karntaka
-
ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల, కఠోర శ్రమ కచ్చితంగా ఉండాలి. జీవితంలో రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంటేనే సక్సెస్‌లో కిక్ ఉంటుందని నమ్మేవారు చాలామందే ఉంటారు. అలాగే ఎవరి దగ్గరో పనిచేయడం కాకుండా తమంతట తాముగా ఏదైనా చేయాలనే తపనతో ఉన్నత శిఖరాలకు చేరింది. బెంగళూరుకు చెందిన దివ్య. నెలకు వెయ్యి రూపాయల ప్యాకెట్‌మనీ కోసం కష్టపడిన ఈమె ఇపుడు నెలకు నాలుగున్నర కోట్లు ఆర్జిస్తోంది. ఎలా? తెలుసుకోవాలని ఉందా?దివ్య రావు సాధారణ మధ్య తరగతి కుటుండంలో పుట్టి పెరిగింది. కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు బావుంటుందన్న తల్లిదండ్రుల మాటలను అక్షరాలా నమ్మింది. అచంచలమైన దృఢ సంకల్పంతో 21 సంవత్సరాల వయస్సులోనే సీఏ చదివింది. తరువాత IIM అహ్మదాబాద్‌లో ఫైనాన్స్‌లో MBA చేసింది. ఈ సమయంలో ఆర్థికంగా చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చింది. ఒక ఎగ్ పఫ్ తినడానికి కూడా ఎంతో ఆలోచించాల్సి వచ్చేది. కష్టపడి చదివి కుటుంబంలోనే సీఏ చదవిన యువతిగా పేరు తెచ్చుకుంది. అయితే నల్లేరుమీద నడకలా ఏమీ సాగలేదు. ఆర్థికంగా పలు సవాళ్లు ఎదుర్కొంది. అయినా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది.వ్యాపారవేత్తగా ఎలా మారింది?ఐఐఎంలో చదువుకునే సమయంలోనే కొన్ని ప్రముఖ ఆహార సంస్థలు, వాటి సక్సెస్‌పై అధ్యయనం చేసింది దివ్యా. ఆ సమయంలోనే ఫుడ్ బిజినెస్ ఆలోచనకు బీజం పడింది. ముఖ్యంగా దక్షిణాది రుచుల్ని విశ్వవ్యాప్తం చేయాలన్న ఆసక్తి పెరిగింది. ఫుడ్ బిజినెస్ అంటే దివ్య తల్లి అస్సలు ఇష్టపడలేదు. 10-20 రూపాయలకు రోడ్లపై ఇడ్లీ, దోసెలు అమ్మాలనుకుంటున్నావా?" అని తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సీఏగా ఉద్యోగం మొదలు పెట్టింది. కానీ మనసంతా వ్యాపారం పైనే ఉండేది. (ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!)ఆహార పరిశ్రమలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉన్న రాఘవేంద్రరావును కలిసే వరకు ఆమె ఆలోచనలకు ఒక రూపం రాలేదు. సీఏగా అతడికి పరిచయమైంది. అలా రాఘవ్‌కు ఫుడ్ బిజినెస్‌లో, ఆర్థికాంశాల్లో దివ్య అతనికి సలహాలిచ్చేది. దీంతో బిజినెస్ పార్ట్‌నర్స్‌గా మారారు. ఆ తరువాత అభిరుచులుకలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. భర్త రాఘవేంద్రతో కలిసి 2021లో ‘రామేశ్వరం కెఫే’ ప్రారంభించింది. ఆహారం నాణ్యత పరంగా, టేస్ట్ పరంగా ప్రత్యేకంగా ఉండాలని ప్లాన్ చేసింది.తొలుత బెంగళూరులో రెండు బ్రాంచీలతో మొదలై ఇపుడు కోట్ల రూపాయల ఆదాయాన్నిచ్చే స్థాయికి చేరింది. రాబోయే ఐదేళ్లలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం, విదేశాలలో కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ దంపతులు. దుబాయ్, హైదరాబాద్ , చెన్నైలలో బ్రాంచెస్ తెరవనుంది. దాదాపు 700 మందికి ఉపాధి కల్పిస్తోంది. నివేదికల ప్రకారం ప్రతి స్టోర్ నుండి నెలకు రూ. 4.5 కోట్లు అమ్మకాలు సంపాదిస్తున్నారు. సంవత్సరానికి రూ. 50 కోట్లు సంపాదిస్తున్నారు. View this post on Instagram A post shared by Rupa (@ruparavi21578)రామేశ్వరం కెఫేకర్ణాటకలోని బెంగళూరు నగరంలో రామేశ్వరం కెఫే చాలా పాపులర్. అక్కడికి వెళ్లినవారు ఈ కేఫేకు వెళ్లకుండా రారు. అంత ఫేమస్. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకొంది. ఈ కేఫును ఈ స్థాయికి తీసుకు రావడంలో భర్తతో కలిసి దివ్య అహర్నిశలు కష్టపడింది. ఇంత చదువూ చదివి, ఇడ్లీలు, దోసెలు అమ్ముతావా? అని గేలిచేసినా వెనుకడుగు వేయలేదు. తనకిష్టమైన ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టి తానేమిటో నిరూపించుకుంది.కెఫే వేదికగా ఇడ్లీ, దోసె, వడ, పొంగల్, బాత్, రోటీ, పరోటాతోపాటు, రైస్ వెరైటీలనూ ఆహార ప్రియులు ఆరగిస్తారు. అలాగే టీ, కాఫీలను స్పెషల్‌గా అందిస్తూ మరింతమందిని ఆకట్టుకుంటోంది. ప్రతీ వంటలోనూ ఆరోగ్య, నాణ్యతా ప్రమాణాల్ని తప్పకుండా పాటిస్తున్నామని ,సహజ పద్ధతుల్లో తయారుచేసిన నెయ్యి, ఇతర పదార్థాలను వాడతామని చెబుతుంది. తమ వంట తిన్న వారు తృప్తిగా.. ఆహా, ఏమిరుచి అన్నపుడు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది అంటుంది సంతోషంగా దివ్య. తన వ్యాపారాన్ని విదేశాలకు సైతం విస్తరించాలని లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. -
ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్‌కు ఎంపిక
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయులు క్రికెట్ ప్రపంచంలోకి దూసుకొస్తున్నారు. పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ అండర్-19 స్ధాయిలో అదరగొడుతుండగా.. ఇప్పుడు చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ విజయ్ మర్చంట్ ట్రోఫీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీకి కర్ణాటక క్రికెట్ ఆసోషియేషన్‌కు ప్రకటించిన 35 మంది ప్రాబబుల్స్ జాబితాలో అన్వయ్‌కు చోటుదక్కింది. కాగా అన్వయ్ ద్రవిడ్ గతేడాది ఇంటర్-జోన్ స్థాయిలో కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదేవిధంగా ఇటీవల కేఎస్‌సీఏ అండర్-16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో అన్వయ్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో భాగంగా తుమకూరు జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జోన్ తరపున 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి జయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ప్రాబబుల్స్‌లో చోటు కల్పించారు. ఇక ఈ టోర్నీ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ద్రవిడ్ పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ కూచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతున్నాడు.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
కోర్టులపై నమ్మకం ఉంది, త్వరలోనే నిజాలు బయటకు: సిద్దరామయ్య
బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) స్కామ్ విషయంలో హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. కుంభకోణానికి సంబంధించి తనను విచారించేందుకు గవర్నర్ అనుమతి మంజూరుచేయడాన్ని సీఎం హైకోర్టులో సవాల్ చేయగా.. పిటిషన్‌ను తాజాగా కోర్టు కొట్టివేసింది. సీఎం పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. గవర్నర్ చర్యలు చట్టప్రకారం ఉన్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయన చర్యల్లో ఎలాంటి లోపాలు లేవని, ఈ కేసులో పేర్కొన్న అంశాలు విచారణ చేయాల్సి ఉందని ఇదిలా ఉండగా హైకోర్టు తీర్పుపై తాజాగా సీఎం సిద్ధరామయ్య స్పందించారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని చెప్పారు. చట్టం, రాజ్యాంగాన్ని నమ్ముతానని, చివరకు నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, హైకమాండ్ నాకు అండగా నిలిచింది. నా పోరాటాన్ని కొనసాగించేందుకు ప్రోత్సహించాయి. నేను పేదల పక్షాన ఉన్నాను. సామాజిక న్యాయం కోసం పోరాడుతున్నందుకు బీజేపీ, జేడీఎస్‌లు నాపై రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుతున్నాయి’ అని మండిపడ్డారు.అయితే తనపై విచారణకు గవర్నర్ అనుమతివ్వడంపై చట్టపరంగా ఎదుర్కోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి తమ న్యాయ నిపుణలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు. 17A కింద విచారణ రద్దు అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.‘ఈ రాజకీయ పోరాటంలో రాష్ట్ర ప్రజలు నాకు అండగా నిలుస్తున్నారు. వారి ఆశీస్సులే నాకు రక్షణ. నేను చట్టాన్ని, రాజ్యాంగాన్ని నమ్ముతాను. ఈ పోరాటంలో ఎట్టకేలకు సత్యమే గెలుస్తుంది. ఇది నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం. బీజేపీ, జేడీఎస్‌ల ఈ ప్రతీకార రాజకీయాలపై మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. కోర్టుపై నాకు నమ్మకం ఉంది. త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయి’ అని అన్నారు.మరోవైపు సిద్దరామయ్యకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీనియర్ నేతలు ప్రియాంక ఖర్గే, రామలింగారెడ్డి తదితరులు మద్దతుగా నిలిచారు. తమ బాస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఆయన 100శాత స్వచ్చమైన సీఎం అని ప్రకటించారు. శివకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, ‘మేము సీఎంకు అండగా ఉంటాం. ఆయనకు మద్దతు ఇస్తాం. ఆయన ఎల్లప్పుడు రాష్ట్రం, పార్టీ కోసం మంచి పని చేస్తున్నారు’ అని పేర్కొన్నారు.ఇక కోర్టు తీర్పు సిద్ధరామయ్య భవిష్యత్తుకు ఎంతో కీలకంగా మారనుంది. ఆయన విచారణను ఎదుర్కోవాల్సి వస్తే రాజీనామా చేయాలన్న డిమాండ్ విపక్షాల నుంచే కాకుండా స్వపక్షం నుంచి వ్యక్తం అవ్వనుంది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తోంది. సీఎం నిర్మించిన అబద్ధాల సామ్రాజ్యం పూర్తిగా కూలిపోయిందని.. ఇక గౌరవప్రదంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ’ అని కన్నడలో బీజేపీ పోస్టు చేసింది. -
యమపురికి దారి : యమధర్మరాజు లాంగ్ జంప్ పోటీ, వీడియో వైరల్
సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని గొప్పగా చెప్పుకొనే బెంగళూరు నగరంలో రోడ్ల అధ్వాన్న పరిస్థితిపై ఇప్పటికే అనేక కథనాలను చూశాం. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై గుంతల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్లపై వెళ్లాలంటేనే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. ఓ మోస్తరు వర్షానికి కూడా రోడ్లపై నరకం చూడాల్సి వస్తోందని ఇప్పటికే సామాన్య జనం సహా, అనేకమంది అసహనం వ్యక్తం చేశారు. ఇవి రహదారులు కాదు, యమపురికి దారులు, రోడ్లపై రక్షణ అనేదే లేకుండా పోయిందంటూ సెలబ్రిటీలు, వ్యాపార వేత్తలు మండిపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. బెంగళూరు రోడ్లపై 5,670 గుంతలు ఉన్నాయని బీబీఎంపీ ఇటీవలి సర్వేలో తేలిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.తాజాగా బెంగళూరు రోడ్ల అధ్వాన్న స్థితిని కళ్లకు కట్టేలా ఉన్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో ద్వారా రోడ్డుపై గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకుద్దేశించిన నిరసన ఆసక్తికరంగా మారింది. కర్నాటకలోని ఉడిపిలో చనిపోయిన వారి కోసం యమరాజు లాంగ్ జంప్ పోటీలు నిర్వహిస్తున్నాడు అంటూ కార్తీక్ రెడ్డి అనే యూజర్ ఈ వీడియోను ఎక్స్ పోస్ట్ చేశారు. ఇది నెటిజనులను ఆకట్టుకుంటోంది. యమధర్మరాజు , చిత్రగుప్తుడు రోడ్డు గుంతలను కొలుస్తున్న వైనం పరిస్థితికి అద్దం పడుతోంది. గుంతలు, అధ్వాన్నమైన రహదారుల కారణంగా సామాన్యుడు గాయపడినా, చచ్చిపోయినా రాజకీయనాయకులు పట్టించుకోరంటూ నెటిజనులు విమర్శలు గుప్పించారు.Yamaraja conducts long jump competition for the dead in Udupi, Karnataka. pic.twitter.com/MLBxCuZoZn— Karthik Reddy (@bykarthikreddy) August 27, 2024 -
అతనికి 40..ఆమెకు 19
తుమకూరు : అతనికి 40 సంవత్సరాలు.. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 19 సంవత్సరాల యువతిని ఆకర్షించి వెంట తీసుకెళ్లాడు. ఏం జరిగిందో ఏమో ఆ యువతి చెరువులో శవమై తేలింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈఘటన తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా మావత్తురుగ్రామంలో వెలుగు చూసింది. ఇదే తాలూకా కోళాల సమీపంలోని బైరగొండ్లు గ్రామానికి చెందిన రంగశ్యామయ్య(40), లక్ష్మయ్యన పాళ్య గ్రామానికి చెందిన ఆనన్య(21)లు ప్రేమికులు. రంగశ్యామయ్యకు ఇప్పటికే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనన్య బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం అనన్య ఇంట్లో తెలిసింది. రంగశ్యామయ్యను వివాహం చేసుకుంటానని అనన్య పేర్కొనగా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లి జరిగిన వ్యక్తితో వివాహం ఏమిటని మందలించారు. ఈక్రమంలో ఈ జంట మూడు రోజుల క్రితం ఊరు విడిచి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మావత్తురు చెరువులో మహిళ శవం తేలియాడుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా అనన్యగా గుర్తించారు. గట్టుపై ఇద్దరి పాదరక్షలు, కారు ఉన్నాయి. వీరిద్దరూ కారులో సంచరించినట్లు అనుమానిస్తున్నారు. రంగశ్యామయ్య కూడా ఇదే చెరువులో దూకి ఉంటాడని భావించి మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. అనన్య మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. -
భారత్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే?
ఎలా ఉంది ఫొటో? అద్భుతం అనిపిస్తోంది కదా? పెద్ద చెరువు.. పక్కనే పచ్చటి మైదానం. ఎక్కడుంది ఇది? అనుకుంటున్నారా? ఇప్పటికైతే లేదు కానీ... ఇంకొన్నేళ్లలో ఈ డిజైన్‌తో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని బీసీసీఐ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. కర్ణాటకలోని మైసూర్లో కట్టనున్న ఈ స్టేడియం కోసం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) 20.8 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ)కి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముడా ఆ భూమిని కెఎస్‌సిఎ 30 సంవత్సరాల లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం. లీజు మొత్తం రూ. 18 కోట్లు ఉండవచ్చు. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని కెఎస్‌సిఎ అధికారులు పరిశీలించినట్లు వినికిడి. వచ్చే ఏడాది ఆఖరికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానున్నట్లు కెఎస్‌సిఎ వర్గాలు వెల్లడించాయి. మైసూర్లో ఈ స్టేడియం నిర్మాణం జరిగితే అది కర్ణాటక రాష్ట్రంలో రెండో అంతర్జాతీయ స్టేడియం కానుంది. ఇప్పటికే బెంగళూరులో చిన్నస్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. MUDA is all set to hand over 20.8 acres of land to the Karnataka state cricket association (KSCA) for the construction of a International cricket stadium in #Mysuru 🔥 pic.twitter.com/7TgGE7W3eD— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ (@NameIsShreyash) June 7, 2024 -
భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి కీలక నిర్ణయం.. ఇకపై ఇంగ్లండ్‌లో
టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో నార్తాంప్టన్‌షైర్‌కు కరుణ్ నాయర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ వైట్మన్ స్థానంలో కరుణ్ నాయర్ నార్తాంప్టన్‌షైర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే సెప్టెంబర్ 8న నార్తాంప్టన్‌షైర్ జట్టుతో నాయర్ చేరాడు. ఆదివారం వార్విక్షైర్తో జరిగే మ్యాచ్‌తో నాయర్ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి.. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన నాయర్.. అరంగేట్ర సిరీస్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు. టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. నాయర్ 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు -
‘ముసలోళ్లం.. చూసి నేర్చుకోండి..లేదంటే’! ఇన్ఫీ నారాయణమూర్తి దంపతుల వ్యాఖ్యలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి, ఆయన సతీమణి, రచయిత్రి సుధామూర్తి విశేషంగా నిలిచారు. ఎందుకుంటే పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పోలింగ్ బూత్కొచ్చి క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి దంపతులు ఓటు హక్కు వినియోగంపై యువతకు సందేశమిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు. బెంగళూరులోని జయనగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. ఓటు హక్కను వినియోగించుకోకపోతే, ఆ తరువాత పాలకులను ప్రశ్నించే హక్కునుకూడా కోల్పోతామని సుధామూర్తి వ్యాఖ్యానించారు. తాము పెద్దవాళ్ల మైనప్పటికీ ఉదయమే ఓటు హక్కును వినియోగించు కున్నామనీ, తమ నుంచి యువత నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. పద్మభూషణ్ అవార్డీ మీడియాతో మాట్లాడుతూ ‘‘దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైన భాగం" అన్నారు. #WATCH | Jayanagar, Bengaluru | Sudha Murty gives a message to young voters after casting her vote; says, "Please look at us. We are oldies but we get up at 6 o'clock, come here and vote. Please learn from us. Voting is a sacred part of democracy..."#KarnatakaElections pic.twitter.com/B1ecZCH93M — ANI (@ANI) May 10, 2023 ఈ సందర్బంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యత గురించి యువతకు చెప్పాల్సిన బాధ్యత పెద్దలదే. తన తల్లిదండ్రులు తనకు అలాగే చెప్పారని చెప్పారు. తాను విదేశాల నుంచి ఈరోజు ఉదయం తిరిగొచ్చాననీ, అయినా ఓటు వేసేందుకు వచ్చానని నారామణ మూర్తి తెలిపారు ఫస్ట్ ఓటు వేద్దాం.. ఆ తరువాతే ఇది బాగాలేదు.. అది బాగాలేదు అనే చెప్పవచ్చు లేదంటే.. విమర్శించే హక్కు ఉండదనిపేర్కొన్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని కోరమంగళలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలు తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు చాలా కీలకం. కర్నాటక లోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. -
కర్ణాటక ఎన్నికల్లో చక్రం తిప్పుతున్న ఆటోలు
-
పూజారిపై ఉమ్మిన మహిళ.. జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన సిబ్బంది
సాక్షి, బెంగళూరు: మహిళపై ఆలయ సిబ్బంది అనుచితంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. బెంగళూరు గుడిలో నుంచి ఓ మహిళను బలవంతంగా బయటకు గెంటేశారు ఆలయ సిబ్బంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. డిసెంబర్ 21న జరిగిన ఈ ఘటనలో బాధితురాలు అమృతహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడిలో మహిళను కొట్టి జుట్టు పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లిన వీడియో ట్విటర్లో షేర్ చేయడంతో తాజాగా వైరల్‌గా మారింది. ఇందులో ఆలయం లోపల ఉన్న ఓ మహిళను ఆలయ సిబ్బంది బయటకు నెట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆమె ప్రతిఘటించడంతో చెంపదెబ్బ కొట్టాడు. అయినా బయటకు వచ్చేందుకు నిరాకరించగా.. మహిళ మెడ పట్టుకొని లాక్కొచ్చాడు. జుట్టు పట్టుకొని బయటకు ఈడ్చుకెళ్లాడు. అప్పటికీ మహిళ మొండిగా ప్రవర్తించడంతో ఆమెను కొట్టేందుకు ఐరాన్ రాడ్‌ను కూడా తీసుకొచ్చాడు. అయితే పూజారి అడ్డుకోవడంతో ఆమె బయటకు వెళ్లిపోయింది. కాగా మహిళ ఆలయ సిబ్బంది అంత దారుణంగా ప్రవర్తించడం వెనక ఓ కారణం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు గుడికి వెళ్లి వెంకటేశ్వరుని భార్యనని చెప్పుకుంటూ.. స్వామివారి విగ్రహం పక్కనే కూర్చోవాలని పట్టుబట్టింది. అందుకు పూజారి అనుమతించలేదు. దీంతో మహిళ పూజారిపై ఉమ్మింది. వెంటనే స్పందించిన ఆలయ సిబ్బంది మహిళను జుట్టు పట్టుకొని గుడి నుంచి బయటకు తోసేశారు. అయితే సదరు మహిళ మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించిన పోలీసులు పలు సెక్షన్ల కింద ఆలయ సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. చదవండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? -
ఐదు నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే నవ్యశ్రీ..
శివమొగ్గ: వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. శివమొగ్గ నగరం అశ్వత నగరలోని 5 క్రాస్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని నవ్యశ్రీ (23)గా గుర్తించారు. నవ్యశ్రీకి ఐదు నెలల క్రితమే ఆకాశ్ అనే యువకుడితో పెళ్లయింది. శనివారం సాయంత్రం ఇంటి వద్ద తులసి పూజ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అయితే, ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో కారు షెడ్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగానే నవ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నవ్యశ్రీ కుటుంబీకులు అనుమానిస్తున్నారు. దీంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వినోబా నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
లవర్ కోసం వెయిటింగ్.. బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని కానిస్టేబుల్..
బనశంకరి: ఓ పోలీసు సభ్య సమాజం తలదించుకునేలా చేశాడు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉండాల్సిన పోలీస్.. కామంతో చిన్నారిని కాటేశాడు. బైక్‌పై డ్రాప్ ఇస్తానని చెప్పి మైనర్(17)ను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. గోవిందరాజనగర పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పవన్(24) దారుణానికి ఒడిగట్టాడు. చామరాజనగర ప్రాంతానికి చెందిన అమ్మాయి.. ఓ యువకునితో ప్రేమలో పడి, ఇంటిని వదిలిపెట్టి అతడి కోసం వెళ్లింది. ఈ క్రమంలో బెంగళూరుకు చేరుకుని 27వ తేదీన ఒక పార్కు వద్ద కూర్చుంది. కాగా, అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పవన్.. ఆమెను ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించగా చామరాజనగరకు వెళ్లాలని చెప్పింది. సరేనంటూ బాధితురాలిని తాను.. తీసుకువెళ్తానని నమ్మించి తన అద్దె ఇంటికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తరువాత చామరాజనగరకు బస్‌లో ఎక్కించి పంపించాడు. అనంతరం ఇంటికి వెళ్లిన బాధితురాలు.. తన కుటుంబసభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధితులు బెంగళూరుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పవన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: ర్యాగింగ్ పేరుతో అర్ధరాత్రి హాస్టల్ రూమ్‌లో సీనియర్ల అరాచకం.. ఇలా కూడా చేస్తారా? -
కర్నాటక రోడ్డు ప్రమాదం.. మృతదేహాలు హైదరాబాద్‌కు తరలింపు
-
పసిబాల్యంపై యాచక మాఫియా దందా!
బనశంకరి (బెంగళూరు): అనాథ మహిళలు, పేద కుటుంబాల పిల్లలే పెట్టుబడిగా యాచక మాఫియా నగరాల్లో పేట్రేగిపోతున్నది. వీరి ఆర్థిక, సాంఘిక పరిస్థితులను ఆసరా చేసుకున్న కొంతమంది సంఘ విద్రోహశక్తులు వారితో భిక్షాటన చేయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. బెగ్గింగ్ మాఫియా ద్వారా ఏడాదికి దేశవ్యాప్తంగా రూ.260 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయంటేనే.. ఈ అనాగరిక వ్యవస్థ సమాజంలో ఏ మేరకు వేళ్లూనుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. అద్దెకు పేద రాష్ట్రాల పిల్లలు.. కొంతమంది దళారులు ఉత్తరప్రదేశ్, ఒడిశా, బిహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, అసోం, తమిళనాడు గ్రామీణ ప్రాంతాల నిరుపేద కుటుంబాలను కలిసి వారి పిల్లలను రోజువారి, లేదా శాశ్వతంగా కొనుగోలు చేసి తెచ్చుకుంటారు. లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని నగరాలకు పిలిపించి నెలకు కొద్దిమేర అద్దె ఇచ్చి పసిపిల్లలను తీసుకుంటారు. ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రముఖ నగరాలు, జనసందడి కలిగిన ప్రాంతాలు, జాతర, ఉత్సవాలు, పర్యాటక ప్రాంతాలు, ఆలయాలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లలో ఈ పిల్లలతో భిక్షాటన చేయిస్తారు. ప్రభుత్వాల పునరావాసం.. భిక్షాటన మాఫియాలో చిక్కుకున్న పిల్లల ఆచూకీని ఆయా రాష్ట్రాల్లోని పోలీసులు కనిపెట్టి ప్రభుత్వ పరంగా పునర్వసతి కల్పిస్తున్నారు. భిక్షాటన దందాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, పిల్లలను, మహిళలను ఈ దందాలో వినియోగిస్తున్నట్లు తెలిస్తే ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. -
తనను ప్రేమగా చూడటం లేదని.. కుటుంబ సభ్యులకు విషమిచ్చి
చిత్రదుర్గ: తోబుట్టువులతో సమానంగా తనను ప్రేమగా చూసుకోవడం లేదని కక్ష పెంచుకున్న ఓ బాలిక(17).. తల్లి, తండ్రి సహా నలుగురు కుటుంబ సభ్యులకు విషమిచ్చి చంపేసింది. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా ఇసాముద్ర గ్రామం లంబనిహట్టిలో జూలై నెలలో చోటుచేసుకున్న ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. విషప్రయోగంతో బాలిక తల్లి, తండ్రి, చెల్లి, అమ్మమ్మ చనిపోగా అన్న(19) అనారోగ్యానికి గురై ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. చిన్న తనం నుంచి అమ్మమ్మ గారింట్లో పెరిగిన బాలిక మూడేళ్ల క్రితం తన తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. అయితే, చెల్లి, అన్నపైనే తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమ చూపడం, తనను పట్టించుకోకపోవడంపై బాలిక ఆవేదన చెందింది. ఈ క్రమంలో కక్ష తీర్చుకునేందుకు వారికి ఓ పర్యాయం విషం కలిపిన ఆహారం పెట్టేందుకు యత్నించి విఫలమైంది. మరో ప్రయత్నంగా ఈ ఏడాది జూలై 12వ తేదీన పురుగులమందు కలిపి స్వయంగా తయారు చేసిన రాగి ముద్దలను వారికి పెట్టింది. వాటిని తిని, తీవ్రంగా వాంతులు చేసుకుని నలుగురు చనిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతదేహాల నుంచి సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇటీవల వెల్లడైన ఫలితాల ఆధారంగా వారు తిన్న రాగి ముద్దల్లో విషం కలిసినట్లు తేలింది. పోలీసుల విచారణలో బాలిక నేరాన్ని అంగీకరించింది. మైనర్ కావడంతో ఆమెను జువెనైల్ హోమ్‌కు తరలించారు. -
తాలిబన్ల వల్లే పెట్రోల్ ధర పెరిగింది: బీజేపీ ఎమ్మెల్యే
బెంగళూరు: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల అరాచకం ప్రారంభం అయిన నాటి నుంచి మన దేశంలో వారి ప్రస్తావన బాగా పెరిగింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకునే క్రమంలో నేతలను తాలిబన్లతో పోలుస్తూ.. తిడుతున్నారు. మరి కొందరు నాయకులు ఓ అడుగు ముందుకు వేసి.. దేశంలో ఇంధన ధరలు, వంట గ్యాస్ ధరలు పెరగడానికి కారణం తాలిబన్లే అని స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఒకరు ఈ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ వివరాలు.. కర్ణాటక హుబ్లీ-ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బల్లాడ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో అరవింద్ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభం ముదురుతుంది. అందువల్ల ముడి చమురు సరఫరాలో తగ్గుదల ఉంది. ఫలితంగా ఎల్పీజీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ఓటర్లుకు ఈ అంతర్జాతీయ పరిణామాల గురించి అర్థం చేసుకునేంత జ్ఞానం లేదు. ఊరికే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: చౌకగా పెట్రోల్ కావాలా?, అయితే, అఫ్గానిస్తాన్ వెళ్లండి: బీజేపీ నేత) అరవింద్ వ్యాఖ్యలపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గన్‌లో తాలిబన్ల సంక్షోభం మొదలై నెల రోజులు అవుతుందేమో. కానీ దేశంలో గత కొద్ది నెలల నుంచి ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీనికి తాలిబన్లతో ముడిపెట్టడం ఏంటి.. పైగా జనాలకు జ్ఞానం లేదని బుద్ధిలేని వ్యాఖ్యలు చేసి.. నీ తెలివితేటలు ప్రదర్శించుకున్నావ్ అంటూ పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు జనాలు. (చదవండి: అఫ్గన్‌లో ప్రభుత్వ ఏర్పాటు: రంగంలోకి దిగిన పాక్) ఇక ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇక రాయిటర్స్ ప్రకారం ఈ ఏడాది జూలై నాటికి ఇరాక్, సౌదీ అరేబియా, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్, నైజిరియా, అమెరికా, కెనడా దేశాలు భారత్‌కు ముడి చమురు విక్రయిస్తున్న ప్రధాన దేశాల జాబితాలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో అఫ్గనిస్తాన్ లేదు. ఈ క్రమంలో దేశంలో ఇంధన ధరల పెరుగుదలకు.. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల సంక్షోభానికి ముడి పెట్టడం పట్ల జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ ఇంధన ధరల పెంపు అంశంలో కేంద్రంపై భారీ ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన ధరలు పెంచుతూ ఇప్పటికే సుమారు 23 లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది అని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు 44 శాతం, డీజిల్ ధరలు 55 శాతం పెరిగినట్లు రాహుల్ గాంధీ విమర్శించారు. చదవండి: అది తాలిబన్ల అఘాయిత్యం కాదు.. సంబురం -
మూడెకరాల కోసం నాలుగు హత్యలు
రాయచూరు రూరల్: కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో భూ వివాదం నలుగురి హత్యకు దారితీసింది. మూడు ఎకరాల కోసం ఈ ఘోరం జరిగింది. వివరాలు... భాగల్కోటె జిల్లా జమఖండి తాలూకా మధురఖండిలో రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదం ఉంది. ధార్వాడ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పొలంలో ఉన్న అన్నదమ్ములు హన్మంతు (48), మల్లప్ప (44), ఈశ్వర్ (40) బసవరాజ్ (36)లను వరుసకు బంధువులైన పుటాణి కుటుంబ సభ్యులు మారణాయుధాలతో హతమర్చారు. కోర్టు తీర్పు ఆలస్యం అవుతుండటంతో శనివారం రాత్రి కాపుగాచి నలుగురిని కిరాతకంగా చంపేశారు. దీంతో జమఖండి పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: Karnataka: బాలికతో అసభ్య ప్రవర్తన.. నడిరోడ్డుపై -
బాలికతో అసభ్య ప్రవర్తన.. నడిరోడ్డుపై ముద్దు పెట్టుకుని
యశవంతపుర/కర్ణాటక: బాలిక పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరు దక్షిణ విభాగంలో జరిగింది. శనివారం సాయంత్రం బాలిక (15) నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె వెనుకే వచ్చిన యువకుడు ముద్దు పెట్టి పరారయ్యాడు. ఫిర్యాదు చేయడానికి బాధితురాలి తల్లిదండ్రులు రాగా చిక్కజాల పోలీసులు కేసు తీసుకోవడానికి నిరాకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావటంతో బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ ధర్మేంద్రకుమార్ మీనా నిందితున్ని అరెస్ట్ చేయాలని ఆదేశించారు. నిందితుడు దారుణ హత్య కెలమంగలం: హత్య కేసులో ప్రధాన నిందితుడు హత్యకు గురయ్యాడు. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని ఉళిబండ గ్రామానికి చెందిన చెన్నక్రిష్ణన్ (33)ను గత ఏప్రిల్ 1వ తేదీ ట్రాక్టర్‌తో ఢీకొట్టి, తలపై బండరాతితో కొట్టి హత్య చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు శంకర్(25). కర్ణాటక సరిహద్దుల్లో అంచెట్టి ఉణిసనహళ్లి మద్యం షాపు వద్ద శనివారం రాత్రి ఆరుగురు దుండగులు వేటకొడవళ్లతో శంకర్‌ను నరికి చంపారు. కనకపుర పోలీలుసు, తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. చదవండి: Mysore Case: ఆ కామాంధులకు 10 రోజుల కస్టడీ -
విద్యార్థినిపై గూండాల అమానుషం.. స్నేహితుడి కళ్లెదుటే..
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. స్నేహితుడి కళ్లెదుటే యువతిపై ఒక గ్యాంగ్, సామూహిక అత్యాచారానికి పాల్పడిన వైనం ఆందోళన రేపింది. ఈ సంఘటన అవలహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలోమంగళవారం రాత్రి ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఈ సంఘటన జరిగి దాదాపు 24 గంటలు గడిచినా, నిందితులు ఇంకా పరారీలో ఉన్నారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మైసూర్ నగరానికి దాదాపు 13 కిలోమీటర్ల దూరంలోని ప్రసిద్ధ శ్రీ చాముండేశ్వరి దేవాలయం వద్ద దారికాచి ఆరుగురు వ్యక్తుల ముఠా వీరిని చుట్టుముట్టింది. యుతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. అనంతరం వారి వద్ద ఉన్న నగలు, నగదు ఇమ్మని అడిగారు. దీనికి నిరాకరించడంతో వారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. ఆమె ఫ్రెండ్‌ను తీవ్రంగా కొట్టి యువతిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. బాధితులిద్దరూ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశామనీ, బాధిత యువతి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉందని డీసీపీ ప్రదీప్ గుంటితెలిపారు. ఇంతవరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతోందన్నారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరిశోధనా విద్యార్థినిగా బాధిత యువతిని పోలీసులు గుర్తించారు. తన స్నేహితుడితో కలిసి సంఘటన జరిగిన ప్రదేశం నుంచే రోజూ ఇంటికి తిరిగి వచ్చేదని పోలీసులు వెల్లడించారు. ఇది గమనించే ఈ ముఠా దారుణానికి పాల్పడి ఉంటుందనే అనుమానాలను వ్యక్తం చేశారు. -
విద్యార్థులకు ఇది నిజంగా స్వాతంత్య్ర దినోత్సవం : సీఎం బొమ్మై
-
అమ్మో...! ఎంత పెద్ద పాముతో..
బెంగళూరు: ఇదేదో సినిమా కోసం ఇచ్చిన పోజు కాదు. ముమ్మాటికి వాస్తవ సంఘటనే. భారీ సర్పాన్ని అలవోకగా ఎత్తిపట్టుకున్న ఈ యువకుడు ఏ సినిమా హీరోగా తక్కువ కాడనే చెప్పాలి. గురువారం కర్ణాటకలోని కాఫీసీమ కొడగు జిల్లా మూర్నాడులో చోటుచేసుకుంది. ఒక కాఫీ తోటలోకి 13 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా పాము చొరబడడంతో యజమాని స్థానిక పాముల నిపుణుడు సూర్యకీర్తికి కాల్ చేశాడు. అక్కడకు చేరుకున్న సూర్యకీర్తి కొంతసేపటికే దానిని వట్టి చేతులతో పట్టుకుని చూపరుల కోసం ఇలా ఆడించాడు. తరువాత సమీప భాగమండల అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేశాడు. -
ఊళ్లోకి వచ్చిన మొసలి.. భయంతో పరుగులు తీసిన జనం!
బెంగళూరు: సాధారణంగా నదులు, చెరువుల్లో మొసళ్లు కనిపిస్తేనే భయపడతాం. అలాంటిది ఏకంగా మొసలి ఓ గ్రామానికి పర్యటనకు వచ్చింది. అవును.. నిజం.. కర్ణాటకలోని కోగిల్బాన్ గ్రామంలోకి గురువారం ఉదయం ఓ భారీ మొసలి ప్రవేశించింది. దానిని చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గ్రామ వీధుల్లో మొసలి తిరుగుతున్న సమాచారాన్ని స్థానికులు వెంటనే అటవీ అధికారులకు చేరవేశారు. అక్కడికి చేరుకున్న అధికారులు మొసలిని సురక్షితంగా పట్టుకొని నీటిలో వదిలిపెట్టారు. కాలీ నది నుంచి గ్రామంలోకి మొసలి వచ్చిందని అధికారులు తెలిపారు. గ్రామానికి చేరుకున్న మొసలి సుమారు అరగంట పాటు వీధుల వెంట తిరిగిందని పేర్కొన్నారు. అయితే.. అదృష్టవశాత్తూ మొసలి ఎవరిపైనా దాడి చేయలేదని.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అటవీ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లి.. మహిళా డాక్టర్‌పై అత్యాచారం -
బర్త్‌డే పార్టీలో ఇంజక్షన్.. చేయి తొలగించిన వైద్యులు
బెంగళూరు: వాలీబాల్ కోచ్ పుట్టిన రోజు వేడుకలు హాజరయ్యాడు ఓ మైనర్ కుర్రాడు. ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. కొద్ది రోజుల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత యువకుడి చేయి బాగా వాయడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడి చేయి తొలగించారు. ఇంతకు ఆ పుట్టిన రోజు వేడుకల్లో ఏం జరిగింది.. ఎందుకు చేయి తొలగించాల్సి వచ్చింది వంటి వివరాలు తెలియాలంటే.. బెంగళూరుకు చెందిన ఓ మైనర్ కుర్రాడు కొద్ది రోజుల క్రితం వాలీబాల్ కోచ్ పుట్టిన రోజు సందర్భంగా చంపరాజేట్ ప్రాంతంలో జరిగిన బర్త్‌డే పార్టీకి హాజరయ్యాడు. నాలుగు రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత చేయి బాగా వాచింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు మైనర్ కుర్రాడిని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాధితుడిని పరీక్షించిన వైద్యులు.. బాలుడి శరీరంలో డ్రగ్స్, విష పదర్ధాలు ఉన్నాయని.. అందువల్లే చేయి వాచిందని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేసి చేయి తొలగించకపోతే మైనర్ కుర్రాడి ప్రాణాలకే ప్రమాదం అని సూచించడంతో తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు. ఆస్సత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బాధితుడిని అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా.. పుట్టినరోజు వేడుకలకు హాజరైన తనకు కోచ్ ఏదో ఇంజక్షన్ చేశాడని తెలిపాడు. కొన్ని మాత్రలను నూరి.. ఆ పొడిని నీటిలో కలిపి.. తనకు ఇంజెక్ట్ చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ క్రమంలో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: షాకింగ్ న్యూస్: దుష్టశక్తులకు బలివ్వడానికి బాలిక కిడ్నాప్ -
కర్ణాటకలో లాక్డౌన్ సడలింపు.. ఎప్పటివరకంటే!
సాక్షి, బెంగళూరు: రోజు రోజుకూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సడలిస్తున్నాయి. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో లాక్డౌన్ నియమాలు సడలించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప శనివారం ప్రకటన విడుదల చేశారు. దీని ప్రకారం.. రాష్ట్రంలో 5% శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటున్న 16 జిల్లాల్లో మాల్స్, రెస్టారెంట్లు, కళ్యాణ మండపాలు, స్పా, సెలూన్లు, రెస్టారెంట్లు, షాపింగ్ కాంప్లెక్సులను 50% సామర్థ్యంతో సాయంత్రం 5 గంటల వరకు తెరుచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బస్సులు, మెట్రో రైళ్లు 50 శాతం సామర్థ్యంతో నడుస్తాయి.ఈ సడలింపులు ఈనెల 21 నుంచి అమలులోనికి రానున్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5,783 మందికి వైరస్ సోకినట్లు అధికారులు నిర్ధారించారు. అదే సమయంలో 168 మంది మృత్యువాత పడ్డారు. 15,290 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 27,96,121కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 26,25,447మంది కోలుకున్నారు. 33,602 మంది మరణించారు. ప్రస్తుతం 1,37,050 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
నా పదవికి ఢోకా లేదు: సీఎం
శివాజీనగర: నాయకత్వ మార్పు ప్రస్తావనే లేదని బీజేపీ హైకమాండ్ స్పష్టంచేయడంతో ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యూహాత్మక మౌనం దాల్చారు. రాష్ట్ర ఇన్చార్జ్ అరుణ్‌సింగ్ పర్యటన నేపథ్యంలో వ్యతిరేకులు ఫిర్యాదులకు పదును పెట్టగా, యడ్డి క్యాంపులో ప్రశాంతత నెలకొంది. బుధవారం మామూలుగానే కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి ఇంటికి సన్నిహిత ఎమ్మెల్యేలు, నాయకులు దండుగా వచ్చి తమ మద్దతును వ్యక్తం చేశారు. నాయకత్వ మార్పునకు అవకాశం ఇవ్వబోమని, అరుణ్‌సింగ్‌ను కలిసి ఇదే మాటను చెబుతామని తెలిపారు. అరవింద బెల్లద్, బసనగౌడ పాటిల్ యత్నాళ్, సీపీ.యోగేశ్వర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన యడియూరప్ప మద్దతుతారులు.. సీఎంను మారిస్తే ఊరుకునేది లేదని చెబుతున్నారు. మద్దతుదారులకు సీఎం సాంత్వన పలికి, ఏమీ జరగదు, నేనే సీఎంగా కొనసాగుతాను, అన్నీ సర్దుకుంటాయని చెప్పి పంపుతున్నారు. అంతా బాగుంది: అరుణ్‌సింగ్ సాక్షి, బెంగళూరు: రాష్ట్ర బీజేపీలో అందరూ ఒక్కటేనని, సీఎం యడియూరప్ప ప్రభుత్వం చక్కగా పాలన సాగిస్తోందని రాష్ట్ర బీజేపీ ఇంచార్జి అరుణ్ సింగ్ అన్నారు. మూడు రోజుల రాష్ట్ర పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఆయన తొలిరోజు బుధవారం పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. యడియూరప్ప నాయకత్వం మార్పు అనే ఊహాగానాల మధ్య అరుణ్ సింగ్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. యడియూరప్పను మార్చాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు లోపాయికారిగా ప్రయత్నాలు చేస్తుండడం తెలిసిందే. తప్పుకోవడానికి తానూ రెడీ అని యడ్డి చెప్పడంతో సెగలు రేగాయి. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరుణ్ సింగ్, సీఎం యడియూరప్ప, మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు విషయంపై స్పందించా, కొత్తగా చెప్పేందుకు ఏమి లేదని అరుణ్‌సింగ్ అన్నారు. తమ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంగా ఉన్నారని చెప్పారు. నేతల మధ్య విభేదాలు ఉంటే మీడియా ముందు కాకుండా వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని సూచించానని తెలిపారు. -
Lockdown: వార్నీ.. కోడికి కూడా ఆ సమస్య ఉంటుందా?
బెంగళూరు: కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మహమ్మారి విజృంభిస్తున్నప్పటికి జనాలు పెద్దగా మారడం లేదు. చాలా చిన్న చిన్న, సిల్లీ కారణాలు చెప్పి రోడ్డుకు మీదకు వస్తున్నారు. కుక్కకు బాలేదని కొందరు.. ఉప్పు పప్పులు అయిపోయాయని చెప్పి మరికొందరు రోడ్ల మీద తిరుగుతున్నారు. తాజాగా లాక్డౌన్ సమయంలో రోడ్డు మీదకు వచ్చిన ఓ వ్యక్తి పోలీసులకు చెప్పిన సమాధానం నెట్టింట తెగ వైరలవుతోంది. వార్నీ కోడికి కూడా ఆ సమస్య ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ట్విట్టర్ యూజర్ అమిత్ ఉపాధ్యే పోస్ట్ చేసిన ఈ వీడియోలోని సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. లాక్డౌన్ అమల్లో ఉండగా ఓ వ్యక్తి చేతిలో సంచితో రోడ్డు మీదకు వచ్చాడు. పోలీసులు అతడిని ఆపి ఎందుకు బయటకు వచ్చావని ప్రశ్నించారు. అప్పుడు ఆ వ్యక్తి సంచిలో ఉన్న కోడిని బయటకు తీసి.. ‘‘ఇది మలబద్దకంతో బాధపడుతుంది సార్. దీన్ని పశువుల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. అందుకే బయటకు వచ్చాను’’ అన్నాడు అతడి సమాధానానికి పోలీసులు పక్కున నవ్వారు. కోడికి కూడా ఇలాంటి సమస్య ఉంటుందా అని ప్రశ్నించారు. ఆ తర్వాత అతడిని ఇంటికి తిరిగి పంపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అతడి సృజానత్మకతను నెటిజనులు ప్రశంసిస్తున్నారు. The police in #Gadag had a hearty laugh after a man claimed be was taking the hen to a vet as it had constipation issues. Police however sent him back home @santwana99 @ramupatil_TNIE @XpressBengaluru @KannadaPrabha @raghukoppar @karnatakacom @NammaBengaluroo @DgpKarnataka pic.twitter.com/BEdxton5ce — Amit Upadhye (@Amitsen_TNIE) May 29, 2021 -
ఫేస్బుక్ లైవ్‌లో కొవిడ్ మృతుల అంత్యక్రియలు..
బెంగళూరు: కరోనా ఎంతో మంది జీవితాలను అతలాకుతులం చేసింది. కనీసం కటుంబసభ్యలు కూడా కరోనాతో మరణించిన వారి కడచూపుకు కూడా నోచుకోలేక పోయారు. కరోనాతో మరణించిన వ్యక్తి అంత్యక్రియలను ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రసారం చేసిన సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. మనోహర్ (పేరు మార్చబడింది) అనే వ్యక్తి కరోనాతో మరణించాడు. అతని మృతదేహన్ని సుందాలోని ఇండియన్ క్రిస్టియన్ స్మశానవాటికలో అంత్యక్రియలకు తీసుకు వచ్చారు. క్వారంటైన్లో ఉన్న అతని కుటంబసభ్యలు, మలేషియాలో ఉన్న బంధువులు కరోనా మహమ్మారి కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అతని అంత్యక్రియలను స్నేహితులు ఏర్పాటు చేసిన ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షించారు. ఈ సంఘటన అందరినీ కలిచివేస్తోంది. బెంగళూరు నగరంలో కరోనాతో ప్రియమైన వారిని కోల్పోయిన చాలా కుటుంబాలు అంత్యక్రియలకు హాజరు కాలేదు. ఎందుకంటే వాళ్లు కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఉన్నారు. వారు అంత్యక్రియలను చూడడానికి వాట్సాప్, ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లైవ్ స్ట్రీమ్ చేయడానికి స్నేహితులు, వాలంటీర్లు పైన ఆధారపడుతున్నారు. కొంతమంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను కూడా సాయం తీసుకుంటున్నారు. కమ్మనహళ్లికి చెందిన ఓ మహిళ విక్టోరియా ఆసుపత్రిలో కరోనాతో మరణించింది. ఆమె కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియాలో ఉన్నారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ చేయాలని ఆమె బంధువులు కోరుకున్నారు. టాబ్లెట్ ఉపయోగించి ఫేస్బుక్ లైవ్ ద్వారా చేశామని.. ఇండియన్ క్రిస్టియన్ స్మశానవాటికలో ఒక కెమెరామెన్ చెప్పారు. విదేశాలలో ఉన్న బంధవులు లైవ్ స్ట్రీమింగ్ అంత్యక్రియల కోసం అనేక అభ్యర్థనలు మాకు అందుతున్నాయి అని అన్నాడు. (చదవండి:సెకండ్ వేవ్: ఆగని మృత్యుఘోష..కొత్తగా 2,67,334 పాజిటివ్ కేసులు) -
పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాన్ బీభత్సం..
ముంబై: తౌక్టే తుఫాను పశ్చిమ తీర ప్రాంతాలను అతలాకుతలం చేస్తోంది. ముంబైలో తుఫాన్ బీభత్సం సృస్టిస్తున్నది. వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేయడంతో 3 గంటలపాటు ముంబై ఎయిర్‌పోర్టు మూసి వేశారు. ఇప్పటివరకు 12,420 మంది ప్రజలను తీరప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని సురక్షిత ప్రదేశాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. తౌటే’ తుఫాను గుజరాత్లో ఈ రోజు సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది. దీని కారణంగా గుజరాత్ రాష్ట్రంలోని తీర ప్రాంతాలలో భారీ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్ తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపుసహాయక చర్యల కోసం 54 ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి కేరళలోను తౌక్టే తుఫాన్ బీభత్సం సృస్టిస్తున్నది. ముఖ్యంగా 9 జిల్లాల్లో తౌక్టే తుపాను ప్రభావంఎక్కువగా వుంది.ఎర్నాకుళం, ఇడుక్కి, మలప్పురంలో భారీ వర్షాలుకురుస్తున్నాయి. కర్ణాటకలోని 7 జిల్లాల్లో తౌక్టే తుపాను ప్రభావం ఎక్కవగా వుంది. ఉడుపి నాడా ప్రాంతంలో 38.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. గోవాను తౌటే తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తుంది.తుఫాన్ కారణంగా ఇద్దరు మృతి చెందారు. (చదవండి:అతి తీవ్ర తుపానుగా మారిన తాక్టే తుపాను) -
ప్రేయసిపై కన్నేసిన కంప్యూటర్ సెంటర్ యజమాని, దాంతో
సాక్షి, కేజీఎఫ్(కర్ణాటక): కంప్యూటర్ సెంటర్ యజమాని హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నగరానికి చెందిన రాజేంద్ర ప్రసాద్, మేల్విన్‌లు నిందితులు. కంప్యూటర్ సెంటర్ యజమాని ముకుందన్ వద్ద రాజేంద్రప్రసాద్ ప్రియురాలు పనిచేసేది. ఆమెపై కన్నేసి పెళ్లి చేసుకోవాలని ముకుందన్ వేధించసాగాడు. దీంతో ఆమె పని వదిలేసినప్పటికీ అతడు ఫోన్లు చేస్తూ ఒత్తిడి చేశాడు. దీంతో ప్రేయసి సలహాతో మేల్విన్‌తో కలిసి రాజేంద్ర ప్రసాద్ ముకుందన్‌ను ఏప్రిల్ 28న హత్య చేశాడు. అండర్సన్పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది. చదవండి: ఫేస్బుక్ పరిచయం.. నగ్నంగా వీడియో కాల్.. కట్ చేస్తే.. -
ఫ్యాన్సీ స్టోర్‌లో చొరబడి.. కత్తులతో పొడిచి మహిళ హత్య
కోలారు: ఫ్యాన్సీస్టోర్ నిర్వాహకురాలిని దుండగులు పట్టపగలే కత్తులతో పొడిచి హత్య చేసి ఉడాయించారు. ఈఘటన కోలారు నగరంలోని మహాలక్ష్మీ లేఅవుట్లో బుధవారం చోటు చేసుకుంది. కోలారు తాలూకాలోని నాగనాయకనహళ్లి గ్రామానికి చెందిన నీలవేణి (29) మహిలక్ష్మీ లే అవుట్లో నివాసం ఉంటోంది. అక్కడే ఫ్యాన్సీ స్టోర్ నిర్వహిస్తోంది. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం ఫ్యాన్సీస్టోర్‌లోకి వచ్చిన నీలవేణి.. సామగ్రిని సర్దుకుంటుండగా దుండగులు ఒక్కసారిగా లోపలకు చొరబడ్డారు. కత్తులతో మహిళ మెడపైనా ఇతర భాగాల్లో పొడిచి ఉడాయించారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. నగర పోలీసులు వేలిముద్ర నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌తో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సమీపంలోని సీసీకెమెరాలను పరిశీలించగా ముగ్గురు దుండగులు ఫ్యాన్సీస్టోర్‌లోకి చొరబడిన దృశ్యాలు కనిపించాయి. అనంతరం మృతదేహాన్ని కోలారు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి హంతకుల కోసం వేట ప్రారంభించారు. చదవండి: 26 కత్తి పోట్లు: ‘దగ్గరకు వచ్చారో మీకు ఇదే గతి’ -
మీ కక్కుర్తి తగలడా.. ప్రాణం కన్న బీరే ముఖ్యమా?
బెంగళూరు: కోవిడ్ సెకండ్ వేవ్ దేశంలో విలయం సృష్టిస్తోంది. మహమ్మారి కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్నో కఠిన చర్యలను తీసుకుంటున్నప్పటికి జనాలు మాత్రం కొంచెం కూడా భయపడటం లేదు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటి వాటిని అస్సలు పట్టించుకోవడం లేదు. అన్నింటి కంటే దారుణం ఏంటంటే.. గుంపులు గుంపులుగా తిరుగుతూ.. ఎక్కడికక్కడ కోవిడ్ నియమాలను ఉల్లంఘిస్తున్నారు. జనాలకు తమ ప్రాణల గురించి ఏ మాత్రం ఆలోచన లేదు. ఈ వీడియో చూస్తే.. ఇది ముమ్మాటికి నిజమే అనిపిస్తుంది. మద్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇంకేముంది.. ఫ్రీగా మందు లభిస్తుండటంతో జనాలు ఎగబడ్డారు. ఒకరిని ఒకరు తోసుకుంటూ.. మందు బాటిళ్ల కోసం పరిగెత్తారు. కరోనా వస్తే తగ్గుతుంది.. కానీ మందు ఫ్రీగా లభిస్తుందా అన్నట్లు ఉంది వారి ధోరణి. ఈ సంఘటన కర్ణాటక చిక్‌మంగళూరులో చోటు చేసుకుంది. మద్యం లోడుతో వెళ్తున్న లారీకి యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల వారు డ్రైవర్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అని కూడా ఆలోచించకుండా మందు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. క్షణాల్లో విషయం సమీప గ్రామాలకు పాకడం.. వారు మందు బాటిళ్ల కోసం పరిగెత్తుకు రావడంతో.. అక్కడ వందలాదిగా జనాలు పోగయ్యారు. ఇక బీరు బాటిళ్ల కోసం ఒకరిని ఒకరు తోసుకుంటూ.. అందినకాడికి చంక బెట్టుకుని వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు జనాలను కంట్రోల్ చేయడానికి ప్రయత్నించినప్పటికి కుదరకపోవడంతో.. చివరకు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు మీ కక్కుర్తి తగలడా.. ప్రాణాల కంటే మందే ముఖ్యమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కరోనా తీవ్రరూపం: కిట్లు లేవు.. టీకాలు లేవు! -
437 కోట్లు కాదు.. రూ.52 కోట్లు నష్టం!
బెంగళూరు: బెంగళూరు సమీపంలోని నరసపుర ఐఫోన్ ప్లాంట్ కర్మాగారంలో శనివారం జరిగిన ఘర్షణల్లో విస్ట్రాన్ కంపెనీ యొక్క వాస్తవానికి నష్టం 52 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. తైవాన్ కంపెనీ ఆపిల్ ఐఫోన్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. తైవాన్ కంపెనీ ఐఫోన్ ప్లాంట్ కర్మాగారంలో జరిగిన హింస కారణంగా ప్రధాన ఉత్పాదక పరికరాలు, గిడ్డంగులోని వస్తువులు ఎక్కువ నష్టం వాటిల్ల లేదని తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 100 మిలియన్ల నుండి 200 మిలియన్ల న్యూ తైవాన్ డాలర్(స్థానిక కరెన్సీ) నష్టం కలిగి ఉండవచ్చని అంచనా. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 52 కోట్ల రూపాయలుగా ఉండవచ్చు. (చదవండి: ఆపిల్ ఫ్యాక్టరీలో విధ్వంసం: రాజకీయ ప్రకంపనలు) కానీ, కోలార్ పోలీస్ స్టేషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం నష్టం 437కోట్ల రూపాయలని తెలిపింది. సంస్థ మొదట్లో నష్టాన్ని ఎక్కువగా అంచనా వేసిందా లేదా పోలీసులు తన నివేదికలో పొరపాటు చేశారా లేదా ఎక్కడైనా తప్పు జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ హింసాత్మక ఘటనలో మెటీరియల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. దాదాపు రూ.52 కోట్ల నష్టం మాత్రమే వాటిల్లినట్లు తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్కు విస్ట్రన్ సమాచారం ఇచ్చింది. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి శివ్రామ్ హెబ్బర్ కంపెనీ ఫిర్యాదులో మాత్రం 437 కోట్ల రూపాయలను ఎందుకు పేర్కొంది అన్నారు. నష్టం ఎంతనేది పక్కనబెడితే.. ఇలాంటి ఘటనలను సమర్థించేది లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి 5 వేల మంది కాంట్రాక్టు వర్కర్లు సహా ఏడు వేల మందిపై కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. -
సినీ ఫక్కిలో.. లవర్ కోసం భర్త కిడ్నాప్
బెంగళూరు: లవర్‌కి సాయం చేయడం కోసం ఓ మహిళ భర్తను కిడ్నాప్ చేసింది. పూర్తిగా సినీ ఫక్కిలో జరిగిన ఈ కిడ్నాప్ వ్యవహారం పోలీసులనే ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలు.. బెంగళూరుకు చెందిన సోమశేఖర్ అనే వ్యక్తి ఇల్లు కొనడం కోసం సుమారు 40 లక్షల రూపాయలు దాచాడు. ఈ డబ్బుపై అతడి భార్య కన్నుపడింది. ఈ మొత్తం తీసుకుని ప్రియుడికిచ్చి.. అతడితోపాటు ఉడాయించాలని భావించింది. ఈ క్రమంలో లవర్, అతడి తల్లి.. స్థానిక బీబీఎంపీ డాక్టర్‌తో కలిసి భర్త కిడ్నాప్‌కు ప్లాన్ చేసింది. దాని ప్రకారం ముందుగా బీబీఎంపీ డాక్టర్ సాయంతో భర్త సోమశేఖర్ పేరు మీద ఓ నకిలీ కోవిడ్-19 పాజిటివ్ సర్టిఫికెట్ తెప్పించింది. ఆ తర్వాత ఓ రోజు తనకు కడుపు నొప్పిగా ఉంది.. టాబ్లెట్స్ తీసుకురావాల్సిందిగా భర్త సోమశేఖర్‌ని కోరింది. దాంతో అతడు సమీప మెడికల్ షాప్‌కు వెళ్లాడు. అప్పటికే ఓ అంబులెన్స్‌లో రెడీగా ఉన్న బాధితుడి భార్య లవర్, అతడి తల్లి, బీబీఎంపీ డాక్టర్ మెడికల్ షాపు దగ్గరికి వచ్చారు. సోమశేఖర్‌కి కరోనా పాజిటివ్ అని.. ఆస్పత్రి నుంచి తప్పించుకుని వచ్చాడని అరిచారు. దాంతో స్థానికులు సోమశేఖర్‌ని పట్టుకుని బలవంతంగా అంబులెన్స్‌లోకి తోశారు. (చదవండి: ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. ఆస్తి కోసం) ఆ తర్వాత సోమశేఖర్‌ని తీసుకుని వెళ్లి ఓ ఫామ్‌హౌజ్‌లో బంధించారు. నలభై లక్షల రూపాయలు ఇస్తే వదిలేస్తామని తెలిపారు. దాంతో సోమశేఖర్‌కి అనుమానం వచ్చింది. ఇది తెలిసిన వారి పనే అని భావించి ఎలాగైనా కిడ్నాపర్ల చెర నుంచి బయట పడాలని నిర్ణయించుకున్నాడు. సరే డబ్బు ఇస్తానని చెప్పి తన స్నేహితులకు కాల్ చేశాడు. వెంటనే తన భార్యకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని స్నేహితులను కోరాడు. సోమశేఖర్ మాటాల్లో ఏదో తేడా కొడుతుందని భావించిన స్నేహితులు అతడి భార్యకు కాల్ చేశారు. ఆమె తన భర్తకు కరోనా వచ్చిందని.. మగాది రోడ్‌లోని ఆస్పత్రిలో ఉన్నాడని వారికి తెలిపింది. దాంతో సోమశేఖర్ స్నేహితులు ఆస్పత్రికి వెళ్లి కనుక్కోగా అతడి భార్య మాటలు అబద్ధం అని తేలింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి సోమశేఖర్ భార్యను విచారించారు. దాంతో మొత్తం స్టోరీ బయటకు వచ్చింది. ప్రస్తుతం పోలీసులు బాధితుడి భార్య, లవర్, అతడి తల్లి, వారికి సాయం చేసిన బీబీఎంపీ డాక్టర్ని అరెస్ట్ చేశారు. -
మహిళను తోసేసిన ఎమ్మెల్యే.. గర్భస్రావం
బెంగళూరు: ఎమ్మెల్యే, అతడి అనుచరులు దాడి చేయడంతో తనకు అబార్షన్ అయ్యిందంటూ ఓ మహిళా నాయకురాలు సొంత పార్టి ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేసింది. బాధితురాలిని స్థానిక బీజేపీ నాయకురాలు, మహాలింగాపూర్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్ మెంబర్ చాందిని నాయక్‌గా గుర్తించారు. గత నెల 9న ఈ దారుణం చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక గత నెల 9న మహాలింగాపూర్ టౌన్ మున్సిపల్ కౌన్సిల్‌కి సంబంధించి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి తన మద్దతుదారులతో కలిసి అక్కడకు చేరుకున్నారు. చాందిని నాయక్ ఓటు వేయడానకి వెళ్తుండగా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో గర్భవతి అయిన చాందిని నాయక్ కింద పడిపోయింది. దాంతో ఆమెకు గర్భస్రావం అయినట్లుగా తెలిసింది. దీనిపై చాందిని నాయక్, ఆమె భర్త నగేష్ నాయక్.. మరో బీజేపీ లీడర్ సాయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే సిద్దూ సవధి మీద ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా చాందిని నాయక్ మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్యే రౌడీయిజం చేశారు. నన్ను కిందపడేశారు. ప్రజాప్రతినిధి అయ్యుండి.. ఓ మహిళ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం ఏంటి?.. ఇలాంటి నాయకులు ఉంటే మహిళలు రాజకీయాల్లోకి రావాలంటేనే భయపడతారు.. ప్రధాని ‘బేటీ బచావో.. బేటీ పడావో’ అంటూ నినాదాలు చేస్తారు.. ఎమ్మెల్యేలు మాత్రం మహిళలు పట్ల ఇలా దారుణంగా ప్రవర్తిస్తారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే సవధి స్పందించారు. చాందిని నాయక్ తనపై చేసినవన్ని తప్పుడు ఆరోపణలు అంటూ ఖండించారు. ‘‘చాందిని నాయక్‌కు సంబంధించిన ఆస్పత్రి రికార్డులు సేకరించాను. ఆమెకు 6 సంవత్సరాల క్రితం ట్యూబెక్టమీ అయ్యిందని తెలిసింది. ఒక రోజులో నేను ఈ నివేదికను మీడియాకు విడుదల చేస్తాను” అన్నారు. ఆమె కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని.. ఆమెకు ఎలాంటి గర్భస్రావం జరగలేదని ఆసుపత్రి అధికారులు తనకు తెలియజేశారని సవధి తెలిపారు. (చదవండి: కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడ్చాను) కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బ్రిజేష్ కలప్ప ఈ వివాదంపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు., “బీజేపీ ఎమ్మెల్యే సిద్దూ సవధి గర్భవతి అయిన కౌన్సిలర్ చాందిని నాయక్ మీద దాడి చేసిన వీడియోలను మేం టీవీ చూసి చాలా భయపడ్డాము. ఎమ్మెల్యే క్రూరత్వం వల్ల ఆమెకు గర్భస్రావం అయ్యింది. బీజేపీ ఇప్పుడు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోగలదా?!” అంటూ సవాలు చేశారు. -
నేను బతికి ఉండటం అద్భుతం: శ్రీనివాసమూర్తి
బెంగళూరు: ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు కర్ణాటకలో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు ఒకరు ఓ వర్గాన్ని కించపరిచే విధంగా పోస్టు చేశారు. ఎమ్మెల్యే అండతోనే సదరు వ్యక్తి ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి నిరసనకారులు బెంగళూరులో శ్రీనివాస మూర్తి నివాసంపై దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్యే తాజాగా స్పందించారు. తాను బతికుండటం నిజంగా అద్భుతం అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ క్షణం నేను బతికి ఉండటం నిజంగా అద్భుతం. దాడి జరిగినప్పుడు నేను బయట ఉన్నాను. నా శ్రేయోభిలాషులు ఫోన్ చేసి దాడి గురించి ముందుగానే నన్ను హెచ్చరించారు. దాంతో తప్పించుకోగలిగాను. లేదంటే ఇప్పుడు నేను ఇలా బతికి ఉండేవాడిని కాదు’ అన్నారు శ్రీనివాస మూర్తి. (బెంగళూరు అల్లర్లు: ముస్లింల సాహసం) అంతేకాక ‘గుర్తు తెలియని వ్యక్తులు నా ఇంటికి నిప్పంటించారు. పెట్రోల్ బాంబులను విసిరారు. పోలీసులు సకాలంలో రాకపోతే నా ఇంట్లో గ్యాస్ సిలిండర్‌ను పేల్చేసేవారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన దాడి. పోలీసులు దీనిపై విచారణ చేయాలి. బాధ్యులను కఠినంగా శిక్షించాలి’ అని శ్రీనివాస మూర్తి డిమాండ్ చేశారు. ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న తనకే ఇలా జరిగితే... ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. దాడులు చేసిన వారు తమ నియోజకవర్గానికి చెందిన వారు కాదని, బయటి వ్యక్తులన్నారు. ఈ విషయంపై హోంమంత్రి, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడానని, తమ పార్టీ వారితో కూడా మాట్లాడినట్టు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. 100మంది గాయపడ్డారు. వీరిలో 60 మంది పోలీసులు ఉన్నారు. -
‘ప్రధాని ప్రశంసించారు.. అది చాలు’
బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ వృద్ధుడి పేరు నిన్న దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. తన ప్రాంతంలో నీటి ఎద్దడి తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించిన ఆ వృద్ధుడిని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో అభినందించారు. ఆ వివరాలు.. మాండ్య, దసనదొడ్డి ప్రాంతానికి చెందిన కామె గౌడ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తమ ప్రాంతంలో నీటి ఎద్దడిని తీర్చడం కోసం ఏకంగా 16 చెరువులు తవ్వించి పెద్ద మనసు చాటుకున్నాడు. ఓ సామన్య గొర్రెల కాపరికి ఇది చాలా పెద్ద విషయమే. దాంతో ఇది కాస్తా ప్రధాని దృష్టికి వెళ్లింది. ఈ క్రమంలో నిన్నటి ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో నరేంద్ర మోదీ కామె గౌడను ప్రశంసించారు. దీనిపై సదరు వృద్ధుడు స్పందిస్తూ.. ‘నిన్నటి కార్యక్రమంలో ప్రధాని కరోనా వైరస్ గురించి జనాలను హెచ్చరించారు.. సరిహద్దు వివాదం గురించి మాట్లాడారు. ఇన్ని ముఖ్యమైన అంశాల మధ్య ఆయన నా పేరును ప్రస్తావించి.. అభినందించారు. నా జీవితానికి ఇంతకంటే పెద్ద సంతోషం ఏం ఉంటుంది’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. తన ప్రాంతంలో చెరువులు తవ్వించి.. నీటి సమస్యను తీర్చడంతో ఆ ప్రాంత ప్రజలు కామె గౌడను ‘కేరె’(చెరువుల)గౌడ అని గౌరవంగా పిల్చుకుంటున్నారు. (స్నేహానికి గౌరవం.. శత్రువుకు శాస్తి) నిన్నటి ‘మన్‌కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ ప్రాంతంపై కన్నేసిన వారికి భారత్ తగిన సమాధానం చెప్పిందని తెలిపారు. స్నేహస్ఫూర్తికి గౌరవమిస్తూనే, ఎంతటి శత్రువుకైనా తగు సమాధానం చెప్పే సామర్థ్యం భారత్‌కు ఉందని చైనాను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
నీ ముక్కు చాలా పొడవు.. నిన్ను పెళ్లి చేసుకోలేను!
సాక్షి, బెంగళూరు: కాబోయే భర్త ముక్కు పొడవుగా ఉందంటూ ఓ యువతి నిశ్చితార్థం చేసుకున్నాక పెళ్లికి నిరాకరించింది. అప్పటికే పెళ్లి ఏర్పాట్లు చేసుకున్న యువకుడి తరఫు బంధువులు లబోదిబోమంటున్నారు. కోరమంగలకు చెందిన జ్యోతిప్రకాష్ బెంగళూరులో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఓ మాట్రిమోనీ సైట్ ద్వారా హిమబిందు అనే యువతితో పరిచయం కాగా.. ఆన్లైన్లో చాటింగ్ చేస్తూ మాట్లాడుకున్నారు. ఇద్దరి ఉద్యోగాలు, అభిరుచులూ నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇరు కుటుంబాలు గతేడాది సెప్టెంబర్ 9న వీరి నిశ్చితార్థం నిర్వహించారు. యువతి కోరిక మేరకు తిరుపతిలో జనవరి 30 వివాహం చేసేందుకు నిర్ణయించారు. దీంతో యువకుడి బంధువులు తిరుమలలో 70 రూమ్‌లు బుక్‌చేశారు. రూ.4 లక్షలతో పెళ్లిదుస్తులు కొనుగోలు చేశారు. అంతలో తనకు పెళ్లి ఇష్టం లేదంటూ అక్టోబర్ 23న హిమబిందు కబురు పంపింది. పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని.. ప్లాస్టిక్ సర్జరీతో సరిచేయించుకుంటే పెళ్లికి ఒప్పుకుంటానని షరతు విధించింది. అతని ఫోన్ నంబర్‌నూ బ్లాక్ చేసింది. దీంతో జ్యోతిప్రకాష్.. కుటుంబ సభ్యులతో కలిసి కోరమంగల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం శనివారం వెలుగులోకి వచ్చింది. పెళ్లి ఏర్పాట్ల కోసం రూ.5 లక్షల వరకూ ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు. -
హింసకు అణచివేతే సమాధానమా?
పౌరసత్వ సవరణ చట్టంపై నిరసన తెలుపుతున్నవారితో ఎలాంటి చర్చలూ చేపట్టని ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు వారిని బలప్రయోగంతో చెదరగొట్టాయి. కాల్పులు జరిపాయి. విధ్వంసం చేసినవారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. వాస్తవానికి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు.. విభజించి పాలించు అనే సూత్రం పనిచేసినంతకాలం తమ హిందూ ఓటు చెక్కుచెదరదనే అభిప్రాయంతో.. ముస్లింలతో సహా ఇతరులను లెక్కపెట్టడం లేదు. సత్పరిపాలనకు సంబంధించిన అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ చర్యలు.. అమలులో ఉన్న చట్టాలన్నింటినీ ఉల్లంఘించడమే కాదు.. చట్టపాలనను అవమానిస్తున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తుల, సమూహాల హింసకు తీవ్ర అణచివేత సమాధానం కావడం ఆటవిక న్యాయమే అవుతుంది. రాజకీయ తప్పిదాలు, అతి చర్యలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆస్తుల ధ్వంసానికి పాల్పడిన నిరసనకారుల నుంచి నష్టపరిహారం రాబట్టాలని ప్రయత్నం చేస్తోంది. కానీ నిరసన తెలిపేందుకు ప్రజలకున్న రాజ్యాంగపరమైన హక్కులే ప్రాథమికం కానీ అణచివేత కాదన్న విషయం యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మర్చిపోయినట్లు కనబడుతోంది. శాంతిభద్రతల ప్రయోజనాల రీత్యా కానీ, భారత సార్వభౌమత్వం, సమగ్రత విషయంలో అయినా సరే.. నిరాయుధంగా, శాంతి యుతంగా సమావేశం కావడానికి రాజ్యాంగం దేశప్రజలకు కల్పించిన హక్కుపై అహేతుక ఆంక్షలను రుద్దకూడదని రాజ్యాంగం స్వయంగా నిర్దేశించిన నిబంధనను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కచ్చితంగా పాటించడం లేదని బోధపడుతోంది. రాజ్యాంగం పొందుపర్చిన ఈ అత్యంత ముఖ్యమైన ప్రాథమిక విధులను ఉల్లంఘించిన యోగి ప్రభుత్వం ఇప్పటికే అణచివేతకు గురైన వారిపై మరింత అణచివేతను విధించబోతున్నది. పైగా, అణచివేతకు పాల్పడిన పోలీసులను నిర్దోషులుగా నిర్ణయిస్తోంది. ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే హక్కు తమకుందని ఎవరూ ప్రకటించలేరు. అది నేరం. దానికి న్యాయస్థానం విధించిన పరిహారాన్ని చెల్లించాల్సిందే. కానీ దీనికి అనుసరించాల్సిన పద్ధతి, ప్రక్రియ ఏకపక్షంగా ఉండకూడదు లేక అమాయకులపై గురిపెట్టరాదు. రాజస్తాన్‌లో గుజ్జర్ల హింసాకాండ సందర్భంగా ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లిన సందర్భంలో ఈ అంశంపై సుప్రీంకోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. న్యాయసలహాదారుగా నన్ను 2007 జూన్ 5న నియమించినప్పుడు నేర లేక సివిల్ వ్యవహారాల్లో అడ్డదిడ్డంగా చర్యలు తీసుకోవడం సాధ్యపడదని, ప్రజా ఆస్తుల విధ్వంస నిరోధక చట్టం 1984 (పీడీపీపీఏ)ను, సంబంధిత ఇతర చట్టాలను మరోసారి పరిశీలించాలని సుప్రీంకోర్టుకు విన్నవించాను. పైగా ఆనాటి అల్లర్లను అణచివేయడానికి 6 కంపెనీల సైనికులను పంపిన పారామిలిటరీ అధికారులను కె పరాశరన్, నేను స్వయంగా కలిసి విచారించాం కూడా. అయితే ఈ పీడీపీపీఏ... నేరనిరోధక చర్యలకు ఏమాత్రం తగి నది కాదు పైగా సాధారణ కేసులకు జరిమానాతో సహా ఆరునెలల జైలుశిక్ష విధింపు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు ప్రయోగించిన వారికి ఒకటి నుంచి పదేళ్ల కారాగార శిక్ష విధింపు అనేవి కొత్త నేరాలకు, అపరాధాలకు దారి తీస్తాయి. సామూహికంగా లేదా వ్యక్తిగతంగా ఒకరిపై వేలెత్తి చూపేరీతిలో నేరాలపై చర్యలను తీసుకోరాదు. దానికి ఒక క్రమ ప్రక్రియ అవసరం అవుతుంది. ఆనాడు రాజస్తాన్, హరియాణా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలలో గుజ్జర్ల ప్రదర్శన సందర్భంగా జరిగిన విధ్వంసం మాటల్లో చెప్పలేనిది. సైన్యాన్ని రంగంలో దింపారు. ఈ సందర్భంగా అనేక ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి అరెస్టులు చేశారని, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం చేకూరిందని నా నివేదికలో పొందుపర్చాను. నేను నివసిస్తుండిన న్యూ ఫ్రెండ్స్ కాలనీలో కూడా ఒక డీటీసీ బస్సును తగులబెట్టేశారని కోర్టుకు నివేదించాను. 2007 మే నెలలో ఎన్‌హెచ్8, ఎన్‌హెచ్ 11లో, బురుండి సమీపంలో మోర్దా, బయానా బోనిల్, విరాట్ నగర్ గ్రామాల్లో పోలీసులు జరిపిన కాల్పుల ఘటనల్లో 18 మంది చనిపోయారు. గుంపు ఒక పోలీసును చచ్చేలా కొట్టారు. ఈ చర్యకు గాను గుజ్జర్లపై సాటి నిరసనకారులైన మీనాలు కూడా తిరగబడ్డారు. ఆనాడు ఘటనలకు సంబంధించిన ప్రతి రిపోర్టునూ జాతీయ టీవీ చానల్స్ ప్రసారాలను పరిశీలించి కోర్టుకు వివరంగా సమర్పించాను. మీడియా బాధ్యతాయుతంగానే నివేదించిందని, ఎక్కడా కల్పించి వార్తల్ని ప్రసారం చేయలేదని పేర్కొన్నాను. కానీ న్యాయస్థానం నా సమగ్ర నివేదికను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రతి ఒక్కరినీ తప్పుపట్టడమే కాకుండా కత్తిరించి అతికించిన మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన నాటి రాజస్తాన్ సీఎం వసుంధరా రాజే, గుజ్జర్లతో అయిదు దఫాలుగా చర్చలకు పూనుకున్నారు. తొలి నాలుగు చర్చలు విఫలమైనా 2007 జూన్ 4న చివరిదఫా చర్చలు విజయవంతమయ్యాయి. తర్వాత బెయిన్స్లా– రాజే మధ్య కుదిరిన ఒప్పందాన్ని గుజ్జర్ల మహాపంచాయతీ ఆమోదించింది. దాంతో సైన్యం కూడా బ్యారక్‌లలోకి వెళ్లిపోయింది. నాటి గుజ్జర్ల హింసాత్మక చర్యలకు, 2019లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న హింసాత్మక చర్యలకు మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంది. తాజాగా నిరసన తెలుపుతున్న వారితో ఎలాంటి చర్చలూ ప్రారంభించకుండానే ఉత్తరప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు వారిని బలప్రయోగంతో చెదరగొట్టాయి. తీవ్రఆరోపణలు చేశాయి. గుజ్జర్లు, మీనాలు, ఇతర ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకులను బుజ్జగించాలని వసుంధరా రాజే ఆనాడు ప్రయత్నించారు. కానీ 2019లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ముస్లిం ఓట్లను, వామపక్ష ఉదారవాద నిరసనకారులను పక్కన బెట్టవచ్చని భావించాయి. విభజించి పాలించు సూత్రం పనిచేసినంతకాలం తమ హిందూ ఓటు చెక్కుచెదరదనే అభిప్రాయంతో వీరు ముస్లింలతో సహా ఇతరులను లెక్కపెట్టడం లేదు. గుజ్జర్ల ఘటన సందర్భంగా సుప్రీంకోర్టు ఆనాడు ప్రభుత్వాలకు, వాటి హైకోర్టులకు నిర్దేశించిన విధివిధానాలను ఇప్పుడు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ లక్నో బెంచ్‌కి చెందిన జస్టిస్ సుధీర్ అగర్వాల్ (బాబ్రీమసీదు కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి) తాజా అల్లర్లకు పాల్పడినవారిపై పీడీపీపీఏ చట్టాన్ని విధించలేదని శోకన్నాలు పెట్టారు. మరోవైపున యోగి ఆదిత్యనా«థ్ పోలీసుల అతిచర్యలపై ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా, నిరసనకారులపైనే తప్పుమోపారు. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు పోలీసుల ద్వారా జరిగిన విధ్వంసంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తక్షణమే నివేదించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినా యూపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. ఇరుపక్షాల పాత్రపై అంతిమంగా న్యాయస్థానం నిర్ణయించాల్సి ఉండగా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ ప్రక్రియ మొత్తాన్ని పక్కనబెట్టేసింది. మరొక ముఖ్యమైన అంశం ఏదంటే హైకోర్టు, సుప్రీంకోర్టు పేర్కొన్న మార్గదర్శక సూత్రాలను కమిషనర్ తప్పక పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. పోలీసుల వల్ల జరిగిన విధ్వంసాన్ని వివరంగా సమర్పించాల్సి ఉంది. ఈ ముఖ్యమైన భాగాన్ని పాటించకుంటే, పోలీసులు, రాష్ట్రప్రభుత్వ నివేదిక అసంపూర్ణంగానూ, అసందర్భ ంగానూ ఉండిపోతుంది. ఇక్కడ పోలీసుల వల్ల జరిగిన విధ్వంసం అంటే వ్యక్తిని లేక వ్యక్తులను గాయపర్చడం, చంపడం కూడా అని అర్థం. కానీ యూపీ ప్రభుత్వం ప్రైవేట్ నిరసనకారులను లక్ష్యంగా చేసుకుని పోలీసు చర్యలను పట్టించుకోకపోవడమే పెద్ద విషాదం. సన్మార్గం కంటే మరింత సన్మార్గంతో తాను వ్యవహరిస్తున్నట్లు నటిస్తున్న యూపీ ప్రభుత్వం కొన్ని నష్టపూరిత చర్యలకు డబ్బు రూపంలో లెక్కగట్టి చూపుతోంది. కానీ ఈ తరహా నష్టాల విషయంలో పక్కా ఆధారాలను చూపించిన తర్వాతే కమిషనర్‌కు వాటిని నివేదించాల్సి ఉంది. జరిగిన నష్టాలకు వాటికి కారకులైన వారికి మధ్య సంబంధాన్ని కచ్చితంగా అంచనా వేయాల్సి ఉంటుంది. గుజ్జర్ల నిరసన కేసులపై జరిగిన చర్చల సందర్భంగా, రెండు కమిటీలూ నేరం జరిగిన ప్రక్రియలో చోటు చేసుకున్న ఘటనలన్నింటినీ నేరవిచారణలో పొందుపర్చాలని అంగీకరించారు. జరిగిన అకృత్యాలపై సివిల్ చర్య తీసుకోవడానికి నారిమన్ కూడా మద్దతు తెలిపారు. కానీ పదేళ్ల తర్వాత కూడా అలాంటి చట్టం ఏదీ అమలులోకి రాలేదు. సుప్రీకోర్టు నిర్దేశించిన మార్గదర్శక సూత్రాలను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కారణం ఒక్కటే.. ఈ మార్గదర్శకాలను అమలు చేస్తే పోలీసుల అతి చర్యలు, వేధింపులు కూడా న్యాయ పరిశీలనకు వస్తాయి. హింసాత్మక ఘటనలపై రాష్ట్రప్రభుత్వమూ ఏకపక్ష చర్య తీసుకోకూడదు. పైగా శిక్షార్హమైన నేరచర్యలకు పాల్పడినవారిని తప్పనిసరిగా అరెస్టు చేయవలసిన అవసరం లేదని గతంలో ఏడుగులు సభ్యులతో కూడిన అలహాబాద్ హైకోర్టు పేర్కొన్న విషయాన్ని యూపీ ప్రభుత్వం తప్పకుండా గుర్తుంచుకోవాలి. కానీ తాజా ఘటనల సందర్భంగా యోగి ప్రభుత్వం 5 వేలమందిని నిర్బంధించడమే కాకుండా వారిలో వెయ్యిమందిని అరెస్టు చేసింది కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే సత్పరిపాలనకు సంబంధించిన అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలు.. అమలులో ఉన్న చట్టాలన్నింటినీ దారి మళ్లించడమే కాదు.. చట్టపాలనను అవమానిస్తున్నాయని కూడా చెప్పాల్సి ఉంటుంది. వ్యాసకర్త : రాజీవ్ ధావన్, సీనియర్ న్యాయవాది -
ఇడ్లీ చాలెంజ్.. ఈ బామ్మతో పోటీ పడగలరా
బెంగళూరు: ఇడ్లీ చాలామందికి ఇష్టమైన అల్పాహారం. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేలీకగా జీర్ణం అవుతుంది. అయితే ఇడ్లీ అంటే ఎంత ఇష్టం ఉన్నా మాములుగా ఎన్ని తినగల్గుతారు.. నాలుగు, ఆరు సరే ఓ పది. కానీ నిమిషంలోనే ఆరు ఇడ్లీలు స్వాహా చేసే వారిని ఎప్పుడైనా చూశారు. అది కూడా 60 ఏళ్ల బామ్మ అంటే నమ్మగలరా. కానీ ఇది వాస్తవం. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఇడ్లీ తినే పోటీ పెట్టారు. హుల్లాహళ్లి ప్రాంతానికి చెందిన సరోజమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఏకంగా నిమిషంలో ఆరు ఇడ్లీలు తిని ఔరా అనిపించడమే కాక పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. యువతులు, పెళ్లైనవారు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ వారందరిని సరోజమ్మ ఓడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో హిందుస్తాన్ టైమ్స్, ఏఎన్ఐలో వచ్చింది. -
కర్ణాటకం : కాంగ్రెస్ ఎమ్మెల్యే యూటర్న్..!
బెంగుళూరు : కన్నడనాట రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఓ వైపు రెబెల్ ఎమ్మెల్యేలు ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌తో చర్చలకు ససేమిరా అనడంతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్ కుప్పకూలే పరిస్థితి నెలకొంది. మరోవైపు కాంగ్రెస్‌కు మద్దతిస్తానని చెప్పిన రెబెల్ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు 24 గంటల్లోనే మాటమార్చారు. సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తానని శనివారం నాగరాజు శివకుమార్‌తో చెప్పినట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ, ఆదివారం ఉదయంకల్లా సీన్ రివర్సయింది. ఆయన యూటర్న్ తీసుకున్నారు. ముంబైలో మకాంవేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసేందుకు నాగరాజు వెళ్లినట్టు సమాచారం. ఆయనతోపాటు మరో ఎమ్మెల్యే సుధాకర్ కూడా రెబెల్ ఎమ్మెల్యేల శిబిరంలో చేరేందుకు వెళ్లనున్నట్టు తెలిసింది. (చదవండి : రేపే ‘విశ్వాసం’ పెట్టండి) విశ్వాసం సన్నగిల్లిందా..! శాసనసభలో బుధవారం ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. తమ ఎమ్మెల్యేలపై పూర్తి విశ్వాసం ఉందని, విశ్వాస పరీక్షలో నెగ్గుతామని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. విశ్వాస పరీక్షలో పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తే వారి సభ్యత్వాన్ని కోల్పోతారని అన్నారు. ఈ అంశం చట్టంలో స్పష్టంగా ఉందని వెల్లడించారు. అసంతృప్త ఎమ్మెల్యేల డిమాండ్లను పరిష్కరించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. విశ్వాస పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సోమవారం శాసనసభాపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఇక సంకీర్ణానికి మద్దతిస్తానని చెప్పిన నాగరాజు యూటర్న్ తీసుకోవడంపై ఆయనకు పార్టీ సమర్థతపై విశ్వాసం సన్నగిల్లిందా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. (చదవండి : విశ్వాసపరీక్షకు సిద్ధం!) -
‘రూ.400 కోట్లు లంచమిచ్చా..ఆత్మహత్యే దిక్కు’
రెక్కలు ముక్కలు చేసుకుని కూడబెట్టిన డబ్బును ఐఎంఏలో డిపాజిట్ చేశాం, మా డబ్బులు మాకు ఇప్పించండి సార్.. అని బాధితుల విలాపం. ఎవరిని కదిపినా ఇదే ఆవేదన. బెంగళూరు శివాజీనగరలోని ఐఎంఏ గ్రూప్ సుమారు వేలాది కోట్ల రూపాయల డిపాజిట్లను ప్రజల నుంచి సేకరించి బోర్డు తిప్పేయడం సంచలనాత్మకమైంది. ఐటీ సిటీ ఆర్థిక నేరాల అడ్డాగా మారుతోందనే విమర్శలకు ఊతమిస్తోంది. బెంగళూరు : ఐ మానిటరీ అడ్వైజరీ(ఐఎంఏ) గ్రూప్ మన్సూర్ ఖాన్ విడుదల చేసిన ఆడియో క్లిప్‌తో కర్ణాటక అట్టుడికి పోతుంది. అధికారులు, నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రోషన్ బయాగ్ వంటి వారందరికి దాదాపు రూ. 400 కోట్ల వరకూ లంచాలు ఇచ్చానని.. ఫలితంగా తాను మోసపోయానని ఆత్మహత్యే శరణ్యమంటూ ఐఎంఏ గ్రూప్ అధినేత మన్సూర్ ఖాన్ ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేసి.. అదృశ్యమయిపోయారు. ఇప్పటి వరకూ ఆయన ఆచూకీని కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారు. దాంతో పెద్ద ఎత్తున జనాలు శివాజీనగరలోని ఆఫీసు వద్దకు చేరుకుని.. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది మహిళలు ఉన్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం రూపాయి రూపాయి దాచుకున్నామని, డబ్బులు పోతే ఆత్మహత్యలే శరణ్యమని రోదించారు. ఓ వైపు వేల సంఖ్యలో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చెందుతుండగా.. మరో వైపు కాంగ్రెస్, బీజేపీ ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వెల్లువలా వస్తున్న బాధితులు బాధితుల రద్దీని తట్టుకోవడానికి శివాజీనగరలో సంస్థ కార్యాలయంలోనే పోలీసులు ఫిర్యాదుల స్వీకరణ కేంద్రాన్ని తెరవాల్సి వచ్చింది. పలువురు బాధితులు తమ సొమ్మును ఎలాగైనా ఇప్పించాలని గొడవకు దిగటంతో పోలీసులు వారిని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించారు. పెద్దసంఖ్యలో బాధిత మహిళలు ఉదయం నుంచే తమ పసిబిడ్డలను ఎత్తుకొని వచ్చి సొమ్ము డిపాజిట్ చేసి మోసపోయామని, బ్యాంకులో పెట్టిన సొమ్మును తీసి వారి చేతిలో పెట్టామని వాపోయారు. కూడబెట్టుకున్న సొమ్మును కోల్పోయి తమ కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో పడిందని విలపించారు. బాధితుల ఫిర్యాదులను స్వీకరించామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విచారణ చేపట్టామని అధికారులు తెలిపారు. మీ సొమ్ము మీకు లభిస్తుందని బాధితులతో చెప్పసాగారు. ఈ క్రమంలో వైద్యుడొకరు ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చినపుడు అస్వస్థతకు గురై మూర్ఛపోగా, తక్షణమే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఐఎంఏలో డిపాజిట్ చేసిన వందలాది మంది ఫిర్యాదులు చేయటానికి గ్రూపులు గ్రూపులుగా వస్తునే ఉన్నారు. సుమారు 3, 4 వేల మంది ఫిర్యాదులు చేశారని, ఈ సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఖాతాల్లోకి కోట్లాది నగదు ప్రవాహం మన్సూర్ఖాన్ అదృశ్యం, డిపాజిటర్ల ఫిర్యాదుల నమోదు అయిన తరువాత కూడా సోమవారం రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు నగదు ఐఎంఏ బ్యాంకు ఖాతాల్లోకి చేరినట్లు కమర్షియల్ స్ట్రీట్ పోలీసుల తనిఖీల్లో తెలిసింది. ఈ కేసులో సుమారు 10 మందికి పైగా బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసిన బ్యాంకు లావాదేవీల పరిశీలన సందర్భంలో మన్సూర్, డైరెక్టర్లు, ఐఎంఏ ఖాతాకు ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా కోట్లాది రూపాయాలు వినియోగదారులు డిపాజిట్ చేసినట్లు వెల్లడైంది. స్కాం నేపథ్యంలో మేల్కొన్న పోలీసులు ఐఎంఏ ఖాతాలను సీజ్ చేసి, ఎవరూ డిపాజిట్ చేయరాదని ప్రజలకు విన్నవించారు. ఆన్లైన్లో సొమ్ము సేకరించేవారి గురించి పోలీసులు సమాచారాన్ని ఆరా తీస్తున్నారు. వెనుక ఎవరున్నా విచారణ జరపాలి ఐఎంఏ జ్యువెల్స్ యజమాని అదృశ్య కేసుకు సంబంధించి దీని వెనుక ఎవరున్నా తగిన తనిఖీ జరుపాలని, ప్రభావం కలిగిన రాజకీయ నాయకులున్నా కూడా క్షమించరాదని వక్ఫ్ మంత్రి జమీర్ అహ్మద్ అన్నారు. ఈ విషయమై హోమ్ మంత్రి ఎంబీ పాటిల్‌ను కలుసుకున్న తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇదొక అతిపెద్ద వంచన కేసని అన్నారు. దీనిపై సిట్ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సీబీఐ దర్యాప్తు జరుపాలని విన్నవించినట్లు తెలిపారు. ఐఎంఏ జ్యూవెల్స్ యజమాని మహమ్మద్ మన్సూర్ ఖాన్‌కు చెందిన నగలను, ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని డిపాజిటర్లకు సొమ్మును ఇప్పించాలని హోంమంత్రిని కోరానని తెలిపారు. – మంత్రి జమీర్ అహ్మద్ డైరెక్టర్ల కోసం గాలింపు ఐఎంఏ కంపెనీకి చెందిన నలుగురు డైరెక్టర్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మన్సూర్ ఖాన్ గత గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో నలుగురు డైరెక్టర్లు పాల్గొన్న విషయాన్ని పోలీసులు సేకరించారు. సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశంలో ఏయే సంగతులను చర్చించారనేది ఆరా తీస్తున్నారు. సమావేశం తరువాత డైరెక్టర్ల మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. మన్సూర్ ఎక్కడ దాక్కున్నాడనేది డైరెక్టర్లకు తెలిసి ఉండవచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పందించారు. కేసును సెంట్రల్ క్రైం బ్రాంచ్‌కు అప్పగించినట్లు తెలిపారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ క్రమంలో బీజేపీ.. కుమారస్వామి, ఐఎంఏ కంపెనీ అధినేత మన్సూర్ ఖాన్ కలిసి ఉన్న ఫోటోలను ట్విట్ర్లో షేర్ చేసింది. దాంతో పాటు ఈ మోసగాడు మీకు చాలా కాలం నుంచి తెలుసు. ఇప్పుడతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇలా బాధితుల మాదిరి విలపిస్తే ఫలితం ఉండదంటూ విమర్శించింది. -
మాపై కోపమెందుకు అన్నా: కుమారస్వామి
సాక్షి, బెంగళూరు : ‘ఎందుకన్నా.. మాపై కోపమా, రా అన్న మాతో కలవండి, మీకు ఏమి సహాయం కావాలో చేద్దాం, ఇలా మధ్యలో విడచిపెట్టి వెళ్లవద్దు. మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి’ అంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి అథణి కాంగ్రెస్ ఎమ్మెల్యే మహేశ్ కుమటెళ్లికి విన్నవించిన సంఘటన సోమవారం విధానసౌధలో జరిగింది. మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా విధానసౌధలో జరిగిన కార్యక్రమానికి మహేశ్ కూడా వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర్ ఇద్దరు కలిసి మహేశ్‌ను పక్కనే ఉన్న ఉద్యానవనంలోకి తీసుకెళ్లి మాట్లాడారు. ఆయనను ఒప్పించే పనిలోపడ్డారు. ఈ ఘటన రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో భేటీ తరువాత మహేశ్ కుమటెళ్ళి విలేకరులతో మాట్లాడారు. ‘అథణి నియోజకవర్గంలో ఉన్న కృష్ణా నదిలో నీరులేదు. నియోజకవర్గ ప్రజలకు మహారాష్ట్ర నుంచి తాగునీరు విడుదల చేయించే విషయమై ముఖ్యమంత్రిని కలిసా, మినహాయించి ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదు అని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, కాంగ్రెస్ నుంచి వైదొలగనని తెలియజేసిన ఆయన, కొన్ని చానల్స్‌లో తాను గోవాలో ఉన్నానని చూపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మీడియాలో ప్రసారం చేయరాదన్నారు. మాజీ మంత్రి రమేశ్ జారకిహొళ్ళి మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం.కృష్ణను కలుసుకున్న సంగతి తనకు తెలియదని, తామెవ్వరు కాంగ్రెస్‌ను విడచి వెళ్లమన్నారు. తమలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు. -
కాంగ్రెస్ నాయకురాలి అనుమానాస్పద మృతి..!
బెంగుళూరు : కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రేష్మా పడెకనూర్ మృతి చెందారు. గురువారం రాత్రి అదృశ్యమైన ఆమె శుక్రవారం శవమై కనిపించారు. బసవనబాగేవాడి తాలుకాలో కృష్ణానదిపై నిర్మించిన కొల్హార్ బ్రిడ్జి సమీపంలో ఆమె మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్నపోలీసులు అక్కడకు చేరుకుని అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై గాయాలున్నాయని.. ఇది హత్యా, ఆత్మహత్యా తెలియాల్సి ఉందని ఏసీపీ బీఎస్ నేమెగౌడ్ చెప్పారు. దర్యాప్తు మొదలు పెట్టామని వెల్లడించారు. గురువారం రాత్రి నుంచి కనిపించకుండా పోయిన రేష్మా రాత్రయినా ఇంటికి రాకపోవడం, సెల్‌ఫోన్ స్విఛాఫ్ చేసి ఉండడంతో కుంటుంబ సభ్యులు కొల్హార్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఆమె కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకపోయింది. రేష్మా మృతదేహం, పక్కన ఆమె ఫైల్ ఫోటో మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ పార్టీ నాయకుడి కారులో ఆమె వెళ్లినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జేడీఎస్ విజయపుర జిల్లా అధ్యక్షురాలిగా పనిచేసిన రేష్మా 2013 అసెంబ్లీ ఎన్నికల్లో దేవరహిప్ప నియోజకవర్గం పోటీచేసి ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ మరోమారు టికెట్ కేటాయించకపోవడంతో.. ఆమె కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న రేష్మా ఫలితాలు దగ్గర పడుతున్న సమయంలో ప్రాణాలు కొల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆమె మరణంపట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. -
దేవెగౌడ కీలక ప్రకటన : భావోద్వేగం
-
దేవెగౌడ కీలక ప్రకటన : భావోద్వేగం
సాక్షి,బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు నగరా మోగిన నేపథ్యంలోమాజీ ప్రధానమంత్రి, జేడీఎస్ చీఫ్ హెచ్డీ దేవెగౌడ కీలక ప్రకటన చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లోల తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. అయితే తన స్థానంలో హసన్ లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థిగా తన మనవడు ప్రజ్వాల్ రెవన్నాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా దేవెగౌడ భావోద్వేగానికి లోనయ్యారు. దీంతో ఆయన మనవడు ప్రజ్వల్, కుమారుడు రేవణ్ణ సైతం భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తమ అభిమాన నాయకున్ని అలా చూసిన జేడిఎస్ నేతలు, కార్యకర్తలు కూడా కంటనీరు పెట్టుకున్నారు. హెలెన్సర్పూర్ తాలుకా ముదలహిప్పి గ్రామంలో జరిగిన జేడీఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించేలా తన మనవడిని ఆశీర్వదించాలని హసన్ నుంచి ఎంపీగా ఉన్న దేవెగౌడ కోరారు. ఇప్పటికి తాను చాలా మందిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని ఇపుడు తన కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొస్తుంటే మాత్రం కొందరు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారనంటూ కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఈ సమయంలో పక్కనే వున్న మనువడు ప్రజ్వల్ ఆయన కన్నీటిని తుడిచి ఓదార్చాడం గమనార్హం. మరో మనవడు నిఖిల్ (సీఎం కుమారస్వామి కుమారుడు)ని సైతం దేవెగౌడ రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్యా లోక్‌సభ నియోజకవర్గం నుంచి నిఖిల్‌కు టికెట్ కేటాయిస్తారని సమాచారం. ఆయన ఎన్నికల్లో పోటీచేస్తారని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై జేడీఎస్ హైకమాండ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు హసన్‌లో ప్రజ్వల్‌పై కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఏ.మంజు పోటీకి దిగుతున్నట్టు సమాచారం. కాగా దేశ రాజకీయాల్లో సీనియర్ నాయకులు, కురువృద్ధులు ఎన్నికల బరినుంచి తప్పుకుంటుండగా, వారి వారసులు రంగంలోకి దిగడం కీలక పరిణామం. ముఖ్యంగా నిన్నగాక మొన్న తన కుటుంబంనుంచి మనువడు (మూడవతరం) పోటీచేస్తారని ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రకటించారు. తాజాగా దేవేగౌడ్ మనువడు, కర్నాటక మంత్రి హెచ్డీ రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లోక్‌సభ ఎన్నికల ద్వారా క్రియాశీల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. -
పన్ను ఎగవేసిన వ్యాపారవేత్తకు జైలు
సాక్షి, బెంగళూరు : పన్ను ఎగవేత కేసులో కర్నాటకకు వ్యాపారవేత్తకు ఊహించని షాక్ తగిలింది. రూ .7.35 కోట్లను ఆదాయపు పన్ను బకాయిల ఎగవేత కేసులో ఆదాయపన్ను శాఖ అధికారులు అతనికి ఆరునెలల జైలుశిక్ష విధించింది. ఆదాయ పన్ను బకాయిలపై ఎన్ని రిమైండర్లు పంపించినా స్పందించకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సదరు వ్యాపారవేత్తను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అనంతరం ఆరునెలల జైలు విధించి, సిటీ సెంట్రల్ జైలుకు తరలించామని ఒక ప్రకటనలో తెలిపింది. అయితే తూమకూరుకు చెందిన వ్యాపారి అన్న సమాచారం మినహా, అతని పేరును, వ్యాపార వివరాలను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. -
వరదలు: షాకింగ్ వీడియో
బెంగళూరు: కేరళలో వరద బీభత్సం మరింత ఉగ్రరూపం దాల్చింది. గత ఏడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు కేరళను వణికిస్తున్నాయి. గత శతాబ్దంలో కురవని వర్షాలు రాష్ట్నాన్ని ముంచెత్తాయి. లక్షలాది మందిని నిరాశ్రయులను చేసింది. మృతుల సంఖ్య 87కి చేరింది. చివరికి సహాయశిబిరాలు కూడా వరదల్లో చిక్కుకున్న పరిస్థితి అక్కడ నెలకొంది. మరోవైపు కర్నాటకను భారీ వర్షాలు ముంచెత్తాయి. కొడగు జిల్లాకు సంబంధించిన ఒక షాకింగ్వీడియో వైరల్ గా మారింది. ఒక కొండ అంచున ఉన్న రెండు అంతస్థుల భవనం కొన్నిసెకన్లుపాటు అలా కదలిపోయింది. అతి ప్రమాదకర పరిస్థితిలో అలా ప్రవహిస్తూ మట్టితో పాటు కొట్టుకుపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. వరద పరిస్థితికి ఈ భయంకరమైన వీడియో అద్దం పడుతోంది. కర్నాటకలోని మూడు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో భవనంలో ఎవరూ లేరని జిల్లా పరిపాలక అధికారులు ప్రకటించారు. మడికేరికి సమీపంలోని కట్టకేరి, తంతితాల గ్రామాలలో దాదాపు 300 మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి, సమీపంలోని కొండపైన, రక్షక చర్యలకోసం ఎదురు చూస్తున్నట్టు కొడగు జిల్లా డిప్యూటీ కమీషనర్ శ్రీవిద్యా తెలిపారు. కాగా వాతావరణ శాఖ లెక్కల ప్రాకరం కేరళలో జూన్ 1, ఆగష్టు 15 మధ్యకాలంలో 2091.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 1600 మిల్లీమీటర్లతో పోలిస్తే ఇది 30.7శాతం ఎక్కువ. ఆగస్టు9, 15 మధ్య తేదీల్లో సగటున 98.5 మి.మీ.కు బదులుగా 352 మి.మీ సగటు వర్షపాతం నమోదయింది. ఇది 257 శాతం ఎక్కువ. ఇడుక్కి జిల్లాలో సాధారణంకంటే 447.6శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. మరోవైపు ఆర్మీ బృందం సహాయ రక్షక చర్యలకోసం గురువారం తిరువనంతపురం చేరుకుంది. -
‘ముచ్చటేలేదు.. 150 కొట్టేస్తాం.. ’
సాక్షి, బెంగళూరు : ‘సిద్ద రామయ్య ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీని ఇక మా రాష్ట్రంలో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మార్పు మొదలైంది. మరో మాటకు అవకాశం లేదు. కచ్చితంగా 150 సీట్లు గెలిచి తీరుతాం’ అని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గత 75 రోజులుగా పరివర్తన యాత్ర చేస్తున్న ఆయన తన సొంత జిల్లా మాండియా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పచ్చి అవకాశ వాది అని, హిందుత్వం పేరిట లాభం పొందాలనుకుంటున్నారని అన్నారు. హిందువుల గురించి తెగ మాట్లాడుతున్న రాహుల్ ఎన్నికలు ముగిశాక ఆ విషయం మరిచిపోతారని విమర్శించారు. ప్రజలు వారిని నమ్మే పరిస్థితి లేదని అన్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని, లింగాయత్‌లు వీరశైవులు తన దృష్టిలో ఒకటేనని చెప్పారు. గుజరాత్ 150 సీట్ల మార్క్ బీజేపీ అందుకోలేకపోయిందిగా అని ప్రశ్నించగా కర్ణాటకలో మాత్రం తమ పార్టీ కచ్చితంగా 150 సీట్ల మార్క్‌ను అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. -
జయకు చెక్ పెడుతున్న కర్నాటక
-
జయకు చెక్ పెడుతున్న కర్నాటక
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. జయ అక్రమాస్తుల కేసులో కర్నాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఉన్నత న్యాయస్థానం దీనిపై సమాధానం చెప్పాల్సిందిగా, కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా ఆమెకు ఆదేశాలు జారీ చేసింది. ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు పొరపాటున నిర్దోషిగా తేల్చిందని ఆరోపించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసిన విషయం తెలిసిందే. జయలలిత కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పులో తమకు అనుమానాలు ఉన్నాయంటూ అప్పీలుకు వెళ్లింది. జయలలిత అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఆమెను దోషిగా ప్రకటించాలని సుప్రీంకోర్టుకు కర్ణాటక విన్నవించింది. 1991-96 మధ్య జయలలిత సీఎంగా ఉన్నప్పుడు రూ.66 కోట్ల మేర అక్రమాస్తులు సంపాదించినట్లు 1997లో డీఎంకే ప్రభుత్వం కేసు పెట్టింది. ఈ కేసు అనేక మలుపులు తర్వాత కేసును కర్నాటక స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారు. అయితే జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.100 కోట్ల జరిమానా విధించిన స్పెషల్ కోర్టు తీర్పును కర్నాటక హైకోర్టు కొట్టివేసింది. దీంతో దాదాపు ఎనిమిది నెలల జైలు శిక్ష తర్వాత జయలలిత నిర్దోషిగా బయటపడి తమిళనాడు సీఎం పదవిని చేపట్టారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలో ఆమె ఆర్కేనగర్ నియోజకవర్గంనుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో జయ విడుదలకు వ్యతిరేకంగా కర్నాటక ప్రభుత్వం సుప్రీంలో అప్పీలు చేసింది.