KSCA
-
ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్‌కు ఎంపిక
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయులు క్రికెట్ ప్రపంచంలోకి దూసుకొస్తున్నారు. పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ అండర్-19 స్ధాయిలో అదరగొడుతుండగా.. ఇప్పుడు చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ విజయ్ మర్చంట్ ట్రోఫీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీకి కర్ణాటక క్రికెట్ ఆసోషియేషన్‌కు ప్రకటించిన 35 మంది ప్రాబబుల్స్ జాబితాలో అన్వయ్‌కు చోటుదక్కింది. కాగా అన్వయ్ ద్రవిడ్ గతేడాది ఇంటర్-జోన్ స్థాయిలో కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదేవిధంగా ఇటీవల కేఎస్‌సీఏ అండర్-16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో అన్వయ్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో భాగంగా తుమకూరు జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జోన్ తరపున 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి జయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ప్రాబబుల్స్‌లో చోటు కల్పించారు. ఇక ఈ టోర్నీ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ద్రవిడ్ పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ కూచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతున్నాడు.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
ఉతప్ప అనూహ్య నిర్ణయం
న్యూఢిల్లీ: సొంత టీమ్ కర్ణాటకతో 15 ఏళ్లు అనుబంధాన్ని క్రికెటర్ రాబిన్ ఉతప్ప తెంచుకోనున్నాడు. హోమ్ టీమ్‌ను వీడాలని నిర్ణయించుకోవడంతో అతడికి కర్ణాటక క్రికెట్ సంఘం(కేఎస్‌సీఏ) నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) ఇచ్చింది. ఇక అతడు వేరే రాష్ట్ర జట్టుకు ఆడినా ఇబ్బంది ఉండదు. రానున్న రంజీ సీజన్లో వేరే జట్టుకు ఆడనున్నాడు. ఉతప్ప నిర్ణయానికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదని కేఎస్‌సీఏ కార్యదర్శి సుధాకర్‌రావు తెలిపారు. ‘ ఉతప్ప నిర్ణయం బాధాకరం. ఏ జుట్టుకు ఆడినా అతడు బాగా రాణించాలని కోరుకుంటున్నాం. అండర్-14 స్థాయి నుంచి కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. వేరే టీమ్ తరపున ఆడేందుకు అతడు ఉత్సాహం చూపించాడు. మేము అతడి నిర్ణయానికి అడ్డుచెప్పలేద’ని సుధాకర్‌రావు అన్నారు. గత వారమే అతడికి ఎన్వోసీ ఇచ్చినట్టు వెల్లడించారు. 31 ఏళ్ల ఉతప్ప 130 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 46 వన్డేలు, 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అతడు ఏ రాష్ట్ర జట్టు తరపున ఆడేది ఇంకా స్పష్టం కాలేదు. రెండు రాష్ట్రాలు అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సుధాకర్‌రావు వెల్లడించారు. కేరళ తరపున ఉతప్ప ఆడే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. -
నేనూ వివక్షను ఎదుర్కొన్నా: కిర్మాణీ
♦ త్వరలోనే జీవిత చరిత్రలో బయటపెడతా బెంగళూరు: తాను క్రికెట్ ఆడే రోజుల్లో సహచర క్రికెటర్ల నుంచి వివక్షను ఎలా ఎదుర్కొన్నానో త్వరలోనే బయటపెడతానని భారత మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని విషయాలను పొందుపర్చిన తన జీవిత చరిత్రను కొద్ది రోజుల్లో విడుదల చేస్తానన్నారు. ‘నేను కూడా అహం బాధితుడినే. నాతో కలిసి ఆడినవాళ్లు సెలక్టర్లు అయ్యారు. 1986 నుంచి 1993 వరకు నేను దేశవాళీల్లో అద్భుతంగా ఆడాను. ఫిట్నెస్ సమస్యలు, వివాదాలు లేవు. కానీ తీరా చూస్తే నాకు జట్టులో మాత్రం చోటు దక్కకపోయేది. ఎందుకలా జరిగిందో నా పుస్తకంలో వివరిస్తా’ అని కిర్మాణీ పేర్కొన్నారు. 2011 ప్రపంచకప్‌కు ముందే దీన్ని విడుదల చేయాలని భావించినా.. కొన్ని కారణాల వల్ల తీసుకురాలేకపోయానని చెప్పారు. అయితే పుస్తకం పేరును ఇప్పుడు వెల్లడించలేనని, కచ్చితంగా అందర్ని ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) డెరైక్టర్‌గా కొనసాగించనందుకు చాలా నిరాశ కలిగిందన్నారు. ‘ఆరేళ్లు డెరైక్టర్‌గా పని చేశా. తర్వాత ఆ పదవి నుంచి తప్పించారు. నేనేమైనా తప్పు చేశానా? ఏ పద్ధతి ప్రకారం నన్ను తొలగించారు. కేవలం ఇగో వల్లే అది జరిగింది. అలా ఎవరు చేశారో నాకు తెలియదు. నన్ను తీసేయడానికి వాళ్ల అధికారం, డబ్బులు మాత్రమే పని చేశాయి’ అని ఈ మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యానించారు. ఐపీఎల్లో భారత ఆటగాళ్లను కాదని విదేశీ క్రికెటర్లను కెప్టెన్లుగా చేయడంపై కిర్మాణీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కేఎస్‌సీఏ నుంచి కుంబ్లే, శ్రీనాథ్ వాకౌట్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) వార్షిక సభ్య సమావేశం గందరగోళంగా మారింది. ఆదివారం జరిగిన ఈ సమావేశం నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ వాకౌట్ చేశారు. నిధులు దుర్వినియోగం చేశారని వారు మండిపడ్డారు. క్రికెట్ కోసం ఖర్చు చేయాల్సిన వంద కోట్ల రూపాయిల నిధులను క్లబ్ హౌస్‌ల కోసం వినియోగించాలని క్రికెట్ సంఘం నిర్ణయం తీసుకుందని కుంబ్లే ఆరోపించాడు. క్రికెట్ అభివృద్ధి కోసం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించాడు. 2010లో మూడేళ్లకాలానికి గాను కేఎస్‌సీఏ అధ్యక్షుడిగా కుంబ్లే ఎన్నికయ్యాడు. మాజీ పేసర్లు వెంకటేశ్ ప్రసాద్, శ్రీనాథ్ కూడా కేఎస్‌సీఏ పాలక మండలికి ఎన్నికయ్యారు.