ప్రేమ ఉంటే సరిపోదు.. మంచి టైమింగ్‌ కూడా ఉండాలి.. లేదంటే ఇంతే! | Viral Video: Husband Lifts His Wife And Fell Down On Dance Floor | Sakshi
Sakshi News home page

Viral Video: ప్రేమ ఉంటే సరిపోదు.. మంచి టైమింగ్‌ కూడా ఉండాలి.. లేదంటే ఇంతే!

Published Tue, Dec 7 2021 9:05 PM | Last Updated on Tue, Dec 7 2021 9:47 PM

Viral Video: Husband Lifts His Wife And Fell Down On Dance Floor - Sakshi

ప్రేమ గురించి ఎంత చెప్పినా, వర్ణించినా తీరదు. ప్రేమ గురించి తెలుసుకునేందుకు కూడా జనాలు అమితాసక్తి చూపిస్తుంటారు. అందుకే ఇటీవల ప్రేమ, పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే కేవలం ప్రేమించడమే కాదు, దాన్ని వ్యక్తపరచడంలోనూ టైమింగ్‌ ఉండాలి. లవర్స్‌ అయితే ఇంప్రెస్‌ చేయడానికి ఏదైనా చేస్తుంటారు. కానీ భార్య, భర్తలు మాత్రం అందరి ముందు తమ ప్రేమను చూపించలేరు. దానికి మంచి వేదిక కావాలి. ఓ భర్తకు అలాంటి వేదికే దొరికింది. కానీ తాను అనుకున్నది మాత్ర జరగలేదు..

అసలేం జరిగిందంటే.. వైభవంగా ఓ వేడుక జరుగుతోంది. స్టేజ్‌పై జంటలు ఫుల్‌ సౌండ్‌లో వస్తోన్న సాంగ్‌కు స్టెప్పులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ భర్త అందరి కంటే బాగా డ్యాన్స్‌ చేయాలన్న అత్యుత్సాహంతో భార్యను పైకి ఎత్తడానికి ప్రయత్నించాడు. అయితే అదుపు తప్పిందో, లేదా బరువును మోయలేకపోయాడో కానీ.. వెంటనే ఇద్దరూ కింద పడిపోయారు. దీంతో వేడుకకు హాజరైన వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. వారిద్దరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి: Viral Video: ఛీ! ఇదేం పాడు పని.. ఇంత నీచానికి దిగజారుతారా?

అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు కానీ అక్కడే ఉన్న కొంతమంది వీడియోన తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘ప్రేమ ఉంటే సరిపోదు.. మంచి టైమింగ్‌ కూడా ఉండాలి.. లేదంటే ఇంతే!’ అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: Funny Video: ‘దండం పెడతా సార్, నన్ను ఇంటికాడ దింపండి, సీరియల్ చూడాలి’ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement