
భారతీయ పెళ్లిళ్లలో తమదైన బ్యూటీతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు పెళ్లి కూతుళ్లు. అత్యంత సుందరంగా ముస్తాబవుతో యువరాణులను మరపిస్తున్నారు. మేకప్ నుంచి డిజైనర్ దుస్తులు, ఆభరణాలు, మెహిందీ, ఇలా ప్రతీదాంట్లోనూ రాయల్ లుక్స్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కోరుకున్న కలల రాకుమారుడిని పెళ్లి చేసుకునే క్షణాలను అపురూపంగా దాచు కునేందుకు డెస్టినేషన్ వెడ్డింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఈ డ్రీమీ వెడ్డింగ్ స్టైల్ చికాగోకు చెందిన ఒక వైద్యురాల్ని విపరీతంగా ఆకర్షించింది. అందాల కశ్మీరంలో.. తన వివాహ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సంబంధించి ఒక వీడియో నెట్టింట సందడి చేస‍్తోంది. మరి ఆ వివరాలేంటో చూసేద్దామా!
చికాగోకు చెందిన డాక్టర్ పైజ్ రిలే(Paige Riley) తన వివాహ వేడకలతో అందర్నీ అబ్బురవపర్చింది. కాశ్మీరీ వధువుగా మారి తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజును సెలబ్రేట్ చేసుకుంది. మేకప్ దుస్తులు, అలంకరణ, మెహిందీ ఇలా ప్రతీదీ స్పెషల్‌గా ఉండేలా జాగ్రత్తపడి కశ్మీరీ పెళ్లి కూతురిలా మెరిసి పోయింది.

రాహుల్ మిశ్రా రూపొందించిన పీకాక్, పూల డిజైన్‌లో ఐవరీ కలర్ లెహెంగా, షీన్ దుపట్టాతో అందర్మీ మెస్మరైజ్ చేసింది. తన జుట్టును కర్ల్స్‌తో అలంకరించుకుంది. పచ్చల హారం, ఝుంకాలు, గాజులు, ఉంగరంతో చోకర్ ఇలా భారతీయ ఆభరణాల్లో అమె అందం మరింత ఎలివేట్ అయింది. దీనికి తోడుగా సింపుల్‌గా ఐషాడో, బ్లష్, మస్కారా, బిందీతో మేకప్ చేసుకుంది.
ఇక మెహెందీ వేడుక కోసం హౌస్ ఆఫ్ మసాబా నుండి అందమైన పసుపు-టోన్డ్ లెహంగాను లెహెంగాను ఎంచుకుంది. నక్సీ డిజైన్‌లో వెండి జరీ వర్క్‌తో పాటు గులాబీ రంగుల్లో టెంపుల్ వర్క్‌తో తయారు చేయబడింది. స్లీవ్‌లపై పూల ప్రింట్లు ఉన్నాయి. అలాగే ఈ లెహెంగాతో డ్యూయల్ దుపట్టాలను ధరించింది.
దీనికి సంబంధించిన వీడియో చూసినెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. ‘‘భలే అందంగా ఉన్నారు’’ ‘ప్రిన్సెస్‌లా ఉన్నారు. డ్రెస్ అద్భుతంగా ఉంది’, "మీరు డ్రెస్ చేసుకున్న విధానం నాకు చాలా నచ్చింది, వావ్ అచ్చం కాశ్మీరీ పండిట్‌లా ఉన్నారు.. లాంటి కామెంట్స్ వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment