ద్రవిడ్ చిన్న కొడుకు వ‌చ్చేస్తున్నాడు.. ఆ టోర్న‌మెంట్‌కు ఎంపిక‌ | Rahul Dravids younger son Anvay Dravid in Karnataka Probable List for U16 Vijay | Sakshi
Sakshi News home page

ద్రవిడ్ చిన్న కొడుకు వ‌చ్చేస్తున్నాడు.. ఆ టోర్న‌మెంట్‌కు ఎంపిక‌

Published Sun, Nov 10 2024 9:16 AM | Last Updated on Sun, Nov 10 2024 11:21 AM

Rahul Dravids younger son Anvay Dravid in Karnataka Probable List for U16 Vijay

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్ర‌విడ్ త‌న‌యులు క్రికెట్ ప్ర‌పంచంలోకి దూసుకొస్తున్నారు. పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ అండ‌ర్‌-19 స్ధాయిలో అద‌రగొడుతుండ‌గా.. ఇప్పుడు చిన్న కొడుకు అన్వయ్ ద్ర‌విడ్ విజయ్ మర్చంట్ ట్రోఫీలో స‌త్తాచాటేందుకు సిద్ద‌మ‌య్యాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీకి కర్ణాటక క్రికెట్ ఆసోషియేష‌న్‌కు ప్ర‌క‌టించిన 35 మంది ప్రాబబుల్స్ జాబితాలో అన్వయ్‌కు చోటుదక్కింది. 

కాగా అన్వ‌య్ ద్ర‌విడ్ గ‌తేడాది ఇంటర్-జోన్ స్థాయిలో కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదేవిధంగా ఇటీవ‌ల కేఎస్‌సీఏ అండర్-16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్‌లో అన్వ‌య్ అద్భుత‌మైన డ‌బుల్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 

ఈ టోర్నీలో భాగంగా తుమకూరు జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జోన్‌ తరపున 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి జయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ప్రాబబుల్స్‌లో చోటు కల్పించారు. ఇక ఈ టోర్నీ డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ద్రవిడ్‌ పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ కూచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతున్నాడు.
చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్‌.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్‌ ప్లేయర్లకు చోటు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement