పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే | Best Dance By Bhabhi In Wedding Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

Viral Video: పెళ్లిలో డ్యాన్స్‌తో దుమ్మురేపిన వదిన.. అందరి చూపు ఆమె వైపే

Published Sat, Nov 20 2021 9:13 PM | Last Updated on Sat, Nov 20 2021 9:26 PM

Best Dance By Bhabhi In Wedding Goes Viral In Social Media - Sakshi

ఇటీవల కాలంలో పెళ్లిలో డ్యాన్స్‌కు సంబంధించిన వార్తలు సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఒకరిని చూసి ఒకరు ప్రతి పెళ్లిలోనూ డాన్స్‌ ప్రోగ్రాం కచ్చితంగా ఉండి తీరాల్సిందేనని పట్టు పడుతున్నారు. పెళ్లి అంటే డ్యాన్‌.. డ్యాన్స్‌ అంటే పెళ్లి అన్నట్లు మారిపోయింది ప్రస్తుతం పరిస్థితి. నవ వధువు, వరుడు, బంధువులు ఇలా ఎవరికి వారే తగ్గేదేలే అంటూ స్టెప్పులతో రెచ్చిపోతున్నారు.  తాజాగా మరిది పెళ్లిలో వదిన డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిందో తెలీదు కానీ.. నెట్టింట్లో హడావిడి చేస్తోంది.
చదవండి: మీరు బాగుండాలయ్యా.. ఆనంద్‌ మహీంద్రా నిర్ణయానికి నెటిజన్లు ఫిదా

సల్మాన్‌ఖాన్, మాధూరి దీక్షిత్‌ జంటగా నటించిన ‘హమ్‌ ఆప్‌కే హైకోన్‌’ సినిమాలోని ‘లోచలీ మై అప్‌నీ దేవర్‌కి బరాత్‌ లేకే’ అనే పాటకు వదిన తన స్టెప్పులతో అదరగొట్టింది. ఎల్లో, బ్లాక్‌ కలర్‌ ఫ్రాక్‌ ధరించిన ఆమె అద్భుతమైన డ్యాన్స్‌తో అందరి చూపూ తనవైపే తిప్పుకుంది. మధ్యలో వధూవరులను స్టేజి మీదకు తీసుకొచ్చి డ్యాన్స్‌ చేపించేందుకు ప్రయత్నించినా.. వారి కంటే వదిననే దుమ్ము రేపింది. వదిన వేసిన స్టెప్స్ చూసి కొంత మంది ఆమెపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. కాగా నవంబర్ 16న ఆశిష్‌ మిట్టల్‌ అనే యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకూ లక్షల్లో వ్యూవ్స్‌ వచ్చాయి. వేలల్లో లైకులు వచ్చి చేరుతున్నాయి.
చదవండి: కూల్‌గా కూర్చోని ఫోన్‌ తెరిచాడు.. ఒక్కసారిగా మంటలు.. షాకింగ్ వీడియో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement