టీమిడియా వెటరన్ ఆటగాడు, కర్ణాటక స్టార్ కరుణ్ నాయర్ క్రికెటర్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు నాయర్ గుడ్ బై చెప్పాడు. ఇకపై విదర్భ క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడాలని కరుణ్ నాయర్ నిర్ణయించుకున్నాడు. ఈ మెరకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌కి వీడ్కోలు పలుకుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశాడు.
"కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌తో గత రెండు దశాబ్దాలగా ప్రయాణం చేయడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన కేఎస్‌సీఈకు ధన్యవాదాలు. అదే విధంగా నా ఈ జర్నీలో మద్దతుగా నిలిచిన కోచింగ్ స్టాప్, కెప్టెన్‌లకు, సహచర ఆటగాళ్లకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎక్స్(ట్విటర్)లో నాయర్ పేర్కొన్నాడు.
కాగా 2013లో కర్ణాటక తరపున కరుణ్ నాయర్ ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. కర్ణాటక క్రికెట్‌తో దాదాపు రెండు దశాబ్దాల పాటు నాయర్ ప్రయాణం సాగింది. ఇప్పటివరకు కర్ణాటక తరపున 85 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన నాయర్.. 48.94 సగటుతో 5922 పరుగులు సాధించాడు. అందులో 15 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తమిళనాడుతో జరిగిన 2014-15 రంజీ ట్రోఫీ ఫైనల్లో నాయర్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అనంతరం అతడికి భారత టెస్టు జట్టులో చోటు దక్కింది. 2016లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌తో అతడు టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే ట్రిపుల్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో వీవీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా నాయర్ రికార్డులకెక్కాడు. అయితే ఆ తర్వాత అంతగా రాణించకపోవడంతో భారత జట్టులో చోటు కోల్పోయాడు.
చదవండి: Asia Cup 2023: ఆసియాకప్‌కు ఆఫ్గానిస్తాన్ జట్టు ప్రకటన.. స్టార్ ఆటగాడిపై వేటు
Comments
Please login to add a commentAdd a comment