ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సత్తాచాటిన సంగతి తెలిసిందే. కౌంటీ క్రికెట్ డివిజన్ IIలో నార్తాంప్టన్‌షైర్ ప్రాతినిథ్యం వహించిన చాహల్.. తన స్పిన్ మయాజాలంతో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు.
ఈ ఇంగ్లండ్ దేశీవాళీ టోర్నీలో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రడే ఆడిన చాహల్ ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్ల హాల్స్ కూడా ఉన్నాయి. అయితే తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ మాట్లాడుతూ.. భారత తరపున టెస్టు క్రికెట్ ఆడాలన్న తన కోరికను వ్యక్తం చేశాడు. వచ్చే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్ కోసం రేసులో ఉండాలని చాహల్ భావిస్తున్నాడు.
కౌంటీ క్రికెట్ ఆడటం చాలా కష్టం. నా స్కిల్స్‌ను మరింత మెరుగుపరుచుకోవడం కోసం నాకు మంచి అవకాశం లభించింది. వచ్చే ఏడాది భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో రెడ్‌బాల్‌తో నా సత్తా ఎంటో సెలక్టర్లకు తెలియజేయాలనకున్నాను.
నాకు కౌంటీ క్రికెట్‌లో ఆడే అవకాశాన్ని కల్పించిన బ్రిండన్ సర్‌కి ధన్యవాదాలు. ఆపై రాజస్తాన్ రాయల్స్ కోచ్‌లు సైతం నాకు ఎంతో సహాయం చేశారు. భారత టెస్టు జట్టులోకి రావడమే నా లక్ష్యమని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment