పాపులర్ సూఫీ సింగర్ తన ప్రేయసితో నిఖా చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. పవిత్రమైన ప్రేమ పాటలకు పాపులర్ అయిన బిస్మిల్, షిఫాఖాన్‌తో జీవితాన్ని పంచుకున్నాడు. డిజైనర్ పెళ్లి దస్తులు, విలువైన ఆభరణాలతో వధూవరులిద్దరూ రాయల్ లుక్‌లో ఫ్యాన్స్‌ను మురిపించారు. వీరి పెళ్లి ప్రయాణంలో విశేషం ఉంది. అదేంటో తెలుసు కోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే.
ప్రముఖ సూఫీ గాయకుడు, బిస్మిల్ ఎన్నోపవిత్రమైన ప్రేమ పాటలకి తన గాత్రాన్ని అందించాడని చెప్పుకున్నాం. గత ఏడాది జనవరి 5న, 'పింక్ సిటీ' జైపూర్‌లో, బిస్మిల్ షిఫా ఖాన్ (ఇపుడు భార్య)తో కలిసి ఒక యుగళగీతాన్ని పాడాడు. అలా సంవత్సరం గడిచిందో లేదో ఆమెతో కలిసి వివాహం బంధంలోకి అడుగుపెట్టాడు. బంధువుల ద్వారా పరిచయమైన షిఫాతో ప్రేమలో పడిపోయాడు. సరిగ్గా ఏడాదికి ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. జీవితంలో మరపురాని రోజు, తన నిఖా ఫోటోలను ఇన్‌స్టాలో అభిమానులతో పంచుకున్నాడు
స్టన్నింగ్ బ్రైడల్ లుక్
వధువు షిఫా ఖాన్ డార్క్ రెడ్ కలర్ డిజైనర్ లెహెంగా చోలీలో పెళ్లికూ
తురిలా మెరిసి పోయింది. చేతితో చేసిన డిజైన్, విలాసవంతమైన గోల్డెన్ ఎంబ్రాయిడరీ ఎలిగెంట్ లుక్ నిచ్చాయి. లెహెంగాకు మ్యాచింగ్, జర్దోజీ దుపట్టా మరింత అందాన్నిచ్చింది. ఇంకా డైమండ్స్, పచ్చలు పొదిగిన లేయర్డ్ నెక్లెస్, చెవిపోగులు, మాంగ్ టీకా, ఉంగరాలు, ఎరుపు, తెలుపు ,బంగారు షేడ్స్‌తో కూడిన గాజులతో అద్భుతంగా కనిపించింది.
నేనేం తక్కువ అన్నట్టు బిస్మిల్ లుక్
క్రీమ్-హ్యూడ్ తలపాగా గ్రీన్, వైట్ షేడ్స్‌లో మెరిసే రాళ్లతో రూపొందించిన బంగారు బ్రూచ్‌తో అందంగా మెరిశాడు బిస్మిల్. వజ్రాలు పచ్చలతో కూడిన లేయర్డ్ నెక్లెస్‌తో తన పెళ్లి రోజుకు రింత ఐశ్వర్యాన్ని జోడించాడు. అంతేనా అతని చేతి గోల్డెన్ వాచ్‌మరింత విలాసాన్నిచ్చింది.
అందమైన ఫోటోలు
స్వచ్ఛమైన ప్రేమ, ఆనందంతో నిండిన తమ నిఖా ఫోటోలు అభిమానులను ఆకట్టు కున్నాయి. చుక్కలాంటి వధువు, షిఫా ఖాన్ నుదిటిపై ముద్దు పెట్టడం, నిఖానామాపై వధూవరులిద్దరూ సంతకాలు పెట్టడంతోపాటు, వేలిముద్రలు ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment