క్రికెట్‌ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు.. సెహ్వాగ్‌ పోస్ట్‌ వైరల్‌ | Late Soldier Son Selected Vijay Merchant Trophy Virender Sehwag Post Viral | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ జట్టులోకి పుల్వామా అమరవీరుడి కుమారుడు.. సెహ్వాగ్‌ పోస్ట్‌ వైరల్‌

Published Wed, Dec 18 2024 7:47 PM | Last Updated on Wed, Dec 18 2024 7:59 PM

Late Soldier Son Selected Vijay Merchant Trophy Virender Sehwag Post Viral

టీమిండియా దిగ్గజ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. తమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న రాహుల్‌ సోరెంగ్‌ విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ ఆడే జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందన్నాడు. కాగా రాహుల్‌ మరెవరో కాదు.. పుల్వామా ఘటనలో నింగికేగిన అమర వీరుడు విజయ్‌ సోరెంగ్‌ కుమారుడు.

నాడు శోక సంద్రంలో
కాగా కశ్మీర్‌లో 2019లో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా భద్రతా బలగాల జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దేశం మొత్తాన్ని శోక సంద్రంలో ముంచిన ఈ ఘటన నేపథ్యంలో వీరూ భాయ్‌ నాడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అదే సమయంలో గొప్ప మనసు కూడా చాటుకున్నాడు.

అమర వీరుల పిల్లలకు హర్యానాలోని సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో ఉచితంగా విద్యనందిస్తామని వాగ్దానం చేశాడు. దేశం ​కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు తమకు చేతనైంత మేర రుణం తీర్చుకుంటామని పేర్కొన్నాడు. పిల్లలను ప్రయోజకులు చేయడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని తెలిపాడు. ఆ హామీని వీరూ భాయ్‌ నిలబెట్టుకున్నాడు కూడా!

సెహ్వాగ్‌ భావోద్వేగం
ఇప్పుడు అందుకు తగ్గ ప్రతిఫలం లభించింది. సెహ్వాగ్‌ స్కూళ్లో చదువుతూనే.. క్రికెట్‌లోనూ శిక్షణ తీసుకుంటున్న రాహుల్‌ సోరెంగ్‌.. హర్యానా అండర్‌-16 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన వీరేంద్ర సెహ్వాగ్‌.. ‘‘రాహుల్‌ సోరెంగ్‌. ఈ పేరును గుర్తు పెట్టుకోండి.

నా జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో ఇదీ ఒకటి. పుల్వామా దాడి వంటి విషాదకర ఘటన తర్వాత.. అమరుల పిల్లలకు సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూళ్లో ఉచిత విద్య, ఆవాసం కల్పిస్తానని మాట ఇచ్చాను.

పుల్వామా అమరవీరుడు విజయ్‌ సోరెంగ్‌ గారి కుమారుడు రాహుల్‌ సోరెంగ్‌ 2019లో సెహ్వాగ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో చేరాడు. నాలుగేళ్లుగామ మాతో ప్రయాణం సాగిస్తున్న రాహుల్‌.. విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీ అండర్‌-16 హర్యానా జట్టుకు ఎంపికయ్యాడు. కొన్ని విషయాలు మనసును రంజింపజేస్తాయి. మన జవాన్లకు ధన్యవాదాలు’’ అని సెహ్వాగ్‌ ఎక్స్‌ వేదికగా తన మనసులోని భావాలు పంచుకున్నాడు. 

చదవండి: D Gukesh: ప్రైజ్‌మనీలో టాక్స్‌ మినహాయింపు ఇవ్వండి: లేఖ రాసిన ఎంపీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement