Karnataka State Cricket Association
-
భారత్‌లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. ఎక్కడంటే?
ఎలా ఉంది ఫొటో? అద్భుతం అనిపిస్తోంది కదా? పెద్ద చెరువు.. పక్కనే పచ్చటి మైదానం. ఎక్కడుంది ఇది? అనుకుంటున్నారా? ఇప్పటికైతే లేదు కానీ... ఇంకొన్నేళ్లలో ఈ డిజైన్‌తో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మించాలని బీసీసీఐ ప్లాన్లు సిద్ధం చేస్తోంది. కర్ణాటకలోని మైసూర్లో కట్టనున్న ఈ స్టేడియం కోసం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) 20.8 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ)కి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముడా ఆ భూమిని కెఎస్‌సిఎ 30 సంవత్సరాల లీజుకు ఇవ్వనున్నట్లు సమాచారం. లీజు మొత్తం రూ. 18 కోట్లు ఉండవచ్చు. తాజాగా స్టేడియం నిర్మించే ప్రాంతాన్ని కెఎస్‌సిఎ అధికారులు పరిశీలించినట్లు వినికిడి. వచ్చే ఏడాది ఆఖరికి ఈ స్టేడియం నిర్మాణం పూర్తి కానున్నట్లు కెఎస్‌సిఎ వర్గాలు వెల్లడించాయి. మైసూర్లో ఈ స్టేడియం నిర్మాణం జరిగితే అది కర్ణాటక రాష్ట్రంలో రెండో అంతర్జాతీయ స్టేడియం కానుంది. ఇప్పటికే బెంగళూరులో చిన్నస్వామి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్న సంగతి తెలిసిందే. MUDA is all set to hand over 20.8 acres of land to the Karnataka state cricket association (KSCA) for the construction of a International cricket stadium in #Mysuru 🔥 pic.twitter.com/7TgGE7W3eD— 𝗦𝗵𝗿𝗲𝘆𝗶 ᵀᵒˣᶦᶜ (@NameIsShreyash) June 7, 2024 -
భారత ట్రిపుల్ సెంచరీ వీరుడి సంచలన నిర్ణయం.. ఇకపై!
టీమిడియా వెటరన్ ఆటగాడు, కర్ణాటక స్టార్ కరుణ్ నాయర్ క్రికెటర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టుకు నాయర్ గుడ్ బై చెప్పాడు. ఇకపై విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడాలని కరుణ్ నాయర్ నిర్ణయించుకున్నాడు. ఈ మెరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కి వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు. "కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌తో గత రెండు దశాబ్దాలగా ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన కేఎస్సీఈకు ధన్యవాదాలు. అదే విధంగా నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన కోచింగ్ స్టాప్, కెప్టెన్లకు, సహచర ఆటగాళ్లకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎక్స్(ట్విటర్)లో నాయర్ పేర్కొన్నాడు. కాగా 2013లో కర్ణాటక తరపున కరుణ్ నాయర్ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. కర్ణాటక క్రికెట్‌తో దాదాపు రెండు దశాబ్దాల పాటు నాయర్ ప్రయాణం సాగింది. ఇప్పటివరకు కర్ణాటక తరపున 85 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నాయర్.. 48.94 సగటుతో 5922 పరుగులు సాధించాడు. అందులో 15 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తమిళనాడుతో జరిగిన 2014-15 రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం అతడికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో అతడు టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వీవీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత అంతగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు ఆఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు -
మహారాజా టీ20 లీగ్‌లో ఆడనున్న కర్ణాటక స్టార్ ఆటగాళ్లు..!
కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ శనివారం కీలక ప్రకటన చేసింది. ఆరు జట్లతో కూడిన మహారాజా టీ20 లీగ్‌ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ టోర్నమెంట్ ఆగస్ట్ 7 ప్రారంభమై ఆగస్ట్ 26న ముగియనుంది. ఈ టోర్నీలో దేవదత్ పడిక్కల్, మయాంక్ అగర్వాల్, మనీష్ పాండే, శ్రేయాస్ గోపాల్, కె గౌతమ్, జగదీశ సుచిత్, కరుణ్ నాయర్ అభిమన్యు మిథున్ వంటి ఆ రాష్ట్ర స్టార్ ఆటగాళ్లు భాగం కానున్నారు. ఇక బెంగళూరు, మైసూర్, హుబ్లీ, శివమొగ్గ, రాయచూర్, మంగళూరు జట్లుగా ఉన్నాయి. కాగా కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, మైసూర్ మహారాజు దివంగత శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ జ్ఞాపకార్థం ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. మహారాజా టీ20 ట్రోఫీలోని 18 మ్యాచ్‌లు మైసూర్‌లోని శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్ గ్రౌండ్లో జరగనుండగా.. ఫైనల్‌తో సహా మరో 16 మ్యాచ్‌లు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి. చదవండి: Robert Lewandowski: తొమ్మిది నిమిషాల్లో 5 గోల్స్.. ఫుట్‌బాల్‌లో కొత్త మొనగాడు -
టీ20లో సంచలనం.. సున్నాకు 6 వికెట్లు!
లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ సర్ఫరాజ్ అష్రఫ్ టీ-20లో అరుదైన ఘనతను సాధించాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన టీ20 పోటీల్లో అతను ఈ రికార్డు సాధించాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన టీ20 మ్యాచ్‌లో యంగ్ పాయినీర్స్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడిన సర్ఫరాజ్... మెర్కారా యూత్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్ మెన్ ను తన స్పిన్‌తో వణికించాడు. ఒక హ్యాట్రిక్ కూడా సాధించాడు. దీంతో అతని జట్టు 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సర్ఫరాజ్ సాధించిన ఆరు వికెట్లలో ఐదు వికెట్లు వరుస బంతులలో సాధించాడు. నిజానికి సర్ఫరాజ్ డబుల్ హ్యాట్రిక్ సాధించే చాన్స్ కూడా తృటిలో మిస్సైంది. అతను విసిరిన మూడో బంతికి ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసినప్పటికీ ఎంపైర్ ఔట్ ఇవ్వలేదు. ’పరుగులను కట్టడి చేయాలంటే దూకుడుగా బౌలింగ్ చేయాలని నేను భావిస్తా. అదే నాకు వికెట్లు సంపాదించి పెడుతుంది. శ్రీలంక బౌలర్ మలింగ తరహాలో విభిన్న యాక్షన్ తో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్ ను తికమకపెడతాను’ అని మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ మీడియాకు తెలిపాడు. బిహార్ ముజఫర్‌పూర్‌కు చెందిన సర్ఫరాజ్ బీసీసీఐ దేశీయ టీ20 టోర్నమెంట్ సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడాడు. గతంలో ఎయిరిండియా జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2014లో ఒడిశాతో జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్ మ్యాచ్‌లో జార్ఖండ్ తరఫున చివరిసారిగా ఆడిన సర్ఫరాజ్ ఇప్పటివరకు భారత ఏ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. ఈసారి ఏ జట్టుతోపాటు ఐపీఎల్‌లోనూ తనకు అదృష్టంవరిస్తుందని సర్ఫరాజ్ భావిస్తున్నాడు. తన తాజా ప్రదర్శనను సెలెక్టర్లు గుర్తిస్తారని అతను ఆశాభావంతో ఉన్నాడు. సర్ఫరాజ్ మ్యాచ్‌లో విసిరిన ఏడు బంతులు ఇలా సాగాయి.. మొదటి బంతి: ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఔట్ రెండో బంతి: ఎల్బీడబ్ల్యూ మూడో బంతి: డాట్ నాలుగో బంతి: ఎల్బీడబ్ల్యూ ఐదో బంతి: బౌల్డ్ ఆరో బంతి: ఎల్బీడబ్ల్యూ ఏడో బంతి (రెండో ఓవర్ మొదటి బంతి): ఎల్బీడబ్ల్యూ సంక్షిప్తంగా స్కోర్లు యంగ్ పయనీర్స్ క్లబ్: 264/4 20 ఓవర్లు. (సర్ఫరాజ్ అష్రఫ్ 40, దీపక్ 74, కిరణ్ 70, రామ్ (నాటౌట్) 22, సునీల్ (నాటౌట్) 33, ఎన్ స్వామి 2/56) మెర్కారా యూత్ క్లబ్: 14.3 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్. (బ్యాటింగ్.. మహేష్ 22; బౌలింగ్ మదన్ 3/21, సర్ఫరాజ్ అష్రఫ్ 6/0 (3-3-0-6) -
క్రికెట్ దిగ్గజాలను సన్మానించనున్న కేఎస్‌సీఏ
దేశంలో అత్యంత పురాతన క్రికెట్ సంఘాల్లో ఒకటయిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్‌సీఏ) పలువురు దిగ్గజ ఆటగాళ్లను సన్మానించనుంది. కేఎస్‌సీఏ ప్లాటినమ్ జూబ్లీ ఏడాదిని పురస్కరించుకుని 8 రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈనెల17న క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లను సముచితంగా గౌరవించనుంది. చిన్నస్వామి మైదానంలో శనివారం కేఎస్‌సీఏ ప్లాటినమ్ జూబ్లీ వేడుకలు ప్రారంభమవుతాయి. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ సర్ రిచర్డ్ హెడ్లీ, బిషన్ సింగ్ బేడీ, సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్లను సన్మానించనున్నట్టు కేఎస్‌సీఏ కోశాధికారి తాళ్లం వెంకటేష్ తెలిపారు.