Do You Know How It Giant Infosys Started - Sakshi
Sakshi News home page

Infosys: మీకు తెలుసా? ఇన్ఫోసిస్ కంపెనీ ఇలా మొదలైంది..!

Published Sat, Aug 19 2023 8:40 PM | Last Updated on Sat, Aug 19 2023 8:59 PM

Do you know how IT giant Infosys started - Sakshi

ఈ రోజు సుధామూర్తి గురించి, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే ప్రముఖ పారిశ్రామిక వేత్తలుగా మాత్రమే కాకుండా.. సమాజసేవలో తమవంతు కృషి చేస్తూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే నేడు లక్షల కోట్ల ఐటీ కంపెనీగా అవతరించిన సంస్థ ఒక చిన్న గదితో ప్రారంభమైనట్లు, కేవలం రూ. 10,000 పెట్టుబడితో ముందుకు కదిలినట్లు బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆధునిక కాలంలో ప్రముఖ పారిశ్రామిక దిగ్గజంగా ఎదిగిన నారాయణ మూర్తి విజయం వెనుక సుధామూర్తి ఉందని అందరికి తెలుసు. కంపెనీ ప్రారంభించాలని కలలు కన్న రోజుల్లోనే ఆమె వద్ద రూ. 10,000 అప్పుగా తీసుకుని స్టార్ట్ చేసినట్లు సమాచారం. అప్పుడప్పుడే భారత్ ఐటీ రంగంలో అడుగులు వేస్తున్న సమయంలో భవిష్యత్తుని చూసి కంపెనీ ప్రారంభించారు.

నేడు లక్షల కోట్ల విలువైన కంపెనీ ఆ రోజు చిన్న గదిలో ప్రారంభమైనట్లు చెబుతారు. అదే ఈ రోజు వేలమందికి ఉద్యోగాలు కల్పించి ముందడుగు వేస్తోంది. 1981లో ప్రారంభమైన ఇన్ఫోసిస్ ఈ రోజు ప్రపంచంలో పేరుగాంచిన పెద్ద ఐటీ కంపెనీగా రూ. 5 లక్షల కోట్లకంటే ఎక్కువ విలువైనదిగా నిలబడింది.

ఇదీ చదవండి: ఇండియాలో ఆ మందు పాక్, చైనాకంటే 15 రెట్లు కాస్ట్‌లీ.. ధర తెలిస్తే షాకవుతారు!

ఇంజినీర్ అంటే ఒకప్పుడు కేవలం పురుషులు మాత్రమే ఉండేవారు.. అయితే స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదని టెల్కో కంపెనీలో మొదటి మహిళా ఇంజినీర్ ఉద్యోగంలో చేరి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. నేడు టాటా కంపెనీలో మహిళలు కూడా పనిచేస్తున్నారంటే అది సుధామూర్తి చలవే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement