
యువ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya)తన ప్రియురాలితో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. చెన్నైకి చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Singer Sivasri Skanda prasad)ను సాంప్రదాయ బద్దంగా వివాహం చేసుకున్నారు. మార్చి 6, 2025న బెంగళూరులో జరిగిన ఒక సన్నిహిత, సాంప్రదాయ వేడుకలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరిలో కేంద్ర మంత్రి వి. సోమన్న, అన్నామలై, ప్రతాప్ సింహా, అమిత్ మాలవ్య, బి.వై. విజయేంద్ర ఉన్నారు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. దీంతో పలువురు నెటిజనులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందించారు.
శివశ్రీ స్కంద ప్రసాద్ పసుపు కాంచీపురం పట్టు చీర, బంగారు ఆభరణాలలో కనిపించగా సూర్య వైట్ గోల్డెన్ కలర్ దుస్తులను ధరించారు. మరొక ఫోటోలో, వధువు ఎరుపు-మెరూన్ చీరలో, వరుడు ఆఫ్-వైట్ దుస్తులలో పెళ్లికళతో మెరిసారు.
बेंगलुरु दक्षिण से सांसद श्री @Tejasvi_Surya जी एवं संगीत गायिका, भरतनाट्यम की प्रसिद्ध कलाकार शिवश्री स्कंदप्रसाद जी के शुभ विवाह समारोह में सम्मिलित होकर नवदंपत्ति को उनके मंगलमय दांपत्य जीवन के लिए शुभकामनाएँ व आशीर्वाद प्रदान किया। pic.twitter.com/S7n531yxmn
— Arjun Ram Meghwal (@arjunrammeghwal) March 6, 2025
భక్తి , శాస్త్రీయ సంగీత అభిమానులకు సుపరిచితమైన శివశ్రీ, మణిరత్నం , AR రెహమాన్ కాంబోలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ మూవీలోని పాటతో చలనచిత్ర సంగీతంలోకి ఎంట్రీ ఇచ్చి అందర్నీ అలరించారు. అలాగే గత సంవత్సరం జనవరిలో అయోధ్యలో రామాలయం ప్రతిష్ట సందర్భంగా ఆమె విద్వత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కూడా దక్కించుకుంది. దీంతోపాటు PVA ఆయుర్వేద ఆసుపత్రి నుండి ఆయుర్వేద కాస్మోటాలజీలో డిప్లొమా కూడా పొందింది. అలాగే 'ఆహుతి' వ్యవస్థాపకురాలు ,డైరెక్టర్ కూడా. శివశ్రీ యూట్యూబ్ చానెల్‌కు 2 లక్షల మందికిపైగా, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.13 లక్షలకు పైగా ఫాలోవర్లున్నారు.
శివశ్రీ శాస్త్ర యూనివర్సిటీ నుంచి బయో ఇంజినీరింగ్, మద్రాస్ యూనివర్సిటీ నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కాలేజీలో సంస్కృతంలో ఎంఏ చదివారు. ఇక తేజస్వి సూర్య వృత్తి రీత్యా న్యాయవాది, ప్రస్తుతం ఆయన బెంగళూరు సౌత్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ తరపున వరుసగా రెండోసారి ఎంపీగా గెలుపొందారు. 2019, 2024 ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించారు. 2020 నుంచి భారతీయ జనతా యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment