![Karnataka: DCP Order To Arrest Man Harassed Girl On Road Bangalore - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/30/Crime_0126.jpg.webp?itok=26f0OiGL)
యశవంతపుర/కర్ణాటక: బాలిక పట్ల ఓ యువకుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరు దక్షిణ విభాగంలో జరిగింది. శనివారం సాయంత్రం బాలిక (15) నడుచుకుంటూ వెళ్తుండగా ఆమె వెనుకే వచ్చిన యువకుడు ముద్దు పెట్టి పరారయ్యాడు. ఫిర్యాదు చేయడానికి బాధితురాలి తల్లిదండ్రులు రాగా చిక్కజాల పోలీసులు కేసు తీసుకోవడానికి నిరాకరించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావటంతో బెంగళూరు దక్షిణ విభాగం డీసీపీ ధర్మేంద్రకుమార్ మీనా నిందితున్ని అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
నిందితుడు దారుణ హత్య
కెలమంగలం: హత్య కేసులో ప్రధాన నిందితుడు హత్యకు గురయ్యాడు. డెంకణీకోట తాలూకా తళి సమీపంలోని ఉళిబండ గ్రామానికి చెందిన చెన్నక్రిష్ణన్ (33)ను గత ఏప్రిల్ 1వ తేదీ ట్రాక్టర్‌తో ఢీకొట్టి, తలపై బండరాతితో కొట్టి హత్య చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు శంకర్(25). కర్ణాటక సరిహద్దుల్లో అంచెట్టి ఉణిసనహళ్లి మద్యం షాపు వద్ద శనివారం రాత్రి ఆరుగురు దుండగులు వేటకొడవళ్లతో శంకర్‌ను నరికి చంపారు. కనకపుర పోలీలుసు, తళి పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment