టీమిండియా ఆటగాడు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. నార్తాంప్టన్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ తరపున ఆడేందుకు నాయర్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో నార్తాంప్టన్‌షైర్‌కు కరుణ్ నాయర్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.
ఆస్ట్రేలియా ఆటగాడు సామ్ వైట్‌మన్ స్థానంలో కరుణ్ నాయర్ నార్తాంప్టన్‌షైర్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే సెప్టెంబర్ 8న నార్తాంప్టన్‌షైర్ జట్టుతో నాయర్ చేరాడు. ఆదివారం వార్విక్‌షైర్‌తో జరిగే మ్యాచ్‌తో నాయర్ కౌంటీల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ట్రిపుల్ సెంచరీతో అదరగొట్టి..
2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో అతడు టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన నాయర్.. అరంగేట్ర సిరీస్‌లోనే డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో 381 బంతులు ఎదుర్కొని 303 పరుగులతో అజేయంగా నిలిచాడు.
టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత పెద్దగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. నాయర్ 2017 మార్చిలో ఆస్ట్రేలియాతో టెస్టులో చివరిసారిగా టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.
చదవండి: SA vs AUS: చరిత్ర సృష్టించిన వార్నర్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment