Sakshi
Sakshi News home page

పెళ్లి రిసెప్షన్‌లో వరుడు, స్నేహితుల హల్చల్‌.. తుపాకీ, తల్వార్‌తో డ్యాన్స్‌లు

Published Thu, Jul 13 2023 12:35 PM | Last Updated on Thu, Jul 13 2023 4:26 PM

Video: Groom His Friends Dance With Guns talwar At Kamareddy Madnoor - Sakshi

సాక్షి, కామారెడ్డి: పెళ్లి రిసెప్షన్‌లో కొందరు యువకుడు వీరంగం సృష్టించారు. తుపాకీలు, కత్తులు చేతపట్టి డ్యాన్స్‌ చేశారు. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆసల్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం..

జూలై 10వ తేదీ రాత్రి మద్నూర్‌ మండల కేంద్రంలో జరిగిన పెళ్లి రిసెప్షన్‌ జరిగింది. ఈ వేడుకలో పెళ్లి కొడుకుతోపాటు మరికొందరు యువకులు తల్వార్‌, గన్‌లతో డ్యాన్స్‌ చేశారు. డ్యాన్స్‌ వీడియోలను కొందరు ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి ఈ విషయం పోలీసులకు చేరింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నవ వరుడితోపాటు స్నేహితులనుఅదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement