బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నారాయణ మూర్తి, ఆయన సతీమణి, రచయిత్రి సుధామూర్తి విశేషంగా నిలిచారు. ఎందుకుంటే పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే పోలింగ్ బూత్‌కొచ్చి క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి దంపతులు ఓటు హక్కు వినియోగంపై యువతకు సందేశమిస్తూ కీలక వ్యాఖ్యాలు చేశారు.
బెంగళూరులోని జయనగర్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. ఓటు హక్కను వినియోగించుకోకపోతే, ఆ తరువాత పాలకులను ప్రశ్నించే హక్కునుకూడా కోల్పోతామని సుధామూర్తి వ్యాఖ్యానించారు. తాము పెద్దవాళ్ల మైనప్పటికీ ఉదయమే ఓటు హక్కును వినియోగించు కున్నామనీ, తమ నుంచి యువత నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. పద్మభూషణ్ అవార్డీ మీడియాతో మాట్లాడుతూ ‘‘దయచేసి మమ్మల్ని చూసి నేర్చుకోండి. ప్రజాస్వామ్యంలో ఓటు పవిత్రమైన భాగం" అన్నారు.
#WATCH | Jayanagar, Bengaluru | Sudha Murty gives a message to young voters after casting her vote; says, "Please look at us. We are oldies but we get up at 6 o'clock, come here and vote. Please learn from us. Voting is a sacred part of democracy..."#KarnatakaElections pic.twitter.com/B1ecZCH93M
— ANI (@ANI) May 10, 2023
ఈ సందర్బంగా నారాయణమూర్తి మాట్లాడుతూ ఓటు ప్రాధాన్యత గురించి యువతకు చెప్పాల్సిన బాధ్యత పెద్దలదే. తన తల్లిదండ్రులు తనకు అలాగే చెప్పారని చెప్పారు. తాను విదేశాల నుంచి ఈరోజు ఉదయం తిరిగొచ్చాననీ, అయినా ఓటు వేసేందుకు వచ్చానని నారామణ మూర్తి తెలిపారు ఫస్ట్ ఓటు వేద్దాం.. ఆ తరువాతే ఇది బాగాలేదు.. అది బాగాలేదు అనే చెప్పవచ్చు లేదంటే.. విమర్శించే హక్కు ఉండదనిపేర్కొన్నారు. మరోవైపు ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నీలేకని కోరమంగళలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.
కాగా ఈ అసెంబ్లీ ఎన్నికలు తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న అధికార బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు చాలా కీలకం. కర్నాటక లోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా, 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment