ఇన్ఫోసిస్ కంపెనీ గురించి తెలిసిన అందరికీ.. ఎన్ఆర్ నారాయణ మూర్తి గురించి కూడా తప్పకుండా తెలిసే ఉంటుంది. ఎన్నో కష్టాలను ఎదుర్కొని ప్రముఖ్ టెక్ దిగ్గజంగా ఎదిగారు అంటే, దాని వెనుక ఆయన అపారమైన కృషి, పట్టుదలే కారణం. ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని నేడు ప్రముఖుల జాబితాలో ఒకరుగా ఉన్న నారాయణమూర్తి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ.. సూచనలు, సలహాలు ఇస్తుంటారు.
ఇటీవల నారాయణ మూర్తి టీచ్ ఫర్ ఇండియా లీడర్స్ వీక్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 12ఏళ్ల విద్యార్ధి ''నేను మీలా అవ్వాలంటే?.. ఏమి చేయాలి'' అని ప్రశ్నించారు. దానికి మూర్తి బదులిస్తూ.. ''మీరు నాలాగా మారడం నాకు ఇష్టం లేదు. దేశ శ్రేయస్సు కోసం మీరు నా కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.
మీ సొంత మార్గాన్ని ఏర్పరచుకోండి.. కొత్త విధానాలకు శ్రీకారం చుట్టండి. జీవితం అంటే ఒకరి అడుగుజాడల్లో నడవడం కాదని నారాయణ మూర్తి వెల్లడించారు. క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ.. మా నాన్న నాకు టైమ్‌టేబుల్ ద్వారా సమయాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించారు. అదే నన్ను స్టేట్ ఎస్ఎస్ఎల్సీ పరీక్షలో నాల్గవ ర్యాంక్ సాధించేలా చేసిందని వెల్లడించారు.
ఇదీ చదవండి: 'అలాంటివేం లేదు.. అదంతా తప్పుడు ప్రచారం': ఆనంద్ మహీంద్రా
ప్యారిస్‌లో ఇంజనీర్‌గా ఉన్నప్పుడు, ఒక ప్రోగ్రామ్‌ను పరీక్షించే సమయంలో అనుకోకుండా మొత్తం కంప్యూటర్ సిస్టమ్ మెమరీని తొలగింతొలగించాను. సిస్టమ్‌ని పునరుద్ధరించడానికి అప్పటి మా బాస్ కోలిన్‌తో కలిసి 22 గంటలు పంచేసాను. కాబట్టి అనుకోను తప్పులు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment