రాయచూరు రూరల్: కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాలో భూ వివాదం నలుగురి హత్యకు దారితీసింది. మూడు ఎకరాల కోసం ఈ ఘోరం జరిగింది. వివరాలు... భాగల్‌కోటె జిల్లా జమఖండి తాలూకా మధురఖండిలో రెండు కుటుంబాల మధ్య ఆస్తి వివాదం ఉంది. ధార్వాడ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో శనివారం రాత్రి పొలంలో ఉన్న అన్నదమ్ములు హన్మంతు (48), మల్లప్ప (44), ఈశ్వర్ (40) బసవరాజ్ (36)లను వరుసకు బంధువులైన పుటాణి కుటుంబ సభ్యులు మారణాయుధాలతో హతమర్చారు.
కోర్టు తీర్పు ఆలస్యం అవుతుండటంతో శనివారం రాత్రి కాపుగాచి నలుగురిని కిరాతకంగా చంపేశారు. దీంతో జమఖండి పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment