ఇడ్లీ చాలెంజ్‌.. ఈ బామ్మతో పోటీ పడగలరా | Karnataka Woman Eats Six Idlis In A Minute | Sakshi
Sakshi News home page

ఇడ్లీ చాలెంజ్‌.. ఈ బామ్మతో పోటీ పడగలరా

Oct 1 2019 7:10 PM | Updated on Oct 1 2019 7:34 PM

Karnataka Woman Eats Six Idlis In A Minute - Sakshi

బెంగళూరు: ఇడ్లీ చాలామందికి ఇష్టమైన అల్పాహారం. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. తేలీకగా జీర్ణం అవుతుంది. అయితే ఇడ్లీ అంటే ఎంత ఇష్టం ఉన్నా మాములుగా ఎన్ని తినగల్గుతారు.. నాలుగు, ఆరు సరే ఓ పది. కానీ నిమిషంలోనే ఆరు ఇడ్లీలు స్వాహా చేసే వారిని ఎప్పుడైనా చూశారు. అది కూడా 60 ఏళ్ల బామ్మ అంటే నమ్మగలరా. కానీ ఇది వాస్తవం. దసరా ఉత్సవాల సందర్భంగా మైసూరులో ఇడ్లీ తినే పోటీ పెట్టారు.  హుల్లాహళ్లి ప్రాంతానికి చెందిన సరోజమ్మ అనే 60 ఏళ్ల మహిళ ఏకంగా నిమిషంలో ఆరు ఇడ్లీలు తిని ఔరా అనిపించడమే కాక పోటీలో మొదటి స్థానంలో నిలిచింది. యువతులు, పెళ్లైనవారు కూడా ఈ పోటీలో పాల్గొన్నారు. కానీ వారందరిని సరోజమ్మ ఓడించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో హిందుస్తాన్‌ టైమ్స్‌, ఏఎన్‌ఐలో వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement