
ప్రతీకాత్మక చిత్రం
బెంగళూరు: వాలీబాల్ కోచ్ పుట్టిన రోజు వేడుకలు హాజరయ్యాడు ఓ మైనర్ కుర్రాడు. ఫ్రెండ్స్ అంతా బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. కొద్ది రోజుల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత యువకుడి చేయి బాగా వాయడంతో ఆస్పత్రికి వెళ్లాడు. అతడిని పరీక్షించిన వైద్యులు అతడి చేయి తొలగించారు. ఇంతకు ఆ పుట్టిన రోజు వేడుకల్లో ఏం జరిగింది.. ఎందుకు చేయి తొలగించాల్సి వచ్చింది వంటి వివరాలు తెలియాలంటే..
బెంగళూరుకు చెందిన ఓ మైనర్ కుర్రాడు కొద్ది రోజుల క్రితం వాలీబాల్ కోచ్ పుట్టిన రోజు సందర్భంగా చంపరాజేట్ ప్రాంతంలో జరిగిన బర్త్‌డే పార్టీకి హాజరయ్యాడు. నాలుగు రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత చేయి బాగా వాచింది. ఆందోళన చెందిన తల్లిదండ్రులు మైనర్ కుర్రాడిని సంజయ్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాధితుడిని పరీక్షించిన వైద్యులు.. బాలుడి శరీరంలో డ్రగ్స్, విష పదర్ధాలు ఉన్నాయని.. అందువల్లే చేయి వాచిందని తెలిపారు. వెంటనే ఆపరేషన్ చేసి చేయి తొలగించకపోతే మైనర్ కుర్రాడి ప్రాణాలకే ప్రమాదం అని సూచించడంతో తల్లిదండ్రులు అందుకు అంగీకరించారు.
ఆస్సత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బాధితుడిని అసలు ఏం జరిగిందని ప్రశ్నించగా.. పుట్టినరోజు వేడుకలకు హాజరైన తనకు కోచ్ ఏదో ఇంజక్షన్ చేశాడని తెలిపాడు. కొన్ని మాత్రలను నూరి.. ఆ పొడిని నీటిలో కలిపి.. తనకు ఇంజెక్ట్ చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. ఈ క్రమంలో బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: షాకింగ్ న్యూస్: దుష్టశక్తులకు బలివ్వడానికి బాలిక కిడ్నాప్
Comments
Please login to add a commentAdd a comment