టీమిండియా మాజీ విధ్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయడు ఆర్యవీర్ దేశీవాళీ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ మర్చంట్ ట్రోఫీ కోసం ఢిల్లీ అండర్-16 జట్టుకు ఆర్యవీర్ ఎంపికయ్యాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో బిహార్‌తో తలపడుతోంది.
ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన 15 మంది సభ్యుల ఢిల్లీ జట్టులో ఆర్యవీర్‌కు చోటు దక్కింది. కాగా ఢిల్లీ ప్రాబ్‌బుల్స్‌లో ఆర్యవీర్ ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌కు అతడికి చోటు దక్కలేదు. ఇక ఈ జట్టుకు అర్నవ్ బుగ్గా సారథ్యం వహిస్తున్నాడు. ఇక ఇదే విషయంపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్‌పర్సన్ ఆకాష్ మల్హోత్రా స్పందించారు.
"ఆర్యవీర్ అద్భుతమైన బ్యాటర్. అతడి ఫుట్‌వర్క్ కూడా చాలా బాగుంది. బంతిని కూడా బాగా మిడిల్ చేస్తున్నాడు. అతడి ఆటతీరు మమ్మల్ని ఆకట్టుకుంది. అందుకే ఆర్యను ఎంపిక చేశాం" అని ఆకాష్ మల్హోత్రా పేర్కొన్నాడు. ఇక జట్టు ఎంపికైన తర్వాత ఆర్యవీర్ తల్లి ఆర్తి సెహ్వాగ్ అతడి బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిపోస్ట్ చేసింది.
Delhi Men's under 16 Team for the match against Bihar in the Vijay Merchant Trophy. Delhi won the toss and elected to bat first. pic.twitter.com/KcwMwSS4yw
— DDCA (@delhi_cricket) December 6, 2022
అంతకుముందు ఆర్యవీర్ కూడా నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. కాగా ఢిల్లీ నుంచి ఎంతో మంది స్టార్ క్రికెటర్లగా ఎదిగారు. విరాట్ కోహ్లి, గౌతం గంభీర్, సెహ్వాగ్, మదన్‌లాల్ వంటి క్రికెటర్లు ఢిల్లీకి చెందిన వారే.
Comments
Please login to add a commentAdd a comment