ఎలా ఉంది ఫొటో? అద్భుతం అనిపిస్తోంది కదా? పెద్ద చెరువు.. పక్కనే పచ్చటి మైదానం. ఎక్కడుంది ఇది? అనుకుంటున్నారా? ఇప్పటికైతే లేదు కానీ... ఇంకొన్నేళ్లలో ఈ డిజైన్‌తో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని బీసీసీఐ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. కర్ణాటకలోని మైసూర్‌లో కట్టనున్న ఈ స్టేడియం కోసం మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) 20.8 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది.
కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ)కి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముడా ఆ భూమిని కెఎస్‌సిఎ 30 సంవత్సరాల లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం. లీజు మొత్తం రూ. 18 కోట్లు ఉండవచ్చు. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని కెఎస్‌సిఎ అధికారులు పరిశీలించినట్లు వినికిడి.
వచ్చే ఏడాది ఆఖరికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానున్నట్లు కెఎస్‌సిఎ వర్గాలు వెల్లడించాయి. మైసూర్‌లో ఈ స్టేడియం నిర్మాణం జరిగితే అది కర్ణాటక రాష్ట్రంలో రెండో అంతర్జాతీయ స్టేడియం కానుంది. ఇప్పటికే బెంగళూరులో చిన్నస్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే.
MUDA is all set to hand over 20.8 acres of land to the Karnataka state cricket association (KSCA) for the construction of a International cricket stadium in #Mysuru 🔥 pic.twitter.com/7TgGE7W3eD
— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ (@NameIsShreyash) June 7, 2024
Comments
Please login to add a commentAdd a comment