నారాయణ మూర్తి, సుధామూర్తి చేసిన ఎన్నో త్యాగాల ఫలితమే.. ఈ రోజు దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించిన 'ఇన్ఫోసిస్' (Infosys). ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కంపెనీ వృద్ధి కోసం తమ మూడు నెలల పాపకు దూరంగా ఉండాల్సి వచ్చినట్లు సుధామూర్తి పేర్కొన్నారు.
ఈ రోజు 83.92 బిలియన్ల విలువ కలిగిన స్థాయికి చేరిన ఇన్ఫోసిస్ ప్రారంభంలో చాలా సవాళ్ళను ఎదుర్కొన్నట్లు, దాని కోసం అనేక త్యాగాలను చేయాల్సి వచ్చినట్లు సుధామూర్తి చెబుతూ.. తమ కుమార్తె అక్షతా మూర్తిని 90 రోజుల వయసున్నప్పుడు తమ తల్లిందండ్రుల దగ్గర వదిలిపెట్టాల్సి వచ్చిందని వెల్లడించింది.
టెక్ కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సుధామూర్తి, నారాయణ మూర్తి ముంబైకి మారారు. ఆ సమయంలో కంపెనీ వృద్ధికి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పరిస్థితులు ఎలా మారతాయో ఊహకందని సమయంలో.. నా బిడ్డ అక్షతా మూర్తి తన తాతయ్యల వద్ద పెరగడం మంచిదని భావించిన సుధామూర్తి.. చిన్నారిని ముంబై నుంచి కర్ణాటకలోని తన తల్లిదండ్రులు, సోదరి వద్ద వదిలి పెట్టింది.
ఎంతో గారాబంగా పెంచుకోవాల్సిన చిన్నారిని విడిచిపెట్టడం చాలా కష్టమైన నిర్ణయమని సుధామూర్తి చెబుతూ.. ఆ రోజు నుంచి అక్షతకు నా తల్లి, సోదరి తల్లులుగా మారారని తెలిపింది. ఈ రోజు ఇన్ఫోసిస్ ఇంత పెద్ద సంస్థగా అవతరించినదంటే ఒక్క రోజులో జరిగిన పని కాదు.
ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి
మీరు ఒక కంపెనీ స్థాపించినప్పుడు.. ఎదురయ్యే కష్టమైన ఎన్నో సవాళ్ళను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సుధామూర్తి చెప్పారు. ఈ రోజు యూకే ప్రధాని భార్యగా.. వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఎదిగిన 'అక్షతా' కర్ణాటకలోని హుబ్లీలో తన తాతయ్యలతో కలిసి పెరిగింది. ఏదైనా విలువైనది చేయాలని ఆకాంక్షించినప్పుడు త్యాగాలు అనివార్యమని మూర్తి దంపతులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment