Vijay Merchant Trophy
-
క్రికెట్ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు.. సెహ్వాగ్ పోస్ట్ వైరల్
టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉద్వేగానికి లోనయ్యాడు. తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్ సోరెంగ్ విజయ్ మర్చంట్ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నాడు. కాగా రాహుల్ మరెవరో కాదు.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్ సోరెంగ్ కుమారుడు.నాడు శోక సంద్రంలోకాగా కశ్మీర్లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా భద్రతా బలగాల జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దేశం మొత్తాన్ని శోక సంద్రంలో ముంచిన ఈ ఘటన నేపథ్యంలో వీరూ భాయ్ నాడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదే సమయంలో గొప్ప మనసు కూడా చాటుకున్నాడు.అమర వీరుల పిల్లలకు హర్యానాలోని సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఉచితంగా విద్యనందిస్తామని వాగ్దానం చేశాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు తమకు చేతనైంత మేర రుణం తీర్చుకుంటామని పేర్కొన్నాడు. పిల్లలను ప్రయోజకులు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపాడు. ఆ హామీని వీరూ భాయ్ నిలబెట్టుకున్నాడు కూడా!సెహ్వాగ్ భావోద్వేగంఇప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. సెహ్వాగ్ స్కూళ్లో చదువుతూనే.. క్రికెట్లోనూ శిక్షణ తీసుకుంటున్న రాహుల్ సోరెంగ్.. హర్యానా అండర్-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన వీరేంద్ర సెహ్వాగ్.. ‘‘రాహుల్ సోరెంగ్. ఈ పేరును గుర్తు పెట్టుకోండి.నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఇదీ ఒకటి. పుల్వామా దాడి వంటి విషాదకర ఘటన తర్వాత.. అమరుల పిల్లలకు సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూళ్లో ఉచిత విద్య, ఆవాసం కల్పిస్తానని మాట ఇచ్చాను.పుల్వామా అమరవీరుడు విజయ్ సోరెంగ్ గారి కుమారుడు రాహుల్ సోరెంగ్ 2019లో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరాడు. నాలుగేళ్లుగామ మాతో ప్రయాణం సాగిస్తున్న రాహుల్.. విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్-16 హర్యానా జట్టుకు ఎంపికయ్యాడు. కొన్ని విషయాలు మనసును రంజింపజేస్తాయి. మన జవాన్లకు ధన్యవాదాలు’’ అని సెహ్వాగ్ ఎక్స్ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. చదవండి: D Gukesh: ప్రైజ్‌మనీలో టాక్స్ మినహాయింపు ఇవ్వండి: లేఖ రాసిన ఎంపీRemember the Name- Rahul Soreng. This is one of the happiest feelings in life. After the tragic Pulwama attack, had made an appeal to offer free education to children of our martyr’s study and stay in my @sehwagschool . I feel so privileged that Rahul Soreng , son of Pulwama… https://t.co/gKvrcyy767 pic.twitter.com/L0Qlc1hh3j— Virender Sehwag (@virendersehwag) December 18, 2024 -
ద్రవిడ్ చిన్న కొడుకు వచ్చేస్తున్నాడు.. ఆ టోర్నమెంట్‌కు ఎంపిక
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయులు క్రికెట్ ప్రపంచంలోకి దూసుకొస్తున్నారు. పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ అండర్-19 స్ధాయిలో అదరగొడుతుండగా.. ఇప్పుడు చిన్న కొడుకు అన్వయ్ ద్రవిడ్ విజయ్ మర్చంట్ ట్రోఫీలో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. అండర్-16 విజయ్ మర్చంట్ ట్రోఫీకి కర్ణాటక క్రికెట్ ఆసోషియేషన్‌కు ప్రకటించిన 35 మంది ప్రాబబుల్స్ జాబితాలో అన్వయ్‌కు చోటుదక్కింది. కాగా అన్వయ్ ద్రవిడ్ గతేడాది ఇంటర్-జోన్ స్థాయిలో కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అదేవిధంగా ఇటీవల కేఎస్‌సీఏ అండర్-16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్లో అన్వయ్ అద్భుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ టోర్నీలో భాగంగా తుమకూరు జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జోన్ తరపున 200 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే సెలక్టర్లు అతడికి జయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ప్రాబబుల్స్‌లో చోటు కల్పించారు. ఇక ఈ టోర్నీ డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. మరోవైపు ద్రవిడ్ పెద్ద కొడుకు సుమిత్ ద్రవిడ్ కూచ్ బెహర్ ట్రోఫీలో కర్ణాటక తరపున ఆడుతున్నాడు.చదవండి: BGT 2024: టీమిండియా టెస్టు సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్లకు చోటు -
Vijay Merchant Trophy: అండర్–16 టోర్నీలో ద్రవిడ్ vs సెహ్వాగ్
సాక్షి, మంగళగిరి: సడెన్‌గా చూస్తే అండర్–16 టోర్నీ ఏంటి? ద్రవిడ్, సెహ్వాగ్‌లు ముఖాముఖిగా తలపడటం ఏంటనే సందేహాలు రావడం ఖాయం. కానీ ఇది దిగ్గజాల మధ్య సమరం కాదు. వారి తర్వాతి తరం పోటీపడుతున్న టోర్నీ సంగతి! టీమిండియాకు ఏళ్ల తరబడి రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి టాపార్డర్‌ను నడిపించారు. గెలిపించారు. ఇప్పుడు బీసీసీఐ దేశవాళీ జూనియర్ టోర్నీ అయిన విజయ్ మర్చంట్ ట్రోఫీలో కర్ణాటక అండర్–16 జట్టు కెపె్టన్‌గా అన్వయ్ ద్రవిడ్ (ద్రవిడ్ రెండో కుమారుడు), ఢిల్లీ అండర్–16 జట్టు ఓపెనర్‌గా ఆర్యవీర్ సెహ్వాగ్ (సెహ్వాగ్ పెద్ద కుమారుడు) బరిలోకి దిగారు. దీంతో మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ వార్తల్లో విశేషంగా నిలిచింది. మూడు రోజుల ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 56.3 ఓవర్లలో 144 పరుగుల వద్ద ఆలౌటైంది. అయితే వికెట్ కీపర్, కెపె్టన్ అన్వయ్ (0) డకౌటయ్యాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ 30 ఓవర్లలో వికెట్ నష్టానికి 107 పరుగులు చేసింది. ఆర్యవీర్ సెహ్వాగ్ (98 బంతుల్లో 50 బ్యాటింగ్; 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధసెంచరీ చేశాడు. తొలిరోజు ఆటను పరిశీలిస్తే... ఒక విధంగా టీనేజ్ ద్రవిడ్ టీమ్‌పై కుర్ర సెహ్వాగ్ పైచేయి సాధించాడు. -
ఒకరు 4, మరొకరు 2 పరుగులు.. తొమ్మిది మంది ‘సున్నా’లే! మరీ చెత్తగా
Vijay Merchant Trophy- సూరత్: భారత దేశవాళీ క్రికెట్లో ఈశాన్య రాష్ట్ర జట్ల పేలవ ప్రదర్శనపై తరచుగా వస్తున్న విమర్శలకు మరింత బలమిచ్చే మ్యాచ్ మరొకటి ముగిసింది. బీసీసీఐ అధికారిక అండర్–16 టోర్నీ (విజయ్ మర్చంట్ ట్రోఫీ)లో మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సిక్కిం 9.3 ఓవర్లలో కేవలం ‘6’ పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్, వికెట్ కీపర్ బ్యాటర్ అన్వీష్ ఒక ఫోర్ కొట్టగా, తొమ్మిదో స్థానంలో వచ్చిన అక్షద్ 2 పరుగులు సాధించాడు. మిగతా తొమ్మిది మంది ‘సున్నా’లే! ఈ మ్యాచ్‌లో ముందుగా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 414 పరుగులు చేసి డిక్లేర్ చేయగా... తొలి ఇన్నింగ్స్‌లో సిక్కిం 43 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లోనైతే మరీ చెత్తగా ఆడి అనూహ్య రికార్డు నమోదు చేయడంతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు ఇన్నింగ్స్, 365 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ ఫలితంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. టీమిండియా ప్లేయర్ల పేర్లు ముడిపెట్టి.. ‘‘మరీ ఇంత దారుణ వైఫల్యమా.. సీనియర్లను బాగా ఫాలో అవుతున్నట్లున్నారు’’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. సిక్కిం ఓపెనర్ రోహిత్ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో సున్నాకే అవుట్ కావడంతో భారత సారథి రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడేమో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక సిక్కిం కెప్టెన్ దిన్రీ రెండు ఇన్నింగ్స్‌లో డకౌట్ అయ్యాడు. మరోవైపు మధ్యప్రదేశ్ కెప్టెన్ మనాల్ చౌహాన్ 170 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IPL 2023: ధోని జట్టులోకి గుంటూరు కుర్రాడు.. ఎవరీ షేక్ రషీద్? Sikkim bowled out for 6 in the Vijay Merchant Trophy against Madhya Pradesh. — Mufaddal Vohra (@mufaddal_vohra) December 23, 2022 -
క్రికెట్లోకి సెహ్వాగ్ కొడుకు ఎంట్రీ.. ఢిల్లీ జట్టుకు ఎంపిక
టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయడు ఆర్యవీర్ దేశీవాళీ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-16 జట్టుకు ఆర్యవీర్ ఎంపికయ్యాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల ఢిల్లీ జట్టులో ఆర్యవీర్‌కు చోటు దక్కింది. కాగా ఢిల్లీ ప్రాబ్బుల్స్లో ఆర్యవీర్ ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ జట్టుకు అర్నవ్ బుగ్గా సారథ్యం వహిస్తున్నాడు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ఆకాష్ మల్హోత్రా స్పందించారు. "ఆర్యవీర్ అద్భుతమైన బ్యాటర్. అతడి ఫుట్‌వర్క్ కూడా చాలా బాగుంది. బంతిని కూడా బాగా మిడిల్ చేస్తున్నాడు. అతడి ఆటతీరు మమ్మల్ని ఆకట్టుకుంది. అందుకే ఆర్యను ఎంపిక చేశాం" అని ఆకాష్ మల్హోత్రా పేర్కొన్నాడు. ఇక జట్టు ఎంపికైన తర్వాత ఆర్యవీర్ తల్లి ఆర్తి సెహ్వాగ్ అతడి బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిపోస్ట్ చేసింది. Delhi Men's under 16 Team for the match against Bihar in the Vijay Merchant Trophy. Delhi won the toss and elected to bat first. pic.twitter.com/KcwMwSS4yw — DDCA (@delhi_cricket) December 6, 2022 అంతకుముందు ఆర్యవీర్ కూడా నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కాగా ఢిల్లీ నుంచి ఎంతో మంది స్టార్ క్రికెటర్లగా ఎదిగారు. విరాట్ కోహ్లి, గౌతం గంభీర్, సెహ్వాగ్, మదన్‌లాల్ వంటి క్రికెటర్లు ఢిల్లీకి చెందిన వారే. View this post on Instagram A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) View this post on Instagram A post shared by Aaryavir Sehwag (@aaryavirsehwag) -
పదికి పది వికెట్లు.. పది మెయిడెన్లు
కోల్‌కతా: మేఘాలయ ఆఫ్ స్పిన్నర్ నిర్దేశ్ బైసోయా అసాధారణ ప్రదర్శనతో రికార్డులకెక్కాడు. అండర్–16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో నాగాలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లను పడగొట్టాడు. 15 ఏళ్ల నిర్దేశ్ బుధవారం తొలిరోజు ఆటలో నాగాలాండ్‌ను తన స్పిన్‌తో చుట్టేశాడు. 21 ఓవర్లు వేసిన ఈ కుర్రాడు 51 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు. ఇందులో 10 ఓవర్లను మెయిడెన్లుగా వేశాడు. దీంతో నాగాలాండ్ జట్టు 113 పరుగులకే ఆలౌటైంది. గత రెండేళ్లుగా నిర్దేశ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గత టోరీ్నలో ఆరు మ్యాచ్‌లాడిన అతను 33 వికెట్లు తీశాడు. తాజా టోర్నీలో నాలుగే మ్యాచ్‌లాడిన అతను 27 వికెట్లు పడేశాడు. నిజానికి నిర్దేశ్ సొంతూరు మీరట్... కానీ మేఘాలయ తరఫున ఆడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 ఏళ్ల క్రితమే భారత మేటి స్పిన్నర్ అనిల్ కుంబ్లే (10/74) పాకిస్తాన్‌పై ఢిల్లీ టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లతో చరిత్రకెక్కాడు. దీంతో ఢిల్లీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో భారత్ అద్వితీయ విజయాన్ని సాధించింది. గతేడాది మణిపూర్ పేసర్ రెక్స్ సింగ్ కూడా పదికి పది వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత వహించాడు. కూచ్ బెహర్ ట్రోఫీలో అతను చరిత్ర సృష్టించగా... పుదుచ్చేరి లెఫ్టార్మ్ స్పిన్నర్ సిదాక్ సింగ్ సీకే నాయుడు ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టేశాడు. -
కర్ణాటకతో హైదరాబాద్ మ్యాచ్ డ్రా
సాక్షి, హైదరాబాద్: విజయ్ మర్చంట్ ట్రోఫీ అండర్–16 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ రెండో ‘డ్రా’ను నమోదు చేసింది. జింఖానా మైదానంలో కర్ణాటక, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. టోర్నీలో ఇప్పటి వరకు హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచ్‌లూ ‘డ్రా’గానే ముగిశాయి. ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 105/1తో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక 92 ఓవర్లలో 6 వికెట్లకు 270 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. జై బోరా (106; 8 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేయగా... అనిరుధ్ శ్రీనివాస్ (71; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. స్మరణ్ (48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. హైదరాబాద్ బౌలర్లలో ఎస్. నిఖిల్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ మూడోరోజు ఆటముగిసే సమయానికి 49 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులతో నిలిచింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన కర్ణాటకు 3 పాయింట్లు లభించాయి. హైదరాబాద్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. ఈనెల 12న మూలపాడులో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఆంధ్రతో హైదరాబాద్ ఆడుతుంది.