![Indian opener Prithvi Shaw slams quick-fire 76 in England domestic One-Day Cup](/styles/webp/s3/article_images/2024/07/29/prithvi.jpg.webp?itok=QdtG1ChB)
ఇంగ్లండ్ దేశీవాళీ వన్డే కప్-2024లో టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా నార్తాంప్టన్‌షైర్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాడ్‌లెట్ క్రికెట్ క్లబ్ వేదికగా మిడిలెక్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన పృథ్వీ షా.. మిడిలెక్స్‌తో మ్యాచ్‌లో మాత్రం విధ్వంసం సృష్టించాడు. కేవలం 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 58 బంతులు ఎదుర్కొన్న షా.. 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో 76 పరుగులు చేసి ఔటయ్యాడు.
దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన నార్తాంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పృథ్వీతో పాటు గాస్ మిల్లర్(73), జైబ్(58) హాఫ్ సెంచరీలతో రాణించారు. పృథ్వీ షా విషయానికి వస్తే.. దాదాపుగా మూడేళ్ల నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.
ఫామ్ లేమి, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా భారత సెలక్టర్లు అతడిని పరిగణలోకి తీసుకోవడం లేదు. దేశీవాళీ క్రికెట్‌లో కూడా తన మార్క్‌ను చూపించడంలో షా విఫలమయ్యాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతడి ప్రదర్శన అంతంతమాత్రమే. ఈ ఏడాది సీజన్‌లో ఢిల్లీ తరపున షా 8 ఇన్నింగ్స్‌లలో 198 పరుగులు మాత్రమే చేశాడు.
10.5 | That's 50 for Prithvi Shaw! 👏
The opener brings up his half-century off 33 balls.
Steelbacks 75/2.
Watch live 👉 https://t.co/CU8uwteMyd pic.twitter.com/JlIYPxjAjl— Northamptonshire Steelbacks (@NorthantsCCC) July 29, 2024
Comments
Please login to add a commentAdd a comment