ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేరు టెక్ ప్రపంచంలో తెలియని వారుంటారు. ఆయన భార్య, ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌కి రిటైర్డ్ చైర్‌పర్సన్ సుధామూర్తి కూడా చాలామందికి ఇన్సిపిరేషన్. తాజాగా వీరిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ఇంట్రస్టింగ్‌గా మారింది.
నాలుగేళ్ల డేటింగ్ తరువాత 1978, ఫిబ్రవరి 10న నారాయణ, సుధా మూర్తి మూడుముళ్ల బంధంలో ఒక్కటైనారు. అయితే అన్ని విషయాల్లో గుంభనం, దూరదృష్టితో ఉండే నారాయణమూర్తి, భోళాగా, డబ్బు విషయంలో చాలా ప్రణాళికా బద్దంగా ఉండే సుధ పరిచయం ప్రేమ విచిత్రంగానే జరిగింది. కొన్ని భేదాభిప్రాయాలున్నప్పటికీ, ఒకరిపై మరొకరు నమ్మకం వారి ప్రేమను శాశ్వతం చేసింది.
పూణేలో తమ కామన్ ఫ్రెండ్ విప్రో ప్రసన్న ద్వారా తామిరువురం కలుసుకున్నామని జ్ఞాపకాలను ఒక ఇంటర్వ్యూలో సుధామూర్తి గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె పూణే బ్రాంచ్‌లో టెల్కోగా పనిచేస్తున్నారు. ఒక సాయంత్రం పూణేలోని గ్రీన్ ఫీల్డ్స్ హోటల్‌లో భోజనానికి ప్రసన్న ద్వారా సుధ , ఆమె స్నేహితులను నారాయణ ఆహ్వానించారు. ఈ బృందంలో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో మొదట్లో వెళ్లేందుకు ఇష్టపడలేదు కానీ నారాయణ ఆమెను ఒప్పించారట.
అలాగే ప్రసన్న దగ్గరినుంచి చాలా పుస్తకాలను తీసుకోవానే వారట సుధ. ఆ పుస్తకాలపై ఎక్కువగా నారాయణమూర్తి పేరు ఉండేదట. అలా తన మనస్సులో నారాయణ ఊహాచిత్రం ముందే ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు. అలా ఇద్దరి మధ్య ప్రేమ అంకురించింది.. ముఖ్యంగా ఆయనలోని వినయం, ముక్కు సూటిగా ఉండే తత్వం తననను ప్రేమలో పడేసిందని ఆమె చెప్పారు. ‘‘నా పొడవు 5'4" పొడవు ఉన్నాను . దిగువ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. నేను నా జీవితంలో ఎప్పటికీ ధనవంతుడు కాలేను,నేను మీకు ఏ సంపదను ఇవ్వలేను. మీరు అందంగా ఉన్నారు. పైగా తెలివైనవారు కూడా. నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగారట నారాయణమూర్తి.
పెళ్లి ఖర్చు సమంగా పంచుకున్నాం
రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నారాయణమూర్తి మొదట్లో వీరిద్దరి వివాహాన్ని సుధ తండ్రి వ్యతిరేకించారు. జీవితంలో ఏం కావాలని అనుకుంటున్నారు అని సుధ తండ్రి అడిగితే, కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా ఎదగాలని, అనాథాశ్రమాన్ని తెరవాలనుకుంటున్నానని మూర్తి చెప్పారట. దీంతో ఆయన ససేమిరా అన్నారట. చివరికి 1977 చివరిలో నారాయణ పాట్నీ కంప్యూటర్స్‌లో జనరల్ మేనేజర్‌గా జాయిన్‌అయిన తరువాత మాత్రమే ఆయన అంగీకరించారు. అమెరికా వెళ్లే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం మేరకు వబెంగుళూరులోని నారాయణ ఇంట్లో కుటుంబ సన్నిహితుల పెళ్లి చేసుకున్నామని ఆమె చెప్పారు. అలా తనకు తొలి పట్టు చీర వచ్చిందని గుర్తు చేసు కున్నారు. అంతేకాదు ఆనాటి తమ పెళ్లి ఖర్చును ఇద్దరమూ సమానంగా పంచుకున్నామని సుధామూర్తి వెల్లడించారు. ఒక్కొక్కరు రూ.400 చొప్పున మొత్తం పెళ్లి ఖర్చు రూ.800 అయిందని చెప్పారు.
అలాగే ఇటీవల కాలంలో ఆయన పాత జ్ఞాపకాల గురించి మీడియాతో పంచుకుంటున్న నారాయణమూర్తి కూడా . తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మధ్యతరగతి నేపథ్యం తాము ఎక్కువగా ఆటోలోనే ప్రయాణించే వారమంటూ ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. కన్నడ రాని డ్రైవరున్న ఆటోలో తాము కన్నడలోమాట్లాడుకుంటూ తమ జీవితంలో కీలక మైన విషయాలను షేర్ చేసుకున్నట్టు నారాయణమూర్తి చెప్పుకొచ్చారు. 1981లో పూణేలో తన సహచరులతో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించాలన్న తన భర్త కల సాకారం కోసం 10 వేల రూపాయలను సుధామూర్తి అప్పుగా ఇచ్చారు. అదే ఆ తరువాత కోట్లాది రూపాయల విలువ చేసే దేశంలో అనే అత్యున్నత ఐటీ సంస్థగా అవతరించింది. అలాగే ఇటీవల తన భార్య సుధ చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని మరీ నారాయణ మూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment